Lakshettipet
-
వడదెబ్బకు ఇద్దరు వృద్ధులు మృతి
లక్సెట్టిపేట/మొయినాబాద్ : సూర్యుడి ప్రతాపానికి గురువారం ఇద్దరు వృద్ధులు మృతిచెందారు. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం అప్పారెడ్డిగూడలో శంకరీబాయి(72) అనే వృద్ధురాలు వడదెబ్బతో ఇంట్లోనే మృతిచెందింది. మరో ఘటనలో ఆదిలాబాద్ జిల్లా లక్సెట్టిపేట మండలం దౌడపల్లిలో రాజలింగం(75) వడదెబ్బ తగిలి ప్రాణాలొదిలాడు. -
అందరి సహకారంతో అభివృద్ధి
లక్సెట్టిపేట : అందరి సహకారంతో జిల్లాను అభివృద్ధి చేస్తానని జెడ్పీ చైర్పర్సన్ శోభారాణి అన్నారు. శనివారం మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన సర్వసభ్య సమావేశానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. జిల్లాలో చాలా సమస్యలు ఉన్నాయని, అన్నింటిపై దృష్టిసారించి అభివృద్ధి చేస్తానని తెలిపారు. వెనకబడిన జిల్లాగా కాకుండా అన్ని విధాలా సౌకర్యాలు కల్పిస్తానని చెప్పారు. అనంతరం ఆమెను ఎంపీటీసీ సభ్యులు శాలువాలతో సన్మానించారు. సమస్యలపై అధికారుల నిలదీత తలమలకు రోడ్డు సౌకర్యం కల్పించాలని ఎంపీ పీ కట్ల చంద్రయ్య కోరగా, విద్యుత్ శాఖ అధికారుల తీరుపై ప్రజాప్రతినిధులు మండిపడ్డారు. విద్యుత్ సరిగా ఉండడం లేదని, రాత్రిళ్లు విఫరీతంగా కోత విధిస్తున్నారని పేర్కొన్నారు. పలు చోట్ల షాక్ వసుందని తిమ్మాపూర్ ఎంపీటీసీ సభ్యురాలు గడుసు స్వప్న, ఊత్కూరు సర్పంచ్ రాజలింగయ్య అధికారుల దృష్టికి తెచ్చారు. బ్యాంకు రుణాలు మాఫీ చేయాలని కోరారు. అలాగే మీ సేవ సర్టిఫికెట్లకు అధికారులు డబ్బులు తీసుకుంటున్నారని, డబ్బులు ఇవ్వనిదే తహశీల్దార్ కార్యాలయంలో ఏపని కావడం లేదని కొత్తూరు సర్పంచ్ గుండ శ్రీనివాస్ ధ్వజమెత్తారు. దీంతో ఎమ్మెల్యే దివాకర్‌రావు కల్పించుకొని తహశీల్దార్ ఆనంద్‌బాబును వివరణ కోరారు. కార్యాలయ సిబ్బంది అవినీతికి పాల్పడకుండా ప్రజలకు సేవలు అందించాలని ఆదేశించారు. సమావేశం ఎజెండాలో జనరల్ ఫండ్‌కు సంబంధించిన లెక్కలు ప్రచురించలేదని, దీనికి ఎంపీడీవో రాంప్రసాద్ సమాధానం ఇవ్వాలని లక్సెట్టిపేట రెండో వార్డు ఎంపీటీసీ షాహెద్ అలీ నిలదీశారు. ఎమ్మెల్యే దివాకర్‌రావు మాట్లాడుతూ మండలంలో నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరించేలా అధికారులను ఆదేశిస్తామని హామీ ఇచ్చారు. సమావేశంలో జెడ్పీటీసీ చుంచు చిన్నయ్య, తహశీల్దార్ ఆనంద్‌బాబు, ఎంపీడీవో రాంప్రసాద్, డీసీఎంఎస్ చెర్మైన్ శ్రీనివాస రెడ్డి, ఎంపీటీసీలు, సర్పంచులు, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు. ఆలస్యంగా సమావేశం సమావేశం చాలా ఆలస్యంగా ప్రారంభమైంది. ఉదయం 11 గంటలకు ప్రారంభం కావాల్సి ఉండగా సాయంత్రం నాలుగింటికి ప్రారంభించి 5.30ముగించారు. జెడ్పీ చైర్పర్సన్ శోభారాణి పట్టణంలోని పాఠశాల భవనం ప్రారంబోత్సవానికి వస్తున్నారని తెలిసి అధికారులు సమావేశం ఏర్పాటు చేశారు. ఒకే రోజు అన్ని కార్యక్రమాలు ఉండడంతో ప్రజాప్రతినిధులకు అధికారులకు చాలా ఇబ్బందికరంగా మారింది.మండల అభివృద్ధి కోసం ఏర్పాటు చేసే సమావేశంలో 25 అంశాలపై చర్చించాల్సి ఉండగా కొన్నింటిపైనే చర్చించి తూతూ మంత్రంగా ముగించారు. ఇందులో మైక్ సెట్ మొరాయించడంతో మాట్లాడేది వినపడక అధికారులు, ప్రజాప్రతినిధులు ఇబ్బందులకు గురయ్యారు. -
భార్య కాపురానికి రాలేదని ఆత్మహత్య
లక్సెట్టిపేట, న్యూస్‌లైన్ :భార్య కాపురానికి రాలేదని మనస్తాపం చెందిన భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన మండలంలోని మస్తాన్‌గూడ కాల నీలో జరిగింది. ఎస్సై ఎస్కే.లతీఫ్ కథనం ప్ర కారం.. మస్తాన్‌గూడ కాలనీకి చెందిన షేక్ షాబీర్ (38) వివాహం పట్టణంలోని గోదావరి రోడ్ కాలనీకి చెందిన షెహనాజ్ బేగంతో 14 ఏళ్ల క్రితం జరిగింది. వీరికి సమీర్, సహజర్, అక్షబేగం పిల్లలున్నారు. కొద్ది రోజుల నుంచి షాబీర్ మద్యానికి బానిసయ్యూడు. దీంతో షెహనాజ్ బేగం తన పుట్టింటికి వెళ్లింది. ఆమె ను తీసుకొచ్చేందుకు షాబీర్ కుటుంబ సభ్యు లు షెహనాజ్ ఇంటికెళ్లగా వచ్చేందుకు ఆమె నిరాకరించింది. దీంతో మనస్తాపానికి గురైన షాబీర్ రెండు రోజుల నుంచి కని పించడంలేదు. కుటుంబ సభ్యులు అతడి జాడ కోసం వెతికినా ఫలితం లేకపోరుుంది. ఆదివా రం ఇంటి ఆవరణలో ఉన్న బావిలో షాబీర్ శ వమై తేలాడు. భార్య కాపురానికి రావడంలేద ని మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్న ట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. గంగారంలో మద్యానికి బానిసై.. చెన్నూర్ రూరల్ : మద్యానికి బానిసైన వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలోని గంగారం గ్రామంలో జరిగింది. ఎస్సై ఖయ్యూం కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన బోనగిరి రామయ్య(48) కొంతకాలంగా మద్యానికి బానిసయ్యూడు. ఈ క్రమంలో శనివారం రాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో కూరగాయల తోటకు చల్లే క్రిమిసంహారక మందు తాగాడు. కాసేపటికి అతడి భార్య కాంత ఇంటికి రాగా రామయ్య అపస్మారకస్థితిలో పడి ఉన్నాడు. అతడి నోటి నుంచి క్రిమిసంహారక మందు వాసన రావడం గమనించిన ఆమె వెంటనే స్థానికుల సాయంతో 108లో భర్తను చెన్నూర్ ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లింది. చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి రామయ్య చనిపోయూడు. అతడికి భార్య, ముగ్గురు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. కాంత ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై వివరించారు. -
బీటెక్ విద్యార్థి ఆత్మహత్య
లక్సెట్టిపేట(దండేపల్లి), న్యూస్‌లైన్ : బీటెక్ విద్యార్థి క్రిమిసంహారక మందు తాగి ఆత్మహత్య చేసుకున్న సంఘటన లక్సెట్టిపేట మండలం వెంకట్రావ్‌పేటలో జరిగింది. స్థాని క అదనపు ఎసై్స యుగేంధర్ కథ నం ప్రకారం.. వెంకట్రావ్‌పేటకు చెందిన రైతు పోతు శంకరయ్య, పుష్పలత దంపతులకు ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. చిన్న కుమారుడు నరేశ్‌కుమార్(19) కరీంనగర్ జిల్లా పెద్దపల్లిలోని ఓ ప్రైవేటు కళాశాలలో బీటెక్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. దసరా సెలవుల్లో భాగంగా మంగళవారం ఇంటికి వచ్చాడు. కుటుంబ సభ్యులతో కలిసి భోజనం చేశాడు. అనంతరం అతడి కోరిక మేరకు తల్లి అందరికీ గ్లాసుల్లో పాలు పోసి ఇచ్చింది. ఆ గ్లాస్లో అతడు తన వెంట తెచ్చుకున్న క్రిమిసంహారక మందు కలుపుకుని తాగాడు. అనుమానం వచ్చిన అతడి అన్న హరీశ్ నిలదీయగా విషయం చెప్పాడు. వెంటనే అతడిని కుటుంబ సభ్యులు లక్సెట్టిపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో కరీంనగర్ ఆస్పత్రికి తీసుకెళ్తుండగా మార్గమధ్యంలో నరేశ్‌కుమార్ చనిపోయాడు. అతడి ఆత్మహత్యకు కారణాలు తెలియరాలేదని ఎసై తెలిపారు. గురువారం కళాశాలకు వెళ్లి యాజమాన్యం, విద్యార్థులతో మాట్లాడి కారణాలు తెలుసుకుంటామని పేర్కొన్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నామని పేర్కొన్నారు.