బీటెక్‌ విద్యార్థి ఆత్మహత్య | BTech student commited suicide | Sakshi
Sakshi News home page

బీటెక్‌ విద్యార్థి ఆత్మహత్య

Published Thu, Oct 10 2013 3:06 AM | Last Updated on Tue, Nov 6 2018 7:53 PM

BTech student commited suicide

లక్సెట్టిపేట(దండేపల్లి), న్యూస్‌లైన్‌ : బీటెక్‌ విద్యార్థి క్రిమిసంహారక మందు తాగి ఆత్మహత్య చేసుకున్న సంఘటన లక్సెట్టిపేట మండలం వెంకట్రావ్‌పేటలో జరిగింది. స్థాని క అదనపు ఎసై్స యుగేంధర్‌ కథ నం ప్రకారం.. వెంకట్రావ్‌పేటకు చెందిన రైతు పోతు శంకరయ్య, పుష్పలత దంపతులకు ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. చిన్న కుమారుడు నరేశ్‌కుమార్‌(19) కరీంనగర్‌ జిల్లా పెద్దపల్లిలోని ఓ ప్రైవేటు కళాశాలలో బీటెక్‌ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు.

దసరా సెలవుల్లో భాగంగా మంగళవారం ఇంటికి వచ్చాడు. కుటుంబ సభ్యులతో కలిసి భోజనం చేశాడు. అనంతరం అతడి కోరిక మేరకు తల్లి అందరికీ గ్లాసుల్లో పాలు పోసి ఇచ్చింది. ఆ గ్లాస్‌లో అతడు తన వెంట తెచ్చుకున్న క్రిమిసంహారక మందు కలుపుకుని తాగాడు. అనుమానం వచ్చిన అతడి అన్న హరీశ్‌ నిలదీయగా విషయం చెప్పాడు. వెంటనే అతడిని కుటుంబ సభ్యులు లక్సెట్టిపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో కరీంనగర్‌ ఆస్పత్రికి తీసుకెళ్తుండగా మార్గమధ్యంలో నరేశ్‌కుమార్‌ చనిపోయాడు. అతడి ఆత్మహత్యకు కారణాలు తెలియరాలేదని ఎసై తెలిపారు. గురువారం కళాశాలకు వెళ్లి యాజమాన్యం, విద్యార్థులతో మాట్లాడి కారణాలు తెలుసుకుంటామని పేర్కొన్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నామని పేర్కొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement