
సాక్షి, చిత్తూరు: పలమనేరు పట్టణంలోని గుడియాత్తంరోడ్డు బజంత్రీ వీధిలో నివాసముంటున్న బీటెక్ విద్యార్థి దిలీప్‌రెడ్డి(20 ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికుల కథనం మేరకు, అన్నమయ్య జిల్లా చినమండ్యం గ్రామానికి చెందిన దిలీప్‌రెడ్డి పట్టణ సమీపంలోని ప్రైవేటు కళాశాలలో బీటెక్ చదువుతున్నాడు. బజంత్రీవీధిలోని ఓ ఇంట్లో మరో ఇద్దరు విద్యార్థులతో కలసి అద్దెకుంటున్నాడు.
శుక్రవారం మధ్యాహ్నం గదిలో ఫ్యానుకొక్కీకి ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానికుల సమాచారంతో సంఘటనా స్థలానికి వెళ్లిన పోలీసులు మృతదేహాన్ని స్థానిక ఏరియా ఆస్పత్రికి తరలించి విచారిస్తున్నారు. అయితే కొద్దిరోజులుగా దిలీప్ ఆన్‌లైన్‌లో బెట్టింగ్ గేమ్‌లకు అలవాటుపడ్డట్లు పోలీసులు తెలిపారు. గేమ్‌లకోసం అప్పులు చేసినట్లు, చివరికి మొబైల్ కూడా తాకట్టు పెట్టినట్లు పోలీసులు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment