left from home
-
తండ్రి కొట్టాడని అలిగెళ్లి.. పాతికేళ్లకు మళ్లీ!
సాక్షి, ఖమ్మం (రఘునాథపాలెం): తండ్రి కొట్టాడని అలిగి పదేళ్లప్పుడు ఇంటి నుంచి పారిపోయాడు. వందల కిలో మీటర్ల దూరం దాటి పక్క రాష్ట్రానికి చేరాడు. పాతికేళ్ల తర్వాత తల్లిని, తండ్రిని చూడాలని తపిం చి తిరిగి వచ్చాడు. కానీ, తండ్రి లేడు. క్షణికావే శంలో దూరం చేసుకున్న తండ్రి ఇక ఎంతకాలానికైనా తిరిగి రాడని తెలిసి తల్లడిల్లిపోతున్నాడు. వివ రాలు... ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం చిమ్మపుడి గ్రామానికి చెందిన దొంతు నాగమణి, సత్యనారాయణ అనే రైతు దంపతులు 25 ఏళ్ల క్రితం ఓ గుర్తు తెలియని పదేళ్ల అబ్బాయిని చేరదీశారు. రమేశ్ అని పేరు పెట్టారు. పెద్దయ్యాక అదే మండలం మల్లేపల్లికి చెందిన లక్ష్మి అనే యువతితో పెళ్లి చేశారు. రమేశ్ దంపతులకిప్పుడు ఒక కొడుకు, కుమార్తె ఉన్నారు. మల్లేపల్లి సమీపంలోని యాకూబ్ కాలనీలో ఉంటూ చిన్న ఇల్లు కట్టుకున్నాడు. జన్మస్థలం గురించి ఆరా తీసి..: రమేశ్ ఇప్పుడు ఖమ్మంలోని ఓ గ్రానైట్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్నాడు. ఫ్యాక్టరీ యజమాని భార్య, కుమారుడికి రమేశ్ తన చిన్నప్పటి సంగతులను అప్పుడప్పుడు చెబుతుండేవాడు. తన తల్లిదండ్రులు, మూర్తి, మున్నెమ్మ, అన్న కార్తీక్, తమ్ముడు ప్రభు, చెల్లి నయాని ఎలా ఉన్నారోనని బెంగటిల్లెవాడు. దీంతో కంపెనీ యజమాని కొడుకు అతడి జన్మస్థలం గురించి ఆరా తీశాడు. రమేశ్ తెలిపిన వివరాల మేరకు కంపెనీ యజమాని కొడుకు తమిళనాడు రాష్ట్రం వెల్లూరు జిల్లా అంబూరి మండలం కదవాల గ్రామంలో విచారణ చేయించాడు. ఆ గ్రామ రేషన్ దుకాణంలో ఉన్న జాబితా ద్వారా చిన్నప్పటి ఫొటోను.. ఇప్పటి రమేష్ ఫొటోను సరిచూశాడు. తమ కుమారుడు పదేళ్ల వయసులో ఇంటి నుంచి పారిపోయాడని, ఆ ఫొటోలో ఉన్నది తమవాడేనని తల్లి, సోదరులు నిర్ధారించారు. గత ఆదివారం తమిళనాడులోని తన జన్మస్థలానికి వెళ్లాడు. తల్లిని, చెల్లిని, ఇద్దరు సోదరులను కలుసుకున్నాడు. తండ్రి రెండేళ్ల క్రితమే అనారోగ్యంతో మృతిచెందాడని తెలుసుకొని చలించిపోయాడు. తల్లిని, చెల్లిని, బావను, చెల్లి పిల్లలను తనతోపాటు యాకూబ్నగర్ తీసుకొచ్చాడు. అయితే, అతడు తెలుగు మాత్రమే మాట్లాడటం.. తల్లి, చెల్లి, బావలకు తమిళం తప్ప తెలుగు భాష రాకపోవడంతో వారితో రమేశ్ సైగలు చేస్తూ వ్యవహరిస్తున్నాడు. -
టిక్ టాక్ మోజులో యువకుల అదృశ్యం
సాక్షి, తూర్పుగోదావరి : టిక్ టాక్ మోజులో పడి డబ్బు సంపాదించాలన్న వ్యామోహంతో ఐదుగురు యువకులు అదృశ్యమైన సంఘటన నగరం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. వారిలో ఒక యువకుడి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు నగరం ఎస్సై ఎన్.సతీష్‌బాబు శనివారం కేసు నమోదు చేశారు. అమలాపురం డీఎస్పీ షేక్ మాసుమ్ బాషా కథనం ప్రకారం మామిడికుదురు, నగరం గ్రామాలకు చెందిన నలుగురు యువకులు కాకినాడకు చెందిన యువకుడితో కలిసి శుక్రవారం అర్ధరాత్రి తరువాత ఇంటి నుంచి అదృశ్యమయ్యారు. వీరు రెండు బైక్‌లపై వెళ్లి పోయారని గుర్తించారు. చదవండి: పురుగుల మందు తాగి టిక్‌టాక్ గతంలో పలు రకాల టిక్ టాక్‌లు చేసిన అనుభవం ఉన్న ఈ యువకులు ఎక్కడకు వెళ్లారన్నది మిస్టరీగా మారింది. ఒక యువకుడు రాసిన లెటర్లో తాము డబ్బు సంపాదన కోసం వెళ్తున్నామని, తమ కోసం ఎటువంటి ఆందోళన చెందవద్దని, తమ తల్లితండ్రులను బాగా చూసుకోవాలని కోరాడు. అదృశ్యమైన వారిలో 16 ఏళ్ల వారు ముగ్గురు, 18 ఏళ్ల వారు ఇద్దరు ఉన్నారు. డీఎస్పీ మాసుమ్ బాషా, రాజోలు సీఐ దుర్గాశేఖర్ రెడ్డి, నగరం ఎస్సై ఎన్.సతీష్‌బాబు తదితరులు ఆ యువకుల కుటుంబ సభ్యులను విచారణ చేసి వివరాలు సేకరించారు. ఈ యువకుల బృందం విశాఖపట్నం వెళ్లినట్లుగా సమాచారం రావడంతో ఆ దిశగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. టిక్‌టాక్ మోజులో పడి ఈ యువకులు వెళ్లిపోయారని గుర్తించామని డీఎస్పీ మాసుమ్ బాషా విలేకర్లకు తెలిపారు. చదవండి: టిట్‌టాక్ చేయడానికి చేపను మింగి.. మిస్సింగ్ కేసును చేధించిన పోలీసులు తూర్పుగోదావరి జిల్లా నగరం గ్రామంలో ఐదుగురు యువకుల మిస్సింగ్ కేసును పోలీసులు చేధించారు. అదృశ్యమైన యువకులంతా ప్రస్తుతం మంగళగిరి పోలీస్ స్టేషన్లో ఉన్నట్లు సమాచారం. వీరిని అక్కడనుంచి తీసుకురావడానికి పోలీసులు నగరం నుంచి మంగళగిరి బయలుదేరి వెళ్లారు. -
భార్య కాపురానికి రాలేదని ఆత్మహత్య
లక్సెట్టిపేట, న్యూస్‌లైన్ :భార్య కాపురానికి రాలేదని మనస్తాపం చెందిన భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన మండలంలోని మస్తాన్‌గూడ కాల నీలో జరిగింది. ఎస్సై ఎస్కే.లతీఫ్ కథనం ప్ర కారం.. మస్తాన్‌గూడ కాలనీకి చెందిన షేక్ షాబీర్ (38) వివాహం పట్టణంలోని గోదావరి రోడ్ కాలనీకి చెందిన షెహనాజ్ బేగంతో 14 ఏళ్ల క్రితం జరిగింది. వీరికి సమీర్, సహజర్, అక్షబేగం పిల్లలున్నారు. కొద్ది రోజుల నుంచి షాబీర్ మద్యానికి బానిసయ్యూడు. దీంతో షెహనాజ్ బేగం తన పుట్టింటికి వెళ్లింది. ఆమె ను తీసుకొచ్చేందుకు షాబీర్ కుటుంబ సభ్యు లు షెహనాజ్ ఇంటికెళ్లగా వచ్చేందుకు ఆమె నిరాకరించింది. దీంతో మనస్తాపానికి గురైన షాబీర్ రెండు రోజుల నుంచి కని పించడంలేదు. కుటుంబ సభ్యులు అతడి జాడ కోసం వెతికినా ఫలితం లేకపోరుుంది. ఆదివా రం ఇంటి ఆవరణలో ఉన్న బావిలో షాబీర్ శ వమై తేలాడు. భార్య కాపురానికి రావడంలేద ని మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్న ట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. గంగారంలో మద్యానికి బానిసై.. చెన్నూర్ రూరల్ : మద్యానికి బానిసైన వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలోని గంగారం గ్రామంలో జరిగింది. ఎస్సై ఖయ్యూం కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన బోనగిరి రామయ్య(48) కొంతకాలంగా మద్యానికి బానిసయ్యూడు. ఈ క్రమంలో శనివారం రాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో కూరగాయల తోటకు చల్లే క్రిమిసంహారక మందు తాగాడు. కాసేపటికి అతడి భార్య కాంత ఇంటికి రాగా రామయ్య అపస్మారకస్థితిలో పడి ఉన్నాడు. అతడి నోటి నుంచి క్రిమిసంహారక మందు వాసన రావడం గమనించిన ఆమె వెంటనే స్థానికుల సాయంతో 108లో భర్తను చెన్నూర్ ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లింది. చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి రామయ్య చనిపోయూడు. అతడికి భార్య, ముగ్గురు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. కాంత ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై వివరించారు.