
భార్యాబిడ్డల కిడ్నాప్‌తో ఓ భర్త అఘాయిత్యం!
అప్పులవారి వేధింపులను తట్టుకోలేక ఉదయ్ తన భార్య, పిల్లలతో హుబ్లీని విడిచి హావేరికి చేరుకున్నాడు. హావేరికి తన అనుచరులతో వచ్చిన పవన్, ఉదయ్ భార్య, బిడ్డలను బలవంతంగా తీసుకుని వెళ్లాడు. దీంతో ఆవేదన గురైన ఉదయ్ ఇంటిలోనే ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనపై స్థానికులు పవన్, అతని అనుచరులపై దాడి చేశారు. పోలీసులు పవన్, అతని అనుచరులు అదుపులోకి తీసుకున్నారు.