భర్త ప్రాణం తీసిన భార్య నటన | Married men commit Suicide in Hyderabad | Sakshi
Sakshi News home page

భర్త ప్రాణం తీసిన భార్య నటన

Published Wed, Feb 5 2014 8:21 AM | Last Updated on Fri, Jul 27 2018 2:21 PM

భర్త ప్రాణం తీసిన భార్య నటన - Sakshi

భర్త ప్రాణం తీసిన భార్య నటన

* అసభ్యంగా నటించడంతో తీవ్ర మనస్తాపం
* ఉరివేసుకొని ఆత్మహత్య
 
హైదరాబాద్: భార్య ఓ లఘుచిత్రంలో అసభ్యంగా నటించడంతో తట్టుకోలేని భర్త తీవ్ర మనస్తాపంతో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. దీనికితోడు అత్తింటివారి వేధింపులు అధికం కావడంతో ఆత్మహత్య చేసుకుంటున్నానంటూ సూసైడ్‌నోట్‌లో పేర్కొన్నాడు. ఎస్సార్‌నగర్ సీఐ శంకర్  వివరాల ప్రకారం..చిత్తూరు జిల్లాకు చెందిన బండారు ఉదయ్‌భాను(32) కొటక్‌మహీంద్రా కంపెనీలో పనిచేస్తూ అమీర్‌పేట సత్యం థియేటర్ సమీపంలోని ఓ అపార్ట్‌మెంట్‌లో స్నేహితులతో కలిసి నివాసముంటున్నాడు.

ఆర్థిక ఇబ్బందులు, కుటుంబకలహాల నేపథ్యంలో భార్య లీలారాణి, 11 ఏళ్ల కూతురుతో గత రెండేళ్లుగా దూరంగా ఉంటున్నాడు. కాగా భార్య ఇటీవల ఓ లఘుచిత్రంలో అసభ్యకరంగా నటించడాన్ని భాను తట్టుకోలేకపోయాడు. కొన్నిరోజులుగా బాధపడుతుండడంతోపాటు అత్తింటి వారి వేధింపులు అధికమయ్యాయి. వీటిని భరించలేని భాను మంగళవారం ఉదయం గదిలో ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.

మధ్యాహ్నం సమయంలో గదికొచ్చిన స్నేహితులు తలుపులు తట్టగా లోపలినుంచి ఎలాంటి సమాధానం రాలేదు. గట్టిగా తలుపులు నెట్టి లోపలికి వెళ్లి చూడగా అప్పటికే భాను మృతిచెంది ఉన్నాడు. పోలీసులు సూసైడ్‌నోట్‌ను స్వాధీనం చేసుకున్నారు. ‘భార్య లఘుచిత్రంలో అసభ్యంగా నటించిందని, దీన్ని తట్టుకోలేకపోయానని, అత్తింటి వేధింపులు పెరగడంతో జీవితంపై విరక్తిచెందానని’ అందులో పేర్కొన్నట్లు పోలీసులు తెలిపారు. మృతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీకి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement