haveri
-
కర్ణాటకలో దారుణం.. లాడ్జిలో జంటపై దాడి
బెంగళూరు: కర్ణాటకలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. లాడ్జి గదిలోకి అక్రమంగా చొరబడిన కొందరు దుండగులు ఓ జంటపై విచక్షణారహితంగా దాడి చేశారు. అసభ్య పదజాలంతో దూషిస్తూ.. ఇద్దరినీ కొడుతూ వీడియో రికార్డ్ చేశారు. దీనికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. జనవరి ఏడున హవేరీ జిల్లాలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. వైరల్ అవుతున్న వీడియోలో రికార్డయిన దృశ్యాల ప్రకారం.. ఈ ఇద్దరూ వేర్వేరు మతాలకు చెందినవాళ్లుగా తెలుస్తోంది. హనగల్ తాలుకాలోని లాడ్జిలో ఈ జంట బస చేస్తున్నారనే సమాచారం తెలుసుకున్న మైనారిటి వర్గానికి చెందిన ఆరుగురు వ్యక్తుల గుంపు హోటల్లోకి ప్రవేశించారు. లాడ్ట్లోని గది నంబర్ వద్దకు వెళ్లి తలుపు తట్టారు. ఓ వ్యక్తి డోర్ తీయడంతో వెంటనే రూమ్‌లోని ప్రవేశించి నేరుగా యువతి వద్దకు పరుగెత్తారు. దీంతో మహిళ భయపడి తన ముఖాన్ని బుర్ఖాతో కప్పుకునే ప్రయత్నం చేసింది. అయినా అంగతకులు యువతిపై దాడికి దిగారు. గట్టిగా కొట్టడంతో ఆమె కిందపడిపోయింది. ఆమెతో ఉన్న వ్యక్తిపై కూడా దాడి చేసేందుకు రాగా అతడు బయటకు పరుగెత్తడానికి ప్రయత్నించాడు. ఇద్దరు ముగ్గురు దుండగులు అతడ్ని లోపలికి ఈడ్చుకొచ్చి కొట్టారు. యువతిపై సైతం పదే పదే దాడికి పాల్పడ్డారు. లాడ్జి బయట తీసిన మరో వీడియోలో యువతి బుర్ఖాతో ముఖాన్ని కప్పుకోవడానికి తీవ్రంగా ప్రయత్నిస్తుంటే.. వ్యక్తులు ఆమె హిజాబ్‌ను తొలగించి వీడియో తీశారు. అనంతరం వారు అక్కడి నుంచి పరారయ్యారు. అంగతకుల దాడిలో గాయాలపాలైన జంట హనగల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. ఆరుగురిలో ఇద్దరి అదుపులోకి తీసుకున్నారు. ఇద్దరు మైనారిటీ వర్గానికి చెందిన వారుగా గుర్తించారు. మిగిలిన నలుగురి ఆచూకీ కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కాగా దాడికి పాల్పడింది ఎవరూ? ఎందుకు కొట్టారనే విషయాలు తెలియాల్సి ఉంది. అయితే యువతి యువకుల మతాలు వేరుకావడం కారణంగానే దుండగులు దాడి చేసినట్లు తెలుస్తోంది. Blood boils looking at this video!!!! Moral policing horror from #Karnataka's Haveri. Muslim youths beat up interfaith couple staying at a lodge in Haveri. Nearly 7 men barge into a lodge & thrash the couple. Victims were dragged to the streets & assaulted, while filming the… pic.twitter.com/JNHFbm9o5V — Nabila Jamal (@nabilajamal_) January 11, 2024 ఇదిలా ఉండగా మతాంతార వివాహం చేసుకున్న జంటగా పొరబడి బెలగావిలో ఇద్దరు బంధువులను కొంతమంది దారుణంగా కొట్టిన సంగతి తెలిసిందే. భిన్న మతాలకు చెందిన యువతి, యువకుడు పక్క పక్కన కూర్చున్నారనే కారణంతో దాడి చేశారు. తనని విడిచిపెట్టాలని కోరినా.. యువకుడిని పైపులు, రాడ్లతో చితక బాదారు. యువతిని వేధించారు. బాధితులిద్దరూ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. మొత్తం 7 మంది నిందితుల్ని అరెస్టు చేశారు. ఈ ఘటన జరిగిన మూడు రోజులకే మరో ఉదంతం వెలుగుచూడటం గమనార్హం. -
హావేరిలో ఆగ్రహ జ్వాల
సాక్షి బెంగళూరు: వేలాది మంది విద్యార్థులు హావేరిలో రోడ్లపైకి వచ్చి ఆందోళన చేపట్టారు. గురువారం జాతీయ రహదారిపై వారద నదికి సమీపంలో 21 ఏళ్ల యువతి మృతదేహం లభించిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో మృతి చెందిన రేణుక పాటిల్ కేసులో న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. హావేరి పట్టణంలోని ప్రధాన సర్కిల్‌ను అడ్డగిస్తూ విద్యార్థులు మానవహారాన్ని నిర్వహించారు. హావేరి పట్టణానికి సరిగ్గా 14 కిలోమీటర్ల దూరంలోని మన్నూర్ గ్రామానికి చెందిన బసనగౌడ కుమార్తె రేణుక పాటిల్ (21) అనుమానస్పద రీతిలో కాలిన గాయాలతో మృతి చెందింది. కాగా, సోమవారం సాయంత్రం స్నేహితుల దినోత్సవాన్ని జరుపుకునేందుకు మిత్రులతో వెళ్లి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. ఆ పార్టీలో మత్తుపదార్థాలు ఇచ్చి స్నేహితులే ఆమెపై అత్యాచారానికి ఒడిగట్టి హత్య చేసి ఉంటారని అనుమానించారు. ఈ నేపథ్యంలో రేణుక విషయంలో సత్వర న్యాయం జరగాలని, నిందితులను కఠినంగా శిక్షించాని డిమాండ్ చేస్తూ హావేరి రోడ్డుపై విద్యార్థులు నిరసన చేపట్టారు. ఏబీవీపీ, ఎస్ఐఎఫ్ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఈ ఆందోళనలు జరిగాయి. మరోవైపు పంచమసాలి పీఠాధిపతి బసవజయ మృత్యుంజయ శ్రీగళు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో యువతులపై వేధింపులు అధికమవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. రేణుక పాటిల్ కేసుపై తక్షణమే ముఖ్యమంత్రి, హోం మంత్రి స్పందించాలన్నారు. -
కన్నీరు పెట్టించిన ఆవు ప్రేమ
-
భార్యాబిడ్డల కిడ్నాప్‌తో ఓ భర్త అఘాయిత్యం!
శివాజీనగర (హావేరి): అప్పు తిరిగి చెల్లించలేదనే కారణంతో వ్యక్తి తన భార్య, బిడ్డలను కిడ్నాప్ చేయటంతో ఈ అవమానాన్ని తట్టుకోలేక భర్త ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన కర్ణాటకలోని హావేరిలో చోటు చేసుకుంది. హుబ్లీలో నివాసముంటున్న ఉదయ్ తన వ్యక్తిగత అవసరం నిమిత్తం పవన్ అనే వ్యక్తి నుంచి రూ.లక్ష అప్పు తీసుకున్నాడు. అయితే ఉదయ్ అప్పు తిరిగి ఇవ్వలేదు. అప్పులవారి వేధింపులను తట్టుకోలేక ఉదయ్ తన భార్య, పిల్లలతో హుబ్లీని విడిచి హావేరికి చేరుకున్నాడు. హావేరికి తన అనుచరులతో వచ్చిన పవన్, ఉదయ్ భార్య, బిడ్డలను బలవంతంగా తీసుకుని వెళ్లాడు. దీంతో ఆవేదన గురైన ఉదయ్ ఇంటిలోనే ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనపై స్థానికులు పవన్, అతని అనుచరులపై దాడి చేశారు. పోలీసులు పవన్, అతని అనుచరులు అదుపులోకి తీసుకున్నారు.