కర్ణాటకలో దారుణం.. లాడ్జిలో జంటపై దాడి | Video: 6 Men Barge Into Hotel Room In Karnataka Thrash Interfaith Couple | Sakshi
Sakshi News home page

కర్ణాటకలో దారుణం.. లాడ్జిలోకి చొరబడి జంటపై దుండగుల దాడి

Published Thu, Jan 11 2024 2:28 PM | Last Updated on Thu, Jan 11 2024 3:04 PM

Video: 6 Men Barge Into Hotel Room In Karnataka Thrash Interfaith Couple - Sakshi

బెంగళూరు: కర్ణాటకలో షాకింగ్‌ ఘటన చోటుచేసుకుంది. లాడ్జి గదిలోకి అక్రమంగా చొరబడిన కొందరు దుండగులు ఓ జంటపై విచక్షణారహితంగా దాడి చేశారు. అసభ్య పదజాలంతో దూషిస్తూ.. ఇద్దరినీ కొడుతూ వీడియో రికార్డ్‌ చేశారు. దీనికి సంబంధించిన దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. జనవరి ఏడున హవేరీ జిల్లాలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. 

వైరల్‌ అవుతున్న వీడియోలో రికార్డయిన దృశ్యాల ప్రకారం.. ఈ ఇద్దరూ వేర్వేరు మతాలకు చెందినవాళ్లుగా తెలుస్తోంది. హనగల్‌ తాలుకాలోని లాడ్జిలో ఈ జంట బస చేస్తున్నారనే సమాచారం తెలుసుకున్న మైనారిటి వర్గానికి చెందిన ఆరుగురు వ్యక్తుల గుంపు హోటల్‌లోకి ప్రవేశించారు. లాడ్ట్‌లోని  గది నంబర్‌ వద్దకు వెళ్లి తలుపు తట్టారు. ఓ వ్యక్తి డోర్‌ తీయడంతో వెంటనే రూమ్‌లోని ప్రవేశించి నేరుగా యువతి వద్దకు పరుగెత్తారు. దీంతో మహిళ భయపడి తన ముఖాన్ని బుర్ఖాతో కప్పుకునే ప్రయత్నం చేసింది.

అయినా అంగతకులు యువతిపై దాడికి దిగారు. గట్టిగా కొట్టడంతో ఆమె కిందపడిపోయింది. ఆమెతో ఉన్న వ్యక్తిపై కూడా దాడి చేసేందుకు రాగా అతడు బయటకు పరుగెత్తడానికి ప్రయత్నించాడు. ఇద్దరు ముగ్గురు దుండగులు అతడ్ని లోపలికి ఈడ్చుకొచ్చి కొట్టారు. యువతిపై సైతం పదే పదే దాడికి పాల్పడ్డారు. లాడ్జి బయట తీసిన మరో వీడియోలో  యువతి బుర్ఖాతో ముఖాన్ని కప్పుకోవడానికి తీవ్రంగా ప్రయత్నిస్తుంటే.. వ్యక్తులు ఆమె హిజాబ్‌ను తొలగించి వీడియో తీశారు. అనంతరం వారు అక్కడి నుంచి పరారయ్యారు.

అంగతకుల దాడిలో గాయాలపాలైన జంట హనగల్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. ఆరుగురిలో ఇద్దరి అదుపులోకి తీసుకున్నారు. ఇద్దరు మైనారిటీ వర్గానికి చెందిన వారుగా గుర్తించారు. మిగిలిన నలుగురి ఆచూకీ కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కాగా దాడికి పాల్పడింది ఎవరూ? ఎందుకు కొట్టారనే విషయాలు తెలియాల్సి ఉంది. అయితే యువతి యువకుల మతాలు వేరుకావడం కారణంగానే దుండగులు దాడి చేసినట్లు తెలుస్తోంది. 

ఇదిలా ఉండగా మతాంతార వివాహం చేసుకున్న జంటగా పొరబడి బెలగావిలో ఇద్దరు బంధువులను కొంతమంది దారుణంగా కొట్టిన సంగతి తెలిసిందే. భిన్న మతాలకు చెందిన యువతి, యువకుడు పక్క పక్కన కూర్చున్నారనే కారణంతో దాడి చేశారు. తనని విడిచిపెట్టాలని కోరినా.. యువకుడిని పైపులు, రాడ్లతో చితక బాదారు. యువతిని వేధించారు. బాధితులిద్దరూ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. మొత్తం 7 మంది నిందితుల్ని అరెస్టు చేశారు. ఈ ఘటన జరిగిన మూడు రోజులకే మరో ఉదంతం వెలుగుచూడటం గమనార్హం. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement