ఒక తప్పిదం..రెండు కుటుంబాల్లో విషాదం | Man Committed Suicide In Rangareddy | Sakshi
Sakshi News home page

ఒక తప్పిదం..రెండు కుటుంబాల్లో విషాదం

Published Wed, Jun 27 2018 10:44 AM | Last Updated on Thu, Aug 16 2018 4:31 PM

Man Committed Suicide In Rangareddy - Sakshi

ఆత్మహత్య చేసుకున్న లలిత తండ్రి బీరయ్య 

యాచారం : వివాహేతర సంబంధం ఘటన రెం డు కుటుంబాల్లో విషాదం యాచారం మం డలం నక్కర్తమేడిపల్లి గ్రామానికి చెందిన లలిత అదే గ్రా మానికి చెందిన ఓ వ్యక్తితో అక్రమ సంబంధంపై మనస్తాపంచెందిన ఆమె భర్త లింగం శనివారం రాత్రి ఇంట్లో ఊరేసుకుని ఆత్మహత్యకు పా ల్పడ్డాడు.  అయితే లింగం మరణానికి ఆయన భార్య లలిత అక్రమ సంబంధమే కారణమంటు గ్రామస్తులు, బంధువులు ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఆదివారం రాత్రి లలితను పోలీసులు అరెస్టు చేశారు.

భార్య లలిత లేకుండా సోమ వా రం నక్కర్తమేడిపల్లిలో లింగం అంత్యక్రియలు పూర్తి చేశా రు. సోమవారం జరిగిన లింగం అంత్యక్రియల్లో బంధువులు, గ్రామస్తులు.. నీ బిడ్డ వివాహేతర సంబంధమే  లింగం ప్రాణతీసిందని లలిత తండ్రి బీరయ్యను మందలించారు. గ్రామస్తుల సూటిపోటి మాటలతో మనస్తాపం చెందిన బీరయ్య సోమవారం రాత్రి కొత్తపల్లి గ్రామంలో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

సమాచారం తెలుసుకున్న పోలీసులు మృతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం ఇబ్రహీంపట్నం ప్రభుత్వాసుపత్రి మార్చురికి తరలించి పోస్టుమార్టం అనంతరం మంగళవారం మృతదేహన్ని కొత్తపల్లికి తరలించారు. భర్త మృతికి కారణమైన లలితను మంగళవారం పోలీసులు రిమాండ్‌కు పంపించారు.

వివాహేతర సంబంధం వల్ల భర్త ఆత్మహత్య చేసుకోవడం.. ఆమె జైలు పాలు కావడం, ముగ్గురు చిన్నారులు అనాథలుగా మారడం.. తండ్రి ఆత్మహత్య చేసుకోవడంతో నక్కర్తమేడిపల్లి, కొత్తపల్లి గ్రామాల్లోని రెండు కుటుంబాల్లో విషాదం నెలకొంది.


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement