భార్య అలా అన్నందుకు...
నార్సింగి (మహబూబ్‌నగర్): మద్యం మానేయమని భార్య చెప్పిందనే కోపంతో ఓ భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన నార్సింగి పోలీస్‌స్టేషన్‌పరిధిలో శనివారం చోటు చేసుకుంది. వివరాల ప్రకారం.. మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన ఎల్లప్ప(35), పద్మ దంపతులు జీవనోపాధి కోసం వచ్చి పీరంచెరువు ప్రాంతంలో నివసిస్తున్నారు. పద్మ స్థానికంగా ఇళ్లలో పని చేస్తుండగా ఎల్లప్ప ఎలక్ట్రీషియన్ పనులు చేసేవాడు.
మద్యానికి బానిసగా మారిన ఎల్లప్పను పద్మ తాగవద్దంటూ హెచ్చరిస్తోంది. ఈ విషయమై శుక్రవారం రాత్రి వారి మధ్య గొడవ జరిగింది. శనివారం ఉదయం పద్మ కుమారుడిని తీసుకోని ఇళ్లలో పని చేసేందుకు వెళ్ళింది. మధ్యాహ్నం ఇంటికి రాగా ఎల్లప్ప ఉరికి వేలాడుతూ కనిపించాడు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.