![Husband Suicide While Wife Threats in Tamil nadu - Sakshi](/styles/webp/s3/article_images/2019/05/28/husband.jpg.webp?itok=C42kFa7t)
తమిళనాడు, తిరువళ్లూరు: భార్య మందలించిందనే మనస్తాపంతో భర్త ఆత్మహత్య చేసుకున్న సంఘటన కవరపేటలో జరిగింది. వివరాలు.. తిరువళ్లూరు జిల్లా పంచెట్టి గ్రామానికి చెందిన సత్య, ఏలుమలైకు 20 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. కొద్ది సంవత్సరాల పాటు సజావుగా సాగిన వీరి కాపురంలో మద్యం భూతం చిచ్చురేపింది. తరచూ మద్యం సేవించి వచ్చే ఏలుమలై భార్యను వేధించేవాడని తెలుస్తుంది. గత శనివారం రాత్రి ఇరువురి మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది. దీంతో సత్య తన పుట్టింటికి వెళ్లిపోయింది. మనస్తాపంతో ఉన్న ఏలుమలై తన అక్క మనోన్మణికి ఫోన్ చేసి మద్యం సేవించి వచ్చానని అందరి ముందు సత్య మందలించిందని వాపోయాడు. ఆత్మహత్య చేసుకోవాలని పురుగుల మందు తాగినట్టు తెలిపాడు. వెంటనే అక్కడికి చేరుకున్న మనోన్మణి అపస్మారక స్థితిలో ఉన్న ఏలుమలైను పొన్నేరి వైద్యశాలకు తరలించింది. అక్కడ చిక్సిత పొందుతూ సోమవారం ఉదయం మృతి చెందాడు. కవరపేట పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment