భువనగిరి అర్బన్: భార్య మందలించడంతో మనస్తాపానికి గురైన ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. నల్లగొండ జిల్లాలోని భువనగిరి-పగిడిపల్లి రైల్వే స్టేషన్ల మధ్యలో రైలు పట్టాలపై శుక్రవారం ఓ వ్యక్తి మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. మృతుడు రాళ్లజనగాం గ్రామానికి చెందిన కందుకూరి రాజారామ్(45)గా గుర్తించారు.
పోలీసుల కథనం ప్రకారం.. వడ్రంగి పని చేసే రాజారామ్ మద్యానికి బానిస కావడంతో భార్య వినోద మందిలించింది. చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని భర్తకు సూచించింది. దీంతో మనస్తాపం చెందిన రాజారామ్ రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు.