
సిరిసిల్లక్రైం: డయాలసిస్‌తో బాధప డుతున్న ఓ భర్త తన భార్యను క్షణి కావేశంలో హత్యచేసి..ఆపై తను ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసు లు తెలిపిన వివరాల ప్రకారం.. రాజన్నసిరిసిల్ల జిల్లాకేంద్రంలోని శాంతి నగర్‌కు చెందిన దూస రాజేశం(62) రెండు కిడ్నీలు కొద్దినెలల క్రితం పాడయ్యాయి. దీంతో డయాలసిస్ చేయించుకుంటున్నాడు. తనకు కిడ్నీ మార్పిడి చేయించాలని కొన్నాళ్లుగా కుటుంబ సభ్యులతో గొడవ పడు తున్నాడు.
కిడ్నీ దొరకగానే శస్త్రచికిత్స చేయిద్దామని, అప్పటి వరకు ఆగాలని కుటుంబసభ్యులు సముదాయించారు. ఈ క్రమంలోనే డయాలసిస్‌తో కాలం వెళ్లదీయలేనని మనస్తా పానికి గురైన రాజేశం ఆదివారం రాత్రి ఇంట్లో ఎవరూలేని సమయంలో తన భార్య లక్ష్మి(50)ని బలమైన ఆయుధంతో తలపై కొట్టి హత్య చేశాడు. అనంతరం ఇంట్లోని పైకప్పుకు తాడుతో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రాజేశం పవర్‌లూమ్స్ నడిపించేవాడని కుటుంబసభ్యులు తెలిపారు.
ఇంట్లో ఎవరూ లేకపోవడంతో..
రాజేశంకు ఇద్దరు కుమారులు. చిన్నకొడుకు విద్యాభ్యాసం కోసం హైదరాబాద్‌లో ఉండగా, పెద్ద కుమారుడు ఆదివారం తన అత్తగారింట్లో జరిగిన శుభకార్యానికి వెళ్లాడు. ఇంట్లో ఎవరూ లేరని గమనించిన రాజేశం తన భార్యను హత్య చేసి తను ఆత్మహత్యకు పాల్పడినట్టు కుమారుడు వేణు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment