Kidney transplant
-
అలకనంద హాస్పిటల్ కిడ్నీ రాకెట్ దందాపై ప్రభుత్వం సీరియస్
-
హైదరాబాద్ కిడ్నీ రాకెట్ కేసులో సంచలన విషయాలు
చైతన్యపురి (హైదరాబాద్): నగరంలో కిడ్నీ రాకెట్ గుట్టు రట్టయింది. సాధారణ వైద్య చికిత్సలకు (జనరల్) మాత్రమే అనుమతి తీసుకుని ఏకంగా కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్లు చేస్తూ రూ.లక్షల్లో దోపిడీకి పాల్పడుతున్న ఆస్పత్రి నిర్వాకాన్ని వైద్యాధికారులు, పోలీసులు బట్టబయలు చేశారు. ఆస్పత్రి నిర్వాహకుడిని పోలీసులు అరెస్టు చేశారు. డీఎంఎచ్ఓ, పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. సరూర్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధి డాక్టర్స్ కాలనీలోని అలకనంద ఆస్పత్రిలో అనుమతుల్లేకుండా కిడ్నీల మారి్పడి దందా సాగిస్తున్నన్నట్లు సమాచారం అందింది. దీంతో జిల్లా వైద్యాధికారి వెంకటేశ్వర్లు, ఎల్బీనగర్ ఏసీపీ కృష్ణయ్య, సరూర్‌నగర్ ఇన్స్పెక్టర్ సైదిరెడ్డి మంగళవారం సాయంత్రం ఆస్పత్రిపై దాడి చేశారు.జనరల్, ప్లాస్టిక్ సర్జరీల నిమిత్తం ఆస్పత్రి నిర్వహణకు 6 నెలల అనుమతి తీసుకున్న సుమంత్ అనే వ్యక్తి.. కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలకు చెందిన అమాయక యువతులకు డబ్బు ఆశ చూపి కిడ్నీలు దానం చేసేందుకు ఒప్పిస్తున్నాడు. హైదరాబాద్‌లో అవసరమైన వారికి కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సలు చేయిస్తున్నాడు. ఇవన్నీ ఎలాంటి అనుమతులు లేకుండానే చేస్తున్నట్లు గుర్తించిన జిల్లా వైద్యాధికారులు.. పోలీసులతో కలిసి ఆస్పత్రిలో తనిఖీలు చేశారు. ఇద్దరు కిడ్నీ దాతలతో పాటు ఇద్దరు కిడ్నీ మార్పిడి చేయించుకున్న రోగులను కనుగొన్నారు.అధికారులు దాడులు చేస్తున్న విషయం తెలుసుకొని వైద్యులు పరారయ్యారు. దీంతో చికిత్స పొందుతున్న నలుగురు బాధితులను అధికారులు అంబులెన్స్‌లో గాంధీ ఆస్పత్రికి తరలించారు. అలకనంద ఆస్పత్రిని సీజ్ చేశారు. కిడ్నీ మారి్పడి చికిత్స కోసం ఒకొక్కరి నుంచి సుమారు రూ.58 లక్షలు తీసుకున్నట్లు అధికారుల తనిఖీల్లో వెల్లడైంది. ఎలాంటి అనుమతి లేకుండానే ఇతర రాష్టాల నుంచి వైద్యులను పిలిపించి కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్లు చేస్తున్నట్లుగా గుర్తించినట్లు డీఎంహెచ్ఓ వెంకటేశ్వర్లు తెలిపారు. కిడ్నీ రాకెట్ ముఠాపై కఠిన చర్యలు: రాజనర్సింహ అలకనంద ఆసుపత్రి ఉదంతంపై వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆరా తీశారు. కిడ్నీ మారి్పళ్లకు పాల్పడిన డాక్టర్లు, ఆసుపత్రి యాజమాన్యం, ఇతర బాధ్యులందరిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. దీనిపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని చెప్పారు -
కిడ్నీలు కుదేలు
మారుతున్న వాతావరణం, జీవనశైలి కారణంగా దేశంలో కిడ్నీ వ్యాధులు ఏటా పెరిగిపోతున్నాయి. అవయవాలు పాడై చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న వారిలో అత్యధిక శాతం కిడ్నీ వ్యాధిగ్రస్తులే ఉంటున్నారు. ఈ నేపథ్యంలో ఏటా కిడ్నీ మార్పిడి(ట్రాన్స్‌ప్లాంట్) కేసుల్లో వృద్ధి నమోదవుతూ వస్తోంది. 2013లో దేశవ్యాప్తంగా 4,037 కిడ్నీ మార్పిడి కేసులు నమోదు కాగా... ఆ సంఖ్య క్రమంగా పెరుగుతూ 2023 సంవత్సరానికి ఏకంగా 1,3426కు చేరింది. – సాక్షి, అమరావతినేషనల్ ఆర్గాన్, టిష్యూ ట్రాన్స్‌ప్లాంట్ ఆర్గనైజేషన్(నోటో) విడుదల చేసిన 2023 వార్షిక నివేదిక ప్రకారం గత ఏడాది దేశం మొత్తం 16,542 అవయవ మార్పిడి కేసులు నమోదు కాగా, అందులో 81 శాతం.. అంటే 13,426 కిడ్నీ మార్పిడి కేసులే ఉండటం గమనార్హం. మొత్తం కిడ్నీ మార్పిడి కేసుల్లో 11,791 రక్తసంబంధికులు కిడ్నీలు దానం చేయగా, 1,635 కేసుల్లో బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తుల నుంచి సేకరించిన కిడ్నీలు ట్రాన్స్‌ప్లాంట్ చేశారు.2023లో కిడ్నీ గ్రహీతల్లో ఎవరు ఎంతమంది అంటే.. పురుషులు: 8,486 (63%) మహిళలు: 4,939 (37%) ట్రాన్స్‌జెండర్: 1 -
కిడ్నీ మార్పిడి చేయించడం లేదని.. భార్యను చంపి భర్త ఆత్మహత్య
సిరిసిల్లక్రైం: డయాలసిస్‌తో బాధప డుతున్న ఓ భర్త తన భార్యను క్షణి కావేశంలో హత్యచేసి..ఆపై తను ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసు లు తెలిపిన వివరాల ప్రకారం.. రాజన్నసిరిసిల్ల జిల్లాకేంద్రంలోని శాంతి నగర్‌కు చెందిన దూస రాజేశం(62) రెండు కిడ్నీలు కొద్దినెలల క్రితం పాడయ్యాయి. దీంతో డయాలసిస్ చేయించుకుంటున్నాడు. తనకు కిడ్నీ మార్పిడి చేయించాలని కొన్నాళ్లుగా కుటుంబ సభ్యులతో గొడవ పడు తున్నాడు.కిడ్నీ దొరకగానే శస్త్రచికిత్స చేయిద్దామని, అప్పటి వరకు ఆగాలని కుటుంబసభ్యులు సముదాయించారు. ఈ క్రమంలోనే డయాలసిస్‌తో కాలం వెళ్లదీయలేనని మనస్తా పానికి గురైన రాజేశం ఆదివారం రాత్రి ఇంట్లో ఎవరూలేని సమయంలో తన భార్య లక్ష్మి(50)ని బలమైన ఆయుధంతో తలపై కొట్టి హత్య చేశాడు. అనంతరం ఇంట్లోని పైకప్పుకు తాడుతో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రాజేశం పవర్‌లూమ్స్ నడిపించేవాడని కుటుంబసభ్యులు తెలిపారు. ఇంట్లో ఎవరూ లేకపోవడంతో..రాజేశంకు ఇద్దరు కుమారులు. చిన్నకొడుకు విద్యాభ్యాసం కోసం హైదరాబాద్‌లో ఉండగా, పెద్ద కుమారుడు ఆదివారం తన అత్తగారింట్లో జరిగిన శుభకార్యానికి వెళ్లాడు. ఇంట్లో ఎవరూ లేరని గమనించిన రాజేశం తన భార్యను హత్య చేసి తను ఆత్మహత్యకు పాల్పడినట్టు కుమారుడు వేణు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. -
రోగికి పంది కిడ్నీ మార్పిడి.. అంతలోనే విషాదం
అమెరికా మసాచుసెట్స్ జనరల్ ఆస్పత్రిలో విషాదం చోటు చేసుకుంది. మసాచుసెట్స్ పంది కిడ్నీని ట్రాన్స్‌ప్లాంట్ చేసిన రిచర్డ్ స్లేమాన్ (62) మరణించారు.ఇంగ్లాండ్ వేమౌత్ నగరానికి చెందిన రిచర్డ్ స్లేమాన్ (62) కిడ్నీ సంబంధిత అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాడు. అయితే 2018లో వైద్యులు అతనికి కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ చేశారు. కొంత కాలం బాగున్నా.. ఆ తర్వాత కిడ్నీ సమస్య మొదటికి రావడంతో డయాలసిస్ చేయాల్సి వచ్చింది. దీంతో అనారోగ్య సమస్యలు చుట్టుముట్టాయి. ఫలితం లేకపోవడంతో వైద్యులు స్లేమాన్‌కు పంది కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్ సలహా ఇచ్చారు.మసాచుసెట్స్ జనరల్ ఆస్పత్రి వైద్యులుఈ ఏడాది మార్చి 16న అమెరికా మసాచుసెట్స్ జనరల్ ఆస్పత్రి వైద్యులు నాలుగు గంటల శ్రమించి స్లేమాన్‌కు పంది కిడ్నీని అమర్చారు. ఆపరేషన్ అనంతరం ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఈ తరుణంలో ఏప్రిల్ 11న (నిన్న) స్లేమాన్ మరణించినట్లు కుటుంబసభ్యులు, మసాచుసెట్స్ వైద్యులు తెలిపారు.ఆధారాలు లేవుఈ సందర్భంగా పందికిడ్నీని అమర్చడం వల్లే స్లేమాన్ మరణించినట్లు ఆధారాలు లేవని వైద్యులు వెల్లడించారు. కుటుంబసభ్యులు తమకు స్లేమాన్తో మరికొంత కాలం పాటు తమతో గడిపేందుకు కృషి చేసిన వైద్యులకు కృతజ్ఞతలు చెప్పారు.గతంలో గతంలో బ్రెయిన్ డెడ్ అయి కృత్రిమ లైఫ్ సపోర్ట్‌పై కోలుకోలేని స్థితిలో ఉన్న వ్యక్తికి పంది కిడ్నీని అమర్చారు. న్యూయార్క్ యూనివర్సిటీ లాన్‌గోన్ హెల్త్ మెడికల్ సెంటర్లో వైద్యులు ఈ ఆపరేషన్ చేశారు. రెండు నెలల వ్యవధిలోనే బాధితుడు మరణించాడు. స్లేమాన్ మాత్రం తాను రెండేళ్లు జీవిస్తానని ధీమా వ్యక్తం చేశారు. తనకు పంది కిడ్నీని అమర్చాలని కోరడంతో మసాచుసెట్స్ వైద్యుల్ని బాధితునికి పంది కిడ్నీని అమర్చారు. కానీ స్వల్ప వ్యవధిలో స్లేమాన్ మరణించడం వైద్య చరిత్రలో విషాదం నెలకొంది. -
మానవుడికి పంది కిడ్నీ..ప్రయోగం విజయవంతం
అవయవ దానం అనేది ఓ సమస్యాత్మకంగా మారింది. దాతలు దొరకక, బ్రెయిన్ డెడ్ వ్యక్తుల నుంచి అవయవాల సేకరణ పరిమితంగానే ఉండటం తదితర కారణాల దృష్ణ్యా ప్రస్తుతం అవయవాల మార్పిడి ఓ అర్థంకానీ ప్రశ్నలా ఉంది. ఆ ప్రశ్నకు సమాధానమే కాదు ఎన్నాళ్లుగా చిక్కుముడి వీడని ప్రశ్నలా వేధిస్తున్న సమస్యకు సమాధానం దొరికిందనే కొత్త ఆశని ఇచ్చింది. ఇంతవరకు పంది కిడ్నీని మనిషికి అమర్చి చేసిన ప్రయోగాల్లో చాలా వరకు ఒకటి రెండు రోజుల వరకే పనిచేస్తే ..ఈసారి మాత్రం ఏకంగా రెండు నెలలు విజయవంతంగా పనిచేసి రికార్డు సృష్టించింది. అదికూడా బ్రెయిన్‌డెడ్ మనిషిలో విజయవంతమవ్వడం పరిశోధకులకు సరికొత్త ఆశలను రేకెత్తించింది. ఈ పరిశోధన యూఎస్‌లో విజయవంతం అయ్యింది. మానవునిలో జన్యుపరంగా మార్పు చెందిన పంది కిడ్నీ సుదీర్ఘకాలం పనిచేయడం ఇదే తొలిసారి. ఈ మేరకు డాక్టర్ మోంట్‌గోమెరీ వైద్య బృందం మాట్లాడుతూ..ఈ ప్రయోగం అవయకొరత సమస్యను పరిష్కరించడంలో సహాయపడుతుందని ఆనందంగా చెప్పారు. తాము మారిస్ మిల్లర్ అనే బ్రెయిన్ డెడ్ వ్యక్తి మృతదేహాన్ని వెంటిలేటర్‌పై ఉంచి ఈ ప్రయోగాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. రెండు నెలలపాటు అతడిని వెంటిలేటర్‌పై ఉంచి మరీ ఆ పంది కిడ్నీ ఎలా పనిచేస్తుందో పరీక్షించినట్లు తెలిపారు. ఒక నెలపాటు విజయవంతంగా పనిచేసిందని ఆ తదుపరి నెమ్మదిగా మార్పులు కనిపించడం మొదలైంది. రోగనిరోధక వంటి మందుల చికిత్సతో కిడ్నీ పనితీరుని పొడిగించేలా చేశామని తెలిపారు. భవిష్యత్తులో ఇలా జంతువుల అవయవాల ట్రాన్స్‌ప్లాంట్ విజయవంతమవుతుందనే ఆశను ధృవీకరించింది. దీనిపై మరింతగా ప్రయోగాలు చేసి కృషి చేయాల్సిన అవసరాన్ని నొక్కి తెలిపిందని పరిశోధకులు చెబుతున్నారు. నిజానికి సదరు వ్యక్తి మిల్లర్ ఆకస్మికంగా కుప్పకూలి బ్రెయిన్‌డెడ్ అయ్యారు. అయితే క్యాన్సర్ కారణంగా అతడి అవయవాలను దానం చేయడం వీలుపడలేదు. అతని సోదరి మేరి మిల్లర్ డఫీ, పిగ్ కిడ్నీ ప్రయోగం కోసం అతడి మృతదేహాన్ని దానం చేయాలనే నిర్ణయాన్ని చాలా భారంగా తీసుకుంది. జూలై 14న మిల్లర్ 58వ పుట్టిన రోజుకు కొద్దిరోజుల ముందు పంది కిడ్నీని మిల్లర్‌కి మార్పిడి చేసి పరీక్షించడం ప్రారంభించారు. జంతువులోని థైమస్ గ్రంథికి రోగనిరోధక కణాలతో పనిచేయగలిగేలా పరిశోధకులు శిక్షణ ఇచ్చారు. దీంతో మొదటి నెలంతా చాలా విజయవంతంగా ఆ కిడ్నీ పనిచేసింది. ఇక రెండో నెల నుంచి మూత్రంలో తగుదల వంటి మార్పులు ప్రారంభమయ్యాయి. వైద్యులు అందుకు అనుగుణంగా చికిత్స అందించి అది పనిచేసేలా చికిత్స అందించారు. ఈ ప్రయోగం జన్యుపరంగా మార్పు చెందని పందుల నుంచి అవయవాలను ట్రాన్స్‌ప్లాంట్ చేయగలమనే నమ్మకాన్ని అందించింది. వైద్యలు గత మూడు నెలలుగా చేసిన ఈ ప్రయోగం విజయవంతంగా ముగిసింది. ఇక మిల్లర్ మృతదేహం నుంచి పంది కిడ్నీని తొలగించి దహనసంస్కారాల నిమిత్తం అతడి బంధువులకు మృతదేహాన్ని అప్పగించారు. అయితే ఇలా జంతువుల అవయవాల మార్పిడి కారణంగా శోషరస కణుపులు, జీర్ణవ్యవస్థలో ఏవైనా సమస్యలు వస్తాయా? అనేదాని గురించి మరింతగా పరిశోధనలు చేయాల్సి ఉందన్నారు. అందుకోసం జీర్ణవ్యవస్థలోని సుమారు 180 వేర్వేరు కణజాల నమూనాలను పరిశీలించాల్సి ఉందని కూడా అన్నారు. చావు అంచుల మధ్య కొట్టుమిట్లాడుతున్న వారికి అవయవదానం ..కొత్త ఊపిరి పోసి జీవితంలో రెండో అవకాశం లభించేలా చేయడమే లక్ష్యంగా ఈప్రయోగాలు చేస్తున్నట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. (చదవండి: చిన్నారుల్లో బ్రాంకియోలైటిస్ వస్తే...? ముఖ్యంగా అలాంటి పిల్లలు..) -
నెదర్లాండ్స్‌లో కిడ్నీ మార్పిడికే ప్రాధాన్యత
లక్డీకాపూల్: తమ దేశంలో కిడ్నీ బాధితులకు ఎక్కువ కాలం డయాలసిస్ చేయమని.. కిడ్నీ మార్పిడికే ప్రాధాన్యత ఇస్తామని నెదర్లాండ్స్ ఆరోగ్య, సంక్షేమ, క్రీడల శాఖ మంత్రి ప్రొఫెసర్ ఎర్నెస్ట్ కైపర్స్ తెలిపారు. తెలంగాణలోని వైద్య సేవలను అధ్యయనం చేసేందుకు వచ్చిన ఆయన గురువారం నిమ్స్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా ఆస్పత్రిలోని లివర్ డయాలసిస్, మెడికల్ ఆంకాలజీ, యూరాలజీ విభాగాలను పరిశీలించి రోగులకు అందుతున్న సేవలపై ఆరా తీశారు. స్క్రీనింగ్ కేన్సర్, మామోగ్రామ్, రొమ్ము కేన్సర్, సర్వైకల్ కేన్సర్‌కు అందిస్తున్న వైద్య సేవలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం నిమ్స్ లెర్నింగ్ సెంటర్లో నిమ్స్ వైద్యులతో ఏర్పాటు చేసిన ఇంటరాక్టివ్ సెషన్లో పాల్గొన్న కైపర్స్... నెదర్లాండ్స్‌లోని వైద్య సేవల తీరును వివరించారు. అత్యవసర చికిత్స అవసరమయ్యే రోగులను తమ దేశంలో హెలికాప్టర్లలో ఆస్పత్రికి తరలిస్తామని చెప్పారు. కోవిడ్ తర్వాత ఎదురవుతున్న పరిణామాల నేపథ్యంలో నిమ్స్‌తో కలసి ఓ వ్యాక్సిన్ రూపొందించాలన్న యోచనలో ఉన్నట్లు కైపర్స్ తెలిపారు. అలాగే వైద్యవిద్యపై ఎక్సే్ఛంజ్ ప్రోగ్రాం చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. బ్యాక్టీరియా, యాంటీబయోటెక్ డ్రగ్స్‌పై పరిశోధనలకు నిమ్స్‌తో ఒప్పందం చేసుకున్నట్లు కైపర్స్ వివరించారు. తెలంగాణలో వైద్య సేవలు బాగున్నాయి.. రాష్ట్రంలో అమలు చేస్తున్న ఆరోగ్య పథకాలు బాగున్నాయని నెదర్లాండ్స్ మంత్రి ఎర్నెస్ట్ కైపర్స్ ప్రశంసించారు. తెలంగాణలో పదేళ్ల కాలంలో మాతాశిశు మరణాల సంఖ్యను గణనీయంగా తగ్గించడం గొప్ప విషయమని... అందుకే తెలంగాణ వైద్యపరంగా నీతి అయోగ్ లెక్కల ప్రకారం 11 స్థానం నుంచి 3వ స్ధానానికి చేరిందన్నారు. కాగా, రాష్ట్రంలో తరచూ రోడ్డు ప్రమాదాలు జరిగే ప్రాంతాల్లోనే ట్రామా సెంటర్లను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం యోచిస్తోందని నిమ్స్ డైరెక్టర్ ప్రొఫెసర్ నగరి బీరప్ప తెలిపారు. 50 పడకలతో కూడిన ఈ సెంటర్లలో అన్ని రకాల అత్యవసర వైద్యసేవలను అందించేలా చర్యలు తీసుకుంటోందన్నారు. నెదర్లాండ్స్ మంత్రి కైపర్స్, ఆ దేశ ప్రతినిధి బృందాన్ని ఆయన ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో నిమ్స్ మెడికల్ సూపరింటెండెంట్ ప్రొఫెసర్ నిమ్మ సత్యనారాయణ, డీన్ డాక్టర్ లిజా రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. -
NYU Langone: పంది కిడ్నీ పని చేసింది
న్యూయార్క్: కిడ్నీ మార్పిడి చరిత్రలో పెద్ద ముందడుగు. అమెరికాలో న్యూయార్క్ లోని ఎన్ వైయూ లాంగ్ వన్ హెల్త్ సంస్థ వైద్యులు ఓ బ్రెయిన్ డెడ్ రోగికి పంది కిడ్నీ అమర్చగా అది ఏకంగా నెల రోజుల పాటు చక్కగా పని చేసింది. మనిషికి పంది కిడ్నీ ఇన్ని రోజుల పాటు పని చేయడం ఇదే తొలిసారి. గతంలో న్యూయార్క్ వర్సిటీ, అలబామా వర్సిటీ చేసిన కిడ్నీ మారి్పడులు రెండు మూడు రోజుల పాటు మాత్రమే పని చేశాయి. అన్నీ కుదిరితే త్వరలో సాధారణ రోగులకు కూడా పంది కిడ్నీ అమర్చుతామని వైద్య బృందం అంటోంది. అయితే మనిషి వ్యాధి నిరోధకతకు పంది కిడ్నీ ఎలా పని చేస్తుందో కూడా చూస్తామని చెబుతోంది. అందుకోసం రెండో నెల కూడా కిడ్నీని అలాగే ఉంచి చూడనున్నారు. -
సంపూర్ణంగా కోలుకున్న లాలూ
న్యూఢిల్లీ: కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స తర్వాత ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ అనారోగ్యం నుంచి సంపూర్ణంగా కోలుకున్నారు. చాలా హుషారుగా బ్యాడ్మింటన్ ఆడుతూ కనిపించారు. లాలూ ఆడుతున్న వీడియోని ఆయన కుమారుడు, బిహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. ‘‘దేనికీ భయపడరు. దేనికీ తలవంచరు. పోరాడారు. పోరాడుతూనే ఉంటారు. జైల్లో పెట్టినా బెదరలేదు. అంతిమంగా విజయమే సాధించారు’’ అని తేజస్వి యాదవ్ క్యాప్షన్ పెట్టారు. -
ఆగమేఘాలపై కిడ్నీ తరలింపు
కాకినాడ : కాకినాడ అపోలో ఆస్పత్రిలో బ్రెయిన్ డెడ్ అయిన 50 ఏళ్ల మహిళ కుటుంబం ఆదర్శంగా నిలిచింది. ఆమె మూత్రపిండాలను కుటుంబ సభ్యులు దానం చేసి మరో ఇద్దరి ప్రాణాలు నిలిపారు. వివరాల్లోకి వెళితే.. కాకినాడ అపోలో ఆస్పత్రిలో బ్రెయిన్ డెడ్ బాధితురాలి నుంచి గురువారం రెండు కిడ్నీలు సేకరించారు. ఓ కిడ్నీని అదే ఆస్పత్రిలో రోగికి అమర్చగా, మరో కిడ్నీని విశాఖలోని కిమ్స్ ఐకాన్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాపాయ స్థితిలో ఉన్న బాధితుడికి అమర్చే నిమిత్తం తీసుకెళ్లారు. కాకినాడ అపోలో యాజమాన్యం జిల్లా ఎస్పీ సతీ‹Ùకుమార్‌ను ఆశ్రయించగా.. ఆయన గ్రీన్ చానల్ ఏర్పాటు చేశారు. కట్టుదిట్టమైన ఏర్పాట్ల మధ్య కిడ్నీని అంబులెన్స్‌లో విశాఖ తరలించారు. కనీసం నాలుగు గంటల సమయం పట్టే ప్రయాణం కేవలం రెండు గంటల్లోనే పూర్తయి కిడ్నీ భద్రంగా చేరింది. -
ఆరేళ్లుగా కాపురం.. ఇద్దరు పిల్లలు.. భార్య తన చెల్లి అని తెలిసి భర్త షాక్..!
ఆరేళ్లుగా కాపురం చేస్తూ ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చిన తర్వాత భార్య తనకు సొంత చెల్లి అని తెలిసి కంగుతిన్నాడు ఓ భర్త. ఇందుకు సంబంధించిన కథనాన్ని రెడ్డిట్‌లో పోస్టు చేయగా అది వైరల్‌గా మారింది. ప్రస్తుతం ఈ పోస్టును ఈ డిలీట్ చేశారు. సదరు వ్యక్తి చెప్పిన వివరాల ప్రకారం.. పుట్టినప్పుడే తల్లిదండ్రులు అతడ్ని వేరేవాళ్లకు దత్తత ఇచ్చారు. దీంతో అసలైన పేరెంట్స్ ఎవరో తనకు తెలియదు. 6 ఏళ్ల క్రితం ఓ మహిళను పెళ్లి చేసుకున్నాడు. ఇద్దరు సంతోషంగా జీవిస్తున్నారు. ఇటీవలే ఇతని భార్య రెండో బిడ్డకు జన్మనిచ్చింది. పండంటి కుమారుడు పుట్టాడు. ఆ వెంటనే ఆమె ఆరోగ్యం తీవ్రంగా క్షీణించింది. దీంతో ఆమెకు అత్యవసరంగా కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స చేయాలని వైద్యులు భర్తకు సూచించారు. వెంటనే కిడ్నీ దాతల కోసం ఆమె కుటుంబసభ్యులతో పాటు తన కుటుంబసభ్యులు ఎవరనే విషయం కునుగొనేందుకు భర్త ప్రయత్నించాడు. భార్య తరఫు కుటుంబసభ్యుల్లో ఎవరి కిడ్నీ ఆమెతో మ్యాచ్ కాలేదు. ఈ క్రమంలోనే చివరకు తన కిడ్నీ మ్యాచ్ అవుతుందేమో చూడమని టెస్టుల కోసం శాంపిల్స్ ఇచ్చాడు. పరీక్షల అనంతరం వైద్యులకు షాకింగ్ విషయం తెలిసింది. భార్య, భర్తల కిడ్నీ మ్యాచ్ అయింది. వైద్యులు ఈ విషయాన్ని అతనికి ఫోన్ చేసి చెప్పగా షాక్ అయ్యాడు. ఆ తర్వాత మరిన్ని టెస్టులు నిర్వహించగా.. అనూహ్యంగా అతని కిడ్నీ భార్య కిడ్నీతో అసాధారణ రీతిలో మ్యాచ్ అయింది. అప్పుడే వీళ్లిద్దరు అన్నాచెల్లి అని వైద్యులు నిర్ధరించారు. ఈ విషయం తెలిశాక భర్త షాక్ అయ్యాడు. ఇన్నాళ్లుగా కాపురం చేస్తూ.. ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చింది సొంత సోదరితోనా అనుకుని వాపోయాడు. రెడ్డిట్‌లో ఈ వ్యక్తి షేర్ చేసిన స్టోరీపై నెటిజన్లు స్పందించారు. 'మీరు ఇంతకుముందు ఎలా సంతోషంగా ఉన్నారో.. మున్ముందు కూడా అలాగే ఉండండి. మీ సిస్టర్-వైఫ్‌కు కిడ్నీ దానం చేయండి. మీ పిల్లలకు గొప్ప తల్లిదండ్రులుగా ఉండండి' అని సూచించారు. చదవండి: విజృంభిస్తున్న H5N1.. సోకితే 100 మందిలో 50 మంది ఖతం.. మరో మహమ్మారిగా మారుతుందా? -
కుడి కన్ను కనిపించలేదు, కిడ్నీ కూడా పాడైపోవడంతో.. : రానా
విక్టరీ వెంకటేశ్, రానా దగ్గుబాటి కలిసి నటించిన తొలి వెబ్ సిరీస్ రానా నాయుడు. ఈ సిరీస్ ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇప్పటికీ సిరీస్ ప్రమోషన్స్‌లో పాల్గొంటూ వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు రానా. ఈ క్రమంలో తాజాగా మరో ఇంటర్వ్యూకి హాజరైన ఆయన గతంలో తను ఎదుర్కొన్న అనారోగ్య సమస్యల గురించి చెప్పుకొచ్చాడు. 'కార్నియల్ ట్రాన్స్‌ప్లాంట్ గురించి మాట్లాడే అతి తక్కువమందిలో నేను ఒకడిని. ఇదెలా మొదలైందంటే.. ఓ పిల్లవాడు తన తల్లికి కన్ను కనిపించడం లేదని ఎంతో బాధపడ్డాడు. అతడిని చూసి జాలేసింది. ప్రతిదానికి ఓ పరిష్కారం ఉంటుందని నచ్చజెప్పాను. అంతెందుకు, నాకు కూడా ఓ కన్ను కనిపించదని చెప్పాను. చాలామంది ఏదైనా శారీరక అనారోగ్యానికి గురైతే ఎంతో మనోవేదన చెందుతారు. చివరికి వారు కోలుకున్నా సరే నాకు ఇలా జరిగిందేంటి? అని పదేపదే దాని గురించే ఆలోచిస్తారు. అంతలా ఆలోచించాల్సిన అవసరం లేదని నా అభిప్రాయం. నాకు కుడి కన్ను సరిగా కనిపించడం లేదని శస్త్రచికిత్స చేయించుకున్నా, కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ చేయించుకున్నా. చెప్పాలంటే నేనొక టెర్మినేటర్‌ని(నవ్వుతూ). మరి ఇన్ని చేయించుకున్నా నేను బాగానే ఉన్నాను కదా మరి మీరెందుకు అక్కడే ఆగిపోతున్నారు? అనవసర ఆలోచనలు మానేసి హాయిగా ముందుకు వెళ్లండి' అని చెప్పుకొచ్చాడు. కాగా రాగా 2016లో తన అనారోగ్య సమస్యల గురించి మొదటిసారి నోరు విప్పాడు. కుడి కన్ను ద్వారా సరిగా చూడలేకపోతున్నానని, పైగా కిడ్నీ కూడా పాడైందని చెప్పాడు. అయితే చికిత్స ద్వారా తాను పూర్తి స్థాయిలో కోలుకున్నానన్నాడు.(చదవండి: 'ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి' రివ్యూ) -
ఆమె గుండె చప్పుడు వినిపించడమే కాదు.. కనిపిస్తోంది కూడా!
అత్యధునిక టెక్నాలజీతో కూడిన వైద్య విధానంలో మనం చాలా రకాల సర్జరీలు గురించి వినే ఉంటాం. కానీ కొన్న సర్జరీల వల్ల జరిగే దుష్పరిణామాలు గురించి ఇటీవలకాలంలో తరుచుగా వింటున్నాం. కానీ అత్యవసర పరిస్థితిలో రోగిని రక్షించే నిమిత్తం తప్పనిసరై అలాంటి శస్త్ర చికిత్సలు చేస్తారు. అయితే ఇటీవలకాలంటో గుండె మార్పిడికి సంబందించిన శస్త్ర చికిత్సలు గురించి వింటున్నాం. కానీ ఇక్కడొక అమ్మాయి అలాంటి శస్త్ర చికిత్స చేయించుకోవడం ఎలా దుష్పరిణామాలను ఎదుర్కుందో చూడండి. గుండె మార్పిడి అనేది వైద్యంలో అత్యంత క్లిష్టమైన శస్త్రచికిత్సా విధానాలలో ఒకటి. ఇది వైద్య విధాంలో అత్యద్భుతమైన శస్త్ర చికిత్స. అయితే సిసిలియా-జాయ్ అడమౌ అనే 22 ఏళ్ల మహిళ గుండెకు సంబందించిన ఎడమ కర్ణిక ఐసోమెరిజంతో అట్రియో వెంట్రిక్యులర్ సెప్టల్ డిఫెక్ట్(గుండెకు ఎడమవైపు రంధ్రాలు ఏర్పడటం)తో జన్మించింది. దీంతో ఆమెకు గుండె మార్పిడి చికిత్స చేయాల్సి వచ్చింది. (చదవండి: వామ్మో! అంత ఎత్తులోంచి ఒకేసారి దూకేసారు... చివరికి) ఈ మేరకు ఆమెకు 2010లో 45 ఏళ్ల వ్యక్తి నుంచి ఆమెకు గుండె మార్పిడి జరిగింది. దీంతో ఆమె తర్వాత ఆరునెలలకే మూత్రపిండాల మార్పిడికి సంబంధించిన సర్జరీ చేయాల్సి వచ్చింది. అయితే ఆమెకు 11 ఏళ్ల ప్రాయంలో జరిగిన ఈ రెండు శస్త్ర చికిత్స ఆమె జీవితాన్నే మార్చేశాయి. తదనంతరం నాలుగేళ్లకే బ్రెయిన్లో ఏర్పడిన కణుతులు కారణంగా మరో ఆపరేషన్ చేయించుకుంది. ఈ సర్జరీల కారణంగా ఆమె రకరకాల దుష్పరిణామాలను ఎదుర్కొంది. అయితే ఆమెకు జరిగిన గుండె మార్పిడి సర్జరీ కారణంగా ఆమె గుండె కొట్టుకుని తీరు అందరికి కనిపించేలా కొట్టుకుంటింది. ఈ శస్త్ర చికిత్సతల తాలుకు మచ్చలు ఆమె శరీరం మీద గుర్తులుగా మిగిలిపోయాయి. ఏది ఏమైన ఒక శస్త్ర చికిత్స చేయిస్తే ఇంకో దుష్పరిణామం ఎదుర్కొవ్వడం మళ్లీ మరో చికిత్సా ఇలా ఆమె మూడు ప్రమాదరకరమైన శస్త్ర చికిత్సలు చేయించుకుంది. ఈ మేరకు ఆమె టిక్‌టాక్‌లో తాను ఈ శస్త్ర చికిత్స వల్ల తాను ఎదర్కొన్న సమస్యలను గురించి వివరిస్తుంది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. (చదవండి: వింతైన ఇల్లు దీని ధర ఎంత తెలుసా?) -
అక్క కూడా అమ్మే
చిన్న చెల్లెలికి కిడ్నీ సమస్య వచ్చింది. పెద్దక్కకు ప్రాణం విలవిలలాడింది. తల్లి కిడ్నీ మేచ్ కాకపోయేసరికి నేను కూడా తల్లిలాంటిదాన్నే నా కిడ్నీ తీసుకోండి అంది. నువ్వు ఇవ్వాలంటే 20 కేజీలు బరువు తగ్గాలి అన్నారు డాక్టర్లు. 20 కేజీలంటే మాటలు కాదు. కాని చెల్లెలి కోసం శ్రమించింది. అక్టోబర్‌లో మొదలుపెట్టి జూలై నాటికి 20 కేజీలు తగ్గింది. చెల్లి కోసం ఇంకా ఏం చేయాలో చెప్పండి అంటోంది. అహ్మదాబాద్‌లో ప్రసిద్ధ కిడ్నీ పరిశోధక, చికిత్సా కేంద్రం– ఇన్స్టిట్యూట్ ఆఫ్ కిడ్నీ డిసీజెస్ అండ్ రీసెర్చ్ సెంటర్ (ఐ.కె.డి.ఆర్.సి) ఉంది. హాస్పిటల్లో ఉండే కిడ్నీ పేషెంట్లను అటెండ్ చేయడానికి వచ్చే వారి కోసం ఆ సెంటర్ బయట చిన్న చిన్న లాడ్జీలు ఉంటాయి. ఒక సింగిల్ రూమ్‌లు దొరుకుతాయి. అలాంటి ఒక సింగల్రూమ్లో 40 ఏళ్ల రేణు సింగ్ ఏడెనిమిది నెలలుగా ఉంటోంది. చెల్లెలి కోసం. చెల్లెలు హాస్పిటల్లో. అక్కడ బయట లాడ్జి గదిలో. వారిద్దరూ ఆ పరిస్థితి నుంచి బయటపడాలంటే చెల్లెలికి కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ జరగాలి. కాని అది వాయిదా పడుతూనే ఉంది. మూడేళ్ల క్రితం రేణు సింగ్ ముంబైలో భర్తతో కుమారుడితో ఉంటుంది. ఆమె చెల్లెలు రాణి సింగ్ (32) పెళ్లి చేసుకుని ఉత్తర ప్రదేశ్‌లో ఆజమ్‌ఘర్‌లో స్థిరపడింది. ఆమెకు మూడేళ్లుగా కిడ్నీ సమస్యలు మొదలయ్యాయి. భర్తతో కలిసి వారణాసిలో, ఆ తర్వాత లక్నోలో వైద్యం చేయించుకుంది. కాని వారానికి రెండుసార్లు డయాలసిస్ చేసుకుని స్థితికి చేరుకోవడంతో డాక్టర్లు అహ్మాదాబాద్‌లోని కిడ్నీ రీసెర్చ్ సెంటర్‌కు వెళ్లి కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ వెంటనే చేయించుకోవలసిందిగా సూచించారు. తల్లి కిడ్నీ ఇవ్వడానికి ముందుకొచ్చింది. వారు అక్టోబర్ 2019లో అహ్మదాబాద్ చేరుకున్నాక డాక్టర్లు తల్లి కిడ్నీని పరీక్షలు చేసి ఆమె ఆరోగ్య, వయసు రీత్యా కిడ్నీ ఇవ్వడానికి సరిపోదు అని నిర్థారించారు. ఈ విషయం రేణుకు తెలిసింది. చెల్లెలిని కాపాడుకోవాలంటే తాను కిడ్నీ ఇవ్వాల్సిందే అని గ్రహించింది. రేణు సింగ్ (ఎడమ నుంచి రెండో వ్యక్తి), రాణి సింగ్ (చివరి వ్యక్తి). తండ్రి మరొక చెల్లితో. కూతురు ఒకింటి కోడలే కిడ్నీ ఇవ్వడం మగవారికి కొంత సులువేమో కాని స్త్రీలకు అంత సులువు కాదు ఈ దేశంలో. ఎందుకంటే ఆమె ఒకింటి కోడలు అయి ఉంటుంది. భర్త అనుమతి, అత్తామామల అనుమతి అవసరమవుతాయి. పుట్టింటి కోసం మెట్టినింటి మనిషిని ప్రమాదంలో పడేయడానికి విముఖత ఎదురు కావచ్చు. అయితే అదృష్టవశాత్తు రేణు సింగ్ భర్త, అత్తామామలు అందుకు అంగీకరించారు. రేణు అత్తగారి తమ్ముడు మరొకరికి కిడ్నీ దానం ఇవ్వడం వల్ల ఆ ఇంట్లో అవయవదానం పట్ల అవగాహన ఉంది. ఇక రేణు కొడుకైతే అన్ని వివరాలు గూగుల్ చేసి ‘అమ్మా... పిన్నికి కిడ్నీ ఇవ్వు. నిన్ను నేను సపోర్ట్ చేస్తాను’ అని సపోర్ట్ చేశాడు. ఇంకేం కావాలి... ఒక అక్కకు చెల్లెలిని కాపాడుకోవడానికి. క్రాస్మేచ్ ట్రాన్స్‌ప్లాంటేషన్ అహ్మదాబాద్ కిడ్నీ సెంటర్లో కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ కోసం క్షుణ్ణంగా పరీక్షలు చేస్తారు. డి.ఎన్.ఏ టెస్ట్‌తో సహా ఈ పరీక్షలు ఉంటాయి. రేణుకు పరీక్షలు నిర్వహించారు. ఆమె కిడ్నీ పనికి వస్తుందికానీ నేరుగా చెల్లెలికి ఇవ్వడానికి మేచ్ కావడం లేదు. దీంతో డాక్టర్లు క్రాస్మేచ్ ట్రాన్స్‌ప్లాంటేషన్ కోసం రేణు కిడ్నీ పరీక్షల వివరాలను కంప్యూటర్‌కు ఇచ్చారు. కంప్యూటర్ సెర్చ్ చేసి రాజస్థాన్‌లోని మున్నారామ్ అనే కిడ్నీ బాధితునికి రేణు కిడ్నీ సరిపోతుందని మున్నారామ్ తండ్రి కిడ్నీ రాణికి సరిపోతుందని తేల్చింది. అంటే రేణు కిడ్నీని ఆ కుర్రాడికి, ఆ కుర్రాడి తండ్రి కిడ్నీని రేణు చెల్లెలికి అమరుస్తారు. బరువు సమస్య అంతా సరిపోయింది అని సంతోషపడుతున్నంతలో రేణు బరువు ఒక సమస్య అయ్యింది. ఇంత బరువు ఉన్నవారు కిడ్నీ దానమిస్తే ఆ తర్వాత కాంప్లికేషన్స్ వస్తాయి అన్నారు డాక్టరు. రేణును 20 కేజీల బరువు తగ్గమన్నారు. ముంబైలో ఉంటూ ఇదంతా చేయాలంటే సాధ్యం కాదని అక్టోబర్ నుంచి రేణు కూడా అహ్మదాబాద్‌లో ఉండిపోయింది. హాస్పిటల్‌లోని చెల్లెలి బాగోగులు చూసుకుంటూ తాను బరువు తగ్గే పని పెట్టుకుంది. ఆహారంలో క్రమశిక్షణ, వ్యాయామం వీటన్నింటితో జూలై నాటికి 20 కేజీల బరువు తగ్గింది. ఇంత శ్రమ అవసరమా అంటే ‘నేను నా చిన్న చెల్లెల్ని అమ్మలా పెంచాను చిన్నప్పుడు. దాన్నెలా వదులుతాను’ అంటోంది. ఊరుకాని ఊరులో చెల్లెలి కుటుంబం ఉండటం, చెల్లి కోసం తాను వచ్చి ఉండటం ఇవన్నీ ఖర్చుతో కూడుకున్న పనులు. వారి దగ్గర డబ్బులు అయిపోయాయి. కాని అందరి మద్దతు వారికి దొరకుతోంది. ‘లాక్డౌన్ లేకపోతే ఈసరికి సర్జరీ అయిపోయేది. దాని కోసమే ఆశగా ఎదురు చూస్తున్నాం’ అని రేణు సింగ్ అంది. ‘కంటే కూతురిని కను’ అని మన దగ్గర అంటారు. ‘కంటే అక్కను కను. తర్వాత ఎవరినైనా కను’ అని రేణుని చూస్తే అనబుద్ధేస్తుంది. ఆ అక్కచెల్లెళ్లు త్వరలో చిరునవ్వులు చిందిస్తూ చిన్నప్పటి కబుర్లు చెప్పుకుంటారని ఆశిద్దాం. – సాక్షి ఫ్యామిలీ -
వైఎస్సార్ ఆరోగ్యశ్రీతో కిడ్నీ ఆపరేషన్
గుంటూరు మెడికల్: అతనో కార్పెంటర్. పేరు మహ్మద్ రౌఫా. రెండేళ్లుగా కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నాడు. వైద్యం కోసం ఎక్కడికి వెళ్లినా లక్షల్లో ఖర్చవుతుందని చెప్పడంతో తల్లడిల్లాడు. ఆ వ్యాధిగ్రస్తుడిని డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ ఆదుకొంది. ఆ పథకంలో అతను ఉచితంగా ఆపరేషన్ చేయించుకున్నాడు. ఇప్పుడు ఆరోగ్యంగా ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యి ఇంటికి తిరిగివెళ్లాడు. అతనికి ఆపరేషన్ చేసిన గుంటూరు జిల్లా చినకోండ్రుపాడులోని కాటూరి మెడికల్ కాలేజీ, ఆస్పత్రి డీన్ డాక్టర్ కేఎస్ వరప్రసాద్ మంగళవారం విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా ల్యాప్రోస్కోపీ విధానంలో కిడ్నీ మార్పిడి ఆపరేషన్ చేసినట్లు ఆయన తెలిపారు. సుమారు రూ.10 లక్షలు ఖర్చయ్యే ఆపరేషన్‌ను డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ఉచితంగా చేసి రోగి ప్రాణాలు కాపాడామన్నారు. కృష్ణా జిల్లా గూడూరు మండలం ఆకులమన్నాడు గ్రామానికి చెందిన మహ్మద్ రౌఫా (36) గతంలో విజయవాడ, గుంటూరులోని పలు ఆస్పత్రుల్లో వైద్యం కోసం వెళ్లాడు. రూ. లక్షల్లో ఖర్చు అవుతుందని అక్కడి వైద్యులు చెప్పడంతో కుంగిపోయాడన్నారు. నాలుగునెలల క్రితం తమ ఆస్పత్రికి వచ్చాడని తెలిపారు. వైద్యులు పరీక్షలు చేసి కిడ్నీ మార్చాలని నిర్ణయించి జనవరి ఐదో తేదీన ఆపరేషన్ చేసినట్లు వెల్లడించారు. రౌఫాకు అతని అక్క గుల్జార్ బేగం కిడ్నీ దానం చేసిందని, ఆమె కిడ్నీని రౌఫాకు అమర్చటంతో శస్త్రచికిత్స విజయవంతమైందని చెప్పారు. ల్యాప్రోస్కోపీ విధానంలో ఆపరేషన్ చేయటం వల్ల కిడ్నీ దానం చేసిన వారు చాలా త్వరగా కోలుకుంటారని, మూడు రోజుల్లోనే తమ పనులు తాము చేసుకుంటారని వివరించారు. అత్యాధునిక ఈ వైద్య విధానంలో డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా తమ ఆస్పత్రిలో ఉచితంగా ఆపరేషన్లు చేస్తున్నామని డాక్టర్ వరప్రసాద్ సూచించారు. మహ్మద్ రౌఫాను మంగళవారం డిశ్చార్జి చేశామని తెలిపారు. కిడ్నీ మార్పిడి ఆపరేషన్లలో నిపుణులైన అహ్మదాబాద్‌కు చెందిన డాక్టర్ శ్రేయాన్, డాక్టర్ తేజ్‌షా పర్యవేక్షణలో తమ ఆస్పత్రి సిబ్బంది కృషితో రౌఫాకు ఆపరేషన్ విజయవంతంగా పూర్తిచేశామన్నారు. నాకు పునర్జన్మ నిచ్చారు మహ్మద్ రౌఫా కార్పెంటర్‌గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్న నేను కిడ్నీ జబ్బు వల్ల పనికి కూడా వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో కుటుంబ పోషణ కూడా భారంగా మారింది. నా భార్య, ఇద్దరు పిల్లలు పలు ఇబ్బందులు పడ్డారు. రెండేళ్ల పాటు వ్యాధి బాధలను అనుభవిస్తూ పలు ఆస్పత్రుల్లో కిడ్నీ మార్పిడి ఆపరేషన్ కోసం సంప్రదించాను. రూ. 15 లక్షల వరకు ఖర్చు అవుతుందని చెప్పారు. ఆపరేషన్ చేయించుకునే స్థోమత లేని సమయంలో డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకం నాకు ఎంతో ఉపయోగపడింది. పథకం ద్వారా ఉచితంగా ఆపరేషన్ చేయించుకున్నాను. డాక్టర్లు నాకు పునర్జన్మనిచ్చారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి, వైద్యులకు నేను జీవితాంతం రుణపడి ఉంటాను. -
అదో బోరింగ్ టాపిక్
‘రానాకు అమెరికాలో కిడ్నీ మార్పిడి ఆపరేషన్ విజయవంతంగా పూర్తయింది. రానా తల్లి లక్ష్మీ దగ్గుబాటి స్వయంగా కిడ్నీ దానం చేశారు’ అంటూ గత కొద్ది రోజులుగా వార్తలు హల్చల్ చేస్తున్నాయి. రానా ఆరోగ్యం విషయంలో పదే పదే ఏదో వార్త షికారు చేయడం చాలా కామన్‌గా అయిపోయింది. ఇటీవల రానా అమెరికాకు వెళ్లడంతో కిడ్నీ మార్పిడి సర్జరీ కోసమే అక్కడకు వెళ్లాడని ఆన్లైన్లో వార్తలు చక్కర్లు కొట్టాయి. దీనిపై తాజాగా ఓ ఇంటర్వ్యూలో రానా స్పందించారు. ‘‘నా ఆరోగ్యం గురించి చాలా రోజుల నుంచి జోరుగా ఊహాగానాలు సాగుతున్నాయి. నా ఆరోగ్యంపై రూమర్లు వచ్చిన ప్రతిసారీ ‘నేను ఆరోగ్యంగా ఉన్నాను’ అని క్లారిటీ ఇచ్చి అలిసిపోయాను. అందుకే నాకు ఇదో బోరింగ్ టాపిక్ అయింది. హైదరాబాద్ వదిలి నేను ఎక్కడికైనా ప్రయాణమైతే చాలు.. చాలామంది టెన్షన్ పడిపోతున్నారు. నా మీద అందరూ చూపించే శ్రద్ధకు.. ప్రేమకు ఋణపడి ఉంటాను. గుణశేఖర్ దర్శకత్వంలో నేను నటించనున్న భారీ బడ్జెట్ చిత్రం ‘హిరణ్యకశ్యప’ ప్రీ ప్రొడక్షన్ పనుల కోసం ఇటీవల అమెరికా వెళ్లాను. ప్రీ విజువలైజేషన్ కాన్సెప్ట్ గురించి పలు వీఎఫ్ఎక్స్ కంపెనీలతో మాట్లాడేందుకే వెళ్లా’’ అన్నారు. -
ఆపరేషన్ సక్సెస్
‘బాహుబలి’లో రానా బలిష్టంగా ఉన్నారు. ఆ తర్వాత సడన్‌గా సన్నబడ్డారు. దాంతో చాలామందికి సందేహాలు మొదలయ్యాయి. ఆ తర్వాత రానా ఆరోగ్యం బాగా లేదనే వార్త ప్రచారంలోకి వచ్చింది. కిడ్నీ సంబంధింత సమస్యతో రానా బాధపడుతున్నారన్నది ఆ వార్త సారాంశం. హైదరాబాద్, ముంబైలలో కొంత కాలంగా చికిత్స పొందుతున్నారని ఫిల్మ్ నగర్ టాక్. తాజాగా అమెరికాలో కిడ్నీ మార్పిడి శస్త్ర చికిత్స విజయవంతంగా జరిగిందని, రానా తల్లి లక్ష్మి తనయుడికి కిడ్నీ దానం చేశారనే వార్త షికారు చేస్తోంది. ప్రస్తుతం రానా అమెరికాలో విశ్రాంతి తీసుకుంటున్నారని కూడా చెప్పుకుంటున్నారు. కొద్దిరోజుల తర్వాత మళ్లీ షూటింగ్స్‌తో బిజీబిజీగా ఉంటారట. అయితే ఈ విషయంపై రానా కుటుంబం స్పందించలేదు. ఇదిలా ఉంటే రానా ట్విట్టర్లో యాక్టివ్‌గా ఉన్నారు. మంగళవారం ‘డియర్ కామ్రేడ్’కి ఆల్ ది బెస్ట్ చెబుతూ, ట్వీట్ చేశారు రానా. అలాగే బుధవారం సాయంత్రం ‘బాహుబలి’ లండన్ షో గురించి కూడా ఓ ట్వీట్ పెట్టారు. -
బ్లడ్ గ్రూపులు కలవకపోయినా కిడ్నీ మార్పిడికి అవకాశం ఉందా?
నా వయసు 40 ఏళ్లు. టీచర్‌గా పనిచేస్తున్నాను. నాకు మూత్రపిండాల సమస్య ఉంది. రెండేళ్లుగా డయాలసిస్ చేయించుకుంటున్నాను. కిడ్నీ మార్పిడి చేయించుకోవడం మంచిదని తెలిసిన వాళ్లు చెబుతున్నారు. కిడ్నీ మార్పిడి తర్వాత కూడా డయాలసిస్ చేయించుకోవాల్సి వస్తుందా? మా కుటుంబ సభ్యులు నాకు కిడ్నీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ వారిలో ఎవరితో నా బ్లడ్‌గ్రూపు కలవడం లేదు. నాకు కిడ్నీ మార్పిడి చేయించుకునే అవకాశం ఉందా? దయచేసి నా సమస్యకు పరిష్కారం చూపగలరు. కిడ్నీలు పూర్తిగా పాడై డయాలసిస్‌పై ఆధారపడుతున్నా వారికి కిడ్నీ మార్పిడి ఉత్తమమైన మార్గం. మీరు రెండు పద్ధతుల ద్వారా కిడ్నీ మార్పిడి చేయించుకోవచ్చు. ఒకటి స్వాప్ ట్రాన్స్‌ప్లాంటేషన్. రెండోది ఏబీఓ ఇన్కంపాటబుల్ ట్రాన్స్‌ప్లాంటేషన్. స్వాప్ ట్రాన్స్‌ప్లాంటేషన్‌లో మీలాంటి సమస్యతోనే బాధపడుతున్న మరొకరు ఉంటే... వారి కుటుంబ సభ్యులతో మీ బ్లడ్ మ్యాచ్ అయితే... వారి కుటుంబసభ్యులు మీకూ... మీ కుటుంబ సభ్యులు వారికీ... ఇలా దాతలను పరస్పరం మార్చుకొని... ఇరువురు బాధితులూ కిడ్నీలు పొంది, కిడ్నీ మార్పిడి ఆపరేషన్ చేయించుకోవచ్చు. అయితే ఇప్పుడు అత్యాధునికమైన ఏబీఓ ఇన్కంపాటబుల్ ట్రాన్స్‌ప్లాంటేషన్ అందుబాటులోకి వచ్చింది. దాని వల్ల బ్లడ్‌గ్రూపు కలవకపోయినా కిడ్నీ మార్పిడి చేయించుకునే అవకాశం ఉంది. ఈ ప్రక్రియలో ప్రత్యేకమైన ప్లాస్మాఫెరాసిస్ పద్ధతిని అనుసరించి వేర్వేరు బ్లడ్గ్రూపులలోని యాంటీజెన్‌ను కలిసేలా చేస్తారు.ఏబీఓ ఇనకంపాటబుల్ ట్రాన్స్‌ప్లాంటేషన్ విధానంలో కిడ్నీ మార్పిడి చేసుకున్నవారు కూడా కంపాటబుల్ కిడ్నీ మార్పిడి మాదిరిగానే మెరుగైన ఫలితాలు పొందుతున్నారు. కిడ్నీ మార్పిడి తర్వాత డయాలసిస్‌పై ఆధారపడాల్సిన అవసరం ఉండదు. మీరు సాధారణ జీవితం గడపగలుగుతారు. కాళ్లవాపులు వస్తున్నాయి... ఇది కిడ్నీ సమస్యా? నా వయసు 54 ఏళ్లు. రెండేళ్లుగా డయాబెటిస్ ఉంది. దాన్ని అదుపులో ఉంచుకోవడం కోసం కొంతకాలంగా మందులు వాడుతూ, ఇన్సులిన్ కూడా తీసుకుంటున్నాను. ఇటీవల నాకు కాళ్లలో వాపు వస్తోంది. దాంతోపాటు మూత్రవిసర్జనలో తీవ్ర ఇబ్బంది కలుగుతోంది. డయాబెటిస్ ఉండే కాళ్లవాపు వస్తుందా? ఈ లక్షణాలతో నాకు తీవ్ర అసౌకర్యంగా ఉంటోంది. ఇది కిడ్నీ సమస్యకు సూచన కావచ్చా? దాంతో సరిగా ఉద్యోగం చేయలేకపోతున్నాను. దయచేసి నా సమస్యకు సరైన పరిష్కారం చూపించగలరు. మీరు తెలిపిన లక్షణాలను బట్టి మీకు కిడ్నీ సంబంధిత సమస్య ఉన్నట్లు తెలుస్తోంది. డయాబెటిస్ వ్యాధిగ్రస్తుల్లో కిడ్నీ సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మీకు కాళ్ల వాపులతో పాటు ముఖం వాచినట్లు ఉండటం, ఆకలి మందగించడం, నీరసంగా ఉండటం, ముఖ్యంగా రాత్రివేళల్లో ఎక్కువసార్లు మూత్రం రావడం వంటి లక్షణాలు కనిపిస్తున్నాయేమో చూసుకోండి. ఈ లక్షణాలు ఉంటే ఆలస్యం చేయకుండా వెంటనే వైద్యలను సంప్రదించి, వారు సూచించిన పరీక్షలు చేయించుకొని వ్యాధిని నిర్ధారణ చేసుకోండి. ఒకవేళ మీకు కిడ్నీ సమస్య ఉన్నట్లు నిర్ధారణ అయినా ఆందోళన చెందకండి. ప్రస్తుతం కిడ్నీ సమస్యలకు మంచి మందులు, అత్యాధునిక వైద్య ప్రక్రియలు అందుబాటులో ఉన్నాయి. కీడ్నీ సమస్యలను ప్రాథమిక దశలో గుర్తించి సకాలంలో చికిత్స అందిస్తే మెరుగైన ఫలితాలు పొందగలుగుతారు. మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉద్యోగం చేయగలగడంతో పాటు సాధారణ జీవితం గడపగలుగుతారు. ఈ లక్షణాలను నిర్లక్ష్యం చేస్తూ, వైద్యులను సంప్రదించడంలో ఆలస్యం చేస్తే సమస్య తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉంటుంది. ఇప్పటికీ మీకు డయాబెటిస్ ఉన్నందున మీరు సాధ్యమైనంతవరకు ఒత్తిడికి గురికాకుండా ప్రశాంతంగా ఉండేందుకు ప్రయత్నించండి. జంక్‌ఫుడ్, ఫాస్ట్ఫుడ్స్, నూనె పదార్థాలకు సాధ్యమైనంత దూరంగా ఉండండి. మీ ఎత్తుకు తగిన విధంగా మీ శరీర బరువు ఉండేలా చూసుకోండి. దాంతోపాటు క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తూ, తాజా ఆకుకూరలు, పండ్లు ఎక్కువగా తీసుకోవడం మంచిది. హాస్పిటల్లో డయాలసిస్ బదులుగా ప్రత్యామ్నాయం ఏదైనా ఉందా? నా వయసు 53 ఏళ్లు. టైప్–2 డయాబెటిస్తో బాధపడుతున్న నాకు రెండు మూత్రపిండాలూ పాడైపోయాయి. చాలాకాలంగా డయాలసిస్ చేయించుకుంటున్నాను. అయితే ప్రతిసారీ డయాలసిస్ కోసం ఆస్పత్రికి వెళ్లిరావడం ఇబ్బందిగా ఉంటోంది. దీనికి ప్రత్యామ్నాయ పద్ధతి ఉందని ఇటీవలే తెలిసింది. దాని గురించి వివరించండి. ఆస్పత్రి లేదా నర్సింగ్‌హోమ్‌లలో నిర్వహించే డయాలసిస్‌ను హీమోడయాలసిస్ అంటారు. ఇది చాలా సాధారణమైన ప్రక్రియ. అత్యధికులు అనుసరించేది కూడా ఇదే. అయితే మీరు రెగ్యులర్‌గా డయాలసిస్ కోసం ఆస్పత్రికి రావడానికి ఇబ్బందిగా ఉన్నందున, ఇంటి దగ్గర మీరే స్వయంగా, మీ కుటుంబ సభ్యుల సహాయంతో డయాలసిస్ చేసుకునే మరో ప్రక్రియ కూడా ఉంది. ఇదే పెరిటోనియల్ డయాలసిస్. దీన్ని ఇంటిదగ్గర, ఆఫీసులో, ప్రయాణాల్లో స్వయంగా చేసుకోవచ్చు. అయితే ఇంటి దగ్గర డయాలసిస్ చేసుకోగల నేర్పు, ఓర్పు పేషెంట్‌కు ఉండాలి. లేదా దీనిని చేయగలవారు ఇంట్లో అందుబాటులో ఉండాలి. పెరిటోనియల్ డయాలసిస్ ద్వారా కడుపు లోపల అంటే ఉదర కుహరంలో ఆవరించిన పొరలలో ఉండే రక్తనాళాల్లోకి డయాలసేట్ అనే ద్రవాన్ని నింపుతూ ఎప్పటికప్పుడు రక్తంలో వ్యర్థాలను బయటకు తీయవచ్చు. రక్తన్ని శుద్ధి చేసే ద్రవాన్ని కేథెటర్ ద్వారా కడుపులోకి పంపిస్తారు. ఈ ద్రవం నిర్ణీతకాలం వరకు కడుపులో ఉంటుంది. ఈ సమయంలో రక్తంలోని వ్యర్థాలు, రసాయనాలు, ద్రవాలు... కడుపులోపలి పొరను అంటిపెట్టుకుని ఉండే రక్తనాళాల నుంచి బయటకు వచ్చి డయాలసిస్ ద్రవంలో కలుస్తాయి. నిర్ణీత సమయం తర్వాత వ్యర్థాలు కలిసిన ద్రవం పేషెంట్ శరీరం వెలుపల అమర్చిన సంచిలోకి డ్రెయిన్ అవుతుంది. కడుపులోకి ద్రవాన్ని పంపడం, కొంతసేపటి తర్వాత దాన్ని బయటకు తీయడం ప్రక్రియను ఎక్స్ఛేంజ్ అంటారు. రాత్రివేళ పేషెంట్ నిద్రించే సమయంలో కూడా డయాలసిస్ చేసుకోవచ్చు. ఇందుకోసం ఆటోమేటెడ్ సైక్లర్‌ను వినియోగిస్తారు. ఈ సైక్లర్ తనంతట తానుగా డయాలసిస్ ద్రవాన్ని కడుపులోపలికి పంపించడం, నిర్ణీత వ్యవధి తర్వాత దాన్ని బయటకు డ్రెయిన్ చేయడం వంటి విధులు నిర్వహిస్తుంది. దీని వల్ల ఉదయం నిద్రలేచిన వెంటనే బ్యాగులో చేరిన వ్యర్థ ద్రవాన్ని ఖాళీ చేయవచ్చు. డా. ఎమ్. దిలీప్‌బాబు,సీనియర్ నెఫ్రాలజిస్ట్ అండ్ కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ ఫిజీషియన్, యశోద హాస్పిటల్స్,సోమాజిగూడ, హైదరాబాద్ -
కాళ్లలో వాపు... నురగలుగా మూత్రం!
నా వయసు 45 ఏళ్లు. నేను వృత్తిరీత్యా ఎప్పుడూ ప్రయాణాల్లోనే ఉంటాను. ఇప్పటివరకు నాకెలాంటి ఆరోగ్య సమస్యా రాలేదు. కానీ గత రెండు మూడు నెలల నుంచి దూరప్రయాణాలు చేసి వచ్చిన తర్వాత నా రెండు కాళ్లు వాస్తున్నాయి. మూత్రం కూడా బాగా నురగతో వస్తోంది. అంతేకాకుండా రాత్రిళ్లు ఎక్కువగా మూత్రం వస్తోంది. ఇలా ఎందుకు జరుగుతోంది? దయచేసి సలహా ఇవ్వండి. మూత్రపిండాల సమస్యలో ఐదు దశలు ఉంటాయి. మొదటి దశ, రెండో దశలో అసలు వ్యాధి లక్షణాలు కనిపించవు. మూడో దశలో ఆకలి మందగించడం, నీరసం, ముఖం వాచినట్లుగా ఉండటం, కాళ్లలో వాపు రావడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. నాలుగో దశ, ఐదో దశలో కన్ను చుట్టూ వాపు రావడం, జబ్బు ఎక్కువవుతున్న కొద్దీ వాపు ఎక్కువవుతుండటం, మూత్రం తగ్గిపోవడం, ఫిట్స్ రావడం, కొన్ని సందర్భాల్లో నడుము నొప్పి రావడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇక ఐదో దశ వచ్చేసరికి కిడ్నీ పనితీరు బాగా తగ్గిపోతుంది. దురదృష్టవశాత్తు చాలామందిలో వ్యాధి ఈ దశకు చేరుకున్న తర్వాతనే వైద్యులను సంప్రదిస్తున్నారు. వ్యాధి ఐదో దశకు చేరిన తర్వాత మళ్లీ దానిని సాధారణ స్థితికి తీసుకురాలేము. అందువల్ల క్రమం తప్పకుండా వైద్యులను సంప్రదిస్తూ చికిత్స కొనసాగించడం ఒక్కటే మార్గం. అయితే మీరు చెబుతున్న లక్షణాలను బట్టి చూస్తుంటే మీ కిడ్నీలో ఏవో అసాధారణ మార్పులు చోటుచేసుకుంటున్నాయని చెప్పవచ్చు. కిడ్నీ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న వారిలో మీరు చెప్పిన లక్షణాలు కనిపిస్తాయి. కాబట్టి మీరు ఏమాత్రం ఆలస్యం చేయకుండా నిపుణులైన వైద్యులను సంప్రదించండి. మీకు తగిన పరీక్షలు నిర్వహించి చికిత్స చేస్తారు. ఆలస్యం చేయకూడదు. గుండెజబ్బులాగా కిడ్నీ సంబంధిత వ్యాధులకు కూడా సమయమే అత్యంత కీలకం. వ్యాధి మొదటి దశలో ఉంటే మీకు సులువుగా చికిత్స నిర్వహించే అవకాశం ఉంది. అలాగే మీ కిడ్నీ కూడా పదిలంగా ఉంటుంది. అలా కాకుండా పరీక్షలలో ఏదైనా సివియారిటీ కనిపిస్తే కూడా మీరు అధైర్యపడాల్సిన అవసరం లేదు. అందుబాటులోకి వచ్చిన నూతన వైద్య ప్రక్రియలతో మీ కిడ్నీ సంబంధిత వ్యాధులను సమూలంగా పరిష్కరించే అవకాశం ఉంది. ఇంట్లోనే డయాలసిస్ చేసుకోవచ్చా? నా వయసు 52 ఏళ్లు. టైప్–2 డయాబెటిస్ కారణంగా నా రెండు మూత్రపిండాలూ పాడైపోయాయి. చాలాకాలంగా డయాలసిస్ చేయించుకుంటున్నాను. అయితే ప్రతిసారీ డయాలసిస్ కోసం ఆస్పత్రికి వెళ్లిరావడం ఇబ్బందిగా ఉంటోంది. ఇంట్లోనే డయాలసిస్ చేసుకునేందుకు అవకాశం ఉందా? దయచేసి వివరంగా చెప్పండి. ఆస్పత్రి లేదా నర్సింగ్‌హోమ్‌లలో నిర్వహించే డయాలసిస్‌ను హీమోడయాలసిస్ అంటారు. ఇది చాలా సాధారణమైన ప్రక్రియ. అత్యధికులు అనుసరించేది కూడా ఇదే. అయితే మీరు రెగ్యులర్‌గా డయాలసిస్ కోసం ఆస్పత్రికి రావడానికి ఇబ్బందిగా ఉన్నందున, ఇంటి దగ్గర మీరే స్వయంగా, మీ కుటుంబ సభ్యుల సహాయంతో డయాలసిస్ చేసుకునే మరో ప్రక్రియ కూడా ఉంది. ఇదే పెరిటోనియల్ డయాలసిస్. దీన్ని ఇంటిదగ్గర, ఆఫీసులో, ప్రయాణాల్లో స్వయంగా చేసుకోవచ్చు. అయితే ఇంటి దగ్గర డయాలసిస్ చేసుకోగల నేర్పు, ఓర్పు పేషెంట్‌కు ఉండాలి. లేదా దీనిని చేయగలవారు ఇంట్లో అందుబాటులో ఉండాలి. పెరిటోనియల్ డయాలసిస్ ద్వారా కడుపు లోపల అంటే ఉదర కుహరంలో ఆవరించిన పొరలలో ఉండే రక్తనాళాల్లోకి డయాలసేట్ అనే ద్రవాన్ని నింపుతూ ఎప్పటికప్పుడు రక్తంలో వ్యర్థాలను బయటకు తీయవచ్చు. రక్తాన్ని శుద్ధి చేసే ద్రవాన్ని కేథెటర్ ద్వారా కడుపులోకి పంపిస్తారు. ఈ ద్రవం నిర్ణీతకాలం వరకు కడుపులో ఉంటుంది. ఈ సమయంలో రక్తంలోని వ్యర్థాలు, రసాయనాలు, ద్రవాలు... కడుపులోపలి పొరను అంటిపెట్టుకుని ఉండే రక్తనాళాల నుంచి బయటకు వచ్చి డయాలసిస్ ద్రవంలో కలుస్తాయి. నిర్ణీత సమయం తర్వాత వ్యర్థాలు కలిసిన ద్రవం పేషెంట్ శరీరం వెలుపల అమర్చిన సంచిలోకి డ్రెయిన్ అవుతుంది. కడుపులోకి ద్రవాన్ని పంపడం, కొంతసేపటి తర్వాత దాన్ని బయటకు తీయడం ప్రక్రియను ఎక్సే ్చంజ్ అంటారు. రాత్రివేళ పేషెంట్ నిద్రించే సమయంలో కూడా డయాలసిస్ చేసుకోవచ్చు. ఇందుకోసం ఆటోమేటెడ్ సైక్లర్‌ను వినియోగిస్తారు. ఈ సైక్లర్ తనంతట తానుగా డయాలసిస్ ద్రవాన్ని కడుపులోపలికి పంపించడం, నిర్ణీత వ్యవధి తర్వాత దాన్ని బయటకు డ్రెయిన్ చేయడం వంటి విధులు నిర్వహిస్తుంది. దీని వల్ల ఉదయం నిద్రలేచిన వెంటనే బ్యాగులో చేరిన వ్యర్థ ద్రవాన్ని ఖాళీ చేయవచ్చు. బ్లడ్ గ్రూపులు కలవడం లేదు... కిడ్నీ మార్పిడి ఎలా? మా అమ్మగారి వయసు 69 ఏళ్లు. కొంతకాలంగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. రోజు విడిచి రోజు హీమోడయాలసిస్ అందిస్తున్నాము. కానీ ఆమె తన వయసు రీత్యా దాన్ని తట్టుకోలేకపోతోంది. చాలా వేదన అనుభవిస్తోంది. మాలో ఎవరైనా కిడ్నీని దానం చేద్దాం అనుకున్నాం గానీ బ్లడ్‌గ్రూపు కలవడం లేదు. ఇప్పుడు మేమేం చేయాలి? మా అమ్మగారి వేదనను తొలగించడానికి తగిన పరిష్కారం చూపండి. కిడ్నీ వంద శాతం పాడైపోయినప్పుడు మాత్రమే కిడ్నీ మార్పిడి ద్వారా రోగిని రక్షిస్తారు. అయితే ఇది అందరి విషయంలోనూ సాధ్యం కాదు. దీనికి దాత అవసరమవుతారు. లైవ్ డోనార్ (బతికి ఉన్న వారి నుంచి కిడ్నీ సేకరించడం), కెడావర్ డోనార్ (చనిపోయిన వ్యక్తి నుంచి కిడ్నీని సేకరించడం) అని రెండు రకాల దాతల నుంచి కిడ్నీని సేకరిస్తారు. లైవ్ డోనార్స్ విషయంలో రక్తసంబంధీకులు మాత్రమే కిడ్నీని దానం చేయాలి. అంతేగాక వీరి బ్లడ్ గ్రూపు కిడ్నీని పొందే వ్యక్తి బ్లడ్ గ్రూపుతో కలవాల్సి ఉంటుంది. కిడ్నీ దానం చేసేవారికి అధిక రక్తపోటు, మధుమేహం, గుండెజబ్బులు, మెదడు జబ్బులు, కాలేయవ్యాధులైన హెపటైటిస్–బి, సి ఉండకూడదు. దాత ఒక కిడ్నీ దానం చేయడం వల్ల ఎలాంటి నష్టం లేదని నిర్ధారణ చేశాకే కిడ్నీ మార్పిడి చేస్తారు. రక్తసంబంధీకుల బ్లడ్ గ్రూపులు కలవకపోతే రెండు మార్గాలు ఉన్నాయి. మొదటిది... స్వాప్ రీనల్ ట్రాన్స్‌ప్లాంటేషన్, రెండోది ఏబీఓ ఇన్కంపాటబుల్ కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్. స్వాప్ రీనల్ ట్రాన్స్‌ప్లాంటేషన్... తమ రక్త సంబంధీకులకు కిడ్నీ దానం చేయాలని ఉన్నాగానీ బ్లడ్ గ్రూపులు కలవకపోవడం వల్ల అది సాధ్యపడనప్పుడు... అదే సమస్యతో బాధపడుతున్న వేరొకరి రక్త సంబంధీకులలో బ్లడ్ గ్రూపు సరిపడిందనుకోండి. ఇలా ఒకరి రక్తసంబంధీకులకు మరొకరు పరస్పరం కిడ్నీలు దానం చేసుకునే ప్రక్రియను స్వాప్ ట్రాన్స్‌ప్లాంటేషన్ అంటారు. ఈ విధానంలో వీరి కిడ్నీని వారి బంధువుకూ, వారి కిడ్నీని వీరి బంధువుకు అమర్చే ఏర్పాటు చేస్తారు. వీరిద్దరికీ ఒకేసారి కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స జరుగుతుంది. బ్లడ్ గ్రూపులు కలవకపోయినా కిడ్నీ మార్పిడి చేయవచ్చు... అందివస్తున్న అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, వైద్యులలో పెరుగుతున్న నైపుణ్యాల వల్ల ప్రస్తుతం బ్లడ్‌గ్రూపులు కలవకపోయినా కిడ్నీ మార్పిడి చేయడం వీలవుతుంది. దీనికి కొన్ని ప్రత్యేకమైన పద్ధతులు అనుసరించాల్సి ఉంటుంది. కొన్ని ప్రత్యేకమైన మందులను ఉపయోగించాల్సి ఉంటుంది. బ్లడ్‌గ్రూపు సరిపడకపోయినప్పటికీ ఈ విధానంలో చేసిన కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సలు కూడా... కంపాటబుల్ కిడ్నీ మార్పిడి సర్జరీల మాదిరిగానే విజయవంతం అవుతున్నాయి. కాబట్టి మీరు మీ అమ్మగారికి తగిన విధానాన్ని అనుసరించేందుకు ఉపయుక్తమైన మార్గాలను తెలుసుకునేందుకు ఒకసారి అత్యంత ఆధునిక వైద్య సదుపాయాలు ఉన్నచోట, నిపుణులైన వైద్యులను సంప్రదించి తగిన సూచనలు తీసుకోండి. డాక్టర్ ఎ. శశి కిరణ్, సీనియర్ నెఫ్రాలజిస్ట్ అండ్ కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ ఫిజీషియన్, యశోద హాస్పిటల్స్, మలక్‌పేట్, హైదరాబాద్ -
ఆస్పత్రి నుంచి జైట్లీ డిశ్చార్జి
సాక్షి, న్యూఢిల్లీ : కిడ్నీ మార్పిడి కోసం మూడు వారాల పాటు ఎయిమ్స్‌లో ఉన్న కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ సోమవారం ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. ఎయిమ్స్‌లో తన పట్ల ఆప్యాయత కనబరిచిన వైద్యులు, నర్సులు, పారామెడికల్ సిబ్బందికి కృతజ్ఞతలు తెలుపుతూ జైట్లీ ట్వీట్ చేశారు. మే 12న ఆస్పత్రిలో చేరిన జైట్లీ (65)కి మే 12న శస్త్రచికిత్స జరిగింది. అప్పటినుంచి ఎలాంటి ఇన్ఫెక్షన్స్సోకకుండా ఆయనకు ప్రత్యేక వార్డులో వైద్యసేవలు అందించారు. మోదీ సర్కార్ నాలుగేళ్ల పాలన పూర్తిచేసుకున్న సందర్భంగా ఆస్పత్రి నుంచే ఆయన ఫేస్బుక్లో పోస్ట్ చేశారు. ఆస్పత్రి నుంచి ఇంటికి చేరుకోవడం ఆనందంగా ఉందని, గత మూడువారాలుగా తనకు అంకితభావంతో సేవలందించిన వైద్యులు, నర్సింగ్ సిబ్బంది, పారామెడిక్స్ అందరికీ కృతజ్ఞతలంటూ జైట్లీ ట్వీట్ చేశారు. తాను త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించిన శ్రేయోభిలాషులు, సహచరులు, స్నేహితులకు కూడా ఆయన ధన్యవాదాలు తెలిపారు. జైట్లీ ఆస్పత్రిలో ఉండగా రైల్వే మంత్రి పీయూష్ గోయల్‌కు ఆర్థిక మంత్రిత్వ శాఖ అదనపు బాధ్యతలు అప్పగించారు. -
జైట్లీకి విజయవంతంగా ఆపరేషన్ పూర్తి
-
జైట్లీకి విజయవంతంగా ఆపరేషన్ పూర్తి
న్యూఢిల్లీ : గత కొంత కాలంగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీకి సోమవారం ఎయిమ్స్ వైద్యులు విజయవంతంగా ఆపరేషన్ పూర్తిచేశారు. జైట్లీకి కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తి చేసినట్టు ఢిల్లీ ఎయిమ్స్ వైద్యులు ప్రకటన విడుదల చేశారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగా ఉందని, త్వరగా కోలుకుంటారని తెలిపారు. ఈ సర్జరీ కోసం జైట్లీ శనివారం రోజు ఎయిమ్స్ ఆసుపత్రిలో జాయిన్ అయ్యారు. నేడు ఉదయం 8 గంటలకు జైట్లీకి వైద్యులు ఆపరేషన్ నిర్వహించారు. ఎయిమ్స్ డైరెక్టర్ రణ్‌దీప్ గులేరియా సోదరుడు అపోలో ఆసుపత్రి నెఫ్రాలజిస్ట్ డాక్టర్ సందీప్ గులేరియా ఈ ఆపరేషన్ చేశారు. సందీప్ గులేరియా జైట్లీ కుటుంబానికి సన్నిహితుడు కూడా. ఈ అనారోగ్య సమస్యతో జైట్లీ వచ్చే వారంలో లండన్‌లో జరుగబోయే 10వ భారత్-అమెరికా ఎకానమిక్, ఫైనాన్సియల్ సదస్సు పర్యటనను కూడా రద్దు చేసుకున్నారు. జైట్లీకి కొన్నేళ్ల క్రితం గుండె సంబంధిత సర్జరీ కూడా అయింది. -
నేడు జైట్లీకి కిడ్నీ మార్పిడి ఆపరేషన్
న్యూఢిల్లీ: కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స కోసం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ(65) శుక్రవారం ఆలిండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(ఎయిమ్స్)లో చేరారు. నేడు ఆయనకు శస్త్రచికిత్స చేస్తారని, అందుకోసం అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని జైట్లీ సన్నిహిత వర్గాలు తెలిపాయి. అపోలో ఆసుపత్రి వైద్యుడు డాక్టర్ సందీప్ గులేరియా జైట్లీకి శస్త్రచికిత్స చేస్తారని సమాచారం. అనారోగ్యం కారణంగా గత కొద్ది రోజులుగా జైట్లీ ఇంటికే పరిమితమయ్యారు. ఈనెల 12న జరిగే 10వ ‘బ్రిటన్–ఇండియా ఆర్థిక, వాణిజ్య చర్చ’ల్లో పాల్గొనేందుకు లండన్ వెళ్లాల్సి ఉండగా.. ఆ పర్యటనను రద్దుచేసుకున్నారు. ‘కిడ్నీ సమస్యలు, కొన్ని ఇన్ఫెక్షన్లకు చికిత్స పొందుతున్నాను’ అని జైట్లీ గురువారం ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. -
సింగర్‌కు కిడ్నీ దానం చేసిన నటి
సాక్షి, హాలీవుడ్: ప్రముఖ పాప్‌సింగర్, నటి సెలెనా గోమెజ్ అభిమానులకు పెద్ద షాకే ఇచ్చింది. ఆమెకు కిడ్నీ మార్పిడి ఆపరేషన్ అయినట్లు ప్రకటించింది. ‘నా బెస్ట్ ఫ్రెండే నా ప్రాణం నిలిపిందంటూ’ ఆపరేషన్ సమయంలో బెడ్ మీద ఉన్న ఓ ఫోటోను సెలెనా షేర్ చేసింది. ఇంతకీ విషయం ఏంటంటే.. సెలెనాకు లూపస్ అనే వ్యాధి సోకింది. దాని వల్ల ఆమె శరీరంలోని గుండె, మెదడు, కిడ్నీల్లాంటి కీలక అవయవాలు పాడయిపోయే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరించారు. వెంటనే కిడ్నీ మార్పిడి ఆపరేషన్ చేస్తే ఫలితం ఉంటుందని ఆమెకు సూచించారు. దీంతో 29 ఏళ్ల ప్రముఖ నటి ఫ్రాన్సియా రైసా కిడ్నీ దానానికి ముందుకు వచ్చింది. ఆపరేషన్ విజయవంతం అయ్యింది కూడా. ఇక ఈ విషయాన్ని తెలియజేస్తూ... తన ఇన్స్టాగ్రామ్ లో సెలెనా ఓ పోస్టు ఉంచింది. ‘తాను గత కొంత కాలంగా మౌనంగా ఉండటంపై అభిమానుల్లో చాలా అనుమానాలు నెలకొన్నాయి. నా కొత్త ఆల్బమ్ కోసం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు కూడా. కానీ, లూపస్ వ్యాధి కోసం శస్త్ర చికిత్స అయ్యాక కోలుకునేందుకు కాస్త సమయం పట్టింది. నా కుటుంబ సభ్యులకు, వైద్య బృందానికి కృతజ్ఞతలు. ముఖ్యంగా ఫ్రాన్సియా తనకు అరుదైన బహుమతి(కిడ్నీ)ని ఇచ్చిందని, ఆమె చేసిన త్యాగానికి ఎప్పటికీ రుణపడి ఉంటానని సెలెనా తెలిపింది. పనిలో పనిగా లూపస్ వ్యాధికి సంబంధించిన పూర్తి వివరాలతో కూడిన లింకును కూడా ఆమె పోస్ట్ చేసింది. సెలెనా ఆరోగ్య సమస్య.. ఆమె ఆపరేషన్ విషయం పాప్ సింగర్, మాజీ ప్రియుడు జస్టిన్ బీబర్ కు కూడా తెలియదంట. ఆ మధ్య ట్విట్టరెక్కి ఒకరినొకరు పబ్లిగ్గా తిట్టిపోసుకున్న విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం ఆమె ఆరోగ్యం కుదుటపడుతుందన్న విషయం తెలుసుకున్న బీబర్ సంతోషం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. -
మృత్యుంజయుడు 'సాహు' రికార్డ్
-
సుష్మ స్వరాజ్ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్
-
సుష్మకు కిడ్నీ మార్పిడి చేసిన వైద్యులు
-
సుష్మకు కిడ్నీ మార్పిడి చేసిన వైద్యులు
న్యూఢిల్లీ: విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్(64)కు ఎయిమ్స్ లో శనివారం కిడ్నీ మార్పిడి శస్త్ర చికిత్సను నిర్వహించారు. ఎయిమ్స్ డైరెక్టర్ ఎమ్ సీ మిశ్రా, సర్జన్లు వీకే బన్సల్, వీ శీను, నెఫ్రాలజిస్టు సందీప్ మహాజన్ లు ఐదు గంటల పాటు ఆపరేషన్ ను నిర్వహించినట్లు తెలిసింది. ఉదయం 9 గంటలకు ప్రారంభమైన సర్జరీ మధ్యాహ్నం 2.30నిమిషాలకు ముగిసింది. ఆ తర్వాత సుష్మను ఐసీయూకు మార్చినట్లు సమాచారం. అయితే సుష్మాకు కిడ్నీ దానం చేసిన దాత వివరాలు తెలియరాలేదు. కొంతకాలంగా సుష్మా డయాబెటిస్ తో బాధపడుతున్నారు. దీనికి తోడు కిడ్నీ ఫెయిల్ కావడంతో ఆమెకు ఢిల్లీ ఎయిమ్స్ డాక్టర్లు వారానికి మూడు సార్లు డయాలసిస్ చేస్తూ వచ్చిన విషయం తెలిసిందే. -
మీడియా కథనాలపై సుష్మాస్వరాజ్ భర్త ఆగ్రహం
న్యూఢిల్లీ: విదేశాంగశాఖ మంత్రి సుష్మాస్వరాజ్ అనారోగ్యంపై వస్తున్న కథనాలపై ఆమె భర్త కౌశల్ స్వరాజ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఇప్పటికే ఎన్నో వివరాలు ఇచ్చేశారు.. ఇక తర్వాత ఏముందీ.. సుష్మా వివరాలతో పాటు త్వరలో జరగనున్న కిడ్నీ ఆపరేషన్ కూడా లైవ్ టెలికాస్ట్ చేయించాలా అని ట్విట్టర్ ద్వారా ప్రశ్నించారు. గత నెలలో తనకు కిడ్నీ ఫెయిల్ అయిందని ప్రస్తుతం న్యూఢిల్లీలోని ఎయిమ్స్ లో చికిత్స పొందుతున్నానని కేంద్ర మంత్రి సుష్మా ట్వీట్ చేశారు. ఇక అప్పటినుంచీ అప్పటినుంచీ ఆమెకు ఆపరేషన్ ఎప్పుడు నిర్వహిస్తారు, అందుకు సంబంధించి కిడ్నీ దాత ఎవరవుతారని భిన్న కథనాలు వచ్చాయి. ఈ వారాంతంలో సుష్మాకు కిడ్నీ మార్పిడి చేయనున్నారు. 'తన భార్యకు కిడ్నీ ఇచ్చే దాతలు బంధువులు, రక్త సంబంధీకులు అయి ఉండరాదని.. ఆమెకు ఇతర వ్యక్తులు ఎవరైనా కిడ్నీ ఇవ్వొచ్చునని ప్రచారం జరిగింది. ప్రముఖులకు కూడా కాస్త వ్యక్తిగత జీవితం ఉంటుంది. కొన్ని విషయాలను మాత్రమే తెలపాలి. ప్రతి ఒక్క విషయాన్ని బయటకు వెల్లడించడం మంచిది కాదు' అని సుష్మాస్వరాజ్ భర్త కౌశల్ స్వరాజ్ వరుస ట్వీట్లు చేశారు. తన భార్య డయాబెటిక్ పేషెంట్ కనుక డయాలిసిస్ కూడా చేయిస్తున్నట్లు కౌశల్ స్వరాజ్ తన ట్వీట్లలో పేర్కొన్నారు. -
వారాంతంలో సుష్మకు మూత్రపిండ మార్పిడి?
-
వారాంతంలో సుష్మకు మూత్రపిండ మార్పిడి?
న్యూఢిల్లీ: విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్‌కు ఈ వారాంతంలో ఢిల్లీలోని ఎయిమ్స్‌లో మూత్రపిండ మార్పిడి శస్త్రచికిత్స జరిగే అవకాశం ఉంది. రక్త సంబంధీకుడు కాని దాత నుంచి కిడ్నీ సేకరిస్తున్నట్లు సమాచారం. రోగి బంధువులే కాకుండా స్నేహితులు, శ్రేయోభిలాషులు, ఇరుగు పొరుగువారు.. ఎవరైనా అవయవ దానం చేయవచ్చని చట్టం చెబుతోంది. కిడ్నీ మార్పిడి ప్రక్రియకు దాత, గ్రహీతలకు ముందస్తు పరీక్షలన్నీ పూర్తి చేసినట్లు వైద్యులు చెప్పారు. ఎరుుమ్స్‌లోని నిపుణులైన వైద్యుల బృందం ఈ శస్త్రచికిత్స నిర్వహించనున్నట్లు తెలిపారు. -
34 ఏళ్ల క్రితం కిడ్నీ మార్పిడి
♦ ఇప్పటికీ ఆరోగ్యంగా కిడ్నీ దాత, స్వీకర్త ♦1982 మే 16న ఉస్మానియా ఆస్పత్రిలో తొలిసారి శస్త్రచికిత్స హైదరాబాద్: వైద్య చరిత్రలో ఇదో మైలురాయి. 34 ఏళ్ల క్రితం కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స చేయించుకున్న వ్యక్తి, ఆయనకు అవయవాన్ని దానం చేసిన దాత ఇప్పటికీ పూర్తి ఆరోగ్యంగా ఉన్నారు. ఉస్మానియా ఆస్పత్రిలో తొలిసారిగా చేసిన కిడ్నీ మార్పిడి ఆపరేషన్ ఇదే కావడం గమనార్హం. ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఎస్ఎస్ రెడ్డి పర్యవేక్షణలో డాక్టర్ గోపాలకృష్ణ, యూరాలజిస్ట్ డాక్టర్ రంగనాథ్రావుల నేతృత్వంలోని వైద్య బృందం 1982 మే 16న నగరంలోని డబీర్‌పురాకు చెందిన మహ్మద్ ఇబ్రహీం(67)కు తొలి కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సను విజయవంతంగా చేసింది. ఇబ్రహీం సోదరుడు ఇషాక్ ఆయనకు కిడ్నీ దానం చేశారు. వీరికి కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స చేసి ఇప్పటికి 34 ఏళ్లు పూర్తవుతుండగా.. వీరిద్దరూ ఇప్పటికీ ఆరోగ్యంగా ఉన్నట్లు ఇబ్రహీంకు శస్త్రచికిత్స చేసిన డాక్టర్ గోపాలకృష్ణ వెల్లడించారు. ఈ శస్త్రచికిత్సకు అప్పటి ముఖ్యమంత్రి టి.అంజయ్య ఆర్థిక సహాయం అందజేసినట్లు తెలిపారు. కాగా, కిడ్నీ మార్పిడి చేయించుకుని ఎక్కువ కాలం జీవించిన వారి జాబితాలో ఇబ్రహీం నాలుగో వ్యక్తి అని వైద్యులు చెపుతున్నారు. ఇది ఉస్మానియా వైద్యుల చలవే అప్పట్లో కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స ఎక్కడా చేసేవారు కాదు. ఉస్మానియాలో పరీక్షలు చేయిస్తే కిడ్నీలు చెడిపోయాయని డాక్టర్లు చెప్పారు. మొట్టమొదటిసారిగా కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స చేసేందుకు వైద్యులు ముందుకు రావడంతో మా తమ్ముడు తన కిడ్నీని దానం చేశాడు. అప్పట్లో రక్త పరీక్షలకు బొంబాయికి పంపేవారు. నెలకు రూ.వెయ్యి ఖర్చయ్యేది. మాకు ప్రభుత్వ ఖర్చులతోనే చేశారు. ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నామంటే అది ఉస్మానియా వైద్యుల చలువే. - ఇబ్రహీం, తొలి కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స జరిగిన వ్యక్తి ఎంతో ఆనందంగా ఉంది మా అన్న ఇబ్రహీంకు రెండు కిడ్నీలు చెడిపోయాయి. దాత కోసం చూసినా.. ఎవరూ ముందుకు రాలేదు. దీంతో నా కిడ్నీలు ఆయనకు మ్యాచ్ అవుతాయని వైద్యులు చెప్పడంతో ఇవ్వడానికి అంగీకరించా. అప్పుడు నా వయసు 22 ఏళ్లు. అప్పటికి మా ఇద్దరికీ పెళ్లి కాలేదు. చికిత్స చేయించుకున్న రెండేళ్ల తర్వాత మా అన్న వివాహమైంది. ఆ తర్వాత నాదైంది. ప్రస్తుతం మా ఇద్దరికీ ముగ్గురు, ముగ్గురు పిల్లలున్నారు. మేం ప్రస్తుతం ఎంతో ఆరోగ్యంగా ఆనందంగా ఉన్నాం. - ఇషాక్, కిడ్నీ దాత -
దరికి రాని జీవన్‌దాన్
ఉత్తరాంధ్రలో సౌకర్యాలు అంతంత మాత్రమే కిడ్నీ మార్పిడి సేవలకే పరిమితం పేదరోగుల తలకు మించిన భారం కేజీహెచ్‌లో ప్రాంతీయ కేంద్రం ఏర్పాటైతే ఎంతో సౌలభ్యం మృత్యుముఖంలో ఉన్న రోగికి అతి కీలకమైన అంతర్గత శరీరభాగాలను దానం చేసి వారి ప్రాణం కాపాడే ఉదాత్త సంస్కారం నానాటికీ మనందరిలో పెంపొందుతోంది. అవయవదానంపై అవగాహన వృద్ధి కారణంగా చావుబతుకుల్లో ఉన్న ఎందరికో ఊపిరి నిలుస్తోంది. అయితే అందుకు తగ్గ సదుపాయాలు మనకు ఏమాత్రం అందుబాటులో ఉన్నాయన్నది ప్రశ్న. రాష్ట్రాభివృద్ధి శరవేగంగా సాగుతోందని చెప్పుకునే పాలకులు ఈ అంశంపై ప్రధానంగా దృష్టి నిలపాల్సిన అవసరం ఉంది. విశాఖపట్నం: ప్రాణాపాయంలో ఉన్న వారికి అవయవాలను (మరణానంతరం) దానం చేసి వారి ప్రాణ ం నిలపాలన్న ఆలోచన నానాటికీ ఊపందుకుంటోంది. తమవారు కనుమరుగైనా వారి అవయవాలను వేరొకరికి అందజేసి ‘పునర్జన్మ’ ప్రసాదించే మహోన్నత సంస్కారం మృతుల కుటుంబ సభ్యుల్లో పెంపొందుతోంది. అయితే ఎవరెవరిలో ఎంత ఔన్నత్యం ఉన్నా, అత్యధునాతన వైద్య, సాంకేతిక సౌకర్యాలు లేనిపక్షంలో ఇది ఆచరణ సాధ్యం కాదు కదా.. ఉత్తరాంధ్ర ఈ విషయంలోనే చాలా వెనుకబడి ఉంది. ఇన్నాళ్లూ ప్రైవేటు ఆస్పత్రుల్లోనే అవయవ మార్పిడి సదుపాయం ఉంది. ఉత్తరాంధ్ర పెద్దాస్పత్రి కేజీహెచ్‌లో మూత్రపిండాల మార్పిడి ఒక్కటే జరుగుతోంది. 2002లో అక్కడ కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స యూనిట్ ప్రారంభమయింది. కొద్దికాలం సర్జన్లు అందుబాటులో లేక శస్త్రచికిత్సలు నిలిచిపోయాయి. మళ్లీ ఈ ఏడాది పునఃప్రారంభమయ్యాయి. ఈ సంవత్సరం ఇప్పటిదాకా ఐదు కిడ్నీ మార్పిడులు జరిగాయి. అవయవదానంపై చైతన్యం పెరుగుతున్న తరుణంలో కేజీహెచ్‌లోనూ మరణానంతరం (కెడావర్) అవయవాల సేకరణ యూనిట్ మంజూరు కోసం ప్రతిపాదించారు. ఏడాది నుంచి దీనికి అతీగతీ లేదు. కేజీహెచ్‌లో గుండె, కాలేయ మార్పిడి విభాగాలున్నా ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్లు, ఇతర సదుపాయాలు లేక ప్రతిపాదన ముందుకు సాగడం లేదు. గుంటూరు ప్రభుత్వాస్పత్రి మాదిరిగా ప్రభుత్వం పీపీపీ విధానంలో కార్పొరేట్ ఆస్పత్రులతో ఒప్పందం కుదుర్చుకుని కార్డియోథొరాసిక్, గ్యాస్ట్రో ఎంట్రాలజీ విభాగాలకు ప్రైవేటు వైద్యులను రప్పించి అవయవ మార్పిడికి శ్రీకారం చుట్టవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. రోగి బ్రెయిన్‌డెడ్ అయ్యాక కాలేయం, గుండె, కళ్లు, ఊపిరితిత్తులను తొలగించి అవసరమైన రోగికి నిర్ణీత సమయంలో అమరుస్తారు. ఆరోగ్యంగా ఉన్న వారు అవసరమైన తమ వారికి మూత్రపిండాలు, కాలేయంలో కొంతభాగాన్ని లైవ్ డొనేషన్ ద్వారా ఇస్తున్నారు. ఇప్పటిదాకా విశాఖ నగరంలో కేర్ ఆస్పత్రిలో అవయవ మార్పిడి సర్జరీలు అధికంగా జరిగాయి. ఇతర కార్పొరేట్ ఆస్పత్రుల్లోనూ అవయవ మార్పిడికి అనుమతులున్నా కిడ్నీ శస్త్రచికిత్సలకే మొగ్గు చూపుతున్నారు. ఖర్చుతో కూడుకున్న పని.. అవయవ మార్పిడిలో జీవన్‌దాన్ ద్వారా అవయవాలు ఉచితంగానే సమకూరుస్తారు. అయితే మార్పిడి అనంతరం రోగి జీవితాంతం ఖరీదైన మందులు (ఇమ్యునో సర్ప్రాసెంట్స్) వాడాల్సి రావడంతో పేదలు అందుకోలేకపోతున్నారు. అంతేకాదు.. దాత నుంచి తీసిన అవయవాలను గంటల వ్యవధిలోనే చార్టర్డ్ ఫ్లైట్‌లో పంపాల్సి రావడం వల్ల లక్షల్లో ఖర్చవుతుంది. ఇది కూడా పేదలకు భారంగా మారుతోంది. ఫలితంగా కేవలం ధనవంతులు మాత్రమే దీనిని సద్వినియోగం చేసుకోగలుగుతున్నారు. త్వరలో కేజీహెచ్‌లో ప్రాంతీయ కేంద్రం.. ఈ నేపథ్యంలో కేజీహెచ్ అవయవ మార్పిడి యూనిట్ స్థాపనకు వీలుగా తొలిదశలో జీవన్‌దాన్ ప్రాంతీయ కేంద్రాన్ని నెఫ్రాలజీ విభాగంలో ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇందుకోసం రెండు గదులు కేటాయించారు. అవయవ మార్పిడి యూనిట్ ప్రారంభమైతే కేజీహెచ్‌లో అన్నీ ఉచితంగానే జరుగుతాయి. జీవితాంతం ఆసుపత్రి ఉచితంగా మందులు అందజేస్తుంది. ఇది పేద రోగులకు వరంగా మారుతుంది. -
కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్ కోసమే రాజన్ దొరికిపోయాడా?
ముంబై: అండర్ వరల్డ్ డాన్ ఛోటా రాజన్ తనకుతానుగా అరెస్టయి.. కావాలనే భారత్ తిరిగి వస్తున్నాడా? ప్రస్తుతం కనిపిస్తున్న కారణాలు అవుననే అంటున్నాయి. 55 ఏళ్ల ఛోటా రాజన్ అత్యవసరంగా మూత్రపిండాల మార్పిడి శస్త్రచికిత్స చేయించుకోవాల్సిన అవసరముంది. భారత్‌లో కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేయించుకోవడానికి అతను గత ఏడాదికాలంగా ప్రణాళికలు రచిస్తున్నాడని, ఇక్కడ అతనికి కిడ్నీ దానం ఇవ్వడానికి కుటుంబసభ్యులు ప్రయత్నిస్తున్నారని ముంబై క్రైమ్ బ్రాంచ్ వర్గాలు తెలిపాయి. 'ఛోటారాజన్ రెండు మూత్రపిండాలూ చెడిపోయాయి. దీంతో ఆయన ప్రస్తుతం డయాలసిస్ మీద ఆధారపడి జీవిస్తున్నారు. ఆయన బతకాలంటే ఒక కొత్త కిడ్నీ అవసరముంది. పరారీ ఖైదీగా ఉన్న రాజన్ విదేశాల్లో ఈ శస్త్రచికిత్స చేయించుకోవడం వీలుపడదు' అని క్రైమ్ బ్రాంచ్ అధికారి ఒకరు తెలిపారు. భారత్ తిరిగొస్తే కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్‌కు అధికారులు అనుమతించే అవకాశముందని రాజన్ భావిస్తున్నాడని ఆయన వివరించారు. సుదీర్ఘకాలంగా ప్లానింగ్! ఛోటా రాజన్ అలియాస్ రాజేంద్ర సదాశివ నికాల్జే గత ఏడాదే తన ఆరోగ్య పరిస్థితి గురించి భారత్‌లోని తన కుటుంబసభ్యులకు వివరించాడు. గత రెండు దశాబ్దాలుగా పరారీలో అజ్ఞాత జీవితం గడుపుతున్న అతని రెండు కిడ్నీలు చెడిపోయాయి. దీంతో రాజన్ మేనల్లుడు ఒకరు కిడ్నీ దానం చేయడానికి ముందుకొచ్చినట్టు సమాచారం. రాజన్ తన వైద్య పరీక్షల వివరాలు కుటుంబసభ్యులకు మెయిల్ ద్వారా పంపించగా.. వాటిని దక్షణ ముంబైలోని ఓ ప్రముఖ ఆస్పత్రిలోని నెఫ్రాలజిస్టుకు చూపించారు. దీంతో ఇద్దరి కిడ్నీలు మ్యాచ్ అవుతాయని, రాజన్‌కు ఆయన మేనల్లుడు కిడ్నీ ఇవ్వవచ్చునని వైద్యుడు సలహా ఇచ్చినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలోనే మలేషియాలోని బాలిలో ఛోటారాజన్ అరెస్టయ్యాడు. ఒకవైపు దావూద్ ఇబ్రహీం అనుచరుడు ఛోటా షకీల్ నుంచి ప్రాణహాని, మరోవైపు అనారోగ్యం కారణంగానే అతను అరెస్టు అవ్వడానికి సిద్ధపడినట్టు పోలీసువర్గాలు భావిస్తున్నాయి. -
సిగరెట్ వల్ల ఎముకలూ పొగచూరిపోతాయి!
నెఫ్రాలజీ కౌన్సెలింగ్ నా వయసు 50 ఏళ్లు. టీచర్‌గా పనిచేస్తున్నాను. నాకు మూత్రపిండాల సమస్య ఉంది. రెండేళ్లుగా డయాలసిస్ చేయించుకుంటున్నాను. కిడ్నీ మార్పిడి చేయించుకోవడం మంచిదని తెలిసిన వాళ్లు చెబుతున్నారు. కిడ్నీ మార్పిడి తర్వాత కూడా డయాలసిస్ చేయించుకోవాల్సి వస్తుందా? మా కుటుంబ సభ్యులు నాకు కిడ్నీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ వారిలో ఎవరితోనూ నా బ్లడ్‌గ్రూపు కలవడం లేదు. నాకు కిడ్నీ మార్పిడి చేయించుకునే అవకాశం ఉందా? దయచేసి నా సమస్యకు పరిష్కారం చూపగలరు. - రమేశ్, ఆదిలాబాద్ కిడ్నీలు పూర్తిగా పాడై డయాలసిస్‌పై ఆధారపడుతున్న వారికి కిడ్నీ మార్పిడి ఉత్తమమైన మార్గం. మీరు రెండు పద్ధతుల ద్వారా కిడ్నీ మార్పిడి చేయించుకోవచ్చు. ఒకటి స్వాప్ ట్రాన్స్‌ప్లాంటేషన్. రెండోది ఏబీఓ ఇన్కంపాటబుల్ ట్రాన్స్‌ప్లాంటేషన్. స్వాప్ ట్రాన్స్‌ప్లాంటేషన్‌లో మీలాంటి సమస్యతోనే బాధపడుతున్న మరొకరు ఉంటే... వారి కుటుంబ సభ్యులతో మీ బ్లడ్ మ్యాచ్ అయితే... వారి కుటుంబసభ్యులు మీకూ... మీ కుటుంబ సభ్యులు వారికీ... ఇలా దాతలను పరస్పరం మార్చుకొని... ఇరువురు బాధితులూ కిడ్నీలు పొంది, కిడ్నీ మార్పిడి ఆపరేషన్ చేయించుకోవచ్చు. అయితే ఇప్పుడు అత్యాధునికమైన ఏబీఓ ఇన్కంపాటబుల్ ట్రాన్స్‌ప్లాంటేషన్ అందుబాటులోకి వచ్చింది. దాని వల్ల బ్లడ్‌గ్రూపు కలవకపోయినా కిడ్నీ మార్పిడి చేయించుకునే అవకాశం ఉంది. ఈ ప్రక్రియలో ప్రత్యేకమైన ప్లాస్మాఫెరాసిస్ పద్ధతిని అనుసరించి వేర్వేరు బ్లడ్గ్రూపులలోని యాంటీజెన్‌ను కలిసేలా చేస్తారు. ఏబీఓ ఇన్కంపాటబుల్ ట్రాన్స్‌ప్లాంటేషన్ విధానంలో కిడ్నీ మార్పిడి చేసుకున్నవారు కూడా కంపాటబుల్ కిడ్నీ మార్పిడి మాదిరిగానే మెరుగైన ఫలితాలు పొందుతున్నారు. కిడ్నీ మార్పిడి తర్వాత డయాలసిస్‌పై ఆధారపడాల్సిన అవసరం ఉండదు. మీరు సాధారణ జీవితం గడపగలుగుతారు. లైఫ్ స్టైల్ కౌన్సెలింగ్ నా వయసు 45 ఏళ్లు. రోజుకు పదిహేను నుంచి ఇరవై సిగరెట్లు తాగుతాను. ఇటీవల నా బరువు తగ్గింది. విటమిన్ డి పాళ్లు కూడా తగ్గాయి. మా డాక్టర్ సిగరెట్లు మానేయమని చెబుతున్నారు. సిగరెట్ దుష్ర్పభావం ఎముకలపైన ఉంటుందా? - ప్రేమ్‌కుమార్, బెంగళూరు అన్ని అవయవాల మాదిరిగానే పొగతాగే అలవాటు ఎముకలపైనా దుష్ర్పభావం చూపుతుంది. సిగరెట్ల వల్ల అనారోగ్యకరంగా బరువు తగ్గడం, విటమిన్ డి పాళ్లు తగ్గడం, ఎముకల్లోకి క్యాల్షియమ్ ఇంకడం కూడా తగ్గడం జరుగుతుంది. పైగా మామూలు వ్యక్తులతో పోలిస్తే స్మోకర్లలో ఫ్రాక్చర్ అయ్యే అవకాశాలు 25 శాతం ఎక్కువ. అలాగే తుంటిఎముక ఫ్రాక్చర్లు అయ్యే అవకాశాలు పొగతాగే వారిలో ఎక్కువ. స్మోకింగ్ వల్ల అనేక దుష్ర్పభావాలు కనిపించి ఎముక సాంద్రత తగ్గుతుంది. అందుకు దారితీసే అంశాలివి... పొగతాగే అలవాటు వల్ల హార్మోనల్ మార్పులు వచ్చి క్యాల్షియమ్‌ను ఎముకల్లోకి వెళ్లేలా చేసే పారాథైరాయిడ్ హార్మోన్ పాళ్లు, మహిళల్లో ఈస్ట్రోజెన్ పాళ్లు తగ్గుతాయి. పొగతాగే అలవాటు వల్ల విటమిన్ డి పాళ్లు తగ్గడంతో, శరీరంలో వ్యాధి నిరోధకత తగ్గుతుంది. శరీరానికి హానిచేసే ఫ్రీరాడికల్స్ పెరగడం వల్ల క్యాన్సర్ రిస్క్ పెరుగుతుంది. రక్తనాళాల్లో రక్తప్రవాహానికి అడ్డంకులు ఏర్పడటం వల్ల ‘పెరిఫెరల్ వాస్క్యులర్ డిసీజ్’ వచ్చే అవకాశాలు ఎక్కువ. దీనివల్ల ఎముకకూ రక్తప్రసరణ తగ్గుతుంది. పొగతాగే అలవాటు వల్ల నరాలు స్పందించే వేగం తగ్గుతుంది. దాంతో వాళ్లు పడిపోయే అవకాశాలు ఎక్కువ. పొగలోని విషపదార్థాలు ఎముక కణాలపైనా నేరుగా తమ దుష్ర్పభావం చూపుతాయి. ఎముకలలోని బంతిగిన్నె కీలుతో పాటు అన్ని కీళ్లు పొగ వల్ల వేగంగా గాయపడే అవకాశాలుంటాయి. గాయాలు చాలా ఆలస్యంగా తగ్గుతాయి. భర్తకు పొగతాగే అలవాటు ఉన్నప్పుడు వారి భాగస్వామికి ప్యాసివ్స్మోకింగ్ బారినపడటం వల్ల వాళ్లకు పుట్టబోయే బిడ్డల ఎముకల బరువూ చాలా తక్కువగా ఉంటుందని అధ్యయనాలు చెబుతున్నాయి.పొగతాగే అలవాటు ఉన్నవారిలో ఆస్టియోపోరోసిస్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ.అందుకే మీ డాక్టర్ చెప్పినట్లుగా మీరు వెంటనే పొగతాగే అలవాటు మానేయండి. గ్యాస్ట్రోంటరాలజీ కౌన్సెలింగ్ నా వయసు 56 ఏళ్లు. గతంలో చేసిన కొన్ని పరీక్షల్లో లివర్ సిర్రోసిస్ వ్యాధి బయటపడింది. ఇందుకు తగిన చికిత్స తీసుకుంటున్నాను. గత ఏడాది మళ్లీ పరీక్షలు చేయిస్తే... హైపోథైరాయిడ్ సమస్య ఉన్నట్లు తేలింది. ఈ వ్యాధికి మందులు వాడాల్సిందిగా వైద్యులు సూచించారు. కానీ లివర్ సిర్రోసిస్ వల్ల థైరాయిడ్ మందులు పనిచేయడం లేదని డాక్టర్ చెబుతున్నారు. థైరాయిడ్ సమస్య తగ్గేదెలా? తగిన సలహా ఇవ్వగలరు. - సుభాష్, జగ్గయ్యపేట లివర్ సిర్రోసిస్ ఉన్నప్పుడు థైరాయిడ్ మందులు మాత్రమే కాకుండా, మిగతా చాలా మందులు శరీర జీవక్రియల (మెటబాలిజమ్) ప్రభావానికి లోనవుతాయి. థైరాయిడ్ మందులు పనిచేయాలంటే ముందుగా లివర్ కణాలలో జీవక్రియ సరిగ్గా జరగాల్సి ఉంటుంది. అలా జరగకపోవడం వల్ల మీ హైపోథైరాయిడ్ సమస్య తగ్గడం లేదు. మీరు కొన్ని ఆటోఇమ్యూన్ పరీక్షలు చేయించుకోవాలి. లివర్, థైరాయిడ్‌కు సంబంధించిన ఆటోఇమ్యూన్ హెపటైటిస్ వచ్చే అవకాశం ఉంది. మీరు స్టెరాయిడ్స్ వాడటం వల్ల మీ రెండు వ్యాధులూ నయమయ్యే అవకాశం ఉంది. కాబట్టి మీరు దగ్గర్లోని గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్‌ను కలిసి తగిన చికిత్స తీసుకోండి. నా వయసు 36 ఏళ్లు. ఒక పెద్ద కంపెనీలో పనిచేస్తున్నాను. ఉద్యోగరీత్యా నాపై ఒత్తిడి చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకే పని తర్వాత సేదదీరడం కోసం ప్రతి వీకెండ్లో ఆల్కహాల్ తీసుకుంటూ ఉంటాను. దీనివల్ల లివర్ దెబ్బతినే ప్రమాదం ఉందా? ప్రతినెలా లివర్‌కు సంబంధించిన పరీక్షలు ఏమైనా చేయించమంటారా? వివరంగా చెప్పండి. - జే.ఆర్.పి., హైదరాబాద్ మీరు తీసుకునే ఆల్కహాల్ మోతాదు బట్టి లివర్ జబ్బులు వచ్చే అవకాశం ఉంది. మీరు ఎంత పరిమాణంలో ఆల్కహాల్ తీసుకుంటారో రాయలేదు. ఎందుకైనా మంచిది... మీరు ఒకసారి బేస్‌లైన్ టెస్టులు... ఎల్.ఎఫ్.టి., లిపిడ్ ప్రొఫైల్, ఓజీటీ, ఎఫ్.బి.ఎస్, క్రియాటినిన్ అనే పరీక్షలు చేయించుకోండి. ప్రతినెలా పరీక్షలు అవసరం లేదు. ఇప్పటికే మీకు డయాబెటిస్, లివర్ జబ్బులు ఉంటే చాలా తక్కువగా ఆల్కహాల్ తీసుకున్నా... అది మీకు ప్రమాదకరంగా పరిణమించే అవకాశం ఉంది. కాబట్టి మీరు తక్షణం ఆల్కహాల్ మానేయడం మంచిది. -
కిడ్నీ మార్పిడిలో ‘కేర్’ 95% విజయవంతం
సాక్షి, హైదరాబాద్: మూత్ర పిండాల మార్పిడిలో తమ వైద్య బృందం 95 శాతం విజయం సాధించినట్లు కేర్ ఆసుపత్రి నెఫ్రాలజీ విభాగం డెరైక్టర్ డాక్టర్ రాజశేఖర్ చక్రవర్తి పేర్కొన్నారు. దేశంలోనే 500 మూత్ర పిండాల మార్పిడి చేసిన ఘనతను కేర్ ఆసుపత్రి సాధించిందని ఆయన వెల్లడించారు. మంగళవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ 2004లోనే మార్పిడి సేవలను అందుబాటులోకి తీసుకువచ్చి తక్కువ కాలంలో మెరుగైన వైద్య సేవలు అందించడంలో తాము అగ్రగామిగా ఉన్నామన్నారు. దేశంలోని వివిధ కేర్ ఆసుపత్రుల్లో మూత్రపిండాల మార్పిడి చేశామని.. ఒక్క హైదరాబాద్ కేర్‌లోనే 300 చేసినట్లు పేర్కొన్నారు. జీవదాతలు, బ్రెయిన్‌డెడ్ అయిన వారి నుంచి మూత్రపిండాలు సేకరించి బాధితులకు మార్పిడి చేసి మంచి ఫలితాలు సాధించామన్నారు. పరస్పర అవగాహనతో ఇద్దరు బాధితుల కుటుంబాల నుంచి కిడ్నీలు సేకరించి ‘స్వాప్ కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్’కు కేర్ ఆసుపత్రి దక్షిణ భారత దేశంలో మొదటిసారిగా శ్రీకారం చుట్టిందని వెల్లడించారు. విలేకరుల సమావేశంలో ట్రాన్స్‌ప్లాంట్ విభాగం సర్జన్లు డాక్టర్ కె.రామరాజు, డాక్టర్ బీవీ రామరాజు పాల్గొన్నారు.