
‘బాహుబలి’లో రానా బలిష్టంగా ఉన్నారు. ఆ తర్వాత సడన్‌గా సన్నబడ్డారు. దాంతో చాలామందికి సందేహాలు మొదలయ్యాయి. ఆ తర్వాత రానా ఆరోగ్యం బాగా లేదనే వార్త ప్రచారంలోకి వచ్చింది. కిడ్నీ సంబంధింత సమస్యతో రానా బాధపడుతున్నారన్నది ఆ వార్త సారాంశం. హైదరాబాద్, ముంబైలలో కొంత కాలంగా చికిత్స పొందుతున్నారని ఫిల్మ్ నగర్ టాక్. తాజాగా అమెరికాలో కిడ్నీ మార్పిడి శస్త్ర చికిత్స విజయవంతంగా జరిగిందని, రానా తల్లి లక్ష్మి తనయుడికి కిడ్నీ దానం చేశారనే వార్త షికారు చేస్తోంది. ప్రస్తుతం రానా అమెరికాలో విశ్రాంతి తీసుకుంటున్నారని కూడా చెప్పుకుంటున్నారు. కొద్దిరోజుల తర్వాత మళ్లీ షూటింగ్స్‌తో బిజీబిజీగా ఉంటారట. అయితే ఈ విషయంపై రానా కుటుంబం స్పందించలేదు. ఇదిలా ఉంటే రానా ట్విట్టర్‌లో యాక్టివ్‌గా ఉన్నారు. మంగళవారం ‘డియర్ కామ్రేడ్’కి ఆల్ ది బెస్ట్ చెబుతూ, ట్వీట్ చేశారు రానా. అలాగే బుధవారం సాయంత్రం ‘బాహుబలి’ లండన్ షో గురించి కూడా ఓ ట్వీట్ పెట్టారు.
Comments
Please login to add a commentAdd a comment