
అమెరికా మసాచుసెట్స్ జనరల్ ఆస్పత్రిలో విషాదం చోటు చేసుకుంది. మసాచుసెట్స్ పంది కిడ్నీని ట్రాన్స్‌ప్లాంట్ చేసిన రిచర్డ్ స్లేమాన్ (62) మరణించారు.
ఇంగ్లాండ్ వేమౌత్ నగరానికి చెందిన రిచర్డ్ స్లేమాన్ (62) కిడ్నీ సంబంధిత అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాడు. అయితే 2018లో వైద్యులు అతనికి కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ చేశారు. కొంత కాలం బాగున్నా.. ఆ తర్వాత కిడ్నీ సమస్య మొదటికి రావడంతో డయాలసిస్ చేయాల్సి వచ్చింది. దీంతో అనారోగ్య సమస్యలు చుట్టుముట్టాయి. ఫలితం లేకపోవడంతో వైద్యులు స్లేమాన్‌కు పంది కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్ సలహా ఇచ్చారు.
మసాచుసెట్స్ జనరల్ ఆస్పత్రి వైద్యులు
ఈ ఏడాది మార్చి 16న అమెరికా మసాచుసెట్స్ జనరల్ ఆస్పత్రి వైద్యులు నాలుగు గంటల శ్రమించి స్లేమాన్‌కు పంది కిడ్నీని అమర్చారు. ఆపరేషన్ అనంతరం ఆస‍్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఈ తరుణంలో ఏప్రిల్ 11న (నిన్న) స్లేమాన్ మరణించినట్లు కుటుంబసభ్యులు, మసాచుసెట్స్ వైద్యులు తెలిపారు.
ఆధారాలు లేవు
ఈ సందర్భంగా పందికిడ్నీని అమర్చడం వల్లే స్లేమాన్ మరణించినట్లు ఆధారాలు లేవని వైద్యులు వెల్లడించారు. కుటుంబసభ్యులు తమకు స్లేమాన్‌తో మరికొంత కాలం పాటు తమతో గడిపేందుకు కృషి చేసిన వైద్యులకు కృతజ్ఞతలు చెప్పారు.
గతంలో
గతంలో బ్రెయిన్ డెడ్ అయి కృత్రిమ లైఫ్ సపోర్ట్‌పై కోలుకోలేని స్థితిలో ఉన్న వ్యక్తికి పంది కిడ్నీని అమర్చారు. న్యూయార్క్ యూనివర్సిటీ లాన్‌గోన్ హెల్త్ మెడికల్ సెంటర్‌లో వైద్యులు ఈ ఆపరేషన్ చేశారు. రెండు నెలల వ్యవధిలోనే బాధితుడు మరణించాడు. స్లేమాన్ మాత్రం తాను రెండేళ్లు జీవిస్తానని ధీమా వ్యక్తం చేశారు. తనకు పంది కిడ్నీని అమర్చాలని కోరడంతో మసాచుసెట్స్ వైద్యుల్ని బాధితునికి పంది కిడ్నీని అమర్చారు. కానీ స్వల్ప వ్యవధిలో స్లేమాన్ మరణించడం వైద్య చరిత్రలో విషాదం నెలకొంది.