కాకినాడ : కాకినాడ అపోలో ఆస్పత్రిలో బ్రెయిన్ డెడ్ అయిన 50 ఏళ్ల మహిళ కుటుంబం ఆదర్శంగా నిలిచింది. ఆమె మూత్రపిండాలను కుటుంబ సభ్యులు దానం చేసి మరో ఇద్దరి ప్రాణాలు నిలిపారు. వివరాల్లోకి వెళితే.. కాకినాడ అపోలో ఆస్పత్రిలో బ్రెయిన్ డెడ్ బాధితురాలి నుంచి గురువారం రెండు కిడ్నీలు సేకరించారు.
ఓ కిడ్నీని అదే ఆస్పత్రిలో రోగికి అమర్చగా, మరో కిడ్నీని విశాఖలోని కిమ్స్ ఐకాన్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాపాయ స్థితిలో ఉన్న బాధితుడికి అమర్చే నిమిత్తం తీసుకెళ్లారు. కాకినాడ అపోలో యాజమాన్యం జిల్లా ఎస్పీ సతీ‹Ùకుమార్‌ను ఆశ్రయించగా.. ఆయన గ్రీన్ చానల్ ఏర్పాటు చేశారు. కట్టుదిట్టమైన ఏర్పాట్ల మధ్య కిడ్నీని అంబులెన్స్‌లో విశాఖ తరలించారు. కనీసం నాలుగు గంటల సమయం పట్టే ప్రయాణం కేవలం రెండు గంటల్లోనే పూర్తయి
కిడ్నీ భద్రంగా చేరింది.
Comments
Please login to add a commentAdd a comment