న్యూయార్క్: కిడ్నీ మార్పిడి చరిత్రలో పెద్ద ముందడుగు. అమెరికాలో న్యూయార్క్ లోని ఎన్ వైయూ లాంగ్ వన్ హెల్త్ సంస్థ వైద్యులు ఓ బ్రెయిన్ డెడ్ రోగికి పంది కిడ్నీ అమర్చగా అది ఏకంగా నెల రోజుల పాటు చక్కగా పని చేసింది. మనిషికి పంది కిడ్నీ ఇన్ని రోజుల పాటు పని చేయడం ఇదే తొలిసారి.
గతంలో న్యూయార్క్ వర్సిటీ, అలబామా వర్సిటీ చేసిన కిడ్నీ మారి్పడులు రెండు మూడు రోజుల పాటు మాత్రమే పని చేశాయి. అన్నీ కుదిరితే త్వరలో సాధారణ రోగులకు కూడా పంది కిడ్నీ అమర్చుతామని వైద్య బృందం అంటోంది. అయితే మనిషి వ్యాధి నిరోధకతకు పంది కిడ్నీ ఎలా పని చేస్తుందో కూడా చూస్తామని చెబుతోంది. అందుకోసం రెండో నెల కూడా కిడ్నీని అలాగే ఉంచి చూడనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment