brain dead patients
-
NYU Langone: పంది కిడ్నీ పని చేసింది
న్యూయార్క్: కిడ్నీ మార్పిడి చరిత్రలో పెద్ద ముందడుగు. అమెరికాలో న్యూయార్క్ లోని ఎన్ వైయూ లాంగ్ వన్ హెల్త్ సంస్థ వైద్యులు ఓ బ్రెయిన్ డెడ్ రోగికి పంది కిడ్నీ అమర్చగా అది ఏకంగా నెల రోజుల పాటు చక్కగా పని చేసింది. మనిషికి పంది కిడ్నీ ఇన్ని రోజుల పాటు పని చేయడం ఇదే తొలిసారి. గతంలో న్యూయార్క్ వర్సిటీ, అలబామా వర్సిటీ చేసిన కిడ్నీ మారి్పడులు రెండు మూడు రోజుల పాటు మాత్రమే పని చేశాయి. అన్నీ కుదిరితే త్వరలో సాధారణ రోగులకు కూడా పంది కిడ్నీ అమర్చుతామని వైద్య బృందం అంటోంది. అయితే మనిషి వ్యాధి నిరోధకతకు పంది కిడ్నీ ఎలా పని చేస్తుందో కూడా చూస్తామని చెబుతోంది. అందుకోసం రెండో నెల కూడా కిడ్నీని అలాగే ఉంచి చూడనున్నారు. -
గుండెకోతను భరించి...
సాక్షి, అమరావతి: హాయిగా సాగిపోతున్న వారి జీవితంలో రోడ్డు ప్రమాదం కల్లోలం సృష్టించింది. ఒక మహిళను జీవచ్ఛవంగా మార్చివేసింది. ఇక తన భార్య జీవించడం అసాధ్యమని తెలిసిన ఆమె భర్త గుండెనిండా బాధ ఉన్నా, ప్రాణాపాయస్థితిలో ఉన్న ఇద్దరిని కాపాడేందుకు ముందుకొచ్చారు. తన భార్య అవయవాలను దానం చేసి మానవత్వాన్ని చాటుకున్నారు. చిలకలూరిపేట పట్టణానికి చెందిన గుంతి నాగేశ్వరరావు, వెంకటేశ్వరమ్మ(58) దంపతులకు ఇద్దరు కుమార్తెలు. ఒక కుమార్తె హిమశైలుష అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తుండగా, మరో కుమార్తె డాక్టర్ బిందుమాధవి విజయవాడ రమేష్ ఆస్పత్రిలోని క్రిటికల్ కేర్ విభాగంలో వైద్యురాలిగా సేవలందిస్తున్నారు. నాగేశ్వరరావు, వెంకటేశ్వరమ్మ, మరో ఇద్దరు కలిసి ఈ నెల 13న కారులో ప్రయాణిస్తుండగా చిలకలూరిపేట వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో తలకు తీవ్ర గాయాలైన వెంకటేశ్వరమ్మను స్థానిక ఆస్పత్రిలో చేర్పించారు. నాలుగురోజుల తర్వాత ఆమె పరిస్థితి విషమించడంతో ఈ నెల 17న మెరుగైన వైద్యం కోసం విజయవాడలోని రమేష్ ఆస్పత్రికి తరలించారు. అయితే 18న వెంకటేశ్వరమ్మ బ్రెయిన్ డెడ్ అయినట్లు డాక్టర్లు ప్రకటించారు. కుమార్తె చొరవతో... ఒకవైపు తన తల్లి వెంకటేశ్వరమ్మకు బ్రెయిన్ డెడ్ అయిన బాధ, మరోవైపు డాక్టర్‌గా తల్లి అవయవాలతో మరొకరి ప్రాణం నిలపాలన్న సంకల్పం.. తీవ్ర మానసిక సంఘర్షణ పడుతూనే డాక్టర్ బిందుమాధవి తన తల్లి అవయవదానానికి తండ్రిని ఒప్పించారు. వెంకటేశ్వరమ్మ నుంచి శుక్రవారం రెండు కిడ్నీలు స్వీకరించిన వైద్యులు సీనియారిటీ ప్రకారం ఒక కిడ్నీని రమేష్ ఆస్పత్రిలోని రోగికి, మరొకదాన్ని ఆయుష్ ఆస్పత్రిలోని రోగికి అమర్చి వారి జీవితాల్లో కొత్త వెలుగులను నింపారు. లివర్, లంగ్స్, గుండెను గుంటూరు మెడికల్ కాలేజీకి తరలించారు. అవయవదానం చేసేవరకు బ్రెయిన్ డెడ్ అయిన తల్లిని కుమార్తె బిందుమాధవి దగ్గరుండి వైద్య సేవలు అందిస్తూ జాగ్రత్తలు తీసుకున్నారు. అవయవదానానికి ముందుకు వచ్చిన వెంకటేశ్వరమ్మ భర్త నాగేశ్వరరావును, కుమార్తెలు హిమ శైలుష, డాక్టర్ బిందు మాధవిని జీవన్‌దాన్ రాష్ట్ర కో–ఆర్డినేటర్ డాక్టర్ కె.రాంబాబు అభినందించారు. ప్రజలు అవయవదానంపై అవగాహన పెంచుకోవాలని ఆయన కోరారు. -
నువ్వు గ్రేట్ అన్న.. చనిపోతూ కూడా..
సాక్షి,చాదర్‌ఘాట్(హైదరాబాద్): కుటుంబ సభ్యుడు విగతజీవిగా మారినా గుండె నిబ్బరం చేసుకుని ఓ కుటుంబం తీసుకున్న నిర్ణయం ఆరుగురి జీవితాల్లో వెలుగులు నింపింది. మానవత్వాన్ని మించిన గొప్పతనాన్ని చాటిన ఆ కుటుంబానికి ఆసుపత్రిలోని పలువురు కన్నీటితోనే ఓదార్పును అందజేశారు. తనువు చాలిస్తూ కూడా ఆరుగురికి జీవన దానం చేసిన అతడు దేవుడితో సమానమని.. సరైన సమయంలో ఆ కుటుంబ సభ్యులు నిర్ణయం తీసుకోవటం గొప్ప విషయమని మలక్‌పేట యశోదా ఆసుపత్రి ఎండీ సురేందర్‌రావు కొనియాడారు. ► కొత్తగూడెం భద్రాద్రి జిల్లా బాబుక్యాంపులో నివాసముండే కంజుల అనిల్‌కుమార్ (45) మణుగూరు టీఎస్ జెన్కో బీటీపీఎస్‌లో జేపీఏగా విధులు నిర్వర్తిస్తున్నాడు. ఈనెల 11న పాల్వంచ నుంచి మణుగూరుకు ద్విచక్రవాహనంపై వెళ్తుండగా ప్రమాదానికి గురయ్యాడు. మెరుగైన చికిత్స కోసం కుటుంబసభ్యులు అతడిని మలక్‌పేట యశోదా ఆసుపత్రిలో చేర్పించారు. అనిల్‌కుమార్‌కు శస్త్ర చికిత్స నిర్వహించి ఆరు రోజుల పాటు వెంటిలేటర్‌పై ఉంచారు. ► మంగళవారం సాయంత్రం అనిల్‌కుమార్ బ్రెయిన్ డెడ్ అయ్యాడని వైద్యులు తెలిపారు. అనంతరం మృతుడి కుటుంబ సభ్యులకు “జీవన్ దాన్’కార్యక్రమం గురించి వివరించారు. మృతుడి అవయవాలను చికిత్స పొందుతున్న ఆరుగురికి అందించి ప్రాణదాతలు కావాలని ఆ కుటుంబ సభ్యులను కోరారు. శోక సంద్రంలో ఉన్న ఆ కుటుంబ సభ్యులు జీవన్ దాన్‌కు ఒప్పుకుని ఆరుగురి జీవితాల్లో వెలుగులు నింపారు. ఆరుగురికి అవయవ దానం... బ్రెయన్‌డెడ్ అయిన అనిల్‌కుమార్ గుండెను ప్రత్యేక విమానంలో చెన్నై ఆసుపత్రికి.. కిడ్నీని అపోలో, యశోదా ఆసుపత్రులకు, కళ్లను ఎల్వీ ప్రసాద్ ఆసుపత్రికి, లివర్, ఊపిరితిత్తులను సికింద్రాబాద్‌లోని యశోదా ఆసుపత్రికి తరలించి అక్కడి రోగుల చికిత్సకు అందజేశారు. అనిల్‌కుమార్ మృతదేహానికి యశోదా ఆసుపత్రి సెక్యూరిటీ సిబ్బంది గౌరవ వందనం చేశారు. -
ఆ యువతి మరణిస్తూ.. కొందరికి వెలుగు
సోమాజిగూడ : బ్రెయిన్ డెడ్ అయిన ఓ యువతి అవయవాలను ఆమె తల్లిదండ్రులు దానం చేసి మరికొందరి జీవితాలను నిలబెట్టారు. శనివారం జీవన్‌దాన్ ప్రతినిధులు తెలిపిన వివరాల ప్రకారం.. నల్గొండ జిల్లా రామగిరికి చెందిన డీసీఎం డ్రైవర్ కె.మల్లిబాబు, లలితల కుమార్తె మౌనిక (21) స్థానిక ఎస్‌ఆర్‌టీఎస్ ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ మూడో సంవత్సరం చదువుతోంది. గతనెల 28న మధ్యాహ్నం ఇంటి నుంచి ద్విచక్ర వాహనంపై వెళుతుండగా.. ఆమెను గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. తీవ్ర గాయాలైన మౌనికను స్థానిక ఆస్పత్రిలో ప్రథమ చికిత్స చేసి మెరుగైన వైద్యం కోసం మే 29న ఎల్బీనగర్లోని అవేర్ గ్లోబల్ ఆస్పత్రికి తరలించారు. ఆమెకు చికిత్స చేస్తున్న న్యూరో ఫిజీషియన్ మౌనికకు బ్రెయిన్ డెడ్ అయినట్లు నిర్థారించారు. ఆమె కుటుంబ సభ్యులకు జీవన్‌దాన్ ప్రతినిధులు అవయవ దానంపై కౌన్సిలింగ్ ఇవ్వగా అందుకు వారు అంగీకరించారు. దీంతో మౌనిక శరీరం నుంచి రెండు కిడ్నీలు, లివర్, రెండు కళ్లను సేకరించారు. -
ఏ తల్లి చేయని పని చేసింది
గుంటూరు మెడికల్ : ప్రత్యర్థుల చేతిలో గాయపడి బ్రెయిన్‌డెడ్ అయిన తన కుమారుడి అవయవాలను దానం చేసేందుకు నిశ్చయించుకుని ఆ తల్లి పలువురికి మార్గదర్శకంగా నిలిచింది. గుంటూరు ప్రభుత్వాస్పత్రిలో మంగళవారం జరిగిన ఈ సంఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.. గుంటూరు జిల్లా జంగమహేశ్వరపురానికి చెందిన పుల్లారెడ్డి (30)కి సోదరుడు పోలిరెడ్డి శ్రీనివాసరెడ్డి (43)తోపాటు సోదరి సరోజిని ఉన్నారు. తండ్రి పెద్దవీరారెడ్డి చిన్నతనంలోనే చనిపోవడంతో తల్లి కాశమ్మ పెద్ద కుమారుడు పోలిరెడ్డి, కుమార్తె సరోజినిలకు పెళ్లిచేసి ఇద్దరు కుమారులతో కలిసి ఉంటోంది. పుల్లారెడ్డి సోదరి సరోజిని, బావ చెన్నారెడ్డిలకు వారి ఇంటికి ఎదురుగా ఉంటున్న గొంగటి నాగిరెడ్డి, ఆయన భార్య పద్మ, కుమారులు శ్రీనివాసరెడ్డి, వీరారెడ్డిలతో కొద్దిరోజులుగా వివాదం నడుస్తూ ఉంది. సరోజిని తన సోదరులు పుల్లారెడ్డి, శ్రీనివాసరెడ్డికి ఈ నెల 4న విషయం తెలియజేసింది. సోదరులు ఇద్దరూ సరోజిని ఇంటికి వెళ్లి ఆరా తీస్తున్న సమయంలో నాగిరెడ్డి కుటుంబ సభ్యులు మూకుమ్మడిగా దాడి చేశారు. పుల్లారెడ్డి బ్రెయిన్‌డెడ్ అయినట్లు మంగళవారం జీజీహెచ్ వైద్యులు నిర్ధారించారు. పెద్ద కుమారుడు చనిపోయి, చిన్న కుమారుడు బ్రెయిడ్‌డెడ్ అవడంతో తల్లి కాశమ్మ పెద్ద మనసుతో తన కుమారుడి అవయవాలను దానం చేసేందుకు ముందుకొచ్చింది. రెండు కిడ్నీలు, రెండు కళ్లు, లివర్ సేకరించి జీవన్‌దాన్ ట్రస్ట్ కోఆర్డినేటర్ ద్వారా ఆపరేషన్ల కోసం ఎదురుచూస్తున్న ఐదుగురికి అవయవాలను అమర్చనున్నట్టు వైద్యులు తెలిపారు. -
వైద్యరంగంలో అద్భుతానికి భారత్ వేదిక
న్యూఢిల్లీ: బ్రెయిన్ డెడ్ రోగులు తిరిగి ప్రాణం పోసుకున్న సందర్భాలు ఇంతవరకు ప్రపంచంలో ఎక్కడా లేవు. అలాంటి రోగులపై వైద్య పరీక్షలు నిర్వహించడం పలు దేశాల్లో చట్ట విరుద్ధం, అనైతికం కూడా. అలాంటి రోగుల చచ్చిన మెదళ్లపై తాను ప్రయోగాలు నిర్వహించడమే కాకుండా, వారికి తిరిగి ప్రాణం పోస్తానని చెబుతున్నారు ఉత్తరాఖండ్‌లోని రుద్రాపూర్‌కు చెందిన డాక్టర్ హిమాంషు బన్సల్. తనను తాను ఆల్బర్ట్ ఐన్‌స్టీన్, ఇసాక్ న్యూటన్తో పోల్చుకునే డాక్టర్ బన్సల్ స్వతహాగా ఆర్థోపెడీషియన్. తన రివిటలైఫ్ సెన్సైస్ కంపెనీ తర ఫున వైద్య రంగంతో వినూత్న ప్రయోగాలు నిర్వహించడం ఆయనకు అలవాటే. బ్రెయిన్ డెడ్‌కు పునర్ ప్రాణంపోసే తన ప్రాజెక్టుకు డాక్టర్ బన్సల్ ‘రీ ఎనిమా ప్రాజెక్ట్’ అని పేరుకూడాపెట్టారు. ఈ ప్రాజెక్టు గురించి విన్న తోటి డాక్టర్లే నవ్వుతున్నారు. కొందరు ఇది వృధా ప్రయాస అని వాదిస్తుండగా, ఇది అనైతికమని మరికొందరు వాదిస్తున్నారు. ఈ ప్రాజెక్టు గురించి ఎన్ని విమర్శలు వస్తున్నా పట్టించుకోకుండా డాక్టర్ బన్సల్ తన ప్రయోగానికి అన్ని సిద్ధం చేసుకుంటున్నారు. ఈ విషయంలో అమెరికాలోని బయోటెక్ సంస్థ బయోక్వార్క్తో ఒప్పందం కూడా చేసుకున్నారు. జన్యు కణాల చికిత్స, లేజర్ చికిత్సలతోపాటు నరాల్లో ఉత్ప్రేరణ కల్పించడం ద్వారా చచ్చిన మెదడుకు ప్రాణం తెప్పించేందుకు కృషి చేస్తున్నానని డాక్టర్ బన్సల్ తెలిపారు. బ్రెయిన్ డెడ్ రోగులపై ఇలాంటి ప్రయోగాలు నిర్వహించడం అమెరికాలో చట్ట విరుద్ధమే కాకుండా, అనైతికమని, భారత్‌లో ఇలాంటి ప్రయోగం నిర్వహించేందుకు తాము ముందుకు రావడానికి ఇదో కారణం కాగా, భారత్‌లో వైద్య ఖర్చులు తక్కువవడం మరో కారణమని అమెరికా బయోక్వార్క్ సంస్థ ప్రతినిధులు తెలిపారు. ఒక్క రోగిపై ఈ ప్రయోగానికి అమెరికాలో ఆరేడు కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని, అదే భారత్‌లోనైతే అందులో పదోవంతు ఖర్చు అవుతుందని వారు అంటున్నారు. ఉత్తరాఖండ్‌లోని రుద్రాపూర్‌లో బ్రెయిన్ డెడ్ రోగులు ఎక్కువగా ఉంటున్నారని, అందుకనే తన ప్రయోగానికి ఆ ఊరును ఎన్నుకున్నానని డాక్టర్ బన్సల్ తెలిపారు. తన ప్రయోగానికి ‘డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా’ అనుమతి ఉందని ఆయన చెబుతున్నారు. కేవలం డ్రగ్స్‌పై ప్రయోగాలకు మాత్రమే అనుమతి మంజూరుచేసే అధికారం కలిగిన ఈ సంస్థ డాక్టర్ బన్సల్ ప్రయోగానికి ఎలా అనుమతి ఇచ్చిందో అర్థంకాని విషయం. ఇదే విషయమై భారత వైద్య పరిశోధనా మండలి డైరెక్టర్ డాక్టర్ సౌమ్య స్వామినాథన్‌ను సంప్రదించగా తమకు ఇలాంటి ప్రయోగాలపై నియంత్రణాధికారాలు లేవని అన్నారు. భారతీయ వైద్య మండలి (ఎంసీఐ)యే ఏవైనా చర్యలు తీసుకోవాలని ఆమె అభిప్రాయపడ్డారు. తమకూ తగిన రెగ్యులేటరీ అధికారాలు లేవని ఇటీవల వైద్య కళాశాలల కేసు విషయంలోనే సుప్రీం కోర్టుకు విన్నవించుకున్న ఎంసీఐ ఈ విషయంలో చర్యలు తీసుకుంటుందన్న నమ్మకం లేదు. ‘ఎందుకింత రాద్ధాంతం చేస్తున్నారు. నేను బతికున్న మనుషులపై ప్రయోగాలు చేయడం లేదు. శ్మశానానికి వెళుతున్న బ్రెయిన్ డెడ్ రోగులపైనే ప్రయోగాలు చేస్తానంటున్నాను. మహా అంటే వారు శ్మశానానికి వెళ్లడం 15 రోజులు ఆలస్యం అవుతుంది. ప్రయోగం సక్సెస్ అయితే వైద్య చరిత్రలోనే అదో అద్భుతం అవుతుంది’ అని బన్సల్ వ్యాఖ్యానించారు.