అమెరికాలో మరో విమాన ప్రమాదం.. వణికిపోయిన ​ప్రయాణీకులు | Plane Catches Fire On Runway At Houston Airport | Sakshi
Sakshi News home page

అమెరికాలో మరో విమాన ప్రమాదం.. వణికిపోయిన ​ప్రయాణీకులు

Published Mon, Feb 3 2025 7:44 AM | Last Updated on Mon, Feb 3 2025 8:50 AM

Plane Catches Fire On Runway At Houston Airport

హ్యూస్టన్‌‌: అమెరికాలో వరుస విమాన ప్రమాదాలు ప్రయాణికులను భయాందోళనలకు గురిచేస్తున్నాయి. గడిచిన మూడు రోజుల్లోనే రెండు విమాన ప్రమాదాల సంభవించగా.. తాజాగా మరో విమానానికి తృటిలో ప్రమాదం తప్పింది. రన్‌వేపై టేకాఫ్‌ అవుతుండగా విమానంలో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ప్రయాణీకులు ఎవరికీ గాయాలు కాకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఇక, ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

వివరాల ప్రకారం.. అమెరికాలో హ్యూస్టన్‌ నుంచి న్యూయార్క్‌ వెళ్లే యునైటెడ్‌ ఎయిర్‌లైన్స్‌ విమానం ప్రమాదానికి గురైంది. భారత స్థానిక కాలమానం ప్రకారం సోమవారం తెల్లవారుజామున జార్జిబుష్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో టేకాఫ్‌ అవుతుండగా దాని రెక్కలలో ఒకదాని నుంచి మంటలు చెలరేగాయి. దీంతో, వెంటనే అప్రమత్తమైన విమానాశ్రయ సిబ్బంది విమానంలో నుంచి ప్రయాణీకులను దింపేసారు. ఈ క్రమంలో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదని హ్యూస్టన్‌ ఫైర్‌ డిపార్ట్‌మెంట్‌ వెల్లడించింది. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. 

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement