Kidney transplantation
-
డీఆర్డీవో శాస్త్రవేత్తకు ఐదు కిడ్నీలు
ముంబై: రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ(డీఆర్డీవో)లో పనిచేసే శాస్త్రవేత్త శరీరంలో ఇప్పుడు ఒకటీ రెండూ కాదు.. ఏకంగా ఐదు కిడ్నీలున్నాయి. పనిచేసేది మాత్రం ఒకే ఒక్కటి..! జనవరి 8వ తేదీన ఫరీదాబాద్‌లోని అమృత ఆస్పత్రి (Amrita Hospital) వైద్య బృందం ఆయనకు అరుదైన ఆపరేషన్ చేపట్టి ఐదో మూత్రపిండాన్ని అమర్చింది. దాదాపు నాలుగు గంటలపాటు సాగిన ఈ సర్జరీ ఎంతో సంక్లిష్టమైందని వైద్యులు తెలిపారు. మూడోసారి కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ (Kidney Transplant) చేయడం ఎంతో అరుదైన విషయమన్నారు. దేశంలో అవయవ ట్రాన్స్‌ప్లాంటేషన్ సాంకేతికతలో ఇది కీలక మలుపని చెప్పారు.డీఆర్డీవో శాస్త్రవేత్త (DRDO Scientist) దేవేంద్ర బర్లేవర్(45) తీవ్రమైన కిడ్నీ వ్యాధితో 15 ఏళ్లపాటు ఇబ్బందిపడ్డారు. హైపర్‌టెన్షన్‌తో 2008లో రెండు మూత్రపిండాలు పనిచేయకుండా పోయాయి. దీంతో, ఆయనకు 2010లో, తిరిగి 2012లో సర్జరీ చేసి కిడ్నీలను మార్చారు. అవి ఫెయిలయ్యాయి. పుట్టుకతో ఉన్న రెండు కిడ్నీలు, ట్రాన్స్‌ప్లాంటేషన్‌తో అమర్చిన రెండు కలిపి మొత్తం నాలుగు మూత్రపిండాలున్నా ఆయన ఆరోగ్యం కుదుటపడలేదు. ఇదే సమయంలో 2022లో బర్లేవర్ కోవిడ్–19 బారినపడి తీవ్ర అనారోగ్యం పాలయ్యారు. దీంతో, ఆయనకు డయాలసిస్ (dialysis) తప్పనిసరయ్యింది.ఈయన్ను పరీక్షించిన ఫరీదాబాద్‌లోని అమృత ఆస్పత్రి వైద్యులు మరోసారి కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్‌కు సంసిద్ధత తెలిపారు. అదే సమయంలో, బ్రెయిన్‌డెడ్ అయిన ఓ రైతు కుటుంబం కిడ్నీ దానం చేసేందుకు ముందుకు వచ్చింది. అనుకోని ఈ అవకాశాన్ని వినియోగించుకునేందుకు వైద్య బృందం సిద్ధపడింది. అయితే, పనిచేయని నాలుగు కిడ్నీల వద్దే మరో కిడ్నీని అమర్చడం వారికి సవాల్‌గా మారింది. వ్యాధి నిరోధకతకు సంబంధించిన ప్రత్యేక సంక్లిష్టతలను వారు ముందుగా దాటాల్సి వచ్చింది.ఇందులో భాగంగా, కొత్త కిడ్నీని రోగి శరీరం తిరస్కరించకుండా చేసేందుకు ముందుగా ఇమ్యునో సప్రెషన్ అనే ప్రత్యేక ప్రక్రియ చేపట్టామని బృందంలో ఒకరైన డాక్టర్ అహ్మద్ కమాల్ చెప్పారు. రోగికి ఇప్పటికే హెర్నియా శస్త్రచికిత్స చేసినందున స్థల పరిమితి కారణంగా ఐదో మూత్రపిండాన్ని శరీరంలో అమర్చడమనే ప్రధాన సవాల్‌ను కూడా ఎదుర్కొన్నామని మరో వైద్యుడు అనిల్ శర్మ తెలిపారు.చదవండి: చిన్నవయసులోనే గుండెపోటు.. ఎందుకొస్తుందో తెలుసా?ఎట్టకేలకు నాలుగు గంటల అనంతరం ట్రాన్స్‌ప్లాంటేషన్ ప్రక్రియను విజయవంతంగా ముగించారు. కొత్త కిడ్నీ చక్కటి పనితీరు కనబరచడంతో పది రోజుల అనంతరం బర్లేవర్‌ను ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేశారు. రెండు వారాల్లో ఆయన శరీరంలో క్రియాటినిన్ స్థాయిలు సాధారణ స్థాయికి చేరుకున్నాయి. డయాలసిస్ అవసరం కూడా లేకుండా పోయింది. తిరిగి సంపూర్ణ ఆరోగ్యవంతుడైనందుకు దేవేంద్ర బర్లేవర్ సంతోషం వ్యక్తం చేశారు. రోజువారీ దినచర్యను ఎటువంటి ఇబ్బందులు లేకుండా తానే సొంతంగా పూర్తి చేసుకోగలుగుతున్నట్లు చెప్పారు. -
గుడ్ న్యూస్: హెచ్ఐవీ రోగుల మధ్య కిడ్నీ మార్పిడి సురక్షితమే!
తీవ్రమైన కిడ్నీసమస్యలతో బాధపడుతున్న హెచ్ఐవీ (HIV) రోగులకు భారీ ఊరట లభించనుంది. హెచ్ఐవీ ఉన్న వ్యక్తుల మధ్య కిడ్నీ మార్పిడి సురక్షితమని కొత్త అధ్యయనంద్వారా వెల్లడైంది. హెచ్ఐవీఉన్న వ్యక్తులు, ఎయిడ్స్ వైరస్‌తో జీవిస్తున్న వ్యక్తుల నుంచి కిడ్నీలను సురక్షితంగా స్వీకరించవచ్చని ఈ స్టడీ తేల్చింది. జీవించి ఉన్నపుడు ఇచ్చినా, లేదా మరణం తరువాత కిడ్నీలను దానం చేసినా రెండింటినీ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేయవచ్చని తెలిపింది.న్యూ ఇంగ్లాండ్ జర్నల్ ఆఫ్ మెడిసిన్‌లో బుధవారం ప్రచురించబడిన ఈ కొత్త అధ్యయనాన్ని అమెరికాలో నిర్వహించారు. 198 కిడ్నీ మార్పిడికేసులను పరిశీలించి, దానం చేసిన అవయవం ఎయిడ్స్ వైరస్ ఉన్న వ్యక్తి నుండి వచ్చినా లేదా లేని వ్యక్తి నుండి వచ్చినా ఇదే ఫలితాలను పరిశోధకులు గుర్తించారు. గత నెలలో, డిపార్ట్మెంట్ ఆఫ్ హెల్త్ అండ్ హ్యూమన్ సర్వీసెస్ పరిశోధనా అధ్యయనాల ప్రకారం ఈ రకమైన మూత్రపిండాలు , కాలేయ మార్పిడిని అనుమతించే నియమ మార్పును ప్రతిపాదించింది. దీనికి ఆమోదం లభిస్తే ఇది రాబోయే సంవత్సరంలో అమల్లోకి వస్తుందని రావచ్చు.హెచ్ఐవీ పాజిటివ్, కిడ్నీ ఫెయిల్ అయిన రోగులపై ఈ అధ్యయనం జరిగింది. HIV-పాజిటివ్‌తో మరణించిన దాత లేదా HIV-నెగటివ్ మరణించిన దాత నుండి అవయవాన్ని స్వీకరించి,నాలుగేళ్లపాటు ఈ పరిశోధన నిర్వహించారు. అలాగే హెచ్ఐవీ పాజిటివ్ దాతల నుంచి కిడ్నీలు పొందిన సగం మందిని హెచ్ఐవీ లేని దాతల నుంచి వచ్చిన వారితో పోల్చారు. వీరిలో 13మంది రోగులకు,ఇతర సమూహంలోని నలుగురికి వైరస్ స్థాయిలు పెరిగాయి. దీనికి హెచ్ఐవీ మందులను సరిగ్గా తీసుకోకపోవడం వల్ల ఇలా జరిగి ఉండవచ్చని NYU లాంగోన్ హెల్త్‌కు చెందిన అధ్యయన సహ-రచయిత డాక్టర్ డోరీ సెగెవ్ చెప్పారు. తమ పరిశోధన అద్భుతమైన ఫలితాలనిచ్చిందన్నారు. -
అవయవదానంతో ఇద్దరికి పునర్జన్మ
లబ్బీపేట(విజయవాడతూర్పు) : ఎన్టీఆర్ జిల్లా వెల్వడం గ్రామానికి చెందిన లక్ష్మమ్మ బ్రెయిన్ డెడ్‌కు గురికాగా.. ఆమె కుటుంబ సభ్యులు అవయవదానం చేసి ఇద్దరికి పునర్జన్మనిచ్చినట్టు అమెరికన్ కిడ్నీ ఇన్స్టిట్యూట్ వైద్యులు తెలిపారు. ఈ నెల 11న అవయవదానం చేయగా.. మూడేళ్లు, నాలుగేళ్లుగా డయాలసిస్ చేయించుకుంటూ జీవనం సాగిస్తున్న ఇద్దరికి, దాత నుంచి సేకరించిన కిడ్నీలను ట్రాన్స్‌ప్లాంట్ చేసినట్లు డాక్టర్ విట్టల్, డాక్టర్ స్వప్న తెలి పారు. ఆస్పత్రి ప్రాంగణంలో గురువారం వారు మీడియాతో మాట్లాడుతూ ఒకే రోజు ఏకకాలంలో రెండు కిడ్నీ మార్పిడి ఆపరేషన్లు చేయడం అరుదైన ఘటనగా చెప్పారు. యూరాలజిస్టులు డాక్టర్ ప్రశాంత్‌కుమార్, డాక్టర్ ధీరజ్, డాక్టర్ మురళీకృష్ణ పాల్గొన్నారు. -
NYU Langone: పంది కిడ్నీ పని చేసింది
న్యూయార్క్: కిడ్నీ మార్పిడి చరిత్రలో పెద్ద ముందడుగు. అమెరికాలో న్యూయార్క్ లోని ఎన్ వైయూ లాంగ్ వన్ హెల్త్ సంస్థ వైద్యులు ఓ బ్రెయిన్ డెడ్ రోగికి పంది కిడ్నీ అమర్చగా అది ఏకంగా నెల రోజుల పాటు చక్కగా పని చేసింది. మనిషికి పంది కిడ్నీ ఇన్ని రోజుల పాటు పని చేయడం ఇదే తొలిసారి. గతంలో న్యూయార్క్ వర్సిటీ, అలబామా వర్సిటీ చేసిన కిడ్నీ మారి్పడులు రెండు మూడు రోజుల పాటు మాత్రమే పని చేశాయి. అన్నీ కుదిరితే త్వరలో సాధారణ రోగులకు కూడా పంది కిడ్నీ అమర్చుతామని వైద్య బృందం అంటోంది. అయితే మనిషి వ్యాధి నిరోధకతకు పంది కిడ్నీ ఎలా పని చేస్తుందో కూడా చూస్తామని చెబుతోంది. అందుకోసం రెండో నెల కూడా కిడ్నీని అలాగే ఉంచి చూడనున్నారు. -
నాలుగు నెలలు 50 కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ సర్జరీలు
లక్డీకాపూల్ : అరుదైన రికార్డులకు చిరునామాగా నిలిచే నిజాం వైద్య విజ్ఞాన సంస్థ(నిమ్స్) మరో సరికొత్త రికార్డును నమోదు చేసింది. గత నాలుగు నెలల్లో 50 మూత్రపిండ మార్పిడి శస్త్ర చికిత్సలను విజయవంతంగా పూర్తి చేసి నిమ్స్ తన ప్రత్యేకతను చాటుకుంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఆరోగ్యశ్రీ ద్వారా రూ.15 లక్షలు ఖర్చయ్యే సర్జరీని పైసా ఖర్చు లేకుండా చేయడం విశేషం. కార్పొరేట్ ఆస్పత్రుల్లో సైతం సాధ్యం కాని ఈ అవయవ మార్పిడి ఆపరేషన్లతో 50 మంది జీవితాల్లో వెలుగులు నింపినట్లయింది. 2014 నుంచి ఇప్పటివరకు 862 కిడ్నీ మార్పిడి ఆపరేషన్లు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2014 నుంచి ఇప్పటి వరకు నిమ్స్ ఆసుపత్రి చరిత్రలో 862 కిడ్నీ మార్పిడి ఆపరేషన్లు జరిగాయి.గత ఏడాది 93 ఆపరేషన్లు జరగ్గా, ఈ ఏడాది కేవలం నాలుగు నెలల్లోనే 50 మూత్రపిండ మార్పిడి ఆపరేషన్లు విజయవంతంగా పూర్తయ్యాయి. జీవన్‌దాన్ కార్యక్రమం ద్వారా చాలా ఏళ్లుగా ఎదురుచూస్తున్న మూత్రపిండ మార్పిడి ఆపరేషన్‌ను అతి తక్కువ సమయంలో పూర్తి చేస్తున్నారు. నిమ్స్ యూరాలజీ విభాగం అధిపతి డాక్టర్ రాహుల్ దేవరాజ్ ఆధ్వర్యంలో వైద్య బృందం విశేషమైన సేవలు అందిస్తూ నిమ్స్ ఖ్యాతిని మరింత పెంచడంతో సఫలీకృతులవుతున్నారు. కాగా, 4 నెలల్లో 50 కిడ్నీ మార్పిడి సర్జరీలు చేసి, పునర్జన్మను ప్రసాదించిన నిమ్స్ వైద్యులను మంత్రి హరీశ్ రావు అభినందించారు. -
నేనే కిడ్నీ ఇద్దామనుకున్నా.. కానీ వద్దన్నారు: పంచ్ ప్రసాద్ భార్య
జబర్ధస్త్ కమెడియన్ పంచ్ ప్రసాద్ కొన్ని నెలలుగా కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న సంగతి తెలిసిందే. దీని కోసం ఆయన డయాలసిస్ చికిత్స తీసుకుంటున్నారు. అయితే చికిత్స తీసుకుంటున్నా ఆయన ఆరోగ్యం పూర్తిస్థాయిలో సహకరించడం లేదు. ఇటీవల రోజు రోజుకు కొత్త అనారోగ్య సమస్యలు ఆయన్ను చుట్టుముడుతున్నాయి. అయితే ప్రస్తుతం పంచ్ ప్రసాద్ అభిమానులకు ఓ శుభవార్త చెప్పింది ఆయన భార్య. కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేయాల్సి ఉండగా.. ఒక కిడ్నీ దొరికిందని ఆమె తమ యూట్యూబ్ ఛానెల్ ద్వారా వెల్లడించింది. పంచ్ ప్రసాద్ భార్య మాట్లాడుతూ.. 'ఫస్ట్ నేనే కిడ్నీ ఇద్దామనుకున్నా. ట్రాన్స్‌ప్లాంటేషన్‌కు ముందు నాకు అన్ని టెస్టులు చేశారు. అన్నింటిలోనూ మ్యాచ్ అయ్యాయి. కానీ ఆయనది వయసు చిన్నది కావడంతో డాక్టర్లు వద్దన్నారు. బయట నుంచి తీసుకుందాం అని చెప్పారు. మళ్లీ భవిష్యత్తులో సమస్యలు వస్తే మీ కిడ్నీ తీసుకునేలా ప్లాన్ చేద్దాం అన్నారు. ప్రస్తుతమైతే ట్రాన్స్‌ప్లాంటేషన్‌కు వెళ్తున్నాం. మీ అందరికీ చెప్పడానికి కారణం ఏంటంటే.. ఆయన ఆరోగ్యం కోసం ఇప్పటికీ చాలా టెస్టులు జరిగాయి. ఇప్పుడు కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్ గురించి ఆయన అభిమానులందరికీ తెలియజేయడం కోసం వీడియో చేశా. మమ్మల్ని ఆదరిస్తున్న మీ అందరికీ థ్యాంక్స్. ట్రాన్స్‌ప్లాంటేషన్ ప్రక్రియ ఇప్పటికే మొదలైంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మీతో పంచుకుంటూ ఉంటా. ఇలాంటి వీడియోలు పెడుతున్నందుకు ఏం అనుకోవద్దు. ఇది కేవలం మా ఛానెల్ ఆదరిస్తున్న వారందరికీ తెలియజేయడం కోసమే. మీ అందరీ ఆశీర్వాదంతోనే ఆయన కోలుకుంటున్నారని భావిస్తున్నా' అని అన్నారు. -
గర్వంగా ఉంది.. లాలూ కూతురిపై బీజేపీ ప్రశంసలు
ఢిల్లీ: మానవ సంబంధాల కంటే డబ్బుకి, సంఘంలో పేరుప్రతిష్టలు, పరపతికే ప్రాధాన్యం పెరిగిపోతోంది. ఈ క్రమంలో.. అయినవాళ్లను కూడా దూరంగా పెడుతున్నారు కొంతమంది. అయితే.. కన్నవాళ్ల కోసం, వాళ్ల ఆరోగ్యం కోసం తాపత్రయ పడే పిల్లలకు సమాజంలోని తల్లిదండ్రుల ఆశీర్వాదం ఎప్పుడూ ఉంటుంది. అలా.. రాజకీయ దిగ్గజం లాలూ ప్రసాద్ యాదవ్ కూతురు రోహిణి ఆచార్యపై ఇప్పుడు రాజకీయాలకు అతీతంగా సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి. బీజేపీ ఫైర్‌బ్రాండ్, బీహార్ నేత గిరిరాజ్ సింగ్.. లాలూ యాదవ్‌పై మామూలుగా విరుచుకుపడరు. అలాంటి వ్యక్తి.. లాలూ కూతురిపై ఆశ్చర్యకరంగా ప్రశంసలు గుప్పించారు. ‘‘రోహిణి ఆచార్య.. కూతురు అంటే నీలా ఉండాలి. నిన్ను చూస్తే గర్వంగా ఉంది. తర్వాతి తరాలకు నువ్వు(రోహిణిని ఉద్దేశిస్తూ..) ఒక ఆదర్శప్రాయంగా నిలిచావు అంటూ పోస్ట్ చేశారు. మరో బీజేపీ నేత నిషికాంత్ దుబే సైతం రోహిణిపై పొగడ్తలు గుప్పించారు. నాకు కూతురు లేదు. కానీ, ఇవాళ రోహిణిని చూశాక.. దేవుడితో పోరాడైన సరే నాకు ఓ కూతురిని ఇవ్వమని కోరాలని ఉంది అంటూ ట్వీట్ చేశారాయన. “बेटी हो तो रोहणी आचार्य जैसी” गर्व है आप पर… आप उदाहरण होंगी आने वाले पीढ़ियों के लिए । pic.twitter.com/jzg3CTSmht — Shandilya Giriraj Singh (@girirajsinghbjp) December 5, 2022 मुझे भगवान ने बेटी नहीं दी,आज रोहिणी आचार्य को देखकर सचमुच भगवान से लड़ने का दिल कर रहा है है,मेरी नानी हमेशा कहती थी,बेटा से बेटी भली जो कुलवंती हो pic.twitter.com/j0WSMfckjL — Dr Nishikant Dubey (@nishikant_dubey) December 5, 2022 ఇదిలా ఉంటే.. లాలూ పెద్ద కూతురు మీసా భారతి, బీహార్ డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్ సైతం గత సాయంత్రం లాలూ సర్జరీకి సంబంధించిన ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న 70 ఏళ్ల వయసున్న లాలూ ప్రసాద్ యాదవ్‌కు కిడ్నీ మార్పిడి అవసరమని వైద్యులు సూచించారు. దీంతో 40లో ఉన్న రోహిణి ఆచార్య.. తన కిడ్నీని తండ్రికి దానం ఇచ్చింది. సింగపూర్‌లో సోమవారం కిడ్నీ మార్పిడి ఆపరేషన్ విజయవంతమైంది. Ready to rock and roll ✌️ Wish me a good luck 🤞 pic.twitter.com/R5AOmFMW0E — Rohini Acharya (@RohiniAcharya2) December 5, 2022 -
లాలుకు విజయవంతంగా కిడ్నీ మార్పిడి
పట్నా: బిహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్‌కు కిడ్నీ మార్పిడి శస్త్ర చికిత్స విజయవంతంగా పూర్తయింది. సింగపూర్‌లో కిడ్నీ మార్పిడి ఆపరేషన్ పూర్తయిందని, ప్రస్తుతం ఆయనను ఐసీయూకి తరలించినట్లు బిహార్ ఉప ముఖ్యమంత్రి, ఆయన కుమారుడు తేజస్వీ యాదవ్ ట్విటర్ వేదికగా వెల్లడించారు. సింగపూర్‌లో నివసిస్తున్న లాలూ రెండో కుమార్తె రోహిణి ఆచార్య.. తండ్రికి కిడ్నీ దానం చేశారు. శస్త్ర చికిత్స తర్వాత ఆమె సైతం ఆరోగ్యంగా ఉన్నట్లు తెలిపారు తేజస్వీ యాదవ్. లాలూ ప్రసాద్ యాదవ్‌కు కిడ్నీ మార్పిడి సమయంలో ఆయన సన్నిహితుడు భోలా యాదవ్, కుమారుడు తేజస్వీ యాదవ్, రాజకీయ సలహాదారు సంజయ్ యాదవ్, బిహార్ మాజీ ముఖ్యమంత్రి రబ్రీ దేవి, పెద్ద కుమార్తే మిసా భారతిలు సింగపూర్ ఆసుపత్రిలోనే ఉన్నారు. 74 ఏళ్ల లాలూ యాదవ్ కొంతకాలంగా కిడ్నీ సంబంధిత సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. కొద్ది రోజుల క్రితం వైద్యం కోసం తన కూతురితో కలిసి సింగపూర్ వెళ్లారు. ఈ క్రమంలో తన తండ్రికి కిడ్నీ ఇచ్చి కొత్త జీవితాన్ని ఇవ్వాలి ఆయన కుమార్తె రోహిణి నిర్ణయం తీసుకున్నారు. पापा का किडनी ट्रांसप्लांट ऑपरेशन सफलतापूर्वक होने के बाद उन्हें ऑपरेशन थियेटर से आईसीयू में शिफ्ट किया गया। डोनर बड़ी बहन रोहिणी आचार्य और राष्ट्रीय अध्यक्ष जी दोनों स्वस्थ है। आपकी प्रार्थनाओं और दुआओं के लिए साधुवाद। 🙏🙏 pic.twitter.com/JR4f3XRCn2 — Tejashwi Yadav (@yadavtejashwi) December 5, 2022 ఇదీ చదవండి: ‘పాక్ బలహీనంగా ఉంది.. పీఓకేను వెనక్కి తీసుకోండి’: కాంగ్రెస్ -
లాలూ కుమార్తె గొప్ప మనసు.. తండ్రికి కిడ్నీ దానం చేసేందుకు..
బిహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కుమార్తె గొప్ప మనసు చాటుకున్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న తన తండ్రికి కొత్త జీవితం ఇచ్చేందుకు సిద్ధపడ్డారు. సింగపూర్‌లో నివసిస్తున్న లాలూ రెండో కుమార్తె రోహిణి ఆచార్య.. తండ్రికి కిడ్నీ దానం చేసేందుకు ముందుకొచ్చారు. కాగా 74 ఏళ్ల లాలూ యాదవ్ కొంతకాలంగా కిడ్నీ సంబంధిత సమస్యలతో ఇబ్బంది పడుతున్న విషయం తెలిసిందే. ఇటీవల వైద్యం కోసం కూతురుతో కలిసి ఆయన సింగపూర్ కూడా వెళ్లొచ్చారు. ప్రస్తుతం ఢిల్లీ ఎయిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో లాలూకి కిడ్నీ మార్పిడి ఆపరేషన్ అవసరమని వైద్యులు సూచించారు. దీంతో తండ్రికి తన కిడ్నీ దానం చేయాలని రోహిణి నిర్ణయించుకున్నారు. అయితే కూతురు ప్రతిపాదనను లాలూ మొదట్లో వ్యతిరేకించినట్లు తెలుస్తోంది. కానీ చివరికి రోహిణి ఒత్తిడి చేయడం, వైద్యుల సూచన మేరకు ఆయన అంగీకారం తెలిపినట్లు సమాచారం. దీంతో త్వరలోనే లాలూ సింగపూర్ వెళ్లబోతున్నారు. అక్కడే ఆయనకు కిడ్నీ మార్పిడి ఆపరేషన్ జరగనుంది. ఇక లాలూ ప్రసాద్ యాదవ్‌కు కిడ్నీ డొనేట్ చేసేందుకు ఆయన కుమార్తె రోహిణి ముందుకు రావడం పట్ల ఆర్జేడీ పార్టీ శ్రేణులతోపాటు పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆమెకు అభినందనలు తెలియజేస్తున్నారు. చదవండి: నీళ్లలో దూకాడు.. బీజేపీ తరపున జాక్‌పాట్ కొట్టాడు -
మూడు చక్రాలు తిరిగితేనే మూడుపూటలా తినేది.. అంతలోనే మాయదారి రోగం
సాక్షి,కాజీపేట అర్బన్: మూడు చక్రాలు తిరిగితేనే ఆ కుటుంబం మూడుపూటలా కడుపునిండా తినేది. చిన్న చిన్న సమస్యలు వచ్చినా ఎదుర్కొంటూ.. ఆనందంగా గడుపుతున్న చిన్న కుటుంబానికి పెద్ద కష్టం వచ్చిపడింది. ఆటో నడుపుతూ జీవనం సాగించే వ్యక్తికి రెండు కిడ్నీలు పాడై మంచానికే పరిమితం కావడంతో ఆ కుటుంబం దిక్కుతోచిన స్థితిలో పడింది. హనుమకొండ జిల్లా కాజీపేట మండలం దర్గా కాజీపేటలోని రామాలయం వీధికి చెందిన మునిగాల జాకోబ్ యాదయ్య, నాగమణమ్మ దంపతులకు ఇద్దరు కుమారులు. కాగా, తండ్రి యాదయ్య 2010లో కాలం చేయగా.. చిన్న కుమారుడు మునిగాల సందీప్ తన తండ్రి నుంచి వారసత్వంగా ఆటో డ్రైవర్ వృత్తిని ఎంచుకున్నాడు. 2014లో ఖమ్మం జిల్లాకు చెందిన సునీతను సందీప్ వివాహం చేసుకున్నాడు. (చదవండి: అడిగే దిక్కెవరు.. ఎక్కడ పడితే అక్కడే కోతలు.. మటన్.. మంచిదేనా? ) 2016లో కుటుంబంలో కిడ్నీ భారం.. ఆనందంగా సాగుతున్న సందీప్ జీవితానికి కిడ్నీ సమస్య శాపంగా మారింది. 2016 మార్చి నెలలో శరీరంలో పలు మార్పులు వస్తుండడంతో సందీప్ హైదరాబాద్‌లోని నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స నిమిత్తం వెళ్లగా, కిడ్నీలు 70 శాతం మేర శక్తిని కోల్పోయినట్లు వైద్యులు ధ్రువీకరించారు. దీంతో నాటి నుంచి రెండు కిడ్నీలకు డయాలసిస్ చేయించుకుంటున్నాడు. ఒక రోజు ఆటో.. మరో రోజు డయాలసిస్.. సందీప్ ఆటో నడిపితేనే గాని కుటుంబం గడవని స్థితి. దీనికితోటు డయాలసిస్ తప్పనిసరి. దీంతో ఒక రోజు ఆటోనడపగా వచ్చిన డబ్బులకు తోడు అప్పలు చేసి కుటుంబాన్ని పోషించడంతోపాటు డయాలసిస్ చేయించుకునేవాడు. ఆస్పత్రికి వెళ్లిన ప్రతీసారి డయాలసిస్, మందులకు కలిపి సుమారు రూ.10 నుంచి రూ.15వేల ఖర్చు అవుతుంది. తల్లి నాగమణెమ్మ తెలిసివారి దగ్గర అప్పులు చేస్తూ కొడుకు ఆరోగ్యం బాగుపడాలని ఖర్చు చేస్తుంది. అయితే ప్రస్తుతం ఒంట్లో సత్తువను కోల్పోయిన సందీప్ ఏడాది నుంచి మంచానికే పరిమితమైపోయాడు. దీంతో భార్య సునీత, తల్లి నాగమణమ్మ సందీప్‌కు మంచంపైనే సపర్యలు చేస్తున్నారు. (చదవండి: Vikarabad: ఇక్కడ డీజిల్ లీటర్ రూ.95, కర్ణాటకలో రూ. 85 ) డిసెంబర్లో కిడ్నీ మార్పిడి సందీప్‌కు రెండు కిడ్నీలు పాడైపోవడంతో తల్లి నాగమణెమ్మ కిడ్నీ ఇచ్చేందుకు అంగీకరించింది. అయితే కిడ్నీ మార్పిడి ఆపరేషన్‌కు రూ.7 నుంచి రూ.10లక్షల ఖర్చు అవుతుందని, డిసెంబర్లో చేయించుకుంటేనే ఫలితం ఉంటుందని వైద్యులు తేల్చి చెప్పారు. ఆటో నడిపే పరిస్థితి లేదు.. మరో వైపు అప్పుల భారం.. దిక్కుతోచని స్థితిలో దాతల ఆపన్న హస్తం కోసం ఎదురుచూస్తున్నాడు. దాతలారా.. స్పందించండి అకౌంట్ నంబర్ 261313898 కొటక్ మహీంద్రబ్యాంక్ కేకేబీకే0000572 వరంగల్ ఫోన్ పే నంబర్ : 70322 22148 చదవండి: Comments On Virat Kohli Daughter: కోహ్లీ కుమార్తెపై అనుచిత వ్యాఖ్యలు: వైరల్ కావడంతో ఆత్మహత్యకు ప్లాన్! -
ట్రాన్స్ ప్లాంటేషన్ లో సంచలనం
-
అందుకు భార్య సమ్మతి అవసరం లేదు: హైకోర్టు
సాక్షి, హైదరాబాద్: మూత్రపిండాల సమస్యతో బాధపడుతున్న చెల్లెలికి మూత్రపిండం దానం చేసేందుకు ముందుకొచ్చిన అన్నకు హైకోర్టులో ఊరట లభించింది. భార్య అనుమతి ఉంటే తప్ప కిడ్నీ దానం చేసేందుకు అనుమతించబోమంటూ అపోలో హాస్పిటల్స్ చేస్తున్న వాదనను న్యాయమూర్తి తోసిపుచ్చారు. భార్యాభర్తల మధ్య విడాకుల కేసు నడుస్తున్నందున భార్య సమ్మతి లేకుండానే కిడ్నీ దానానికి అనుమతించాలని, వెంటనే కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్ శస్త్రచికిత్స నిర్వహించాలని అపోలో ఆస్పత్రిని ఆదేశించారు. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ టి.అమర్నాథ్గౌడ్ మంగళవారం మధ్యంతర ఉత్తర్వులు జారీచేశారు. వివరాలు... నగరానికి చెందిన కె. వెంకట్ నరేన్ (39), బి.మాధురిలు అన్నాచెల్లెళ్లు. మాధురికి 2012లో వివాహమైంది. మూత్రపిండాల వ్యాధితో బాధపడుతున్న మాధురిని పరీక్షించిన అపోలో వైద్యులు ఆమెకు మూత్రపిండం ట్రాన్స్‌ప్లాంటేషన్ తప్పనిసరని తేల్చారు. వైద్య పరీక్షల అనంతరం వెంకట్ నరేన్ మూత్రపిండాన్ని అమర్చేందుకు అనుకూలంగా ఉందని నిర్ధారించారు. అయితే వెంకట్ నరేన్ భార్య సమ్మతి ఉంటే తప్ప ట్రాన్స్‌ప్లాంటేషన్ శస్త్రచికిత్స నిర్వహించబోమన్నారు. దీంతో వెంకట్ నరేన్ హైకోర్టును ఆశ్రయించారు. చదవండి: దళితబంధు పథకాలివే -
ఆర్థిక సాయం చేసి ఆదుకోండి: ప్రముఖ నటుడు
తమిళ సినిమా : ఆరోగ్యం క్షీణించడంతో వైద్య ఖర్చులకు కూడా డబ్బులేక బాధపడుతున్నానని కాబట్టి ఆర్థిక సాయం చేసి ఆదుకోవాల్సిందిగా బహుభాషా నటుడు పొన్నంబళం వేడుకుంటున్నారు. తెలుగు, తమిళం మొదలగు పలు భాషల్లో వివిధ పాత్రల్లో నటించి పేరు తెచ్చుకున్న నటుడు పొన్నంబళం. కొంత కాలం క్రితం అనారోగ్యానికి గురైన ఆయన చెన్నైలోని ఒక ప్రైవేట్ హాస్పిటల్లో వైద్య చికిత్స పొందుతున్న విషయం విదితమే. ఈ నేపథ్యంలో కిడ్నీ మార్పిడి చికిత్సకు సిద్ధమవుతున్నారు. ఈ సందర్భంగా సినీరంగంలోని ప్రముఖులను ఆర్ధిక సాయం చేయాల్సిందిగా వేడుకుంటున్నారు. ఈ మేరకు ఆయన శుక్రవారం మీడియాకు ఒక ప్రకటన విడుదల చేశారు. గత ఐదేళ్లుగా తన ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో ప్రాణాన్ని నిలుపుకోవడానికి పోరాడుతూ వచ్చానన్నారు. అయితే ప్రస్తుతం ఆ ప్రమాదం నుండి గట్టెక్కి కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ ఆపరేషన్ చేయించుకోవడానికి సిద్ధమయ్యానని పొన్నంబళం తెలిపారు. తన సహోదరి కొడుకు కిడ్నీ దానం ఇవ్వడానికి సంసిద్ధత వ్యక్తం చేసినట్లు తెలిపారు. అయితే ప్రస్తుతం ఎలాంటి ఆదాయం లేకపోవడంతో తన కుటుంబం ఆర్థిక పరిస్థితి బాగా లేక కూమిలిపోతోందన్నారు. ఇప్పటికే నటుడు రజనీకాంత్, కమల్ హాసన్, రాధిక శరత్ కుమార్, ధాను ధనుష్, కె ఎస్ రవికుమార్, రాఘవ లారెన్స్, ఐసరి గణేష్ వంటి ప్రముఖులు ఆర్ధిక సహాయం చేశారని తెలిపారు. కాగా ప్రస్తుతం కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ చికిత్సకు ఆర్థిక సాయం అవసరం ఉందని, దాతలు, దక్షిణ భారత నటీనటుల సంఘం, తెలుగు మా అసోసియేషన్ తరపున తగిన ఆర్ధిక సాయం అందించాలని నటుడు పొన్నంబళం వేడుకొన్నారు. చదవండి: చారిత్రాత్మక సినిమాలో సూర్య జాతిపితపై కంగనా సంచలన వ్యాఖ్యలు -
16 సార్లు అరెస్ట్ చేసిన వ్యక్తికే ప్రాణదానం
అలబామా : మేలు చేసిన వారికి సాయం చేయడం కృతజ్ఞత భావం.. 16 సార్లు కటకటాల్లోకి నెట్టిన వ్యక్తికి కిడ్నీ దానం చేసి జోసెలిన్ జేమ్స్ మానవత్వాన్ని చాటుకుంది. ఈ ఘటన అలబామాలో చోటుచేసుకుంది. అసలు విషయంలోకి వెళితే.. అలబామాకు చెందిన జోసెలిన్ జేమ్స్ .. కొన్ని సంవత్సరాల క్రితం మత్తు పదార్థాలకు బానిసగా మారింది. ఎంతలా అంటే జీవితంలో అన్ని బంధాలను వదులుకొని డ్రగ్స్‌నే తన ఆహారంగా చేసుకొని బతికేసింది. ఈ నేపథ్యంలోనే తను చేసే జాబ్, ఇష్టపడి కొనుక్కున్న కారు, ఇళ్లు కూడా అమ్మేసుకుంది. బతకడానికి దొంగతనాలు కూడా చేసింది. అనతికాలంలోనే జేమ్స్ అలబామాలో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్‌గా పేరు పొందింది. 2007 నుంచి 2012 వరకు దాదాపు 16 సార్లు టెర్రెల్ పాటర్ అనే పోలీస్‌కు చిక్కి అరెస్ట్ అయి జైలుకు వెళ్లి వచ్చింది. టెర్రెల్ పాటర్ కూడా ఈ జీవితాన్ని వదిలేసి మంచి మనిషిగా మారు అని ఎన్నోసార్లు చెప్పిచూశాడు. టెర్రెల్ పాటర్ అనే వ్యక్తి మళ్లీ ఆమె జీవితంలోకి వస్తాడని బహుశా అప్పుడు ఊహించి ఉండదు. (చదవండి :మొత్తం పోయింది: కాలిఫోర్నియా బాధితుల ఆవేదన) ఇదలాఉండగా.. జేమ్స్ ఒకరోజు ఇంట్లోనే టీవీ చూస్తుండగా.. మోస్ట్ వాంటెడ్ అనే వార్త ఆమెను షాక్‌కు గురయింది. ఎందుకంటే మోస్ట్ వాంటెడ్ అని చూపిస్తుంది ఎవరిదో కాదు.. జోసెలిన్ జేమ్స్ దే. అప్పుడు తనకు అర్థమయింది.. తాను ఏ స్టేజీలో ఉన్నానో.. ఇక ఈ జీవితం వద్దని చెప్పి నేరుగ అధికారుల వద్ద లొంగిపోయింది. ఆరు నెలల జైలు జీవితం గడిపి బయటకు వచ్చిన జేమ్స్ నేరుగా డ్రగ్ అడిక్షన్ సెంటర్‌కు వెళ్లి తొమ్మిది నెలలు అక్కడే రీహాబిటేట్‌గా మార్చుకుంది. అక్కడి నుంచి జేమ్స్ జీవితం పూర్తిగా మారిపోయింది. ప్రస్తుతం జేమ్స్ తనలాగే డ్రగ్స్‌కు అలవాటు పడి జీవితాలను నాశనం చేసుకుంటున్న మహిళను ఆ మహమ్మారి నుంచి రక్షించే పనిని చేస్తుంది. ఒకరోజు జేమ్స్ తన ఫేస్బుక్ ఓపెన్ చేయగా.. టెర్రెల్ పాటర్ కిడ్నీ దెబ్బతిన్నాయని.. కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్ కోసం దాత అవసరం ఉందని టెర్రెల్ కూతురు షేర్ చేసిన పోస్ట్ కనిపించింది. వెంటనే టెర్రెల్ కూతురును కలిసి కిడ్నీని దానమిచ్చేందుకు తాను సిద్దమని తెలిపింది. గత జూలైలో వాండెర్‌బిల్ట్ యునివర్సీటీ మెడికల్ హెల్త్ సెంటర్లో టెర్రెల్‌కు కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్ విజయవంతంగా జరిగింది. ఇప్పుడు జేమ్స్, టెర్రెల్ ఆరోగ్యంతోనే ఉన్నారు.(చదవండి : విషాద జ్ఞాపకానికి 19 ఏళ్లు..) ఇదే విషయమై టెర్రెల్ స్పందిస్తూ.. ' నా అనుకున్నవారు సాయం చేయడానికి ఎవరు ముందుకు రాలేదు. అలాంటిది పోలీస్ ఆఫీసర్‌గా 16 సార్లు జైలుకు పంపించిన అమ్మాయి వచ్చి నాకు కిడ్నీ ఇవ్వడం ఆశ్చర్యం కలిగించింది. ఆశ్చర్యం ఎందుకంటే.. నాకు కిడ్నీ దానం చేస్తమని ఒక వంద మంది ముందుకు వస్తే అందులో జేమ్స్ పేరు కచ్చితంగా ఉండదనే అనుకుంటాం. ఎందుకంటే ఆమెను అరెస్టు చేసి జైలుకు పంపించిన తర్వాత మళ్లీ నాకు కనిపించలేదు.. సరైన కాంటాక్ట్ కూడా లేదు.. కానీ దేవుడు మా ఇద్దరిని ఈ విధంగా కలుపుతాడని మాత్రం నేను ఊహించలేదు అంటూ టెర్రెల్ ఉద్వేగంతో పేర్కొన్నాడు. -
అమర్‌సింగ్ కన్నుమూత
న్యూఢిల్లీ: రాజ్యసభ సభ్యుడు, సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ) మాజీ నేత అమర్‌సింగ్(64) కన్నుమూశారు. సింగపూర్‌లోని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం కన్నుమూశారు. 2011లో ఆయనకు కిడ్నీ మార్పిడి జరిగింది. చాలా కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన మరో కిడ్నీ మార్పిడి కోసం 8 నెలల క్రితం సింగపూర్‌లోని ఆస్పత్రిలో చేరారు. పరిస్థితి విషమించి శనివారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు. ఆయనకు భార్య పంకజకుమారి, కుమార్తెలు దృష్టి, దిశ ఉన్నారు. అమర్‌సింగ్ మృతికి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధాని మోదీ సహా పార్టీలకతీతంగా పలువురు ప్రముఖులు సంతాపం ప్రకటించారు. ‘అమర్‌సింగ్ మరణం ఎంతో విచారం కలిగించింది. ఆయన సమర్థుడైన పార్లమెంటేరియన్. బహుముఖ ప్రజ్ఞాశాలి. ఆయన కుటుంబసభ్యులు, శ్రేయోభిలాషులకు ప్రగాఢ సానుభూతి’అని రాష్ట్రపతి కోవింద్ ట్విట్టర్లో పేర్కొన్నారు. ప్రముఖుల సంతాపం అమర్‌సింగ్ కుటుంబసభ్యులకు ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు ప్రగాఢ సానుభూతి తెలిపారు. దేశంలో సంభవించిన కీలక రాజకీయ పరిణామాలకు ప్రత్యక్ష సాక్షి అయిన అమర్‌సింగ్ గొప్ప ప్రజానాయకుడని ప్రధాని మోదీ కొనియాడారు. అందరితో కలివిడిగా మెలిగే అమర్‌సింగ్ మంచి రాజకీయ నేత, వ్యూహకర్త అని బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా పేర్కొన్నారు. ఎస్పీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ ట్విట్టర్లో తన తండ్రి, పార్టీ వ్యవస్థాపకుడు ములాయంతో అమర్‌సింగ్ ఫొటోను ట్విట్టర్లో షేర్ చేశారు. ఆయన కుటుంబసభ్యులు ప్రగాఢ సానుభూతి తెలిపారు. అమర్‌సింగ్ మృతికి కాంగ్రెస్ చీఫ్ సోనియాగాంధీ సంతాపం ప్రకటించారు. రాజకీయ నేపథ్యం లేకుండానే... 1956 జనవరి 27న∙ఉత్తరప్రదేశ్‌లోని ఆజంగఢ్‌లో జన్మించిన అమర్‌సింగ్‌కు ఎలాంటి రాజకీయ నేపథ్యం లేదు. ఎస్పీ అధినేత ములాయం సింగ్‌కు అత్యంత సన్నిహితుడిగా పలుకుబడిగల నేతల్లో ఒకరిగా ఎదిగారు. 2008లో అప్పటి యూపీఏ ప్రభుత్వం అమెరికాతో కుదుర్చుకున్న అణు ఒప్పందానికి వ్యతిరేకంగా వామపక్షాలు యూపీఏ నుంచి వైదొలగడంతో కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రభుత్వం ప్రమాదంలో పడింది. ఆ సమయంలో ఎస్పీ ప్రధాన కార్యదర్శిగా ఉన్న అమర్.. ఎస్పీ మద్దతుతో యూపీఏ ప్రభుత్వాన్ని కాపాడటంలో కీలకపాత్ర పోషించారు. యూపీ నుంచి రాజ్యసభకు తొలిసారిగా 1996లో ఎన్నికయ్యారు. 2003, 2016లో రాజ్యసభ సభ్యుడయ్యారు. 1996 నుంచి 2010లో బహిష్కరణకు గురయ్యే వరకు ఆయన ఎస్పీలో కీలక నేతగా కొనసాగారు. అనిల్ అంబానీ, అమితాబ్ బచ్చన్, ‘సహారా’ సుబ్రతా రాయ్ తదితరులతో ఆయనకు సన్నిహిత సంబంధాలున్నాయి. సినీనటి జయప్రద ఎస్పీలో చేరడం వెనుక అమర్ హస్తం ఉందని అంటుంటారు. అమితాబ్ కుటుంబంతో సన్నిహిత సంబంధాలున్నాయి. 2016లో ఆయన అమితాబ్ భార్య జయా బచ్చన్‌పై సంచలన వ్యాఖ్యలు చేయడంతో అంతరం పెరిగింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలపై ఆయన్ను సమాజ్‌వాదీ పార్టీ 2010లో బహిష్కరించింది. ఓటుకు నోటు కుంభకోణంలో 2011లో అరెస్టయ్యారు. అయినప్పటికీ, 2016లో ఎస్పీ మద్దతుతోనే స్వతంత్ర అభ్యర్ధిగా రాజ్యసభకు ఎన్నికయ్యారు. 2016లో తిరిగి పార్టీలో చేర్చుకున్న ములాయం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు అప్పగించారు. అయితే, ఆ తర్వాత ఎస్పీ పగ్గాలు చేపట్టిన అఖిలేశ్ యాదవ్ 2017లో ఆయన్ను పార్టీ నుంచి బహిష్కరించారు. ఎస్పీ నుంచి దూరమైన అమర్‌సింగ్ ప్రధాని మోదీకి, బీజేపీ మాతృసంస్థ ఆర్ఎస్ఎస్కు దగ్గరయ్యారు. ఆజంగఢ్‌లో ఉన్న తమ పూర్వీ కుల ఆస్తులను ఆర్ఎస్ఎస్కు విరాళంగా అందజేస్తానని ప్రకటించారు. -
కిడ్నీల మార్పిడిలో భార్యల గొప్ప మనసు
సాక్షి బెంగళూరు: సాధారణంగా బ్రెయిన్‌డెడ్ అయిన వ్యక్తుల నుంచి సేకరించిన అవయవాలను రోగులకు అమర్చుతారు. ఇక్కడ మాత్రం ఇద్దరు రోగుల భార్యల మూత్రపిండాలను మార్చి అమర్చారు. వివరాలు... బెంగళూరులోని ఓ కార్పొరేట్ ఆస్పత్రిలో సంతోష్, మరో ఆస్పత్రిలో క్రిష్ణ అనే మూత్రపిండాల రోగులు చికిత్స పొందుతున్నారు. వీరికి మూత్రపిండాల మార్పిడి చేయడమే పరిష్కారమని వైద్యులు తేల్చారు. కిడ్నీలను దానం చేసేందుకు వారి భార్యలు ముందుకొచ్చినప్పటికీ జత కాలేదు. అయితే సంతోష్‌కు క్రిష్ణ భార్య మూత్రపిండం, క్రిష్ణకు సంతోష్ భార్య మూత్రపిండం సరిపోతాయని వైద్యుల పరీక్షల్లో తేలింది. దీంతో నలుగురికీ అవగాహన కల్పించి అవయవ మార్పిడికి సిద్ధం చేశారు. ఇరువురు మహిళల నుంచి కిడ్నీలను సేకరించి సంతోష్, క్రిష్ణలకు అమర్చారు. ఇలా ఇచ్చిపుచ్చుకునే స్వాప్ ట్రాన్స్‌ప్లాంటేషన్ ఇదే తొలిసారి అని వైద్యులు చెబుతున్నారు. గ్రీన్ కారిడార్‌ను ఏర్పరచి రెండు ఆస్పత్రుల నుంచి 15–20 నిమిషాల్లో మూత్రపిండాలను తరలించారు. రోగులకు విజయవంతంగా కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సలు నిర్వహించినట్లు వైద్యులు తెలిపారు. -
జైట్లీకి కిడ్నీ మార్పిడి
న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ(65)కి సోమవారం నిర్వహించిన మూత్రపిండ మార్పిడి శస్త్రచికిత్స విజయవంతమైంది. ప్రస్తుతం జైట్లీతోపాటు ఆయనకు కిడ్నీ దానం చేసిన వ్యక్తి ఆరోగ్య పరిస్థితి కూడా నిలకడగా ఉందని ఢిల్లీలోని ఎయిమ్స్ (ఆలిండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్) వైద్య బృందం తెలిపింది. సోమవారం ఉదయం 8.30 గంటలకు మొదలైన శస్త్రచికిత్స నాలుగున్నర గంటలపాటు సాగింది. అనంతరం ఆయనను ఐసీయూకి తరలించి నిరంతరం పర్యవేక్షిస్తున్నామని వైద్యులు తెలిపారు. 20 మంది వైద్యులతో కూడిన బృందం జైట్లీకి శస్త్రచికిత్స నిర్వహించింది. జైట్లీ దూరపు బంధువు, మధ్య వయస్కురాలైన ఓ మహిళ తన మూత్రపిండాన్ని దానమిచ్చేందుకు ముందుకు రావడంతో సోమవారం కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సను నిర్వహించారు. అంతకు కొద్దిసేపటి ముందు ప్రధాన మంత్రి మోదీ జైట్లీతో మాట్లాడారు. -
బ్లడ్ గ్రూప్ వేరైనా కిడ్నీ మార్పిడి
సాక్షి, హైదరాబాద్: బంజారాహిల్స్ కేర్ ఆస్పత్రిలో అరుదైన కిడ్నీ మార్పిడి శస్త్ర చికిత్స నిర్వహించారు. బ్లడ్ గ్రూప్ వేరైనా కిడ్నీ మార్పిడిని విజయవంతంగా చేశారు. ‘బి’పాజిటివ్ బ్లడ్‌గ్రూప్ స్వీకర్తకు ‘ఎ’పాజిటివ్ దాత కిడ్నీని ‘ఏబీవో ఇన్‌కాంపిటెబుల్’పద్ధతిలో వైద్యులు విజయవంతంగా అమర్చారు. ప్రస్తుతం దాత, స్వీకర్తలిద్దరూ కోలుకుని ఆరోగ్యంగా ఉన్నారు. గురువారం ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సర్జరీకి సంబంధించిన వివరాలను నెఫ్రాలజీ వైద్యనిపుణుడు డాక్టర్ విక్రాంత్‌రెడ్డి వెల్లడించారు. అస్సాంకు చెందిన నిలాధన్ సింఘా(42) కిడ్నీ సంబంధిత సమస్యతో కేర్ ఆస్పత్రి వైద్యులను ఆశ్రయించాడు. వైద్యులు పరీక్షించి కిడ్నీ పనితీరు దెబ్బతిన్నట్లు గుర్తించారు. క్రియాటిన్ 16.0 గా నమోదైంది. యాంటీబాడీస్ బాగా తగ్గిపోవడంతో కిడ్నీ మార్పిడి అనివార్యమైంది. స్వీకర్త బ్లడ్ గ్రూప్‌నకు సంబంధించిన దాతలెవరూ కిడ్నీ దానానికి ముందుకు రాలేదు. చివరకు ఆయన భార్య లువాంగ్ సింఘా(37) కిడ్నీ ఇచ్చేందుకు ముందుకు వచ్చింది. అయితే, స్వీకర్త బ్లడ్‌గ్రూప్ ‘బి’పాజిటివ్ కాగా, దాతది ‘ఎ’పాజిటివ్. సాధారణంగా రెండు వేర్వేరు బ్లడ్‌గ్రూప్‌ల మధ్య అవయవదాన మార్పిడి శస్త్ర చికిత్సలు చేయరు. ఒకవేళ చేసినా స్వీకర్త శరీరం దాత అవయవాన్ని తిరస్కరిస్తుంది. చికిత్సకు మరోదారి లేకపోవడంతో వైద్యులు ఏప్రిల్ మొదటివారంలో ‘ఏబీవో ఇన్‌కాంపిటెబుల్ ట్రాన్స్‌ప్లాంటేషన్’పద్థతిలో విజయవంతంగా శస్త్రచికిత్స చేశారు. -
నేడు జైట్లీకి కిడ్నీ మార్పిడి ఆపరేషన్
న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీకి ఎయిమ్స్ (ఆలిండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్)లో ఆదివారం కిడ్నీ మార్పిడి ఆపరేషన్ నిర్వహించనున్నారు. శనివారం పలు పరీక్షలు నిర్వహించిన వైద్యులు ఆయనను ఒకరోజు పరిశీలనలో ఉంచారు. కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ ఆపరేషన్ చేయించుకునే వారిని ఒకరోజు అబ్జర్వేషన్లో ఉంచడం సాధారణమేనని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. ఆపరేషన్‌కు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి కాగా, కిడ్నీ దాత సిద్ధంగా ఉన్నారు. నెఫ్రాలజిస్ట్ డాక్టర్ సందీప్ గులేరియా ఈ ఆపరేషన్‌ను పర్యవేక్షించనున్నారు. -
సాక్షి సలాం..!
-
డిప్యూటీ సీఎంకు స్వైన్‌ఫ్లూ నిజమే
ఆందోళన చెందాల్సిన అవసరం లేదు రాష్ట్రంలో పోలియో నియంత్రణలో ఉంది వైద్య ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి వెల్లడి హైదరాబాద్: రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీకి స్వైన్‌ఫ్లూ సోకినట్లు నిర్ధారణ అయిందని, ఈ విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నట్లు వైద్య ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ సి.లక్ష్మారెడ్డి తెలిపారు. ఆదివారం హైదరాబాద్‌లోని ఫిలింనగర్లో పోలియో చుక్కల కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం ఆయన మాట్లాడారు. గత రెండు, మూడేళ్లలో రాష్ట్రంలో స్వైన్‌ఫ్లూ కేసుల సంఖ్యతో పాటు మరణాల శాతం కూడా బాగా తగ్గిందని చెప్పారు. స్వైన్‌ఫ్లూ వ్యాధిని నయం చేసేందుకు అన్ని రకాల వసతులు, మందులు ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉన్నాయని అన్నారు. రాష్ట్రంలో పోలియోపై పూర్తి స్థాయిలో నివారణ ఉన్నప్పటికీ దేశ వ్యాప్తంగా నిర్వహిస్తున్నందున పోలియో చుక్కల కార్యక్రమాన్ని చేపట్టామని మంత్రి లక్ష్మారెడ్డి తెలిపారు. కిడ్నీ బాధితులకు ఉచిత మందులు కిడ్నీ మార్పిడి చేయించుకున్న రోగులకు జీవితకాలం ఉచితంగా మందులు అందిస్తా మని, త్వరలో దీనిపై కార్యాచరణ ప్రకటిస్తా మని లక్ష్మారెడ్డి తెలిపారు. మరో 40 డయాల సిస్ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. అగర్వాల్ సమాజ్ సహాయతా ట్రస్ట్ రూ.70 లక్షలతో గాంధీ ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన డయాలసిస్ సెంటర్‌ను మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, తలసాని శ్రీనివాస్‌యాదవ్‌తో కలసి ఆయన ప్రారంభించారు. అనంతరం లక్ష్మారెడ్డి మాట్లా డుతూ ప్రస్తుతం సుమారు 8 వేల మంది కిడ్నీ రోగులకు డయాలసిస్ సేవలు అంది స్తున్నట్లు తెలిపారు. త్వరలోనే నాన్ కమ్యూని కబుల్ డిసీజెస్ సెంటర్లనూ అందుబాటులోకి తీసుకు రానున్నట్లు తెలిపారు. నిరుపేద రోగుల కోసం డయాలసిస్ సెంటర్‌ను ఏర్పాటు చేసిన ట్రస్ట్ నిర్వాహకు లను అభినందించారు. ఈ కార్యక్రమంలో వైద్య శాఖ కార్య దర్శి రాజేశ్వర్ తివారీ, డీఎంఈ రమణి, గాంధీ్ర పిన్సిపాల్ బీవీఎస్ మంజుల, సూప రింటెండెంట్ జేవీ రెడ్డి, అగర్వాల్ ట్రస్ట్ నిర్వాహకులు కరోడిమల్ అగర్వాల్, రాజేష్ కుమార్, కపూర్‌చంద్, నరేశ్‌కుమార్ చౌదరి, దుర్గాప్రసాద్ నరెటా పాల్గొన్నారు. -
చరిత్ర సృష్టించారు
గుండెమార్పిడిలో గుంటూరు జీజీహెచ్ వైద్యుల రికార్డు బ్రెయిన్‌డెడ్ వ్యక్తి గుండె మరొకరికి అమరిక పేద కుటుంబంలో వెలుగులు నింపిన వైద్యులు రూ.30 లక్షల వ్యయమయ్యే ఆపరేషన్ ఉచితంగా.. ఉదయం 11 నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు శస్త్రచికిత్స ఉద్విగ్న క్షణాల నడుమ విజయవంతం .. గుండెమార్పిడిలో మొట్టమొదటి ప్రభుత్వాస్పత్రిగా జీజీహెచ్‌కు గుర్తింపు డాక్టర్ ఆళ్ల గోపాలకృష్ణ గోఖలే కృషి ఫలితమేనంటూ అభినందనలు మొన్న జాయింట్ రీ ప్లేస్మెంట్.. నిన్న కిడ్నీ మార్పిడి.. నేడు గుండె మార్పిడితో గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆస్పత్రి చరిత్ర సృష్టించింది. కార్పొరేట్ ఆస్పత్రుల్లో మాత్రమే లభించే సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలను జీజీహెచ్‌లో పేదలకు ఉచితంగా అందిస్తున్నారు. రాష్ట్రంలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో గుండెమార్పిడి చేసిన మొట్టమొదటి ఆస్పత్రిగా గుంటూరు జీజీహెచ్ రికార్డు నిలిచింది. డాక్టర్ ఆళ్ల గోపాలకృష్ణ గోఖలే ఆధ్వర్యంలో శుక్రవారం జీజీహెచ్‌లో గుండెమార్పిడి ఆపరేషన్ విజయవంతంగా నిర్వహించారు. గుంటూరు మెడికల్ : సహృదయ హెల్త్, మెడికల్ అండ్ ఎడ్యుకేషనల్ ట్రస్టు చైర్మన్, ప్రముఖ గుండె మార్పిడి శస్త్రచికిత్స నిపుణుడు ఆళ్ల గోపాలకృష్ణ గోఖలే సుమారు రూ.30 లక్షలు ఖరీదుచేసే గుండె మార్పిడి ఆపరేషన్‌ను గుంటూరుకు చెందిన ఉప్పు ఏడుకొండలుకు ఉచితంగా చేశారు. ప్రభుత్వం గుండెమార్పిడి ఆపరేషన్ చేసేందుకు డాక్టర్ గోఖలేకు అనుమతులు ఇచ్చినప్పటికీ నిధులు మంజూరు చేయలేదు. దీంతో దాతల సహాయంతో సహృదయ ట్రస్టు ఆధ్వర్యంలో ఉచితంగా గుండెమార్పిడి ఆపరేషన్ జరిగింది. జీజీహెచ్‌లో సహృదయ ట్రస్టు 2015 మార్చి 18 నుంచి గుండె ఆపరేషన్లు నిర్వహిస్తోంది. సుమారు 200 వరకు గుండె ఆపరేషన్లు ట్రస్టు ఆధ్వర్యంలో జరిగాయి. మొట్టమొదటి గుండెమార్పిడి సర్జన్ గోఖలే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తొలిసారిగా గుండె, ఊపిరితిత్తుల మార్పిడి ఆపరేషన్లు చేసిన వ్యక్తిగా డాక్టర్ గోఖలే పేరు రికార్డుల్లో ఉంది. సుమారు పదివేలకు పైగా గుండె శస్త్రచికిత్సలు చేయగా, 22 వరకూ గుండెమార్పిడి ఆపరేషన్లు చేశారు. 2015లో ఉగాది పురస్కారం, 2016లో పద్మశ్రీ అవార్డుతో ప్రభుత్వం సత్కరించింది. అవరోధాలు అధిగమించి.. జీజీహెచ్‌లో డాక్టర్ గోఖలే ఆధ్వర్యంలో సహృదయ ట్రస్టు ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా ఉచితంగా గుండె మార్పిడి ఆపరేషన్ చేయాలని నిర్ణయించుకున్నారు. 2015 జనవరి నుంచే గుండె మార్పిడి ఆపరేషన్ చేసేందుకు పలువురు రోగులకు అన్ని రకాల వైద్య పరీక్షలు చేసి సిద్ధం చేసుకున్నారు. సుమారు పదిమంది వరకూ గుండెమార్పిడి ఆపరేషన్ రోగులకు పరీక్షలు పూర్తయ్యాయి. బ్రెయిన్‌డెడ్ కేసు నుంచి గుండెను సేకరించి జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్న గుండె రోగులకు అమర్చేందుకు రెండుసార్లు ప్రయత్నాలు చేశారు. జీజీహెచ్‌కు వచ్చిన బ్రెయిన్ డెడ్ కేసును నిర్ధారణ చేసేందుకు వైద్యులు సకాలంలో స్పందించకపోవడం వల్ల ఆ రెండు కేసులూ చనిపోయాయి. వైద్యుల మధ్య సహకారలోపం వల్లే రెండు నెలల క్రితం నుంచి గుండెమార్పిడి ఆపరేషన్ వాయిదా పడుతూ వచ్చింది. దీంతో ప్రైవేట్ ఆస్పత్రిలోనే బ్రెయిన్‌డెడ్ కేసు నుంచి గుండెను తీసుకొచ్చి విజయవంతంగా ఆపరేషన్ చేశారు. ఆ ఇంట ఆనందం పునర్జన్మనిచ్చారు నా భర్త ఉప్పు ఏడుకొండలుకు గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆస్పత్రి వైద్యులు, డాక్టర్ గోఖలే పునర్జన్మనిచ్చారు. కొంతకాలంగా గుండెజబ్బుతో బాధపడుతున్న నా భర్తకు నగరంలోని పలు ఆస్పత్రుల్లో వైద్యం చేయించినా తగ్గలేదు. గుండె మార్పిడి ఆపరేషన్ చేయాలని, అందుకోసం రూ.30 లక్షల వరకూ ఖర్చవుతుందని ప్రైవేట్ వైద్యులు చెప్పారు. ఆయన డ్రైవర్‌గా పనిచేస్తున్నారు. ముగ్గురు పిల్లలతో కుటుంబాన్ని పోషించేందుకు జీతం సరిపోకపోవడంతో నేను కూడా ఇళ్లల్లో పనులు చేస్తూ ఆయనకు చేదోడువాదోడుగా ఉంటున్నాను. అనారోగ్యంతో ఏడాదిగా డ్రైవర్ ఉద్యోగం మానేసి ఇంట్లోనే ఉంటున్నారు. కుటుంబ పోషణే కష్టంగా మారింది. అంతమొత్తంలో డబ్బు ఖర్చు పెట్టలేక నా భర్తపై ఆశలు వదిలేసుకున్నాను. నా భర్త ఓ డాక్టర్ వద్ద డ్రైవర్‌గా పనిచేస్తుండటంతో ఆయన సూచన మేరకు ఆరు నెలల క్రితం జీజీహెచ్‌కు వచ్చాం. డాక్టర్ గోఖలే ఆరునెలలుగా మాకు ఉచితంగా వైద్య సేవలు అందిస్తూ గుండెమార్పిడి ఆపరేషన్ చేస్తామని భరోసా ఇచ్చారు. గుండెకోసం ఇన్ని రోజులు వేచి ఉన్నాం. ఈ శుక్రవారం జీవితంలో నాకు మరిచిపోలేని రోజు. జీజీహెచ్ వైద్యులకు, డాక్టర్ గోఖలేకు రుణపడి ఉంటాను. - ఓర్ప (ఉప్పు ఏడుకొండలు భార్య) ఇద్దరూ ఏడుకొండలే.. ఇద్దరూ డ్రైవర్లే.. విజయవాడలోని అజిత్‌సింగ్‌నగర్‌కు చెందిన ఇమడాబత్తుని ఏడుకొండలు (44) ఈనెల 13న రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. ఈనెల 19వ తేదీన మంగళగిరి ఎన్నారై వైద్యులు బ్రెయిన్‌డెడ్‌గా నిర్ధారించారు. ఆయన భార్య నాగమణి అవయవదానం చేసేందుకు ముందుకు రావడంతో గుంటూరు స్వర్ణభారతి నగర్ సీబ్లాక్ మూడో వీధికి చెందిన ఉప్పు ఏడుకొండలుకు విజయవంతంగా గుండె అమర్చారు. గుండెదానం చేసినవారు, గుండెను స్వీకరించిన వారు ఇద్దరి పేర్లు ఏడుకొండలు కాగా, ఇద్దరూ డ్రైవర్లే కావడం మరో విశేషం. ఉదయం 11 నుంచి సాయంత్రం 4.30 గంటల వరకూ ఆపరేషన్ జరిగింది. డాక్టర్ గోఖలేతో పాటు సర్జన్లు డాక్టర్ శ్రీనివాస్, డాక్టర్ సుబ్రహ్మణ్యం, మత్తు వైద్య నిపుణుడు సుధాకర్, డాక్టర్ భరద్వాజ్, డాక్టర్ షరీఫ్, డాక్టర్ అనూష ఈ ప్రక్రియలో పాల్గొన్నారు. - గుంటూరు మెడికల్ ఓ ఇంట అంతులేని విషాదం.. మరో ఇంట అవధుల్లేని ఆనందం.. ఓ కంట విషాదాశ్రు ప్రవాహం.. మరో కంట ఆనంద బాష్ప జలపాతం.. హృదయంలో అటు ఉద్వేగం.. ఇటు ఉత్తేజం.. అర్థంతరంగా ముగిసిన ఓ జీవన పయనం ఆరిపోతున్న ఆరు దీపాలను వెలిగించింది. ఈ ప్రాణదానంతో ఆగిపోతున్న ఓ గుండె ఊపిరిపోసుకుని పేద కుటుంబానికి చిరుదివ్వె అయ్యింది. రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలై మంగళగిరి ఎన్నారైలో చికిత్స పొందుతున్న విజయవాడకు చెందిన ఇమడాబత్తుని ఏడుకొండలు గుండెను గుంటూరు జీజీహెచ్‌లో మరణానికి చేరువైన ఉప్పు ఏడుకొండలుకు అమర్చి ప్రాణదానం చేశారు. ఇద్దరు ఏడుకొండలు మధ్య సాగిన ఈ గుండెమార్పిడి శస్త్రచికిత్సను ఊపిరి తెగే ఉద్రిక్త క్షణాల మధ్య గుంటూరు జీజీహెచ్ వైద్యులు శుక్రవారం విజయవంతంగా పూర్తిచేశారు. -
బతకాలని ఉంది
♦ బీఎడ్ పట్టభద్రురాలి ఆక్రందన ♦ రెండు కిడ్నీలు పాడై దాతల కోసం ఎదురుచూపు ఒంగోలు సెంట్రల్: బీఎడ్ పూర్తి చేసింది. మంచి ఉపాధ్యాయురాలిగా జీవనం సాగించాలనుకుంది. తను ఒకటి తలిస్తే విధి ఇంకొకటి శాసించింది. రెండు కిడ్నీలు పాడైపోరుు చావుతో పోరాడుతూ దాతల సాయం కోసం ఎదురు చూస్తోంది. కిడ్నీ దానం చేయడానికి ముందుకు వచ్చినా మార్పిడి కోసం రూ.10 లక్షలకు పైగా వైద్య ఖర్చులు అవుతాయని తెలియడంతో అయోమయ పరిస్థితిని ఎదుర్కొంటోందామె. ఒంగోలుకు చెందిన పి.రాజ్యం (36)కు మూడు సంవత్సరాల క్రితం వివాహమైంది. ఈమె ఓ ప్రరుువేటు పాఠశాలలో ఉపాధ్యారుునిగా, భర్త ఓ లారీ క్లీనర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నారు. వీరికి ఓ కుమార్తె పుట్టింది. ఈ ఆనందం ఎంతో కాలం నిలువ లేదు. గత రెండు సంవత్సరాల క్రితం ప్రరుువేటు పాఠశాలలో ఉద్యోగం చేస్తుండగానే విపరీతమైన నీరసంతో పడిపోగా ఆసుపత్రిలో చేర్చారు. అప్పట్లో ఉన్నత చికిత్స కోసం నెల్లూరు వెళ్లమని సూచించడంతో రెండు కిడ్నీలు పాడైపోయాయని నిర్ధారించారు. ఏమీ చేయలేని నిస్సహాయత. పైగా వెంటనే డయూలసిస్ చేయాలని సూచించడంతో ఆ చికిత్స చేరుుంచుకుంటూ ఇతర మందులు వాడుతోంది. కోడలు బాధ చూడలేక తన అత్త కిడ్నీని దానం చేయడానికి ముందుకు వచ్చారు. ఇందుకు దాదాపు రూ.10 లక్షలకుపైగా ఖర్చవుతందని వైద్యులు చెప్పడంతో వీరి కష్టాలు మళ్లీ మొదటికి వచ్చారుు. కిడ్నీ మార్పిడికి అవసరమైన నగదును మానవతా దృక్పధంతో దాతలు సమకూర్చితేగానీ ఆరోగ్యం కుదుట పడదు. త్వరితగతిన ఈ శస్త్ర చికిత్స చేపట్టకపోతే మిగిలిన అవయవాలు పాడైపోతాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. స్పందించే హృదయూలు 88975-51930 అనే నెంబరుకు ఫోన్ చేసి సాయం చేయాలని ఆ కుటుంబం అర్థిస్తోంది.