
మీడియాతో డాక్టర్ విట్టల్, పక్కన డాక్టర్ స్వప్న, డాక్టర్ ప్రశాంత్‌కుమార్ తదితరులు
లబ్బీపేట(విజయవాడతూర్పు) : ఎన్టీఆర్ జిల్లా వెల్వడం గ్రామానికి చెందిన లక్ష్మమ్మ బ్రెయిన్ డెడ్‌కు గురికాగా.. ఆమె కుటుంబ సభ్యులు అవయవదానం చేసి ఇద్దరికి పునర్జన్మనిచ్చినట్టు అమెరికన్ కిడ్నీ ఇన్‌స్టిట్యూట్ వైద్యులు తెలిపారు.
ఈ నెల 11న అవయవదానం చేయగా.. మూడేళ్లు, నాలుగేళ్లుగా డయాలసిస్ చేయించుకుంటూ జీవనం సాగిస్తున్న ఇద్దరికి, దాత నుంచి సేకరించిన కిడ్నీలను ట్రాన్స్‌ప్లాంట్ చేసినట్లు డాక్టర్ విట్టల్, డాక్టర్ స్వప్న తెలి పారు. ఆస్పత్రి ప్రాంగణంలో గురువారం వారు మీడియాతో మాట్లాడుతూ ఒకే రోజు ఏకకాలంలో రెండు కిడ్నీ మార్పిడి ఆపరేషన్‌లు చేయడం అరుదైన ఘటనగా చెప్పారు. యూరాలజిస్టులు డాక్టర్ ప్రశాంత్‌కుమార్, డాక్టర్ ధీరజ్, డాక్టర్ మురళీకృష్ణ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment