Institute
-
రిసార్ట్ శైలి జీవనమే లక్ష్యంగా ఐఖ్యా ఇన్ఫ్రా డెవలపర్స్ 'ఈ5వరల్డ్’ కు అంకురార్పణ
హైదరాబాద్, నవంబర్ 2024: ఐఖ్యా ఇన్ఫ్రా డెవలపర్స్ ఆధ్వర్యంలో ఐకేఎఫ్ ఫైనాన్స్ సహకారంతో హైదరాబాద్‌లో ఇరవై ఎకరాల విస్తీర్ణంలో లగ్జరీతో కూడిన రిసార్ట్ శైలి జీవనమే లక్ష్యంగా 'ఈ5వరల్డ్' కు అంకురార్పణ జరిగింది. ఈ వివరాలు తెలిపేందుకు బంజారాహిల్స్ లోని తాజ్ డెక్కన్ లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఐకేఎఫ్ ఫైనాన్స్ వ్యవస్థాపకులు, ఈ5వరల్డ్ ప్రమోటర్ వీజీకే ప్రసాద్ మాట్లాడుతూ రిసార్ట్ స్టైల్ లివింగ్‌లో సరికొత్త కాన్సెప్ట్‌ను పరిచయం చేస్తున్నామని చెప్పారు. ఇది లగ్జరీ, వెల్నెస్, నేచర్ సమతుల్యతతో డిజైన్ చేయబడిందన్నారు. ఇరవై ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ రిసార్ట్ ప్రత్యేకంగా రూపొందించామని తెలిపారు. ప్రీమియం సౌకర్యాలు కలవన్నారు. ప్రకృతి నుంచి స్ఫూర్తి పొందే ఆర్కిటెక్చర్ ఇక్కడ ప్రత్యేకత అన్నారు. దీనిని మూడు దశల్లో అభివృద్ధి చేయనున్నామని చెప్పారు. మొదటి దశలో 1 నుంచి 5 ఎకరాలు, రెండో దశలో 2 నుంచి 10 ఎకరాలు, మూడో దశలో 3 నుంచి 5 ఎకరాలు అభివృద్ధి చేయనున్నామన్నారు. లగ్జరీ, వెల్నెస్, స్థిరమైన డిజైన్‌తో హైదరాబాదులో కొత్త బెంచ్‌మార్క్‌ను సెట్ చేస్తున్నామని చెప్పారు. ఇది పచ్చని వాతావరణంలో ప్రశాంతతతో కూడిన ఉన్నత స్థాయి రిసార్ట్ జీవనానికి నిలయంగా ఉండనుందన్నారు.ఐకేఎఫ్ ఫైనాన్స్ రూ. 2,356.99 కోట్లు మార్కెట్ క్యాపిటలైజేషన్ కలిగిన విశ్వసనీయ ఆర్థిక సంస్థ అన్నారు. హైదరాబాద్‌లో లగ్జరీ లివింగ్‌ను మలుపు తిప్పేందుకు సిద్ధమవుతున్నామని చెప్పారు. ఇది కేవలం ఒక లగ్జరీ రిసార్ట్ లివింగ్ కమ్యూనిటీ మాత్రమే కాదని, ఇది నాణ్యత, ఆవిష్కరణ, స్థిరమైన జీవనం తాలుకా నిబద్ధతను ప్రతిబింబిస్తుందని తెలిపారు. ఆర్కిటెక్చర్ కీర్తి షా లగ్జరీ, నేచర్ కలయిక విజన్ అద్భుతమన్నారు. ఉన్నతమైన జీవన విధానానికి నిలువెత్తు సాక్ష్యంగా నిలుస్తుందన్నారు. ఇక్కడ నివసించే వారికి లగ్జరీ జీవనంతో పాటు పర్యావరణ అనుకూల వాతావరణాన్ని అందిస్తుందని తెలిపారు. ఈ లగ్జరీ రిసార్ట్స్‌కు ఎక్కువ డిమాండ్ ఉందన్నారు. పెట్టుబడిదారులు దీర్ఘకాలంలో వృద్ధిపై ఆసక్తి చూపిస్తున్నారన్నారు. పెట్టుబడిదారులకు ఫ్రాక్షనల్ ఓనర్షిప్ అందించే ప్రత్యేక అవకాశాన్ని అందిస్తున్నామని చెప్పారు. ఈ మోడల్ ద్వారా పెట్టుబడిదారులు రిసార్ట్‌లో భాగస్వామ్యం పొందవచ్చన్నారు.ఈ సందర్భంగా ఓపస్ ఇండస్ట్రీస్ మేనేజింగ్ డైరెక్టర్ రఘురాం వుప్పుటూరి మాట్లాడుతూ ప్రాక్షనల్ ఓనర్షిప్ ద్వారా దీనిని అందరికి చేరువ చేయనున్నామని చెప్పారు. రూ.10 లక్షలలోపు మొత్తంతో రిసార్ట్‌లో భాగస్వామ్యం పొందవచ్చన్నారు. ఇది కుటుంబాలు సమయం గడిపేందుకు ఒక వీకెండ్ గమ్యస్థలంగా కూడా ఉంటుందన్నారు. ఇందులో ఉన్న విస్తృతమైన సౌకర్యాలు అన్ని వయస్సులు, వర్గాలకు అనుకూలంగా రూపొందించబడ్డాయని చెప్పారు. చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు అందరికి అనుకూలంగా ఉన్నాయన్నారు. ఈ ప్రాజెక్ట్‌లో మూడు క్లబ్ హౌస్‌లు కలవన్నారు. వీటి విస్తీర్ణం 10,000, 30,000, 50,000 చదరపు అడుగులు అన్నారు. అందులో యోగా గదులు, వెల్నెస్ జోన్లు, స్విమ్మింగ్ పూల్స్, వినోద సౌకర్యాలు ఉన్నాయన్నారు. రెండు రెస్టారెంట్లు కలవన్నారు. ఈ రెస్టారెంట్లలో ప్రపంచ, స్థానిక వంటకాలు అందుబాటులో ఉంటాయన్నారు. తాజా, సేంద్రీయ పదార్థాలను ప్రధానంగా ఉపయోగించనున్నామని తెలిపారు. విశాలమైన పచ్చని ప్రదేశాలు, గ్రీన్ గార్డెన్స్, నీటి వనరులు, నడక మార్గాలు ఉన్నాయన్నారు. పిల్లల కోసం ప్రత్యేక అడ్వెంచర్ ప్రదేశాలు, పెద్దలు, వృద్ధుల కోసం నేచర్ ట్రైల్స్, వెల్నెస్ లాంజ్‌లు ఉన్నాయని తెలిపారు. ఈ కమ్యూనిటీ ప్రత్యేక మెంబర్షిప్ ప్యాకేజీలను కూడా అందిస్తుందని చెప్పారు. హైదరాబాద్ నివాసితులు ప్రపంచ స్థాయి సదుపాయాలు ఆస్వాదించే అవకాశం ఉందన్నారు.ఈ సందర్భంగా ఈ5వరల్డ్ సేల్స్, బ్రాండ్ కన్సల్టెంట్ డాక్టర్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ ఈ5వరల్డ్ హైదరాబాద్ వాసులు ఆనందించే ఒక ప్రత్యేక గమ్యస్థలంగా మారనుందన్నారు. ఇది వివిధ వయస్సులు, వర్గాల ప్రజల అవసరాలను తీర్చబోతుందన్నారు.ఈ సందర్భంగా ఆర్కిటెక్ట్, అర్బన్ ప్లానర్, ఈ5వరల్డ్ వ్యవస్థాపక సభ్యులు కీర్తి షా మాట్లాడుతూ ఈ5వరల్డ్ స్థిరమైన నిర్మాణం, వెల్నెస్ ఆధారిత జీవనశైలిలో ఉంటుందన్నారు. ఆధునిక సౌకర్యాలు ఆస్వాదిస్తూ.. ప్రకృతితో మళ్లీ కనెక్ట్ అయ్యేలా చేయడం మా లక్ష్యమన్నారు. మా స్టాండ్ ఏమిటంటే.. పర్యావరణానికి అనుకూలంగా ఉంటూ విలాసవంతమైన జీవనానికి ఒక నమూనాగా, సమకాలీన సౌకర్యాలతో సహజ ప్రకృతి దృశ్యాలను మిళితం చేయడం అన్నారు. ఈ5వరల్డ్ భారతదేశంలో పూర్తిగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా రూపకల్పన చేసిన మొదటి రిసార్ట్ లివింగ్ కమ్యూనిటీగా నిలుస్తుందని తెలిపారు. ఈ వినూత్న పద్ధతిని క్యూలీడ్.ఏఐ డాక్టర్ ప్రవీణ్ కుమార్ నేతృత్వంలో అమలు అవుతుందన్నారు. ఇందులో మార్కెట్ కమ్యూనికేషన్, ఉత్పత్తి మార్కెట్ సరిపోలిక, ఆదాయ అంచనాలు, వ్యూహాత్మక ప్రణాళిక వంటి ప్రతి అంశంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత సూచనలు ఉంటాయన్నారు. ఐకేఎఫ్ ఫైనాన్స్ ప్రమోటర్ల మద్దతుతో ఐఖ్యా ఇన్ఫ్రా డెవలపర్స్ లగ్జరీ రిసార్ట్ లివింగ్‌లో మొదటి ప్రయత్నంగా ఈ5వరల్డ్ కు పునాది పడింది. ఇది ఈ సంస్థ ఆర్థిక సేవలలో ఉన్న బలమైన పునాది నుంచి సహజ విస్తరణను ప్రతిబింబిస్తుంది. ఇది 1991లో స్థాపించబడింది. ఐకేఎఫ్ ఫైనాన్స్ నిరంతరం అగ్రగామిగా ఉంది. ఇది తన పోర్ట్‌ఫోలియోను వాహన, ఎంఎస్ఎంఈ, హౌసింగ్ ఫైనాన్స్‌లను కలుపుతూ విస్తరించింది. తొమ్మిది రాష్ట్రాలలో ప్రస్థానం కలిగి ఉంది. 613.76 కోట్ల రూపాయల అంచనా కలిగిన సమగ్ర టర్నోవర్‌తో ఐకేఎఫ్ ఫైనాన్స్ మద్దతుతో స్థిరత్వం, నాణ్యత, దీర్ఘకాలిక విలువకు హామీగా నిలుస్తుంది. ఈ సమావేశంలో బిజినెస్ కన్సల్టెంట్ దేవేంద్ర దాంగ్ పాల్గొన్నారు.ఐకేఎఫ్ ఫైనాన్స్ గురించిఐకేఎఫ్ ఫైనాన్స్ వీజీకే ప్రసాద్ చేత స్థాపించబడింది. పారదర్శకత, వృద్ధి, కస్టమర్ సేవల పట్ల నిబద్ధతకు ప్రసిద్ధి చెందిన ప్రముఖ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీగా ఎదిగింది. కంపెనీ ట్రాక్ రికార్డ్ దాని తాజా వెంచర్ ఈ5వరల్డ్ హైదరాబాద్‌లో ప్రీమియర్ లైఫ్ స్టైల్ కు మద్దతు ఇస్తుంది.ఐకేఎఫ్ ఫైనాన్స్ వాహన ఫైనాన్సింగ్‌పై దృష్టి సారించడంతో ప్రారంభమైంది. భారతదేశంలో విభిన్న శ్రేణి ఆర్థిక ఉత్పత్తులను అందించే పవర్ హౌస్‌గా ఎదిగింది. ఆయన దూరదృష్టితో కూడిన నాయకత్వంలో ఐకేఎఫ్ ప్రతిష్టాత్మకమైన హెచ్డీఎఫ్సీ బ్యాంక్, సుందరం ఫైనాన్స్, టెల్కో వంటి సంస్థలతో కలిసి పని చేస్తుంది. దీర్ఘకాల భాగస్వామ్యాలు, పరిశ్రమ నైపుణ్యాన్ని పెంపొందించుకుంది.మరింత సమాచారానికి దయచేసి సంప్రదించండి : 9959154371/ 9963980259 -
కోచింగ్ సెంటర్లను నియంత్రించాలి!
భారీ వర్షాల కారణంగా మురుగు కాలువ పొంగిపొర్లి, ఢిల్లీలో ఒక సివిల్ సర్వీస్ శిక్షణా సంస్థలో ఉన్న నేలమాళిగ గ్రంథాలయంలోకి వరద నీరు ఉధృతంగా ప్రవహించిన దుర్ఘటనలో ముగ్గురు విద్యా ర్థులు జల సమాధి కావటం యావత్ దేశాన్ని కలచివేసింది. చని పోయిన ముగ్గురిలో ఒకరు బిహార్ లోని ఔరంగాబాద్‌కు చెందిన తానియా సోనీ తండ్రి మంచిర్యాల సింగరేణిలో సీనియర్ మేనేజర్ కావడంతో తెలంగాణ అంశం తెరపైకి వచ్చింది. దీంతో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తానియా సోనీ మృతదేహాన్ని తరలించడంలో తండ్రి విజయ్ కుమార్‌కు సహాయ సహకా రాలు అందించాల్సిందిగా ఢిల్లీ రెసిడెంట్ కమిషనర్ గౌరవ్ ఉప్పల్‌కు ఆదే శాలు జారీ చేశారు.ఢిల్లీలోని పలు కోచింగ్ సెంట ర్లలో కనీస సౌకర్యాలు లేవనీ, కోచింగ్ సెంటర్లు నరక కూపాలుగా ఉన్నా యనీ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయ మూర్తికి అవినాష్ దూబే అనే సివిల్స్ ఆశావహ అభ్యర్థి లేఖ రాయటంతో అందరి దృష్టి కోచింగ్ సెంటర్లపై పడింది. ప్రధానంగా మన తెలంగాణ రాజధాని హైదరా బాద్‌లో అనుమతి లేని పలు కోచింగ్ సెంటర్లు, స్టడీ హాళ్లు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. ఇవి వరంగల్, ఇతర జిల్లా కేంద్రాలకు కూడా విస్తరించాయి. హైదరాబాద్‌లో కోచింగ్ సెంటర్ల మూలంగా అశోక్ నగర్, దిల్సుఖ్ నగర్, అమీర్ పేట్ నిరుద్యోగుల కూడళ్ళుగా పేరుపొందాయి. దేశవ్యాప్తంగా సుమారు 80 వేల పైచిలుకు కోచింగ్ సెంటర్ ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వం వద్ద ఉన్న సమాచారం. సంవత్సరానికి 70 వేల కోట్ల వరకు వ్యాపారం జరుగు తున్నట్లు అంచనా.అడ్డూ అదుపూ లేని కోచింగ్ సెంటర్లపై మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో యూపీఏ ప్రభుత్వం తొలుత దృష్టి పెట్టింది. కోచింగ్ సెంటర్లను సేవారంగంలోకి తెచ్చి వాటిపై పన్నులు వేశారు. 2024 జనవరి 18న కోచింగ్ సెంటర్ల నియంత్రణ కోసం కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ కొన్ని మార్గదర్శకాలు జారీ చేసింది. ఇవి ఎక్కడా అమలు కావడం లేదు. అత్యధిక కోచింగ్ సెంటర్లకు ఎటువంటి అనుమతులు ఉండవు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో నామ మాత్రపు రుసుముతో ఒక వ్యాపార సంస్థగా నమోదు చేసుకుంటారు. భవన యజమానులు అగ్నిమాపక శాఖ విధించిన రక్షణ నిబంధనలు పాటించరు. గృహ అవస రాలకు అని అనుమతి తీసుకుని ఆ భవనాలనే కోచింగ్ సెంటర్లుగా వాడుతూ విద్యుత్ శాఖ ఆదాయానికి గండి కొడుతున్నారు.ఎంతమంది విద్యార్థులు శిక్షణ పొందు తున్నారు, ఎంతెంత ఫీజులు చెల్లిస్తున్నారు అనే లెక్కలు ఉండవు. తరగతి గదిలో శిక్షణ పొందుతున్న ప్రతి విద్యార్థి పైన జీఎస్టీ వంటి పన్నులు చెల్లించకుండా తప్పించుకుంటున్నారు. పైగా వెలుతురు లేని గదుల్లో 100 మంది కూర్చోవాల్సిన చోట 500 మందికి బోధిస్తున్నారు. కనీస మౌలిక సౌకర్యాలు ఉండవు. వీటి కన్నా కన్నా జైళ్ళు నయమనే భావన కలుగుతుంది. జైళ్ళలో మరుగుదొడ్లు, మూత్ర శాలలు పరిశుభ్రంగా ఉండటమే కాకుండా జైలు గదుల్లో వెలుతురు ఉంటుంది. నిబంధనల ప్రకారం గదిలో లెక్కకు మించి ఖైదీలను ఉంచరు.అత్యధిక ఫీజులు వసూలు చేస్తూ సరైన భద్రతా ప్రమా ణాలు పాటించని కోచింగ్ సెంటర్లను నియంత్రించాల్సిన బాధ్యత తెలంగాణ ప్రభుత్వానికి ఉంది. ఇటీవల హరి యాణా ప్రభుత్వం కోచింగ్ సెంటర్ల నమోదు నియంత్రణ బిల్లు–2024ను తెచ్చి ప్రైవేట్ కోచింగ్ సెంటర్లను కట్టడి చేసింది. అట్లాగే రేవంత్ రెడ్డి సర్కార్ కూడా చట్టం తెచ్చి, తల్లిదండ్రులపై ఫీజుల భారం పడకుండా విద్యార్థి నిరు ద్యోగుల శ్రేయస్సుకు పాటుపడాలి.– కోటూరి మానవతా రాయ్, వ్యాసకర్త టీపీసీసీ అధికార ప్రతినిధి; తెలంగాణ విద్యార్థి నిరుద్యోగ జేఏసీ చైర్మన్, 90009 19101 -
Christmas Celebrations Photos: ఉల్లాసంగా.. ఉత్సాహంగా.. ఐహెచ్ఎంఐలో క్రిస్మస్ వేడుకలు
-
అవయవదానంతో ఇద్దరికి పునర్జన్మ
లబ్బీపేట(విజయవాడతూర్పు) : ఎన్టీఆర్ జిల్లా వెల్వడం గ్రామానికి చెందిన లక్ష్మమ్మ బ్రెయిన్ డెడ్‌కు గురికాగా.. ఆమె కుటుంబ సభ్యులు అవయవదానం చేసి ఇద్దరికి పునర్జన్మనిచ్చినట్టు అమెరికన్ కిడ్నీ ఇన్స్టిట్యూట్ వైద్యులు తెలిపారు. ఈ నెల 11న అవయవదానం చేయగా.. మూడేళ్లు, నాలుగేళ్లుగా డయాలసిస్ చేయించుకుంటూ జీవనం సాగిస్తున్న ఇద్దరికి, దాత నుంచి సేకరించిన కిడ్నీలను ట్రాన్స్‌ప్లాంట్ చేసినట్లు డాక్టర్ విట్టల్, డాక్టర్ స్వప్న తెలి పారు. ఆస్పత్రి ప్రాంగణంలో గురువారం వారు మీడియాతో మాట్లాడుతూ ఒకే రోజు ఏకకాలంలో రెండు కిడ్నీ మార్పిడి ఆపరేషన్లు చేయడం అరుదైన ఘటనగా చెప్పారు. యూరాలజిస్టులు డాక్టర్ ప్రశాంత్‌కుమార్, డాక్టర్ ధీరజ్, డాక్టర్ మురళీకృష్ణ పాల్గొన్నారు. -
గురుకుల పరీక్షల తుది ‘కీ’లు ఖరారు
సాక్షి, హైదరాబాద్: గురుకుల విద్యా సంస్థల్లో ఉద్యోగాల భర్తీకి సంబంధించి గత నెలలో నిర్వహించిన అర్హత పరీక్షల తుది ‘కీ’లను గురుకుల విద్యా సంస్థల నియామకాల బోర్డు (టీఆర్‌ఈఐఆర్‌బీ) ఖరారు చేసింది. ఆగస్టు చివరి వారంలో ప్రాథమిక కీలను అందుబాటులోకి తీసుకొచ్చిన టీఆర్‌ఈఐఆర్‌బీ.. వాటిపై అభ్యంతరాలను స్వీకరించింది. ఇందులో భాగంగా క్షేత్రస్థాయిలో వచ్చిన అభ్యంతరాలను పూర్తిగా పరిశీలించిన నిపుణుల కమిటీ వాటికి సంబంధించి టీఆర్‌ఈఐఆర్‌బీకి సిఫార్సులు చేసింది. వీటిని పరిశీలించిన అధికారులు వాటి ఆధారంగా తుది కీలను ఖరారు చేశారు. వీటిని టీఆర్‌ఈఐఆర్‌బీ వెబ్సైట్లో అందుబాటులో పెట్టారు. మొత్తంగా 51 కేటగిరీల్లో జరిగిన పరీక్షలకు సంబంధించిన ఫైనల్ కీలు తాజాగా వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం ప్రకటించిన తుది కీలలో ఇకపై ఎలాంటి మార్పులు ఉండవని గురుకుల బోర్డు స్పష్టం చేసింది. రోస్టర్ పాయింట్ల మార్పులు... ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో రోస్టర్ చార్ట్ కీలకంగా పనిచేస్తుంది. ఈ చార్ట్‌లో నిర్దేశించిన రిజర్వేషన్ల ఆధారంగా అర్హులను ఎంపిక చేస్తారు. తాజాగా రోస్టర్ పాయింట్లలో కొన్ని రకాల మార్పులు చేస్తూ సవరించిన రోస్టర్ జాబితాను టీఆర్‌ఈఐఆర్‌బీ వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది. ఇందులో ప్రధానంగా 13, 37 (ఎక్స్ సర్వీస్‌మెన్) రోస్టర్ పాయింట్లలో ఈ మార్పులు చోటుచేసుకున్నాయి. సొసైటీ వారీగా నిర్దేశించిన పోస్టు కేటగిరీల్లో ఈ పాయింట్లలో మార్పులు చోటుచేసుకున్నాయి. ఇదివరకు ప్రకటించిన పాయింట్లు... తాజాగా సవరించిన పాయింట్లతో కూడిన జాబితాను టీఆర్‌ఈఐఆర్‌బీ వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది. -
‘ఐటీ’కి మెటబాలిక్ సిండ్రోమ్!
ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) రంగంలో పనిచేస్తున్న ఉద్యోగుల్లో సగం మందిలో మెటబాలిక్ సిండ్రోమ్ సమస్య కనిపిస్తోందని జాతీయ పోషకాహార సంస్థ (ఎన్ఐఎన్) పేర్కొంది. ఉద్యోగ హడావుడిలో ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తూ.. మధుమేహం, తీవ్ర రక్తపోటు, గుండె జబ్బుల బారినపడుతున్నారని తమ అధ్యయనంలో తేలిందని వెల్లడించింది. ఐటీ కంపెనీలు ఉద్యోగుల ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకోవాలని.. సరైన పోషకాహారం తీసుకునేలా చూడటంతోపాటు వ్యాయామాలు చేయించడం, ఒత్తిడిని తగ్గించే కార్యక్రమాలను చేపట్టడం మంచిదని సూచించింది. –సాక్షి హైదరాబాద్ ఐసీఎంఆర్ నేతృత్వంలో.. భారతీయ వైద్య పరిశోధన సమాఖ్య (ఐసీఎంఆర్) నేతృత్వంలో ఎన్ఐఎన్ ఈ అధ్యయనం నిర్వహించింది. దేశంలో ప్రముఖ ఐటీ హబ్ అయిన హైదరాబాద్‌లో పెద్ద, మధ్య తరహా, చిన్న ఐటీ కంపెనీల్లో విస్తృత స్థాయిలో అధ్యయనం నిర్వహించింది. ఉద్యోగాల తీరుతెన్నులు, వాటిలో పనిచేస్తున్నవారి ఆహార అలవాట్లు, జీవనశైలి, వారి ఆరోగ్యం వంటి వివరాలను సేకరించి విశ్లేషించింది. వారిలో 46శాతం మందికిపైగా మెటబాలిక్ సిండ్రోమ్ బారినపడినట్టు గుర్తించింది. చాలా మందిలో హెచ్‌డీఎల్ (మంచి) కొవ్వులు తక్కువగా ఉండటం, రక్తపోటు, నడుము చుట్టుకొలత వంటివి ఎక్కువగా ఉండటాన్ని గమనించింది. ఐటీ ఉద్యోగులు రోజులో కనీసం ఎనిమిది గంటల పాటు కూర్చునే ఉంటున్నారని.. 22 శాతం మంది మాత్రమే వారానికి కనీసం 150 నిమిషాల శారీరక వ్యాయామం చేయాలన్న సూత్రాన్ని పాటిస్తున్నారని తేల్చింది. వ్యాయామం లేకపోవడం, తీవ్ర ఒత్తిడి, పోషకాలు లేని జంక్ ఫుడ్ తీసుకోవడం వంటివి శరీరంలో ఇన్ఫ్లమేషన్కు కారణం అవుతున్నాయని.. ఇది కాలం గడిచిన కొద్దీ మెటబాలిక్ సిండ్రోమ్‌కు దారితీస్తోందని ఎన్ఐఎన్ డైరెక్టర్ డాక్టర్ ఆర్.హేమలత తెలిపారు. ఈ అధ్యయనంలో పాల్గొన్న ఉద్యోగుల సగటు వయసు 30 ఏళ్లు మాత్రమేనని.. చిన్నవయసులోనే సమస్యల బారినపడుతున్నారని వివరించారు. ఏమిటీ మెటబాలిక్ సిండ్రోమ్! మన శరీరంలో క్రమంకొద్దీ జరగాల్సిన జీవక్రియల్లో తేడాలు రావడం, లోపాలు చోటు చేసుకోవడమే మెటబాలిక్ సిండ్రోమ్. ఊబకాయం, ట్రైగ్లిజరైడ్స్, హెచ్‌డీఎల్, రక్తపోటు, రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు.. అనే ఐదు ప్రధాన రిస్క్ ఫ్యాక్టర్లను బట్టి దీన్ని నిర్ధారిస్తారు. నడుము చుట్టుకొలత, అధిక బరువు ఊబకాయాన్ని సూచిస్తాయి. వైద్య నిపుణుల సూచనల ప్రకారం.. నడుము చుట్టుకొలత పురుషుల్లోనైతే 90 సెంటీమీటర్లకన్నా, మహిళలకు 80 సెంటీమీటర్లకన్నా ఎక్కువగా ఉండటం ఊబకాయానికి సూచిక. ఇక రక్తంలో ట్రైగ్లిజరైడ్లు 150ఎంజీ/డెసిలీటర్ కంటే ఎక్కువ ఉండటం అనారోగ్యకరం. ఆరోగ్యకరమైన కొవ్వులైన హెచ్‌డీఎల్ (హైడెన్సిటీ లిపిడ్స్) పురుషుల్లోనైతే 40 ఎంజీ/డెసిలీటర్ కంటే, మహిళల్లో 50 ఎంజీ/డెసిలీటర్ కంటే ఎక్కువగా ఉండాలి. రక్తపోటు 135/85 కన్నా తక్కువగా ఉండాలి. కనీసం ఎనిమిది గంటలకన్నా ఎక్కువ సమయం ఎలాంటి ఆహారం తీసుకోకుండా ఉన్నాక రక్తంలో గ్లూకోజు స్థాయిలు 100 ఎంజీ/డెసిలీటర్ కన్నా తక్కువగా ఉండాలి. ఈ ఐదింటిలో ఏ మూడు వ్యతిరేకంగా ఉన్నా.. సదరు వ్యక్తులు మెటబాలిక్ సిండ్రోమ్ సమస్యను ఎదుర్కొంటున్నట్టేనని వైద్యులు చెప్తున్నారు. జీవన శైలిలో మార్పులే పరిష్కారం మెటబాలిక్ సిండ్రోమ్‌కు గురి కాకుండా ఆరోగ్యాన్ని కాపాడుకోవడం పెద్ద కష్టమేమీ కాదని నిపుణులు చెప్తున్నారు. తరచూ బయటి ఆహారం (ఫాస్ట్‌ఫుడ్, జంక్‌ఫుడ్) తినడం తగ్గించుకోవాలని.. కొవ్వు పదార్థాలకు దూరంగా ఉండాలని, వీలైనంత వరకూ కాయగూరలు, పండ్లు తినాలని సూచిస్తున్నారు. ఐటీ ఉద్యోగులు చాలామంది సమయానికి ఆహారం తీసుకోవడం లేదని వెల్లడైందని అధ్యయనానికి నేతృత్వం వహించిన శాస్త్రవేత్త డాక్టర్ ఎం.సుబ్బారావు గవరవరపు తెలిపారు. దీనికితోడు ఒత్తిడికి లోనవుతుండటం మెటబాలిక్ సిండ్రోమ్‌కు గురయ్యేందుకు దారితీస్తోందని వివరించారు. అధ్యయనంలో పాల్గొన్న వారి సంఖ్య తక్కువే అయినా.. సగటున అందరు ఉద్యోగుల జీవనశైలి, ఆహార అలవాట్లు, ఒత్తిడి దాదాపు ఒకేలా ఉన్నట్టు గుర్తించామని వెల్లడించారు. ఈ సమస్య నుంచి ఐటీ ఉద్యోగులు బయటపడేందుకు తీసుకోవాల్సిన చర్యలనివేదికను ఎన్ఐఎన్ శాస్త్రవేత్త భానుప్రకాశ్‌రెడ్డితో కలసి సిద్ధం చేస్తున్నట్టు తెలిపారు. న్యూట్రియంట్స్’ఆన్లైన్ జర్నల్‌లో ఈ అధ్యయనం వివరాలు ప్రచురితమయ్యాయి. -
10 పాసైతే చాలు కోర్సులో చేరిపోవచ్చు.. అదిరేటి రుచులతో ఆదాయం మీ సొంతం
వంట చేయడం గొప్ప కళ. ఆ కళను ఉపాధి మార్చుకుని అదిరేటి రుచులు అందించే వారే ఆధునిక నలభీములు. ఆతిథ్య రంగంలో చెఫ్‌లకు అంతర్జాతీయంగా ఎప్పుడూ ఆదరణ ఉంటుంది. ప్రాంతీయ సంస్కృతికి ప్రాధాన్యమిస్తూనే ఆహారంలో ఆధునికత, కొత్త ఆవిష్కరణలతో రాణిస్తే.. కాకా హోటల్ నుంచి కార్పొరేట్ కిచెన్ వరకు విస్తృతమైన అవకాశాలు ఉంటాయి. ఈ అవకాశాలను అందుకోవాలంటే నైపుణ్యాలు తప్పనిసరి. పాకశాస్త్రంలో సిద్ధహస్తులను తయారు చేస్తున్న సంస్థలెన్నో ఉన్నా.. రాష్ట్రంలో ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచే సంస్థ ఒక్కటే ఉంది. అదే విశాఖలో నిర్వహిస్తున్న ఫుడ్‌క్రాఫ్ట్ ఇన్స్టిట్యూట్. ఈ నలభీముల తయారీ సంస్థకు 35 ఏళ్లు పూర్తయింది. ఇక్కడ శిక్షణ పొందిన ఎందరో దేశ, విదేశాల్లో చెఫ్‌లుగా రాణిస్తూ.. ఆహా అనిపించే కమ్మని రుచులను అందిస్తున్నారు. విశాఖపట్నం: నగరంలో జాతీయ రహదారిని ఆనుకుని రూరల్ తహసీల్దార్ కార్యాలయం పక్కనే ఫుడ్‌క్రాఫ్ట్ ఇన్స్టిట్యూట్ ఉంది. అతి తక్కువ ఫీజుతో ప్రభుత్వమే నిర్వహిస్తున్న ఈ ఇన్స్టిట్యూట్కు 35 ఏళ్లు పూర్తయింది. ప్రస్తుతం ఇక్కడ అడ్మిషన్లు జరుగుతున్నాయి. ఇక్కడ పరిమితమైన సీట్లు మాత్రమే ఉన్నాయి. రాష్ట్రంలోనే ఏకైక ఫుడ్‌క్రాఫ్ట్ ఇన్స్టిట్యూట్ను డిపార్ట్మెంట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ నిర్వహిస్తోంది. ఈ విద్యా సంవత్సరంలో ఆగస్టు 11 నుంచి తరగతులు ప్రారంభం కానున్నాయి. కనీస అర్హత 10వ తరగతి ఈ ఇన్స్టిట్యూట్లో చేరడానికి కనీస అర్హత పదో తరగతి. 25 ఏళ్లు లోపు ఉండాలి. దీన్ని ఈ ఏడాది నుంచి 30 ఏళ్లకు పెంచాలని వినతులు వచ్చినట్లు ఉపాధ్యాయులు తెలిపారు. ఇక్కడ శిక్షణ పొందిన వారికి స్టేట్ బోర్డు ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్, ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో కోర్సు ముగిసిన తర్వాత పరీక్షలు నిర్వహిస్తారు. అనంతరం ఇండ్రస్టియల్ ట్రైనింగ్ ఇచ్చి సర్టిఫికెట్ అందజేస్తారు. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఉండటం వల్ల ఈ కోర్సులకు డిమాండ్ పెరుగుతోంది. దీంతో ఇక్కడ మరింత నాణ్యత ప్రమాణాలతో కూడిన ల్యాబ్ (ప్రయోగశాల)ను ఇటీవల ఆధునికీకరించారు. ప్రైవేట్ ఫుడ్‌క్రాఫ్ట్ ఇన్స్టిట్యూట్లకు దీటుగా ఇక్కడ అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నారు. అన్ని రకాలైన వంటకాల్లోనూ తరీ్ఫదు ఇచ్చి వారితోనే తయారు చేయిస్తున్నారు. ఇక్కడ విద్యార్థులు తయారు చేస్తున్న వంటకాలను ఉపాధ్యాయులు, ప్రిన్సిపాల్ ఎప్పటికప్పుడు రుచులు చూసి.. మరింత మెరుగు కోసం సూచనలు, సలహాలు ఇస్తున్నారు. ఇక్కడ అందించే కోర్సులివే.. ప్రస్తుతం ఇక్కడ ఫుడ్ ప్రొడెక్షన్ అండ్ పెటిసరీ, బేకరీ అండ్ కన్ఫెక్షనరీ, ఫుడ్ సరీ్వస్ ఆపరేషన్స్ కోర్సులు నిర్వహిస్తున్నారు. ఇవన్నీ ఏడాదిన్నర కాల వ్యవధి గల కోర్సులు. ఏడాది పాటు థియరీ, ఆరు నెలల పాటు ఇండ్రస్టియల్ ట్రైనింగ్ ఇస్తారు. ఇందులో భాగంగా నగరంలో స్టార్ హోటళ్లలో ఇండ్రస్టియల్ ట్రైనింగ్‌కు పంపిస్తారు. ఇక్కడ ప్రయోగశాలలో ప్రాక్టీస్ చేయిస్తారు. ఇక్కడ విశాలమైన వంట గది(ప్రయోగశాల) ఉంది. ఇందులో శిక్షణ పొందే వారికి వివిధ రకాల వంటకాలు తయారు చేయడంలో తరీ్ఫదు ఇస్తారు. ఆంధ్ర, తెలంగాణ వంటకాలు, దక్షిణ, ఉత్తర భారత దేశంలో ప్రసిద్ధి వంటకాలు చేయడం నేర్పుతారు. ఇక్కడ శిక్షణ పొందిన వారు నగరంతో పాటు వివిధ ముఖ్య పట్టణాలు, దేశ విదేశాల్లోని స్టార్ హోటళ్లు, ఆతిథ్య రంగంలో ఉపాధి పొందుతున్నారు. షిప్‌ల్లో కూడా పనిచేస్తున్నారు. కొందరు సొంతంగా హోటళ్లు, పార్లర్లు, పాస్ట్ ఫుడ్ సెంటర్లు నిర్వహిస్తూ.. 10 మందికి ఉపాధి కల్పిస్తున్నారు. ప్రవేశాలు జరుగుతున్నాయి ఇక్కడ తక్కువ ఫీజుతో కోర్సుల్లో శిక్షణ ఇస్తున్నాం. రాష్ట్రంలో ఇదొక్కటే ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న ఫుడ్‌క్రాఫ్ట్ ఇన్స్టిట్యూట్. అందుకే ఇక్కడ కోర్సులకు డిమాండ్ ఉంది. 10 తరగతి చదువుకుని 25 ఏళ్ల వయసు లోపు వారికి ప్రవేశాలు కలి్పస్తున్నాం. ఇక్కడ శిక్షణ పొందిన వారికి విదేశాల్లో సైతం ఉద్యోగాలు లభిస్తున్నాయి. అందుకే 25 ఏళ్లు దాటిన వారు కూడా శిక్షణ కావాలని కోరుతున్నారు. కనీస అర్హత 30 ఏళ్లకు పొడిగిస్తే మరింత మంది శిక్షణ తీసుకుని అవకాశం ఉంటుంది. ఈ విషయాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తాం. ఈ విద్యా సంవత్సరానికి ఆగస్టు 11 నుంచి తరగతులు ప్రారంభిస్తాం. ప్రవేశాలు పొందాలనుకునే వారు నేరుగా వచ్చి ఇన్స్టిట్యూట్లో సంప్రదించవచ్చు. – రవి, ప్రిన్సిపాల్, ఫుడ్‌క్రాఫ్ట్ ఇన్స్టిట్యూట్ -
నాణ్యమైన వృద్ధుల జీవనం భేష్, రాజస్తాన్‌కు మొదటి స్థానం
సాక్షి, న్యూఢిల్లీ: ‘వృద్ధుల జీవన నాణ్యత’ సూచీలో రాజస్తాన్, మహారాష్ట్ర, బిహార్, తమిళనాడు, మధ్యప్రదేశ్ రాష్ట్రాలు టాప్–5లో నిలిచాయి. ప్రధాన మంత్రి ఆర్థిక సలహా మండలి కోసం ఇనిస్టిట్యూట్ ఫర్ కాంపిటిటివ్నెస్ సంస్థ రూపొందించిన ఈ సూచీని మండలి చైర్మన్ డాక్టర్ వివేక్ దేవ్రాయ్ బుధవారం ఇక్కడ విడుదల చేశారు. ఆర్థిక శ్రేయస్సు, సామాజిక శ్రేయస్సు, ఆరోగ్య వ్యవస్థ, ఆదాయ భద్రత అనే నాలుగు ప్రధాన అంశాలు, వీటికి సంబంధించిన మరో 8 అనుబంధ అంశాల ఆధారంగా ఈ సూచీ రూపొందించారు. ఈ సూచిక దేశంలోని వృద్ధుల అవసరాలు, అవకాశాలను అర్థం చేసుకునే విధానాన్ని విస్తృతం చేస్తుంది. 50 లక్షల పైచిలుకు వృద్ధులు ఉన్న రాష్ట్రాల కేటగిరీలో రాజస్తాన్ మొదటి స్థానంలో నిలవగా ఏపీ 8వ స్థానంలో, తెలంగాణ 10వ స్థానంలో నిలిచాయి. 50 లక్షల కంటే తక్కువ సంఖ్యలో వృద్ధులు ఉన్న రాష్ట్రాల కేటగిరీలో హిమాచల్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్, హరియాణా, ఒడిషా, జార్ఖండ్ రాష్ట్రాలు టాప్–5లో నిలిచాయి. ఈశాన్య రాష్ట్రాల్లో మిజోరాం తొలి స్థానంలో నిలిచింది. కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఛండీగఢ్ తొలిస్థానంలో నిలిచింది. -
ఏపీ: ఐఎల్ఈజీ వైస్ ఛైర్మన్‌గా ఐఏఎస్ అధికారి సమీర్‌శర్మ
సాక్షి, విజయవాడ: ఇనిస్టిట్యూట్ ఆఫ్ లీడర్ షిప్, ఎక్సలెన్స్ అండ్ గవర్నెన్స్ (ఐఎల్ఈజీ) వైస్ ఛైర్మన్, మెంబర్ సెక్రటరీగా సమీర్‌శర్మ నియమితులయ్యారు. ఈ మేరకు సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ ఉత్తర్వులు జారీ చేశారు. సమీర్‌శర్మ ఇటీవలే కేంద్ర సర్వీస్ నుంచి రాష్ట్రానికి వచ్చారు. -
ది ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజినీర్స్‌కు వందేళ్లు..
సాక్షి, ఖైరతాబాద్: అత్యున్నత ప్రతిభ కనబరుస్తూ.. ఎంతో మంది విద్యార్థులను ఉన్నతులుగా తీర్చిదిద్దుతూ.. ఎన్నెన్నో విజయాలను సొంతం చేసుకుంటూ.. నూరేళ్లు పూర్తి చేసుకుంది ‘ది ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజినీర్స్(ఐఈఐ)’.. జాతీయ, అంతర్జాతీయ సదస్సులు, సమావేశాలతో పాటు యువ ఇంజినీర్లను ప్రోత్సహిస్తూ ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా ఉంటూ చేపట్టిన అనేక కార్యక్రమాలతో ఉత్తమ స్టేట్ సెంటర్ అవార్డు సైతం అందుకుంది. 34వ ఇంజినీరింగ్ కాంగ్రెస్ సదస్సుకు హాజరైనరాష్ట్ర గవర్నర్ తమిళిసై (ఫైల్) 1920లో స్థాపించబడిన ‘ది ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజినీర్స్’ స్వర్ణోత్సవాలు తెలంగాణ స్టేట్ సెంటర్లో నిర్వహించాలని నిర్ణయించడంతో సెప్టెంబర్ 15, 2019 నుంచి సెప్టెంబర్ 13, 2020 వరకు ఏడాది పాటు అంతర్జాతీయ, జాతీయ సదస్సులు నిర్వహించారు. 34వ ఇంజినీరింగ్ కాంగ్రెస్‌ను 2019 డిసెంబర్లో నిర్వహించగా కార్యక్రమానికి రాష్ట్ర గవర్నర్ తమిళిసై హాజరయ్యారు. క్లీన్ అండ్ సేఫ్టీ న్యూక్లియర్ పవర్ జనరేషన్‌పై నిర్వహించిన అంతర్జాతీయ సదస్సుకు అనూహ్య స్పందన వచ్చింది. కార్యక్రమానికి ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మైనింగ్ రంగంలో ఎదురయ్యే సవాళ్లు, అధిగమించాల్సిన అంశాలు ఇలా అనేక సెమినార్లతో పాటు యువ ఇంజినీర్లను ప్రోత్సహిస్తూ చేపట్టిన అనేక కార్యక్రమాలు 2018–19కు గాను ఉత్తమ స్టేట్ సెంటర్‌గా అవార్డు దక్కింది. అంతర్జాతీయ సదస్సులో సావనీర్ ఆవిష్కరిస్తున్న ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు కరోనా పరిస్థితుల నేపథ్యంలో వెబినార్ల ద్వారా సదస్సులు నిర్వహించడంతో పాటు స్టేట్ సెంటర్ ఆధ్వర్యంలో సీఎం సహాయ నిధికి రూ.14 లక్షల చెక్కును అందజేశారు. రాబోయే రోజుల్లో ఎప్పటికప్పుడు యువతను ప్రోత్సహించే విధంగా కార్యక్రమాలు చేపట్టడంతో పాటు దేశం, రాష్ట్రాభివృద్ధికి అవసరమయ్యే అంశాలపై సదస్సులు నిర్వహించి ప్రభుత్వానికి సలహాలు, సూచనలు చేసే విధంగా కార్యాచరణ రూపొందిస్తున్నట్లు ఐఈఐ సెక్రటరి టి.అంజయ్య తెలిపారు. వందేళ్ల ముగింపు సందర్భంగా గౌవర కార్యదర్శి అంజయ్య, అదనపు గౌవర కార్యదర్శి ప్రొఫెసర్ డాక్టర్ రమణానాయక్, ప్రొఫెసర్ జి.రాధాకృష్ణ సిబ్బందితో కలిసి కార్యాలయంలో అవార్డులు, రివార్డులను ప్రదర్శించారు. ఉత్సాహంతో ముందుకు.. నాలెడ్జ్‌ను ఎప్పటికప్పుడు పంచుకోవడంతో పాటు ఐఈఐ వందేళ్లు పూర్తయిన సందర్భంగా ఇప్పటి వరకు చేపట్టిన కార్యక్రమాలను మరింత ఉత్సాహంతో ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ట్రాన్స్మీటర్ల ద్వారా విద్యుత్ సరఫరా చేసే టెక్నాలజీ అందుబాటులోకి వస్తున్న తరుణంలో మనం మరో వందేళ్లకు సరిపడా ఇంజినీర్లు ప్లానింగ్ చేసుకోవాలని, రాబోయే తరాలకు నాలెడ్జ్ అందించాల్సిన అవసరం ఉంది. – డాక్టర్ జి.రామేశ్వర్రావు, ఐఈఐ తెలంగాణ స్టేట్ సెంటర్ చైర్మన్ నేడు ముగింపు వేడుక.. ఐఈఐ వందేళ్లు ముగింపు కార్యక్రమాన్ని ఆదివారం వెబినార్ ద్వారా నిర్వహిస్తున్నామని, కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మంత్రి కేటీఆర్, గెస్ట్ హాఫ్ హానర్‌గా మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి హాజరవుతారని తెలిపారు. -
పెళ్లి పేరుతో యువతులకు వల
కర్నూలు: నగర శివారులోని నంద్యాల చెక్‌పోస్టు సమీపంలో సుమౌర్యా మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూట్ ముసుగులో యువతులను మోసగిస్తున్న నయవంచకుడి బండారం బయటపడింది. పెళ్లి పేరుతో తనను నమ్మించి మోసం చేశాడంటూ నగరంలోని ఇందిరాగాంధీ నగర్‌కు చెందిన ఓ యువతి పోలీసులను ఆశ్రయించింది. ఈమె 2012 నుంచి సుమౌర్యా మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూట్లో పనిచేస్తుండేది. ఇన్స్టిట్యూట్ నిర్వాహకుడు సురేష్ బాబు శ్రీనగర్ కాలనీలో నివాసముంటున్నాడు. ఈయనకు రాధారమణితో మొదట వివాహమైంది. అయితే ఆమెకు విడాకులు ఇచ్చి పెళ్లి చేసుకుంటానంటూ ఇన్స్టిట్యూట్కు వచ్చిన ఐదుగురు యువతులతో వివాహేతర సంబంధం కొనసాగించాడని, తనలాగే మరికొందరిని మోసం చేస్తుండటంతో ఇందిరాగాంధీ నగర్‌కు చెందిన యువతి ఈనెల 23వ తేదీన మూడో పట్టణ పోలీసులను ఆశ్రయించింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని విచారించి గురువారం సురేష్ బాబును అదుపులోకి తీసుకొని సెక్షన్ 323, 470, 420 రెడ్‌విత్ 34 ఐపీసీ కింద కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు. ఈ విషయంపై సురేష్ బాబు భార్య రాధారమణిని నిలదీయగా బాధితురాలిపై దాడి చేసినందుకు ఆమెపై కూడా కేసు నమోదు చేశామని పోలీసులు చెప్పారు. -
‘రైతుబంధు’పై అమెరికా సంస్థ అధ్యయనం
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ‘రైతుబంధు’పథకం అమలు తీరుపై అమెరికా పరిశోధన సంస్థ అధ్యయనం చేయనుంది. అమెరికాలోని మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఐటీ)కి చెందిన ఆర్థిక విభాగం ఈ బాధ్యతలు చేపట్టనుంది. ఈ అధ్యయనాని కి ‘హై ఫ్రీక్వెన్సీ మానిటరింగ్ ఎవాల్యువేషన్’అని నామకరణం చేశారు. రైతుబంధు పథకం ప్రారంభమయ్యాక ఈ సంస్థ సర్వే మొ దలు పెడుతుంది. వ్యవసాయ, రెవెన్యూ అధికారుల పనితీరు, వారి సామర్థ్యం అంచనా వేయనుంది. రైతుల అభిప్రాయాలు తీసుకుంటుంది. పథకం వల్ల వారి జీవితాల్లో చోటుచేసుకునే పరిణామాలను తెలుసుకుంటుంది. అనంతరం రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక ఇస్తుంది. 120మండలాల్లో అధ్యయనం.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంస్థలతో అధ్యయనం చేపడితే నిష్పక్షపాతంగా ఉండదని భావించి ఒక అంతర్జాతీయ పరిశోధన యూనివర్సిటీకి రాష్ట్ర ప్రభుత్వం అధ్యయనం బాధ్యతలు అప్పగించింది. వచ్చే నెల 10 నుంచి పెట్టుబడి చెక్కులను ప్రభుత్వం రైతులకు ఇవ్వనున్న సంగతి తెలిసిందే. చెక్కుల పంపిణీ సమయంలోనే వర్సిటీ బృందం అధ్యయనం మొదలుపెడుతుంది. అందుకు 120 మండలాలను కంప్యూటర్ ద్వారా ర్యాండమ్‌గా గుర్తిస్తుంది. ఆ మండలాల వ్యవసాయ, రెవెన్యూ అధికారుల ఫోన్ నంబర్లు, ఇతర వివరాలు తీసుకుంటుంది. ఆయా మండలాలకు చెందిన రైతుల ఫోన్ నంబర్లు, పట్టా వివరాలను రెవెన్యూ శాఖ నుంచి సేకరిస్తుంది. పెట్టుబడి చెక్కులు అందాయా.. లేదా.. ఎంత సొమ్ము అందింది.. ఎక్కడైనా అన్యాయం జరిగిందా.. దానికి బాధ్యులెవరు.. తీసుకున్న పెట్టుబడి సొమ్మును ఏ అవసరాలకు ఉపయోగించారు.. తదితర వివరాలను అధ్యయనం చేస్తుంది. అధ్యయనం చేసిన నివేదికలను ప్రతి 10 రోజులకోసారి రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిస్తారు. ఈ అధ్యయనం నెల రోజులు జరుగుతుందని వ్యవసాయ శాఖ వర్గాలు తెలిపాయి. కాల్ సెంటర్ ఏర్పాటు.. అమెరికన్ పరిశోధన వర్సిటీ ప్రత్యేకంగా కాల్ సెంటర్‌ను ఏర్పాటు చేయనుంది. ఆ కాల్ సెంటర్ నుంచే 120 మండలాలకు చెందిన అధికారులు, రైతులను సంప్రదిస్తుంది. అవసరాన్ని బట్టి క్షేత్రస్థాయి పరిశీలనకు వెళ్తుంది. ఈ అధ్యయనం చేపట్టడంలో ప్రధాన ఉద్దేశం పథకాన్ని సరిగా అమలుచేసేలా అధికారులపై ఒత్తిడి తేవడమేనని వ్యవసాయ శాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. 120 మండలాల్లో పథకం అమలు తీరును పరిశీలించి అధికారుల పనితీరు, సామర్థ్యాన్ని అంచనా వేస్తారు. పైగా అమెరికా సంస్థ తమ సామర్థ్యాన్ని అంచనా వేస్తుందన్న భయంతో అధికారులు తప్పులు దొర్లకుండా సక్రమంగా చెక్కుల పంపిణీ చేస్తారన్న భావన సర్కారులో ఉందని చెబుతున్నారు. రైతుల నుంచి వచ్చే అభిప్రాయాలను బట్టి పథకంలో తీసుకురావాల్సిన మార్పులను గుర్తిస్తారు. అందుకు తగ్గట్లు రబీలో మార్పులు చేర్పులు చేస్తారు. అధ్యయనం ఎలా చేయాలన్న దానిపై వ్యవసాయ శాఖ కమిషనర్ జగన్మోహన్ బుధవారం అధ్యయన బృందంతో సమావేశమయ్యారు. -
'గ్లోబల్ టాప్ ఎంప్లాయర్' గా టీసీఎస్...
టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) ప్రపంచ వ్యాప్త గుర్తింపును తెచ్చుకుంది. ప్రపంచ వ్యాప్తంగా 1,072 సంస్థల్లో టాప్ ఎంప్లాయర్స్ ఇనిస్టిట్యూట్ గా పేరొందిన టీసీఎస్ 'గ్లోబల్ టాప్ ఎంప్లాయర్' అవార్డును అందుకుంది. ప్రపంచ వ్యాప్తంగా తొమ్మిది ఇతర సంస్థలతో సహా శ్రామిక ప్రణాళిక, ఆన్ బోర్డింగ్, అభ్యాసం మరియు అభివృద్ధి, పనితీరు నిర్వహణ, నాయకత్వ అభివృద్ధి వంటి విషయాల్లో అగ్రభాగాన నిలిచింది. ప్రపంచంలోని ఉత్తమ యాజమాన్యాలకు ప్రదానం చేసే ఈ గౌరవ అవార్డును ఇప్పుడు టీసీఎస్ సాధించింది. ఉద్యోగులు, వినియోగదారుల విషయంలో అత్యున్నత ప్రమాణాలను పాటించే తమ యాజమాన్యం ఈ పురస్కారాన్ని అందుకుంటోందని సంస్థ తెలిపింది. ఈ జాబితాలో సీజేఎస్సీ టెక్నిప్, డీహెచ్ ఎల్, డైమెన్షన్ డేటా, సెయింట్ గోబెయిన్, జేటీ ఇంటర్నేషనల్, మొబినిల్, మోబిస్టార్, ఆరెంజ్, వాలియో సంస్థలు ఉన్నాయి. ఈ సంస్థలన్నీ నిరంతరం ముందు చూపుతో ఆలోచిస్తూ తమ ఉద్యోగుల పరిస్థితులు, అభివృద్ధికి మార్గంగా నిలుస్తున్నాయని టీసీఎస్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ అండ్ హ్యూమన్ రిసోర్సెస్ గ్లోబల్ హెడ్ అజయ్ ముఖర్జీ తెలిపారు. ఇది తమ సంస్థకు మంచి విజయమని, దీని స్ఫూర్తితో ప్రపంచవ్యాప్తంగా తమ ఉద్యోగులు, వినియోగదారుల సేవల్లో మరింత అభివృద్ధికి మార్గమౌతుందని సంస్థ చెప్తోంది. -
'కెరీర్ ఎరీనా'తో విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్
-
బోస్ పరిశోధన సంస్థలో అగ్నిప్రమాదం
కోల్‌కతా తూర్పు ప్రాంతంలోని రాజా బజార్లో గల బోస్ పరిశోధన సంస్థలో ఆదివారం అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో సంస్థలో గల మైక్రోబయాలజీ ల్యాబ్ పూర్తిగా అగ్నికి ఆహుతైంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలార్పారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ ఈ ప్రమాదానికి కారణంగా భావిస్తున్నారు. ప్రఖ్యాత శాస్త్రవేత్త జగదీష్ చంద్రబోస్ 1917లో బోస్ పరిశోధన సంస్థను స్థాపించారు. విఙ్ఞాన శాస్త్రానికి సంబంధించిన పలు విభాగాలలో ఇక్కడ పరిశోధనలు నిర్వహిస్తారు. -
ఇకపై సెమిస్టర్ విధానం
డిగ్రీ, పీజీ కోర్సుల్లో భారీ మార్పులు హైదరాబాద్: డిగ్రీ, పీజీ కోర్సుల్లో చాయిస్ బేస్డ్ క్రెడిట్ సిస్టం (సీబీసీఎస్) అమలు చేయాలని తెలంగాణ ఉన్నత విద్యా మండలి నిర్ణయించింది. ఇందులో భాగంగా ముందు సెమిస్టర్ విధానాన్ని ప్రవేశపెట్టాలని నిర్ణయం తీసుకుంది. ఉన్నత విద్యామండలి కార్యాలయంలో గురువారం జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో డిగ్రీ, పీజీ కోర్సుల్లో పలు మార్పులపై చర్చ జరిగింది. ఈ సమావేశంలో విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి రంజీవ్ ఆర్.ఆచార్య, తెలంగాణ ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ పాపిరెడ్డి, వైస్ చైర్మన్లు ప్రొఫెసర్ వెంకటాచలం, ప్రొఫెసర్ మల్లేశ్, కళాశాల విద్య కమిషనర్ వాణి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీబీసీఎస్ అమలుకు చేపట్టాల్సిన చర్యలు, రాష్ట్రంలో విద్యా సంస్థల్లో వాస్తవ పరిస్థితులు, అధ్యాపకుల కొరతపై జరిగిన చర్చల అనంతరం సీబీసీఎస్‌ను అమలు చేయాలని నిర్ణయానికొచ్చారు. కొత్త కోర్సులు, కొత్త సబ్జెక్టులు లేనట్టే.. ప్రస్తుతం ఉన్న సబ్జెక్టులు, కోర్సుల్లోనే సీబీసీఎస్ వర్తింపచేయాలని, కొత్త కోర్సులు, కొత్త సబ్జెక్టులు ప్రస్తుతానికి పక్కన పెట్టాలని నిర్ణయించారు. కొత్త కోర్సులు, కొత్త సబ్జెక్టులు ప్రవేశ పెడితే కాలేజీల్లోనే కాకుండా యూనివర్సిటీల్లోనూ ఇబ్బందులు తప్పవని భావించారు. అందుకే ప్రస్తుతం డిగ్రీ కోర్సులో సివిల్స్‌కు అనుగుణంగా సిలబస్‌లో మార్పులు చేయనున్న నేపథ్యంలో.. ఆ సిలబస్‌లోనే 2015-16 విద్యా సంవత్సరం నుంచే సీబీసీఎస్ విధానం వర్తింపజేయాలని, ఇందులో భాగంగా అన్ని రకాల డిగ్రీ, పీజీ కోర్సుల్లో సెమిస్టర్ విధానం, పరీక్షల ఫలితాల్లో గ్రేడింగ్ విధానం అమలు చేయాలని నిర్ణయానికొచ్చారు. గతంలో యూనివర్సిటీలు, అటానమస్ కాలేజీలు, ఇతర డిగ్రీ కాలేజీల్లో దశల వారీగా అమలు చేయాలని భావించినా అది సాధ్యం కాదని తేల్చారు. రాష్ట్రంలోని 1,200కు పైగా ఉన్న ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్ డిగ్రీ కాలేజీలు, పీజీ కాలేజీలు, యూనివర్సిటీల్లో ఈ విధానం అమలు చేయనున్నారు. సీబీసీఎస్‌లోని కోర్ సబ్జెక్టుల్లోనే (ప్రస్తుతం ఉన్న సబ్జెక్టులు) దీన్ని ప్రవేశపెట్టాలని, మరో రెండు అంశాలైన ఎలక్టివ్, ఫౌండేషన్ సబ్జెక్టుల విషయాన్ని తరువాత పరిశీలించాలని నిర్ణయం తీసుకున్నారు. అలాగే సీబీసీఎస్ అమలుకు ప్రత్యేక దృష్టి సారించాలని నిర్ణయించారు. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ పేర్కొన్న కోర్సులు, సబ్జెక్టులు కాకుండా రాష్ట్రంలో ఉన్న కోర్సుల్లో దీన్ని అమలు చేయాలని నిర్ణయించారు. కొన్ని నోడల్ కాలేజీలను ఏర్పాటు చేసి, వాటి పరిధిలోని కాలేజీల్లో సీబీసీఎస్ అమలును అవి పర్యవేక్షి ంచేలా చర్యలు చేపట్టాలని నిర్ణయించారు. అలాగే అటానమస్ కాలేజీల ఏర్పాటు కోసం ప్రోత్సాహకాలు అందించాలన్న అభిప్రాయానికి వచ్చారు. సెమిస్టర్ విధానంలో సమస్యలు ఉంటాయని, అందుకే జిల్లాకో పరీక్షల విభాగం ఏర్పాటు చేసి, పరీక్షల నిర్వహణ పక్కాగా ఉండేలా చర్యలు చేపట్టాలని నిర్ణయించారు. -
అదిరిన ‘టెక్ ఫెస్ట్’
-
వైద్యవృత్తికే కళంకం తెస్తున్నారు
మదనపల్లె ఏరియా ఆస్పత్రి వైద్యులపై డీసీహెచ్‌ఎన్ మండిపాటు మదనపల్లెక్రైం: ‘ఓ ప్రభుత్వ ఇన్స్టిట్యూట్లో పనిచేసే వైద్యులు ఓ విధి, విధానం లేకుండా వ్యవరించడం తగదు. తమకు కేటాయించిన ఓపీడీలోని రోగులను మాత్రమే పరీక్షించి, పక్క ఓపీడీకి చెందిన వారు వస్తే నాకు సంబంధం లేదు.. మరోచోటుకు వెళ్లమని కసురుకోవడం వైద్యవృత్తికే కళంకం తెస్తుంది. కొంతమంది డాక్టర్లు గిరగీసుకుని వైద్యం చేయడం ఏంటి?. అత్యవసర విభాగంలో డ్యూటీచేసే వారు రోగులు లేనప్పుడు జనరల్ కేసులను కూడా చూడాలి’ అంటూ జిల్లా వైద్యశాలల సంమన్వయకర్త(డీసీహెచ్‌ఎన్) డాక్టర్ సరళమ్మ మదనపల్లె ప్రభుత్వాస్పత్రి వైద్యులపై విరుచుకుపడ్డారు. గురువారం ఆమె ఏరియా ఆస్పత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్థానిక డాక్టర్లు, సిబ్బంది తీరుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మధ్యాహ్నం రెండు గంటలు కాకముందే కొంత మంది డాక్టర్లు ఇళ్లకు వెళ్లిపోతున్నారని, ఆస్పత్రిలో ఎవరు డాక్టర్లు, ఎవరు సిబ్బంది.. ఎవరు బయటి వ్యక్తులనే తేడా తెలియడంలేదన్నారు. డాక్టర్లు యూనిఫామ్, గుర్తింపు కార్డులు వేసుకోవాలన్నారు. అత్యవసర విభాగం నుంచి ఎక్స్‌రే, ల్యాబ్, ఫార్మసీ, డ్రగ్స్టోర్రూము, వార్డులను ఆమె పరిశీలించారు. కొత్తగా నిర్మిస్తున్న ఆపరేషన్థియేటర్లో కొన్ని మార్పులను సూచించారు. ఆప్తాలమిక్ కేసులకు ఓ ప్రత్యేక గదిని ఏర్పాటు చేసుకోవాలన్నారు. వైద్య సదుపాయాలపై ఆరా తీశారు. విధులకు హాజరయ్యే డాక్టర్లు ఓ పద్ధతి లేకుండా వ్యవహరిస్తున్నట్లు తనకు పలు ఫిర్యాదులు వచ్చాయని, దీనికి నేను చాలాషేమ్గా ఫీలవుతున్నానని అన్నారు. ఆస్పత్రిలో ఎంఎన్‌వో, ఎఫ్‌ఎన్‌వోలు తాము చేయాల్సిన పనులను స్వీపర్లతో చేయించడం తగదన్నారు. పనులు చేయలేని వారు ఇళ్లకు వెళ్లిపోవాలన్నారు. ఆదివారాల్లో ఓపీడీ లేకపోయినా వైద్యులు విధిగా ఆస్పత్రికి వచ్చి వార్డుల్లో ఉన్న తమ పేషంట్లను చూడాలన్నారు. డాక్టర్లు లీవు తీసుకుని మాత్రమే వెళ్లాల్సి ఉంటుందన్నారు. ఆర్ఎంవోనే పూర్తి బాధ్యతలు తీసుకుని ఆస్పత్రిని ప్రక్షాళన చేయాలన్నారు. మాట వినని వారిపై వేటు వేయాలని, దిక్కరిస్తే తనకు సరెండర్ చేయాలని సూచించారు. రోగులకు మందుల కొరత లేకుండా చూసుకోవాలన్నారు. జిల్లాలో 27 వైద్య పోస్టులు ఖాళీ జిల్లావ్యాప్తంగా 27 వైద్య పోస్టులు కొరత ఉన్నట్టు డీసీహెచ్‌ఎన్ డాక్టర్ సరళమ్మ తెలిపారు. ఆమె స్థానిక విలేకరులతో మాట్లాడుతూ డాక్టర్ పోస్టుల భర్తీకి సీఏఎస్‌ల నుంచి దరఖాస్తులు తీసుకుంటున్నామన్నారు. కమిషనర్ నుంచి ఉత్తర్వులు వెలువడగానే పోస్టులభర్తీ ప్రక్రియ చేపడతామన్నారు. మదనపల్లె ఏరియా ఆస్పత్రిలో వెంటిలేటర్లు లేక పలుకేసులను రెఫర్ చేస్తున్నారని విలేకర్లు ప్రశ్నించగా వాటిని ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామన్నారు. ఈ సమా వేశంలో ఆర్ఎంవో గురుస్వామినాయక్, డాక్టర్ జ్ఞానేశ్వర్, హెడ్ నర్సులు, ఆప్తాలమిక్ ఆఫీసర్ ఆజాద్ తదితరులు పాల్గొన్నారు. -
సబ్జెక్ట్ ఏదైనా ప్రాక్టీస్‌కు ప్రాధాన్యం
‘చిన్ననాటి నుంచి బెస్ట్ ఇన్స్టిట్యూట్లో ఇంజనీరింగ్ చదవాలనే ఆశయం.. దానికోసం ఎనిమిదో తరగతి నుంచే కృషి... వీటికి కుటుంబ సభ్యుల తోడ్పాటు.. ప్రోత్సాహం తోడవడం.. తాజా విజయానికి ప్రధాన కారణాలు’ అంటున్నాడు జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో ఆల్ ఇండియా స్థాయిలో రెండో ర్యాంకు సాధించిన చింతకింది సాయిచేతన్. ఐఐటీ-ముంబైలో సీఎస్ఈ పూర్తి చేసి తర్వాత సివిల్ సర్వీసెస్‌లో విజయంతో ప్రజలకు సేవ చేయడమే తన లక్ష్యం అంటున్న చింతకింది సాయిచేతన్ సక్సెస్ స్పీక్స్.. స్వస్థలం మహబూబ్ నగర్ జిల్లా ముత్పూర్ గ్రామం. అమ్మానాన్న ఉద్యోగాల రీత్యా హైదరాబాద్‌లో స్థిరపడ్డాం. నాన్న సురేందర్ రెడ్డి అకౌంటెంట్ జనరల్ కార్యాలయంలో అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్. అమ్మ నిర్మల లాలాపేటలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్‌గా పని చేస్తున్నారు. ఈ విజయంలో అమ్మ, నాన్నల తోడ్పాటు ఎంతగానో ఉంది. చిన్ననాటి నుంచే ఇంజనీరింగ్‌పై దృష్టి: ఇంజనీరింగ్ చదవాలి.. అది కూడా అత్యున్నత ఇన్స్టిట్యూట్లో చదవాలి అనే కోరిక చిన్ననాటి నుంచే ఉంది. అందుకు మార్గం ఐఐటీలే అని తెలిసింది. బాబాయి జితేందర్ రెడ్డి ఐఐటీ-ఖరగ్‌పూర్‌లో ఎంటెక్ పూర్తి చేశారు. బంధువుల్లోనూ చాలామంది ఐఐటీల్లో చదివారు. ఆదే స్ఫూర్తితో ఐఐటీల్లోనే ఇంజనీరింగ్ సీటు సాధించాలనే పట్టుదల పెరిగింది. అందుకే ఎనిమిదో తరగతి నుంచే ఐఐటీకి ఫౌండేషన్ కోర్సులో చేరాను. ప్రిపరేషన్.. ప్రణాళికబద్ధంగా: ఐఐటీకి పూర్తి స్థాయిలో ప్రిపరేషన్ మాత్రం ఇంటర్మీడియెట్ మొదటి సంవత్సరంలో మొదలుపెట్టాను. క్లాస్‌రూం సెషన్స్, స్టడీ అవర్స్, సెల్ఫ్ స్టడీ అన్నీ కలిపి రోజుకు 11-12 గంటలు చదివేలా ప్రణాళిక రూపొందిం చుకున్నా. జేఈఈ పరీక్షలో అన్ని సబ్జెక్ట్‌లకు సమ ప్రాధాన్యం ఉంటుంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని వ్యూహాత్మకంగా చదివాను. అన్ని సబ్జెక్ట్‌లకు సమ ప్రాధాన్యం ఇస్తూ ప్రిపరేషన్ సాగించాను. వాస్తవానికి ఇనార్గానిక్ కెమిస్ట్రీ అంటే కొంత క్లిష్టంగా ఉండేది. అయితే దీనికోసం ప్రత్యేకించి సమయం కేటాయించకుండా మిగతా సబ్జెక్ట్‌ల మాదిరిగానే చదివాను. అందుబాటులోని సమయంలోనే పరిపూర్ణ అవగాహన సాధించేందుకు కృషి చేశాను. బేరీజు వేసుకుంటూ: జేఈఈలో ప్రశ్నలన్నీ ఎన్సీఈఆర్టీ సిలబస్ నుంచే ఉంటాయి. దీన్ని దృష్టిలో ఉంచుకుని.. ఇంటర్మీడియెట్ బోర్డ్ సిలబస్‌ను.. ఎన్సీఈఆర్టీ 11, 12 తరగతుల సిలబస్‌ను బేరీజు వేసుకుంటూ చదివాను. బోర్డ్ సిలబస్‌లో లేని, ఎన్సీఈఆర్టీలో మాత్రమే ఉన్న అంశాలకు ప్రత్యేక సమయం కేటాయించాను. ఏ విషయాన్నయినా ఒక్కసారి చదివితే మెదడులో నిక్షిప్తమవుతుంది. అది బాగా అడ్వాంటేజ్‌గా మారింది. మా బ్యాచ్ నుంచి ఐపీఈ సిలబస్ మారింది. దాదాపు ఎన్సీఈఆర్టీ సిలబస్ మాదిరిగానే ఉంది. కాబట్టి ప్రత్యేకించి చదవాల్సిన అంశాలు చాలా తక్కువగా ఉండడం కూడా కలిసొచ్చిందనే చెప్పాలి. ప్రాక్టీస్ + అప్లికేషన్ ఓరియెంటేషన్: చదవడం ఎంత ముఖ్యమో... చదివిన అంశాలను ప్రాక్టీస్ చేయడమూ అంతే ముఖ్యం. అందుకే ప్రతి రోజు చదివిన అంశాలను కచ్చితంగా ప్రాక్టీస్ చేయడం హాబీగా చేసుకున్నాను. అంతేకాకుండా మ్యాథమెటిక్స్ నుంచి ఆర్గానిక్ కెమిస్ట్రీ వరకు ప్రతి అంశాన్ని అప్లికేషన్ ఓరియెంటేషన్‌లో చదవడం లాభించింది. వీటితోపాటు ప్రతి రోజు చదివిన అంశాలకు సంబంధించి సొంత నోట్స్ రాసుకోవడం రివిజన్ సమయంలో బాగా ఉపయోగపడింది. తద్వారా ఈ విజయం సాధ్యమైంది. ఐఐటీ టు ఐఏఎస్: ప్రస్తుతం వచ్చిన ర్యాంక్‌తో ఐఐటీ-ముంబైలో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్‌లో చేరతాను. నాలుగేళ్ల ఈ కోర్సు పూర్తయ్యాక సివిల్ సర్వీసెస్ పరీక్షలకు హాజరై ఐఏఎస్ సాధించాలని.. తద్వారా ప్రజలకు సేవ చేయడమే భవిష్యత్తు లక్ష్యంగా నిర్ణయించుకున్నాను. ఒత్తిడి లేకుండా.. లక్ష్యంపైనే దృష్టి: జేఈఈ లక్ష్యంగా పెట్టుకున్న విద్యార్థులు ఎట్టి పరిస్థితుల్లోనూ ఒత్తిడికి గురి కాకూడదు. ఏదైనా ఒక నిర్దిష్టమైన అంశాన్ని చదువుతూ ఒత్తిడికి గురైతే.. వెంటనే దాన్ని వదిలేసి సులువుగా, ఇష్టంగా ఉన్న అంశం చదవడం మేలు. అంతేకాకుండా ఒత్తిడికి లోనైతే లక్ష్యంపై నుంచి దృష్టి మళ్లే ప్రమాదం ఉంది. సబ్జెక్ట్ ఏదైనా ప్రాక్టీస్‌కు ప్రాధాన్యం ఇవ్వడం ఏమాత్రం విస్మరించకూడదు. మానసిక సంసిద్ధత, ఆత్మవిశ్వాసం ఆయుధాలుగా అడుగులు వేస్తే విజయావకాశాలు మెరుగుపరచుకోవచ్చు. అకడెమిక్ ప్రొఫైల్: 2012లో పదోతరగతి ఉత్తీర్ణత (9.8 జీపీఏ) 2014లో ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణత (983 మార్కులు) ఎంసెట్-2014లో 10వ ర్యాంకు బిట్‌శాట్-2014 స్కోర్ 398 జేఈఈ-మెయిన్ మార్కులు - 340 జేఈఈ-అడ్వాన్స్డ్ మార్కులు- 320 -
విద్యా రుణాలు...భవితకు వరాలు
ఓ వైపు బంగారు భవిష్యత్తును చూపించే కోర్సులు.. మరో వైపు కళ్లు చెదిరే ఫీజులు.. కోర్సులో చేరాలనే బలమైన ఆకాంక్ష.. అనుకూలించని ఆర్థిక పరిస్థితులు.. చివరకు రాజీ ధోరణితో ఏదో ఒక కోర్సులో చేరడం..ప్రతిభ, నైపుణ్యాలు మెండుగా ఉన్నప్పటికీ ప్రస్తుత విద్యా ప్రపంచంలో అధిక శాతం మందికి ఎదురవుతున్న అనుభవం. అయితే.. విద్యార్థులు ఈ పరిస్థితిని అధిగమించొచ్చు. ప్రతిభ ఉంటే రాజీ పడాల్సిన అవసరమే లేదు. కారణం.. బ్యాంకులు విద్యా రుణాల పేరుతో అందిస్తున్న భరోసానే. రాష్ట్రంలోనే కాకుండా.. దేశవ్యాప్తంగా ఉన్న ఇన్స్టిట్యూట్లలో.. విదేశాల్లోనూ చదవాలనుకునే ప్రతిభ ఉన్న విద్యార్థులకు అన్ని జాతీయ బ్యాంకులు విద్యా రుణాలు అందిస్తున్నాయి. ఉన్నత విద్య దిశగా ప్రోత్సహిస్తున్నాయి. విద్యా సంవత్సరం ప్రారంభమవుతున్న నేపథ్యంలో.. విద్యా రుణాల విధివిధానాలపై విశ్లేషణ.. ఎన్నో కోర్సులు.. వాటిని పూర్తి చేస్తే మరెన్నో అవకాశాలు. ఒకేషనల్ నుంచి ఓవర్సీస్ ఎడ్యుకేషన్ వరకు ఔత్సాహిక విద్యార్థులకు ఉన్నత విద్య దిశగా ఎన్నెన్నో మార్గాలు. వాటికి సరిపడే అర్హతలూ, ప్రతిభాపాటవాలు విద్యార్థులకు ఉంటున్నాయి. కానీ ఈ అవకాశాలను అందుకుంటున్న విద్యార్థులు కొందరే. కారణం.. రూ. లక్షల్లో ఉంటున్న ఫీజులు. కేవలం రుసుముల కారణంగా.. అన్ని అర్హతలు ఉన్నప్పటికీ ఆశించిన కోర్సులో చేరలేక ఏదో ఒక కోర్సుకు పరిమితమవుతున్న వారి సంఖ్య లక్షల్లోనే. దీంతో దేశంలో నైపుణ్యం కలిగిన మానవ వనరుల కొరత ఏర్పడుతోంది. దీన్ని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం.. ఉన్నత విద్యను అభ్యసించాలనుకునే ప్రతిభావంతులకు ‘విద్యా రుణాలు’ పేరుతో ఆర్థిక చేయూతనిచ్చేందుకు ఎన్నో చర్యలు చేపడుతోంది. ఇండియన్ బ్యాంకర్స్ అసోసియేషన్‌తో సంప్రదింపులు సాగించి అన్ని జాతీయ బ్యాంకుల్లో విద్యా రుణ పథకాలను అమలు చేసే విధంగా చర్యలు తీసుకుంది. దీంతో ఇప్పుడు ఇంటర్మీడియెట్ అర్హతగా ప్రవేశం లభించే సాధారణ బ్యాచిలర్ డిగ్రీ కోర్సులు మొదలు మరెన్నో కోర్సులకు రుణ సదుపాయం అందుబాటులోకి వచ్చింది. గుర్తింపు పొందిన కోర్సులకే విద్యా రుణాలు మంజూరు చేసే విషయంలో కేంద్ర ప్రభుత్వం, ఇండియన్ బ్యాంకర్స్ అసోసియేషన్ సంయుక్తంగా.. ఈ రుణాలకు అర్హమైన కోర్సులను నిర్దేశించాయి. దీని ప్రకారం.. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ), కేంద్ర ప్రభుత్వం, అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ), ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్(ఐసీఎంఆర్) తదితర నియంత్రణ సంస్థల పరిధిలోని యూనివర్సిటీల్లో లభించే బ్యాచిలర్, పోస్ట్ గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా కోర్సులన్నిటికీ రుణ సదుపాయం లభిస్తుంది. అంతేకాకుండా ప్రొఫెషనల్ కోర్సులుగా పేరొందిన చార్టర్డ్ అకౌంటెన్సీ, కంపెనీ సెక్రటరీ, ఐసీడబ్ల్యుఏ వంటి కోర్సుల ఔత్సాహికులు కూడా విద్యా రుణాల దరఖాస్తుకు అర్హులే. వీటితోపాటు ఐఐటీలు, ఐఐఎంలు, ఎన్ఐటీల వంటి ఇన్‌స్టిట్యూట్‌లతోపాటు, ఇతర అన్ని జాతీయ ప్రాధాన్యమున్న ఇన్స్టిట్యూట్స్ (కేంద్ర ప్రభుత్వ నిధులతో నిర్వహించే సంస్థలు)లో ప్రవేశం పొందాలనుకునే విద్యార్థులు కూడా విద్యా రుణాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. అన్నిటికంటే అత్యంత ఆకర్షణీయ అంశం రూ. లక్షల ఖర్చుతో కూడుకున్న పైలట్ శిక్షణ కోర్సులకు కూడా రుణ సదుపాయం అందుబాటులోకి తేవడం. అయితే దీనికి సంబంధించి సదరు శిక్షణనిచ్చే సంస్థకు డెరైక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ గుర్తింపు తప్పనిసరి. విదేశీ విద్యకు ప్రతిభావంతులైన విద్యార్థుల విషయంలో విదేశీ విద్య ఔత్సాహికులకు కూడా ఈ విద్యా రుణాలు అందుబాటులోకి వచ్చాయి. స్టడీ అబ్రాడ్‌కు సంబంధించి ఆయా దేశాల నియంత్రణ సంస్థల గుర్తింపు పొందిన యూనివర్సిటీల్లో జాబ్ ఓరియెంటెడ్, ప్రొఫెషనల్, టెక్నికల్ కోర్సుల ఔత్సాహికులు, ఎంబీఏ, ఎంసీఏ, ఎంఎస్ వంటి కోర్సులు చదవాలనుకునేవారు విద్యా రుణాలకు అర్హులు. దేశంలో ఒకేషనల్ కోర్సులకు కూడా దీర్ఘకాలిక వ్యవధిలో ఉండే బ్యాచిలర్స్ డిగ్రీ, పీజీ కోర్సులే కాకుండా మూడు నెలలు మొదలు రెండు, మూడేళ్ల వ్యవధిలో ఉండే వృత్తి విద్యా కోర్సుల్లో ప్రవేశించాలనుకునే విద్యార్థులకు కూడా రుణ సదుపాయం కల్పిస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా మోడల్ ఎడ్యుకేషన్ లోన్ ఫర్ ఒకేషనల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ పేరుతో ఒక ప్రత్యేక పథకాన్ని రూపొందించారు. దీనికి ప్రధాన కారణం ఆయా వృత్తి నైపుణ్యాలను అందించే రంగాల్లో సుశిక్షితులైన మానవ వనరులను తీర్చిదిద్దడమే. ఈ క్రమంలో నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, ఇతర ప్రభుత్వ వృత్తి విద్యా సంస్థల గుర్తింపు పొందిన సంస్థలలో కోర్సులను ఈ విద్యా రుణాలకు అర్హమైన కోర్సులుగా పేర్కొన్నారు. దీంతో ఆయా సంస్థలు అందించే స్వల్పకాలిక కోర్సుల నుంచి ఐటీఐలు, పాలిటెక్నిక్ కోర్సుల వరకు దాదాపు అన్ని ఒకేషనల్ కోర్సులకు విద్యా రుణాలు అందుబాటులోకి వస్తున్నాయి. రుణ మొత్తం కోర్సు కాల వ్యవధి ఆధారంగా ఉంటుంది. మూడు నెలల వ్యవధిలోని కోర్సులకు రూ. 10 వేలు; మూడు నెలల నుంచి ఆరు నెలల వ్యవధిలోని కోర్సులకు రూ. 25 వేలు; ఏడాది వ్యవధి గల కోర్సులకు రూ. 50 వేలు; ఏడాదికంటే ఎక్కువ వ్యవధి గల కోర్సులకు రూ. 1.5 లక్షలుగా నిర్ణయించారు. ప్రభుత్వ నిర్దేశిత ఫీజు మొత్తాలకు మాత్రమే విద్యా రుణాలను అందించే విషయంలో ప్రభుత్వం, బ్యాంకర్స్ అసోసియేషన్లు కలిసి కొన్ని నిబంధనలను నిర్దిష్టంగా పేర్కొన్నాయి. ముఖ్యంగా రుణ మొత్తం మంజూరుకు సంబంధించి స్పష్టమైన విధివిధానాలను పేర్కొన్నారు. ఈ క్రమంలో ఆయా కోర్సులకు సంబంధించి ప్రభుత్వం నిర్దేశించిన ట్యూషన్ ఫీజులకు సమానమైన మొత్తానికి మాత్రమే రుణాలను అందిస్తారు. మేనేజ్మెంట్ కోటాలో చేరినా ప్రభుత్వం నిర్దేశించిన ఫీజు మేరకే రుణం మంజూరు చేస్తారు. రుణ మొత్తాలు ఇలా దేశంలో, విదేశాల్లో విద్యాభ్యాసానికి సంబంధించి రుణ సదుపాయంపై బ్యాంకులు గరిష్ట పరిమితులు విధించాయి. దీని ప్రకారం దేశంలోని విద్యా సంస్థల్లో కోర్సులకు గరిష్టంగా రూ. పది లక్షలు, విదేశీ విద్యకు గరిష్టంగా రూ. 20 లక్షలు మంజూరు చేస్తారు. అంతేకాకుండా మొత్తం రుణాలకు సంబంధించి మార్జిన్ మనీ (విద్యార్థులు సొంతంగా భరించాల్సిన మొత్తం)ని కూడా నిర్దేశించాయి. రూ. నాలుగు లక్షల వరకు ఎలాంటి మార్జిన్ మనీ ఉండదు. రుణ మొత్తం రూ.నాలుగు లక్షలు దాటితే స్వదేశంలో విద్యకు 5 శాతం, విదేశీ విద్యకు 15 శాతం మార్జిన్ మనీ నిబంధన అమలులో ఉంది. హామీల నిబంధనలివే రుణ మంజూరుకు సంబంధించి విద్యార్థులు కొన్ని హామీలు సమర్పించాల్సి ఉంటుంది. ఈ విషయంలోనూ రూ. నాలుగు లక్షల వరకు ఎలాంటి హామీ అవసరం లేదు. కేవలం తల్లిదండ్రులను సహ దరఖాస్తుదారులుగా పేర్కొంటే సరిపోతుంది. రూ. నాలుగు లక్షల నుంచి రూ. 7.5 లక్షల వరకు తల్లిదండ్రుల హామీతో పాటు థర్డ్‌పార్టీ గ్యారెంటీ సమర్పించాలి. రూ.7.5 లక్షల కంటే ఎక్కువ రుణాలకు తల్లిదండ్రుల హామీతోపాటు స్థిరాస్థులను కొల్లేటర్ సెక్యూరిటీగా చూపించాలి. వడ్డీ రేట్లలోనూ చేయూత ఆయా రుణ మొత్తాలపై వసూలు చేసే వడ్డీ రేట్ల విషయంలోనూ బ్యాంకులు సరళీకృత విధానాలను అమలు చేస్తున్నాయి. ప్రస్తుతం 10.5 శాతం నుంచి 13.00 శాతం వరకు వార్షిక వడ్డీరేటును వసూలు చేస్తున్నాయి. ఈ వడ్డీ రేట్లు ఆయా బ్యాంకుల అంతర్గత నిబంధనల మేరకు నిర్ణయమవుతున్నాయి. అంతేకాకుండా మహిళా విద్యార్థులను ఉన్నత విద్య దిశగా ప్రోత్సహించే క్రమంలో అన్ని బ్యాంకులు దాదాపు ఒక శాతం వడ్డీని తక్కువగా వసూలు చేస్తున్నాయి. సీఎస్ఐఎస్ స్కీం.. ప్రత్యేక సదుపాయం వడ్డీ గణన విషయంలో విద్యార్థులకు వెసులుబాటు కల్పించే క్రమంలో 2009లో కేంద్ర ప్రభుత్వం సెంట్రల్ సెక్టార్ ఇంట్రెస్ట్ సబ్సిడీ (సీఎస్ఐఎస్) స్కీంను ప్రవేశపెట్టింది. ఈ స్కీం 2009-10 విద్యా సంవత్సరం నుంచి అమల్లోకి వచ్చింది. దీని ప్రకారం కోర్సు వ్యవధిలో వడ్డీ రేటును లెక్కించరు. దీని ఫలితంగా అంతకు ముందు మాదిరిగా రుణం మంజూరు చేసిన రోజు నుంచి వడ్డీ చెల్లించాల్సిన అవసరం విద్యార్థులకు తప్పింది. తిరిగి చెల్లింపు ఇలా విద్యా రుణాలు పొందిన విద్యార్థులు ఆ మొత్తాలను కోర్సు పూర్తి చేసుకున్న ఒక ఏడాది తర్వాత నుంచి లేదా ఉద్యోగం పొందిన ఆరు నెలల తర్వాత నుంచి (రెండిట్లో ముందుగా ఏది సాధ్యమైతే దానినే పరిగణనలోకి తీసుకుంటారు) నెల వాయిదాల రూపంలో చెల్లించాల్సి ఉంటుంది. అప్పటి వరకు రీపేమెంట్ హాలిడే లేదా మారటోరియం పేరుతో తిరిగి చెల్లింపు విషయంలో బ్యాంకులు వెసులుబాటు కల్పిస్తున్నాయి. ఒకవేళ విద్యార్థులు అనివార్య కారణాల వల్ల కోర్సును నిర్దిష్ట గడువు లోపు పూర్తి చేయలేక పోయినా.. మరో రెండేళ్లు రీపేమెంట్ హాలిడే సదుపాయాన్ని అందిస్తు న్నాయి. అకడెమిక్ ట్రాక్ రికార్డ్‌పైనా దృష్టి విద్యా రుణాలు మంజూరు చేసే క్రమంలో బ్యాంకులు విద్యార్థుల అకడెమిక్ రికార్డ్‌పైనా ప్రత్యేక దృష్టి సారిస్తున్నాయి. కొన్ని బ్యాంకులు నిర్దిష్ట పర్సంటేజ్‌తో ఉత్తీర్ణత సాధించాలనే నిబంధనను విధిస్తున్నాయి. సాధారణంగా కనీసం 60 శాతం మార్కులతో ఉత్తీర్ణులైన విద్యార్థులకు ప్రాధాన్యమిస్తున్నాయి. అంతేకాకుండా నిరంతరం ఆయా కళాశాలల యాజమాన్యాల సహకారంతో విద్యార్థుల ట్రాక్ రికార్డ్‌ను తెలుసుకుంటున్నాయి. కాబట్టి రుణం మంజూరు చేయించుకోవడంతో పాటు.. ఆ తర్వాత అకడెమిక్గానూ మంచి ప్రదర్శన కనబర్చాల్సిన అవసరం విద్యార్థులపై ఉంటోంది. రుణ మొత్తాలు.. వీటికే బ్యాంకులు మంజూరు చేసే విద్యా రుణాల్లో ట్యూషన్ ఫీజుతోపాటు మరికొన్ని వ్యయాలను కూడా పరిగణనలోకి తీసుకుంటున్నాయి. అవి.. ట్యూషన్ ఫీజు లైబ్రరీ/లేబొరేటరీ/ఎగ్జామినేషన్ ఫీజు పుస్తకాలు, యూనిఫామ్స్, కోర్సు అభ్యసనానికి అవసరమయ్యే ఇతర పరికరాలు (కంప్యూటర్లు తదితర) కొనుగోలు వ్యయం. స్టడీ టూర్స్, ప్రాజెక్ట్ వర్క్స్‌కు వెచ్చించే మొత్తం. విదేశీ విద్య ఔత్సాహికులకు సంబంధించి ప్రయాణ ఖర్చులు అన్ని బ్యాంకులు ప్రధానంగా వీటి ఆధారంగానే రుణ మొత్తాలను ఖరారు చేస్తాయి. వాటిని నేరుగా కళాశాలలకు అందిస్తాయి. ఒకవేళ అప్పటికే విద్యార్థులు ఆయా ఫీజులను చెల్లించి ఉంటే తగిన ఆధారాలను పరిశీలించి సదరు మొత్తాన్ని విద్యార్థి చేతికి అందిస్తాయి. కోర్సు మిగతా సమయాల్లో చెల్లించాల్సిన మొత్తాలను కళాశాలలకు చెల్లిస్తాయి. రుణ దరఖాస్తుకు సమర్పించాల్సిన పత్రాలు ప్రవేశం లభించిన ఇన్స్టిట్యూట్ నుంచి ఫీజు, ఇతర అకడెమిక్ సంబంధిత ఖర్చులతో కూడిన అడ్మిషన్ లెటర్ వయసు నిర్ధారణకు సంబంధించి వయో ధ్రువీకరణ పత్రం అప్పటి వరకు పొందిన అకడెమిక్ అర్హతలకు సంబంధించి సర్టిఫికెట్ల నకలు ప్రతులు తల్లిదండ్రులు/కో-అప్లికెంట్స్/హామీదారుల ఆదాయ ధ్రువీకరణ పత్రాలు. కొల్లేటర్ సెక్యూరిటీకి సంబంధించి వాల్యుయేషన్ సర్టిఫికెట్ విదేశీ విద్య ఔత్సాహికులు పాస్‌పోర్ట్, వీసా, అడ్మిషన్ లెటర్, ప్రయాణ ఖర్చులకు సంబంధించిన నకలు ప్రతులు. విద్యార్థులు, తల్లిదండ్రులు, గ్యారంటార్ల పాస్‌పోర్ట్ సైజ్ ఫొటోగ్రాఫ్స్ ఇటీవల కాలంలో బ్యాంకులు దరఖాస్తు చేసుకునే బ్రాంచ్ విషయంలోనూ కొన్ని నిబంధనలు పాటిస్తున్నాయి. దీని ప్రకారం విద్యార్థులు తమ నివాస పరిధిలోని లేదా తాము చేరిన కళాశాల/ఇన్స్టిట్యూట్ సమీపంలోని బ్యాంకుల బ్రాంచ్‌లలోనే దరఖాస్తు చేయాల్సిన అవసరం ఉంది. బ్యాంకుల నుంచి ఎంతో చేయూత విద్యా రుణాల విషయంలో బ్యాంకులు ఎంతో చేయూతనిస్తున్నాయి. ప్రతిభావంతులైన విద్యార్థులకు ఉన్నత విద్య కలలను నిజం చేసేందుకు ఎన్నో సౌకర్యాలు కల్పిస్తున్నాయి. ఈ క్రమంలో రీపేమెంట్ హాలిడే, మహిళలకు వడ్డీ రాయితీ వంటి సదుపాయాలను అందిస్తున్నాయి. నెలవారీ వాయిదాల చెల్లింపు విషయంలోనూ విద్యార్థుల కోణంలో ఆలోచిస్తున్నాయి. నిర్దిష్ట రీపేమెంట్ గడువు కంటే ముందే రుణ మొత్తాన్ని తిరిగి చెల్లిస్తే మొత్తం వడ్డీ నుంచి ఒక శాతం గుడ్‌విల్ అందిస్తున్నాయి. విద్యార్థులు ఈ సౌకర్యాలను అందిపుచ్చుకుని ఉన్నత విద్యలో రాణించాలని అభిలషిస్తున్నాను. - ఆర్.సి. రాజన్, జీఎం, కెనరా బ్యాంక్ ముందస్తు కసరత్తుతో సులువుగా విద్యా రుణాలకు దరఖాస్తు చేసుకునేవారు ఆ ప్రక్రియను ముందుగానే ప్రారంభించాలి. అన్ని బ్యాంకుల్లో లోన్ ప్రాసెసింగ్‌కు 15 నుంచి 20 రోజుల సమయం పడుతుంది. కాబట్టి తమ కోర్సు ప్రారంభానికి ముందే అడ్మిషన్ లెటర్‌తో దరఖాస్తు చేసుకోవాలి. అంతేకాకుండా దరఖాస్తు పూర్తి చేసేటప్పుడు ఎలాంటి పొరపాట్లు లేకుండా చూసుకోవాలి. దరఖాస్తులో చిన్న చిన్న లోపాలతో చాలా మంది విద్యార్థులు చివరి నిమిషంలో ఒత్తిడికి గురవుతున్నారు. అందుకే దరఖాస్తును, అందులోని నియమ నిబంధనలను ఒకటికి రెండుసార్లు పరిశీలించి దరఖాస్తు చేయడం మంచిది. దరఖాస్తుతోపాటు అవసరమైన ఇతర పత్రాలన్నిటినీ పకడ్బందీగా సమర్పిస్తే 15 రోజుల్లో రుణం మంజూరవుతోంది. - వి.కె. గోపాలన్, చీఫ్ మేనేజర్, ఎస్బీహెచ్ -
ఉద్యోగ సృష్టికర్తలు కావాలి
విద్యాలయాలకు కలాం సూచన సాక్షి, బెంగళూరు :విద్యార్థులను ఉద్యోగార్థులుగా కాకుండా.. ఉద్యోగ సృష్టికర్తలుగా తయారు చేయాలని ప్రముఖ శాస్త్రవేత్త, మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం విద్యాసంస్థలకు సూచించారు. శుక్రవారమిక్కడి ఏఎంసీ ఇంజనీరింగ్ కళాశాల ఆవరణలో నిర్వహించిన కళాశాల వార్షికోత్సవ కార్యక్రమానికి కలాం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ‘రోల్ ఆఫ్ యూత్ ఇన్ నేషన్ బిల్డింగ్’ అనే అంశంపై ఆయన ప్రసంగించారు. కన్నడి గులందరికీ బసవ జయంతి శుభాకాంక్షలు చెబుతూ కలాం తన ప్రసంగాన్ని ప్రారంభించారు. ప్రతి విద్యార్థి ముందుగా కళాశాల క్యాంపస్ నుంచి బయటికి వెళ్లిన తరువాత తాను ఏదైనా సాధించగలననే ఆత్మస్థైర్యాన్ని పెంపొందించుకోవాల్సిన అవసరముందన్నారు. కళాశాలల్లోని విద్యార్థులు తమ మెదడులోని ఆలోచనలకు పదును పెడితే ప్రపంచంలో అన్ని రంగాల్లోనూ భారతదేశం మొదటి స్థానంలో నిలుస్తుందన్నారు. జీవితంలో తాను ఎలాంటి శిఖరాలను అందుకోవాలనే విషయానికి పాఠశాల జీవితంలోనే పునాదులు పడ్డాయని, అందుకు తన గురువులే కారణమని అన్నారు. అదే విధంగా ప్రతి ఒక్క విద్యార్థి తరగతి గదిలోనే తన విజయాలకు పునాదులు వేసుకోవాలని సూచించారు. ప్రస్తుత పోటీ కాలంలో సృజనాత్మక అనేది వ్యక్తి విజయావకాశాలను నిర్దేశిస్తోందని పేర్కొన్నారు. ఏఎంసీ కళాశాలల చైర్మన్ డాక్టర్ కేఆర్ పరమహంస మాట్లాడుతూ... అన్ని వర్గాల్లోని విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడమే తమ విద్యాసంస్థల లక్ష్యమని పేర్కొన్నారు. తమ కళాశాలల్లో చదివిన విద్యార్థులకు మంచి ప్లేస్మెంట్ అవకాశాలు లభిస్తున్నాయని తెలిపారు. విద్యార్థుల ప్లేస్‌మెంట్స్‌కు గాను ఇన్ఫోసిస్, విప్రో, టీసీఎస్‌తో పాటు బీమా, బ్యాంకింగ్ రంగాల్లోని సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకున్నామని వెల్లడించారు.