
సురేష్ బాబు (ఫైల్)
కర్నూలు: నగర శివారులోని నంద్యాల చెక్‌పోస్టు సమీపంలో సుమౌర్యా మేనేజ్‌మెంట్ ఇన్‌స్టిట్యూట్ ముసుగులో యువతులను మోసగిస్తున్న నయవంచకుడి బండారం బయటపడింది. పెళ్లి పేరుతో తనను నమ్మించి మోసం చేశాడంటూ నగరంలోని ఇందిరాగాంధీ నగర్‌కు చెందిన ఓ యువతి పోలీసులను ఆశ్రయించింది. ఈమె 2012 నుంచి సుమౌర్యా మేనేజ్‌మెంట్ ఇన్‌స్టిట్యూట్‌లో పనిచేస్తుండేది. ఇన్‌స్టిట్యూట్ నిర్వాహకుడు సురేష్ బాబు శ్రీనగర్ కాలనీలో నివాసముంటున్నాడు.
ఈయనకు రాధారమణితో మొదట వివాహమైంది. అయితే ఆమెకు విడాకులు ఇచ్చి పెళ్లి చేసుకుంటానంటూ ఇన్‌స్టిట్యూట్‌కు వచ్చిన ఐదుగురు యువతులతో వివాహేతర సంబంధం కొనసాగించాడని, తనలాగే మరికొందరిని మోసం చేస్తుండటంతో ఇందిరాగాంధీ నగర్‌కు చెందిన యువతి ఈనెల 23వ తేదీన మూడో పట్టణ పోలీసులను ఆశ్రయించింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని విచారించి గురువారం సురేష్ బాబును అదుపులోకి తీసుకొని సెక్షన్ 323, 470, 420 రెడ్‌విత్ 34 ఐపీసీ కింద కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు. ఈ విషయంపై సురేష్ బాబు భార్య రాధారమణిని నిలదీయగా బాధితురాలిపై దాడి చేసినందుకు ఆమెపై కూడా కేసు నమోదు చేశామని పోలీసులు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment