రిసార్ట్ శైలి జీవనమే లక్ష్యంగా ఐఖ్యా ఇన్‌ఫ్రా డెవలపర్స్ 'ఈ5వరల్డ్’ కు అంకురార్పణ | Apollo Institute Of Medical Sciences & Research Hosts ‘White Coat Ceremony’ To Welcome The Class Of 2024 Students. | Sakshi
Sakshi News home page

రిసార్ట్ శైలి జీవనమే లక్ష్యంగా ఐఖ్యా ఇన్‌ఫ్రా డెవలపర్స్ 'ఈ5వరల్డ్’ కు అంకురార్పణ

Published Sat, Nov 23 2024 9:30 AM | Last Updated on Sat, Nov 23 2024 10:43 AM

Apollo Institute Of Medical Sciences & Research Hosts ‘White Coat Ceremony’ To Welcome The Class Of 2024 Students.

- ఐకేఎఫ్ ఫైనాన్స్ సహకారంతో
- ఈ ప్రాజెక్టు మూడు దశల్లో పూర్తి

హైదరాబాద్, నవంబర్ 2024: ఐఖ్యా ఇన్‌ఫ్రా డెవలపర్స్ ఆధ్వర్యంలో ఐకేఎఫ్‌ ఫైనాన్స్ సహకారంతో హైదరాబాద్‌లో ఇరవై ఎకరాల విస్తీర్ణంలో లగ్జరీతో కూడిన రిసార్ట్ శైలి జీవనమే లక్ష్యంగా 'ఈ5వరల్డ్' కు అంకురార్పణ జరిగింది. ఈ వివరాలు తెలిపేందుకు బంజారాహిల్స్ లోని తాజ్ డెక్కన్ లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఐకేఎఫ్ ఫైనాన్స్ వ్యవస్థాపకులు, ఈ5వరల్డ్ ప్రమోటర్ వీజీకే ప్రసాద్ మాట్లాడుతూ రిసార్ట్ స్టైల్ లివింగ్‌లో సరికొత్త కాన్సెప్ట్‌ను పరిచయం చేస్తున్నామని చెప్పారు. ఇది లగ్జరీ, వెల్నెస్, నేచర్ సమతుల్యతతో డిజైన్ చేయబడిందన్నారు. ఇరవై ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ రిసార్ట్ ప్రత్యేకంగా రూపొందించామని తెలిపారు. ప్రీమియం సౌకర్యాలు కలవన్నారు. ప్రకృతి నుంచి స్ఫూర్తి పొందే ఆర్కిటెక్చర్‌ ఇక్కడ ప్రత్యేకత అన్నారు. దీనిని మూడు దశల్లో అభివృద్ధి చేయనున్నామని చెప్పారు. మొదటి దశలో 1 నుంచి 5 ఎకరాలు, రెండో దశలో 2 నుంచి 10 ఎకరాలు, మూడో దశలో 3 నుంచి 5 ఎకరాలు అభివృద్ధి చేయనున్నామన్నారు. లగ్జరీ, వెల్నెస్, స్థిరమైన డిజైన్‌తో హైదరాబాదులో కొత్త బెంచ్‌మార్క్‌ను సెట్ చేస్తున్నామని చెప్పారు. ఇది పచ్చని వాతావరణంలో ప్రశాంతతతో కూడిన ఉన్నత స్థాయి రిసార్ట్ జీవనానికి నిలయంగా ఉండనుందన్నారు.

ఐకేఎఫ్ ఫైనాన్స్ రూ. 2,356.99 కోట్లు మార్కెట్ క్యాపిటలైజేషన్ కలిగిన విశ్వసనీయ ఆర్థిక సంస్థ అన్నారు. హైదరాబాద్‌లో లగ్జరీ లివింగ్‌ను మలుపు తిప్పేందుకు సిద్ధమవుతున్నామని చెప్పారు. ఇది కేవలం ఒక లగ్జరీ రిసార్ట్ లివింగ్ కమ్యూనిటీ మాత్రమే కాదని, ఇది నాణ్యత, ఆవిష్కరణ, స్థిరమైన జీవనం తాలుకా నిబద్ధతను ప్రతిబింబిస్తుందని తెలిపారు. ఆర్కిటెక్చర్ కీర్తి షా లగ్జరీ, నేచర్ కలయిక విజన్ అద్భుతమన్నారు. ఉన్నతమైన జీవన విధానానికి నిలువెత్తు సాక్ష్యంగా నిలుస్తుందన్నారు. ఇక్కడ నివసించే వారికి లగ్జరీ జీవనంతో పాటు పర్యావరణ అనుకూల వాతావరణాన్ని అందిస్తుందని తెలిపారు. ఈ లగ్జరీ రిసార్ట్స్‌కు ఎక్కువ డిమాండ్ ఉందన్నారు. పెట్టుబడిదారులు దీర్ఘకాలంలో వృద్ధిపై ఆసక్తి చూపిస్తున్నారన్నారు. పెట్టుబడిదారులకు ఫ్రాక్షనల్ ఓనర్‌షిప్ అందించే ప్రత్యేక అవకాశాన్ని అందిస్తున్నామని చెప్పారు. ఈ మోడల్ ద్వారా  పెట్టుబడిదారులు రిసార్ట్‌లో భాగస్వామ్యం పొందవచ్చన్నారు.

ఈ సందర్భంగా ఓపస్ ఇండస్ట్రీస్ మేనేజింగ్ డైరెక్టర్ రఘురాం వుప్పుటూరి మాట్లాడుతూ ప్రాక్షనల్ ఓనర్‌షిప్ ద్వారా దీనిని అందరికి చేరువ చేయనున్నామని చెప్పారు. రూ.10 లక్షలలోపు మొత్తంతో రిసార్ట్‌లో భాగస్వామ్యం పొందవచ్చన్నారు. ఇది కుటుంబాలు సమయం గడిపేందుకు ఒక వీకెండ్ గమ్యస్థలంగా కూడా ఉంటుందన్నారు. ఇందులో ఉన్న విస్తృతమైన సౌకర్యాలు అన్ని వయస్సులు, వర్గాలకు అనుకూలంగా రూపొందించబడ్డాయని చెప్పారు. చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు అందరికి అనుకూలంగా ఉన్నాయన్నారు. ఈ ప్రాజెక్ట్‌లో మూడు క్లబ్ హౌస్‌లు కలవన్నారు. వీటి విస్తీర్ణం 10,000, 30,000, 50,000 చదరపు అడుగులు అన్నారు. అందులో యోగా గదులు, వెల్నెస్ జోన్లు, స్విమ్మింగ్ పూల్స్, వినోద సౌకర్యాలు ఉన్నాయన్నారు. రెండు రెస్టారెంట్లు కలవన్నారు. ఈ రెస్టారెంట్లలో ప్రపంచ, స్థానిక వంటకాలు అందుబాటులో ఉంటాయన్నారు. తాజా, సేంద్రీయ పదార్థాలను ప్రధానంగా ఉపయోగించనున్నామని తెలిపారు. విశాలమైన పచ్చని ప్రదేశాలు, గ్రీన్ గార్డెన్స్, నీటి వనరులు, నడక మార్గాలు ఉన్నాయన్నారు. పిల్లల కోసం ప్రత్యేక అడ్వెంచర్ ప్రదేశాలు, పెద్దలు, వృద్ధుల కోసం నేచర్ ట్రైల్స్, వెల్నెస్ లాంజ్లు ఉన్నాయని తెలిపారు. ఈ కమ్యూనిటీ ప్రత్యేక మెంబర్షిప్ ప్యాకేజీలను కూడా అందిస్తుందని చెప్పారు. హైదరాబాద్ నివాసితులు ప్రపంచ స్థాయి సదుపాయాలు ఆస్వాదించే అవకాశం ఉందన్నారు.

ఈ సందర్భంగా ఈ5వరల్డ్  సేల్స్, బ్రాండ్ కన్సల్టెంట్ డాక్టర్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ ఈ5వరల్డ్ హైదరాబాద్ వాసులు ఆనందించే ఒక ప్రత్యేక గమ్యస్థలంగా మారనుందన్నారు. ఇది వివిధ వయస్సులు, వర్గాల ప్రజల అవసరాలను తీర్చబోతుందన్నారు.

ఈ సందర్భంగా ఆర్కిటెక్ట్, అర్బన్ ప్లానర్,  ఈ5వరల్డ్ వ్యవస్థాపక సభ్యులు కీర్తి షా మాట్లాడుతూ ఈ5వరల్డ్ స్థిరమైన నిర్మాణం, వెల్నెస్ ఆధారిత జీవనశైలిలో ఉంటుందన్నారు. ఆధునిక సౌకర్యాలు ఆస్వాదిస్తూ.. ప్రకృతితో మళ్లీ కనెక్ట్ అయ్యేలా చేయడం మా లక్ష్యమన్నారు. మా స్టాండ్ ఏమిటంటే.. పర్యావరణానికి అనుకూలంగా ఉంటూ విలాసవంతమైన జీవనానికి ఒక నమూనాగా, సమకాలీన సౌకర్యాలతో సహజ ప్రకృతి దృశ్యాలను మిళితం చేయడం అన్నారు. ‌

ఈ5వరల్డ్ భారతదేశంలో పూర్తిగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా రూపకల్పన చేసిన మొదటి రిసార్ట్ లివింగ్ కమ్యూనిటీగా నిలుస్తుందని తెలిపారు. ఈ వినూత్న పద్ధతిని క్యూలీడ్.ఏఐ డాక్టర్ ప్రవీణ్ కుమార్ నేతృత్వంలో అమలు అవుతుందన్నారు. ఇందులో మార్కెట్ కమ్యూనికేషన్, ఉత్పత్తి మార్కెట్ సరిపోలిక, ఆదాయ అంచనాలు, వ్యూహాత్మక ప్రణాళిక వంటి ప్రతి అంశంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత సూచనలు ఉంటాయన్నారు. ‌

ఐకేఎఫ్ ఫైనాన్స్ ప్రమోటర్ల మద్దతుతో ఐఖ్యా ఇన్‌ఫ్రా డెవలపర్స్ లగ్జరీ రిసార్ట్ లివింగ్‌లో మొదటి ప్రయత్నంగా ఈ5వరల్డ్ కు పునాది‌ పడింది. ఇది ఈ సంస్థ ఆర్థిక సేవలలో ఉన్న బలమైన పునాది నుంచి సహజ విస్తరణను ప్రతిబింబిస్తుంది. ఇది 1991లో స్థాపించబడింది. ఐకేఎఫ్ ఫైనాన్స్ నిరంతరం అగ్రగామిగా ఉంది. ఇది తన పోర్ట్‌ఫోలియోను వాహన, ఎంఎస్ఎంఈ, హౌసింగ్ ఫైనాన్స్‌లను కలుపుతూ విస్తరించింది. తొమ్మిది రాష్ట్రాలలో ప్రస్థానం కలిగి ఉంది. 613.76 కోట్ల రూపాయల అంచనా కలిగిన సమగ్ర టర్నోవర్‌తో ఐకేఎఫ్ ఫైనాన్స్ మద్దతుతో స్థిరత్వం, నాణ్యత, దీర్ఘకాలిక విలువకు హామీగా నిలుస్తుంది. ఈ సమావేశంలో బిజినెస్ కన్సల్టెంట్ దేవేంద్ర దాంగ్ పాల్గొన్నారు.‌

ఐకేఎఫ్ ఫైనాన్స్ గురించి
ఐకేఎఫ్ ఫైనాన్స్ వీజీకే ప్రసాద్ చేత స్థాపించబడింది. పారదర్శకత, వృద్ధి, కస్టమర్ సేవల పట్ల నిబద్ధతకు ప్రసిద్ధి చెందిన ప్రముఖ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీగా ఎదిగింది. కంపెనీ ట్రాక్ రికార్డ్ దాని తాజా వెంచర్ ఈ5వరల్డ్ హైదరాబాద్‌లో ప్రీమియర్ లైఫ్‌ స్టైల్ కు మద్దతు ఇస్తుంది.

ఐకేఎఫ్ ఫైనాన్స్ వాహన ఫైనాన్సింగ్‌పై దృష్టి సారించడంతో ప్రారంభమైంది. భారతదేశంలో విభిన్న శ్రేణి ఆర్థిక ఉత్పత్తులను అందించే పవర్‌ హౌస్‌గా ఎదిగింది. ఆయన దూరదృష్టితో కూడిన నాయకత్వంలో ఐకేఎఫ్ ప్రతిష్టాత్మకమైన హెచ్డీఎఫ్సీ బ్యాంక్, సుందరం ఫైనాన్స్, టెల్కో వంటి సంస్థలతో కలిసి పని చేస్తుంది. దీర్ఘకాల భాగస్వామ్యాలు, పరిశ్రమ నైపుణ్యాన్ని పెంపొందించుకుంది.
మరింత సమాచారానికి దయచేసి సంప్రదించండి : 9959154371/ 9963980259

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement