Surgeries
-
ఇకపై.. రోబోలతో సంక్లిష్టమైన సర్జరీలు తేలిగ్గా..!
మానవ మణికట్టు ఒక పరిమితి వరకే తేలిగ్గా తిరుగుతుంది. కానీ ఓ రోబో మణికట్టు ఎటువైపైనా దాదాపు 270 డిగ్రీల వరకు తిరిగేలా రూపొందుతుంది. దాంతో అత్యంత నిశితంగా అనుకున్నంత మేరకే కోసేలా, కుట్లు వేసేలా చేసే శస్త్రచికిత్స ప్రక్రియల్ని రోబోకు ఆదేశాలిస్తూ డాక్టర్లు ‘ఆపరేట్’ చేస్తుంటారు. ఆ సర్జరీలో శస్త్రచికిత్స జరుగుతున్న అవయవాన్నీ, అందులోని భాగాల్నీ (ఫీల్డ్‌ను) 3–డీ ఇమేజ్ తెరపై చూస్తుంటారు.మరింత సురక్షితమెందుకంటే... కోత చాలా చిన్నగా ఉండటంవల్ల కోలుకునే సమయం తగ్గుతుంది. గాయమూ వేగంగా మానుతుంది. కోత, గాయం తక్కువ కావడం వల్ల ఇన్ఫెక్షన్కు అవకాశాలు బాగా తక్కువ. ఇవేకాదు... శస్త్రచికిత్సకు పట్టే సమయమూ, ఇవ్వాల్సిన మత్తుమందూ, రక్తస్రావమూ అన్నీ తక్కువే. ఇవన్నీ రోబోతో జరిగే శస్త్రచికిత్సను మరింత సురక్షితంగా మార్చేస్తాయి.ఏయే శాఖల్లో ఈ శస్త్రచికిత్సలు?మూత్ర వ్యవస్థకు సంబంధించి... మూత్రపిండాల శస్త్రచికిత్సలో:– కిడ్నీ నుంచి మూత్రాశయానికి (బ్లాడర్‌కు) మూత్రం తీసుకొచ్చే పైపులైన యురేటర్లలో ఏవైనా అడ్డంకులు ఉన్నప్పుడు (ఉదాహరణకు యురేటరో–పెల్విక్ జంక్షన్లో అడ్డంకి. దీన్నే యూపీజే అబ్స్టక్షన్ అంటారు.) చేసే ‘పైలో΄్లాస్టీప్రొíసీజర్’ అనే శస్త్రచికిత్సలో ∙కిడ్నీల్లో గడ్డల (రీనల్ ట్యూమర్స్) తొలగింపు ∙కిడ్నీ పూర్తిగా తొలగించాల్సిన కేసుల్లో (నెఫ్రెక్టమీ). ప్రోస్టెక్టమీ: ప్రోస్టేట్ గ్రంథి తొలగింపులో.గైనకాలజీలో:గర్భసంచికీ అలాగే గర్భాశయ ముఖద్వారంలో క్యాన్సర్ (ప్రీ–మ్యాలిగ్నెంట్ సర్విక్స్ అండ్ యుటెరస్) వచ్చే అవకాశముందని తెలిసినప్పుడుఫైబ్రాయిడ్, అడినోమయోసిస్ వంటి గడ్డల తొలగింపులో ఎండోమెట్రియాసిస్ కేసుల్లో సమస్యాత్మకమైన / వ్యాధికి గురైన భాగాలను తొలగించడానికి ∙ఎండోమెట్రియమ్ శస్త్రచికిత్సలో అడ్హెషన్స్తో ఆ భాగం ఇతర శరీర భాగాలకు అతక్కుపోవడాన్ని విడదీయడానికి.యూరో–గైనకాలజీ శస్త్ర చికిత్సల్లో: – పొత్తికడుపు కింది భాగంలోని అవయవాలు మరో అవయవంలోకి చొచ్చుకునిపోయే హెర్నియా కేసుల్లో ‘సాక్రోకాల్పోపెక్సీ’ చేసేందుకు– దగ్గినప్పుడూ, ఒత్తిడికి మూత్రం పడిపోయే కేసుల్లో చేసే కాల్పోసస్పెన్షన్ప్రొసీజర్లలో, ∙ఫిస్టులా రిపేర్ల వంటి కేసుల్లో సర్జరీ కాంప్లికేషన్లను తగ్గించడానికి.ఇతరత్రా విభాగాల్లోని శస్త్రచికిత్సలివి..విపుల్ ప్రొసీజర్:ప్రాంక్రియాస్ (క్లోమం)లోని ‘హెడ్’ అనే భాగాన్నీ, అలాగే చిన్నపేగుల్లోని ‘డియోడినమ్’ అనే భాగాన్ని, గాల్బ్లాడర్నూ, బైల్డక్ట్ను తొలగించే ‘ప్రాంక్రియాటికో–డియోడనెక్టమీ’ వంటి సంక్లిష్టమైన శస్త్రచికిత్సలో.ప్రాంక్రియాస్, చిన్నపేగులు, గాల్‌బ్లాడర్‌లోని కొన్ని జబ్బులు (డిజార్డర్స్)లో (ఉదా: క్రానిక్ ప్రాంక్రియాటైటిస్, డియోడనల్ ట్రామా వంటి చికిత్సల్లో)థైరాయిడెక్టమీ: క్యాన్సర్‌కు గురైన థైరాయిడ్ గ్రంథిని తొలగించడానికి చేసే సంప్రదాయ శస్త్రచికిత్స తర్వాత మెడ చుట్టూ గీత కనిపిస్తుంది. కానీ రోబో చేసే శస్త్రచికిత్స తర్వాత ఎలాంటి గీతా పడకుండా శస్త్రచికిత్స చేసేందుకు. (అందంగా కనిపించాలని కోరుకునే యువతీ యువకులకూ / పెళ్లి కావాల్సిన యువతకు ఇదో వరం). బ్రెయిన్ సర్జరీస్: మెదడులోని సంక్లిష్టమైన భాగాల్లోకి ఏర్పడ్డ ట్యూమర్స్‌ను సంప్రదాయ శస్త్రచికిత్సతో తొలగింపు వీలుకాని సందర్భాల్లో.భవిష్యత్తులో మరింత చవగ్గా... ఇప్పుడు చాలా చోట్ల అమెరికన్ తయారీ రోబోలు ఉపయోగంలో ఉన్నాయి. ఇవి బాగా ఖరీదు కావడంతో ఈ శస్త్రచికిత్సలూ కాస్త ఖరీదే. అయితే భారతీయ రోబోలు అతి వేగంగా అందుబాటులోకి రానున్నాయి. ఇవి అమెరికన్ రోబోల ఖరీదులో సగానికే దొరుకుతాయి. ఫలితంగా అవి అందుబాటులోకి వస్తే ఇప్పటివరకూ అడ్వాన్స్డ్గా పరిగణిస్తున్న లాపరోస్కోపీ సర్జరీల స్థానంలో అన్ని వర్గాల ప్రజలకూ కొద్దిరోజుల్లోనే కారు చవగ్గా రోబో శస్త్రచికిత్సలు అందుబాటులోకి వచ్చే అవకాశముంది.– డాక్టర్ వి. చంద్రమోహన్, సీనియర్ రోబోటిక్ యూరో సర్జన్ -
పెరుగుతున్న మూత్రనాళ పునర్నిర్మాణ శస్త్రచికిత్సలు
సాక్షి, హైదరాబాద్: యూరాలజీ, నెఫ్రాలజీ సేవలకు దేశంలోనే పేరెన్నికగన్న ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాలజీ అండ్ యూరాలజీ (ఏఐఎన్‌యూ) ఆధ్వర్యంలో ప్రతిష్ఠాత్మక యూరాలజీ సదస్సు రెండో ఎడిషన్ నగరంలో శనివారం ప్రారంభమైంది. యూరేత్రా @ ఏఐఎన్‌యూ పేరుతో నిర్వహిస్తున్న ఈ రెండు రోజుల సదస్సుకు 8 దేశాలతో సహా.. దేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి 800 మందికి పైగా యూరాలజిస్టులు హాజరయ్యారు.మూత్రనాళ పునర్నిర్మాణ శస్త్రచికిత్సలలో సరికొత్త టెక్నిక్‌ల గురించిన లోతైన చర్చ ఈ సదస్సులో జరుగుతోంది. మూత్రనాళాలు సన్నబడిపోవడం వల్ల మూత్రవిసర్జన తగ్గడం, దానివల్ల అనేక సమస్యలు వచ్చినప్పుడు ఈ శస్త్రచికిత్స చేస్తారు. ఇలా సన్నబడే అవకాశాలు పురుషుల్లో ఎక్కువగా ఉంటాయి గానీ, మహిళలు, పిల్లల్లోనూ కనిపిస్తుంది.గతంలో మూత్రనాళాలు సన్నబడటానికి గ్రామీణ ప్రాంతాల్లో పారిశుధ్య పరిస్థితులు ప్రధాన కారణం అయ్యేవి. అయితే, గత రెండు దశాబ్దాలుగా అవగాహన పెరగడంతో ఇది 30-40 శాతం వరకు తగ్గింది. రోడ్డు ప్రమాదాలు, ఇన్ఫెక్షన్ల వల్ల మూత్రనాళ పునర్నిర్మాణ శస్త్రచికిత్సలు ఎక్కువగా చేయాల్సి వస్తోందని ఏఐఎన్‌యూ ఆస్పత్రి యూరాలజిస్టులు గమనించారు. రోడ్డు ప్రమాదాల్లో ఎక్కువ మరణాలు సంభవిస్తున్న దేశాల్లో భారతదేశం కూడా ఒకటి.ఈ సందర్భంగా సదస్సు నిర్వాహక కార్యదర్శి, ఏఐఎన్‌యూ ఆస్పత్రికి చెందిన కన్సల్టెంట్ యూరాలజిస్టు డాక్టర్ భవతేజ్ ఎన్గంటి మాట్లాడుతూ, “రోడ్డు ప్రమాదాలలో ఎక్కువ ఫ్రాక్చర్లు జరిగినప్పుడు మూత్రనాళాలు దెబ్బతింటాయి. అలాంటప్పుడు కొన్ని నెలలు వేచి ఉండి, ఆ తర్వాత దీన్ని సరిచేయాలి. ప్రమాదాలు ఇటీవలి కాలంలో ఎక్కువవుతున్నాయి.ముందున్న వాహనాన్ని వేగంగా ఢీకొన్నప్పుడు ఇతర అవయవాలతో పాటు మూత్రనాళాలు తీవ్రంగా దెబ్బతింటున్నాయి. యూటీఐ, ఎస్టీఐ లాంటి ఇన్ఫెక్షన్ల వల్ల కూడా మూత్రనాళాలు సన్నబడుతున్నాయి. క్యాన్సర్ లాంటివాటికి రేడియేషన్ ఇచ్చినప్పుడు కూడా మూత్రనాళాల్లో సమస్యలు వస్తున్నాయి. కొందరు పిల్లల్లో పుట్టుకతోనే అసలు మూత్రనాళం ఏర్పడదు. ఎక్కువకాలం పాటు ఆస్పత్రిలో ఉన్నప్పుడు క్యాథటర్స్ అమర్చుకోవడం, అదనపు వ్యాధులు ఉండటం వల్ల కూడా ఈ సమస్య వస్తోంది” అని తెలిపారు. సాధారణంగా మూత్రనాళాలకు రిపేర్ చేసినప్పుడు అవి ఫెయిలయ్యే అవకాశాలు ఉంటాయి. వాళ్ల సొంత టిష్యూల ఆధారంగానే ఆపరేషన్ చేయాలి. బుగ్గలలో టిష్యూ, నాలుక దగ్గర ఉండే టిష్యూలను తీసుకుంటాం. ఇందుకు జెనెటికల్ ఇంజినీర్ లేదా బయో ఇంజినీరింగ్ నైపుణ్యాలు అవసరం అవుతాయి. మరీ ఎక్కువసార్లు విఫలం అయితే టిష్యూ అందుబాటులో ఉండదు. అందుకే ఇప్పుడు సెల్ థెరపీ ఆధారంగా రీజనరేటివ్ పద్ధతులు అవలంబిస్తున్నారు. అంటే.. టిష్యూను ఇంజెక్ట్ చేయడం ద్వారా మూత్రనాళం దానంతట అదే బాగుపడుతుంది.ఏఐఎన్‌యూ మేనేజింగ్ డైరెక్టర్, చీఫ్ కన్సల్టెంట్ యూరాలజిస్ట్ డాక్టర్ సి.మల్లికార్జున మాట్లాడుతూ, “గడిచిన తొమ్మిదేళ్లలో వెయ్యికి పైగా శస్త్రచికిత్సలు చేశాం. గతంలో ఏడాదికి 50 కేసులే చేసేవాళ్లం. ఇప్పుడు 200-250 వరకు చేస్తున్నాం. దక్షిణ భారతదేశంలోనే ఇలాంటి శస్త్రచికిత్సలలో మేం అగ్రస్థానంలో ఉన్నాం. నిపుణుల నుంచి నేర్చుకుని, శిక్షణ పొందడమే ఈ సదస్సు ముఖ్య ఉద్దేశం. మూత్రనాళ పునర్నిర్మాణ శస్త్రచికిత్సలు సంక్లిష్టమైనవి, వీటిలో వైఫల్యాల రేటు ఎక్కువ. రోగుల కోణం నుంచి చూసినప్పుడు పెరుగుతున్న డిమాండుకు, నిపుణులైన సర్జన్లకు మధ్య ఉన్న అంతరాన్ని పూడ్చాల్సిన అవసరం ఉంది” అని చెప్పారు. యూకే, ఉగాండా, నేపాల్, బంగ్లాదేశ్, సింగపూర్, థాయ్ లాండ్, గల్ఫ్ దేశాలతో పాటు దేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి సుమారు 800 మందికి పైగా ప్రతినిధులు ఈ సదస్సులో పాల్గొన్నారు. భారతదేశంలోనే మూత్రనాళ శస్త్రచికిత్సలలో అగ్రగణ్యులుగా పేరొందిన పుణెకు చెందిన డాక్టర్ సంజయ్ కులకర్ణి, కోయంబత్తూరుకు చెందిన డాక్టర్ గణేష్ గోపాలకృష్ణన్ ప్రధానంగా ఈ సదస్సులో మాట్లాడారు. ఐఎస్బీ హైదరాబాద్ మాజీ డీన్ అజిత్ రంగ్నేకర్ కూడా ఇందులో ప్రధాన వక్తగా పాల్గొన్నారు.ఏఐఎన్‌యూ గురించి భారతదేశంలో యూరాలజీ, నెఫ్రాలజీ ఆస్పత్రుల నెట్వర్కులో ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాలజీ అండ్ యూరాలజీ ప్రముఖమైనది. ఇటీవల దీన్ని ఏషియా హెల్త్‌కేర్ హోల్డింగ్స్ టేకోవర్ చేసింది. ప్రముఖ నెఫ్రాలజిస్టులు, యూరాలజిస్టులతో కూడిన ఏడు ఆస్పత్రులు దేశంలోని నాలుగు నగరాల్లో ఉన్నాయి.యూరాలజీ, నెఫ్రాలజీ రంగాలలో చికిత్సాపరమైన నైపుణ్యాలతో ఈ ఆస్పత్రి యూరో-ఆంకాలజీ, రీకన్స్ట్రక్టివ్ యూరాలజీ, పిల్లల యూరాలజీ, మమిళల యూరాలజీ, ఆండ్రాలజీ, మూత్రపిండాల మార్పిడి, డయాలసిస్ లాంటి సేవలు అందిస్తోంది. యూరాలజీ, నెఫ్రాలజీ, యూరో-ఆంకాలజీ రంగాల్లో ఇప్పటివరకు 1200 రోబోటిక్ సర్జరీలు చేసి, రోబోటిక్ యూరాలజీ రంగంలో దేశంలోనే ముందంజలో ఉంది. దేశంలో ఈ ఆస్పత్రికి 500 పడకలు ఉన్నాయి, ఇప్పటివరకు లక్ష మందికి పైగా రోగులకు చికిత్సలు అందించారు. ఏఐఎన్‌యూకు ఎన్ఏబీహెచ్, డీఎన్బీ (యూరాలజీ అండ్ నెఫ్రాలజీ), ఎఫ్ఎన్బీ (మినిమల్ ఇన్వేజివ్ యూరాలజీ) నుంచి ఎక్రెడిటేషన్ ఉంది. -
కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్ విషాద మరణాలు (ఫొటోలు)
-
ప్రభుత్వ ఆస్పత్రుల్లో అరుదైన శస్త్ర చికిత్సలు
గుంటూరు మెడికల్/కర్నూలు(హాస్పిటల్): తీవ్రమైన అనారోగ్య సమస్యలతో ప్రభుత్వ ఆస్పత్రులకు వచ్చిన వారికి శస్త్ర చికిత్సలు చేసి ప్రాణాలు నిలిపిన ఘటనలకు గుంటూరు జీజీహెచ్, కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలు వేదికయ్యాయి. వివరాల్లోకి వెళితే... ఏలూరు జిల్లాకు చెందిన 62 ఏళ్ల నూతి దుర్గారావు విపరీతమైన కడుపు నొప్పితో జనవరి 17న గుంటూరు జీజీహెచ్‌కు వచ్చారు. జనరల్ సర్జరీ మూడో యూనిట్ ప్రొఫెసర్ డాక్టర్ గోవింద నాయక్ ఆధ్వర్యంలో పలు రకాల వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేసి పాంక్రీస్ డక్ట్ స్టోన్స్ ఉన్నట్లు గుర్తించారు. మద్యం తాగడం వల్ల ఏర్పడిన ఈ రాళ్లను జనవరి 19న సుమారు నాలుగు గంటల పాటు ఆపరేషన్ చేసి తొలగించారు. సుమారు రూ.1.50 లక్షల ఖరీదు చేసే ఆపరేషన్‌ను డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ఉచితంగా చేశారని ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఏకుల కిరణ్‌కుమార్ తెలిపారు. బాలిక ఛాతీలో కణితి తొలగింపు కర్నూలు జిల్లా డోన్ మండలం దొరపల్లి గ్రామానికి చెందిన పద్మ(15)కు ఛాతీలో గుండె పక్కన గడ్డ వచ్చింది. గుండె వెనుక భాగంలో న్యూరో ఫైబ్రోమా అని పిలిచే ఈ గడ్డ నరాల నుంచి వస్తోందని వైద్యులు గుర్తించారు. సాధారణంగా ఇలాంటి కణితిని ఓపెన్ హార్ట్ సర్జరీ ద్వారా తొలగించాల్సి ఉంది. ఇలా చేస్తే బాలిక కొన్ని నెలల పాటు విశ్రాంతి తీసుకోవాల్సి ఉంటుంది. త్వరలో ఆ బాలిక పదో తరగతి పరీక్షలు రాయాల్సి ఉన్నందున వీఏటీఎస్ వీడియో అసిస్టెడ్ తొరాసిక్ సర్జరీ పద్ధతి ద్వారా కణితిని తొలగించినట్లు కార్డియోథొరాసిక్ సర్జరీ హెచ్‌వోడీ డాక్టర్ సి.ప్రభాకర్‌రెడ్డి మీడియాకు వెల్లడించారు. -
ముక్కు లేకుండానే జన్మ..ఇప్పుడెలా ఉన్నాడంటే?
ఓ చిన్నారి పుట్టుకతో ముక్కు లేకుండా జన్మించాడు. ఆ చిన్నారి తల్లికి 20 వారాల గర్భంగా ఉన్నప్పుడే పుట్టబోయే బిడ్డలో ఏదో సమస్య ఉందని తెలిసింది. ఆ తర్వాత స్కానింగ్‌లో బిడ్డ ముక్కు కనిపించ లేదని, అలాగే బిడ్డ కూడా పూర్తి స్థాయిలో ఆరోగ్యంగా లేడని చెప్పారు వైద్యులు. అయితే ఆ తల్లి అబార్షన్ చేయించుకునేందకు ఇష్టపడలేదు. ఎలా ఉన్నా.. భూమ్మీదకు తీసుకురావాలని స్ట్రాంగ్‌గా ఫిక్స్ అయ్యింది. చివరికీ వైద్యులు చెప్పినట్లుగానే జన్మించాడు. ఆ బిడ్డ బతికే క్షణాలు కూడా తక్కవే అని పెదవి విరిచారు డాక్టర్లు. సీన్ కట్ చేస్తే..22 ఏళ్ల తర్వాత.. అసలేం జరిగిందంటే..యూఎస్‌కి చెందిన జాన్, మేరీ జో దంపతులు తమ తొలి సంతానం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మేరీ జో సరిగ్గా 20 వారాల గర్భతగా ఉండగా.. ఏదో సమస్య తలెత్తుందని అనిపించింది. వారి ఊహించినదే నిజమైంది. స్కానింగ్‌లో పుట్టబోయే బిడ్డ మెదడు సరిగా అభివృద్ధి చెందలేదని, అలాగే ముక్కు కూడా లేదని తేలింది. శిశువు పుట్టిన బతకడం కష్టం అని గర్భస్రావం చేయించుకోవాల్సిందిగా మేరీ జోకి సూచించారు. అయితే అందుకు ఆ దంపతుల మనసు అంగీకరించ లేదు. దీంతో వారు ఏం జరిగినా ఆ బిడ్డను ఈ భూమ్మీదకు తెచ్చి పెంచుకుందామని గట్టిగా డిసైడ్ అయిపోయారు. అయితే ఆ బిడ్డ వైద్యులు చెప్పినట్లుగానే జన్మించడం జరిగింది. అదీకూడా డెలీవెరీకి ఐదువారాల ముందుగానే సీజేరియన్ చేసి పండంటి మగ బిడ్డను బయటకు తీశారు వైద్యులు. ఇక ఆ శిశువుకి పుట్టడంతోనే ముక్కు, కనురెప్పలు ఏర్పడలేదు. పైగా శిశువు మెదడులో ఎడమవైపు భాగం కూడా అభివృద్ధి చెందలేదు. అలాగే ఆ శిశువు పాదాలకు వేళ్లు కూడా లేవు. దీంతో డాక్టర్లు ఎంతసేపో ఆ శిశువు బతకదని పెదవి విరిచారు. ఎందుకంటే? ముక్కు లేదు కాబట్టి అస్సలు శ్వాస పీల్చుకోగలుగుతుందా లేదనది ఒక ప్రశ్న అయితే ఆక్సిజన్ మెదడకు సక్రమంగా అందకపోతే బతికే ఛాన్స్ అనేది కచ్చితంగా ఉండదు. ఈ రసవత్తరకరమైన ఆందోళనల మధ్య ఓ అద్భుతంలా ఆ శిశువు శ్వాస పీల్చుకోవడం బతకడం చకచక జరిగిపోయింది. వైద్యులు కూడా ఊహించని రీతీలో ఆ శిశువు కోలుకుంటూ..జస్ట్ డెలివరీ అయిన ఒక్క వారంలోనే డిశ్చార్చ్ అయ్యి తల్లిదండ్రలతో వెళ్లిపోయాడు. అయితే తల్లిదండ్రలు ఆ బిడ్డని కంటికి రెప్పలా కాచుకుంటూ అత్యంత భద్రంగా పెంచారు. ఎందుకంటే ముక్కులేదు కాబట్టి రంధ్రంగా ఉన్న ఆ ప్లేస్‌లో ఒక సన్నని నెట్మాదిరి క్లాత్‌ని అడ్డంగా ఉంచేవారు. అలాగే కళ్లకు రెప్పలు లేవు కాబట్టి నిద్ర వచ్చే సమయంలో వైద్యులు ఇచ్చిన ఒక రకమైన ద్రవాన్ని రక్షణగా ఉంచేవారు. అలా ఆ బిడ్డకు ఆరు నెలల వయసు వచ్చే వరకు ఓ గాజు ముక్కలా కాపడుకుంటూ వచ్చారు. ఆ తర్వాత పెరిగి పెద్దయ్యే వరకు చాలా సర్జరీలు చేయించుకోవాల్సి వచ్చింది. దాదాపు 30 సర్జరీలు దాక చేయించుకున్నాడు. ప్రస్తుతం ఆ చిన్నారి వయసు 22 ఏళ్లు. ఇప్పుడు అతను అందరిలానే సంగీతం, బేస్‌బాల్ వంటి ఆటలు ఆడుతూ హాయిగా గడుపుతున్నాడు. ఆ చిన్నారికి పేరు గ్రే కెనాల్స్. పుట్టుకతో ముక్కు లేకపోవడంతో కేవలం దీని పునర్నిర్మాణం కోసం ఏకంగా 11 సర్జరీలు చేయించుకోవాల్సి వచ్చింది. ఇలా అత్యంత అరుదుగా కొద్దిమందికి మాత్రమే జరగుతుందని వైద్యులు చెబుతున్నారు. పైగా పూర్తి ముక్కుని పునర్నిర్మించడం అనేది అత్యంత క్లిష్టమైన సర్జరీ కూడా. అలాగే అతడి తల్లిందండ్రులు కూడా అతడు ఎదిగే క్రమంలో తన తోటి పిల్లలతో చులకనకు గురవ్వకూడదని ఇంట్లోనే ఉంచి చదువు చెప్పించారు. అలాగే తన పట్ల ఎవ్వరూ జాలి చూపకుండా ఎలా మసులుకోవాలో కూడా కెన్నాల్కి తల్లిదండ్రులు నేర్పించారు. అంతేగాదు ఆ తల్లిదండ్రులు ఆ బిడ్డను చూసి బాధపకడ పోగా ప్రత్యేక అవసరాలున్న పిల్లలను ప్రత్యేకమైన తల్లిదండ్రులకే ఇస్తాడని సగర్వంగా చెప్పారు. పైగా వైకల్యంతో పుట్టిన పిల్లల పట్ల ఎలా తల్లిదండ్రులు వ్యవహరించాలనేందుకు స్ఫూర్తిగా నిలిచారు ఆ దంపతులు. బిడ్డ సమస్యను ముందు తల్లిదండ్రులే ధైర్యంగా ఫేస్ చేసేందుకు రెడీ అయితేనే బిడ్డలో స్థైర్యాన్ని నిపంగలమని చాటి చెప్పారు. ఇక కెన్నాల్ కూడా తాను ఇన్ని సర్జరీలు చేసి నరకయాతన చూసిన తల్లిదండ్రులు ఇచ్చిన స్థైర్యాన్ని ఆశని వదులకోకపోవడం విశేషం. ఇక కెనాల్స్ కూడా ఈ సర్జరీల వల్ల తన జీవితానికి కలుగుతున్న అంతరాయన్ని అధిగమించి చక్కగా ముందుకు సాగిపోయేలా ప్లాన్ చేసుకుంటానని ఆత్మవిశ్వాసంగా చెబుతున్నాడు. మరీ అతనికి ఆల్ ద బెస్ట్ చెబుదామా!. (చదవండి: నెయిల్ పాలిష్ రిమూవర్ ఇంత డేంజరా? మంటల్లో చిక్కుకున్న చిన్నారి..) -
ఒక్కో పోస్టుకు 15 మంది పోటీ
సాక్షి, అమరావతి: వైద్య, ఆరోగ్య శాఖలో సివిల్ అసిస్టెంట్ సర్జన్(సీఏఎస్) పోస్టులకు డిమాండ్ నెలకొంది. ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమ విభాగం పరిధిలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో 250 సీఏఎస్ వైద్య పోస్టుల భర్తీకి ఏపీ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డ్ ఇటీవల నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ క్రమంలో 3,906 మంది దరఖాస్తులు చేసుకున్నారు. అంటే ఒక్కో పోస్టుకు 15 మంది చొప్పున అభ్యర్థులు పోటీ పడుతున్నారు. వచ్చిన దరఖాస్తుల పరిశీలన అనంతరం ప్రాథమిక మెరిట్ జాబితాను ఇప్పటికే రిక్రూట్మెంట్ బోర్డ్ ప్రకటించింది. బుధవారంతో ప్రాథమిక మెరిట్ జాబితాపై అభ్యంతరాల స్వీకరణ గడువు ముగియనుంది. అభ్యంతరాల పరిశీలన అనంతరం తుది మెరిట్ జాబితాను ప్రకటించి అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. ఇన్–సర్వీస్ కోటాలో 2023–24 విద్యా సంవత్సరానికి పీజీ చదివేందుకు వెళ్లే వైద్యుల స్థానాలను భర్తీ చేయడం కోసం ప్రభుత్వం పోస్టుల భర్తీ చేపడుతోంది. ఖాళీ అయ్యే పోస్టులను అంచనా వేసి వైద్యులు రిలీవ్ అయి వెళ్లే సమయానికి కొత్తవారిని అందుబాటులోకి తెచ్చి ఫ్యామిలీ డాక్టర్, ఇతర పీహెచ్సీ సేవలకు అంతరాయం కలగకుండా ముందు చూపుతో ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. కాగా, ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఒక్క పోస్టు కూడా ఖాళీగా ఉండకుండా సీఎం జగన్ ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో 2019 నుంచి ఇప్పటి వరకూ ఏకంగా 53 వేలకు పైగా పోస్టుల భర్తీ చేపట్టింది. -
అవయవదానంతో ఇద్దరికి పునర్జన్మ
లబ్బీపేట(విజయవాడతూర్పు) : ఎన్టీఆర్ జిల్లా వెల్వడం గ్రామానికి చెందిన లక్ష్మమ్మ బ్రెయిన్ డెడ్‌కు గురికాగా.. ఆమె కుటుంబ సభ్యులు అవయవదానం చేసి ఇద్దరికి పునర్జన్మనిచ్చినట్టు అమెరికన్ కిడ్నీ ఇన్స్టిట్యూట్ వైద్యులు తెలిపారు. ఈ నెల 11న అవయవదానం చేయగా.. మూడేళ్లు, నాలుగేళ్లుగా డయాలసిస్ చేయించుకుంటూ జీవనం సాగిస్తున్న ఇద్దరికి, దాత నుంచి సేకరించిన కిడ్నీలను ట్రాన్స్‌ప్లాంట్ చేసినట్లు డాక్టర్ విట్టల్, డాక్టర్ స్వప్న తెలి పారు. ఆస్పత్రి ప్రాంగణంలో గురువారం వారు మీడియాతో మాట్లాడుతూ ఒకే రోజు ఏకకాలంలో రెండు కిడ్నీ మార్పిడి ఆపరేషన్లు చేయడం అరుదైన ఘటనగా చెప్పారు. యూరాలజిస్టులు డాక్టర్ ప్రశాంత్‌కుమార్, డాక్టర్ ధీరజ్, డాక్టర్ మురళీకృష్ణ పాల్గొన్నారు. -
గైనిక్ సర్జరీల్లోనూ రోబోలు
సాక్షి, హైదరాబాద్: వైద్య రంగంలో అందుబాటులోకి వచ్చిన ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రొబోటిక్ సర్జరీలు హైదరాబాద్‌లోనూ విస్తృతంగా అందుబాటులోకి వచ్చాయి. పేరొందిన దాదాపు ప్రతి ఆసుపత్రీ ఈ శస్త్రచికిత్సా విధానాన్ని ఉపయోగిస్తోంది. చికిత్సా వ్యయం ఎక్కువైనప్పటికీ ఎక్కువ మంది రోగులకు నప్పే అనేక ప్రయోజనాల వల్ల రానురానూ రొబోటిక్ సర్జరీల ఎంపిక కూడా పెరుగుతోంది. విభిన్న రకాల శస్త్రచికిత్సల్లో దోహదపడుతున్న రొబోటిక్ సర్జరీ గైనకాలజీ విభాగంలోనూ ఇప్పుడిప్పుడే వేగం పుంజుకుంటోంది. ఈ నేపథ్యంలో గైనకాలజీ శస్త్రచికిత్సల్లో రోబోల వాడకం వల్ల కలిగే ప్రయోజనాల గురించి అపోలో ఆసుపత్రికి చెందిన కన్సెల్టెంట్ అబ్స్ట్రిటిషియన్ అండ్ గైనకాలజిస్ట్ డాక్టర్ అనురాధా పాండా మరిన్ని వివరాలు తెలియజేశారు. అవి ఏమిటంటే... మరింత కచ్చితత్వం... ‘‘గైనకాలజీలో రోబో అసిస్టెడ్ కీహోల్ సర్జరీని కొత్త ఆవిష్కరణగా చెప్పొచ్చు. సాధారణ లేపరోస్కోపిక్ సర్జరీలతో పోలిస్తే రోబో సాయంతో చేసే సర్జరీల్లో త్రీడీ విజన్ (త్రిమితీయ ఆకారం) ఎక్కువ కచ్చితత్వాన్ని అందిస్తుంది. శస్త్ర చికిత్సలకు ఉపయోగించే పరికరాలను 360 డిగ్రీల కోణంలో తిప్పడానికి వీలుండటం వల్ల శరీరంలో సంక్లిష్టమైన ప్రదేశాలను సైతం చేరుకోవచ్చు. ఈ శస్త్రచికిత్సా విధానంలో తక్కువ రక్త నష్టంతోపాటు నొప్పి, ఇన్ఫెక్షన్ ముప్పు కూడా తక్కువగా ఉంటుంది. తద్వారా రోగులు ఆసుపత్రిలో ఉండాల్సిన వ్యవధి కూడా తగ్గుతుంది. ఈ శస్త్రచికిత్సల్లో సర్జన్ ఒక కంప్యూటర్ కన్సోల్ నుంచి పనిచేస్తారు. తన చేతి కదలికలతో రొబోటిక్ చేతులను కదిలిస్తూ ఆపరేషన్ నిర్వహిస్తారు. ‘‘క్లిష్టమైన హిస్టెరెక్టమీ (గర్భాశయం తొలగింపు) ఆపరేషన్లకు రోబో సాయాన్ని ఉపయోగించవచ్చు. ప్రత్యేకించి ఊబకాయంతో ఉన్న రోగి పొత్తికడుపుపై పలు శస్త్రచికిత్సలు నిర్వహించాల్సి వచ్చినప్పుడు ఈ విధానాన్ని ఉపయోగిస్తారు. కచ్చితత్వం, తక్కువ నొప్పితోపాటు చిన్న కోతల ద్వారానే శస్త్రచికిత్స చేయడానికి ఈ విధానం వీలు కల్పిస్తుంది’’అని డాక్టర్ అనురాధా పాండా వివరించారు. గైనిక్ రొబోటిక్ సర్జరీలతో ప్రయోజనాలు... మయోమెక్టమీ అనేది గర్భాశయ కండరాల గోడ (ఫైబ్రాయిడ్) నుంచి నిరపాయకరమైన కణుతులను తొలగించడానికి ఉపయోగించే ఒక ప్రక్రియ. రొబోటిక్ సర్జరీ ఫైబ్రాయిడ్ కుట్టు తొలగింపునకు కూడా వీలు కల్పిస్తుంది. ఎండోమెట్రియోసిస్ అనేది గర్భాశయం వెలుపల గర్భాశయ లైనింగ్ వంటి కణజాలాలు పెరిగే పరిస్థితి. ఈ కణజాలాలు హార్మోన్లకు ప్రతిస్పందిస్తాయి. పీరియడ్స్ సమయంలో రక్తస్రావం, నొప్పి ఉంటుంది. ఎండోమెట్రియోసిస్ శస్త్రచికిత్స ఒక సవాలు వంటిది. దీనికోసం పెల్విస్, పెల్విక్ సైడ్ వాల్స్‌లో లోతుగా పనిచేయాల్సిన అవసరం ఉంటుంది. రోబో అసిస్టెడ్ ఎండోమెట్రియోసిస్ శస్త్రచికిత్స ద్వారా మరింత కచ్చితమైన రీతిలో అండాశయ తిత్తిని తొలగించడం సాధ్యపడుతుంది. పేగు, మూత్రాశయం, మూత్ర నాళానికి అతుక్కొని ఉండే డీప్ ఇన్ఫిల్ట్రేటింగ్ ఎండోమెట్రియోసిస్ వ్యాధి చికిత్సలోనూ రొబోటిక్ సర్జరీ తక్కువ సంక్లిష్టతతో కూడుకుంటున్నదని పలు అధ్యయనాలు తెలిపాయి. హిస్టెరెక్టమీ సర్జరీ తర్వాత కొందరిలో తలెత్తే వాల్ట్ ప్రోలాప్స్ అనే పరిస్థితిని సరిదిద్దడంలోనూ రొబోటిక్ సర్జరీ ఉపకరిస్తుంది. ఊబకాయ రోగుల్లో శస్త్రచికిత్సలకు లేపరోస్కోపీతో పోలిస్తే రోబోటిక్ సర్జరీ వారి అనారోగ్యాన్ని, ఆసుపత్రిలో ఉండే వ్యవధిని తగ్గిస్తుంది. లేపరోస్కోపీతో పోల్చినప్పుడు రొబోటిక్ శస్త్రచికిత్స ఎక్కువ ఖర్చుతో కూడుకున్నది. అయితే భవిష్యత్తులో ఈ చికిత్సా విధానం వాడకం మరింత విస్తృతమైతే ఈ సర్జరీల ధరలు తగ్గే అవకాశం ఉంది. -
ఈ చిన్న సర్జరీతో ఆంటీలను అందంగా మార్చవచ్చు
-
16 వేల గుండె ఆపరేషన్లు చేసిన కార్డియాలజిస్టు.. గుండెపోటుతో మృతి
గుండెపోటుతో మరణించేవారి సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. వయస్సుతో సంబంధం లేకుండా దీని భారిన పడుతున్నారు. అయితే.. గుజరాత్‌కు చెందిన ప్రముఖ కార్డియాలజిస్టు డా. గౌరవ్ గాంధీ కూడా గుండెపోటుతో మరణించడం పలువురిని దిగ్భ్రాంతికి గురిచేసింది. గుజరాత్‌లోని జామ్‌నగర్‌కు చెందిన డా. గౌరవ్ గాంధీ అంటే ఆ ప్రాంతంలో తెలియనివారుండరు. ఆయన చేతితో ఎన్నో గుండె ఆపరేషన్లు చేశారు. ఎందరి ప్రాణాలనో రక్షించారు. గుండెకు సంబంధించిన అనేక కార్యక్రమాలు నిర్వహించారు. గుండె ఆరోగ్యంగా ఉండడానికి అనేక సూచనలు చేసేవారు. కేవలం నాలుగు పదుల వయస్సులోనే సుప్రసిద్ధ కార్డియాలజిస్టుగా పేరుగాంచారు. కానీ దురదృష్టవశాత్తు ఆయనే గుండెపోటుతో మరణించారు. సుమారు 16 వేల ఆపరేషన్లు ఆయన ఇప్పటివరకు చేశారు. సోమవారం రాత్రి ఎప్పటిలానే ఆస్పత్రి పనులు ముగించుకుని ప్యాలెస్ రోడ్డులోని ఇంటికి చేరారు. రోజూలానే భోజనం పూర్తి చేసుకుని నిద్రకు వెళ్లారు. ఉదయం ఎంతసేపటికీ నిద్రలేవకపోయేసరికి కుటుంబ సభ్యులు వెళ్లి చూశారు. సృహలో లేకపోవడంతో ఆస్పత్రికి తీసుకెళ్లారు. కానీ ఆయన అప్పటికే మరణించినట్లు వైద్యులు తెలిపారు. గుండెపోటే కారణమని స్పష్టం చేశారు. రాత్రి నిద్రకు వెళ్లే సమయంలో ఎలాంటి అసౌకర్యంగా ఆయన కనిపించలేదని కుటుంబ సభ్యులు తెలుపారు. ఆయన మంచి ఆహారాన్నే తీసుకున్నారని వెల్లడించారు. డా. గాంధీ మృతిపై పలువురు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇదీ చదవండి:కేంద్ర మంత్రితో రెజ్లర్ల భేటీ.. వారి ఐదు డిమాండ్లు ఇవే..! -
లక్షలాది అవ్వాతాతల కళ్లల్లో వెలుగులు
సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అవ్వాతాతల జీవితాల్లో వెలుగులు నింపుతున్నారు. వారికి క్రమం తప్పకుండా ప్రతి నెలా ఒకటో తేదీనే ఠంచనుగా వారున్న చోటుకే పింఛను డబ్బు పంపిస్తున్నారు. మరో పక్క వైఎస్సార్ కంటి వెలుగు పథకం ద్వారా మలి వయసులో చూపు మసకబారిన అవ్వాతాతల కళ్లల్లో వెలుగులు నింపుతున్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఏడాదే సీఎం జగన్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. కోవిడ్ మహమ్మారి రావడంతో ఆ సమయంలో కొంత అవరోధం కలిగింది. కోవిడ్ ప్రభావం తగ్గగానే మళ్లీ ప్రారంభించారు. రాష్ట్రంలోని 60 సంవత్సరాలు దాటిన అవ్వా తాతలకు ఉచితంగా కంటి పరీక్షలు చేసి, అవసరమైన వారికి కళ్లద్దాలు, మందులు ఉచితంగా ఇస్తున్నారు. అవసరమైన వారికి క్యాటరాక్ట్ ఆపరేషన్లు ఉచితంగా చేస్తున్నారు. 56,88,424 మంది అవ్వా తాతలకు కంటి పరీక్షలు చేయాలని లక్ష్యంగా నిర్ణయించగా, ఇప్పటికే 31,77,994 మందికి పరీక్షలు చేశారు. 11,46,659 మందికి కళ్లద్దాలు అవసరమని గుర్తించారు. ఇప్పటివరకు 8,81,659 మంది అవ్వా తాతలకు ఉచితంగా కళ్లద్దాలు పంపిణీ చేశారు. మిగతా వారికి కూడా కళ్లద్దాలను ఆర్డర్ ఇచ్చారు. 1,86,628 మందికి క్యాటరాక్ట్ ఆపరేషన్ చేయాల్సి ఉందని గుర్తించగా ఇప్పటి వరకు 53,416 మందికి ఉచితంగా ఈ సర్జరీలు చేసి, వారి జీవితాల్లో కొత్త వెలుగులు తెచ్చారు. త్వరగా సర్జరీలు చేయండి సీఎస్ కె.ఎస్.జవహర్ రెడ్డి వైఎస్సార్ కంటి వెలుగు కింద అవ్వా తాతలకు ఉచిత కంటి పరీక్షలు, కళ్లద్దాల పంపిణీ, క్యాటరాక్ట్ ఆపరేషన్ల పురోగతిపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) డాక్టర్ కె.ఎస్.జవహర్ రెడ్డి జిల్లా కలెక్టర్లతో సమీక్షించారు. ఈ కార్యక్రమంపై వలంటీర్లు, ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలతో కలిసి విస్తృత ప్రచారం చేయాలని సూచించారు. కంటి పరీక్షల బృందం గ్రామాల పర్యటన షెడ్యూల్‌ను ముందుగానే విలేజ్ హెల్త్ క్లినిక్స్, గ్రామ సచివాలయాల్లో ప్రదర్శించాలని చెప్పారు. ప్రభుత్వ ఆస్పత్రులు, ఆరోగ్యశ్రీ ఎంప్యానల్ ఆస్పత్రులతో సమన్వయం చేసుకొని క్యాటరాక్ట్ సర్జరీలను త్వరితగతిన పూర్తి చేయాలని సీఎస్ ఆదేశించారు. వైఎస్సార్ జిల్లా అధికారులు పక్షం రోజుల్లోనే 3,650 శస్త్రచికిత్సలు చేయించారని చెప్పారు. మిగతా జిల్లాలు కూడా ఆపరేషన్లు త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్లను ఆదేశించారు. శస్త్ర చికిత్సలకు జిల్లాకు లక్ష రూపాయల చొప్పున మొబిలైజేషన్ నిధులను విడుదల చేశామన్నారు. వైఎస్పార్ కంటి వెలుగు కార్యక్రమం పురోగతిని పక్షం రోజులకోసారి పోర్టల్‌లో అప్డేట్ చేయాలని ఆదేశించారు. కంటి వెలుగుతో చూపు మాది పేద కుటుంబం. భర్త చనిపోయాడు. ఎవరూ లేరు. జగనన్న ఇస్తున్న పింఛను మీద జీవిస్తున్నాను. ఒక రోజు కంటిలో మసక వచ్చింది. వస్తువులు కనపడడంలేదు. మా ప్రాంతంలోని ఆఫ్తాల్మిక్ అసిస్టెంట్ రత్నంను సంప్రదించగా, కంటికి క్యాటరాక్ట్ సమస్య ఉందని చెప్పారు. దాని కి ఖర్చు భరించలేనని చెప్పడంతో వెంటనే కంటి వెలుగు కార్యక్రమం ద్వారా ఉచితంగా చేస్తామన్నారు. మార్చి 29న ఆపరేషన్ చేశారు. ఇప్పుడు కన్ను బాగా కనిపిస్తోంది. నా పని నేను చేసుకుంటున్నాను. జగనన్న ఇస్తున్న పింఛన్ డబ్బులు, కంటి వెలుగు పథకం ద్వారా ఆపరేషన్ చేయించుకొని సంతోషంగా జీవిస్తున్నాను. –డి. లక్ష్మీ నారాయణమ్మ, 65 సంవత్సరాలు, మధురవాడ,బాపూజీ నగర్, విశాఖపట్నం -
12 రకాల సర్జరీలు.. లక్షల డాలర్లు ఖర్చు..తీరా చూస్తే ప్రాణం పోయింది!
హాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. ప్రముఖ కెనడాకు చెందిన నటుడు సెయింట్ వాన్ కోలుచి(22) కన్నుమూశారు. అయితే ముఖానికి సర్జరీ చేయించుకోవడం వల్లే అతను మృతి చెందినట్లు తెలుస్తోంది. ప్రముఖ పాప్ సింగర్ జిమిన్‌లా కనిపించేందుకు దాదాపు 12 రకాల సర్జరీలు చేయించుకున్నారు. ఉదయం దక్షిణ కొరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మరణించాడు. సెయింట్ వాన్ కొలూచి 12 ప్లాస్టిక్ సర్జరీల కోసం దాదాపు 2,20,000 డాలర్లు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. గతేడాది నవంబర్‌లో దవడకు అమర్చిన ఇంప్లాంట్లను తొలగించుకోవడానికి ఇటీవలే ఓ ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్లాడు. అది ఇన్ఫెక్షన్కు దారి తీయడంతో కొద్ది గంటలకే మృతి చెందాడు. వాన్ కొలూచి సినీ ఇండస్ట్రీలో రావడానికి 2019లో కెనడా నుంచి దక్షిణ కొరియాకు వెళ్లినట్లు అతని సన్నిహితులు తెలిపారు. అతను దక్షిణ కొరియా ఎంటర్టైన్మెంట్ కంపెనీలో ట్రైనీగా పనిచేస్తున్నాడని వెల్లడించారు. చిన్న వయసులోనే మృతి చెందడంతో స్నేహితులు, సన్నిహితులు విషాదంలో మునిగిపోయారు. -
వామ్మో! దోమ కుడితే ఇంత అలానా! ఏకంగా 30 సర్జరీలా!
దోమల వల్ల ఏ డెంగ్యూ లేక మలేరియా వంటి వ్యాధులు వస్తాయని తెలుసు. అంతేగానీ ఏకంగా మూడు వారాల పాటు కోమా, 30 సర్జరీలు చేయించుకోవడం గురించి విన్నారా!. లేదు కదా కానీ ఇక్కడోక వ్యక్తి ఒక్క దోమ కాటు వల్ల ఇంత దారుణమైన పరిస్థితిని ఎదుర్కొన్నాడు. ఔనా! ఇది నిజమా? అని సందేహించొద్దు నిజంగానే జరిగింది. దయ చేసి ఈ దోమల పట్ల జాగ్రత్తగా ఉండండని ఆ వ్యక్తి పలువురికి సలహాలు ఇస్తున్నాడు కూడా. వివరాల్లోకెళ్తే....జర్మన్‌కి చెందిన 27 ఏళ్ల సెబాస్టియన్ రోట్ష్కే 2021లో ఆసియా టైగర్ దోమ అతన్ని కుట్టింది. దీంతో అతనికి కొన్ని రోజులపాటు ఫ్లూ వంటి లక్షణాలతో కూడిన జ్వరం వచ్చింది. ఆ తర్వాత రోట్ష్కే కొద్ది రోజుల్లోనే కోలుకుంటాను అని లైట్ తీసుకున్నాడు. అది కాస్త రోజు రోజుకి విషమించి చనిపోయేంత ప్రాణాంతకంగా మారిపోయింది. ఆ దోమ కాటు కారణంగా బ్లడ్ పాయిజన్‌గా మారిపోయింది. దీంతో కాలేయం, మూత్రపిండాలు, గుండె, ఊపిరతిత్తులు సరిగా పనిచేయడం మానేశాయి. ఆ తర్వాత అతను సుమారు మూడు, నాలుగు వారాలపాటు పూర్తిగా కోమాలోకి వెళ్లిపోయాడు. ఆ తర్వాత అతను ఏదో కొద్దిపాటి అదృష్టం కొద్ది కోమా నుంచి బయటపడ్డాడు. ఆ తదనంతరం ఆ దోమ కుట్టిన ప్రాంతంలో ఏర్పడిన గడ్డను తొలగించేందుకు ఏకంగా 30 సర్జరీలు చేయించుకోవాల్సి వచ్చింది. దీంతో రోట్ష్క్ ఏకంగా సగం తోడను పోగొట్టుకోవాల్సి వచ్చింది కూడా. ఈ సర్జరీల కారణంగా తాను కొన్నేళ్ల పాటు మంచానికే అతుక్కుపోవాల్సి వచ్చిందని, దారుణమైన నరకాన్ని అనుభవించానని ఆవేదనగా చెప్పాడు రోట్ష్క్. ఫారెస్ట్ దోమలుగా పిలిచే ఈ ఆసియా టైగర్ దోమలు పగటిపూటే దాడి చేస్తాయని, దయచేసి వాటి పట్ల బహు జాగ్రత్తగా ఉండాలని రోట్ష్క్ అందర్నీ కోరుతున్నాడు. (చదవండి: షాకింగ్ ఘటన: జడ్జి, ఆమె భర్త, పెంపుడు జంతువులతో సహా మృతి) -
ఎట్టకేలకు ముసుగు తీసి.. ముఖం చూపెట్టింది
హాలీవుడ్ నటి ఏంజెలీనా జోలిని పోలిన ముఖ కవళికలతో.. ఓవరాల్‌గా భయంకరమైన రూపంతో సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ ఆ మధ్య ఫేమస్ అయ్యింది ఒక యువతి(21). అయితే ఎట్టకేలకు ఆమె తన ముఖాన్ని ప్రపంచానికి చూపెట్టింది. అదీ జైలు నుంచి విడుదలైన తర్వాతే!. ఇరాన్‌కు చెందిన సహర్ తబర్.. 2019లో అరెస్ట్ అయ్యి జైలుకు వెళ్లింది. ఎంజెలీనా జోలిలా మారాలనే ఆశతో సర్జరీలు చేయించుకుంటే.. అవి వికటించిన వికృతంగా మారినట్లు తబర్పై ఓ ప్రచారం ఉండేది. ఆపై జరిగిన పరిణామాలు ఆమెను చిక్కుల్లో పడేశాయి. మోసం, దైవదూషణ నేరానికిగానూ ఆమెకు పదేళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది అక్కడి న్యాయస్థానం. హిజాబ్‌ను అవమానించిన ఆరోపణలకుగానూ ఆమె ఈ శిక్ష పడింది. అయితే.. 14 నెలలకే ఆమెకు జైలు జీవితం నుంచి విముక్తి లభించింది. అందుకు కారణం.. 40 రోజులుకు పైగా అక్కడ మహిళా లోకం చేస్తున్న పోరాటం. మహ్సా అమినీ మృతి తర్వాత.. ఇరాన్లో ఉవ్వెత్తున్న హిజాబ్ వ్యతిరేక ఉద్యమం జరుగుతోంది. ఇదే అదనుగా సహర్ తబర్‌ను సైతం విడుదల చేయాలంటూ పలువురు సోషల్ మీడియాలో నినదించారు. మసిహ్ అలినెజద్ లాంటి ఉద్యమకారిణి సహా పలువురు సామాజిక వేత్తలు తబర్ విముక్తి కోసం పోరాడారు. దీంతో ఇరాన్ ప్రభుత్వం తగ్గి.. తబర్‌ను విడుదల చేసింది. హిజాబ్ విషయంలో ఆమె చేసిన ఒక చిన్న జోక్.. ఆమెను కటకటాల పాల్జేసింది. ఆమె కన్నతల్లి రోజూ కన్నీరు కార్చింది. ఈ వ్యవహారంలో నటి ఏంజెలీనా కలగజేసుకోవాలని మసిహ్ అలినెజద్ కోరారు కూడా. అయితే.. హిజాబ్ వ్యతిరేక నిరసనల నడుమ జైలు నుంచి ఆమెకు విముక్తి లభించింది. ఇక బెయిల్ మీద జైలు నుంచి బయటకు వచ్చాక.. తబర్ ఓ టీవీ ఛానెల్ ద్వారా తన అసలు రూపాన్ని ప్రపంచానికి చూపించింది. గతంలో ముఖానికి తాను కొన్ని సర్జరీలు చేయించుకున్న మాట నిజమేనని, అయితే.. వికృతంగా రూపం మాత్రం మారలేదని ఆమె వెల్లడించింది. సోషల్ మీడియాలో పేరుప్రఖ్యాతులు సంపాదించుకున్న ఫొటోల వెనుక.. ఫొటోషాప్ ఎడిటింగ్, కంప్యూటర్ ఎఫెక్ట్స్ ఉన్నాయని ఆమె తెలిపింది. ఇదిలా ఉంటే.. 2017లో సర్జరీలు వికటించడంతో దెయ్యంలా మారిందంటూ తబర్ గురించి కొన్ని కథనాలు వెలువడ్డాయి. ఆ తర్వాత ఆ ఫొటోలతోనే జాంబీ ఎంజెలీనా జోలిగా ఆమెకు సోషల్ మీడియాలో పేరు ముద్రపడిపోయింది. తబర్ అసలు పేరు ఫతేమెహ్ కిష్వంద్. సుమారు 50 సర్జరీలు చేయించుకున్నట్లు.. అవి వికటించడంతో దెయ్యంలా మారినట్లు అబద్ధం చెప్పింది. ఒక హీరోయిన్గా కంటే.. ఇలా సర్జరీలు వికటించిన బాధితురాలిగా పేరు ఎక్కువే దక్కించుకోవచ్చన్న ఆలోచన కొంతమేర వర్కవుట్ అయినా.. ఆపై బెడిసి కొట్టి జైలుకు వెళ్లాల్సి వచ్చింది. -
వైద్య పరికరాలకు ‘చికిత్స’
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వాస్పత్రులకు ఆధునిక వైద్య ఉపకరణాలు అందుబాటులోకి వస్తున్నాయి. కొత్తగా వంద రకాల పరికరాలను సర్జికల్ జాబితాలో చేర్చారు. ప్రభుత్వాస్పత్రుల్లో ఏటా లక్షలాది శస్త్రచికిత్సలు జరుగుతుంటాయి. కొత్త కొత్త వైద్య పద్ధతులు వస్తున్న నేపథ్యంలో ప్రతి రెండేళ్లకు ఒకసారి సమీక్ష నిర్వహించి ఆధునిక ఉపకరణాలను అందుబాటులోకి తీసుకురావాలి. కానీ 2014 తర్వాత అప్పటి ప్రభుత్వం దీని గురించి అసలు పట్టించుకోలేదు. ఈ పరిస్థితిని గుర్తించిన ప్రస్తుత ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల మేరకు.. స్పెషాలిటీ వైద్యులు సర్జికల్ జాబితాపై కసరత్తు చేశారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా చర్యలు తీసుకున్నారు. తాజాగా నిర్వహించిన సమీక్షలో శస్త్రచికిత్సలకు అవసరమైన 390 రకాల సర్జికల్ ఉపకరణాలతో జాబితా తయారు చేశారు. ఇందులో 100 రకాలు కొత్తగా చేర్చినవే. ప్రైవేటు ఆస్పత్రుల్లోని పరికరాల కంటే ఇవి అత్యుత్తమమైనవని వైద్యులు, అధికారులు పేర్కొన్నారు. కొన్ని ప్రైవేటు ఆస్పత్రుల్లో చైనా నుంచి వచ్చిన నాసిరకం పరికరాలు వాడుతుంటారని వివరించారు. ప్రభుత్వ రేటు కాంట్రాక్టులో ఉన్నవన్నీ అమెరికా ఔషధ నియంత్రణతో పాటు డబ్ల్యూహెచ్‌వో నాణ్యతా ప్రమాణాలు కలిగి ఉన్నవేనని తెలిపారు. జనరల్ సర్జరీ, గ్యాస్ట్రిక్, ప్రసవాల్లో వాడే పరికరాల్లో ఆధునికమైనవి ఎక్కువగా వచ్చాయని చెప్పారు. గతంలో శస్త్రచికిత్సలు చేసేటప్పుడు శరీరంపై కోతలు ఎక్కువగా పెట్టేవాళ్లు. కానీ ఇప్పుడు చిన్న గాటుతో చికిత్స చేసే ల్యాప్రోస్కోపిక్ పరికరాలు అందుబాటులోకి వచ్చాయి. ఇలాంటి వైద్య ఉపకరణాలను ప్రభుత్వం కొనుగోలు చేస్తోంది. రేటు ఎక్కువైతే పునఃసమీక్ష.. మొత్తం 390 రకాల పరికరాల్లో.. రేటు ఎక్కువగా ఉన్న వాటి విషయంలో పునఃసమీక్షించి నిర్ణయం తీసుకోనున్నారు. మొదటిసారిగా సర్జికల్ ఉపకరణాలను అన్ని బోధనాస్పత్రుల్లో పనిచేస్తున్న స్పెషాలిటీ వైద్యుల అభిప్రాయాలు తీసుకుని మరీ నిర్ధారించారు. ఆధునిక వైద్య పరికరాలు గతంలోని రేటు కాంట్రాక్టులో లేకపోవడంతో.. ఆస్పత్రుల్లో లోకల్ పర్చేజీ కింద ఎక్కువ రేటు చెల్లించి కొనుగోలు చేసేవారు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వమే సరఫరా చేస్తే మరింత రేటు తగ్గుతుందని పలువురు వైద్యులు అభిప్రాయపడ్డారు. ఏటా లక్షలాదిమంది సర్జరీ చేయించుకునేందుకు ప్రభుత్వాస్పత్రులకు వస్తున్నారని, ఆధునిక వైద్యపరికరాలుంటే రక్తస్రావం తక్కువగా ఉండటం, త్వరగా గాయాలు మానడం, ఇన్ఫెక్షన్లు తగ్గడం వంటి ఉపయోగాలుంటాయని వైద్యులు చెప్పారు. అందరి అభిప్రాయాలతోనే.. ఆధునిక వైద్య పరికరాల కొనుగోలుపై స్పెషాలిటీ వైద్యులు కసరత్తు చేశాకే నిర్ధారణకు వచ్చాం. బోధనాస్పత్రుల్లో పనిచేసే వైద్యుల అభిప్రాయాలు తీసుకున్నాం. అందరి అభిప్రాయాల మేరకే ఉపకరణాల జాబితా తయారు చేశాం. సర్జికల్ బడ్జెట్ కొంత పెంచాల్సి ఉంది. దీని కోసం ప్రయత్నిస్తున్నాం. – డా.రాఘవేంద్రరావు, వైద్య విద్యా సంచాలకులు -
కాకినాడ జీజీహెచ్‌లో 100కు చేరిన బ్లాక్ ఫంగస్ సర్జరీలు
కాకినాడ క్రైం: కాకినాడ జీజీహెచ్‌లో బ్లాక్ ఫంగస్‌తో శస్త్ర చికిత్స చేయించుకున్న వారి సంఖ్య వందకు చేరింది. నెల రోజులుగా కాకినాడ జీజీహెచ్‌లో బ్లాక్ ఫంగస్ రోగులకు సేవలందిస్తున్నారు. ఇప్పటి వరకూ మొత్తం 280 మంది ఆస్పత్రిలో చేరగా, వీరిలో రికార్డు స్థాయిలో వంద మందికి వేగంగా ఆపరేషన్లు చేయడం విశేషం. ఈఎన్టీ విభాగాధిపతి డాక్టర్ కృష్ణకిషోర్ ఆధ్వర్యంలో.. అప్పారావు వైద్య బృందం నిరంతరాయంగా శస్త్ర చికిత్సలు చేస్తోంది. గడిచిన 24 గంటల్లో 9 మంది బ్లాక్ ఫంగస్ రోగులు కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. -
సెకండ్ వేవ్: సర్జరీలకు కరోనా బ్రేక్!
సాక్షి, హైదరాబాద్: కొద్దిరోజులుగా కరోనా కేసులు మళ్లీ పెరిగిపోతుండటంతో ప్రభుత్వ ఆస్పత్రుల్లో సేవలపై ప్రభావం పడింది. గాంధీ, నిమ్స్, ఉస్మానియా జనరల్ హాస్పిటళ్లు సహా చాలా ప్రభుత్వ ఆస్పత్రుల్లో సర్జరీలకు బ్రేక్ పడింది. అత్యవసర ఆపరేషన్లు మినహా మిగతా అన్నింటినీ డాక్టర్లు వాయిదా వేస్తున్నారు. చికిత్స కోసం ఆస్పత్రులకు వస్తున్న రోగుల నుంచి ఆపరేషన్ థియేటర్లలో పనిచేస్తున్న వైద్య సిబ్బందికి వైరస్ సోకుతోంది. తాజాగా కోఠి ఈఎన్టీ ఆస్పత్రి ఆపరేషన్ థియేటర్లో పనిచేస్తున్న వైద్య సిబ్బందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడంతో సర్జరీలను నిలిపేశారు. ఇప్పటికే ఆస్పత్రుల్లో చేరిన బాధితులను కూడా కరోనా తీవ్రత తగ్గి, పరిస్థితులు మెరుగయ్యాక రావాల్సిందిగా చెప్పి పంపేస్తున్నారు. దీంతో డబ్బులు ఖర్చుపెట్టలేక సర్జరీల కోసం ప్రభుత్వ ఆస్పత్రులకు వెళ్తున్న పేద, మధ్యతరగతి రోగులు తీవ్రంగా ఇబ్బందిపడుతున్నారు. ఈఎన్టీ ఆపరేషన్ థియేటర్‌కు తాళం హైదరాబాద్‌లోని కోఠిలో ఉన్న ప్రభుత్వ చెవి, ముక్కు, గొంతు (ఈఎన్టీ) ఆస్పత్రి ఓపీకి రోజుకు సగటున 650 నుంచి 700 మంది రోగులు వస్తుంటారు. ముక్కులో కండ పెరిగి శ్వాసకు ఇబ్బందికావడం, చెవి నుంచి చీము కారడం, వినికిడి లోపంతో బాధపడుతున్నవారికి, కాక్లియర్ ఇంప్లాంట్ చికిత్సలు వంటి ఆపరేషన్లు.. రోజుకు సగటున 20 నుంచి 25 వరకు జరిగేవి. అయితే ఆపరేషన్ థియేటర్లో పనిచేసే అనస్థీషియన్, సిస్టర్లకు రెండు రోజుల క్రితం కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో బుధవారం నుంచి సర్జరీలు వాయిదా వేసి, ఆపరేషన్ థియేటర్లకు తాళం వేశారు. ఇప్పటికే చికిత్స కోసం ఆస్పత్రిలో ఎదురుచూస్తున్న వారికి.. వారం పది రోజుల తర్వాత రావాలంటూ డిశ్చార్జి చేసి ఇంటికి పంపేశారు. ఉస్మానియా, గాంధీలో 60 శాతానికి పడిపోయిన సర్జరీలు ఉస్మానియా జనరల్ ఆస్పత్రిలో 11 ఆపరేషన్ థియేటర్లు ఉండగా.. వాటన్నింటిలో కలిపి రోజుకు సగటున వంద మైనర్, 25 మేజర్ ఆపరేషన్లు జరుగుతుంటాయి. కరోనా సెకండ్ వేవ్ దృష్ట్యా ప్రస్తుతం అత్యవసరమైనవి మినహా సాధారణ చికిత్సలను చేయడం లేదు. దీంతో ప్రస్తుతం రోజుకు 40లోపే ఆపరేషన్లు జరుగుతున్నాయి. ఇక గాంధీ ఆస్పత్రిలో 28 ఆపరేషన్ థియేటర్లు ఉండగా.. చిన్నా పెద్దా అన్నీ కలిపి గతంలో రోజుకు సగటున 150 శస్త్రచికిత్సలు జరిగేవి. ఆస్పత్రిని పూర్తిస్థాయి కోవిడ్ సెంటర్‌గా మార్చడంతో గత మార్చి నుంచి డిసెంబర్ వరకు ఆపరేషన్ థియేటర్లను మొత్తంగా మూసేశారు. ప్రాక్టీస్‌కు దూరమవుతున్నామన్న వైద్య విద్యార్థుల ఆందోళనతో జనవరి తర్వాత పునరుద్ధరించారు. అయినా జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీలు సహా ప్లాస్టిక్ సర్జరీలు ఇప్పటికీ ప్రారంభం కాలేదు. నిలోఫర్, ఎంఎన్‌జే కేన్సర్ ఆస్పత్రుల్లోనూ సర్జరీలు చేసేందుకు వైద్యులు విముఖత చూపుతున్నట్టు చెబుతున్నారు. అంతేకాదు జిల్లా వైద్యారోగ్యశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసే కుటుంబ నియంత్రణ శిబిరాలు కూడా వాయిదా పడ్డాయి. నిలిచిన ట్రాన్స్ప్లాంటేషన్లు కార్పొరేట్ ఆస్పత్రుల్లో కొంతమేర అవయవ మార్పిడి చికిత్సలు జరుగుతున్నప్పటికీ...ప్రభుత్వ ఆస్పత్రుల్లో బాగా తగ్గిపోయాయి. నిమ్స్ మూత్రపిండాల విభాగంలో గతంలో వారానికి నాలుగు కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్లు చేసేవారు. ప్రస్తుతం కోవిడ్ కారణంగా ఒకటి రెండే చేస్తున్నారు. కీలకమైన గుండె మారి్పడి, కాలేయ మార్పిడి చికిత్సలు పూర్తిగా నిలిచిపోయాయి. ఎండోస్కోపీ, కొలనోస్కోపీ టెస్టులతోపాటు స్టెంట్ ప్రొసీజర్లు కూడా సగానికి పడిపోయాయి. ప్రస్తుతం జీవన్‌దాన్‌లో 8,633 మంది అవయవ మార్పిడి చికిత్సల కోసం ఎదురు చూస్తున్నారు. వీరిలో 4,383 మంది కిడ్నీ కోసం, 3,950 మంది కాలేయ మార్పిడి చికిత్సల కోసం వేచి ఉన్నారు. గతంలో బ్రెయిన్‌డెడ్ అయిన వారి నుంచి సేకరించిన అవయవాలే కాకుండా లైవ్ డోనర్ల (బంధువులు) నుంచి కూడా అవయవాలు తీసుకుని బాధితులకు అమర్చేవారు. ప్రస్తుతం కరోనా ఎఫెక్ట్‌తో దాతలు ముందుకు రావడం లేదని అంటున్నారు. అసలు గత ఏడాది కాలంగా ఉస్మానియా, గాంధీ, నిమ్స్ ఆస్పత్రుల్లో ఒక్క గుండె, కాలేయ మార్పిడి చికిత్స కూడా జరగకపోవడం గమనార్హం. ఈ బాలుడి పేరు మణిదీప్. ముక్కు లో కండరాలు పెరిగి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్నాడు. చికిత్స కోసం తల్లిదండ్రులు బుధవారం హైదరాబాద్‌లోని ఈఎన్టీ ఆస్పత్రికి తీసుకొచ్చారు. పరీక్షించిన వైద్యులు సర్జరీ చేయాలన్నారు. అయితే ప్రస్తుతం కోవిడ్ కారణంగా ఆపరేషన్ థియేటర్లు (ఓటీ) మూసివేశామని.. ఫ్యూమిగేషన్ తర్వాత రీఓపెన్ చేసి, చికిత్స చేస్తామని చెప్పారు. ఆ బాలుడేమో నోటితోనే శ్వాస తీసుకోవాల్సి వస్తుండటంతో తీవ్రంగా ఇబ్బంది పడుతున్నాడు. వారం తర్వాత రమ్మన్నారు కన్నుకు, దవడకు మధ్య గాయమైంది. చర్మంతోపాటు కండరాలు దెబ్బతిన్నాయి. కార్పొరేట్ ఆస్పత్రుల్లో చికిత్స చేయించుకునే స్తోమత లేక 15 రోజుల కింద గాంధీ ఆస్పత్రికి వచ్చా. వైద్యులు పరీక్షించి ప్లాస్టిక్ సర్జరీ చేయాలన్నారు. మందులు రాసి పంపారు. డాక్టర్లు చెప్పిన మేరకు బుధవారం మళ్లీ గాం«దీకి వచ్చాను. ప్రస్తుతం కరోనా కేసులు పెరుగుతున్నాయని, మరో వారం తర్వాత వస్తే.. అప్పుడు సర్జరీ గురించి ఆలోచిస్తామని డాక్టర్లు చెప్తున్నారు. ఏం చేయాలో అర్థం కావడం లేదు. –వాజిద్, ఖమ్మం వైద్యులు కూడా భయపడుతున్నారు కరోనా శకం ముగిసిపోయిందని అంతా సంతోషపడ్తున్న సమయంలోనే సెకండ్ వేవ్ మొదలైంది. వైరస్ అనేక రకాలుగా రూపాంతరం చెందింది. ఏ స్ట్రెయిన్ ఎలాంటి ప్రభావం చూపుతుందో తెలియక వైద్యులు సైతం భయపడుతున్నారు. ఆపరేషన్ థియేటర్లోకి వెళ్లేందుకే వెనుకాడుతున్నారు. ఫలితంగా సర్జరీలు వాయిదా వేయాల్సి వస్తోంది. వ్యాక్సిన్‌పై అపోహలు వీడి అంతా టీకా వేయించుకోవాలి. విందులు, వినోదాలకు దూరంగా ఉండాలి. ప్రయాణాలను వాయిదా వేసుకోవాలి. విధిగా మాస్కు లు ధరించి, భౌతిక దూరం పాటించాలి. వ్యక్తిగత శుభ్రతతోపాటు పౌష్టికాహారం తీసుకుని, వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించుకోవాలి. –డాక్టర్ రవిశంకర్, ఈఎన్టీ నిపుణుడు చదవండి: మమ్మల్ని ఏపీకి బదిలీ చేయండి కరోనా కేసులపై వైద్యశాఖ కీలక నిర్ణయం..! -
టేబుళ్లు.. కత్తెర్లు కరువు! రోగుల నిరీక్షణ!
సాక్షి, సిటీబ్యూరో: సాధారణ చికిత్సలతో పోలిస్తే స్పైన్, స్పాండలైటిస్, మెదడులో కణుతుల చికిత్సలు కొంత క్లిష్టమైనవి. ఎంతో నైపుణ్యం, అనుభవం ఉన్న వైద్యులు మాత్రమే వీటిని చేయగలుగుతారు. నిమ్స్ న్యూరో సర్జరీ విభాగం ఈ చికిత్సలకు ప్రసిద్ధి. దీంతో ఇక్కడికి రోగులు పోటెత్తుతుంటారు. ఈ విభాగంలో మూడు యూనిట్లు ఉండగా, 60 పడకలతో పాటు మూడు ఆపరేషన్ థియేటర్లు ఉన్నాయి. రోజుకు సగటున ఆరు నుంచి ఏడు సర్జరీలు జరుగుతుంటాయి. రోగుల నిష్పత్తికి అనుగుణంగా ఎప్పటికప్పుడు వైద్యపరికరాలు కొనుగోలు చేయకపోగా, ఏళ్ల క్రితం కొనుగోలు చేసినవి కూడా సాంకేతిక లోపాలు తలెత్తి మూలకు చేరాయి. ఏడాది క్రితం 35 లక్షల రూపాయల ఖరీదు చేసే అనస్థీషియా వర్క్ స్టేషన్, ఓటీ లైట్లు పాడైపోవడంతో అప్పటి నుంచి సర్జరీలకు విఘాతం కలుగుతోంది. డ్రిల్లింగ్ మిషన్ లేక సర్జరీలు వాయిదా.. ఎముకలను కత్తిరించే డ్రిల్లింగ్ మిషన్ (రూ.15 లక్షలు ఖరీదు చేసే) పాడైపోయి ఐదు నెలలైంది. ఇప్పటికీ దీన్ని కొనుగోలు చేయకపోవడంతో తీవ్రమైన నొప్పితో బాధ పడుతున్న వారికి మరింతకాలం నిరీక్షణ తప్పడం లేదు. ఇలా ఒక్క స్పైన్ అండ్ స్పాండలైటిస్‌తో బాధపడుతున్న బాధితులే 60 మందికిపైగా ఉన్నట్లు తెలిసింది. ఇక మెదడులో కణతులు, రక్తంగడ్డకట్టిన బాధితులు మరో వంద మందికి పైగా ఉన్నారు. కింది చిత్రంలో కన్పిస్తున్న ఆయన పేరు కొప్పొజు శేఖరాచారి. నల్లగొండ జిల్లా మునుగోడు మండలం. ఫ్లోరైడ్ కారణంగా మెడ, వెన్నెముక వంగిపోయి తీవ్రమైన నొప్పితో బాధపడుతున్నాడు. లేచి నడవలేని స్థితిలో ఉన్న ఆయన చికిత్స కోసం ఇటీవల నిమ్స్ వైద్యులను సంప్రదించారు. న్యూరోసర్జరీ విభాగం వైద్యులు ఆయన్ను పరీక్షించి... సీసీఎం, సీ4, సీ5, సీ6 సర్జరీ చేయాల్సిందిగా సూచించారు. అత్యవసర విభాగంలో అడ్మిట్ రాసి, ఆ మేరకు సీరియల్ నెంబర్ కూడా ఇచ్చారు. నెలరోజులైంది కానీ ఇప్పటికీ సర్జరీ చేయలేదు. అదేమంటే ఆపరేషన్ టేబుల్ ఖాళీ లేదని ఒకసారి..బోన్ కటింగ్ కోసం ఉపయోగించే డ్రిల్లింగ్ మిషన్ లేదని మరోసారి తిప్పిపంపారు. సర్జరీ ఎప్పుడు చేస్తారో ఇప్పటికీ స్పష్టత లేదు’..ఇలా ఒక్క శేఖరాచారి మాత్రమే కాదు మెదడులో కణుతులు, మెడ, వెన్నె ముఖ సమస్యలతో బాధపడుతున్న అనేక మంది చికిత్సల కోసం నాలుగైదు మాసాలు నిరీక్షించాల్సి వస్తోంది. చికిత్సలో జాప్యం వల్ల సమస్య మరింత ముదిరి చివరకు ప్రాణాలకే ముప్పు ఏర్పడుతోంది. -
‘మత్తు’ డాక్టర్లు కావలెను
నిర్మల్‌చైన్‌గేట్: జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో మత్తు వైద్యుల కొరత తీవ్రంగా ఉంది. జిల్లా ప్రసూతి ఆస్పత్రిలో ఏడు అనస్తీషియా వైద్యుల పోస్టులు ఉండగా ఒక్కరే అందుబాటులో ఉన్నారు. మిగిలిన ఆరుపోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఖానాపూర్ సీహెచ్‌సీతో పాటు భైంసా ఏరియా ఆస్పత్రిలో మత్తు వైద్యుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దీంతో సకాలంలో ఆపరేషన్లు చేయలేక వైద్యులు అవస్థలు పడుతున్నారు. శస్త్ర చికిత్స చేయాలంటే మత్తుమందు ఇచ్చే వైద్యుడు అందుబాటులో ఉండాల్సిందే. ఆపరేషన్ థియేటర్లో సర్జన్‌తో పాటు అనస్తీషియా వైద్యుడు తప్పనిసరి. వ్యాధి తీవ్రత, రోగి, ఆరోగ్య పరిస్థితిని బట్టి మత్తుమందు ఇస్తారు. మత్తు ఎక్కడ ఇవ్వాలనేది అనస్తీషియనే నిర్ణయిస్తాడు. జిల్లా కేంద్రంలోని ఆస్పత్రిలో మాత్రమే ఇద్దరు వైద్యులు ఉన్నారు. ఇందులో ఒకరు ఒక వారం పాటు ప్రసూతి ఆస్పత్రిలో కూడా డ్యూటీ చేయాల్సి ఉంటుంది. జిల్లాలో 21 మందికి ఆరుగురు మాత్రమే జిల్లా వ్యాప్తంగా మొత్తం 21 అనస్తీషియా వైద్యులు ఉండాల్సి ఉండగా కేవలం ఆరుగురు మాత్రమే పని చేస్తున్నారు. జిల్లాలో కీలకమైంది జిల్లా ఆసుపత్రి, ప్రసూతి ఆసుపత్రి. జిల్లా ఆస్పత్రి, బైంసా ఏరియా ఆసుపత్రుల్లో సివిల్ సర్జన్‌తో పాటు డిప్యూటీ సివిల్ సర్జన్, అసిస్టెంట్ సివిల్ సర్జన్ పోస్టులు ఉండాలి. కానీ ఇక్కడ ఇద్దరు మాత్రమే అసిస్టెంట్ సివిల్ సర్జన్ విధులు నిర్వర్తిస్తున్నారు. జిల్లా ఆస్పత్రిలోని ఐసీయూ విభాగంలో కాంట్రాక్ట్ పద్ధతిలో మరో అనస్తీషియా పోస్ట్ ఖాళీగా ఉంది. జిల్లా ప్రసూతి ఆస్పత్రిలో ఏడుగురికి ఒక అసిస్టెంట్ సివిల్ సర్జన్ మాత్రమే విధులు నిర్వర్తిస్తున్నారు. ఖానాపూర్ సీహెచ్‌సీలో మూడు అనస్తీసియా పోస్టులకుగానూ ఒక్కరు మాత్రమే విధులు నిర్వహిస్తున్నారు. రూ.కోట్లు వెచ్చించి ఆస్పత్రులు నిర్మిస్తున్న ఆస్పత్రుల్లో ఆపరేషన్ థియేటర్లు నిర్మిస్తున్నా, ఇతర సౌకర్యాలు కల్పిస్తున్నా పోస్టుల భర్తీపై సర్కారు దృష్టి సారించకపోవడంతో రోగులకు సరైన వైద్యసేవలు అందడం లేదు. వైద్యుల కొరతతో ఇబ్బందులు జిల్లాలోని ప్రసూతి ఆస్పత్రిలో గతేడాది మార్చి నుంచి డిసెంబర్ వరకు 4,676 ప్రసవాలు జరిగాయి. ఇందులో 3,688 సిజేరియన్లు, 988 సాధారణ కాన్పులు. జిల్లా ఆసుపత్రిలో గతేడాది మార్చి నుంచి డిసెంబర్ వరకు దాదాపు 2,150 ఆపరేషన్లు చేశారు. గత మార్చి నుంచి 2021 ఫిబ్రవరి వరకు బైంసా ఏరియా ఆస్పత్రిలో జరిగిన ఆపరేషన్లు 1089, గత మార్చి నుంచి 2021 ఫిబ్రవరి వరకు బైంసా ఏరియా ఆస్పత్రిలో జరిగిన ప్రసవాలు 2643. కానీ అనస్తీషియా వైద్యులు సరిపడా లేకపోవడంతో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జిల్లా ఏరియా ఆస్పత్రిలో ఈ విభాగంలో కాంట్రాక్టు పద్ధతిన నియమించడానికి నోటిఫికేషన్ వేసినా ఎవరూ ముందుకు రావడం లేదు. ఇబ్బంది కలగకుండా చూస్తున్నాం జిల్లాలోని పలు ఆసుపత్రుల్లో అనస్తీషియా వైద్యుల పోస్టులు ఖాళీగా ఉన్న మాట వాస్తవమే. అయినా ఎవరికీ ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకుంటున్నాం. జిల్లా ఆస్పత్రిలోని ఐసీయూ విభాగంలో ఖాళీగా ఉన్న అనస్తీసియా పోస్టు కాంట్రాక్టు పద్ధతిలో నియమించేందుకు చర్యలు తీసుకుంటాం. – దేవేందర్‌రెడ్డి, డీసీహెచ్ఎస్ -
లేజర్ ట్రీట్మెంట్: 'అమ్మాయిగా అనిపించట్లేదు'
లండన్: మరింత అందంగా కనిపించాలని, తన నిగారింపును రెట్టింపు చేసుకోవాలని తహతహలాడిందో బ్యూటీషియన్. ఈ క్రమంలో ఒంటి మీద ఉన్న అవాంచిత రోమాలను శాశ్వతంగా తొలగించుకోవాలనుకుంది. ఇందుకోసం లేజర్ ట్రీట్మెంట్లు తీసుకుంటూ కాస్మొటిక్ సర్జరీలు చేయించుకుంది. మొత్తంగా రెండు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఎనిమిది సార్లు హెయిర్ రిమూవల్ చికిత్స తీసుకుంది. కానీ ఆమె ఆశించినదానికి భిన్నంగా ప్రతికూల ఫలితాలు వస్తున్నాయని అర్థమై అర్ధాంతరంగా చికిత్సను ఆపేసింది. ఇప్పుడు తనకు తాను అమ్మాయిగా అనిపించడం లేదంటూ చింతిస్తోంది. 2018లో ఇంగ్లాండ్‌లోని లివర్‌పూల్‌కు చెందిన సన్నా సోహైల్ అనే బ్యూటీషియన్ అవాంచిత రోమాలను తొలగించేందుకు చికిత్స తీసుకుంది. ఈ క్రమంలో ఓసారి క్లినిక్‌కు వెళ్లినప్పుడు తనను తాను చూసుకుని తీవ్ర నిరాశ చెందింది. తను ఊహించినట్లుగా అందంగా కనిపించడానికి బదులుగా ఏదో హార్మోన్ల సమస్యలు ఉన్నట్లు నిర్జీవంగా కనిపించింది. దీంతో ట్రీట్మెంట్ మధ్యలోనే ఆపేసింది. పైగా చికిత్స తీసుకున్నచోట ఓ గడ్డ(కణతి) ఏర్పడింది. దీని గురించి సన్నా మాట్లాడుతూ.. నా చర్మంపైన కణతి ఏర్పడగానే వారు వైద్యుడికి చూపిస్తామన్నారు. ఓ ప్రైవేటు డాక్టర్‌ను సంప్రదించి దాన్ని తీసేయిస్తామన్నారు. కానీ ఇప్పటివరకు అది జరగలేదు అని సన్నా వాపోయింది. ట్రీట్మెంట్ తర్వాత ఎలాంటి మార్పులొస్తాయనే కనీస విషయాలేవీ వాళ్లు నాకు చెప్పలేదు. కణతి ఉన్నప్పుడు లెగ్గిన్లు, అండర్‌వేర్‌తో పాటు టైట్ దుస్తులు వేసుకోవద్దని చెప్పలేదు. ఇప్పుడు వాటిని ధరించాలన్నా ఎక్కడ మళ్లీ ఆ కణతి ఏర్పడుతుందోనని భయంగా ఉంది. వీటన్నింటి మధ్య నేను అమ్మాయినే అన్న భావన కలగడం లేదు. ఈ సమస్య వల్ల నేనెప్పటికీ జీన్స్ ధరించలేను అని చెప్పుకొచ్చింది. తనను మానసికంగా ఎంతో బాధించిన ఈ సమస్యను సన్నా అంత ఈజీగా వదల్లేదు. లేజర్ ట్రీట్మెంట్ మీద ఆమె పరిశోధనలు చేపట్టింది. ఓ యంత్రాన్ని సైతం కనిపెట్టింది. తను సొంతంగా ఏర్పాటు చేసిన క్లినిక్‌లో ఈ యంత్రాన్ని లాంచ్ చేసింది. చదవండి: ఆటోపై లగ్జరీ హౌజ్.. ఆనంద్ మహీంద్ర ఫిదా పట్టుమని పది సెకన్లు ఉన్న వీడియోకు రూ.48 కోట్లు గుమ్మరించారు -
కరోనా టైమ్.. రోబోటిక్ సర్జరీలకు ఊపు
వైద్య రంగంలో రోబోలు ప్రవేశించి దశాబ్దాలు గడిచింది. వాటి వినియోగం కూడా దినదినాభివృద్ధి చెందుతున్న క్రమంలో.. చాలా రంగాల్లో పెను మార్పులు తెచ్చిన కరోనా వైద్య రంగంలో కూడా అనేక మార్పులకు కారణమైంది. అందులో ఒకటి రోబోటిక్ అసిస్టెడ్ సర్జరీ(ఆర్ఎఎస్)లకు మరింత ఆదరణ పెంచడం. నగరంలో మరింత మందికి రోబోల సాయంతో చేసే శస్త్ర చికిత్సలపై అవగాహన పెంచడంతో పాటు భవిష్యత్‌లో వాటి అవసరాన్ని గుర్తించేలా చేసింది కరోనా. ఈ నేపథ్యంలో నగరానికి చెందిన రోబోటిక్ సర్జరీ నిపుణులు చెబుతున్న ప్రకారం.. సాక్షి, హైదరాబాద్: కొన్ని నెలల్లోనే ఢిల్లీ, ముంబై, బెంగళూర్, చెన్నై, కోల్‌కతాల్లో ఆర్ఏఎస్లు ఊపందుకున్నట్టు సమాచారం. లాక్డౌన్ ప్రకటించిన 4 నెలల్లోపు బెంగళూర్లోనే 400కిపైగా ఆర్ఏఎస్లు నిర్వహించారు. అలాగే మిగిలిన మెట్రోల్లో కూడా లాక్డౌన్ టైమ్‌లో రోబోల వినియోగం బాగా పెరిగిందని గణాంకాలు చెబుతున్నాయి. కోవిడ్ కారణంగా అత్యవసరం కాని సర్జరీలను ఇన్ఫెక్షన్ భయంతో ఆస్పత్రులు ఆపి ఉంచాయని నగరానికి చెందిన ఓ సర్జన్ చెప్పారు. తక్కువ సంఖ్యలో వైద్య సిబ్బంది, పేషెంట్‌కు దూరంగా సర్జన్ ఓ కన్సోల్ మీద కూర్చుని ఉండి చేయవచ్చు కాబట్టి.. తప్పనిసరిగా చేయాల్సిన సర్జరీను మాత్రం లాక్డౌన్ టైమ్‌లో రోబోల సహకారంతో నిర్వర్తించామన్నారని ఆయన వెల్లడించారు. ఆస్పత్రిలో గడిపే కాలం తగ్గడం ఓపెన్ సర్జరీ చేస్తే కొన్ని రోజుల పాటు తప్పకుండా ఆస్పత్తిలో ఉండాల్సి ఉంటుంది. అదే రోబోటిక్ సర్జరీ చేస్తే సర్జరీ చేసిన తర్వాత కేవలం ఒక్కరోజులో డిశ్చార్జి అయి వెళ్లిపోవచ్చు. దీని ద్వారా కనీసం వారం రోజుల వ్యవధి తేడా వస్తుంది. తద్వారా ఇన్ఫెక్షన్ సోకే అవకాశాలు కూడా ఆ మేరకు తగ్గినట్టే అవుతుంది. అయితే మరి ధరలో వ్యత్యాసం ఉన్నప్పటికీ.. తక్కువ రోజులు ఆస్పత్రిలో ఉండటం ద్వారా రోజువారీ వ్యయాలు చాలా తగ్గుతాయి. కాబట్టి పెద్ద తేడా అనిపించదు. పైగా నొప్పి కూడా తక్కువ ఉంటుంది. సర్జన్ల కొరత.. పెరిగిన శిక్షణ ఒకప్పుడు భయపడేవారు ఇప్పుడు తగ్గింది. చివరి దశలో ఉన్నవారు కూడా రోబోటిక్ సర్జరీ చేయాలంటున్నారు. రోబోటిక్ సర్జరీలకు పెరుగుతున్న ఆదరణ దృష్ట్యా సదరు సర్జరీలపై మరింత మంది వైద్యులకు శిక్షణ అవసరం అవుతోంది. నగరంలో ఈ శిక్షణ పొందిన సర్జన్లు రెండంకెలలోపే ఉంటారని అంచనా. గతంలో ఈ శిక్షణ అమెరికా, పారిస్‌లలో మాత్రమే అందుబాటులో ఉండేది. ఇప్పుడిప్పుడే మన దేశంలో కూడా లభిస్తోంది. అయితే రెగ్యులర్ సర్జరీల్లో తగినంత అనుభవం వచ్చిన తర్వాతనే ఈ శిక్షణ ఇస్తారు. ‘తెలుగు రాష్ట్రాలలో రోబోటిక్ సర్జరీలు చేసేవారి సంఖ్య 20లోపే ఉండొచ్చు. పరిస్థితుల కారణంగా శిక్షణ కార్యక్రమాలు కూడా పెరిగాయి. నేనూ ఇటీవలే విశాఖ వెళ్లి శిక్షణ ఇచ్చి వచ్చాను’ అని అపోలో వైద్యులు డా.చినబాబు చెప్పారు. సోషల్ డిస్టెన్స్‌కి మేలు.. ⇔ సాధారణంగా ల్యాప్రొస్కపీ, ఓపెన్ హార్ట్ తదితర సర్జరీలకు సర్జన్ సహా అందరూ పక్కపక్కనే ఉండాల్సిన అవసరం ఉంటుంది. అయితే రోబోట్రిక్స్లో ఆ అవసరం ఉండదు. కనీసం 8 నుంచి 10 అడుగుల దూరం వరకూ ఉండే సర్జరీ చేసేందుకు అవకాశం ఉంటుంది. దీంతో కరోనా టైమ్‌లో రోబోల వినియోగంవైపు బాగా మొగ్గు చూపుతున్నారు. ⇔ ప్రస్తుతం గైనిక్ కేన్సర్స్, పెద్దపేగు, అన్నవాహిక, ప్రోస్టేట్ కేన్సర్లకు అవసరమైన సర్జరీలు చేయడంలో ఎక్కువగా రోబోటిక్స్ సహకారం తీసుకుంటున్నారు. అలాగే గర్భసంచి తొలగించడానికి కూడా రోబోటిక్ సర్జరీ ఎంచుకుంటున్నారు. కరోనా పరిస్థితుల్లో ఉపయుక్తమే.. నాకు 8 ఏళ్ల నుంచి రోబోటిక్ సర్జరీలు చేస్తున్న అనుభవం ఉంది. కోవిడ్ కారణంగా కొంత వరకూ రోబోటిక్ అసిస్టెడ్ సర్జరీల శాతం పెరిగిందనేది నిజమే. సోషల్ డిస్టెన్స్‌కి, అలాగే ఆస్పత్రుల్లో తక్కువ రోజుల్లోనే డిశ్చార్జ్ అయ్యే అవకాశం వల్ల కోవిడ్ పరిస్థితుల్లో ఈ సర్జరీలు చాలా ఉపయుక్తంగా మారాయి. రోగుల్లో కూడా రోబోటిక్ సర్జరీలపై బాగా అవగాహన పెరిగింది. వారే స్వయంగా ఈ పద్ధతిలో సర్జరీ గురించి అడిగే పరిస్థితి కూడా వచ్చింది. అలాగే రోబోలకు సంబంధించి కొత్త కొత్త ఆవిష్కరణలూ వెలుగు చూస్తున్నాయి. – డాక్టర్ చినబాబు సుంకవల్లి, రోబోటిక్ సర్జికల్ అంకాలజిస్ట్, అపోలో కేన్సర్ ఇన్స్టిట్యూట్ -
ఇక వారు కూడా ఆపరేషన్లు చేయొచ్చు!
సాక్షి, న్యూఢిల్లీ: ఆయుర్వేద వైద్యానికి ఆదరణ పెరుగుతున్న నేపథ్యంలో బీజేపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. భారతీయు ఆయుర్వేద వైద్య విధానం ప్రోత్సాహానికి ఇప్పటికే అనేక చర్యలు చేపట్టిన కేంద్రం తాజాగా ఆయుర్వేదంలో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ హోల్డర్లు వివిధ రకాల సాధారణ శస్త్రచికిత్సలు చేసేందుకు వీలు కల్పించనుంది. ఈ మేరకు ఇండియన్ మెడిసిన్ సెంట్రల్ కౌన్సిల్ (పోస్ట్ గ్రాడ్యుయేట్ ఆయుర్వేద విద్య) 2016 నిబంధనలను సవరించింది. షాలియా (సాధారణ శస్త్రచికిత్స) షాలక్య (ఈఎన్టీ, హెడ్, డెంటల్ స్పెషలైజేషన్) కోర్సులను పీజీలో ప్రవేశపెట్టింది. దీని ప్రకారం వారికి ప్రత్యేక శిక్షణను ప్రవేశపెట్టింది. శిక్షణ అనంతరం ఈఎన్టీ, దంత వైద్యంతోపాటు, కంటి శస్త్ర చికిత్సలు చేయడానికి కూడా అనుమతి లభిస్తుంది. ప్రభుత్వనిర్ణయం ప్రకారం ఇకపై ఆయుర్వేద వైద్యులు స్కిన్ గ్రాఫ్టింగ్, కంటిశుక్లం శస్త్ర చికిత్స, రూట్ కెనాల్ వంటి సాధారణ ఆపరేష్లన్లను చట్టబద్ధంగా నిర్వహించవచ్చు. నవంబర్ 19న జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్, పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థులకు పాఠ్యాంశాల్లో భాగంగా షాలియా (సాధారణ శస్త్రచికిత్స) షాలక్య (చెవి, ముక్కు, గొంతు వ్యాధులు) విధానాలలో అధికారికంగా శిక్షణనిస్తుంది. తద్వారా వారు స్వతంత్రగా సర్జరీలను నిర్వహించే సామర్ధ్యాన్ని సొంతం చేసుకుంటారు. ఎంఎస్ (ఆయుర్వేద) శాల్య తంత్రం డీబ్రిడ్ మెంట్ / ఫాసియోటోమీ / క్యూరెట్టేజ్ పెరియానల్ చీము, రొమ్ము గడ్డ, ఆక్సిలరీ చీము, సెల్యులైటిస్ అన్ని రకాల స్కిన్ గ్రాఫ్టింగ్, ఇయర్ లోబ్ రిపైర్ లింఫోపోమా, ఫైబ్రోమా, స్క్వాన్నోమా మొదలైన కణతుల తొలగింపు గ్యాంగ్రేన్ ఎక్సిషన్ / విచ్ఛేదనం తీవ్ర గాయాలనిర్వహణ, అన్ని రకాల సూటరింగ్, హేమోస్టాటిక్ లిగెచర్స్, బిగుసుకుపోయిన కండరాల చికిత్స లాపరోటమీ హేమోరాయిడెక్టమీ, రబ్బర్ బ్యాండ్ లిగేషన్, స్క్లెరోథెరపీ, ఐఆర్పీ, రేడియో ఫ్రీక్వెన్సీ / లేజర్ అబ్లేషన్ మొదలైన వివిధ పద్ధతులు. యానల్ డైలేటేషన్, స్పింక్టెరోటోమీ అనోప్లాస్టీ ఫిస్టులెక్టమీ, ఫిస్టులోటోమీ, పైలోనిడల్ సైనస్ ఎక్సిషన్, వివిధ రెక్టోపెక్సీలు యురేత్రల్ డైలేటేషన్, మీటోమి, సున్తీ పుట్టుకతో వచ్చే హెర్నియోటమీ, హెర్నియోరాఫీ, హెర్నియోప్లాస్టీ హైడ్రోసెల్ ఎవర్షన్, థొరాసిక్ గాయానికి ఇంటర్‌కోస్టల్ డ్రెయిన్ మొదలైనవి ఉన్నాయి కన్ను కనుపాపలను సరిచేసే సర్జరీ, క్యూరెట్టేజ్ ట్యూమర్ తొలగింపు సర్జరీ పాటరీజియం ఐరిస్ ప్రోలాప్స్-ఎక్సిషన్ సర్జరీ గ్లాకోమా-ట్రాబెక్యూలెక్టమీ కంటికి గాయం: - కనుబొమ్మ, మూత, కండ్లకలక, స్క్లెరా కార్నియా గాయాలకుమరమ్మత్తు శస్త్రచికిత్స స్క్వింట్ సర్జరీ - ఎసోట్రోపియా, ఎక్సోట్రోపియా డాక్రియోసిస్టిటిస్- డిసిటి / డాక్రియోసిస్టోరినోస్టోమీ [డిసిఆర్] కంటిశుక్లం శస్త్రచికిత్స ఇంప్లాంటేషన్ శస్త్రచికిత్సతో కంటిశుక్లం వెలికితీత మొదలైనవి ముక్కు: సెప్టోప్లాస్టీ, పాలీపెక్టమీ, రినోప్లాస్టీ చెవి : లోబులోప్లాస్టీ. అక్యూట్ సపరేటివ్ ఓటిటిస్, మాస్టోయిడెక్టమీ గొంతు వ్యాధులు : టాన్సిలెక్టమీతో పాటు ఇతర చికిత్సలు దంత : వదులు దంతాల బిగింపు, రూట్ కెనాల్,ఇతర చికిత్స -
భారత్‌లో 5.8 లక్షల ప్రాణాలకు ముప్పు!
సాక్షి, న్యూఢిల్లీ : దేశంలో కరోనా కేసులకు ప్రాధాన్యత ఇవ్వడం కోసం అత్యవసరం కాని అన్ని ఎలక్టివ్ సర్జరీలను మార్చి 31వ తేదీ వరకు వాయిదా వేయాలంటూ కేంద్ర ప్రభుత్వం మార్చి 20వ తేదీన దేశంలోని ఆస్పత్రులకు, వైద్య సంస్థలకు సూచనలు జారీ చేసింది. మార్చి 20వ తేదీ వరకే కాకుండా నేటి వరకు కూడా దేశంలో కరోనా కేసుల తీవ్రత తగ్గక పోవడంతో అన్ని ప్రభుత్వ ఆస్పత్రులు, వైద్య సంస్థలు అత్యవసరం కాని సర్జరీ కేసులను వాయిదా వేస్తూనే వస్తున్నాయి. మే 31వ తేదీ నాటికి నాలుగవ దశ లాక్డౌన్ కొనసాగుతుంది. ఐదవ దశ లాక్‌డౌన్‌ను విధిస్తారా, లేదా? అన్న విషయంతో ప్రస్తుతానికి స్పష్టత లేదు. లాక్‌డౌన్‌ను పొడిగించినా, లేకపోయిన వాయిదా వేస్తూ వస్తోన్న సర్జరీలను వెంటనే అనుమతించక పోయినట్లయితే వారిలో ఎంతో మంది మరణించే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు తెలియజేస్తున్నారు. దేశంలో ఇప్పటి వరకు 5.8 లక్షల ఎలక్టివ్ సర్జరీలను వాయిదా వేసినట్లు వైద్య వర్గాలు తెలియజేస్తున్నాయి. ఎలక్టివ్ సర్జరీలో ఎలక్టివ్ అనే ఆంగ్లపదం ‘ఎలిగెరి’ అనే లాటిన్ పదం నుంచి వచ్చింది. ఎలిగెరి అంటే ఎంపిక చేసిన అని అర్థం. ఎలక్టివ్ సర్జరీలంటే అత్యవసరం కాకపోయినప్పటికీ సర్జరీ ద్వారా ప్రాణాలను కాపాడాల్సిన కేసులే. ఈ సర్జరీలను ఆస్పత్రుల్లోని సౌకర్యాలు, రోగుల పరిస్థితిని దష్టిలో పెట్టుకొని ఎప్పుడు సర్జరీ చేయాలో ముందుగానే నిర్ధారిస్తారు. వాటి కోవలోకి హెర్నియా, అపెండిక్స్, కిడ్నీ, గాల్ బ్లాడర్ సర్జరీలను వాయిదా వేయవచ్చు. అయితే మరింత ఆలస్యమైతే రోగుల పరిస్థితి దుర్భరం అవుతుంది. ► కార్డియాక్ సర్జరీలు : యాంజీయోగ్రాఫీ లేదా స్టెంట్లు వేయడానికి ముందుగానే ముందుగానే తేదీలను ఖరారు చేయాల్సి ఉంటుంది. కొన్ని నెలలు ఆలస్యమైతే రోగి ప్రాణాలే పోవచ్చు. ► క్యాన్సర్ : మొదట్లోనే గుర్తించి సర్జరీ చేస్తే నయం అవుతుంది. ఆలస్యం అయినకొద్దీ ముదిరి ప్రాణం మీదకు తెస్తుంది. ► మధుమేహ రోగులకు అయిన గాయాలకు, ఇన్ఫెక్షన్లకు సకాలంలో వైద్య పోయినట్లయితే ఇన్ఫెక్షన్లు తీవ్రమై శరీర అవయవాలను తొలగించాల్సిన అవసరం ఏర్పడుతుంది. మే 18వ తేదీ నాటికి దేశంలో 5,05,800 అత్యవసరం కాని సర్జరీలు, 51,100 క్యాన్సర్ సర్జరీలు, 27,700 ఆబ్స్టెరిక్ సర్జరీలు (స్త్రీల అంగం, అండాశయం, గర్భాశ్రయంకు సంబంధించిన) పెండింగ్‌లో ఉన్నట్లు వైద్య వర్గాల ద్వారా తెల్సింది. ‘బ్రిటిష్ జర్నల్ ఆఫ్ సర్జరీ’ కూడా దాదాపు ఇంతే సంఖ్యను మే 12వ తేదీన వెల్లడించింది. భారత ప్రభుత్వం సూచనల ప్రకారం మొదటి వారంలో 48,725 సర్జరీలు వాయిదా పడ్డాయని, ఆ లెక్కన 12 వారాలకు(దాదాపు మూడు నెలల కాలానికి) 5,85,000 సర్జరీలు వాయిదా పడి ఉంటాయని ఆ పత్రిక పేర్కొంది. అలా ప్రపంచవ్యాప్తంగా 2.84 కోట్ల సర్జరీలు వాయిదా పడి ఉంటాయని అంచనా వేసింది. (చదవండి : ట్రంప్ వ్యాఖ్యలపై కేంద్రం స్పందన) కరోనా వైరస్ ప్రభావం ఎక్కువగా ఉన్న మహారాష్ట్రలో ఎలక్టివ్ సర్జరీలు ఎక్కువగా వాయిదా పడ్డాయి. ఇలాంటి కేసుల విషయంలో అత్యవసరంగా స్పందించాల్సిన అవసరం వచ్చిందని, ఆలస్యం చేసినట్లయితే రోగుల అవయవాలు దెబ్బతింటాయని, తద్వారా వారి ప్రాణాలకు కూడా ముప్పుందని ముంబైలోని ‘టీఎన్ మెడికల్ కాలేజ్ అండ్ బీవైఎల్ నాయర్ ఆస్పటల్’ సర్జరీ విభాగం అధిపతి, ‘మహారాష్ట్ర చాప్టర్ ఆఫ్ ది అసోసియేషన్ ఆఫ్ సర్జన్స్ ఆఫ్ ఇండియా’ కార్యదర్శి సతీష్ ధారప్ హెచ్చరించారు. -
మహమ్మారితో ఆ‘పరేషాన్’లు..
లండన్ : కోవిడ్-19 ప్రభావంతో భారత్‌లో 5,80,000కు పైగా సర్జరీలు రద్దవడం లేదా జాప్యానికి గురయ్యాయని అంతర్జాతీయ కన్సార్షియం చేపట్టిన అథ్యయనం అంచనా వేసింది. కరోనా మహమ్మారి వ్యాప్తితో ఆస్పత్రి సేవలకు 12 వారాల పాటు తీవ్ర అంతరాయం నెలకొన్న క్రమంలో ప్రపంచవ్యాప్తంగా 2.8 కోట్ల సర్జరీలు రద్దవడం లేదా వాయిదా పడవచ్చని బ్రిటిష్ జర్నల్ ఆఫ్ సర్జరీలో ప్రచురితమైన అథ్యయనం పేర్కొంది. దీంతో రోగులు తమ ఆరోగ్య సమస్యల పరిష్కారానికి వారాల తరబడి వేచిచూడాల్సిన పరిస్థితి నెలకొంది. సర్జికల్ కేర్‌పై కోవిడ్-19 ప్రభావం గురించి 120 దేశాలకు చెందిన 5000 మంది సర్జన్లతో కూడిన కోవిడ్సర్జ్ కొలాబరేటివ్ ఈ పరిశోధనను నిర్వహించింది. బ్రిటన్, అమెరికా, భారత్, ఇటలీ, మెక్సికో, నైజీరియా, దక్షిణాఫ్రికాకు చెందిన సభ్యుల నేతృత్వంలో ఈ అథ్యయనం సాగింది. ఆస్పత్రి సేవలకు అదనంగా ఏ ఒక్క వారం విఘాతం కలిగినా మరో 24 లక్షల సర్జరీలు వాయిదా పడటమో, రద్దవడమో జరుగుతాయని అథ్యయనం స్పష్టం చేసింది. 71 దేశాల్లోని 359 ఆస్పత్రుల నుంచి సేకరించిన సమాచారంతో బ్రిటన్‌లోని యూనివర్సిటీ ఆఫ్ బర్మింగ్‌హామ్ సహా ఇతర పరిశోధకులు ఈ నివేదికను రూపొందించారు. చదవండి : మరో సరికొత్త ఆవిష్కరణ కోవిడ్-19 అవాంతరాలతో ప్రపంచవ్యాప్తంగా ముందుగా నిర్ణయించిన 72.3 శాతం సర్జరీలు రద్దవుతాయని పరిశోధకులు అంచనా వేశారు. క్యాన్సరేతర ఆపరేషన్లే వీటిలో అధికంగా ఉంటాయని వెల్లడించారు. ఇక భారత్‌లో కోవిడ్-19 కలకలంతో 12 వారాల సమయంలో 5,84,737మంది రోగులకు ఆపరేషన్లు వాయిదా పడ్డాయని అథ్యయనం అంచనా వేసింది. ఇక ఈ 12 వారాల వ్యవధిలో ప్రపంచవ్యాప్తంగా 63 లక్షల ఆర్ధోపెడిక్ ఆపరేషన్లు రద్దయ్యాయని పరిశోధకులు పేర్కొన్నారు. -
‘ఆసరా’తో ఆదుకుంటాం
మంచి పాలన అందుతున్నప్పుడు, వేలెత్తి చూపించే పరిస్థితులు ఏవీ లేనప్పుడు చిన్నచిన్న వాటిని, మనకు సంబంధం లేని అంశాలను కూడా పెద్ద సమస్యలుగా చూపించే ప్రయత్నాలు ఇవాళ జరుగుతున్నాయి. ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని కుతంత్రాలు పన్నినా గట్టిగా నిలబడతా. మీ అందరి దీవెనలు, దేవుడి దయ... వీటిమీదే నేను గట్టిగా నమ్మకం ఉంచా. మొదటి నుంచి కూడా వీటినే నమ్ముకున్నా. ఈరోజు కూడా మిమ్మల్నే, దేవుడినే నమ్ముకుంటా.. – సీఎం జగన్ సాక్షి, అమరావతి బ్యూరో: మనిషి ప్రాణాలకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తూ వైద్య ఆరోగ్య రంగాల్లో విప్లవాత్మక చర్యలకు నాంది పలుకుతున్నామని సోమవారం గుంటూరులో ‘వైఎస్సార్ ఆరోగ్య ఆసరా’ పథకం ప్రారంభోత్సవం సందర్భంగా సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు. ఆరోగ్యశ్రీలో భాగంగా ఉండే వైఎస్సార్ ఆసరా పథకం ద్వారా ఆపరేషన్ తర్వాత రోగికి రోజుకు రూ.225 చొప్పున నెలకు గరిష్టంగా రూ.5 వేల వరకు అందిస్తామని తెలిపారు. వైద్యుల సిఫార్సుల మేరకు ఎన్ని రోజులైనా, ఎన్ని నెలలైనా చికిత్సానంతర జీవనభృతిని అందిస్తామని సీఎం వివరించారు. మూడేళ్లలో ప్రభుత్వాస్పత్రుల రూపురేఖలు మార్చేసి అపోలో లాంటి కార్పొరేట్ ఆసుపత్రులకు దీటుగా తీర్చిదిద్దుతామని ప్రకటించారు. ఇందుకోసం రూ.13 వేల కోట్లు వెచ్చించనున్నట్లు చెప్పారు. గుంటూరు మెడికల్ కాలేజీ జింఖానా ఆడిటోరియంలో ‘వైఎస్సార్ ఆరోగ్య ఆసరా’ ప్రారంభించిన అనంతరం సీఎం జగన్ ప్రసంగం వివరాలు ఆయన మాటల్లోనే.. మాట నిలబెట్టుకుంటున్నా... ‘నా పాదయాత్ర సమయంలో ఇచ్చిన ఒక మాటను నిలబెట్టుకోవడంలో భాగంగా ఈరోజు ఇక్కడకు రావడం సంతోషంగా ఉంది. ఇవాళ రకరకాల ఆరోపణల మధ్య రాష్ట్రంలో పరిపాలన చూస్తున్నాం. మంచి పరిపాలన జరుగుతుంటే జీర్ణించుకోలేక ఏదిపడితే అది మాట్లాడుతున్నారు. గుంటూరు వేదికగా ‘వైఎస్సార్ ఆరోగ్య ఆసరా’ పథకాన్ని ప్రారంభించడాన్ని గౌరవంగా భావిస్తున్నా. పేదలు ఆపరేషన్ తరువాత ఇంటికి వెళ్లి విశ్రాంతి తీసుకోవాలనే ఆలోచనను పక్కనపెట్టి కడుపు నిండటం కోసం మళ్లీ పనుల కోసం పరుగెత్తుతున్నారు. ఈ పరిస్థితుల్ని మారుస్తూ శస్త్రచికిత్స అనంతరం రోగిని ఆప్యాయంగా పలుకరిస్తూ కోలుకునేందుకు వీలుగా డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్య ఆసరా పథకాన్ని ప్రవేశపెట్టాం. ఆరోగ్యశ్రీలో అంతర్భాగంగా దీన్ని ప్రారంభించాం. ఆపరేషన్ చేయించుకుని విశ్రాంతి తీసుకునే సమయంలో రోగులు ఇంట్లో పస్తులు ఉండకుండా రోజుకు రూ.225 చొప్పున నెలకు రూ.5 వేల వరకు చెల్లిస్తాం. వైద్యుల సిఫార్సుల మేరకు ఎన్ని రోజులైనా, ఎన్ని నెలలైనా చికిత్సానంతర ఈ జీవనోపాధి భృతిని అందజేస్తాం. ఏ ఆపరేషన్‌కు ఎంత ఖర్చు అవుతుంది? ఈ సహాయం ఎంత కాలం ఇవ్వాలన్నది నిపుణులతో కూడిన డాక్టర్లు నిర్ణయిస్తారు. సంపాదించే వ్యక్తి రోగాలతో బాధపడుతుంటే ఆ కుటుంబాలు ఆదాయం లేక ఎంత సతమతమవుతాయో నా పాదయాత్రలో కళ్లారా చూశా. ఆ కుటుంబాలన్నింటికీ ‘‘నేను విన్నాను.. నేను ఉన్నాను...’’ అని ఆ రోజు చెప్పా. ఇప్పుడా మాట నిలబెట్టుకుంటున్నందుకు గర్వంగా ఉంది. గుంటూరు మెడికల్ కాలేజీ ఆడిటోరియంలో జరిగిన సభలో హాజరైన ప్రజలు జనవరి 1 నుంచి ఆరోగ్యశ్రీ కొత్త కార్డులు అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టాం. 3,648 కిలోమీటర్ల మేర సాగిన నా పాదయాత్రలో ప్రజలకు మాట ఇచ్చినట్టుగానే.. ఆరోగ్యశ్రీ పరిధిని పెంచి ఏటా రూ.5 లక్షలలోపు ఆదాయం ఉన్నవారందరికీ ఈ పథకాన్ని వర్తింపజేస్తాం. అందులో భాగంగా వారికి జనవరి 1వతేదీ నుంచి ఆరోగ్యశ్రీ కొత్త కార్డులు జారీ చేస్తాం. కార్డుతో పాటు క్యూఆర్ కోడ్‌లో పేషెంట్‌కు సంబంధించి మెడికల్ రిపోర్టును పొందుపరుస్తాం. జనవరి 1 నుంచి ఆరోగ్యశ్రీని 1,200 చికిత్సలకు విస్తరిస్తూ విప్లవాత్మక మార్పులు తెస్తున్నాం. రానున్న రోజుల్లో ఆరోగ్యశ్రీ పరిధిలోకి 2,000 చికిత్సలను చేరుస్తాం. తొలిదశలో పైలెట్ ప్రాజెక్ట్ కింద ముందు పశ్చిమ గోదావరి జిల్లాలో జనవరిలో దీన్ని ప్రారంభిస్తాం. ఏప్రిల్ నుంచి నెలకు ఒక జిల్లా చొప్పున విస్తరించుకుంటూ వెళతాం. వైద్యం ఖర్చు రూ.1,000 దాటితే ఆరోగ్యశ్రీ వర్తిస్తుంది. మూడు మహానగరాల్లోనూ వర్తింపు వచ్చే ఏప్రిల్ నాటికి 104, 108 వాహనాలు కొత్తవి 1,060 కొనుగోలు చేస్తాం. ఫోన్ కొట్టిన 20 నిమిషాల్లోనే మంచి అంబులెన్స్ మీ ముందు ఉంటుంది. మంచి ఆస్పత్రికి తీసుకువెళ్లడమే కాకుండా ఉచితంగా మెరుగైన వైద్యం అందించి చిరునవ్వుతో తిరిగి ఇంటికి వెళ్లేలా చూస్తాం. మీరు విశ్రాంతి తీసుకునే సమయంలో కూడా ఇబ్బంది పడకుండా చెక్కు మీ చేతుల్లో పెట్టి పంపించే పరిస్థితి తెస్తాం. ఆరోగ్యశ్రీలో పెనుమార్పులు తెస్తూ హైదరాబాద్, బెంగళూరు, చెన్నైలోని 130కి పైగా సూపర్ స్పెషాల్టీ ఆస్పత్రుల్లో నవంబర్ 1 నుంచే ఈ సేవలను అందుబాటులోకి తెచ్చాం. రోగులకు మొక్కుబడిగా కాకుండా మెరుగైన సేవలు అందించేందుకు నెట్వర్క్ ఆసుపత్రులు నాణ్యతా ప్రమాణాలు పెంచుకోవాలి. ‘ఏ’ గ్రేడ్ నుంచి ‘ఏ’ ప్లస్ గ్రేడ్‌కి ఆర్నెళ్లలో మారాలి. అలా మారని ఆసుపత్రులను ఆరోగ్యశ్రీ ఎంప్యానెల్ నుంచి తొలగిస్తాం. రాష్ట్ర ప్రజలందరికీ ‘వైఎస్సార్ కంటి వెలుగు’.. ఆర్నెళ్లు తిరగక ముందే ‘వైఎస్సార్ కంటి వెలుగు’ పథకానికి శ్రీకారం చుట్టి పాఠశాల విద్యార్థులకు ఉచితంగా నేత్ర వైద్య పరీక్షలు, శస్త్ర చికిత్సలు నిర్వహిస్తున్నాం. కళ్లద్దాలు ఉచితంగా అందజేస్తున్నాం. ప్రతి ఆర్నెళ్లకు ఓ వర్గాన్ని ఈ పథకంలోకి తెస్తాం. విద్యార్థుల తర్వాత అవ్వా తాతలకు దీన్ని వర్తింపజేస్తాం. ఆ తర్వాత ఆర్నెళ్లకు రాష్ట్రంలో ఉన్న జనాభా మొత్తానికి పథకాన్ని అమలు చేస్తాం. ప్రభుత్వాసుపత్రుల్లో 510 రకాల ఔషధాలు ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఈనెల 15వతేదీ నుంచి 510 రకాల మందులను అందుబాటులోకి తెస్తాం. వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాలతో కూడిన ఔషధాలను మాత్రమే అందుబాటులోకి తెస్తాం. డయాలసిస్ రోగులకు మన ప్రభుత్వం ఇప్పటికే ఇస్తున్న విధంగానే తలసేమియా, సికిల్‌సెల్, హీమోఫీలియా వ్యాధిగ్రస్తులకు కూడా జనవరి 1 నుంచి నెలకు రూ.10 వేలు చొప్పున ఇస్తాం. ప్రమాదాలు, పక్షవాతం, నరాల బలహీనత కారణంగా వీల్ చైర్లు, మంచానికే పరిమితమైన వారికి జనవరి 1 నుంచి రూ.5 వేలు చొప్పున పెన్షన్ చెల్లిస్తాం. బోధకాలు, కిడ్నీ బాధితుల(స్టేజ్ 3, 4, 5)ను రూ.5 వేల పెన్షన్ కేటగిరీలోకి తెస్తాం. లెప్రసీ బాధితులను రూ.3 వేల పెన్షన్ కేటగిరీలోకి తెచ్చి ప్రతి రోగికీ నేను ఉన్నాను అనే భరోసా కల్పిస్తాం. కేన్సర్ పేషెంట్లను కూడా మార్పులతో ఆరోగ్యశ్రీ పరిధిలోకి తెస్తాం. వారికి ఎన్ని దశల చికిత్స అవసరమైన పూర్తిగా భరిస్తాం. పుట్టుకతో మూగ, చెవుడు లోపం కలిగిన చిన్నారులకు రెండు చెవులకు కాక్లియర్ ఇంప్లాంట్స్ అందచేస్తాం. అలవాట్లు మారినప్పుడే... ప్రజల అలవాట్లు మారినప్పుడే వైద్యంపై ప్రభుత్వం వెచ్చించే ఖర్చు తగ్గుతుంది. అందుకనే మద్యాన్ని ఒక పద్ధతి ప్రకారం నియంత్రిస్తున్నాం. దాదాపు 43 వేల బెల్టుషాపులను రద్దు చేశాం. పర్మిట్‌రూంలు లేకుండా చేశాం. 4,500 మద్యం షాపులను 3,500కి తగ్గించాం. పర్మిట్ రూమ్‌లు లేకుండా చేస్తున్నాం. రాత్రి 8 గంటల తర్వాత మద్యం షాపులను మూసివేస్తున్నాం. ప్రైవేట్ వ్యాపారుల్లాగా లాభాపేక్ష ఉండకూడదన్న ఉద్దేశంతో ప్రభుత్వ ఆధ్వర్యంలో మద్యం షాపులను ఏర్పాటు చేశాం. బార్లను కూడా 40 శాతం తగ్గించేశాం. మద్యం ధరలు షాక్ కొట్టేలాగే ఉంటాయి. అలా చేస్తేనే ఆరోగ్యం బాగుపడుతుందని నమ్ముతున్నాం. మూడేళ్లలో రూపురేఖలు మార్చేస్తాం డిసెంబర్ చివరి వారంలో ప్రభుత్వ ఆస్పత్రుల రూపురేఖలను సమూలంగా మార్చే నాడు–నేడు కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. మూడేళ్లలో అన్ని ప్రభుత్వ ఆస్పత్రులను అపోలో లాంటి కార్పొరేట్ ఆసుపత్రులకు దీటుగా అభివృద్ధి చేసేందుకు రూ.13 వేల కోట్లు వెచ్చిస్తాం. విజయనగరం, పాడేరు, ఏలూరు, మచిలీపట్నం, గురజాల, మార్కాపురం, పులివెందులలో బోధనాస్పత్రులను ఏర్పాటు చేస్తాం. మే నెల నాటికి డాక్టర్లు, నర్సులు, ఇతర ఖాళీ పోస్టులన్నీ భర్తీ చేస్తాం. ఈ అడుగులు ఒకవైపు వేస్తూనే ఒక మంచి సమాజం ఉండాలనే ఉద్దేశంతో స్కూళ్ల రూపురేఖలు మార్చేందుకు ఇంగ్లీషు మీడియాన్ని ప్రవేశపెడుతున్నాం. నిధుల కొరత ఉన్నా, నావద్ద ఎలాంటి మంత్రదండం లేకున్నా.. దేవుడు ఆశీర్వదిస్తాడు, ప్రజల దీవెనతో అడుగులు ముందుకు పడతాయనే నమ్మకంతో ఈ కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నాం’’ -
ప్రతిష్టాత్మకం.. వైఎస్సార్ నవశకం
అర్హులైన లబ్ధిదారులకు జనవరి 1 నుంచి కొత్త కార్డులను ముద్రించి, పంపిణీ చేయాలి. వైఎస్సార్ నవశకం మార్గదర్శకాలు చేరని జిల్లాలకు వెంటనే పంపించండి. అర్హులైన ప్రతి వారూ లబ్ధి పొందాలి. ఏ ఒక్కరికీ అన్యాయం జరగకుండా అధికారులు సీరియస్‌గా పని చేయాలి. సంక్షేమ పథకాల వర్తింపులో కులం, మతం, ప్రాంతం, పార్టీలు చూడొద్దు. కేవలం అర్హతే ప్రామాణికం అనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి. చరిత్రలో నిలిచిపోయేలా ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం ఉండాలి. అధికారులందరూ దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలి. ఫలానా కలెక్టర్ హయాంలో ఇళ్ల పట్టా ఇచ్చారన్న పేరు చరిత్ర ఉన్నంత వరకు నిలిచిపోయేలా పని చేయాలి. ఇలాంటి గొప్ప కార్యక్రమం చేస్తే దేవుడికి సేవ చేసినట్లే. డిసెంబర్ 1 నుంచి ఆరోగ్యశ్రీ కింద శస్త్రచికిత్సలు చేయించుకున్న వారికి వైద్యులు సూచించిన మేరకు విశ్రాంతి సమయంలో రోజుకు రూ.225 లేదా గరిష్టంగా రూ.5 వేలు ఇస్తాం. ఆ మేరకు ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన 48 గంటల్లో రోగుల అకౌంట్లలో నేరుగా నగదు జమ అవుతుంది. 26 ప్రత్యేక విభాగాల్లో 836 రకాల శస్త్ర చికిత్సలు చేయించుకున్న వారికి ఇది వర్తిస్తుంది. ఇందుకు ఏడాదికి దాదాపు రూ.268.13 కోట్లు ఖర్చవుతుందని అంచనా. స్పందన కార్యక్రమంలో అర్జీ ఇవ్వడానికి వచ్చే వారిని చిరునవ్వుతో స్వాగతించాలి. ఇచ్చిన ప్రతి అర్జీని సీరియస్‌గా తీసుకోవాలి. మనసా, వాచా, కర్మణా పని చేసినప్పుడే బాధితులకు న్యాయం చేయగలుగుతాం. మనకేదైనా సమస్య వస్తే ఎలాంటి పరిష్కారం కోరుకుంటామో అలాంటి పరిష్కారమే మన దగ్గరకొచ్చేవారికి లభించేలా చర్యలుండాలి. సాక్షి, అమరావతి : ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల తుది జాబితాను డిసెంబర్ 20 నాటికి గ్రామ, వార్డు సచివాలయాల్లో శాశ్వతంగా ప్రదర్శించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. సామాజిక తనిఖీల కోసం డిసెంబర్ 15 నుంచి 18వ తేదీ వరకు ఆయా పథకాల అర్హుల జాబితాను అక్కడే ప్రదర్శించాలన్నారు. లబ్ధిదారుల ఎంపిక కోసం చేపట్టిన వైఎస్సార్ నవశకం కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలన్నారు. ‘స్పందన’ కార్యక్రమంపై మంగళవారం ఆయన సచివాలయం నుంచి కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్సార్ నవశకం పేరుతో ఈ నెల 20 నుంచి గ్రామ, వార్డు వలంటీర్ల ద్వారా ప్రారంభమైన ప్రభుత్వ సంక్షేమ పథకాలకు అర్హులైన లబ్ధిదారుల ఎంపిక కార్యక్రమం సాగుతున్న తీరుపై ఆయన ఆరా తీశారు. ఈ సందర్భంగా పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమం కింద కొత్తగా బియ్యం కార్డు, వైఎస్సార్ ఆరోగ్యశ్రీ కార్డు, వైఎస్సార్ పెన్షన్ కానుక కార్డు, జగనన్న విద్యా దీవెన – జగనన్న వసతి దీవెన కార్డులను జారీ చేస్తామని చెప్పారు. జగనన్న అమ్మఒడి, వైఎస్సార్ కాపు నేస్తం, రజకులు, నాయీ బ్రాహ్మణులు, దర్జీలకు ఆర్థిక సాయం, అర్చకులు, ఇమామ్‌లు, మౌజమ్‌లకు ఆర్థిక సాయం, వైఎస్సార్ సున్నా వడ్డీ, నేతన్న నేస్తం, లా నేస్తం లబ్ధిదారుల ఎంపిక కోసం సాగుతున్న ప్రక్రియ తీరు గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. డిసెంబర్ 1 నుంచి రోగులకు ఆర్థిక సాయం వైఎస్సార్ ఆరోగ్య శ్రీ కింద నిర్ధారించిన వ్యాధులకు శస్త్రచికిత్స చేయించుకున్న వారు ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యి కోలుకునే సమయంలో దేశంలో తొలిసారిగా ఆర్థిక సాయం చేస్తున్నామని ముఖ్యమంత్రి తెలిపారు. ఈ పథకం అమల్లో ఎలాంటి గందరగోళానికి తావులేకుండా చూడాల్సిందిగా ఆదేశించారు. ఈ పథకం అమలు కోసం ఆరోగ్య మిత్రలకు అవసరమైన ఓరియెంటేషన్ ఇవ్వాలని సూచించారు. దేశం మొత్తం రాష్ట్రం వైపు చూసేలా మన పని తీరు ఉండాలని, ప్రజా ప్రతినిధులను ఈ కార్యక్రమంలో భాగస్వాములను చేయాలన్నారు. సికిల్‌సెల్ ఎనీమియా, తలసేమియా, హీమోఫీలియా బాధితులకు నెలకు రూ.10 వేలు, ఎలిఫెంటియాసిస్, పెరాలసిస్, మస్క్యులర్ డిస్ట్రోపీ, క్రానిక్ కిడ్నీ డిసీజ్ వ్యాధిగ్రస్తులకు నెలకు రూ.5 వేలు చొప్పున ఇచ్చే వైఎస్సార్ పెన్షన్ కానుక లబ్ధిదారుల జాబితాను రూపొందించడంలో కలెక్టర్లు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సీఎం సూచించారు. మంగళవారం స్పందనపై సమీక్షలో రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడతామని ఉన్నతాధికారులతో ప్రమాణం చేయిస్తున్న సీఎం వైఎస్ జగన్ 45.82 లక్షల మంది రైతులకు వైఎస్సార్ రైతు భరోసా వైఎస్సార్ రైతు భరోసా కింద వ్యవసాయ పెట్టుబడి కోసం రాష్ట్ర వ్యాప్తంగా 45.82 లక్షల మంది రైతులకు చెల్లింపులు పూర్తి చేసినట్లు ముఖ్యమంత్రి పేర్కొన్నారు. మరో 2.14 లక్షల మంది రైతులకు వారం రోజుల్లోగా చెల్లించాలని ఆదేశించారు. ఈ చెల్లింపుల విషయంలో కలెక్టర్లు ప్రత్యేకంగా దృష్టి పెట్టాలన్నారు. బ్యాంకర్లతో సమావేశమై మిగిలిన రైతులకు భరోసా అందేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఈ డబ్బును బ్యాంకర్లు పాత అప్పుల కింద జమ చేసుకోవడానికి వీలు లేకుండా స్పష్టమైన ఆదేశాలు జారీ చేస్తున్నామన్నారు. అన్ ఇంకంబర్డ్ అకౌంట్ కింద మాత్రమే భరోసా మొత్తాన్ని రైతులకు చెందేలా జమ చేయాలని మరోసారి స్పష్టం చేశారు. ‘ఉపాధి’తో వర్క్‌షాపుల అనుసంధానం గ్రామ సచివాలయాలకు అనుబంధంగా ఏర్పాటు చేస్తున్న వర్క్‌షాపులపై కలెక్టర్లు సీరియస్‌గా దృష్టి సారించాలని సీఎం సూచించారు. గ్రామ సచివాలయాల్లో వర్క్‌షాపులను కచ్చితంగా తెరవాలని.. విత్తనాలు, ఎరువుల నాణ్యతను పరీక్షించిన తర్వాత మాత్రమే వాటిని రైతులకు విక్రయించాలని చెప్పారు. ఈ వర్క్‌షాపుల ఏర్పాటుకు ఉపాధి హామీ పథకాన్ని అనుసంధానం చేయాలని, జనవరి 1 నాటికి వీటిని పూర్తి చేయాలని ఆదేశించారు. ధాన్యం సేకరణలో రైతులకు చెల్లింపుల విషయంలో ఎలాంటి ఆటంకాలు లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఉగాది నాటికి ఎట్టి పరిస్థితుల్లోనూ అర్హులైన పేదలందరికీ ఇళ్ల పట్టాల పంపిణీ పూర్తి చేయాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. మార్చి 1 నాటికి కటాఫ్ తేదీగా లబ్ధిదారుల జాబితా సిద్ధం చేయాలని కలెక్టర్లను ఆదేశించారు. ఇప్పటి వరకు 22.7 లక్షల మంది లబ్ధిదారులను గుర్తించామని అధికారులు వివరించారు. 15 నాటికి ఔట్ సోర్సింగ్ ఉద్యోగాల జాబితా ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు జనవరి 1 నుంచి ఔట్ సోర్సింగ్ కార్పొరేషన్ ద్వారానే వేతనాలు చెల్లించాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. డిసెంబర్ 15 నాటికి ఔట్ సోర్సింగ్ ఉద్యోగాల జాబితా సిద్ధం చేయాలని కలెక్టర్లను ఆదేశించారు. అవినీతిని తగ్గించడం, ఉద్యోగులకు పూర్తిగా జీతాలు వచ్చేట్టు చేయడమే ఈ కార్పొరేషన్ లక్ష్యమని చెప్పారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు 50 శాతం రిజర్వేషన్లు, మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించడమే ప్రభుత్వ ప్రధాన ఉద్దేశం అని స్పష్టీకరించారు. ఇది సక్రమంగా అమలవుతోందా లేదా అనేది జిల్లా ఇన్చార్జి మంత్రులు పర్యవేక్షిస్తారన్నారు. కలెక్టర్లు జిల్లా స్థాయిలో, సెక్రెటరీలు సచివాలయ స్థాయిలో పర్యవేక్షిస్తారని సీఎం పేర్కొన్నారు. 21న వైఎస్సార్ నేతన్న నేస్తం మగ్గం ఉన్న ప్రతి చేనేత కుటుంబానికి వైఎస్సార్ నేతన్న నేస్తం కింద రూ.24 వేల సాయం అందించనున్నట్లు సీఎం తెలిపారు. డిసెంబర్ 21న ఈ పథకాన్ని ప్రారంభిస్తామన్నారు. ఇప్పటి వరకు 73,594 మంది లబ్ధిదారులను గుర్తించారని, మగ్గమున్న ప్రతి ఇంటికీ ఈ పథకం వర్తించాలని చెప్పారు. అర్హత ఉండీ పథకం వర్తించని వారు ఉండకూడదన్నారు. వైఎస్సార్ మత్స్యకార భరోసా కింద ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకోని వారికి డిసెంబర్ 15 వరకు అవకాశం ఇవ్వాలని సీఎం సూచించారు. అర్హులైన ఏ ఒక్క లబ్ధిదారుడిని ఈ పథకానికి దూరం చేయరాదని స్పష్టం చేశారు. వైఎస్సార్ వాహన మిత్రకు నేటితో గడువు ముగిసిందని, అర్హులైన లబ్ధిదారులందరకీ చెల్లింపులు పూర్తి చేశామని తెలిపారు. అగ్రిగోల్డ్ బాధితులకు ఇప్పటి వరకు 92 శాతం చెక్కులు పంపిణీ జరిగిందన్నారు. వచ్చే సమావేశం నాటికి నూరు శాతం చెక్కులు పంపిణీ పూర్తయ్యేలా చర్యలు తీసుకొవాలని సీఎం సూచించారు. మద్యం అక్రమ రవాణాను అరికట్టాలి రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే మద్యం షాపులను తగ్గించడంతో పాటు బెల్టు షాపులను పూర్తిగా నిర్మూలించామని సీఎం అన్నారు. సరిహద్దు రాష్ట్రాల నుంచి మద్యం అక్రమ రవాణాను అరికట్టాలని, ఎస్పీలు దీనిపై ప్రత్యేక దృష్టి సారించాలని స్పష్టం చేశారు. మద్యం, ఇసుక.. రెండింటిలోనూ అక్రమాలకు అడ్డుకట్టు వేయాల్సిందేనని, ఈ విషయంలో రాజీపడేది లేదన్నారు. ప్రతి వారం ఇసుక ధరలు, లభ్యతపై జిల్లా స్థాయిలో పత్రికల ద్వారా సమాచారం ఇవ్వాలని సీఎం ఆదేశించారు. ఇసుక రవాణాకు ఉపయోగిస్తున్న ప్రతి వాహనానికి డిసెంబర్ 10 నాటికి జీపీఎస్ తప్పనిసరి చేయాలని చెప్పారు. ఇసుక అక్రమ రవాణా అరికట్టడానికి ఏర్పాటు చేసిన 439 చెక్ పోస్టుల్లో నైట్ విజన్ సీసీ కెమెరాలను కూడా అదే రోజుకు సిద్ధం చేయాలని సీఎం ఆదేశించారు. ప్రస్తుతం రోజుకు 2 లక్షల టన్నుల ఇసుక అందుబాటులోకి వస్తోందని, రోజుకు 80 వేల టన్నుల ఇసుక అవసరాలు ఉన్నాయని అధికారులు వివరించారు. ప్రస్తుతం 3 లక్షల 95 వేల మెట్రిక్ టన్నుల ఇసుకను ఆన్లైన్లో ఇవాల్టికి (మంగళవారం) అందుబాటులో ఉంచామని మైనింగ్ శాఖ అధికారులు తెలిపారు. అక్రమాలకు పాల్పడితే రూ.2 లక్షల జరిమానా, రెండేళ్ల జైలు శిక్ష విధించేలా చట్టంలో మార్పులు తీసుకొచ్చిన విషయాన్ని విస్తృతంగా తెలియజేయాలని సీఎం సూచించారు. ‘స్పందన’ కింద వస్తున్న వినతుల పరిష్కారంలో నాణ్యత కోసం ఏర్పాటు చేసిన శిక్షణ తరగతులపై వివరాలను ముఖ్యమంత్రి అడిగి తెలుసుకున్నారు. డిసెంబర్ 4న అనంతపురం, కర్నూలులో ఆఖరి విడతగా ఓరియెంటేషన్ తరగతులు ఉన్నాయని అధికారులు తెలిపారు. అవినీతిపరుల భరతం పట్టాలి - 14400 కాల్ సెంటర్‌కు ఫోన్ చేసిన 15 నుంచి 30 రోజుల్లోగా దర్యాప్తు పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలి. - ఒక్క ఫోన్ కాల్‌తో మీ వెంట మేమున్నామనేలా ప్రజలకు భరోసా కల్పించాలి. - ఎవరూ లంచాలు తీసుకోకూడదనేలా చర్యలుండాలి. - ప్రతి దశలోనూ అట్టడుగు స్థాయి వరకూ ఇది ప్రజల్లోకి వెళ్లాలి. - నా (సీఎం) స్థాయిలోనో, అధికారులగా మీ స్థాయిలోనో అవినీతికి నో చెబితే 50 శాతం వరకూ పోతుంది. మిగిలిన 50 శాతం అవినీతి పోయినప్పుడే వ్యవస్థ ప్రక్షాళన అవుతుంది. ఇందుకోసం ఐఐఎం, ఏసీబీ రెండూ కలిసి పని చేస్తాయి. - ఇన్ని సంక్షేమ పథకాలు ప్రవేశ పెడుతున్నప్పుడు వాటిని అవినీతికి తావులేకుండా ప్రజలకు అందించాల్సిన బాధ్యత మనపై ఉంది. మనం ఉన్నది ప్రజలకు సేవ చేయడానికే. సదరం సర్టిఫికెట్ల జారీపై మార్గదర్శకాలు - నిబంధనలను సరళతరం చేయాలి. - 52 సెంటర్ల ద్వారా ఇకపై వారానికి రెండు దఫాలుగా సర్టిఫికెట్లు జారీ చేయాలి. - డిసెంబర్ 3న వరల్డ్ డిజేబుల్డ్ డే నాటి నుంచి ఈ కార్యక్రమం ప్రారంభించాలి. - డిసెంబర్ 15 నుంచి కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో కూడా వారానికి ఒక రోజు సదరం క్యాంపు నిర్వహించాలి. - అర్హులైన వారందరికీ వీలైనంత వేగంగా సర్టిఫికెట్లు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలి. - కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారికి 3, 4 రోజుల్లో సర్టిఫికెట్ అందించడమే లక్ష్యంగా పని చేయాలి. -
విర్డ్‌లో ఆధునిక కీళ్ల చికిత్స
ఆధునిక కీళ్ల చికిత్సా విధానం లింబ్ ప్లిజర్‌వేషన్ సిస్టం ద్వారకాతిరుమల శివారు లక్ష్మీపురంలోని విర్డ్ ఆస్పత్రిలోఅందుబాటులోకి వచ్చింది. అమెరికాకే పరిమితమైన ఈ విధానంపై ఆదివారం వైద్యులకు లైవ్ శస్త్రచికిత్స ద్వారా అవగాహన కల్పించారు. పశ్చిమగోదావరి ,ద్వారకాతిరుమల: ఇటలీలో పుట్టిన లింబ్ ప్లిజర్‌వేషన్ సిస్టమ్, ప్రస్తుతం అమెరికా వైద్యుల చేతులో ఉందని, ఆ వైద్యాన్ని తాము విర్డ్ ఆసుపత్రిలో చేస్తున్నట్టు ప్రముఖ ఆర్థోపెడిక్ సర్జన్, తిరుమల తిరుపతి బర్డ్ ఆసుపత్రి ప్రధాన వైద్యులు జగదీష్ తెలిపారు. ద్వారకాతిరుమల శివారు లక్ష్మీపురంలోని విర్డ్ ఆసుపత్రిలో ఆదివారం లైవ్ శస్త్ర చికిత్సలను నిర్వహించారు. ఇందులో మన రాష్ట్రానికి చెందిన వైద్యులే కాకుండా, తెలంగాణ, తమిళనాడు, మహారాష్ట్ర, ఒడిశా రాష్ట్రాలకు చెందిన ప్రముఖ వైద్యులు, అసిస్టెంట్ సర్జన్లు 106 మంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ జగదీష్ ఆపరేషన్ చేసే విధానాన్ని ప్రొజెక్టర్ ద్వారా లైవ్‌లో వైద్యులకు వివరించారు. వైద్యులకు కలిగిన సందేహాలను ఆయన నివృత్తి చేశారు. విర్డ్ ఆసుపత్రిలో చేస్తున్న శస్త్రచికిత్సలకు వినియోగిస్తున్న అధునాతన, నాణ్యమైన పరికరాల గురించి ఆయన వైద్యులకు వివరించారు. అనంతరం డాక్టర్ జగదీష్, విర్డ్ ఆసుపత్రి ట్రస్ట్ చైర్మన్ ఎస్వీ సుధాకరరావు, వైస్ చైర్మన్, రాజు వేగేశ్న ఫౌండేషన్ అధినేత ఆనందరాజు, సభ్యులు చెలికాని రాజబాబు, గుప్తా, ఆడిటర్ సాయి, వెంపరాల నారాయణమూర్తి, సుధాకరరావులు గత శిబిరంలో శస్త్రచికిత్సలు చేయించుకున్న వారిలో అవసరమైన వారికి ఉచితంగా కాలిపర్స్‌లను అందజేశారు. డాక్టర్ జగదీష్ మాట్లాడుతూ లింబ్ ఎముక ఏర్పడేందుకు ప్లిజర్‌వేషన్ సిస్టమ్ చికిత్సను ఏడాదిన్నర పాటు చేయాల్సి ఉంటుందన్నారు. అమెరికాలో మాత్రమే చేస్తున్న ఈ చికిత్సను విర్డ్ ఆసుపత్రిలో విజయవంతంగా నిర్వహిస్తున్నట్టు చెప్పారు. ఎలాంటి శస్త్రచికిత్స అయినా సరే.. ఆర్థోపెడిక్ విభాగంలో ఎలాంటి శస్త్రచికిత్సనైనా విర్డ్ ఆసుపత్రిలో నిర్వహిస్తున్నట్టు జగదీష్ తెలిపారు. ఆసియా ఖండంలో అతిపెద్ద ఆర్థోపెడిక్ ఆసుపత్రి తిరుమల తిరుపతి బర్డ్ అయితే, అవే తరహా వసతులతో సేవలందిస్తున్న ఆసుపత్రి ఇక్కడి విర్డ్ అన్నారు. కీళ్ల మార్పిడి, వెన్నెముక, మోకాళ్ల శస్త్ర చికిత్సలతోపాటు, పొట్టిగా ఉన్న వారిని పొడవుగా చేసే చికిత్సలు కూడా చేస్తున్నట్టు చెప్పారు. చైర్మన్ సుధాకరరావు మాట్లాడుతూ ప్రారంభించిన అతి కొద్ది కాలంలోనే వంద పడకల ఆసుపత్రిగా విర్డ్ అభివృద్ధి చెందిందన్నారు. ఈ ఆసుపత్రిలో ఇప్పటి వరకు 15 వేల మంది పోలియో వికలాంగులకు ఉచితంగా శస్త్రచికిత్సలు చేసి, అందులో అవసరమైన వారికి కాలిపర్స్‌లను అందించామన్నారు. రోజు రోజుకు విర్డ్ సేవలు విస్తరిస్తున్నాయని చైర్మన్ అన్నారు. కార్యక్రమంలో పెనుమత్స నరసింహరాజు తదితరులు పాల్గొన్నారు. -
గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రిలో దారుణం!
సాక్షి, గుంటూరు/ గుంటూరు మెడికల్: గుంటూరు జిల్లా తాడేపల్లికి చెందిన ఎం.జోషిబాబుకు ఈ నెల 12న జరిగిన ఓ ప్రమాదంలో కుడిచేయి నుజ్జునుజ్జయింది. దీంతో కుటుంబసభ్యులు అతడిని గుంటూరు జీజీహెచ్‌కు తరలించారు. చేతి వేళ్లు పూర్తిగా దెబ్బతినడంతో బుధవారం సర్జికల్ ఆపరేషన్ థియేటర్ (ఎస్ఓటీ)లో శస్త్ర చికిత్స చేసేందుకు వైద్యులు సిద్ధమయ్యారు. అయితే ఆపరేషన్ మధ్యలో ఉండగా హ్యాండ్ డ్రిల్ మిషన్ పనిచేయలేదు. దీంతో వెంటనే అతడిని ఆర్థోపెడిక్ విభాగంలోని ఆపరేషన్ థియేటర్‌కు తరలించి శస్త్రచికిత్స చేయాల్సి వచ్చింది. సరిగ్గా గత బుధవారం కూడా ఇలాంటి సమస్యే తలెత్తింది. పల్నాడు ప్రాంతంలోని ఓ గ్రామానికి చెందిన వెంకమ్మకు రోడ్డు ప్రమాదంలో తలకు బలమైన గాయాలయ్యాయి. ఈ నెల 7న ఎస్ఓటీలో శస్త్రచికిత్స చేసేందుకు ఏర్పాట్లు చేశారు. ఆపరేషన్ మధ్యలో ఉన్న సమయంలో ఓటీ లైట్లు ఆరిపోయాయి. దీంతో వైద్యులు సెల్‌ఫోన్ లైట్ల మధ్య ఆపరేషన్ పూర్తి చేశారు. గుంటూరు ప్రభుత్వ సమగ్ర వైద్యశాలలోని ఎస్ఓటీలో తరచూ జరుగుతున్న ఇలాంటి ఘటనలు రోగులను, వారి కుటుంబ సభ్యులను కలవరపాటుకు గురిచేస్తున్నాయి. ఆస్పత్రి అధికారుల నిర్లక్ష్యం జీజీహెచ్‌లోని చిన్న పిల్లల శస్త్రచికిత్స వైద్య విభాగంలో వెంటిలేటర్‌పై ఉన్న ఓ పసికందును ఎలుకలు కొరికి చంపిన సంఘటన అప్పట్లో దేశవ్యాప్తంగా సంచలనం రేపిన విషయం తెలిసిందే. ఆ సమయంలో జీజీహెచ్‌ను ప్రక్షాళన చేస్తామంటూ ప్రభుత్వ పెద్దలు హడావుడి చేశారు. ఆ తర్వాత షరామామూలే. జీజీహెచ్‌లో జరిగే ఆపరేషన్ల వల్ల ఆరోగ్యశ్రీ ద్వారా రూ.కోట్ల ఆదాయం వస్తున్నా ఆపరేషన్ థియేటర్లలో వైద్య పరికరాలు, వసతుల కల్పనను మాత్రం ఆస్పత్రి అధికారులు పట్టించుకోవడం లేదు. ఒకవేళ నిధులు మంజూరు చేసినా కాంట్రాక్టర్లు నాణ్యత లేని వైద్య పరికరాలు సరఫరా చేస్తుండడంతో అవి ఆపరేషన్ల మధ్యలో మొరాయిస్తున్నాయి. థియేటర్లు లేక నిలిచిన ఆపరేషన్లు జీజీహెచ్‌లోని ఎస్ఓటీలలో ఇన్ఫెక్షన్లు ఎక్కువగా ఉన్నాయంటూ వైద్యులు ఆస్పత్రి అధికారులకు లిఖితపూర్వకంగా తెలియజేసి ఆపరేషన్లు నిలిపివేశారు. మూడు పర్యాయాలు ఆపరేషన్లు నిలిపివేయడంతో అధికారులు మరమ్మతుల కోసం రూ.20 లక్షలు మంజూరు చేశారు. మరమ్మతులు పూర్తయినా సరిపడా వైద్య పరికరాలు లేకపోవడంతో తాజాగా బుధవారం శస్త్రచికిత్స నిలిచిపోయింది. ఎస్ఓటీలో ముఖ్యమైన వైద్య పరికరాలు లేకపోవడంతో ఆపరేషన్లు చేయలేక అవస్థలు పడాల్సి వస్తోందంటూ వైద్య సిబ్బంది వాపోతున్నారు. న్యూరోసర్జరీ వైద్య విభాగంలో రోగుల సంఖ్య ఎక్కువగా ఉండడంతో వారికి తగ్గట్టుగా ఆపరేషన్ థియేటర్లు లేక పలుమార్లు ఆపరేషన్లు వాయిదా పడుతున్నాయి. ఆర్థోపెడిక్ వైద్య విభాగానికి ప్రత్యేకంగా మోకీళ్ల మార్పిడి ఆపరేషన్లు చేసేందుకు థియేటర్ కేటాయించకపోవడం వల్ల ఏడాది పాటు ఆపరేషన్లు నిలిచిపోయాయి. అత్యంత ఖరీదైన కిడ్నీ మార్పిడి ఆపరేషన్లకూ ప్రత్యేకంగా థియేటర్ కేటాయించకపోవడంతో ఆర్నెల్లుగా ఆపరేషన్లు నిలిపివేశారు. దీంతో రూ.లక్షలు ఖర్చు పెట్టి ఆపరేషన్ చేయించుకునే స్థోమత లేక ఎంతోమంది పేదలు జీజీహెచ్ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. జీజీహెచ్ ఎదుట ఎమ్మెల్యే ముస్తఫా ఆందోళన గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రి ఎదుట గురువారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ముస్తఫా ఆందోళనకు దిగారు. ఆస్పత్రి సూపరింటెండెంట్ నిర్లక్ష్యం వల్లే జీజీహెచ్‌లో అధ్వాన పరిస్థితులు నెలకొన్నాయని ఆయన మండిపడ్డారు. గతంలో ఆస్పత్రిలో ఎలుకలు చిన్నారిపై దాడి చేశాయని, పాములు కూడా వచ్చాయని ఆయన మండిపడ్డారు. సూపరింటెండెంట్ ఛాంబర్ వద్ద ముస్తఫా బైఠాయించిన నిరసన తెలిపారు. విచారణకు ఆదేశించిన ఉన్నతాధికారులు టార్చ్‌లైట్ వెలుగులో ఆపరేషన్లు చేస్తున్న ఘటనపై ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు. మరోవైపు వీడియో ఎలా బయటకు వచ్చింది, ఎవరు తీశారనే దానిపై అధికారులు ఆరా తీస్తున్నారు. కాగా గత మూడు నెలలుగా సెల్‌ఫోన్, టార్చ్లైట్ల వెలుగులోనే వైద్యులు ఆపరేషన్లు చేస్తున్నట్లు సమాచారం. -
వింత వ్యాధి.. కథ మళ్లీ మొదటికే!
ఢాకా : మాములు మనిషిగా మారేందుకు చెట్టు మనిషి ‘అబుల్ బజందర్’ చేసిన ప్రయత్నాలు విజయవంతం కాలేదు. వైద్యులు చేసిన సర్జరీలు ఫలించకపోగా.. ఇప్పుడు మళ్లీ అతని చేతిపై కుక్క గొడుగుల్లాంటి ఆకారాలు మొలవటం ప్రారంభమైంది. దీంతో అతను ఆందోళనకు గురవుతున్నాడు. 25 ఏళ్ల బజందర్ దాదాపు పన్నెండేళ్లుగా ఈ సమస్యతో బాధపడుతున్నాడు. 'ఎపిడర్మోడిస్ప్లాషియా వెర్రసిఫార్మిస్' అనే చర్మ వ్యాధి అతనికి సోకింది. అది కాస్త ముదరటంతో చెట్టు బెరడు లాంటి ఆకృతులతో ఉన్న అతడి రెండు చేతులు, కాళ్లు మీద పెరిగిపోగా.. ఆ బాధతో అతను నరకం అనుభవించాడు. 2016లో ఇతని గురించి మొదటిసారి వార్తలు వెలువడగా.. బంగ్లా ట్రీ మ్యాన్(చెట్టు మనిషిగా) అతని పేరు పాపులర్ అయిపోయింది. ఢాకాలోని మెడికల్ కాలేజీ ఆస్పత్రి అతనికి ఉచితంగా చికిత్స చేసేందుకు ముందుకొచ్చింది. శస్త్రచికిత్స ద్వారా వింత వ్యాధి నుంచి విముక్తి కలిగిస్తామని అతనికి వైద్యులు మనోధైర్యం కల్పించారు. చివరకు గతేడాది 24 సర్జరీలు చేసి వాటిని తొలగించటంతో.. ఇక మాములు మనిషిని అయిపోయానని అతను సంతోషించాడు. వైద్య శాస్త్రంలో ఇదో అరుదైన చికిత్స అని బంగ్లాదేశ్ వైద్యులు కూడా గర్వంగా ప్రకటించుకున్నారు. ఇక శస్త్ర చికిత్సల అనంతరం పరిశీలన కోసం ఏడాది నుంచి అతను ఆస్పత్రిలోనే ఉంచుతున్నారు. ఓ చిన్న గదిలో భార్య కూతురుతోపాటు అతను నివసిస్తున్నాడు. కొన్ని రోజులు గడిచాక సమస్య మళ్లీ మొదటికి వచ్చింది. అతను మెరుగవటానికి కాస్త సమయం పట్టొచ్చని.. మరిన్ని శస్త్ర చికిత్సలు అవసరమని వైద్యుడు సమంత లాల్ సేన్ చెబుతున్నారు. కానీ, బజందర్ మాత్రం వణికిపోతున్నాడు. ‘‘ఇంక నాకు ఎలాంటి శస్త్ర చికిత్సలు వద్దు. నా కాళ్లు చేతులు బాగుపడతాయనే నమ్మకం పోయింది. నేను చనిపోయినా ఫర్వాలేదు. నన్ను బయటికి పంపించేయండి. నా కుటుంబాన్ని పోషించుకోవాలి. నా కూతురిని చదివించుకోవాలని’’ అంటూ వైద్యులను అతను వేడుకుంటున్నాడు. అయినప్పటికీ 25వ సర్జరీకి వైద్యులు సిద్ధమైపోయారు. ప్రపంచంలో ఇతనికి ముందు ముగ్గురు ఇలాంటి సమస్యను ఎదుర్కున్నారు. అయితే వారి విషయంలో కూడా శస్త్రచికిత్సలు పలించలేదని తెలుస్తోంది. అబుల్ బజందర్ సర్జరీకి ముందు.. ప్రస్తుతం -
నీళ్లు లేవని ఆపరేషన్ చెయ్యట్లేదు..
భానుగుడి (కాకినాడ సిటీ): రక్తం కొరతతో శస్త్ర చికిత్సలు వాయిదా వేస్తారు ... సంబంధిత వైద్య నిపుణులు లేకపోయినా వాయిదా వేడయం చూశాం...కానీ కేవలం నీటి సరఫరా నిలిచిపోయిందంటూ ఆపరేషన్లు చేయకపోవడం విచిత్రమే. ఇది ఏ మారుమూలనో ఉన్న ఆసుపత్రిలో చోటుచేసుకుందంటే ‘సరేలే’ అని సరిపెట్టుకోవచ్చు. జిల్లా కలెక్టర్ కార్యాలయానికి కూతవేటు దూరంలో ఉన్న కాకినాడ ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలోనే ఈ దుస్థితి నెలకొంది. రెండు జిల్లాలకు అతి పెద్ద పేదల ఆసుపత్రిగా గుర్తింపుపొందిన ఇక్కడ నీళ్ల సరఫరా లేదంటూ ముందస్తుగా తేదీలు ఇచ్చిన రోగులకు కూడా తిరిగి పంపించేస్తున్నారు. రోజుల తరబడి ఆసుపత్రి చుట్టూ తిరిగితే గానీ ఆపరేషన్లు చేసేందుకు సంబంధిత వైద్యులు నిర్ధిష్ట తేదీని ఇవ్వరు. ఆ తేదీ నాటికి సిద్ధపడి ...కుటుంబ సభ్యులతో అన్నీ సర్దుకొని వస్తే ఇలా చేస్తారా అని రోగులు మండిపడుతున్నారు. ఒకటి, రెండు కాదు గురువారం ఒక్క రోజునే 14 శస్త్ర చికిత్సలు నిలిపివేశారు. కాకినాడ జీజీహెచ్‌లో ట్విన్ ఆఫరేషన్ థియేటర్స్ (టీఓటీ), ఆర్థోపెడిక్ ఆపరేషన్ థియేటర్లో నీటి సరఫరా లేకపోవడంతో ఈ దుస్థితి ఏర్పడింది. ఈ సంఘటనతో సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన రోగులు పలు అవస్థలకు గురయ్యారు. దీనిపై ఆసుపత్రి సూపరిండెంట్ ఎం.రాఘవేంద్రరావును వివరణ కోరగా ఆపరేషన్ థియేటర్లకు వెళ్లాల్సిన వాటర్ మోటార్లు పాడైపోయిన కారణంగా ఈ రోజుకు ఆపరేషన్లు నిలుపుదల చేశామన్నారు. త్వరితగతిన మోటార్లు మరమ్మతు చేయించే ఏర్పాట్లు చేయాలని మెకానిక్‌లకు ఆదేశించామని తెలిపారు. -
అపర బ్రహ్మలు.. ‘గాంధీ’ వైద్యులు
హైదరాబాద్: పాడైపోయిన రూపాన్ని సరిచేసి అపర బ్రహ్మలుగా నిలిచారు.. సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రి వైద్యులు. వివిధ ప్రమాదాల్లో తీవ్రంగా గాయపడి గుర్తు పట్టలేనంతగా మారిన ముఖాలకు అరుదైన శస్త్రచికిత్సలు నిర్వహించి కోల్పోయిన రూపాలను తిరిగి తెచ్చారు గాంధీ ఆస్పత్రి ప్లాస్టిక్ సర్జరీ వైద్యులు. గాంధీ ఆస్పత్రిలో శనివారం జరిగిన మీడియా సమావేశంలో సూపరింటెండెంట్ శ్రవణ్‌కుమార్‌తో కలసి పాస్టిక్ సర్జరీ విభాగాధిపతి సుబోధ్‌కుమార్, అనస్థీషి యా వైద్యులు అప్పారావు ఆరోగ్య శ్రీ ద్వారా విజయవంతంగా నిర్వహించిన 4 అరుదైన శస్త్రచికిత్సల వివరాలను వెల్లడించారు. తెగి ఊగిసలాడుతున్న చేతికి.. ఏపీలో పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మండ లం కల్సిపురికి చెందిన అభినవ్ (21) నగరంలో బీటెక్ చదువుతున్నాడు. పట్టాలు దాటుతుండగా రైలు ఢీ కొట్టడంతో ఎడమచేయి తెగి ఊగిసలాడుతోంది. దీంతో గతనెల 6న గాంధీలో చేరాడు. వైద్యులు మైక్రోవాస్కులర్ సర్జరీ విజయవంతంగా నిర్వహించి తొడవద్ద కండను తీసి చేతికి అతికించి, రక్తనాళాలకు కనెక్షన్ ఇచ్చారు. విద్యుదాఘాతానికి గురైన మరో ఇద్దరికి.. విద్యుదాఘాతానికి గురై గుర్తుపట్టలేనంతగా ముఖం కాలిపోయిన మరో ఇద్దరు బాధితులకు పలుమార్లు శస్త్రచికిత్సలు నిర్వహించి కొల్పోయిన రూపాన్ని తిరిగి తెచ్చారు. నల్లగొండజిల్లా కంచనపల్లికి చెందిన శ్రీను (45), సిద్దిపేట జిల్లా కొయిడ మండలం బసవపూర్ జ్యోతిరాం తండాకు చెందిన నెహ్రూ (50) విద్యుదాఘాతంతో ముఖరూపాన్ని కోల్పోయారు. వీరికి మల్టిపుల్ ప్లాప్ సర్జరీలు చేసి పేషియల్ రీకనస్ట్రక్షన్ శస్త్రచికిత్స ద్వారా కోల్పోయిన రూపాన్ని తిరిగి తెచ్చారు. ఈ సమావేశంలో ప్లాస్టిక్ సర్జరీ వైద్యులు వెంకటేశ్వర్లు, అప్పారావు, రమేశ్, మహేందర్, చంద్రకళ, అర్జున్, సృజనలతోపాటు పీజీ వైద్యవిద్యార్థులు, సిబ్బంది పాల్గొన్నారు. ఎముకను వంచి.. దవడగా మార్చి.. రంగారెడ్డి జిల్లా కొత్తగూడకు చెందిన జనార్దన్ (32) దవడ ఎముకకు క్యాన్సర్ సోకింది. ఎముక పూర్తిగా పాడైపోవడంతో గతనెలలో గాంధీ ఆస్పత్రి ప్లాస్టిక్ సర్జరీ విభాగంలో చేరాడు. వైద్యులు పాడైన దవడ ఎముకను తొలగించారు. ఎమలోబ్లాష్టోమా అనే అరుదైన శస్త్రచికిత్స విజయవంతంగా నిర్వహించి నిలువుగా ఉన్న కాలి ఎముకను తీసి దాన్ని యు ఆకారంలో వంచి దవడకు విజయవంతంగా అమర్చారు. ప్రైవేటు ఆస్పత్రుల్లో సుమారు రూ.15 లక్షలు ఖర్చయ్యే ఈ సర్జరీని దివంగత నేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ఉచితంగా నిర్వహించారు. -
ఏదో సరదాకోసం అలా చేశా!
హీరోయిన్ మీద అభిమానంతో 50 సర్జరీలు చేయించుకుని.. దయ్యంలా మారిన యువతి గురించి మీకు తెలిసేఉంటుంది. ఏంజెలీనా జోలీ వీరాభిమానిగా చెప్పుకుంటూ.. అలా మారిపోయేందుకు 50 ప్లాస్టిక్ సర్జరీలు చేయించుకుని.. గుర్తుపట్టలేనంత మారిపోయిన ఇరాన్ యువతి.. సహర్ తబర్ నిజానికి ఎటువంటి సర్జరీలు చేయించుకోలేదట. మోడ్రన్ మేకప్‌తో పాటు.. ఫొటోషాప్ టెక్నాలజీతో సహర్ తబర్ ఫొటోలను అలా మార్చుకుని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసినట్లు తెలిసింది. సహర్ ఒక పత్రికతో పాట్లాడుతూ.. నాకు నిజంగానే ఏంజెలినీ జోలీ అంటే ఇష్టం. నేను ఆమెలా ఉంటాను.. అనే నమ్మకం నాకుంది. నేను ఆమెలా మారితో ఎలా ఉంటుందోనన్న ఆకాంక్షతో ఈ ప్రయోగం చేసినట్లు చెప్పింది. మరో విషయం ఏమిటంటే.. ఆ ఫొటో కోసం 40 కేజీల బరువు తగ్గినట్లు పేర్కొంది. బరువు తగ్గడం కోసం చాలా కష్టపడ్డట్లు తెలిపింది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆ ఫొటోను చూసి చాలామంది షాక్గురయ్యారని సహర్ తబర్ చెప్పింది. ‘నేను అందవికారంగా లేనని.. ఇదిగో ఇలా ఉన్నానంటూ’ ప్రస్తుత ఫొటో ఒకటి తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో మరోసారి పోస్ట్ చేసింది. ఇదిలా ఉండగా.. ఈ ఫొటో పోస్ట్ చేయడానికి ముందు.. సోషల్ మీడియాలో చాలా తక్కువగా ఫాలోవర్లు.. ఉండేవారు. ఇప్పుడు దాదాపు.. ఫాలోవర్ల సంఖ్య దాదాపు 8 లక్షలకు చేరింది. -
కల చెదిరింది.. దెయ్యంలా మారింది
సాక్షి, న్యూఢిల్లీ : అభిమానం తారా స్థాయికి చేరి ఓ యువతి చేసిన పని ఆమె ముఖాన్ని పూర్తిగా మార్చేసింది. తన ఫేవరెట్ హీరోయిన్లా మారిపోవాలని ఏకంగా 50 సర్జరీలు చేయించుకుంది. అవన్నీ వికటించటంతో ఇప్పుడు ఆమె ముఖం దారుణంగా మారిపోయింది. ఇరాన్‌కు చెందిన 19 ఏళ్ల సహర్ తబర్ హాలీవుడ్ నటి ఏంజెలీనా జోలీ వీరాభిమాని. స్వతహాగా అందగత్తె అయిన తబర్.. జోలీలా లేనని తరచూ నిరుత్సాహం చెందేది. ఈ క్రమంలో శస్త్రచికిత్సలు చేయించుకునేందుకు సిద్ధమైపోయింది. ముఖానికి మొత్తం 50 సర్జీలు చేయించుకుంది. అంతేకాదు డైటింగ్ చేసి 40 కేజీలకు బరువు మించకుండా చూసుకుంది. ఇప్పుడు ఆమె ముఖంగా దారుణంగా మారిపోయింది. అయినప్పటికీ తన ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన సహర్ కు ఇప్పుడు ఫ్యాన్ ఫాలోయింగ్ బాగా పెరిగిపోయింది. క్షణక్షణానికి ఆమెను అనుసరించేవారు పెరిగిపోతూ ప్రస్తుతానికి దాదాపు 4 లక్షలకు చేరుకుంది. అయితే వారిలో చాలా మంది పాపం ఆమెను ఎగతాళి చేస్తూ కామెంట్లు పెట్టడం విశేషం. నీ ముఖంపై ఎవరైనా బాంబు వేశారా? జాంబీ, నువ్వు చాలా భయంకరంగా ఉన్నావ్, సర్జరీ కంటే ముందు చాలా అందంగా ఉన్నావ్, నువ్వసలు మనిషివేనా? ఇలాంటి కామెంట్లు కనిపిస్తున్నాయి. مدرسه نابه..!😁❤️ A post shared by سحرتبر..!👾✌🏻 (@sahartabar_official) on Jun 7, 2017 at 2:14am PDT -
మా క్లినిక్‌కు వచ్చేయండి..
♦ గర్భిణులపై ఘోష ఆస్పత్రి వైద్యుల ఒత్తిడి ♦ ప్రభుత్వ ఆస్పత్రిలో ఉంటే పట్టించుకోని వైనం ♦ మాట వినని వారికి సేవల్లోనూ వివక్ష ♦ క్లినిక్‌లలో శస్త్రచికిత్సలు.. పేదలపై బిల్లుల భారం ♦ వైద్యులపై డీఎంహెచ్‌వోకు ఫిర్యాదు ఇది ప్రభుత్వాస్పత్రి.. ఇక్కడ వైద్యసేవలు బాగోవు.. ఎవరూ పట్టించుకోరు.. మా మాట వినకుంటే మీకు ఘోసే మిగులుతుంది.. మీ కోసమే చెబుతున్నాం.. ప్రయివేటు క్లినిక్‌కు వచ్చేయండి.. గర్భిణులకు శస్త్రచికిత్స చేసి పురుడుపోస్తాం.. తల్లీపిల్లలను రక్షిస్తాం.. మంచి సేవలు అందిస్తాం.. ఇదీ విజయనగరం జిల్లాలోని ఘోష ఆస్పత్రిలో చేరిన గర్భిణులు, వారి బంధువులకు వైద్యులు ఇచ్చే సూచన, సలహా. ప్రభుత్వాస్పత్రికి వచ్చే పేదలకు ఉత్తమ సేవలందించాల్సిన వైద్యులు ఆర్థిక భారం వేస్తున్నారు. సొమ్ము సంపాదనే లక్ష్యంగా డాక్టర్ వృత్తికే మచ్చతెస్తున్నారు. ప్రభుత్వాస్పత్రిలో సేవలను నిర్వీర్యం చేస్తూ పేదల ప్రాణాలను పణంగా పెడుతున్న తీరు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. విజయనగరం ఫోర్ట్: ‘గజపతినగరం మండలానికి చెందిన ఓ గర్భిణి ప్రసవం ఇటీవల ఘోష ఆస్పత్రిలో చేరింది. ఆమెను రెండు, మూడు రోజుల వరకు వైద్యులు పట్టించుకోలేదు. అ తర్వా త ఓ వైద్యురాలు తన క్లినిక్‌కు వస్తే బాగా చూస్తానని చెప్పి అక్కడకు తీసుకెళ్లిపోయింది. క్లినిక్‌లో ప్రసవం జరిపించి రూ.27వేలు బిల్లు వసూలు చేశారు. ఆస్పత్రిలో అయితే తమకు ఉచితంగా ప్రసవం అయ్యేదని, క్లినిక్‌లో ప్రసవం జరిపించడం వల్ల రూ.27 వేలు ఖర్చుయిందని, అప్పుచేసి డబ్బులు కట్టామంటూ గర్భిణి బంధువులు డీఎంహెచ్ఓకు లిఖిత పూరకంగా ఫిర్యాదు చేశారు. అయితే, ఇది వెలుగులోకి వచ్చిన ఘటన మాత్రమే. తరచూ ఆస్పత్రిలో ఇదే పరిస్థితి ఎదురవుతున్నట్టు పలువురు గర్భిణులు, బంధువులు చెబుతున్నారు. ఆస్పత్రికి వచ్చే అధికశాతం మంది గర్భిణులను ఏదో ఒక వంక చూపి ప్రయివేటు క్లినిక్‌లకు రిఫర్ చేస్తున్నారని వాపోతున్నారు. గర్భిణులు చికిత్స పొందే వార్డుల్లోకి వైద్యులు ప్రతి రోజు వెళ్లినా పట్టించుకోరనే అపవాదు ఉంది. కొంతమంది వైద్యులు అయితే గర్భిణులతో నేరుగా మా క్లినిక్‌కు రావచ్చు కదా.. బాగా చూస్తానని చెబుతున్నారు. కొంతమంది ఇష్టం లేకపోయినా గత్యంతరం లేక వైద్యుల చెప్పిన విధంగా క్లినిక్‌లకు వెళ్తున్నారు. ఆస్పత్రిలో ఉన్నంతసేపు అంతగా పట్టించుకోని వైద్యులు క్లినిక్‌కు వచ్చిన వెంటనే ప్రసవం జరిపించేస్తున్నారు. ప్రభుత్వ ఆస్పత్రిల్లో అయితే ఉచితంగా ప్రసవం జరిపించాలి. అదే క్లినిక్‌ల్లో అయితే వేలకు వేలు ఫీజులు వస్తాయి. సాధారణ ప్రసవం అయితే రూ.8 వేల నుంచి రూ.10 వేలు, సిజేరియన్ అయితే రూ.25 వేలు నుంచి రూ.30 వేలు వరకు వసూలు చేస్తున్నారు. దీని వల్ల రెక్కాడితేగాని డొక్కాడాని బడుగుజీవులు వేలకు వేలు ఫీజులు చెల్లించలేక అప్పులు పాలువుతున్నారు. విచారణ జరిపిస్తాం.. గజపతినగరానికి చెందిన ఓ గర్భిణిని ఘోష ఆస్పత్రి నుంచి క్లినిక్‌కు తీసుకెళ్లి ప్రసవం అనంతరం రూ.27 వేలు వరకు బిల్లు వసూలు చేశారని గర్భిణి బంధువు ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ జరుపుతాం. ఆస్పత్రిలో సక్రమంగా వైద్యసేవలు అందేలా చూస్తాం. –డాక్టర్ సి.పద్మజ, డీఎంహెచ్‌వో -
ఆరోగ్య భాగ్య విధాత
స్వస్థ భారతం స్వాతంత్య్రం వచ్చిన 1947 నాటితో పోలిస్తే ఇప్పటికి ఆరోగ్య రంగంలో గణనీయమైన వృద్ధి చోటు చేసుకుంది. మనదేశ ఆరోగ్యరంగం పురోగతి చోటు చేసుకుందని చెప్పేందుకు చాలా తార్కాణాలే ఉన్నాయి. ఉదాహరణకు ఒకనాడు విదేశాల్లోనే సాధ్యమనుకున్న సంక్లిష్టమైన శస్త్రచికిత్సలు ఇప్పుడు ఇక్కడ కూడా జరుగుతున్నాయి. ఇరవై ఏళ్ల కిందట కూడా ధనవంతులు గుండె ఆపరేషన్ల కోసం విదేశాలకు వెళ్లేవారు. కానీ ఇప్పుడు ఒక మోస్తరు ఆసుపత్రుల్లో కూడా గుండెశస్త్రచికిత్సలు ప్రతిరోజూ పదుల సంఖ్యలో జరుగుతున్నాయి. ఇక గుండె, కాలేయం, కిడ్నీ, ఊపిరితిత్తుల వంటి కీలకమైన అవయవాల మార్పిడి శస్త్రచికిత్సల సంఖ్య ఎంతగానో పెరిగింది. దాంతో అప్పట్లో మనం విదేశాలకు వెళ్లడం మానేయడం అనే పరిణామం ఎలా ఉన్నా... విదేశీయులే ఇక్కడికి రావడం అనే ఒక ట్రెండ్ మొదలైంది. దాంతో హెల్త్ టూరిజం ఎంతగానో అభివృద్ధి చెందింది. ప్రజల ఆయుఃప్రమాణం దాదాపు రెట్టింపు కంటే ఎక్కువే అయ్యింది. మందులను దిగుమతి చేసుకునే స్థాయి నుంచి మనమే అనేక దేశాలకు మందులను, వ్యాక్సిన్లను ఎగుమతి చేసే స్థితిలో ఉన్నాం. మశూచీ లాంటి మహమ్మారులను పూర్తిగా నిర్మూలించాం. ఇక వైద్య పరీక్షలను చేసే ఉపకరణాల తయారీ విషయానికి వస్తే... దాదాపు 90 శాతం చిన్న చిన్న వైద్యపరీక్షా సాధనాలను మనమే తయారు చేసుకుంటున్నాం. వైద్య విద్య కూడా గణనీయంగానే అభివృద్ధి చెందింది. స్వాతంత్రం వచ్చే నాటితో పోలిస్తే వైద్య కళాశాలల సంఖ్య ఈ 70 ఏళ్లలో ఇరవై రెట్లు పెరిగింది. అలాగే ఒకనాడు చిన్న చిన్న వైద్య అవసరాల కోసం విదేశాలకు వెళ్లే పరిస్థితి నుంచి విదేశీయులే వారికి ఇక్కడ చవగ్గా లభ్యమవుతున్న వైద్య సదుపాయాల కోసం ఇక్కడికే పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. అయితే ఈ పురోభివృద్ధి సామాన్యుడికి ఏమేరకు అందిందనే అంశం మాత్రం ఇంకా ప్రశ్నార్థకమే. శీర్షికలవారీగా ఆయా అంశాలను పరిశీలిస్తే... ఆయుః ప్రమాణాలు పెరిగినప్పటికీ... ఆరోగ్యరంగంలో వచ్చిన మార్పులతో మన దేశవాసుల ఆయుఃప్రమాణం బాగానే పెరిగింది. స్వాతంత్య్రం వచ్చిన తొలిరోజుల్లో భారతీయుల ఆయుఃప్రమాణం 32 ఏళ్లు మాత్రమే. కానీ తాజాగా ఇప్పుడు 2016 నాటి లెక్కల ప్రకారం మన దేశవాసుల ఆయుఃప్రమాణం 68.3 ఏళ్లు. దీన్ని బట్టి మన ప్రజలకు మంచి ఆరోగ్యం అందుతోందనే భావన వస్తుంది. కానీ వాస్తవ పరిస్థితి మాత్రం వేరు. బొగ్గు, పెట్రోలియం, విద్యుత్ వంటి శక్తి వనరుల వినియోగాలతో క్రమంగా అన్ని రకాల కాలుష్యాలు పెరుగుతున్నాయి. ప్లాస్టిక్ వినియోగం విపరీతమైంది. శారీరక శ్రమ చేయడం నామోషీ అయ్యింది. మొక్కలు నాటకపోవడం, చెట్లు నరకడంతో అనర్థాలు పెరుగుతున్నాయి. వీటి కారణంగా ఊబకాయం, అధిక రక్తపోటు, రక్తనాళాల్లో అధిక కొలెస్ట్రాల్, డయాబెటిస్, గుండెజబ్బులు, పక్షవాతం, దీర్ఘకాలిక కిడ్నీ జబ్బుల వంటి నాన్‌కమ్యూనికబుల్ డిసీజ్‌లు బాగా పెరిగిపోయాయి. నేటి సమాజంలో పైన పేర్కొన్న జబ్బుల్లో ఏదో ఒకదానితో బాధపడేవారు ప్రతి ఇంట్లోనూ ఉన్నారంటే అది అతిశయోక్తి కాదు. దీన్ని బట్టి జబ్బులు తగ్గాయా లేక పెరిగాయా అనేది ఆలోచించాల్సిన అంశం. మందుల లభ్యత మంచికా... చెడ్డకా? కొన్ని కొత్త మందులు కనిపెట్టాక అవి రోగనిరోధక శక్తికి బాసటగా నిలవడంతో కొన్ని జబ్బులు పూర్తిగా అదుపులోకి వచ్చాయి. ఉదాహరణకు... మశూచీ వ్యాక్సిన్ కనిపెట్టాక ఆ రోగం పూర్తిగా మటుమాయం అయ్యింది. అలాగే అనేక రకాల వ్యాక్సిన్లు, మందుల కారణంగా ఇప్పుడు పోలియో పూర్తిగా అదుపులో ఉంది. ధనుర్వాత మరణాలు, క్షయ రోగుల సంఖ్య దాదాపుగా అదుపులోకి వచ్చింది. ప్లేగు లాంటి జబ్బులు కనబడటం లేదు. కలరా, టైఫాయిడ్ వంటి జబ్బులకు సమర్థమైన మందులు అందుబాటులో ఉన్నాయి. 70 ఏళ్ల కిందట మన దేశం అనేక ఔషధాలను దిగుమతి చేసుకునే స్థితిలోనే ఉంది. ఇప్పుడు చాలా మందులను ఎగుమతి చేసేంతగా దేశం అభివృద్ధి చెందింది. అయితే 2000 సంవత్సరంలో డబ్ల్యూటీఓ (వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్)లో చేరి మన ప్రాసెస్ పేటెంటు చట్టాన్ని ప్రాడక్ట్ పేటెంట్గా మార్చుకున్నందున చాలా నష్టపోయాం. అయినప్పటికీ మనదేశం ఇంకా మందులను ఎగుమతి చేసే పరిస్థితుల్లోనే ఉండటం విశేషం. అయితే మందుల లభ్యత ఇంత విశేషంగా ఉన్నా ఇక్కడ మన దేశ విధాన రూపకర్తలు ఆలోచించాల్సిన కీలకమైన అనేక జటిల అంశాలు ఎన్నో ఉన్నాయి. ఉదాహరణకు ప్రజలకు అవసరమైన మందులను గురించి వివరిస్తూ... 116 ఔషధాలు ఉంటే ప్రజారోగ్యానికి అవి చాలని 1975లో హాథీ కమిటీ పేర్కొంది. అయితే ఆ సంఖ్య 150గా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ చెప్పింది. అన్ని జబ్బుల వైద్య చికిత్స కోసం మొత్తం 256 మందులు అవసరమని డబ్ల్యూహెచ్ఓ చెబుతోంది. కానీ ప్రస్తుతం మన దేశ మార్కెట్లో 85,000 ఫార్ములేషన్లు అందుబాటులో ఉన్నాయి. వాటిలో చాలావరకు అవసరమైన, అర్థరహితమైన కాంబినేషన్లు, ప్రమాదకరమైన మందులే ఉన్నాయి. ఈ దృష్టి కోణంలో ఆలోచించినప్పుడు మందుల లభ్యత అన్నది అభివృద్ధేనా లేక ప్రతికూల అంశమా అన్నది కీలక చర్చనీయాంశం. వైద్యపరీక్ష ఉపకరణాల విషయంలో... ఇక వైద్య ఉపకరణాల విషయానికి వస్తే... దాదాపు 90 శాతం చిన్న చిన్న వైద్యపరీక్ష సాధనాలను మనమే తయారు చేసుకునే స్థాయికి వచ్చాం. కానీ సీటీ స్కాన్, ఎమ్మారై, పెట్ స్కాన్ వంటి అనేక పైస్థాయి వైద్య పరీక్ష సాధనాలను మాత్రం ఇంకా విదేశాలనుంచి దిగుమతి చేసుకుంటూనే ఉన్నాం. నగర ప్రజల అవసరాలను మినహాయిస్తే... పట్టణాలు, మారుమూల గ్రామాలకు వాటి లభ్యత ఇంకా చేరువ కాలేదు. ఆ మాటకొస్తే కొన్ని జిల్లా కేంద్రాల్లోనూ అత్యున్నత స్థాయి వైద్య నిర్ధారణ పరీక్ష ఉపకరణాలు అందుబాటులో లేవు. వైద్య విద్య – మెడికల్ కాలేజీలు... ఈ 70 ఏళ్లలో మన దేశంలో ప్రైవేటు వైద్యకళాశాలల సంఖ్య పెరిగింది, స్వాతంత్య్రం వచ్చిన నాటికి మన దేశంలో మొత్తం 23 మెడికల్ కాలేజీలు ఉండేవి. కానీ ఇప్పుడు (2016) నాటికి వాటి సంఖ్య 439కి పెరిగింది. స్వాతంత్య్రం వచ్చిన నాటితో పోలిస్తే మెడికల్ కాలేజీల సంఖ్య దాదాపు 20 రెట్ల అభివృద్ధి కనిపిస్తున్నా ఇది సరిపోదు. ప్రస్తుతం ప్రతి 2000 మంది రోగులకు ఒక పడక మాత్రమే అందుబాటులో ఉంది. దాదాపు ప్రతి ఏడాది 50,000 మంది డాక్టర్లు అందుబాటులోకి వస్తున్నారు. అయినా ఈ సంఖ్య సరిపోదు. 2034 నాటికి 35 లక్షల పడకలు అవసరమవుతాయనేది ఒక ఉజ్జాయింపు లెక్క. ప్రజల ఆరోగ్యానికి బాధ్యత వహించేలా చేసే ‘సోషల్ అండ్ ప్రివెంటివ్ మెడిసిన్’ అనే అంశం మీద వైద్యవిద్యార్థులకు ప్రేమా, గౌరవం రెండూ ఉండటం లేదు. కుప్పలు తెప్పలుగా డబ్బులు సంపాదించి పెట్టే స్పెషలైజేషన్ మీదే ఇప్పుడు వైద్య విద్యార్థుల దృష్టి ఉంటోంది. ఇక 70 ఏళ్ల వైద్య భారతాన్ని గొప్పగా ఆవిష్కరించుకుంటూ... ఇంతగా అభివృద్ధి చెందిందని మనం గొప్పలు చెప్పుకుంటున్న వేళ ఆక్సిజన్ అందక యూపీలో సుమారు 70 మంది చిన్నారులు మృతిచెందడం ఒక మాయనిమచ్చ. హెల్త్ టూరిజం పెరుగుతూనే ఉన్నప్పటికీ... ప్రస్తుతం దేశంలోని ఆసుపత్రుల్లో కార్పొరేట్ రంగ ప్రభావం విస్తృతమవుతోంది. ఆరోగ్య పర్యాటకం అనే అంశంలో ఒకనాడు దాదాపు ఏమీ లేని పరిస్థితి నుంచి ఇప్పుడు మనదేశం రూ. 19, 226 కోట్లు (మూడు బిలియన్ల అమెరికన్ డాలర్లు) ఆర్జించే స్థితిలోకి వచ్చింది. 2020 నాటి అంచనా లెక్కల ప్రకారం ఇది రూ. 51,270 కోట్లు (8 బిలియన్ యూఎస్ డాలర్లు)కు చేరనుంది. అయితే కార్పొరేట్ రంగంలో హార్ట్, లంగ్ ట్రాన్స్‌ప్లాంటేషన్స్, మూత్రపిండాల మార్పిడి చికిత్సలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. మెదడులోని అత్యంత సున్నితమైన సర్జరీలు వీలుకాని చోట్లలోనూ రేడియేషన్ ఇవ్వగల స్టీరియోటాక్టిక్ రేడియేషన్ చికిత్సలను అందించగల అత్యాధునిక స్థాయి వైద్యకేంద్రాలు ఇక్కడ కొత్తవి ఎన్నో వస్తున్నాయి. దాంతో పాశ్చాత్యదేశాలకు వెళ్లి చికిత్స చేయించుకునే చాలా మంది విదేశీయులు సైతం భారత్‌కే తరలి వస్తున్నారు. కానీ మనదేశస్తులకే వాటిని అందిపుచ్చుకునేంత ఆర్థిక స్తోమత లేదు. అంటే విదేశీయుల కరెన్సీలతో పోల్చుకున్నప్పుడు వాళ్లకు చాలా చవకగా లభ్యమయ్యే చాలా ఆధునాతన వైద్య సదుపాయాలు స్వదేశీయులకు మాత్రం అందడం లేదు. అందరికీ ఆరోగ్యం కోసం జరగాల్సిందేమిటి? చిన్న చిన్న అంశాలపై ప్రభుత్వాలు దృష్టి కేంద్రీకరించడం ద్వారానే చాలా ఆరోగ్యరంగంలో పెద్ద పెద్ద మార్పులు వచ్చే అవకాశం ఉంది. దాంతో సమాజమూ ఆరోగ్యంగా మారే అవకాశమూ ఉంది. ఉదాహరణకు...అందరికీ పుష్టికరమైన పోషకాహారం లభ్యత ద్వారా ఆరోగ్యం బాగుటుంది. అయితే సమాజంలోని 30 శాతం మందికి ఆహార లభ్యత లేని కారణంగా రోగ నిరోధక శక్తి తగ్గి జబ్బులు వస్తున్నాయి. మరో 30 శాతం మందికి ఆహారం ఎక్కువైన కారణంగా డయాబెటిస్, రక్తపోటు, ఊబకాయం వంటి వ్యాధులు వస్తున్నాయి. అందుకే అందరికీ సమతులాహారం అందేలా విధానాల రూపకల్పన జరగాలి. చాలా గ్రామాల్లో ఇప్పటికీ రక్షిత మంచినీళ్లు దొరకడం లేదు. దాంతో చిన్న చిన్న గ్రామాల్లోనూ ‘సీసాలలో మంచినీళ్లు’ కొనుక్కోవాల్సిన పరిస్థితి. కాబట్టి ‘కొనుక్కోగలిగితేనే నీళ్లు’ అనే ప్రస్తుత పరిస్థితి నుంచి ‘ఆరోగ్యం కోసం అందరికీ నీళ్లు’ అనే విధంగా ప్రభుత్వాలు సురక్షితమైన మంచినీరు అందించాలి.మంచినీళ్లు లభ్యం కావడం లేదు కానీ... అలాంటి చోట్ల కూడా జబ్బులను ప్రేరేపించే మద్యం, సారాయి వంటివి మాత్రం విరివిగా దొరుకుతున్నాయి. ప్రభుత్వాలే మద్యాన్ని ఒక లాభదాయకమైన ఆదాయ వనరుగా చూస్తూ, మద్యం మీద భారీగా వ్యాపారం చేస్తున్నాయి. ఇది సరికాదు. అలాగే పొగతాగడం హానికరం అనే సూచనను మరింత బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లాల్సి ఉంది. పనిచేసే అలవాటును మరింతగా ప్రోత్సహించాలి. పనిచేయడం వల్ల ఆదాయం వస్తుంది. ఆదాయం బాగుంటే ఆరోగ్యానికి అవసరమైన అన్ని సౌకర్యాలూ, అంశాలను కొనుక్కోవచ్చు. కానీ మనం మన పిల్లలను స్కూలు దశ నుంచే క్రమంగా శారీరక శ్రమకు దూరం చేస్తున్నాం. దాంతో పని అలవాటుతో పాటు వ్యాయామాలు సైతం కొరవడి జబ్బులు వస్తున్నాయి.ఆహారం, నీళ్లు, పని, దురలవాట్లు దూరం చేయడం అనే ఈ ప్రాథమిక అంశాలతోనే చాలావరకు సమాజాన్ని ఆరోగ్యవంతం చేయడంతో పాటు... అనేక రుగ్మతలను మొదట్లోనే తుంచేయవచ్చు. అనేక జబ్బులను సమర్థంగా నివారించవచ్చు. – డాక్టర్ వి. బ్రహ్మారెడ్డి, ప్రముఖ వైద్య నిపుణులు -
శంకర్‌దాదాలు!
కాసులకోసం కడుపుకోత అవసరం లేకపోయినా 22మందికి సిజేరియన్ కాన్పులు ఆరు తండాలు, రెండు గ్రామాల్లో 112మందికి అనవసరపు ఆపరేషన్లు ఒక్కో ఆపరేషన్‌కు రూ.25వేల నుంచి రూ.35వేల వరకు వసూలు కోయిలకొండలో ఓ ఆర్ఎంపీ ఆగడాలు గ్రామాల్లో ప్రభుత్వవైద్యంపై కొరవడిన అవగాహన కోయిల్‌కొండ మండలం చన్మన్పల్లితండాకు చెందిన రాధిక ధర్మాపూర్ పాఠశాలలో ఐదవ తరగతి చదువుతోంది. పాపకు కడుపునొప్పిరావడంతో పాఠశాలనుంచి తండాకు వచ్చింది. రాధికను ఆమె తాత అభంగపట్నం గ్రామంలోని ఖలీం అనే ఆర్ఎంపీ నడుపుతున్న దవాఖానాకు తీసుకెళ్లాడు. అక్కడ చూపిస్తే ఆపరేషన్ చేయించాలని, మహబూబ్‌నగర్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి రెఫర్ చేశాడు. మరుసటి రోజు రాధికకు ఆపరేషన్ చేశారు. ఇంతకు రాధికకు కడుపునొప్పి ఎందుకు వచ్చిందో చెప్పింది లేదు. కేవలం డబ్బుల కోసం చిన్నారి కడుపును కోశారు. కోయిల్‌కొండ మండల పరిధిలోని ఆరు తండాలు, రెండు గ్రామాల్లో 112మందికి అనవసరపు ఆపరేషన్లు చేశారని తేలింది. అవి కూడా ప్రైవేటు ఆస్పత్రుల్లోనే. అంటే వీరు డబ్బుల కోసం ఎంతకైనా తెగిస్తారన్నది సుస్పష్టమవుతోంది. సాక్షి, మహబూబ్‌నగర్ పేదల ప్రజల అమాయకత్వం వారికి ఆసరా.. శస్త్రచికిత్సలు అవసరం లేకపోయినా కాసుల కోసం ఆపరేషన్లు చేసేస్తున్నారు. కమీషన్ వస్తుందంటే చాలు ఎంతకైనా సిద్ధపడుతున్నారు. చిన్నాపెద్దా అనే తేడా లేకుండా అనవసరపు ఆపరేషన్లు చేసి పేదల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. కోయిల్‌కొండ మండలంలో కన్నతల్లులకు కడుపుకోతలు మిగుల్చుతున్న సంఘటనలు ఎన్నో వెలుగులోకి వస్తున్నాయి. కలెక్టర్ రొనాల్డ్‌రోస్ తనిఖీలతో అనేక విషయాలు బహిర్గతమయ్యాయి. మండలంలోని అభంగపట్నం గ్రామంలో ప్రైవేట్ క్లినిక్ నడుపుతున్నా ఖలీం అనే వ్యక్తి చిన్నచిన్న జబ్బులకు వైద్యంచేస్తూ నిర్లక్షరాస్యులు, పేదలను నమ్మించాడు. కొన్నిరోజుల తరువాత కడుపునొప్పితోపాటు ఇతర వ్యాధులు వచ్చినవారు ఖలీం వద్దకు వైద్యం కోసం వస్తే ‘మీకు ఆపరేషన్ చేయాలని లేకుంటే రోగం నయం కాదని’ చెప్పి జిల్లా కేంద్రంలోని కొన్ని డయాగ్నస్టిక్ సెంటర్లకు పంపించి పరీక్షలు చేయిస్తున్నాడు. గ్రామంలో ఎవరిని తట్టినా తమకు గర్భసంచి ఆపరేషన్ జరిగిందని, అపెండిసైటిస్ ఆపరేషన్లు జరిగాయని చెబుతుండడం ఖలీం వైద్యానికి నిదర్శనంగా నిలుస్తున్నాయి. ఒక్కో ఆపరేషన్‌కు రూ.25వేల నుంచి రూ.35వేల వరకు దండుకుని తనకిచ్చే కమీషన్‌ను తీసుకుంటున్నాడని పలువురు బాధితులు ఆరోపిస్తున్నారు. జిల్లాలో అధికారికంగా 20ఆర్ఎంపీల క్లీనిక్‌లు ఉండగా, అనధికారికంగా 150కిపైగా ఉంటాయి. కలెక్టర్ పర్యటనతో వెలుగులోకి.. ఈనెల 10న జాతీయ నులిపురుగుల నిర్మూలన ది నోత్సవాన్ని పురస్కరించుకుని మాత్రలు వేయిం చేందుకు కలెక్టర్ రొనాల్డ్‌రోస్ కోయిలకొండ మండలంలోని చన్మయిపల్లి గ్రామాన్ని సందర్శించారు. ఈ క్రమంలో రోడ్డుపై వెళ్తున్న కలెక్టర్‌కు ఇద్దరు బాలికలు కనిపించారు. బడికి వెళ్లకుండా బయటకు ఎందుకు వెళ్తున్నారని ఆయన ప్రశ్నించారు. దీంతో ఆ బాలికలు తమకు ఆపరేషన్ అయిందని చెప్పడంతో ఎవరు చేశారని.. ఏం ఆపరేషన్ అని కలెక్టర్ వారిని అడిగారు. దీంతో ఆర్ఎంపీ ఖలీల్ నిర్వాహకం వెలుగులోకి వచ్చింది. వెంటనే కలెక్టర్ రొనాల్డ్‌రోస్ అతడిపై విచారణ చేయాలని డీఎంహెచ్ఓకు ఆదేశాలు జారీచేశారు. ఆర్ఎంపీ వైద్యంపై కొరవడిన నిఘా గ్రామాల్లో విచ్చలవిడిగా వెలసిన ఆర్ఎంపీ క్లీనిక్‌లపై జిల్లా వైద్యాధికారులు దృష్టిసారించలేకపోతున్నారు. క్లీనిక్‌లకు వచ్చిన నిరుపేదల ప్రాణాలతో చెలగాటమాడుతున్నా పట్టించుకున్న పాపానపోలేదు. ఆర్ఎంపీలు ప్రసవాలు, ఆపరేషన్లు, ఆబార్షన్లు చేస్తూ పేదల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. కోయిల్కొండమండలంలోని అభంగపట్నంలో క్లీనిక్ సెంటర్ నిర్వహిస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడి ఆపరేషన్లు చేయించిన ఆర్ఎంపీ ఖలీంపై కేసునమోదు చేసినట్లు కోయిల్‌కొండ ఎస్ఐ శ్రీకాంత్‌రెడ్డి తెలిపారు. పరారీలో అతడిని వెంటనే పట్టుకుని రిమాండ్‌కు తరలిస్తామన్నారు. విచ్చలవిడిగా ఆర్ఎంపీ కేంద్రాలు మహబూబ్‌నగర్ జిల్లా కోయిలకొండ, నారాయణపేట, కోస్గి, జడ్చర్ల, నవాబ్‌పేట, ధన్వాడ మండలాల్లో ఆర్ఎంపీల వైద్యం బాగా విస్తరించింది. ఇంజక్షన్లతో పాటు నెబ్యులైజర్, సెలైన్ బాటిళ్లు ఎక్కిస్తున్నారు. ప్రమాదంలో కాళ్లు, చేతులు విరిగినవారికి అత్యవసర సేవలు అందించేందుకు కూడా వెనుకాడడం లేదు. కొంతమంది ఫిజియోథెరపీలు ఎక్స్‌రే, ప్రిస్కిప్షన్లు రాస్తూ చికిత్స చేస్తున్నారు. ఇటీవల నారాయణపేటలోని ఓ ఆర్ఎంపీ వైద్యుడు చేసిన చికిత్సకారణంగా రోగి కాలు నడవలేని పరిస్థితి ఏర్పడింది. రోగి ప్రమాదకరస్థితిలో ఉండగానే సంబంధిత నకిలీ వైద్యులు ఆ ప్రమాదం నుంచి బయటపడటానికి ఆయా శాఖలో ఉండే ఉన్నతాధికారులకు భారీస్థాయిలో ముడుపులు ముట్టచెప్పుకున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. 112 ఆపరేషన్ల గుర్తింపు కలెక్టర్ ఆదేశాల మేరకు మండలంలోని ఆరు తండాలు, రెండు గ్రామాల్లో జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి విచారణ చేయగా 112మందికి వివిధ రకాల ఆపరేషన్లు జరిగినట్లు తేలింది. వీటిలో గర్భసంచి తొలగించినవి 41, అపెండిసైటిస్ 22, సిజేరియన్లు 49 ఉన్నాయి. దీంట్లో ఖలీల్ అనే ఆర్ఎంపీ 22ఆపరేషన్లు చేయించినట్లు విచారణలో తెలింది. ఇదిలా ఉండగా, పేదల వైద్యానికి కోట్లాది రూపాయలు ఖర్చు అవుతున్నాయని లెక్కలు చూపిస్తున్న ప్రభుత్వం గ్రామీణులకు ప్రభుత్వం వైద్యంపై నమ్మకం కలిగించలేకపోతుంది. ఏ చిన్నజబ్బు వచ్చినా ప్రైవేట్ ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నారే తప్ప ప్రభుత్వ ఆస్పత్రులకు వెళ్లడం లేదు. కలెక్టర్ పర్యటనలో వెలుగులోకి వచ్చిన ఆపరేషన్లను పరిశీలిస్తే అన్ని ప్రైవేట్ ఆస్పత్రుల్లో జరిగినవే కావడం గమనార్హం. -
వారి హృదయాలు.. పదిలం..!
విజయవాడ (లబ్బీపేట) : వారంతా ఇంగ్లాండ్ దేశానికి చెందిన వారు. ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో చికిత్స పొందుతున్న రోగులకు సేవలందించడంలో అత్యంత నిష్ణాతులు. ఇంగ్లాండులోని హీలింగ్ లిటిల్ హార్ట్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నగరంలోని ఆంధ్రా హాస్పటల్లో గుండె జబ్బులతో బాధపడుతున్న చిన్నారులకు ఐదు రోజుల పాటు గుండె శస్త్ర చికిత్సలు నిర్వహించారు. ఈ చికిత్సలు చేసేందుకు పిడియాట్రిక్ కార్డియాలజీ విభాగానికి చెందిన నిష్ణాతులైన వైద్యులతో పాటు, ఇంటెన్సివ్ కేర్ నర్సింగ్ సిబ్బంది విచ్చేశారు.ఆరు నెలల వయస్సు నుంచి పదేళ్ల వయస్సున్న 26 మంది చిన్నారులకు ఐదురోజుల పాటు గుండె శస్త్ర చికిత్సలు నిర్వహించారు. ఆత్మీయ సేవలు శస్త్ర చికిత్స అనంతరం కార్డియాక్ ఐసీయూలో వున్న చిన్నారులకు ఇంగ్లాండ్ ఇంటెన్సివ్ కేర్ బృందం విశేష సేవలందించారు. ఆప్యాయంగా చిన్నారులను పలుకరిస్తూ వారిలో ఉల్లాసాన్ని నింపేందుకు తమవంతు ప్రయత్నం చేశారు. వారికి రక్తం ఎక్కించడం, మందులు వేయడం వంటి అన్ని పనులను వారే చూసుకున్నారు. ఇంటెన్సివ్ కేర్‌లో సర్జరీ అయిన తర్వాత చిన్నారులకు అందించే సేవలపై ఇక్కడి నర్శింగ్ సిబ్బందికీ అవగాహన కల్పించారు. కాగా దేశం కానీ దేశం వచ్చి ఇక్కడ సేవలు అందించిన ఇంగ్లాండ్ బృందం సేవలపై చిన్నారుల తల్లిదండ్రులతో పాటు, ఇక్కడి వైద్యం బృందం ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇక్కడ సేవలు అందించడం అదృష్టంగా భావిస్తున్నామని వారు తెలిపారు. ప్రతి మూడు నెలలకు ఒకసారి వచ్చేందుకు వారు సంసిద్ధత వ్యక్తంచేశారు. యూకే నుంచి వచ్చిన బృంద సభ్యులు వీరే యూకే నుంచి వచ్చిన బృంద సభ్యులలో పిడియాట్రిక్ ఇంటర్నేషనల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ విక్రమ్ కుడుములు, పిడియాట్రిక్ కార్డియో థోరాసిక్ సర్జన్లు డాక్టర్ రమణ దన్నపనేని, డాక్టర్ ఆనంద్వా, డాక్టర్ అపర్ణహాస్కోట్, డాక్టర్ బలరామ్బాబు, డాక్టర్ ఫిల్ ఆర్నాల్డ్, డాక్టర్ సుబ్రహ్మణ్యం చెల్లప్పన్, సిబ్బంది లూయిగి సెరిల్లో, జాన్ గిల్రాయ్, షారోన్ గోమనీ గ్రాన్ఉడ్, రాచెల్ వెబ్స్టార్లు ఉన్నారు. వీరికి ఆంధ్రా హాస్పటల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ జె. శ్రీమన్నారాయణ, కార్డియో థోరాసిక్ సర్జన్ డాక్టర్ దిలీప్, కార్డియో అనస్థీషియా రమేష్ తమవంతు సహకారం అందించారు. -
వయసు 25.. సర్జరీలు 100
⇒ పాకిస్తానీ యువతికి 100వ సర్జరీ లాహోర్: జీవితంలో ఎప్పుడో తీవ్రమైన అనారోగ్య సమస్య వస్తేనే శస్త్రచికిత్స వరకు వెళ్తాం. సాధారణ వ్యక్తులతో పోలిస్తే సర్జరీ చేసుకున్నవారు కాస్త బలహీనంగానే ఉంటారు. అలాంటిది ఒకసారికాదు రెండుసార్లు కాదు.. ఏకంగా వందోసారి శస్త్రచికిత్స చేయించుకుంది ఓ పాకిస్తానీ యువతి. ‘అరుదైన చర్మవ్యాధితో బాధపడుతున్న ఫౌజియా యూసుఫ్‌కు 100వ శస్త్రచికిత్సను పూర్తిచేశాం. ఫిబ్రమటోసెస్గా పిలిచే ఈ సమస్య ఆమెకు చిన్నతనంలోనే ఎదురైంది. దీంతో పదే పదే సర్జరీ చేయడం మినహా మరో మార్గం లేకపోవడంతో ఇన్నిసార్లు సర్జరీ చేయాల్సి వచ్చింద’ని షేక్ జాఝెద్ హాస్పిటల్ వైద్యులు తెలిపారు. శస్త్రచికిత్స పూర్తయిన తర్వాత ఫౌజియా మీడియాతో మాట్లాడుతూ... ‘మరిన్నిసార్లు కూడా సర్జరీ చేయించుకునేందుకు నేను సిద్ధమే. అంతే కానీ వ్యాధి కారణంగా పెరుగుతున్న నా కుడి భుజాన్ని తొలగించుకునేందుకు నేను సిద్ధంగా లేను. నా ప్రాణాలు కాపాడేందుకు భుజాన్ని తొలగించుకోవడం మేలని వైద్యులు చెప్పారు. లేదంటే వ్యాధి మెడవరకు వ్యాపిస్తుందని హెచ్చరించారు. అయినా సరే.. చావడానికైనా సిద్ధమేకానీ భుజం లేకుండా బతకలేను. ఓ వికలాంగురాలిగా బతకడం నావల్ల కాదు' అని ఫౌజియా చెప్పింది. -
ఆ గుండెల్లో నువ్వు పదిలం
సాక్షి, హైదరాబాద్: ఆరోగ్యశ్రీ.. ఈ మాట వినగానే మొదట గుర్తొచ్చే పేరు వైఎస్సార్! ఖరీదైన కార్పొరేట్ వైద్యాన్ని నిరుపేదల ముంగిట నిలిపిన ఈ పథకం లక్షలాది మంది బతుకుల్లో వెలుగులు నింపింది. ఆరిపోతున్న జీవితాలకు ఆయువు పోసింది. గుండెకు పడిన చిల్లులను ఉచితంగా పూడ్చింది. 2007లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఈ పథకానికి శ్రీకారం చుట్టారు. ఆరోగ్యశ్రీ కింద ఇప్పటివరకు తెలంగాణలో 14.72 లక్షల మంది పేదలకు శస్త్రచికిత్సలు చేశారు. అందుకు వైఎస్ హయాం నుంచి ఇప్పటివరకు రూ.3,858 కోట్లు ఖర్చు చేశారు. పథకం ప్రారంభమైన 2007-08లో తెలంగాణలో 7,105 మందికి శస్త్రచికిత్సలు చేశారు. అందుకు నాటి ప్రభుత్వం రూ.31.12 కోట్లు ఖర్చు చేసింది. 2008-09 నుంచి పథకం పేదలకు మరింత దగ్గరైంది. ఆపరేషన్ల సంఖ్య పెరిగింది. 2008-09లో ఏకంగా 86,287 శస్త్రచికిత్సలు నిర్వహించారు. అందుకు వైఎస్ ప్రభుత్వం రూ.261.15 కోట్లు వెచ్చించింది. 2009-10లో ఆపరేషన్ల సంఖ్య 1.29 లక్షలకు చేరింది. తెలంగాణ ఏర్పడ్డాక 2014-15లో 2.36 లక్షల మందికి, 2015-16లో 2.60 లక్షల మందికి ఆపరేషన్లు నిర్వహించారు. ఈ పథకం కింద గుండె, ఊపిరితిత్తులు, కాలేయం వంటి అవయవ మార్పిడులను కూడా చేర్చాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. క్యాన్సర్‌లో కీలమైన నాలుగు శస్త్రచికిత్సలకు కూడా అవకాశం కల్పించింది. -
నీళ్లు లేక ఉస్మానియాలో ఆగిన ఆపరేషన్లు
సాక్షి, హైదరాబాద్: ఉస్మానియా జనరల్ ఆస్పత్రిలో నీరు లేకపోవడంతో శనివారం పలు శస్త్రచికిత్సలు నిలిచిపోయాయి. శస్త్రచికిత్స సమయంలో చేతులు శుభ్రం చేసుకునేందుకు నీరు లేక ఏకంగా నాలుగు ఆపరేషన్ థియేటర్లకు తాళాలు బిగించారు. ఫలితంగా 50కి పైగా శస్త్రచికిత్సలు వాయిదా పడ్డాయి. దీంతో తెల్లవారుజామునే ఆపరేషన్ థియేటర్ల వద్దకు చేరుకున్న రోగులకు తీవ్ర నిరాశే మిగిలింది. అంతేకాదు మూత్రశాలలు, మరుగుదొడ్లకు గత మూడు రోజుల నుంచి నీరు సరఫరా కావడం లేదు. దీంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులు, ఇతర రోగులు, వారికి సహాయంగా వచ్చిన బంధువులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దుర్వాసన భరించలేక వైద్యులు కూడా అటువైపు వెళ్లడానికి భయపడుతున్నారు. రోజుకు 50 లక్షల లీటర్లు అవసరం: ఆస్పత్రి ఔట్‌పేషంట్ విభాగానికి ప్రతిరోజూ 2,000-2,500 మంది రోగులు వస్తుంటారు. ఇన్‌పేషంట్ విభాగాల్లో నిత్యం 1,500 మంది చికిత్స పొందుతుంటారు. వైద్యులు మరో 200 ఉంటారు. ప్రతి రోజు 150-200 శస్త్రచికి త్సలు జరుగుతుంటాయి. రోజుకు 50 లక్షల లీటర్ల నీరు అవసరం కాగా 29.47 లక్షల లీటర్లు సరఫరా అవుతోంది. వీటిని 14 ట్యాంకుల్లో నిల్వ చేస్తున్నారు. ట్యాంకులకు మూతల్లేక పావురాల మలవిసర్జన నీటిపై తేలియాడుతోంది. ట్యాంకుల్ని 15 రోజులకోసారి శుభ్రం చేయాల్సి ఉన్నా నెలకోసారీ చేయడం లేదు. పది మంది ఆర్ఎంవోలున్నా..: పంపింగ్ కేంద్రాల్లో పనిచేస్తున్న సిబ్బంది ఎప్పటికప్పుడు ట్యాంకులను క్లీన్ చేయడంతో పాటు నీటి సరఫరా, నిల్వలను పరిశీలించాలి. కానీ వీరెవరూ కూర్చున్న కుర్చీలో నుంచి కదలడం లేదు. పది మంది ఆర్ఎంవోలు పని చేస్తున్నా.. వీరు ఈ విషయాన్ని పట్టించుకోవడం లేదు. పారిశుద్ధ్య నిర్వహణ సరిగా లేకున్నా కాంట్రాక్టర్ల నుంచి కమీషన్లు పుచ్చుకుని వంద శాతం మార్కులు వేస్తుండటం కొసమెరుపు. -
‘సరోజినీ’ ఘటనపై హెచ్చార్సీ సీరియస్
కేసును సుమోటోగా స్వీకరించిన హక్కుల కమిషన్ సాక్షి, హైదరాబాద్ : సరోజినీదేవి కంటి ఆస్పత్రిలో శస్త్రచికిత్సలు వికటించిన ఘటనపై రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ (హెచ్చార్సీ), లోకాయుక్త సీరియస్‌గా స్పందించాయి. ఈ కేసును సుమోటోగా స్వీకరించిన హెచ్చార్సీ... పూర్తి వ్యవహారంపై ఈనెల 21లోగా నివేదిక ఇవ్వాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి, సరోజినీ ఆస్పత్రి సూపరింటెండెంట్లను ఆదేశించింది. ఇక లోకాయుక్త డిప్యూటీ డెరైక్టర్ తాజుద్దీన్, ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ నర్సయ్యలతో కూడిన బృందం శుక్రవారం సాయంత్రం సరోజినీ ఆస్పత్రిలో విచారణ జరిపి, బాధితుల నుంచి వివరాలు సేకరించింది. ఈ బృందం శనివారం ఉదయం మరోసారి ఆస్పత్రిలో పర్యటించనుంది. బాధితులకు చికిత్సలు.. కంటిచూపు మందగించడంతో దానిని మెరుగుపర్చుకోవడం కోసం సరోజినీ ఆస్పత్రిలో గత నెల 30న 21 మంది క్యాటరాక్ట్ శస్త్రచికిత్సలు చేయించుకున్నారు. వారిలో 13 మంది ఇన్ఫెక్షన్ బారినపడగా.. ఏడుగురికి కంటిచూపు పోయిన విషయం తెలిసిందే. అయితే వీరిలో ఇద్దరికి చూపు వచ్చే అవకాశముందని వైద్యులు చెబుతున్నారు. శుక్రవారం ఓ ప్రైవేటు ఆస్పత్రి నుంచి కార్నియాను సేకరించి బాధితుల్లో ఒకరైన నూకాలమ్మతల్లికి శస్త్రచికిత్స ద్వారా అమర్చారు. ఆమెతో పాటు మరో ఇద్దరు బాధితులు కూడా చికిత్సకు స్పందిస్తున్నట్లు ఆస్పత్రి డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ రాజేందర్గుప్తా తెలిపారు. ఇక సరోజినీ ఆస్పత్రిలోని ఆపరేషన్ థియేటర్లను మూసివేయడంతో శస్త్రచికిత్సల కోసం ఎదురుచూస్తున్న పలువురు రోగులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆపరేషన్ థియేటర్లను తిరిగి తెరిచేదాకా ఉస్మానియా, గాంధీ ఆస్పత్రుల్లో చికిత్సలు చేసేలా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు. సరోజినీదేవి కంటి ఆస్పత్రికి వచ్చిన రోగులను కూడా ఉస్మానియా, గాంధీలకు తరలించి, శస్త్రచికిత్సలు చేయనున్నారు. ఆమ్ఆద్మీ పార్టీ ఫిర్యాదు..: ఆస్పత్రులకు నాసిరకం మందులు సరఫరా కావడానికి, ఏడుగురు బాధితులు కంటి చూపు కోల్పోవడానికి వైద్య ఆరోగ్యశాఖ మంత్రి, ముఖ్య కార్యదర్శి, టీఎస్ఎంఐడీసీ ఎండీల నిర్లక్ష్యమే కారణమని పేర్కొంటూ ఆమ్ఆద్మీ పార్టీ రాష్ట్ర కో-కన్వీనర్ పీఎల్ విశ్వేశ్వరరావు హైదరాబాద్‌లోని హుమాయూన్‌నగర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు సెక్షన్ 338 కింద కేసు నమోదు చేశారు. రూ.15 లక్షల పరిహారం ఇవ్వాలి ‘‘రాష్ట్ర ప్రభుత్వం రోగుల జీవితాలతో ఆడుకుంటోంది. ప్రభుత్వ ఆస్పత్రులకు నాసిరకం మందులు సరఫరా అవుతున్నా పట్టించుకోవడం లేదు. నాసిరకం మందులు సరఫరా చేసిన కంపెనీలను బ్లాక్‌లిస్ట్‌లో పెట్టాలి. ఎంతో పేరుపొందిన సరోజిని ఆస్పత్రిలో ఇలాంటి ఘటన చోటు చేసుకోవడం దురదృష్టకరం. సర్జరీలకు ముందే ఆపరేషన్ థియేటర్లను శుభ్రం చేసుకోవాలన్న కనీస సూత్రాన్ని వైద్యులు పాటించలేదు. బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందించాలి. రూ.15 లక్షల చొప్పున నష్టపరిహారం చెల్లించాలి’’. - చెరుకు సుధాకర్,తెలంగాణ ఉద్యవు వేదిక చైర్మన్ వైద్యులపై కేసులు నమోదు చేయొద్దు: టీజీడీఏ నాసిరకం మందులు తయారు చేసిన కంపెనీలను, కొనుగోలు చేసి సరఫరా చేసిన టీఎస్ఎంఐడీసీ అధికారులను వదిలేసి రోగులకు చికిత్స చేసే వైద్యులపై చర్యలు తీసుకోవాలని చూడటం దుర్మార్గమని తెలంగాణ వైద్యుల సంఘం సెక్రెటరీ జనరల్ బొంగు రమేశ్, కోశాధికారి లాలూప్రసాద్ రాథోడ్ పేర్కొన్నారు. వైద్యులపై కేసులు నమోదు చేయాలని చూస్తే ఆందోళనకు కార్యాచరణ ప్రకటిస్తామని హెచ్చరించారు. -
నిమ్స్‌లో కోల్డ్‌వార్
► ఇమడలేక వీడిపోతున్న వైద్యులు ► దీర్ఘకాలిక సెలవులో సర్జికల్ ఆంకాలజిస్ట్ ► సీనియర్లు లేక మూతపడుతున్న థియేటర్లు సాక్షి, సిటీబ్యూరో: ప్రతిష్టాత్మక నిజామ్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ (నిమ్స్)లోని కొంతమంది వైద్యుల మధ్య నెల కొన్న అంతర్గత పోరు తారాస్థాయికి చేరింది. అందరికీ ఆదర్శంగా ఉండాల్సిన వైద్యులు వర్గాలుగా విడిపోయి ఒకరిపై మరొకరు కత్తులు దూసుకుంటున్నారు. విభాగాధిపతులు, ఉన్నతాధికారుల తీరుతో తీవ్ర మనస్తాపానికి గురై ప్రతిభావంతులైన పలువురు సీనియర్ వైద్యులు ఉద్యోగానికి రాజీనామా చేసి వెళ్లిపోతున్నారు. ఫలితంగా ఆస్పత్రిలో 70కి పైగా వైద్యుల పోస్టులు ఖాళీ అయ్యాయి. అంతర్గత పోరు, వనరుల లేమికి తోడు సరైన అవకాశాలు రాకపోవడంతో ఏటా పది శాతం మంది వైద్యులు ఇదే కారణంతో ఆస్పత్రిని వీడుతున్నట్టు అధికారులే అంగీకరిస్తున్నారు. మనస్తాపంతో దీర్ఘకాలిక సెలవు సర్జికల్, మెడికల్ ఆంకాలజీ విభాగాల్లో పరిస్థితి మరింత ఘోరంగా ఉంది. ఇక్కడ పనిచేస్తున్న డాక్టర్ వెంకటరత్నం, డాక్టర్ జగన్నాథం గత ఏడాదే పదవీ విరమణ చేశారు. ఇప్పటి వరకు ఆ పోస్టులు భర్తీ చేయక పోవడంతో వైద్యుల కొరత తీవ్రంగా ఉంది. ఉన్న వైద్యులకు కూడా కనీస సౌకర్యాలు కల్పించలేదు. సూపర్ స్పెషాలిటీ బ్లాక్ నాలుగో అంతస్తులో 50 పడకలను సర్జికల్ ఆంకాలజీ రోగులకు కేటాయించారు. ఇక్కడ నిత్యం 50-60 మంది రోగులు చికిత్స పొందుతుంటారు. వీరికి కేటాయించిన రెండు ఆపరేషన్ థియేటర్లలో రోజుకు సగటున 8-10 శస్త్రచికిత్సలు చేసే అవకాశం ఉంది. సర్జికల్ ఆం కాలజీ విభాగానికి మూడు ఐసీయూ బెడ్స్‌ను కేటాయించారు. వీటిని కూడా జనరల్ సర్జరీ విభాగానికి చెందిన వైద్యుడు కబ్జా చేశాడు. దీంతో ఇరు విభాగాధిపతుల మధ్య అభిప్రాయబేధాలు తలెత్తాయి. ఈ అంశాన్ని డెరైక్టర్ దృష్టికి తీసుకెళితే.. తానేమీ చేయలేనని చేతులెత్తేశారు. మెడికల్ సూపరింటిండెం ట్ కూడా జనరల్ సర్జరీ విభాగాధిపతికి కొమ్ముకాస్తున్నారు. మనస్తాపం చెందిన సదరు సర్జికల్ ఆంకాలజీ అధిపతి దీర్ఘకాలిక సెలవుల్లో వెళ్లడంతో శస్త్రచికిత్సల్లో తీవ్ర జాప్యం జరుగుతోంది. శస్త్రచికిత్స చేయించుకుని వారం రోజుల్లో ఇంటికి తిరిగి వెళ్తామని భావించి వచ్చిన రోగులు నెలల తరబడి వార్డుల్లోనే మగ్గాల్సి వస్తోంది. వేధింపులతో ఇమడలేక.. న్యూరోసర్జరీ విభాగంలో సీనియర్ సర్జన్ డాక్టర్ మానస్ పాణిగ్రాహి ఇప్పటికే వెళ్లిపోగా, సీని యర్ న్యూరోసర్జన్ డాక్టర్ ప్రవీణ్ కూడా నిమ్స్ ను వీడారు. పరిపాలనా పరమైన వేధింపులే ఇం దుకు కారణమని తన రాజీనామా లేఖలో పేర్కొనడం గమనార్హం. ఆర్థోపెడిక్ విభాగం పూర్వ అధిపతి డాక్టర్ వీబీఎన్ ప్రసాద్ రాజీ నామా తర్వాత మోకాలి శస్త్రచికిత్సలు 10-15 శాతానికి పడిపోవడానికి కూడా ఇదే కారణం. పాత భవనంలోని పలు ఆపరేషన్ థియేటర్లో ఏసీలు పనిచేయడం లేదు. ల్యామినర్ ఎయిర్ ఫ్లో లేదు. చిన్నపాటి వ ర్షం కురిసినా పైకప్పు కారుతోంది. ఇక్కడ శస్త్రచికిత్సలు చేస్తుండడం వల్ల రోగులు ఇన్ఫెక్షన్ బారిన పడుతున్నట్లు స్వయంగా వైద్యులే చెబుతున్నారు. యూరాలజీ, నెఫ్రాలజీ విభాగాల్లోనూ ఇదే పరిస్థితి. ఇదిలా ఉంటే అనస్థీషియా విభాగంలోని ఓ సీనియర్ ప్రొఫెసర్ ఇటీవల వీఆర్ఎస్పై వెళ్లిపోయారు. అనస్థీషియన్ల కొరత వల్ల ఆరు ఆపరేషన్ థియేటర్లు మూతపడడం గమనార్హం. -
వైద్యసేవ డబ్బుల సంగతి తేల్చండి
గత ఏడాది జూన్ నుంచి చెల్లింపులు లేవు ఇలాగైతే సర్జరీలు చేస్తాం.. కానీ రిజిష్టర్ చేయం వైద్యశాఖ కార్యదర్శికి వైద్యుల సంఘం వినతి విజయవాడ (లబ్బీపేట) : ఎన్టీఆర్ వైద్య సేవ(ఆరోగ్యశ్రీ) పథకంలో సర్జరీలు చేయించుకున్న ప్రభుత్వాస్పత్రి రోగులకు ఇంటికి వెళ్లేటపుడు చెల్లించాల్సిన చార్జీల విషయం తేల్చాలని మెడికల్ కో-ఆర్డినేటర్లు కోరుతున్నారు. రోగులకు వైద్యసేవ పథకంలో సర్జరీలు చేయడంతో ప్రభుత్వాస్పత్రికి ఆదాయం వస్తుంది. కానీ ఆ రోగులు ఇంటికెళ్లేటప్పుడు ఇవ్వాల్సిన చార్జీలను నిలిపి వేయడంతో మెడికల్ కో-ఆర్డినేటర్లు తమ జేబులో డబ్బులు ఇవ్వవల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత ఏడాది జూన్ నుంచి ఎన్టీఆర్ పథకం ద్వారా ఆస్పత్రికి నిధులు సమకూరుతున్నా, వాటిని వైద్యులకు రావాల్సిన చెల్లింపులతో పాటు, రోగులకు ఇచ్చే చార్జీల డబ్బులు కూడా నిలిపివేసారని వారు పేర్కొంటున్నారు. నిబంధనలు ఇలా.. ఆరోగ్యశ్రీ పథకం ప్రవేశపెట్టినపుడు ప్రైవేటు ఆస్పత్రులతోపాటు ప్రభుత్వాస్పత్రుల్లో కూడా పథకాన్ని అమలు చేశారు. ఆరోగ్యశ్రీ సర్జరీలకు వచ్చే డబ్బులతో 20 శాతం మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం ప్రభుత్వం వద్ద ఉంచుకుని మిగిలిన 80 శాతం ఆస్పత్రికి విడుదల చేశారు. వాటిలో 35 శాతం సర్జరీ బృందం తీసుకోవాల్సి ఉంది. ఏడాదికి ప్రభుత్వాస్పత్రిలో వైద్య సేవ పథకంలో సర్జరీలు చేస్తున్నా వైద్యులు, సిబ్బందికి ఇవ్వాల్సిన డబ్బులు మాత్రం ఇవ్వకపోవడంతో వైద్యులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. అసలేం జరిగిందంటే.. ప్రభుత్వాస్పత్రికి ఆరోగ్యశ్రీ పథకం ద్వారా సమకూరిన నిధులు ప్రత్యేక అకౌంట్లో ఉండేవి. వాటిపై జిల్లా అదనపు జాయింట్ కలెక్టర్ చెక్ పవర్ ఉండేది. రూ.100 చెల్లింపునకు సైతం ఆయన వద్దకు చెక్కు కోసం వెళ్లడం కష్టమవడంతో చెల్లింపులు జాప్యం జరుగుతుందని అప్పట్లో జరిగిన అభివృద్ధి కమిటీ సమావేశం పలువురు వైద్యులు నాటి కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. ఆస్పత్రిలో ఓ వైద్యునికి ఆరోగ్యశ్రీ చెల్లింపులకు సంబంధించి చెక్‌పవర్ ఇచ్చారు. కొన్నాళ్లు పని సజావుగానే జరిగింది. ఎప్పటికప్పుడు చెల్లింపులు చేసేవారు. అయితే కలెక్టర్‌గా బాబు.ఎ బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆరోగ్యశ్రీ అకౌంట్ లావాదేవీలు తానే చేస్తానని వైద్యునికి ఇచ్చిన డ్రా పవర్‌ను రద్దు చేశారు. దీంతో గత ఏడాది జూన్ నుంచి అన్ని చెల్లింపులు నిలిచిపోయాయి. వైద్య శాఖ కార్యదర్శికి వినతి ఎన్టీఆర్ వైద్య సేవ చెల్లింపులు నిలుపుదల చేయడంపై ప్రభుత్వాస్పత్రికి తనిఖీలకు వచ్చిన వైద్య ఆరోగ్య శాఖ ముఖ్యకార్యదర్శికి టీచింగ్ వైద్యుల సంఘం తరపున రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె.అప్పారావు వినతిపత్రం సమర్పించారు. ఇలాగైతే తాము సర్జరీలు చేస్తాము కానీ, ఎన్టీఆర్ వైద్య సేవలో రోగిని రిజిస్ట్రేషన్ చేయమని తేల్చిచెప్పారు. ప్రస్తుతం ఆస్పత్రిలో జరుగుతున్న అభివృద్ధి పనుల్లో ఆరోగ్యశ్రీ నిధులు రూ.కోట్లలో ఉన్నట్లు వారు పేర్కొన్నారు. వారి వినతిపై స్పందించిన పూనం మాలకొండయ్య ఈ విషయాన్ని పరిశీలిస్తానని తెలిపారు. ఇదే వినతిపత్రాన్ని ఎన్టీఆర్ వైద్య సేవ సీఈవో రవిశంకర్ అయ్యర్, డీఎంఈ డాక్టర్ టి.వేణుగోపాలరావులకు కూడా అందజేశారు. -
కటింగ్ అప్పుడే మొదలైంది!
ఆధునిక కత్తెరలను ఇంగ్లండ్‌కు చెందిన విలియమ్ వైట్లీ అండ్ సన్స్ కంపెనీ క్రీస్తుశకం 1760 నుంచి తయారు చేయడం ప్రారంభించింది. ఆధునిక కాలంలోనూ వాడుకలో ఉన్న పురాతన వస్తువుల్లో కత్తెర ఒకటి. ప్రాచీన ఈజిప్టులో కత్తెరల వాడుక క్రీస్తుపూర్వం 1500 ఏళ్ల నాడే మొదలైంది. అప్పట్లో పలచని లోహపు రేకును మధ్యకు వంచి, రెండువైపులా పదునైన చాకుల్లా ఉండేలా తయారు చేసేవారు. అప్పటి కత్తెరలను అడకత్తెరలా అరచేత్తో నొక్కాల్సిందే తప్ప వేళ్లతో తేలికగా ఆడించేందుకు రింగుల పిడి ఏర్పాటు ఉండేది కాదు. అప్పట్లో వాడే కత్తెరలకు మధ్యన వంచిన భాగం స్ప్రింగులా ఉపయోగపడేది. మధ్యయుగాల్లో కత్తెరల తయారీ కాస్త పరిణామం చెందింది. ఇనుము లేదా ఉక్కుతో రెండు చాకులను విడివిడిగా తయారు చేసి, తేలికగా కదిపేందుకు వీలుగా వాటి మధ్యలో స్ప్రింగు అమర్చేవారు. అయితే, రింగుల పిడితో విడివిడిగా ఉన్న రెండు చాకులతో ఆధునిక కత్తెరలను ఇంగ్లండ్‌కు చెందిన విలియమ్ వైట్లీ అండ్ సన్స్ కంపెనీ క్రీస్తుశకం 1760 నుంచి తయారు చేయడం ప్రారంభించింది. ఆ కంపెనీ ద్వారా తొలిసారిగా ‘332’ ట్రేడ్‌మార్కుతో బ్రాండెడ్ కత్తెరలు అందుబాటులోకి వచ్చాయి. అప్పటి నుంచి రకరకాల పరిమాణాల్లోని కత్తెరలు రకరకాల అవసరాలకు అనుగుణంగా మార్కెట్లోకి అందుబాటులోకి వచ్చినా, వాటి డిజైన్‌లో పెద్ద మార్పు రాలేదు. కత్తెరలు విరివిగా అందుబాటులోకి వచ్చిన తర్వాత శస్త్రచికిత్సలు చేయడం తేలికైంది. దుస్తుల తయారీ సహా ఫ్యాషన్ రంగంలోనూ గణనీయమైన మార్పులు వచ్చాయి. వంటింటి అవసరాల నుంచి పారిశ్రామిక అవసరాల వరకు రకరకాల కత్తెరలు విరివిగా ఉపయోగంలోకి వచ్చాక ఇవి మన జీవితాల్లో విడదీయరాని భాగంగా మారాయి. -
ఆ‘పరేషాన్’..!
వనపర్తి టౌన్: జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో కాన్పులు, శస్త్రచికిత్సలు(సిజేరియన్) నిలిచిపోయాయి. కొన్ని ఆస్పత్రుల్లో మత్తు(అనస్తిషీయా)వైద్యులు లేకపోగా.. మరికొన్నిచోట్ల గైనకాల జిస్టులు లేరు. కాన్పుకోసం ప్రైవేట్ ఆస్పత్రుల కు వెళ్లిన పేదలకు పగలే చుక్కలు కనిపిస్తున్నా యి. సాధారణ ప్రసవమైనా సరే రూ.10వేల నుంచి రూ.15వేల వరకు ఖర్చవుతున్నాయి. జి ల్లా ఆస్పత్రిలో తప్పితే.. వనపర్తి, గద్వాల, నాగర్‌కర్నూల్, నారాయణపేట, సీహెచ్ఎస్ బాదేప ల్లి, షాద్‌నగర్, కల్వకుర్తి, అలంపూర్, కల్వకుర్తి, రేవల్లి ప్రభుత్వ ఆస్పత్రుల్లో శస్త్రచికిత్సలు అస లు జరగడమే లేదు. కాన్పులు కూడా అరకొరగానే జరుగుతున్నాయి. ఏరియా ఆస్పత్రులకు పూర్తిస్థాయిలో మత్తుమందు వైద్యులు, గైనకాల జిస్టులను నియమిస్తే సమస్య కొంత తీరేది. కా నీ చాలా ఆస్పత్రుల్లో పూర్తిస్థాయి వైద్యులు లే రు. జిల్లాలో కార్పొరేట్ తరహాలో రూపొం దించిన ఏరియా, సీహెచ్ఎస్ ఆస్పత్రుల్లో జిల్లా నలుమూలల నుంచి పురిటినొప్పులతో వచ్చే గర్భిణులకు సర్కారు ఆస్పత్రుల్లో సేవలు అందకపోవడంతో ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్లి వేలకువేలు ఖర్చుచేస్తున్నారు. పీజీ వైద్యులు వెళ్లిపోవడంతో.. గైనకాలజిస్టులు పీజీకోర్సుల్లో భాగంగా జిల్లాలోని అన్ని ఏరియా ఆస్పత్రులకు ఏడాది క్రితం వచ్చారు. సూపరింటెండెంట్లు, వైద్యాధికారులు వారిని సమన్వయం చేస్తూ వైద్యసేవలను విని యోగించుకునేవారు. శిక్షణ గైనకాలజిస్టులకు చే దోడువాదోడుగా ఉండటంతో ఆస్పత్రుల్లో ఇ తర వైద్యులు ఆపరేషన్లు కొనసాగించేవారు. ఏ డాది శిక్షణకాలం పూర్తయిన తరువాత వారు గతనెల చివరిలో వెళ్లిపోవడంతో శస్త్రచికిత్సలు నిలిచిపోయాయి. గైనకాలజి స్టులు, మత్తుమందు వైద్యుల పోస్టులు జిల్లాలో ఖాళీగా ఉండటంతో తీవ్ర సంక్షోభంలో ఉన్న ప్ర భుత్వ ఆస్పత్రులు ఈనెల చివరివారంలో జరిగే పీజీ వైద్యుల కౌన్సెలింగ్‌పైనే ఆశలు పెట్టుకున్నాయి. ఇప్పటికే పలుమార్లు డీసీహెచ్ఓ జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఖాళీల వివరాలను ఉన్నతాధికారులకు అందజేసినట్లు తెలుస్తోంది. డిప్యూటేషన్ వైద్యులు వీరే.. గైనకాలజిస్ట్లు బాదేపల్లిలో ఉమ, డీసీహెచ్ఓ పద్మ, కల్వకుర్తిలో సంధ్యరాణి, అచ్చంపేటలో అర్చన, చిన్నపిల్లల వైద్యులు షాద్‌నగర్ వెంకటేశ్వర్లు, వనపర్తి వినోద్‌కుమార్, జిల్లా ఆస్పత్రిలో బి.శంకర్, నాగర్‌కర్నూల్‌లో ఫిరోజోద్దీన్, వి జయ్‌కుమార్, ఘనపురంలో హర్షదుల్లా, మత్తముందు వైద్యులు షాద్‌నగర్‌లో లక్ష్మి, మహబూబ్‌నగర్ తేజస్విని, అలంపూర్‌లో రాంబాబు డిప్యూటేషన్‌లో కొనసాగుతున్నారు. -
ఫ్యామిలీ ‘ప్లానింగ్’
కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సలు నిర్వహించడంలో మన జిల్లా ముందువరుసలో నిలిచింది. నూటికి నూరుశాతం శస్త్రచికిత్సలు నిర్వహించి తన సత్తా చాటుతూ వస్తోంది. గతంలో వరుసగా ఏకంగా పదమూడు సంవత్సరాలు ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను పూర్తి చేసి రాష్ట్ర స్థాయిలో అవార్డులు అందుకున్న ఘనత జిల్లాకే దక్కింది. అదే రీతిలో మూడేళ్లుగా లక్ష్యానికి మించి కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు నిర్వహిస్తూ జిల్లాకు పూర్వవైభవాన్ని వైద్య ఆరోగ్య శాఖ తీసుకువస్తోంది. నల్లగొండ టౌన్ : కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయించడంలో రాష్ట్ర స్థాయిలో 2012-13 సంవత్సరంలో అవార్డు అందుకున్న జిల్లా వైద్య ఆరోగ్య శాఖ మరింత ఉత్సాహంతో పనిచేస్తూ వస్తోంది. 2012-13 ఆర్థిక సంవత్సరంలో జిల్లాకు రాష్ట్ర ప్రభుత్వం 24 వేల కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్సలు నిర్వహించాలని లక్ష్యంగా నిర్దేశించగా 24,045 ఆపరేషన్లు నిర్వహించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి అవార్డు దక్కించుకుంది. అదే విధంగా 2013-14 ఆర్థిక సంవత్సరంలో 22 వేల కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించింది. అవార్డును పొందిన జిల్లా వైద్య ఆరోగ్య శాఖ మరింత రెట్టింపు ఉత్సాహంతో మార్చి 31 నాటికి 22,050 శస్త్ర చికిత్సలను నిర్వహించి నూటికి నూరుశాతానికి మించి శస్త్ర చికిత్సలను చేసిన ఘనతను సాధించిన జిల్లాల జా బితాలో చేరింది. జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారితో పాటు సంబంధిత అధికారులు ప్రతి నెలా మండలా ల వారిగా కుటుంబ నియంత్రణ ఆపరేషన్లపై సమీక్షలను నిర్వహించిన కారణంగానే నిర్దేశించిన లక్ష్యాన్ని పూర్తి చేయగలిగారు. అదే స్ఫూర్తితో పనిచేసిన సిబ్బంది తిరిగి జిల్లాను మూడోసారి కూడా ల క్ష్యానికి మించి శస్త్రచికిత్సలను చేసిన జిల్లాల జాబితాలో చేర్చారు. గతంలో కూడా కుటుంబ నియంత్రణలో జిల్లా 1993-94 ఆర్థిక సంవత్సరం నుంచి 2005-06 ఆర్థిక సంవత్సరం వరకు వరుసగా 13 సంవత్సరాలు నూటికి నూరుశాతానికి మించి శస్త్ర చికిత్సలను నిర్వహించి రాష్ట్ర స్థాయిలో వరసగా అవార్డులను సాధించిన ఘనత వైద్య ఆరోగ్య శాఖకు ఉంది. కుటుంబ వ్యవస్థలో చోటుచేసుకున్న మార్పులే ప్రజలలో సామాజికంగా, ఆర్థికంగా వచ్చిన మార్పులకు తోడు కుటుంబ వ్యవస్థలో వచ్చిన మార్పుల కారణంగా జిల్లా ప్రజలు అత్యధికంగా కుటుంబ నియంత్రణను పాటిస్తున్నారని విశ్లేషకులు పేర్కొంటున్నారు. దానికి తోడు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ద్వారా కుటుంబ నియంత్రణపై నిర్వహిస్తున్న అవగాహన కార్యక్రమాలు క్షేత్రస్థాయికి చేరడంతో గ్రామీణ ప్రాంత ప్రజలు సైతం ఇద్దరు పిల్లలకే కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్సలు చేయించుకోవడానికి ముందుకువస్తున్నారని వైద్య ఆరోగ్యశాఖ అధికారులు చెపుతున్నారు. ఇక ఉద్యోగస్తులతో పాటు సంపన్నులు ఒక్కరికే సరిపుచ్చుకునే ఆలోచనకు రావడం కలిసివచ్చినట్లు అయ్యింది. కుటుంబ నియంత్రణను పాటించడంలో మగవారికంటే మహిళలే ముందు వరుసలో ఉంటున్నారు. కుటుంబపోషణ, పిల్లల పెంపకం, వారిని స్కూళ్లకు పంపడం, ఇంటి పని, వంట పనులతో పాటు ఉద్యోగం, వ్యవసాయ పనులు, కూలీ పనులతో బిజీబిజీగా ఉండే మహిళలు ఒక్కరు లేక ఇద్దరు చాలు అనే ఆలోచనకు రావడం వల్ల కుటుంబ నియంత్రణలో వారే ముందుకు వస్తున్నారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మహిళలు సింహభాగంలో.. కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్సలను చేయించుకోవడంలో మహిళలే సింహభాగంలో ఉంటున్నారు. వేళ సంఖ్యలో మహిళలు శస్త్ర చికిత్సలను చేయించుకుంటుంటే మగవారు మాత్రం కేవలం పదుల సంఖ్యలో వేసెక్టమీ ఆపరేషన్లను చేయించుకుంటూ కుటుంబ నియంత్రణ బాధ్యత మహిళలదే అన్నచందంగా వ్యవహరిస్తున్నారు. వేసెక్టమీ చేయించుకున్న మగవారి సంఖ్య ఇలా ఉంది. 2008-09 సంవత్సరంలో 162 మంది, 2009-10లో 126, 2010-11లో 73 , 2011-12లో 47, 2012-13లో 45, 2013-14లో 39 , 2014-15లో 28 మంది మగవారు మాత్రమే వేసెక్టమీ ఆపరేషన్లు చేయించుకోవడం గమనార్హం. ఏటేటా సంఖ్య పెరగకుండా తగ్గిపోవడం ఆందోళన కలిగిస్తోంది. కుటుంబ నియంత్రణ బాధ్యత మహిళలకు ఎంత ఉంటుందో మగవారికి కూడా అంతే ఉంటుందని గ్రహించాల్సిన అవసరం ఉందని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు పేర్కొంటున్నారు. సమష్టి కృషితో సాధించాం ఎస్పీహెచ్ఓలు, వైద్యాధికారులు, సూపర్వైజర్లు, ఏఎన్ఎంలు, టెక్సీషియన్లతో పాటు అన్ని తరగతుల అధికారులు, ఉద్యోగుల సమష్టి కృషితోనే లక్ష్యానికి మించి కుటుంబ నియంత్రణ శస్త్ర చికి త్సలు నిర్వహించాం. వరుసగామూడేళ్లుగా నూటికి నూరుశాతం మించి శస్త్ర చికిత్సను నిర్వహించడం ఆనందంగా ఉంది. కుటుంబ నియంత్రణపై ప్రజలలో బాగా అవగాహన పెరి గింది. స్వచ్ఛందంగా శస్త్రచికిత్సలను చేయించుకోవడానికి ముందుకు వస్తున్నారు. మహిళల మాదిరిగా మగవారు కూడా వేసెక్టమీ ఆపరేషన్లను చేయించుకోవడానికి ముందుకు రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లక్ష్యాన్ని పూర్తి చేయడంలో సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఇదే స్ఫూర్తితో అందరం సమష్టిగా పనిచేసి 2015-16 లక్ష్యాన్ని కూడా అవలీలగా పూర్తి చేయగలుగుతాం. - డాక్టర్ పి.ఆమోస్,డీఎంహెచ్ఓ -
అమెరికన్ ‘ఎవడు’!
ఎవడు సినిమా చూశారా? అందులో హీరో అల్లు అర్జున్ ముఖం కాలిపోవడంతో చనిపోయిన మరో హీరో రాంచరణ్ తేజ్ ముఖాన్ని అమరుస్తారు. ఇదీ అదే స్టోరీ! సినిమా కన్నా ముందే అమెరికాలో నిజంగా జరిగింది. కథలోకెళితే.. రిచర్డ్ లీ నోరిస్ అనే వర్జీనియా యువకుడు ఓ రోజు తప్పతాగి ఇంటికొచ్చాడు. తల్లి చెడామడా తిట్టేసింది. మనోడు నాటు తుపాకీ అందుకున్నాడు. దవడ కింద ఉంచుకుని కాల్చుకుంటానని బెదిరించాడు. ఆమె వెనక్కి తగ్గడంతో తుపాకీ కిందకి దించాడు. తూటా పైకి దూసుకుపోయింది. ఇంకేం.. ముఖం పచ్చడైంది. దవడలు పగిలాయి. ముక్కు ఎగిరిపోయింది. నాలుక ఒక్కటే మిగిలి.. నోటి భాగంలో పెద్ద బొక్క పడింది! 1997లో ఇది జరిగింది. అప్పటి నుంచి 18 ఏళ్లు నరకం చూశాడు. 30 శస్త్రచికిత్సలు జరిగాయి. ముఖం వికృతంగా తయారైంది. ముఖం మార్చకపోతే చస్తాడు. మారిస్తే బతికే చాన్స్ 50 శాతమేనని వైద్యులు తేల్చారు. నిత్యనరకానికి తోడు బయటకెళ్లడమే మానేశాడు. వెళ్లాల్సి వస్తే పెద్ద టోపీ, మాస్కుతో ముఖాన్ని కప్పుకునేవాడు. ఆత్మహత్య గురించీ ఆలోచించాడు. ఇంతలో ఇతనికోసమే అన్నట్లు.. మూడేళ్ల క్రితం జోషువా అవెర్సనో(21) అనే యువకుడు కారు ప్రమాదంలో మరణించాడు. అతడి ముఖాన్ని దానం చేసేందుకు కుటుంబం అంగీకరించింది. దీంతో ‘యూనివర్సిటీ ఆఫ్ మేరీల్యాండ్ స్కూల్ ఆఫ్ మెడిసిన్’ ప్రొఫెసర్ డాక్టర్ ఎడ్వర్డో రోడ్రిగ్ నేతృత్వంలోని 150 మంది వైద్యుల బృందం 36 గంటల పాటు శ్రమించి ఆపరేషన్ పూర్తిచేసింది. కొత్తముఖంతో మరో జన్మెత్తిన నోరిస్‌ను జోషువా సోదరి రెబెకా ఇటీవల తొలిసారిగా కలుసుకుంది. చనిపోయిన తన సోదరుడి ముఖాన్ని మళ్లీ సజీవంగా చూసుకుని ఆనందబాష్పాలు రాల్చింది. అయితే.. కథ సగమే సుఖాంతమైంది! ఎందుకంటే నోరిస్ వయసు ప్రస్తుతం 39. అంతా సవ్యంగా జరిగితే కొత్త ముఖం 20 నుంచి 30 ఏళ్లు పనికొస్తుందట. కొత్త ముఖాన్ని దేహం తిరస్కరించకుండా ఉండేందుకు జీవితాంతం మందులు వాడాలి. మళ్లీ మందుకొట్టినా, పొగ తాగినా, గాయం అయినా.. కొత్త ముఖాన్ని దేహం తిరస్కరిస్తుంది! అందుకే.. ఎప్పుడు కొత్త ముఖాన్ని దేహం తిరస్కరిస్తుందో.. ఎప్పుడు మృత్యువు ముంచుకొస్తుందోనన్న భయంతోనే ఇతడు రోజూ నిద్రలేస్తున్నాడు. -
గ్రహణమొర్రికి ఉచితంగా శస్త్రచికిత్స
సాక్షి, హైదరాబాద్: గ్రహణమొర్రి బాధిత బాలల పెదవులపై చిరునవ్వులు పూయిం చేందుకు ‘స్మైల్ ఇంటర్నేషనల్ నెట్వర్క్, ఫౌండేషన్ ఫర్ చిల్డ్రన్ ఇన్ నీడ్’ సంయుక్తంగా కృషి చేస్తున్నాయి. ఈ రెండు సంస్థల ఆధ్వర్యంలో కర్నూలు జిల్లా నంద్యాలలోని శాంతిరామ్ మెడికల్ కాలేజ్ అండ్ జనరల్ హాస్పిటల్లో ఈ నెల 22 నుంచి 28 వరకు ఉచితంగా శస్త్ర చికిత్సలు జరపనున్నారు. కార్యక్రమ నిర్వహణలో భాగం గా శుక్రవారం స్మైల్ నెట్వర్క్ మెడికల్ టీం అమెరికా నుంచి హైదరాబాద్‌కు వచ్చిం ది. ఫౌండేషన్ చిల్డ్రన్ ఇన్ నీడ్ సంస్థ వ్యవస్థాపకులు డాక్టర్ గీత, టామ్ చిత్తా వీరికి స్వాగతం పలికారు. బేగంపేటలోని ఓ హోటల్లో ఏర్పాటు చేసిన సమావేశంలో నిర్వాహకులు మాట్లాడుతూ.. ‘‘ఏపీ, తెలంగాణలోని గ్రహణ మొర్రి బాధితులైన 60 మంది చిన్నారులకు ఉచితంగా శస్త్ర చికిత్సలు నిర్వహిస్తున్నామని, బాధితులకు వారి సహాయకులకు హాస్పిటల్ ఖర్చులు, భోజన వసతి, రవాణా ఖర్చులు కూడా సమకూర్చుతామం.’ అని తెలిపారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన యునెటైడ్ స్టేట్ కౌన్సిల్ జనరల్ మైఖేల్ మల్లిన్స్, ఈ శస్త్ర చికిత్స నిర్వహణకు సహకరిస్తున్న ఏపీ లెజిస్లేటివ్ కౌన్సిల్ డిప్యూటీ చైర్మన్ ఎన్.వి. సతీష్‌కుమార్‌రెడ్డి .. ఎఫ్.సి.ఎన్, స్మైల్ నెట్వర్క్ సేవల్ని ప్రశంసించారు. -
ఆపరేషన్ కష్టాలు
⇒ చేవెళ్ల ఆస్పత్రిలో పడకల సంఖ్య 20 ⇒ కు.ని. శస్త్రచికిత్సలు చేసింది 96 మందికి ⇒ బెడ్లు సరిపోక ఇబ్బందులకు గురైన మహిళలు ⇒ వసతుల కల్పనలో విఫలమైన యంత్రాంగం చేవెళ్ల రూరల్: కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సలు చేయించుకోవాలని ఒకవైపు భారీగా ప్రచారం చేస్తున్నా.. అందుకు తగిన విధంగా సౌకర్యాలు కల్పించటంలో అధికారులు పూర్తిగా విఫలమవుతున్నారు. తరచూ ఇబ్బందుల మధ్యే ఆపరేషన్లు జరుగుతున్న విషయం జిల్లా వైద్యాధికారులకు తెలిసినా ఎలాంటి చర్యలు తీసుకోవటంలేదనడానికి చేవెళ్లలో ఆపరేషన్లు చేయించుకున్న మహిళల అవస్థలే నిదర్శనం. ఆస్పత్రిలో ఉన్నవి 20 పడకలే అయినా 96 మంది మహిళలకు శస్త్రచికిత్సలు చేశారు. అందరికీ బెడ్లు సరిపోక కొందరిని వరండాలోని నేలపై పడుకోబెట్టడంతో మహిళలు ఇబ్బందులకు గురయ్యారు. సోమవారం డివిజన్లోని నాలుగు మండలాల పరిధిలోని పీహెచ్‌సీల నుంచి 96 మంది మహిళలు కు.ని. ఆపరేషన్ల కోసం ఉదయాన్నే పస్తులతో వచ్చారు. కానీ ఆపరేషన్లను మధ్యాహ్నం మొదలుపెట్టి సాయంత్రం వరకు చేశారు. దీంతో మహిళలు చాలా నీరసించిపోయారు. దీనికి తోడు ఆస్పత్రి వద్ద ఎలాంటి సౌకర్యాలు లేకపోవటంతో ఇబ్బందులకు గురయ్యారు. ఆస్పత్రిలో ఉన్న 20 మంచాలపై ఇద్దరు చొప్పున 40 మందిని పడుకోబెట్టారు. మిగిలినవారిని వరండాలోని నేలపైనే విశ్రాంతి తీసుకున్నారు. మహిళల వెంట వచ్చిన కుటుంబ సభ్యులకు ఆరుబయట వేసిన చిన్న టెంటు సరిపోకపోవటంతో చెట్ల కిందనే నిరీక్షించారు. తాగునీరు, బాత్రూంలు లేక అవస్థల పాలయ్యారు. ఒకేసారి ఇంత పెద్దమొత్తంలో వచ్చేవారికి ఆస్పత్రిలోని బెడ్లు సరిపోవని వైద్యాధికారులు తెలిపారు. మొదట ఆపరేషన్ పూర్తయినవారిని పంపిస్తూ.. ఆ తర్వాత చేసేవారికి బెడ్లను కేటాయిస్తున్నట్లు చెప్పారు. సాధ్యమైనంత వరకు అన్ని సౌకర్యాలూ కల్పించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. కు.ని. ఆపరేషన్లలో వైద్యులు జయమాలిని, క్యాంపు ఇన్చార్జి కరీమున్నీషా, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. -
సంస్కృతిని కాపాడుకుందాం
నెల్లూరు (కల్చరల్) : భారతదేశ ఉన్నతమైన సంస్కృతిని అందరం కలిసి కాపాడుకుందామని నార్త్ అమెరికా తెలుగు సంఘం (తానా) అధ్యక్షుడు మోహన్ నన్నపనేని కోరారు. కనుపర్తిపాడులోని వీపీఆర్ కన్వెన్షన్ సెంటర్లో గురువారం నిర్వహించిన తానా ‘చైతన్య స్రవంతి’ కార్యక్రమాలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మోహన్ మాట్లాడుతూ మొదటి సారిగా జిల్లా చరిత్రలో తానా కార్యక్రమాలను నిర్వహిస్తున్నామన్నారు. తెలుగు వారి ఐక్యతను చాటేందుకు కొంతమంది అమెరికాలో ఈ సంఘాన్ని స్థాపించారన్నారు. అతిపెద్ద ప్రవాస తెలుగు సంస్థగా నిలిచినందుకు గర్విస్తున్నామన్నారు. ఏ ప్రవాస భారత అసోసియేషన్ చేయని విధంగా రాష్ర్టంలో రూ.300 కోట్లతో సేవా కార్యక్రమాలు, కంటి శస్త్ర చికిత్సలు, వైద్య శిబిరాలను ఏర్పాటు చేశామన్నారు. ఎంతో ఉన్నతమైన మనదేశ సంస్కృతిని రేపటి తరానికి అందజేయాలని ఎన్ఆర్ఐల సహకారంతో ఇంత ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమాన్ని తీర్చిదిద్దామన్నారు. అంతరించిపోతున్న మన ప్రాచీన కళలను చిన్నారులకు పరిచయం చేయడం కర్తవ్యంగా భావిస్తున్నామన్నారు. కింది స్థాయి నుంచి వచ్చిన చాలా మంది ఈ వేదికపై స్థానం పొందారని, వారిని ఆదర్శంగా తీసుకుని విద్యార్థులు తమ భవిష్యత్‌ను నిర్మించుకోవాలని మోహన్ పిలుపునిచ్చారు. పుట్టిన గ్రామాలను మరవొద్దు : ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి తల్లిదండ్రుల, పూర్వీకుల జ్ఞాపకాలతో నిండి ఉన్న మీ గ్రామాలను దత్తత తీసుకుని అభివృద్ధి పరచాల్సిందిగా తానా కార్యక్రమాలకు విచ్చేసిన ఎన్ఆర్ఐలను నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి కోరారు. భారతీయులంతా, ప్రత్యేకంగా తెలుగువారంతా ఎక్కడ ఉన్నా తమ ఐక్యతను చాటేందుకు ఈ తెలుగు సంఘాన్ని స్థాపించారన్నారు. కన్వెన్షన్ సెంటర్లో చేసిన ఈ ఏర్పాట్లను చూస్తుంటే అమెరికాలో జరుగుతున్న సభకే మనం వెళ్లినంత ఆశ్చర్యంగా ఉందన్నారు. విద్యాలయాలు, వైద్యాలయాలు, శ్మశానవాటికలను, పచ్చదనాన్ని పెంచడం ద్వారా మీ సేవలు చిరకాలం నిలిచిపోతాయని విన్నవించారు. ప్రతి ఏటా తనకు ప్రభుత్వం అందజేస్తున్న వేతనం రూ.60 లక్షలను ప్రజా ప్రయోజనానికే వెచ్చిస్తున్న విషయాన్ని గుర్తుచేశారు. జూలై లో అమెరికాలో జరిగే 20వ ైద్వైవార్షిక తానా సభలు విజయవంతం కావాలని కోటంరెడ్డి ఆకాంక్షించారు. సంప్రదాయానికి నిదర్శనం ఈ వేడుక : ఎమ్మెల్సీ వాకాటి నారాయణరెడ్డి సంప్రదాయాన్ని చక్కగా పాటిస్తున్నామనడానికి ఈ వేదిక ప్రత్యక్ష నిదర్శనం అని ఎమ్మెల్సీ వాకాటి నారాయణరెడ్డి అన్నారు. మంచి ఉద్దేశంతో చేపట్టిన ఇలాంటి కార్యక్రమాలను భవిష్యత్‌లో మరిన్ని జరపాలని తానా నిర్వాహకులను ఆయన కోరారు. తానా సేవా కార్యక్రమాల్లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో వైద్య సదుపాయాలను అందించడం జరిగిందన్నారు. విదేశాల్లో ఉన్నా జన్మభూమిని మరవకుండా, సంప్రదాయం, సంస్కృతిని కాపాడేందుకు ఎన్ఆర్ఐలు చేపట్టిన కార్యక్రమాలను వాకాటి కొనియాడారు. విద్యార్థులంతా వీరిని ఆదర్శంగా తీసుకుని ఉన్నత స్థాయికి ఎదగాలని పిలుపునిచ్చారు. నెల్లూరు చరిత్ర ఘనమైనది : ఏపీఐఐసీ చైర్మన్ క ృష్ణయ్య నెల్లూరు జిల్లా ఘనమైన చరిత్ర కలిగినదని ఏపీఐఐసీ చైర్మన్ కృష్ణయ్య అన్నారు. తిక్కన, ఎర్రాప్రగడ వంటి మహా కవులను అందించిన ఘనత మన గడ్డదే అన్నారు. చరిత్రకు సంబంధించిన వివరాలను విశ్లేషించి స్మారక చిహ్నాలను నిర్మించాల్సిన అవసరముందన్నారు. గతంలో సంక్రాంతి అంటే హరిదాసు, జంగం దేవర తదితర కళాకారులతో పల్లెలు కళకళలాడేవన్నారు. నేటి తరం అలాంటి వేడుకల ప్రాశస్తాన్ని తెలుసుకోవాలని సూచించారు. స్వచ్ఛభారత్ కార్యక్రమంపై ప్రతి ఒక్కరూ అవగాహనపెంచుకుని ఆరోగ్య కరమైన పద్ధతులను పాటించాల్సిందిగా విద్యార్థులను కోరారు. రాష్ట్రాన్ని ఆర్థికంగా ఆదుకోండి : మాజీ మంత్రి సోమిరెడ్డి ప్రస్తుతం రాష్ట్రం లోటు బడ్జెట్లో నడుస్తుందని, ఎన్ఆర్ఐలంతా రాష్ట్రానికి ఉపయోగపడే కార్యక్రమాలు చేపట్టడం ద్వారా ఆదుకోవాలని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి తానా నిర్వాహకులను కోరారు. తెలుగు పండగలన్నింటిని అత్యంత సంప్రదాయంగా, సంస్కృతిని కాపాడే విధంగా జరుపుకోవడంలో తానా సభ్యులు ముందున్నారని ప్రశంసించారు. స్ఫూర్తిని ఇచ్చే కార్యక్రమం చేపట్టడం హర్షణీయం : మేయర్ అబ్దుల్ అజీజ్ ప్రతి ఒక్కరికి స్ఫూర్తి కలిగించే విధంగా, చిన్నారుల్లో ప్రతిభను వెలికి తీసే విధ రూపొందించిన ఈ కార్యక్రమాల నిర్వహణ హర్షణీయమని నగర మేయర్ అబ్దుల్ అజీజ్ అన్నారు. ప్రతిష్టాత్మకమైన తానా కార్యక్రమాలను నగరంలో నిర్వహించడం అభినందనీయం అని ఆనందం వ్యక్తం చేశారు. అనంతరం సాహిత్యంలో విశేష కృషి నెరిపిన ఆచార్య రవ్వా శ్రీహరికి గిడుగు రామ్మూర్తి పంతులు పురస్కారాన్ని, జానపద కళకు కొత్త రూపం తీసుకువచ్చిన గొర్రెల రాములుకు నరసింహమూర్తి జ్ఞాపకార్థం స్మారక పురస్కారాన్ని అందజేశారు. సాహిత్య రంగంలో ఎనలేని సేవలందించిన అనురాధ, రామకృష్ణ దంపతులకు నగదు పురస్కారాన్ని, ఆర్థికంగా చితికిన రైతులు తోట హరిప్రసాద్, పి బాలకృష్ణారెడ్డి, ఎన్. రఘునాథ్‌కు ప్రత్యేకంగా తానా నిర్వాహకులు ఆర్థిక సహయాన్ని అందజేశారు. పాత్రికేయ పురస్కారాన్ని సింహపురి రైతు సంపాదకుడు నిరంజన్‌రెడ్డికి, విధి నిర్వహణలో మరణించిన జర్నలిస్ట్‌లు శ్రీనివాసులు (హెచ్ఎంటీవీ), ఇబ్రహీం అలి (సీవీఆర్ న్యూస్) కుటుంబాలకు నగదు సహాయాన్ని అందజేశారు. హైదరాబాద్ నుంచి ప్రత్యేకంగా వచ్చిన జబర్దస్త్ టీం ప్రేక్షకులను తమ హాస్యవల్లరితో రంజింప జేసింది. జిల్లాలో తానా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడంలో ముఖ్యపాత్ర పోషించిన చైతన్య స్రవంతి అధ్యక్షుడు, ఎన్ఆర్ఐ రవి సన్నారెడ్డిని తానా నిర్వాహకులు ఘనంగా సన్మానించారు. 3 వేల మంది విద్యార్థులకు మధ్యాహ్నం భోజనం అందించిన ఎస్వీఎస్ పోషక ఆహార సంస్థ వ్యవస్థాపకుడు ఆనందరావును సత్కరించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే బీదమస్తాన్‌రావు, వైఎస్సార్సీపీ నాయకుడు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, జేసీ రేఖారాణి, తానా మాజీ వైస్ ప్రెసిడెంట్ జంపాల చౌదరి, తుంగా శివప్రభాత్‌రెడ్డి, ఎన్ఆర్ఐలు గంగాధర్ నాదెళ్ల, జయరామ్ కోమటి, సతీష్ వేమన, మధు తోట, లావు అంజయ్య చౌదరి, రవి గౌరినేని, రజని ఆకురాతి, వాసుదేవరెడ్డి, రవి పోట్లూరి, గౌతమ్ గుర్రం, రామ్ జక్కేపూడి, నరేంద్ర ఏలూరు, హరిత చదివె, రామ్ ఎలమంచిలి తదితరులు పాల్గొన్నారు. -
బెజవాడ చేరుకున్న ‘షోలాపూర్’ క్షతగాత్రులు
స్పెషల్ ఆరోగ్యశ్రీ పథకం కింద శస్త్రచికిత్సలు కలెక్టర్ ఆదేశంతో అనూ ఆస్పత్రిలో చికిత్స విజయవాడ : మహారాష్ట్రలో ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడి షోలాపూర్ యశో దా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తొమ్మిదిమందిని విజయవాడ తరలించారు. మచిలీపట్నం, పరిసర ప్రాంతాలకు చెందిన వీరిని ప్రత్యేక వాహనంలో షోలాపూర్ నుంచి శుక్రవారం సాయంత్రం నగరానికి తీసుకువచ్చారు. నగరంలోని సూర్యారావుపేట అనూ ఆస్పత్రిలో రెవెన్యూ అధికారులు చేర్పించారు. ప్రత్యేక ఆరోగ్యశ్రీ పథకం కింద అవసరమైన వారికి శస్త్ర చికిత్సలు చేయిం చాలని కలెక్టర్ ఎం.రఘునందన్‌రావు అధికారులను ఆదేశించారు. గాయపడినవారిలో అర్జా బాల, తోట వెంకటసుబ్బారావు, వడ్డీ లక్ష్మి, నూ కల నాగమణిలకు శస్త్ర చికిత్స చేయాల్సిన అవస రం ఉందని వైద్యులు తెలిపారు. మిగతా వారిలో అర్జా సిరి నాగమణి, తోట కనకదుర్గ, కుమార్‌బాబు, అర్జా శ్రీనివాస్, చలమలశెట్టి సుజాతలకు ప్రథమ చికిత్స చేసి, డిశ్చార్జి చేశారు. క్షతగాత్రులను అర్బన్ తహశీల్దార్ ఆర్.శివరావు, వీఆర్వోలు బాషా, శ్రీనివాస్ ఆస్పత్రికి తరలించారు. అవసరమైన వారికి శస్త్ర చికిత్సలకు ఏర్పాట్లు చేస్తున్నారు. తహశీల్దార్ శివరావు బాధితులను పరామర్శించారు. వారికి అవసరమైన సహాయ సహకారాలను అందిస్తున్నారు. -
అంధకారంలో ‘గాంధీ’
మొరాయించిన జనరేటర్లు నిలిచిపోయిన అత్యవసర సేవలు టార్చిలైట్ల వెలుగులో శస్త్రచికిత్సలు పాఠం నేర్వని యంత్రాంగం గాంధీ ఆస్పత్రి: ప్రజారోగ్యానికి ప్రభుత్వం ఎంత ప్రాధాన్యం ఇస్తుందో సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిని చూస్తే అర్థమవుతుంది. వేల మంది పేద రోగులకు ప్రాణ దానం చేసే ఈ ఆస్పత్రిని కొన్నాళ్లుగా సమస్యలు చుట్టుముడుతున్నా నాయకులు గాని, అధికారులు గాని పట్టించుకోవడం లేదు. శనివారం ఆస్పత్రికి నాలుగు గంటల పాటు సరఫరాను నిలిపివేస్తున్నట్లు విద్యుత్ శాఖ అధికారులు ముందుగానే సమాచారం ఇచ్చారు. దీని ప్రకారం మధ్యాహ్నం 2.30 గంటలకు కరెంటు పోయింది. జనరేటర్లు పనిచేయక పోవడంతో ఆస్పత్రిలో పరిస్థితి దారుణంగా మారింది. అత్యవసర సేవలు, శస్త్రచికిత్సలకు తీవ్ర విఘాతం ఏర్పడింది. వెంటిలేటర్ల బ్యాకప్ అయిపోవడంతో అత్యవసర విభాగాల్లోని రోగులకు మాన్యువల్‌గా ఆక్సిజన్‌ను పంపింగ్ చేశారు. టార్చిలైట్లు, సెల్ఫోన్ల వెలుగులో వైద్యసేవలు అందించిన దుస్థితి దాపురించింది. వార్డులో చీకట్లు అలుముకోవడంతో రోగులు ఆందోళనకు గురయ్యారు. ఎట్టకేలకు జనరేటర్లను మరమ్మతు చేసేసరికి డీజిల్ అయిపోయింది. దీంతో సిబ్బంది డీజిల్ కోసం పరుగులు తీశారు. సుమారు రెండు గంటల పాటు సాగిన గందరగోళానికి పాలనా యంత్రాంగం నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనిపించింది. దీనిపై రోగులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎట్టకేలకు రెండు గంటల తర్వాత విద్యుత్ సరఫరా పునరుద్ధరించారు. గతంలోనూ ఇదే పరిస్థితి.. ఈ ఏడాది జూన్ 22,24 తేదీల్లో పలుమార్లు విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో ఆస్పత్రిలో చీకట్లు అలుముకున్నాయి. శస్త్ర చికిత్సలు నిలిచిపోవడంతో వైద్యులే ఆస్పత్రి పాలనా యంత్రాంగం తీరును తూర్పారబట్టారు. తరుచూ ఇటువంటి ఘటనలే జరుగుతున్నా నిర్లక్ష్యవైఖరి వీడక పోవడంపై రోగులతోపాటు వైద్యులు, సిబ్బంది తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కోట్లాది రూపాయల వ్యయంతో ఏర్పాటు చేసిన సోలార్ పవర్‌ప్లాంట్ నిర్మాణం పూర్తయినా ప్రారంభానికి నోచుకోకపోవడం గమనార్హం. ఈ ఘ టనపై ఆస్పత్రి ముఖ్య అధికారి ఒకరిని వివరణ కోరగా నిర ్లక్ష్యపు సమాధానం ఇచ్చారు. పది నిమిషాలే విద్యుత్‌కు అంతరాయం కలిగిందని, ఎటువంటి అపాయం జరగ లేదనడం గమనార్హం. -
రూపాయికే శస్త్రచికిత్సలు
కూకట్‌పల్లిలోని ఆకార్ ఆశా సెంటర్ ఫర్ ఎనేబుల్మెంట్ ఆఫ్ ఫిజికల్లీ డిజేబుల్డ్ వికలాంగుల కోసం రూపాయికే శస్త్రచికిత్సలు నిర్వహించనుంది. నగరంలోని పారిశ్రామిక ప్రాంతాల్లో ప్రమాదాల కారణంగా అంగవైకల్యానికి గురైన వారి కోసం రూపాయికే శస్త్రచికిత్సా శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు నిర్వా హకులు తెలిపారు. అర్హులైన రోగుల ఎంపిక కోసం పారిశ్రామిక సంస్థల్లో అవగాహన ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 25 మంది వికలాంగులను శస్త్రచికిత్సల కోసం ఎంపిక చేశారు. త్వరలోనే వీరికి రూపాయికే శస్త్రచికిత్సలు నిర్వహించనున్నారు. - సాక్షి, సిటీప్లస్ -
భౌ బోయ్
నగరంలో శునకాల స్వైర విహారం గుంపులుగా తిరుగుతూ జనంపై దాడి ఏటా పెరుగుతున్న కుక్క కాటు బాధితులు, మరణాలు స్పందించని అధికారులు మల్కాజిగిరిలో చిన్నారిపై దాడితో ఆందోళన సిటీ బ్యూరో, న్యూస్‌లైన్: ‘గ్రేటర్’లో కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. ఎక్కడ పడితే అక్కడ గుంపులుగా తిరుగుతూ కనిపించే వారందరిపై దాడి చేస్తున్నాయి. వీటి బారిన పడి, ఆస్పత్రి పాలవుతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. కుక్కల దాడిలో ప్రాణాలు కో ల్పోతున్న వారి సంఖ్య భీతిగొల్పుతోంది. శుక్రవారం మల్కాజ్‌గిరిలో రెండున్నరేళ్ల బాలుడిపై వీధి కుక్క దాడి చేసింది. ఈ దాడిలో బాలుడి ముఖంపై తీవ్ర గాయాలయ్యాయి. ఆ చిన్నారి పరిస్థితి హృదయవిదారకంగా ఉంది. రక్తమోడుతున్న బాలుని తీసుకొని కుటుంబ సభ్యులు రెండు ఆస్పత్రులకు తిరిగినా అవసరమైన వ్యాక్సిన్ అందుబాటులో లేకపోవడం రాజధాని నగరంలో వైద్యసేవల తీరుకు దర్పణం పడుతోంది. ఇక్కడ... అక్కడ...అని తేడా లేకుండా నగరమంతటా కుక్కల బెడద తీవ్రంగా వేధిస్తోంది. బాటసారులతో పాటు వాహనదారులూ కుక్క కాటుకు గురవుతున్నారు. ముఖ్యంగా రాత్రి పూట విధులు నిర్వహించి ఇళ్లకు వెళుతున్న వారి పరిస్థితి దారుణంగా ఉంటోంది. ఏ కుక్క ఎటు నుంచి మీద పడుతుందో తెలియని పరిస్థితి ఎదురవుతోంది. వీటి కారణంగా రాత్రి వేళల్లో ఎవరూ ఒంటరిగా కాలు బయట పెట్టలేని దుస్థితి ఉందంటే అతిశయోక్తి కాదు. వీటిని అరికట్టేందుకు అధికార యంత్రాంగం నుంచి ఎటువంటి చర్యలూ కానరావడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. వీటిని దూరంగా తరలించాలని తాము చేస్తున్న విజ్ఞప్తులు పట్టించుకునే వారే లేరని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పేరుకే శస్త్ర చికిత్సలు వీధి కుక్కల వల్ల ప్రజలకు హాని జరుగకుండా ఉండేం దుకు జీహెచ్ఎంసీ పరిధిలోని ఐదు శస్త్రచికిత్స కేంద్రాల ద్వారా ఏటా దాదాపు 80 వేల కుక్కలకు టీకాలు, నెలకు రెండువేల కుక్కలకు శస్త్రచికిత్సలు చేస్తున్నామని అంటున్నారు. వాస్తవ పరిస్థితి చూస్తే అధికారుల మాటలపై సందేహాలు రేకెత్తేలా ఉంది. శస్త్ర చికిత్సల సంగతి అటుం చి... వాటిని దూర ప్రాంతాలకు తరలించాలని జనం ముక్తకంఠంతో కోరుతున్నారు. గడచిన పదేళ్లలో నగరంలో కుక్కకాటుతో దాదాపు 40 మంది మృతి చెందారు. ఏటా దాదాపు ఐదు వేల మంది కుక్కకాటు బారిన పడుతున్నారు. కుళ్లిన ఆహార పదార్థాల వల్లనేనట... గ్రేటర్లో ఎక్కడ పడితే అక్కడ కనిపించే చెత్తకుప్పలు.. వాటిలోని కుళ్లిపోయిన ఆహార పదార్థాలను కుక్కలు తినడం వల్ల ప్రకోపం పెరిగి ప్రజలపై దాడి చేస్తాయని పశువైద్య శాఖ అధికారులు చెబుతున్నారు. అంతేకాక ఆగస్టు-నవంబర్ నెలల మధ్య కుక్కల సంతానోత్పత్తి సమయమైనందున జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. గతంతో పోలిస్తే గ్రేటర్లో కుక్కల బెడద తగ్గిందని అధికారులు చెబుతుండగా... నెలకు దాదాపు రెండువేల మంది నారాయణగూడలోని ఐపీఎంకు వస్తుండటం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ఐపీఎంకు వచ్చేవారిలో నగర ప్రజలే కాక పొరుగు జిల్లాల వారు కూడా ఉంటున్నారని అధికారులు అంటున్నారు. రోజూ ఫిర్యాదులు... తమ ప్రాంతంలో కుక్కలు తిరుగుతున్నాయంటూ రోజుకు వంద మందికి పైగా జీహెచ్ఎంసీకి ఫిర్యాదు చేస్తున్నారు. కుక్క కాటు బాధితుల సంఖ్య కూడా రోజుకు వందకుపైగానే ఉంటున్నట్టు ఓ అధికారి చెప్పారు. గ్రేటర్లో ప్రస్తుతం దాదాపు నాలుగు లక్షల కుక్కలు ఉండవచ్చునని అంచనా. కుక్క క రిచిన వారికి అవసరమైన యాంటీ రేబిస్ ఇంజెక్షన్లు నారాయణగూడలోని ఐపీఎం (ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్)లో అందుబాటులో ఉన్నాయని జీహెచ్ఎంసీ చీఫ్ వెటర్నరీ ఆఫీసర్ డాక్టర్ వెంకటేశ్వర రెడ్డి చెప్పారు. యానిమల్ బర్త్ కంట్రోల్ (ఏబీసీ) నిబంధనల మేరకు సంతాన నిరోధక శస్త్రచికిత్సలు(స్టెరిలైజేషన్) ద్వారా మాత్రమే ప్రజలకు కుక్కల నుంచి హాని లేకుండా చేయాల్సి ఉంది. ఈ శస్త్ర చికిత్సల కేంద్రాలు ఆటోనగర్, అంబర్‌పేట, చుడీబజార్, జీడిమెట్ల, పటాన్‌చెరులలో ఉన్నాయి. మల్కాజిగిరిలో కుక్కల నియంత్రణకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని జీహెచ్ఎంసీ వెటర్నరీ విభాగం అసిస్టెంట్ డెరైక్టర్ డాక్టర్ గోవర్థన్‌రెడ్డి చెప్పారు. అక్కడ నిత్యం తమ విభాగానికి చెందిన రెండు వాహనాలు తిరుగుతున్నాయన్నారు. వీధి కుక్కలకు సంబంధించిన అన్ని ఫిర్యాదులను గ్రేటర్‌లోని దిగువ నెంబర్లకు తెలియజేయవచ్చు. ఈస్ట్‌జోన్-9000554767, 9989930359 సౌత్‌జోన్- 9989930358, సెంట్రల్‌జోన్-9704456521, 9989930356 వెస్ట్‌జోన్-9000901937 నార్త్‌జోన్-9704456520, 9989930397 ఇదీ పరిస్థితి : సాక్షి, సిటీబ్యూరో: కుక్క కాటుకు సంబంధించి గత ఏడాది ఫీవర్ ఆస్పత్రిలో అత్యధికంగా 11621 కేసులు నమోదు కాగా, వీరిలో 23 మందికి రేబిస్ సోకినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ ఏడాది ఇప్పటి వరకు ఐదువేలకు పైగా కుక్కకాటు కేసులు నమోదు కాగా, పది మంది రేబిస్ బారిన పడ్డారు. ఇదే ఆస్పత్రిలో గురువారం 47 కేసులు కాగా, శుక్రవారం 28 కేసులు నమోదవడంపై సర్వత్రా ఆందోళన వ్యక్తం అవుతోంది. ఇవీ దుష్ఫలితాలు... కుక్క కాటు వల్ల వైరస్ కాలు నుంచి శరీరంలోకి ప్రవేశించిన తర్వాత రోజుకు అర సెంటిమీటర్ చొప్పున పైకి ఎగబాకుతుంది. ఇది నరాలు, మెదడుపై ప్రభావం చూపుతుంది. రేబీస్ సోకిన వారిలో మొదటి దశలో జ్వరం, తల నొప్పి, వాంతులు, వంటి లక్షణాలు కనిపిస్తాయి. పిచ్చిగా ప్రవర్తించడం, మనుషులను గుర్తించ లేకపోవడం, నోటిలోంచి నురుగ రావడం, మంచి నీరు తాగితే గొంతు పట్టేయడం, గాలి వీచినప్పుడు ఊపిరి ఆడకపోవడం వంటి లక్షణాలు రెండో దశలో కనిపిస్తాయి. ఇక మూడో దశలో పూర్తిగా కోమా లోకి వెళ్లిపోయి, రెండు మూడు రోజుల్లో మరణిస్తారు. ఈ జాగ్రత్తలు పాటించాలి వీధి కుక్కలను సాధ్యమైనంత వరకు నియంత్రించాలి. ఒక వేళ కుక్క కరిస్తే వెంటనే ధారగా కారుతున్న నీటితో 10 నుంచి 15 నిమిషాల పాటు శుభ్రం చేయాలి. రక్తం కారుతున్నా...గాయంపై కట్టు కట్టకూడదు. మట్టి, పసుపు, ఆకుపసరు వంటివి పూయకూడదు. ఏ మాత్రం నిర్లక్ష్యం చేయకుండా వెంటనే సమీపంలోని ఆస్పత్రికి వెళ్లి, యాంటి రేబిస్ వ్యాక్సిన్ వేయించుకోవాలి. కరిచిన తర్వాత ఒకటి, ఆ తర్వాత 3, 7, 14, 28 రోజుల్లో విధిగా వ్యాక్సిన్ వేసుకోవాలి. కుక్కలకు సాధ్యమైనంత వరకు దూరంగా ఉండాలి. వీధి కుక్కలు అధికంగా ఉన్న ప్రాంతంలో తిరగకపోవడమే మంచిది. ఇంట్లో ఉన్న కుక్కలకు ప్రతి మూడు మాసాలకు ఒకసారి తప్పని సరిగా వ్యాక్సిన్ వేయించాలి. -
లంచం ఇస్తేనే ఆపరేషన్లు
‘ఖని’ ధర్మాస్పత్రికి అవినీతి రోగం గోదావరిఖని ధర్మాస్పత్రికి అవినీతి రోగం పట్టుకుంది. ఇక్కడ లంచం ఇవ్వనిదే శస్త్రచికిత్సలు చేయడం లేదు. చివరికి ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ఉచితంగా నిర్వహించాల్సిన శస్త్రచికిత్సలను సైతం లంచం కోసం పక్కన పెడుతున్నారు. ఏడాదిన్నరలో కనీసం ఒక్క కేసు కూడా ఆరోగ్యశ్రీ ద్వారా నిర్వహించలేదంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. నెలల తరబడి పేషెంట్లు శస్త్రచికిత్సల కోసం ఎదురుచూస్తున్నారు. ధర్మాస్పత్రిని నమ్ముకుని ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని వస్తున్న నిరుపేద ప్రజలను ప్రతీ పనికి ఓ రేటంటూ జలగాల్లా పీడిస్తున్నారు. ఆస్పత్రిలో కొందరు వైద్యులు, ఉద్యోగులు, సిబ్బంది అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్నారు. ఇదేందని పేషెంట్లు నిలదీస్తే ‘పైసలిస్తే పదినిమిషాల్లో ఆపరేషన్ అవుద్ది..ఆలోచించుకో’ అంటూ బహిరంగంగానే ఉచిత సలహాలిస్తున్నారు. అధికారు లు ఈ అవినీతిపై మౌనంగా ఉండడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆదివారం ‘సాక్షి’ ఆస్పత్రిని సందర్శించగా పలువురు పేషెంట్లు తమ బాధలు వెల్లడించారు. - కోల్‌సిటీ రెండు నెలలు ఇన్‌పేషెంట్‌గా.. గోదావరిఖని ఫైవింక్లయిన్కాలనీకి చెందిన ఐల వేణి రాజమ్మకు పిత్తాశయంలో రాళ్లు (గాల్‌బ్లాడర్ స్టోన్స్) రావడంతో కొంత కాలం నుంచి తల్లడిల్లుతోంది. రెండున్నర నెలల క్రితం పరీక్ష చేయించుకోగా, ఆరోగ్యశ్రీ ద్వారా శస్త్రచికిత్స చేస్తామని వైద్యులు సూచించారు. రెండు నెలలుగా రాజమ్మ ఆస్పత్రిలో ఇన్‌పేషంట్‌గా అడ్మిట్ అయి శస్త్రచికిత్స కోసం ఎదురుచూస్తోంది. నెల క్రితం ఆరోగ్యశ్రీ ట్రస్ట్ కూడా ఈమెకు శస్త్రచికిత్స నిర్వహణ కోసం అనుమతి ఇచ్చింది. అయితే మొదట మత్తు డాక్టర్ లేడని, తర్వాత గుండె సంబంధిత సమస్య ఉందని, ఆ తర్వాత వయస్సు ఎక్కువగా ఉండడంతో శస్త్రచికిత్సకు రాజమ్మ శరీరం సహకరించదని పొంతనలేని సమాధానాలు చెబుతూ ఆపరేషన్ చేయకుండా జాప్యం చేస్తూ వచ్చారు. బాధితురాలి బంధువులు నిలదీస్తే కరీంనగర్‌కు రెఫర్ చేస్తున్నామని చెప్పి చేతులు దులుపుకున్నారు. రాజమ్మతోపాటు ఆమె కుటుంబసభ్యులు ఆందోళనకు గురవుతున్నారు. రూ. 5 వేలు లంచం ఇచ్చినా.. కమాన్‌పూర్ మండలం రాణాపూర్ గ్రామానికి చెందిన వృద్ధుడు మెడగోని కొమురయ్యగౌడ్ హెర్నియాతో మూడు నెలలుగా బాధపడుతున్నాడు. నెల క్రితం ప్రభుత్వ ఆస్పత్రి వైద్యులకు చూపించగా, శస్త్రచికిత్స చేస్తామని చె ప్పి అడ్మిట్ చేసుకున్నారు. 21 రోజులుగా కొమురయ్య ఆస్పత్రిలో ఇన్‌పేషంట్‌గా చికిత్స పొందుతున్నాడు. బెడ్ ఇవ్వాలంటే రూ. 700 చెల్లించాలని డిమాండ్ చేయడంతో డబ్బులు క ట్టినట్లు బాధితుడు ఆరోపించాడు. ‘పే-రూం’ పేరుతో రోజుకు రూ. 100 చొప్పున తీసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. ఆపరేషన్ లేటవుతుందనడంతో ఆస్పత్రిలో పనిచేస్తున్న ఓ ప్రైవేట్ సెక్యూరిటీగార్డు అడిగినప్పుడు రూ. 5 వేలు ఇచ్చినట్లు వివరించాడు. ఈ డబ్బులు డాక్టర్‌కు ముట్టజెప్పానని, రెండు రోజుల్లో ఆపరేషన్ చేస్తారని అతడు చెప్పాడని, మూడు రోజులు గడిచినా ఇప్పటికీ ఆపరేషన్ చేయలేదని బాధితుడు వాపోయాడు. అలాగే స్థానిక కృష్ణానగర్‌కు చెందిన కాశిపేట దుర్గమ్మ అనే వృద్ధురాలు అదుపుతప్పి కిందపడిపోయింది. వారం క్రితం ఆమెను స్థానికులు ఆస్పత్రిలో చేర్పించగా వైద్యులు ఆరోగ్యశ్రీ ద్వారా ఆపరేషన్ చే స్తామని చెప్పారు. కానీ ఇప్పటికీ ఆమెను పట్టించుకోవడం లేదు. ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు స్పందించి ప్రభుత్వ ఆస్పత్రిలోని అవినీతి అధికారులపై చర్యలు తీసుకోవాలని రోగులు కోరుతున్నారు. -
అమ్మో.. ఆపరేషన్
సర్జన్లకు సవాలు.. రోగులకు ప్రాణసంకటం కేజీహెచ్ ఆపరేషన్ థియేటర్లలో కొరవడిన కనీస సదుపాయాలు జనరేటర్లూ లేని వైనం కొవ్వొత్తుల వెలుగే శరణ్యం నానాటికీ తగ్గిపోతున్న శస్త్రచికిత్సలు విశాఖపట్నం, మెడికల్:ఋ కేజీహెచ్‌లోని ఆపరేషన్ థియేటర్లు అధ్వానంగా తయారవుతున్నాయి. రోగుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయి. కనీస సదుపాయలు కొరవడటంతో ఆపరేషన్ల సంఖ్య రోజురోజుకూ తగ్గిపోతోంది. గతంలో రోజుకు వంద జరిగేవి. ప్రస్తు తం ఆ సంఖ్య సగానికి పడిపోయింది. 1050 పడకల సామర్ధ్యం గల పెద్పాస్పత్రిలో 10 ఆపరేషన్ థియేటర్లున్నాయి. ప్రధానంగా ఏఓటీ, బీఓటీలో ఎక్కువ ఆపరేషన్లు జరుగుతుంటాయి. వీటిని జంట థియేటర్లుగా పిలుస్తారు. ట్రామాకేర్ సెంటర్లోని ఆర్థో, న్యూరో ఆపరేషన్ థియేటర్లతో పాటు అత్యవసర రోగులకు చిన్న,చితకా ఆపరేషన్లు చేసేందుకు ఎమర్జెన్సీ ఆపరేషన్ థియేటర్ ఉంది. ఎముకల చికిత్స విభాగంలో ఆర్థో ఆపరేషన్ థియేటర్, ఓపీ కాంప్లెక్స్‌లో ఎబ్డన్ ఆపరేషన్ థియేటర్లు , సూపర్‌స్పెషాల్టీ బ్లాక్‌లో ప్లాస్టిక్ సర్జరీ, పిల్లల శస్త్రచికిత్స ఆపరేషన్ థియేటర్లు ఉన్నాయి. వీటిలో జంట ఆపరేషన్ థియేటర్లు మినహా మిగిలిన చోట కనీస సదుపాయాలు తీసికట్టుగా ఉంటున్నాయని సర్జన్లే పెదవి విరుస్తున్నారు. సర్జన్లలకు సవాలు..రోగులకు ప్రాణసంకటం రెండింటికి మినహా మిగిలిన వాటికి జనరేటర్ సదుపాయం లేకపోవడంతో ఆపరేషన్లు నిలిచిపోతున్నాయి. అటువంటి సమయాల్లో టార్చిలైట్లు, కొవ్వొత్తుల వెలుగులోనే శస్త్రచికిత్సలు చేయాల్సిన దుస్థితి. జనరేటర్లున్న చోట కిరోసిన్ లేక సకాలంలో పనిచేయక ఇబ్బందులుపాలుచేస్తున్నాయి, జనరేటర్ పనిచేసినా అవి కేవలం వెలుతురుకు తప్ప పరికరాలను నడిపించలేకపోతున్నాయి. ఇటు సర్జన్లు, అసిస్టెంట్ సర్జన్లకు శస్త్రచికిత్సలు సవాలుగా మారుతున్నాయి. కొద్ది రోజుల క్రితం జనరల్ సర్జరీ విభాగానికి చెందిన ఒక యూనిట్ వైద్యులు జంట ఆపరేషన్ థియేటర్లలో ఏకకాలంలో ఇద్దరు రోగులకు శస్త్రచికిత్సలు నిర్వహిస్తుండగా మధ్యలో కరె ంట్ పోవడం, జనరేటర్ సకాలంలో పనిచేయకపోవడం వల్ల శస్త్రచికిత్సలకు అవరోధం కలిగి ఇద్దరు రోగులు ఆపరేషన్ థియేటర్లలోనే మృత్యువాత పడ్డారని విశ్వసనీయవర్గాల సమాచారం. ఇదే సంఘటన నేపథ్యంలో ఆస్పత్రికి చెందిన ఓ సీనియర్ సర్జన్ పేదల ప్రాణాలతో చెలగాటం ఆడవద్దని, ఆపరేషన్ థియేటర్లకు ఇన్వర్టర్లు ఏర్పాటు చే సి అవసరమైన అన్ని వైద్య పరికరాలను సక్రమంగా పనిచేసేలా చూడాలని సూపరింటెండెంట్‌కు లేఖ రాయడం థియేటర్ల పరిస్థితికి అద్దం పడుతోంది. జనరేటర్లూ లేవు వైద్య పరికరాల స్థితిగతులు కూడా దారుణంగా ఉన్నాయి. విద్యుత్ కోత సమస్య వేధిస్తోంది. ఇన్వర్టర్లు ఏ థియేటర్‌కు లేవు. దీంతో వైద్య పరికరాలు పనిచేయవు. శస్త్ర చికిత్సల్లో నాణ్యత లేని సర్జకల్ సామగ్రి వినియోగిస్తున్నారు. థియేటర్లలో స్టెరిలైజేషన్ సక్రమంగా ఉండడం లేదు. -
చీకట్లో 'ఉస్మానియా’
- రెండు దఫాలు కరెంట్ కట్ - నిలిచిన శస్త్రచికిత్సలు, వైద్య పరీక్షలు అఫ్జల్‌గంజ్: రాష్ట్రంలోనే పెద్దాస్పత్రిగా ఖ్యాతిగాంచిన ఉస్మానియాకూ విద్యుత్ కోతలు తప్పడం లేదు. సోమవారం ఉదయం 8:30 నుంచి 11:30 గంటల వరకు ఉస్మానియా ఆస్పత్రిలో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. దీంతో రోగ నిర్ధారణ పరీక్షలు, శస్త్ర చికిత్సలు నిలిచిపోయాయి. దీంతో రోగులు, వారి సహాయకులు ఆందోళనకు గురయ్యారు. తిరిగి సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో వార్డుల్లో చికిత్సలు పొందుతున్న రోగులు, సేవలందిస్తున్న వైద్య సిబ్బంది ఇబ్బందులు పడ్డారు. దీంతో పాటు వివిధ విభాగాల్లో పని చేసే సిబ్బంది అత్యవసరమైన ఫైళ్లను క్లియర్ చేసేందుకు నానాపాట్లు పడ్డారు. సెల్‌ఫోన్ వెలుగులో ఫైళ్లను క్లియర్ చేశారు. అదే విధంగా ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సీజీ రఘురామ్ సైతం ఆరోగ్యశ్రీ పథకానికి సంబంధించిన ఫైళ్లను సెల్‌ఫోన్ వెలుగులో పరిశీలించి క్లియర్ చేయాల్సి వచ్చింది. -
బోటాక్స్ చేయించుకున్నా...
అందం కోసం శస్త్రచికిత్సలు చేయించుకున్న విషయాన్ని సినీతారలు సాధారణంగా రహస్యంగా ఉంచుతారు. బ్రిటిష్ నటి కేటీ ప్రైస్ మాత్రం తాను బోటాక్స్ చికిత్స చేయించుకున్న విషయాన్ని బహిరంగంగా వెల్లడించింది. లండన్‌లో ఒక హెయిర్ డై రిమూవల్ ఉత్పత్తిని ప్రారంభించిన సందర్భంగా ఆమె ఈ విషయం చెప్పింది. -
కోమాలోంచి బయటకు షుమాకర్
లియోన్: ఆరు నెలల పాటు కోమాలో ఉన్న ఫార్ములావన్ దిగ్గజం మైకేల్ షుమాకర్ ఎట్టకేలకు బయటపడ్డాడు. దీంతో ఇప్పటిదాకా చికిత్స పొందుతున్న ఫ్రాన్స్‌లోని ఆస్పత్రి నుంచి అతడిని సోమవారం స్విట్జర్లాండ్‌లో లుసానేలోని ఆస్పత్రికి తదుపరి చికిత్స కోసం తరలించారు. ఈ విషయాన్ని షుమాకర్ తరపు ప్రతినిధి సబినే కెమ్ అధికారికంగా ప్రకటించారు. భార్య, పిల్లలతో కలిసి షుమాకర్ స్విట్జర్లాండ్‌లోనే ఓ చిన్న పట్టణంలో నివాసం ఉంటున్నాడు. గత ఏడాది డిసెంబర్ 29న ఫ్రాన్స్‌లోని మెరిబెల్లో 45 ఏళ్ల షుమాకర్ స్కీయింగ్ చేస్తూ తీవ్రంగా గాయపడి కోమాలోకి వెళ్లిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి గ్రెనోబుల్‌లో అతనికి చికిత్సనందించిన డాక్టర్లు.. మెదడులో గడ్డకట్టిన రక్తాన్ని తొలగించేందుకు రెండు శస్త్రచికిత్సలు చేశారు. షుమాకర్లో కదలికలు కనిపించినట్లు పలుమార్లు వార్తలు రాగా, అతని కుటుంబ సభ్యులు ఈ విషయాన్ని వెల్లడించేందుకు ఆసక్తి చూపలేదు. అయితే అతడు తప్పక కోలుకుంటాడన్న విశ్వాసాన్ని వారు వ్యక్తం చేస్తూ వచ్చారు. సోమవారం షుమాకర్ తరలింపు సందర్భంగా మీడియా దృష్టంతా గ్రెనోబుల్ పైనే ఉన్నా.. ఎటువంటి హడావిడి లేకుండా, మీడియా సమావేశం కూడా నిర్వహించకుండా అతడిని తీసుకెళ్లారు. అయితే గాయపడిన నాటి నుంచి షుమాకర్‌కు చికిత్సనందించిన వైద్యులకు, అతడు కోలుకోవాలని ప్రార్థించిన వారందరికీ అతని కుటుంబసభ్యులు కృతజ్ఞతలు చెప్పినట్లు సబినే కెమ్ తెలిపారు. షుమాకర్ ప్రస్తుత ఆరోగ్యస్థితిపై పూర్తి వివరాలను వెల్లడించేందుకు మాత్రం ఆమె నిరాకరించారు. పూర్తిగా కోలుకునే దాకా ప్రపంచానికి దూరంగా ఉంచనున్నట్లు చెప్పారు. -
తాండూరులోని జిల్లా ఆస్పత్రికి సుస్తీ
తాండూరు టౌన్ : పేరుకే అది పెద్దాస్పత్రి.. రోగులకు అందే వైద్య సేవలు అంతంతమాత్రం.. కనీసం పడుకోవడానికి మంచాలు కూడా సరిపోని ధైన్యం.. సరిపడా వైద్యులు లేక అవస్థలు.. శస్త్రచికిత్సలు అవసరమైతే ప్రైవేటు హాస్పిటళ్ల బాట పట్టాల్సిందే.. ఇదీ ‘పేరుగొప్ప ఊరు దిబ్బ’ అన్న చందంగా ఉన్న తాండూరు ప్రభుత్వ జిల్లా ఆస్పత్రి పరిస్థితి. తాండూరు నియోజకవర్గంలోని ప్రజలే కాకుండా మహబూబ్‌నగర్, మెదక్ జిల్లాలతో పాటు కర్నాటక రాష్ట్రం నుంచి కూడా రోగులు ఇక్కడికి చికిత్స కోసం వస్తుంటారు. తాండూరు ప్రాంత పరిధిలో ఉన్న సిమెంటు కర్మాగారాలు, నాపరాతి గనుల్లోనూ, పాలిషింగ్ యూనిట్లలోనూ వేలాదిమంది కార్మికులు పనిచేస్తున్నారు. అక్కడ ఏ ప్రమాదం జరిగినా వారంతా జిల్లా ఆస్పత్రికే వస్తుంటారు. రోగుల సంఖ్యకు అనుగుణంగా మంచాలు లేకపోవడంతో వారు ఇబ్బంది పడాల్సి వస్తోంది. చేసేదేమి లేక ఎలాగోలా సర్దుకుని ఒకే మంచంపై ఇద్దరు పడుకుంటున్నారు. మెడికల్వార్డుల్లో పురుషులకు, మహిళలకు వేర్వేరుగా రెండేసి గదుల చొప్పున మొత్తం నాలుగు గదులు కేటాయించారు. ఒక్కో గదిలో 12 మంచాల చొప్పున మొత్తం 48 మంచాలున్నాయి. చికిత్స కోసం వచ్చే వారి సంఖ్య ఎక్కువగా ఉండడంతో సమస్యలు తప్పడం లేదు. ఒకే మంచంపై ఇద్దరు చొప్పున పడుకుంటే ఒకరి వ్యాధి మరొకరికి వ్యాప్తి చెందే ప్రమాదం ఉందని రోగుల బంధువులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. భర్తీ కాని వైద్యుల పోస్టులు ఆస్పత్రిలో అరకొర వైద్యులతో ఎలాగోలా నెట్టుకువస్తున్నారు. 200 పడకల ఆస్పత్రికి 9 మంది సివిల్ సర్జన్లు, 15 మంది అసిస్టెంట్ సివిల్ సర్జన్లు, ఇద్దరు అనస్థీషియన్లు ఉండాలి. ఇక్కడ మాత్రం ముగ్గురు సివిల్ సర్జన్లు, 8 మంది అసిస్టెంట్ సివిల్ సర్జన్లు ఉన్నారు. ఇతర వైద్య సిబ్బంది సంఖ్య కూడా తక్కువగా ఉంది. అనస్థీషియన్లు అసలు లేనేలేరు. ప్రతి గురు, శుక్ర, శనివారాల్లో హైదరాబాద్ నుంచి ప్రత్యేకంగా అనస్థీషియన్లను తీసుకువస్తున్నారు. ఈ మూడు రోజుల్లో మాత్రమే ఇక్కడ శస్త్రచికిత్సలు జరుగుతున్నాయి. ఎమర్జెన్సీ కేసులు తప్పనిసరి పరిస్థితుల్లో హైదరాబాద్‌కు గానీ లేదా తాండూరులోని ప్రైవేటు ఆస్పత్రులకు గానీ వెళ్లాల్సి వస్తోంది. రవాణాశాఖ మంత్రి మహేందర్‌రెడ్డి తక్షణమే స్పందించి ఆస్పత్రి సమస్యలను పరిష్కరించాలని నియోజకవర్గ ప్రజలు కోరుతున్నారు. -
‘రక్త’సంబంధం
మంచిర్యాల అర్బన్ : రక్తం.. కృత్రిమంగా తయారు చేయలేనిది. అలాగని ప్రమాదాలు, శస్త్రచికిత్సలు, అత్యవసర సమయాల్లో అందకపోతే ప్రాణం గాలిలో కలిసిపోతుంది. ఆపద సమయంలో ఒక్కరు రక్తం చేస్తే చాలు ప్రాణాన్ని కాపాడవచ్చు. ఓ కుటుంబాన్ని నిలబెట్టవచ్చు. అందుకే మేమున్నామంటూ రక్తదాతలు ముందుకొస్తున్నారు. స్వచ్ఛందంగా రక్తదానం చేస్తున్నారు. ఇలా ఒకటి రెండుసార్లు కాదు 10.. 16.. 47సార్లు రక్తదానం చేసిన వారూ ఉన్నారు. ఆపదలో ఉన్నవారితో వారికెలాంటి సంబంధం లేకున్నా ‘రక్త’సంబంధం దాతలను ముందుకు నడిపిస్తోంది. జాతీయ నాయకుల జయంతి, ప్రాముఖ్యత కలిగిన రోజుల్లో స్వ చ్ఛంద సేవా సంస్థలు రక్తదాన శిబిరాలు ఏర్పా టు చేస్తున్నాయి. ఈ నెల 14న ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం. రక్తదానంపై అపోహలు వద్దు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు రక్తదానంపై చైతన్యం చేస్తున్నా కొంతమందిలో అపోహలు ఉన్నాయి. అవగాహన రాహిత్యంతో రక్తదానానికి సాహసించడం లేదు. రక్తదానం చేస్తే మనిషి బలహీన పడుతారనేది అపోహ మాత్ర మే. రక్తదానం చేస్తే ఆరోగ్యానికి ఎంతో మేలు. మానవుని శరీరం లో ఐదు నుంచి ఆరు లీటర్ల రక్తం ఉంటుంది. ఆరోగ్యంగా ఉన్న వ్య క్తి నుంచి 350 మి ల్లీలీటర్ల రక్తం సేకరిస్తారు. ప్రతీ మూడు నెలలకోసారి రక్తదానం చేసినా ఎలాంటి నష్టం ఉండదు. 18 ఏళ్ల నుంచి 60ఏళ్లలోపు ఆరోగ్యంగా ఉన్న వారంతా నిర్భయంగా రక్తదానం చేయొచ్చు. జిల్లాలో.. జిల్లాలో మంచిర్యాల, నిర్మల్‌లో ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో, ఆదిలాబాద్‌లో రిమ్స్‌లో రక్తనిధి కేంద్రాలు ఉన్నాయి. కాగజ్‌నగర్, చెన్నూర్‌లో రెడ్‌క్రాస్ సొసైటీకి చెందిన సబ్‌సెంటర్లు ఉన్నాయి. వీటి ద్వారా విరివిగా రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేస్తున్నారు. రోడ్డు ప్రమాదాలు, శస్త్రచికిత్సలు, ఇతర ప్రమాదాల సమయాల్లో అవసరమైన వారికి రక్తం అందిస్తున్నాయి. మంచిర్యాల ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలోని ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రక్తనిధి కేంద్రం జిల్లాలో ఆదర్శంగా నిలుస్తోంది. రక్తనిధి కేంద్రం లేక, రక్తం సకాలంలో అందక ఎంతోమంది రోడ్డు ప్రమాద క్షతగాత్రులు, గర్భిణులు మరణించారు. 2008లో రక్తనిధి కేంద్రం ప్రారంభించారు. తూర్పు ప్రాంత వాసులకు అపర సంజీవనిలా మారింది. రక్తం నిల్వ ఉంచే సౌలభ్య ఉండడంతో ఏటా రక్తం నిల్వలు పెరుగుతున్నాయి. తలసేమియా వ్యాధిగ్రస్తులకు వరం తలసేమియా వ్యాధిగ్రస్తులకు నెలకోసారి రక్తమార్పిడి చేయాల్సి ఉంటుంది. గతంలో హైదరాబాద్‌కు వెళ్లాల్సి వచ్చేది. ప్రస్తుతం మంచిర్యాల బ్లడ్‌బ్యాంకులోనే మార్పిడి చేస్తున్నారు. అవసరమైన గ్రూపు రక్తం అందుబాటులో ఉంచుతున్నారు. 2012లో 152, 2013లో 1,036, 2014లో 1,800 యూనిట్ల రక్తాన్ని అందించారు. రక్తం విడదీసే సౌకర్యం రక్తాన్ని విడదీసి ఎక్కించే సౌకర్యం జిల్లాలోని అన్ని బ్లడ్‌బ్యాంకుల్లో ఉంది. ఒక వ్యక్తి రక్తాన్ని నలుగురికి ఉపయోగపడే విధంగా చేసే సాంకేతిక పరిజ్ఞానం ఉంది. ఏ వ్యక్తికి ఏ కణం రక్తం అవసరమో ఆ కణాలనే ఎక్కించే సౌలభ్యం ఉంది. డెంగీ వ్యాధిగ్రస్తులకు అవసరమైన ప్లేట్లేట్స్ ఎక్కిస్తే మిగితా రక్తం మరో వ్యక్తిని అవసరం ఉన్నట్లుగా వినియోగించుకోవచ్చు. ఆరోగ్యానికి మంచిది.. రక్తదానం చేయడం ఆరోగ్యానికి ఎంతో మంచింది. అనార్యోగానికి గురవుతామనే అపోహలు వీడాలి. ఎన్నిసార్లు రక్తదానం చేసినా ఆరోగ్యానికి ఎలాంటి చింత ఉండదు. ఆపదలో ఉన్నవారికి రక్తం ఇవ్వడానికి ముందుకు రావాలి. బ్లడ్‌బ్యాంకులో ఎంత రక్తమైనా నిల్వ చేసుకునే సౌలభ్య ఉంది. యువకులు రక్తదానం చేయడానికి ఎళ్లవేళలా సిద్ధంగా ఉండాలి. - డాక్టర్ విష్ణుమూర్తి, బ్లడ్ బ్యాంక్ నిర్వాహకుడు, మంచిర్యాల 47సార్లు రక్తదానం ఆపదలో ఉన్నవారికి 47సార్లు రక్తదానం చేశాను. ఇప్పటివరకు 1,275 యూనిట్ల రక్తం అందించాను. రక్తదానం చేసి ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడం ఆనందంగా ఉంది. మా తండ్రి మల్యాల రాజయ్య పేరిట స్వచ్ఛంద సంస్థ ఏర్పాటు చేసి రక్తదాతలను ప్రోత్సహిస్తున్న. నా స్నేహితులు వంద మంది రక్తం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. రక్తసం అవసరమైన వారు 9700070894, 9908927515 నంబర్లలో సంప్రదించాలి. - మల్యాల శ్రీపతి, మంచిర్యాల తాండూర్ : 1998లో రక్తదానం చేయడం ప్రారంభించి క్రమం తప్పకుండా చేస్తున్న. ఇప్పటివరకు 58సార్లు రక్తదానం చేశాను. అభినవ స్వచ్ఛంద సేవా సంస్థను ప్రారంభించి ఎంతోమందిని సభ్యులుగా చేర్పించి రక్తదానంపై అవగాహన కల్పిస్తున్న. వారితో కూడా రక్తదానం చేయిస్తున్న. అన్ని దానాలకన్న రక్తదానం ఎంతో గొప్పది. రక్తదానం చేస్తేనే ప్రాణం నిలబడుతుంది. ప్రాణం ఉన్న వ్యక్తే ఎన్ని దానాలైనా చేయగలడు. ఇప్పటివరకు రెండు రాష్ట్ర స్థాయి, ఐదు జిల్లా స్థాయి అవార్డులు అందుకున్న. గ్రామస్తాయిలో కూడా రక్తదానంపై పూర్తి స్థాయిలో అవగాహన కల్పించి అందరినీ రక్తదాతలుగా మార్చాలన్నదే నా ధ్యేయం. - కె.సంతోష్‌కుమార్, అభినవ స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు, తాండూర్ -
యథావిధిగా ఆరోగ్యశ్రీ శస్త్ర చికిత్సలు
ఆలమూరు, న్యూస్‌లైన్ : రాష్ట్ర విభజన నేపథ్యంలో రాజీవ్ ఆరోగ్య శ్రీ పథకానికి వచ్చిన ముప్పేమీ లేదని, యథావిధిగా ఈ పథకం కింద శస్త్ర చికిత్సలు నిర్వహిస్తామని ఆరోగ్యశ్రీ జిల్లా కోఆర్డినేటర్ డాక్టర్ ప్రసన్న ఆంజనేయులు తెలిపారు. ఆయన గురువారం ఆలమూరులో విలేకరులతో మాట్లాడుతూ ఆర్టికల్ 10 ప్రకారం పదేళ్ల పాటు రాష్ట్రంలో ఎక్కడైనా, ఏఆస్పత్రుల్లోనైనా ఆరోగ్యశ్రీ పథకం వర్తిస్తుందన్నారు. ఆస్పత్రులకు చెల్లింపులను రెండు రాష్ట్ర ప్రభుత్వాలు చూసుకుంటాయన్నారు. జిల్లాలో ఆరోగ్యశ్రీ ప్రారంభమైన ఎనిమిదేళ్ల కాలంలో ఇప్పటి వరకూ 1,72,889 శస్త్రచికిత్సలు జరపగా రూ. 420.11 కోట్లు వ్యయం అయ్యిందన్నారు. ఆలమూరు మండలంలో 2,396 మందికి చికిత్స అందించగా ప్రభుత్వం రూ. 5.58 కోట్లు వ్యయం చేసిందన్నారు. రాష్ర్టంలోనే ఆరోగ్యశ్రీ పథకం అమలులో జిల్లా ప్రథమస్థానంలో నిలిచిందన్నారు. ప్రస్తుతం ఈపథకం కింద 938 రకాల వ్యాధులకు చికిత్సను అందిస్తుండగా 138 వ్యాధులకు కేవలం ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే చికిత్సను అందిస్తున్నామన్నారు. రేషన్ కార్డుల్లోని డేటాను పౌరసరఫరాలశాఖతో సరిపోల్చడం వల్ల తలెత్తుతున్న ఇబ్బందులను అధిగమించేందుకు చర్యలు చేపట్టినట్టు ప్రసన్న ఆంజనేయులు తెలిపారు. -
అంధకారంలో ఉస్మానియా
అఫ్జల్‌గంజ్, న్యూస్‌లైన్: ఉస్మానియా ఆసుపత్రిలో అంధకా రం అలుముకుంది. సోమవారం ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 2.30 వరకు, సాయంత్రం 5 నుంచి రాత్రి 9 గంటల వరకు విద్యుత్ నిలిచిపోవడంతో రోగులు, సిబ్బంది ఇబ్బందులు పడ్డారు. ఆసుపత్రిలోని క్యాజువాల్టీ, ఏబీసీ, ఏఎంసీ, ఏఎన్ఎస్సీ, మీకో వార్డుల్లో శస్త్రచికిత్సలకు అంతరాయం కలిగింది. పలు శస్త్రచికిత్సలు వాయిదా పడ్డాయి. ఓపీ రిజిస్ట్రేషన్ విభాగం, ఎంక్వైరీ విభాగాల్లో కంప్యూటర్లు పనిచేయక రోగుల వివరాల నమోదుకు సిబ్బంది అవస్థలు పడ్డారు. అత్యవసర పరిస్థితుల్లో అంబులెన్స్‌లో వచ్చిన రోగులకు సత్వరం వైద్యం అందించాల్సి ఉండగా, విద్యుత్ లేకపోవడం తో ఇతర ఆస్పత్రుల కు పంపించాల్సిన దుస్థితి నెలకొంది. ఓపీ భవనంలో జనరేటర్ ఉన్నా.. పనిచేయలేదు. డ్యూటీ ఆర్ఎంవో డాక్టర్ రఫీ మీడియాకు వివరణనిస్తూ.. సాంకేతిక కారణాల వల్ల విద్యుత్ అంతరాయం తలెత్తిందన్నారు. -
1.5 లక్షల మందికి ఆరోగ్యశ్రీ శస్త్రచికిత్సలు
మావకరపాలెం, న్యూస్‌లైన్: జిల్లాలో ఆరోగ్యశ్రీ పథకం ద్వారా లక్షా 5వేల 507మందికి శస్త్రచికిత్సలు జరిగాయని ఆ పథకం జిల్లా కో-ఆర్డినేటర్ ఎస్.వి.పార్వతీశం తెలిపారు. మండల కేంద్రంలో మంగళవారం నిర్వహించిన ఆరోగ్యశ్రీ వైద్యశిబిరాన్ని పరి శీలించేందుకు వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడారు. పథకం ప్రారంభం నుంచి ఇప్పటివరకు సర్జరీలకు రూ.269.83 కోట్లు ఖర్చయ్యాయన్నారు. జిల్లావ్యాప్తంగా ఇప్పటివరకు జరిగిన 1,523 వైద్యశిబిరాల్లో వివిధ కార్పొరేట్ ఆస్పత్రుల వైద్యనిపుణులు 2లక్షల 89వేల 112 మంది రోగులకు వై ద్యపరీక్షలు నిర్వహించారన్నారు. వీరిలో 16,798 మందిని ఈ శిబిరాల్లో గుర్తించి మెరుగైన వైద్య సేవలందించామన్నారు. జిల్లాలో నెలకు నాలుగు శి బిరాలు ఏర్పాటుచేసి రో గులకు వైద్యసేవలు అం దిస్తున్నట్లు తెలిపారు. ఐటీడీఏ పరిధిలో ప్రత్యే క శిబిరాలు నిర్వహిస్తున్నామని వివరించారు. శస్త్రచికిత్సలకు సంబంధించిన బిల్లులను సకాలంలో ఆస్పత్రులకు చెల్లిస్తున్నామన్నారు. రోగుల పేర్లు తప్పుగా నమోదు చేస్తే అలాంటి వారి బిల్లుల చెల్లింపులో కొంత జాప్యం జరుగుతుందని చెప్పారు. సమావేశంలో స్థానిక ఆరోగ్యమిత్ర మేరీ జీవాబాయి పాల్గొన్నారు. -
ఎటూ తేలని ఉద్యోగుల హెల్త్‌కార్డుల విషయం