
సాక్షి, న్యూఢిల్లీ : అభిమానం తారా స్థాయికి చేరి ఓ యువతి చేసిన పని ఆమె ముఖాన్ని పూర్తిగా మార్చేసింది. తన ఫేవరెట్ హీరోయిన్‌లా మారిపోవాలని ఏకంగా 50 సర్జరీలు చేయించుకుంది. అవన్నీ వికటించటంతో ఇప్పుడు ఆమె ముఖం దారుణంగా మారిపోయింది.
ఇరాన్‌కు చెందిన 19 ఏళ్ల సహర్ తబర్ హాలీవుడ్ నటి ఏంజెలీనా జోలీ వీరాభిమాని. స్వతహాగా అందగత్తె అయిన తబర్.. జోలీలా లేనని తరచూ నిరుత్సాహం చెందేది. ఈ క్రమంలో శస్త్రచికిత్సలు చేయించుకునేందుకు సిద్ధమైపోయింది. ముఖానికి మొత్తం 50 సర్జీలు చేయించుకుంది. అంతేకాదు డైటింగ్ చేసి 40 కేజీలకు బరువు మించకుండా చూసుకుంది.
ఇప్పుడు ఆమె ముఖంగా దారుణంగా మారిపోయింది. అయినప్పటికీ తన ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన సహర్ కు ఇప్పుడు ఫ్యాన్ ఫాలోయింగ్ బాగా పెరిగిపోయింది. క్షణక్షణానికి ఆమెను అనుసరించేవారు పెరిగిపోతూ ప్రస్తుతానికి దాదాపు 4 లక్షలకు చేరుకుంది. అయితే వారిలో చాలా మంది పాపం ఆమెను ఎగతాళి చేస్తూ కామెంట్లు పెట్టడం విశేషం. నీ ముఖంపై ఎవరైనా బాంబు వేశారా? జాంబీ, నువ్వు చాలా భయంకరంగా ఉన్నావ్, సర్జరీ కంటే ముందు చాలా అందంగా ఉన్నావ్, నువ్వసలు మనిషివేనా? ఇలాంటి కామెంట్లు కనిపిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment