Angelina Jolie
-
Mahakumbh 2025:‘మోనాలీసా’, ‘ఏంజలీనా జోలీ’ డస్కీ బ్యూటీ ఫోటోలు
-
హాలీవుడ్ స్టార్ జంటకు విడాకులు.. ఎనిమిదేళ్ల తర్వాత సెటిల్మెంట్!
ప్రముఖ హాలీవుడ్ జంట ఏంజెలీనా జోలీ, బ్రాడ్ పిట్ తమ బంధానికి గుడ్ బై చెప్పేశారు. దాదాపు 8 ఏళ్ల తర్వాత ఈ దంపతులకు కోర్టు విడాకులు మంజూరు చేసింది. సెప్టెంబరు 2016లో ఎంజెలీనా జోలీ విడాకుల కోసం కోర్టును అశ్రయించారు. సుదీర్ఘమైన విచారణ తాజాగా వీరిద్దరు ఓ సెటిల్మెంట్కు వచ్చారు. దీంతో వీరిద్దరు అధికారికంగా విడాకులు తీసుకున్నట్లు ఎంజెలీనా తరఫు న్యాయవాది ధ్రువీకరించారు.కాగా.. 2014లో ఎంజెలీనా, బ్రాడ్ పిట్ పెళ్లి చేసుకున్నారు. ఈ జంట దాదాపు 12 ఏళ్ల పాటు కలిసి ఉన్నారు. హాలీవుడ్లో అత్యంత ప్రజాదరణ పొందిన జంటల్లో ఏంజెలినా జోలీ, బ్రాడ్ పిట్ ఒకరు. కాగా... విడాకుల సెటిల్మెంట్కు సంబంధించిన వివరాలను గోప్యంగా ఉంచారు. ఈ కేసు కోసం దంపతులు ఒక ప్రైవేట్ న్యాయమూర్తిని నియమించారు.2016లో జోలీ యూరప్ ట్రిప్ తర్వాత విడాకుల కోసం దాఖలు చేసింది. పిట్ తన పట్ల, తన పిల్లల పట్ల అనుచితంగా ప్రవర్తించాడని ఆమె పేర్కొంది. అయితే ఈ జంటకు న్యాయమూర్తి వారికి 2019లో విడాకులు మంజూరు చేశారు. కానీ పిల్లలు, ఆస్తుల విభజన, పిల్లల సంరక్షణ సెటిల్మెంట్ కోసం కోసం మరో ఐదేళ్లు పట్టింది. ఇక నుంచి వీరిద్దరు అధికారికంగా విడిపోయినట్లే. ఇక సినిమాల విషయానికొస్తే ఎంజెలీనా జోలీ చివరిసారిగా మారియాలో కనిపించింది. -
ఎట్టకేలకు ముసుగు తీసి.. ముఖం చూపెట్టింది
హాలీవుడ్ నటి ఏంజెలీనా జోలిని పోలిన ముఖ కవళికలతో.. ఓవరాల్‌గా భయంకరమైన రూపంతో సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ ఆ మధ్య ఫేమస్ అయ్యింది ఒక యువతి(21). అయితే ఎట్టకేలకు ఆమె తన ముఖాన్ని ప్రపంచానికి చూపెట్టింది. అదీ జైలు నుంచి విడుదలైన తర్వాతే!. ఇరాన్‌కు చెందిన సహర్ తబర్.. 2019లో అరెస్ట్ అయ్యి జైలుకు వెళ్లింది. ఎంజెలీనా జోలిలా మారాలనే ఆశతో సర్జరీలు చేయించుకుంటే.. అవి వికటించిన వికృతంగా మారినట్లు తబర్పై ఓ ప్రచారం ఉండేది. ఆపై జరిగిన పరిణామాలు ఆమెను చిక్కుల్లో పడేశాయి. మోసం, దైవదూషణ నేరానికిగానూ ఆమెకు పదేళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది అక్కడి న్యాయస్థానం. హిజాబ్‌ను అవమానించిన ఆరోపణలకుగానూ ఆమె ఈ శిక్ష పడింది. అయితే.. 14 నెలలకే ఆమెకు జైలు జీవితం నుంచి విముక్తి లభించింది. అందుకు కారణం.. 40 రోజులుకు పైగా అక్కడ మహిళా లోకం చేస్తున్న పోరాటం. మహ్సా అమినీ మృతి తర్వాత.. ఇరాన్లో ఉవ్వెత్తున్న హిజాబ్ వ్యతిరేక ఉద్యమం జరుగుతోంది. ఇదే అదనుగా సహర్ తబర్‌ను సైతం విడుదల చేయాలంటూ పలువురు సోషల్ మీడియాలో నినదించారు. మసిహ్ అలినెజద్ లాంటి ఉద్యమకారిణి సహా పలువురు సామాజిక వేత్తలు తబర్ విముక్తి కోసం పోరాడారు. దీంతో ఇరాన్ ప్రభుత్వం తగ్గి.. తబర్‌ను విడుదల చేసింది. హిజాబ్ విషయంలో ఆమె చేసిన ఒక చిన్న జోక్.. ఆమెను కటకటాల పాల్జేసింది. ఆమె కన్నతల్లి రోజూ కన్నీరు కార్చింది. ఈ వ్యవహారంలో నటి ఏంజెలీనా కలగజేసుకోవాలని మసిహ్ అలినెజద్ కోరారు కూడా. అయితే.. హిజాబ్ వ్యతిరేక నిరసనల నడుమ జైలు నుంచి ఆమెకు విముక్తి లభించింది. ఇక బెయిల్ మీద జైలు నుంచి బయటకు వచ్చాక.. తబర్ ఓ టీవీ ఛానెల్ ద్వారా తన అసలు రూపాన్ని ప్రపంచానికి చూపించింది. గతంలో ముఖానికి తాను కొన్ని సర్జరీలు చేయించుకున్న మాట నిజమేనని, అయితే.. వికృతంగా రూపం మాత్రం మారలేదని ఆమె వెల్లడించింది. సోషల్ మీడియాలో పేరుప్రఖ్యాతులు సంపాదించుకున్న ఫొటోల వెనుక.. ఫొటోషాప్ ఎడిటింగ్, కంప్యూటర్ ఎఫెక్ట్స్ ఉన్నాయని ఆమె తెలిపింది. ఇదిలా ఉంటే.. 2017లో సర్జరీలు వికటించడంతో దెయ్యంలా మారిందంటూ తబర్ గురించి కొన్ని కథనాలు వెలువడ్డాయి. ఆ తర్వాత ఆ ఫొటోలతోనే జాంబీ ఎంజెలీనా జోలిగా ఆమెకు సోషల్ మీడియాలో పేరు ముద్రపడిపోయింది. తబర్ అసలు పేరు ఫతేమెహ్ కిష్వంద్. సుమారు 50 సర్జరీలు చేయించుకున్నట్లు.. అవి వికటించడంతో దెయ్యంలా మారినట్లు అబద్ధం చెప్పింది. ఒక హీరోయిన్గా కంటే.. ఇలా సర్జరీలు వికటించిన బాధితురాలిగా పేరు ఎక్కువే దక్కించుకోవచ్చన్న ఆలోచన కొంతమేర వర్కవుట్ అయినా.. ఆపై బెడిసి కొట్టి జైలుకు వెళ్లాల్సి వచ్చింది. -
తన మనసు నిండా విషమే: ఏంజెలీనాపై మాజీ భర్త సంచలన కామెంట్స్
మాజీ భార్య ఏంజెలీనా జోలీపై హాలీవుడ్ స్టార్ హీరో బ్రాడ్ పిట్ సంచలన ఆరోపణలు చేశాడు. దంపతులుగా ఉన్నప్పుడు వీరిద్దరు కలిసి చేసిన వైన్ వ్యాపారాన్ని ఆమె నాశనం చేసి తనకు హానీ తలపెట్టే ప్రయత్నం చేస్తోందంటూ ఏంజెలీనాపై కోర్డులో పిటిషన్ దాఖలు చేశాడు. ఈ వ్యాపార సామ్రాజ్యంలో ఏంజెలీనా వాటా అమ్మకానికి సంబంధించి ప్రస్తుతం ఇద్దరి మధ్య నడుస్తున్న కేసులో భాగంగా బ్రాడ్ తాజాగా ఆరోపణలు చేశాడు. కాగా ఫ్రాన్స్ లోని దక్షిణ ప్రాంతంలో ఉన్న ఓ వైన్ యార్డ్‌తో పాటు షాటూ మిరావళ్ను 2008లో ఈ మాజీ దంపతులు కొనుగోలు చేశారు. చదవండి: భారీ భద్రత నడుమ హైదరాబాద్‌లో ల్యాండయిన సల్మాన్ 2014లో ఆ మిరావళ్ లోనే వాళ్లిద్దరూ పెళ్లి చేసుకున్నారు. అయితే, వివాహ బంధం నుంచి విడిపోయాక గత ఏడాది ఏంజెలీనా.. వ్యాపారంలోని తన వాటాను టెన్యూట్ డెల్ మోండో అనే సంస్థకు అమ్మేసింది. అయితే, దానిని బ్రాడ్ వ్యతిరేకించాడు. వ్యాపారాన్ని ఎవరికీ అమ్మబోమంటూ ఇద్దరం ఒప్పందం చేసుకున్నామని, కానీ, ఇప్పుడిలా అమ్మేయడం నమ్మకద్రోహమేనని పేర్కొంటూ కోర్టులో పిటిషన్ వేశాడు. ఈ నేపథ్యంలో తాజాగా ఆ కేసుకు సంబంధించి మరిన్ని సంచలన ఆరోపణలు చేశాడు బ్రాడ్. మిరావళ్ తన కలల ప్రాజెక్టు అని, దానిని సక్సెస్ చేయడంలో ఏంజెలీనా పాత్రంటూ ఏమీ లేదని పిటిషన్లో ఆరోపించాడు. ప్రస్తుతం తన వైన్ బిజినెస్ కొన్ని వందల కోట్లకు ఎదిగిందని, ప్రపంచంలోనే అత్యంత నాణ్యమైన రోజ్ వైన్ తయారీదారుల్లో తన సంస్థ స్థానం సంపాదించిందని చెప్పాడు. కేవలం తన కృషి వల్లే అది సాధ్యమైందని, ఏంజెలీనా పాత్ర ఏమీ లేదన్నాడు. అయితే, విడాకుల అనంతరం తనకు తెలియకుండానే తన వాటాను వేరే సంస్థకు అమ్ముకోవడం దారుణమని బ్రాడ్ తన పిటిషన్లో పేర్కొన్నాడు. చదవండి: ఇండియన్ రెస్టారెంట్లో జానీ డెప్ పార్టీ, రూ. 49 లక్షల బిల్లుతో షాకిచ్చాడు ఇక, ఏంజెలీనా జోలీ నుంచి వాటాను కొనుగోలు చేసిన టెన్యూట్ డెల్ మోండో సంస్థను రష్యాకు చెందిన యూరీ షెఫ్లర్ అనే వ్యాపారవేత్త పరోక్షంగా నడుపుతున్నాడని, ఇప్పుడు మిరావళ్ను చేజిక్కించుకునేందుకు రహస్య ఒప్పందం చేసుకున్నాడని ఆరోపించాడు. తెలియని కొత్త వ్యక్తితో తన వ్యాపార భాగస్వామిగా చేయాలని చూసిందన్నాడు. తన సంస్థ పేరు ప్రతిష్ఠలను మంటగలిపి తనకు హాని చేయాలని చూస్తోందని, తన మనసు నిండా విషమే ఉందని మాజీ భార్య ఏంజెలీనాపై బ్రాడ్ సంచలన కామెంట్స్ చేశాడు. -
వాళ్లింకా షాక్‌లో ఉన్నారు: ఉక్రెయిన్‌లో పర్యటించిన హీరోయిన్
ఒక్కసారి యుద్ధంలోకి దిగాక వెనక్కు తగ్గే ప్రసక్తే లేదన్నట్లుగా ఉంది రష్యా తీరు. నానాటికీ ప్రతికూల పరిణామాలే ఎదురవుతున్నా సరే యుద్ధాన్ని మాత్రం ముగించేందుకు సముఖత వ్యక్తం చేయడం లేదు. ఇక దాడులు, కాల్పులతో ఉక్రెయిన్ ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతుకుతున్నారు. ఈ క్రమంలో ఓ హాలీవుడ్ హీరోయిన్ ఏంజెలినా జోలి ఉక్రెయిన్‌లో అడుగుపెట్టింది. యుద్ధంలో అందరినీ కోల్పోయి నిరాశ్రయులుగా మిగిలిన చిన్నారులను పరామర్శించింది. ఐక్యరాజ్య సమితి శరణార్థుల ఏజెన్సీ ప్రత్యేక ప్రతినిధిగా ఆమె శనివారం లివివ్ సిటీలో పర్యటించింది. ఈ క్రమంలో రైల్వే స్టేషన్‌ను సందర్శించిన ఆమె అక్కడి వాలంటీర్లతో మాట్లాడింది. ఈ సందర్భంగా వాలంటీర్లు.. అక్కడ తలదాచుకుంటున్న పిల్లలంతా దాదాపు 2 నుంచి 10 ఏళ్లలోపే పిల్లలని చెప్పుకొచ్చారు. 'వాళ్లు ఇప్పటికీ షాక్‌లోనే ఉన్నారు.. ఈ యుద్ధ ప్రభావం పిల్లలను ఎంత ప్రభావితం చేస్తుందో నేను ఊహించగలను. వారికోసం నిలబడటం చాలా అవసరం' అని ఏంజెలినా జోలి చెప్పుకొచ్చింది. అనంతరం స్టేషన్‌లోని పిల్లలతో, వాలంటీర్లతో చిరునవ్వులు చిందిస్తూ ఫొటోలు దిగింది. కాగా ఈ యుద్ధం వల్ల గత రెండు నెలల్లో 12.7 మిలియన్ల మంది ప్రజలు(ఉక్రెయిన్ జనాభాలో 30% మంది) ఇల్లు విడిచి వెళ్లిపోయారు. ⚡️ Actress and filmmaker Angelina Jolie was spotted at a cafe in western Ukrainian city of Lviv on April 30. Jolie is a special envoy for the United Nations High Commissioner for Refugees. Video: Maya Pidhoretska via Facebook. pic.twitter.com/CBtR4HBMNR — The Kyiv Independent (@KyivIndependent) April 30, 2022 Angelina Jolie came to Lvov for some PR. For the sake of such a thing, they turned on an air raid alarm, and the actress hurried to the bomb shelter under the cameras. We remind you that there were no "arrivals" in Western Ukraine today. HAHAHA I CANT pic.twitter.com/AMGM47wPHF — Levi (@Levi_godman) April 30, 2022 చదవండి: 'మాయి' సిరీస్‌లో మూగ అమ్మాయిగా నటించిందెవరో తెలుసా? పక్కింట్లో టీవీ చూసే బుడ్డి సుమ సినిమాల్లోకి రావడం అదృష్టం -
అవెంజర్స్: ‘ఎటర్నెల్స్’ లో కీలక పాత్ర షోషిస్తున్న ఏంజెలీనా జోలీ
దీపావళీ కానుకగా నవంబర్ 4న డిస్నీ - మార్వెల్ లేటెస్ట్ సూపర్ హీరో మూవీ ఎటర్నెల్స్ విడుదల కానుంది. ఎవెంజర్స్ సిరీస్ ఎండ్ అవ్వడంతో హాలీవుడ్ మూవీ లవర్స్ ని ఎంటర్ టైన్ చేయడానికి మార్వెల్ వారు ఎటర్నెల్స్ అనే కొత్త సూపర్ హీరోల్ని సృష్టించారు, భారతదేశంలో ఉన్న అన్ని ముఖ్యమైన భాషల్లో ఈ చిత్రాన్ని ఇంగ్లీష్ తో పాటు ఒకేసారి విడుదల చేయనున్నారు. ఈ సినిమాలో హాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఏంజెలీనా జోలీ ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు. థేనా అనే సూపర్ వుమెన్ గెటెప్ లో ఏంజెలీనా తన ఫ్యాన్స్‌ని ఎంటర్టైన్ చేయబోతున్నారు. ఎవెంజర్స్కి మించిన పవర్స్‌తో ఎటర్నెల్స్లో సూపర్ హీరోలు అద్భుతమైన విన్యాసాలు చేయనున్నారు. అలానే ఈ సినిమాలో ఇండియన్ వెడ్డింగ్‌కి సంబంధించిన సన్నివేశాలు కూడా ఉన్నాయని డిస్నీ ఇండియా బృందం తెలిపింది. బిగ్ స్క్రీన్ పై ఎటర్నెల్స్ లో ఉన్న సూపర్ హీరోలు ప్రేక్షకులకి వీనుల విందు ఇవ్వనున్నట్లుగా మూవీ టీమ్ ప్రకటించింది. చదవండి: అవెంజర్స్ నటుడు క్రిస్ ఎవాన్స్‌తో పాప్ సింగర్ సెలెనా డేటింగ్? -
స్వీట్ మదర్&డాటర్ మూమెంట్స్
-
మాజీ భర్త చెంతకి ఎంజెలీనా జోలి.. విమర్శలు
న్యూయార్క్: హాలీవుడ్ నటి ఎంజెలీనా జోలి తీరుపై ఆమె అభిమానులే మండిపడుతున్నారు ఇప్పుడు. పిల్లల సంరక్షణ విషయంపై ఆమె భర్త బ్రాడ్ పిట్‌కి అనుకూలంగా ఈ మధ్య కోర్టు తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే ఆ ఉత్తర్వులు పట్టించుకోకుండా ఆమె పిల్లల్ని తీసుకుని న్యూయార్క్‌కు చెక్కేసింది. ఈ తరుణంలో బ్రాడ్ పిట్ తరుపు న్యాయవాది మరోసారి కోర్టును ఆశ్రయించాలని ప్రయత్నిస్తున్నాడు. అయితే మొదటి నుంచి జోలి తన భర్త బ్రాడ్‌పిట్ పట్ల కర్కశంగా ప్రవర్తిస్తూ వస్తోంది. మీడియా మీట్లలో బ్రాడ్ పిట్ పట్ల నిర్లక్క్ష్య వైఖరి, విడాకుల పిటిషన్ వంకతో 9మిలియన్ డాలర్ల భరణం తీసుకోవడం, తాజాగా పిల్లల కస్టడీకి సంబంధించి డ్రామాతో ఆమె అభిమానులు విసిగిపోయారు. ఈ క్రమంలో బ్రాడ్ పిట్‌కు మద్ధతు పెరుగుతోంది. బర్త్ డే పార్టీ పేరుతో తండ్రికి పిల్లల్ని దూరంగా తీసుకెళ్లిన జోలిపై హాలీవుడ్ మీడియా వెబ్ సైట్లతో పాటు ఫ్యాన్స్ మండిపడుతున్నారు. మాజీ భర్త చెంతకి.. ఇదిలా ఉంటే ఈ వ్యవహారంలోనే కొత్త ట్విస్ట్ వెలుగు చూసింది. ఎంజెలీనా మాజీ భర్త జానీ లీ మిల్లర్(48)కు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తోందన్న కథనాలు వెలువడుతున్నాయి. బ్రిటిష్-అమెరికన్ యాక్టర్ జానీ లీ ప్రస్తుతం న్యూయార్క్‌లోని ఓ అపార్ట్మెంట్లో ఉంటున్నాడు. శుక్రవారం ఆ అపార్ట్‌మెంట్‌కు వెళ్లిన జోలి.. చాలాసేపు అక్కడే గడిపింది. దీంతో వీళ్లిద్దరూ మళ్లీ ఒక్కటి కాబోతున్నారనే వార్తలు వెలువడుతున్నాయి. అయితే ఈ చేష్టలు పిట్‌ను రెచ్చగొట్టడానికేనేమోనని హాలీవుడ్ వర్గాల కథనం. కాగా, ఎంజెలీనా, జానీ ఇద్దరూ 1996 మార్చ్‌లో పెళ్లి చేసుకుని.. 18 నెలల తర్వాత విడిపోయారు. అయితే విడాకులు మాత్రం 1999లో తీసుకున్నారు. ఆ తర్వాత 2000 సంవత్సరంలో అమెరికన్ యాక్టర్ బిల్లీ బాబ్ను రెండో పెళ్లి చేసుకుని.. మూడేళ్ల తర్వాత విడాకులు తీసుకుంది. ఇక ముచ్చటగా లాంగ్‌రిలేషన్ తర్వాత బ్రాడ్ పిట్‌ను 2014లో పెళ్లి చేసుకుని.. 2019లో విడాకులు కోరుతూ కోర్టును ఆశ్రయించింది ఎంజెలీనా జోలి. చదవండి: బ్రాంజెలీనా విడిపోవడానికి కారణాలివే.. -
ఒంటిపై తేనెటీగలతో హీరోయిన్ ఫోటో షూట్.. వీడియో వైరల్
Angelina Jolie: హీరోయిన్లు ఫోటో షూట్లో పాల్గొనడం సర్వసాధారణం. అందుకోసం గ్లామర్ షో చేయడం కూడా కొత్తేమి కాదు. పోటీ ప్రపంచంలో తోటి హీరోయిన్లను తట్టుకొని సీనీ ఇంటస్ట్రీలో ముందుకు సాగాలంటే అప్పుడప్పుడు వెరైటీ ఫోటో షూట్లు చేయడం తప్పనిసరి. అందుకే నేటితరం నటీమణులు ఫోటో షూట్లపై ప్రత్యేక శ్రద్ద పెట్టారు. ట్రెండ్‌కి తగ్గటు డ్రెస్సింగ్ స్టైల్‌ని మారుస్తూ హాట్ హాట్ ఫోటోలతో కుర్రకారు మతులు పోగొడుతూ.. సినీ అవకాశాలు చేజిక్కుంచుకుంటున్నారు. అయితే తాజాగా ఓ హీరోయిన్ చేసిన ఫోటో షూట్ చూసి నెటిజన్లు ముక్కున వేలేసుకుంటున్నారు. ఫోటో షూట్ ఇలా కూడా చేస్తారా అని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. హాలీవుడ్ నటి నటి ఏంజెలీనా జోలి ఒంటి నిండా తేనెటీగలతో ఫోటో షూట్లో పాల్గొంది. దాదాపు 18 నిమిషాల పాటు తేనెటీగలను తన శరీరంపై ఉంచుకుంది. ఆ ఫోటోలు, వీడియోలు చూసిన నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఆమె చేసిన ఈ సాహసం గురించి పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. ఇంతకీ ఇదెలా సాధ్యమైంది? అవి కుడితే ఆమె పరిస్థితి ఎలా ఉండేదని చాలా మంది చర్చించుకుంటున్నారు. ఈ సందేహాలపై ఫోటోగ్రాఫర్ బీకీపర్స్ డాన్ వింటర్స్ క్లారిటీ ఇచ్చాడు. తేనెటీగలు కుట్టకుండా.. నిదానంగా ఉండటానికి తగిన జాగ్రత్తలు తీసుకున్నామని చెప్పారు. నేషనల్ జియోగ్రాఫిక్ చానెల్ సహకారంతో ఈ ఫోటో షూట్ చేశామని తెలిపారు. ఈ షూట్ కోసం ఇటాలియన్ తేనెటీగలను ఉపయోగించారని.. అలాగే సెట్లో ఉన్న సిబ్బంది రక్షణ కోట్స్ ధరించారని.. కేవలం ఏంజెలీనాకు మాత్రమే సూట్ వేయలేదని చెప్పారు. అలాగే తేనెటీగలు కుట్టకుండా ఉండటానికి సెట్ లో నిశ్శబ్ధం.. చీకటిగా ఉండేలా ఏర్పాట్లు చేశారని తెలిపారు. ‘ఈ ఫోటో షూట్ కోసం.. కీటక శాస్త్రవేత్త అయిన అవెడాన్ నుంచి అనుమతి తెచ్చుకున్నాము. ఏంజెలీనా దీని కోసం చాలా రిస్క్ చేసింది’ అంటూ డాన్ వింటర్స్ చెప్పుకొచ్చాడు. View this post on Instagram A post shared by Dan Winters (@danwintersphoto) -
నా భర్త వేధించాడు, పిల్లలే సాక్ష్యం: ప్రముఖ నటి
లాస్ఎంజిల్స్: ప్రముఖ హాలీవుడ్ నటి ఏంజెలినా జోలి తన భర్త బ్రాడ్ పిట్ నుంచి విడాకులు కోరుతూ 2016 కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం వీరి విడాకుల కేసుపై కోర్టులో విచారణ జరుగుతునే ఉంది. ఈ నేపథ్యంలో తాజాగా ఎంజెలినా కోర్టులో భర్త పిట్‌పై గృహ హింస కేసు పెడుతూ పిటిషన్ దాఖలు చేసింది. పిట్ తనను వేధించాడని చెప్పేందుకు ఆధారాలు ఉన్నాయని, తన పిల్లలే ఇందుకు సాక్ష్యం అని ఆమె పేర్కొంది. వారు కోర్టుకు వచ్చి సాక్ష్యం ఇచ్చేందుకు కూడా సిద్దంగా ఉన్నారని ఆమె పటిషన్లో స్పష్టం చేసింది. కాగా 2004లో వచ్చిన ‘మిస్టర్ అండ్ మెసెస్ స్మిత్’ మూవీ సమయంలో ఎంజెలినా-బ్రాడ్ పట్లు ప్రేమలో పడ్డారు. పదేళ్ల సహజీవనం అనంతరం వీరిద్దరూ 2014లో వివాహం చేసుకున్నారు. అయితే పెళ్లైయిన రెండేళ్లకే విడిపోయిన బ్రాడ్, ఎంజెలినాలు అప్పటి నుంచి కోర్టు వేదికగా కొట్లాడుకుంటున్నారు. ఇప్పటికి వీరికి విడాకులు రాలేదు. కానీ 2019లో నుంచి వీరిద్దరూ విడిగానే జీవిస్తున్నారు. అయితే వారి ఆరుగురి పిల్లల బాధ్యతను జాయింట్ కస్టడిలో ఉంచాలని వీరిద్దరూ డిమాండ్ చేస్తున్నారు. చదవండి: ఏంజెలినా విడాకుల కేసు: ఆ లాయర్‌ను తొలగించండి రంగ్‌దే ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంతో తెలుసా! -
నటీమనీ
స్టార్స్‌ని సినిమాలోకి తీసుకుంటే, ప్రేక్షకుల్ని వాళ్లు థియేటర్‌కి రప్పించగలుగుతారు అంటారు. సార్ట్స్ చిన్నితెరపై దర్శనమిచ్చినా ప్రేక్షకులకు పండగే. స్టార్స్ క్రేజ్ అలాంటిది. ఆ క్రేజ్, వాళ్ల సంపాదన ఎప్పుడూ ఆశ్చర్యపరిచే టాపిక్కే. ప్రతి ఏడాది ఎవరెంత సంపాదిస్తున్నారు అని ఓ జాబితాను విడుదల చేస్తుంది ఫోర్బ్స్ మ్యాగజీన్. ఈ ఏడాది హాలీవుడ్ హీరోయిన్లు సంపాదన గురించి ఈ పత్రిక ఒక జాబితా విడుదల చేసింది. మరి.. ఏయే నటీమణి ఎంత ‘మనీ’ సంపాదిస్తున్నారో చూద్దాం. ‘మోడ్రన్ ఫ్యామిలీ’ టీవీ సిరీస్ స్టార్ సోఫియా వెర్గారా అత్యధికంగా సంపాదిస్తున్న నటీమణుల్లో మొదటి వరుసలో ఉన్నారు. 43 మిలియన్ డాలర్స్ ఆర్జిస్తూ ఆమె మొదటి వరుసలో ఉన్నారు. 43 మిలియన్లు అంటే మన కరెన్సీలో సుమారు 315 కోట్లు. ఆమె తర్వాతి స్థానంలో ఏంజెలినా జోలీ ఉన్నారు. సుమారు 35.5 మిలియన్లు (దాదాపు 256 కోట్లు) సంపాదిస్తున్నారు జోలీ. మూడో స్థానాన్ని గాల్ గాడోట్ సంపాదించారు. ఆమె సంపాదన 31 మిలియన్లు. ఆ తర్వాత మెలిసా మెకార్తీ (25 మిలియన్ డాలర్లు), మెరిల్ స్ట్రీప్స్ ( 24 మిలియన్ డాలర్లు), ఎమీలా బ్లంట్ (22.5 మిలియన్ డాలర్లు), నికోల్ కిడ్మన్ (22 మిలియన్ డాలర్లు), ఎలెన్ పోంపీ (19 మిలియన్ డాలర్లు), ఎలిజిబెత్ మోస్ (16 మిలియన్ డాలర్లు), వోయిలా డేవిస్ (15.5 మిలియన్ డాలర్లు)తో టాప్ టెన్‌లో ఉన్నారు. సాధారణంగా సినిమాల ద్వారా ఎక్కువ ఆర్జించడం చూస్తుంటాం. కానీ ఈ ఏడాది టాప్‌లో ఉన్న సోఫియా వెర్గారా సంపాదన భారీగా ఉండటానికి కారణం ప్రధానంగా రెండు పాపులర్ టీవీ షోలు కావడం విశేషం. మార్వెల్ నిర్మాణ సంస్థ తెరకెక్కిస్తున్న ‘ది ఎటర్నల్స్’ కోసం భారీ పారితోషికం అందుకున్నారు ఏంజెలినా జోలీ. ఆమె ఆదాయంలో ఎక్కువ శాతం ఈ సినిమా నుంచే వచ్చిందని టాక్. సాధారణంగా ప్రతీ ఏడాది సినిమాలు ఎక్కువ చేసే స్టార్స్ అత్యధికంగా సంపాదిస్తున్నవారి జాబితాలో కనిపిస్తారు. కానీ ఈ ఏడాది టీవీ స్టార్స్ కూడా ఈ జాబితాలో కనిపించడం విశేషం. ఎలెన్ పోంపీ, ఎలిజిబెత్ మోస్, వోయిలా డేవిస్ టీవీ స్టార్సే. సినిమా విడుదలలు ఏమీ లేకపోవడం, కొత్త సినిమా ప్రాజెక్ట్స్ ప్రకటించకపోవడం వల్ల చిన్నితెర స్టార్స్ సంపాదన పెరిగిందని హాలీవుడ్ మీడియా పేర్కొంది. -
ఈ కేసు విచారణకు అతడు అనర్హుడు: ఏంజెలినా
లాస్ ఏంజిల్స్: తన విడాకుల కేసును పర్యవేక్షిస్తున్న మాజీ భర్త బ్రాడ్ పిట్ ప్రైవేటు న్యాయవాది జాన్ డబ్ల్యూ అవుడర్కిర్క్ను ఈ కేసు నుంచి తొలగించాలని హాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఏంజెలినా జోలి కోర్టును కోరారు. ఏంజెలినా తన భర్త బ్రాడ్ పిట్ నుంచి విడాకులు కోరుతూ 2016లో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. తన మాజీ భర్త వ్యాపార సంబంధాల గురించిన సమాచారం ఇవ్వడంలో జాన్ విఫమలమయ్యాడని, తన న్యాయవాదులకు సహకరించడం లేనందున అతడు ఈ కేసు విచారణకు అనర్హుడని ఏంజెలినా కోర్టుకు తెలిపారు. (చదవండి: మాజీ భర్త సినిమాకు నో చెప్పిన హీరోయిన్) లాస్ ఏంజిల్స్ సుపీరియర్ కోర్టులో 2016లో తాను దాఖలు చేసిన పిటిషన్‌ను వెనక్కి తీసుకోవాలని మొదట్లో జాన్ వాదించాడని ఏంజెలినా తెలిపారు. ఎందుకంటే జాన్ ఇతర కేసులతో నటులు అన్నే సి కిలేతో సంబంధం ఉందని, ఆ కేసులు తన నుంచి వెళ్లిపోతాయని భయపడినట్లు ఆమె ఆరోపించారు. తమ విడాకుల కేసుల విచారణ సమయంలో ఆర్థిక ప్రయోజనాల కోసం ప్రత్యర్థి కేసు వ్యతిరేకతపై తన నియమాకాన్ని(ఫీజులు స్వీకరించే సామర్థ్యాన్ని) ఉన్నత స్థాయిలో కూడా విస్తరించాలని జాన్ చూసినట్లు ఆమె చెప్పారు. -
పిల్లలు పస్తులు ఉండకూడదు
కోవిడ్ 19 (కరోనా వైరస్) కారణంగా ప్రపంచవ్యాప్తంగా పాఠశాలలు మూతపడ్డాయి. కొన్ని ప్రభుత్వ విద్యాలయాల్లో పిల్లలకు ఉచిత భోజన సౌకర్యం ఉంటుంది. ఇప్పుడు పాఠశాలలు మూతబడడంతో పేద కుటుంబాలకు చెందిన పిల్లలకు సరైన ఆహారం అందే పరిస్థితి లేదు. అందుకే ప్రముఖ హాలీవుడ్ నటి ఏంజెలినా జోలీ ‘నో కిడ్ హంగ్రీ’ అనే సేవా సంస్థకు దాదాపు 7 కోట్లకు పైగా విరాళంగా ప్రకటించారు. ‘‘కరోనా వైరస్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది పిల్లలు స్కూల్‌కు వెళ్లలేకపోతున్నారు. చాలామంది పిల్లలకు స్కూల్ టైమింగ్స్‌లో పౌష్టికాహారం అందుతుంది. అమెరికాలోనే అలాంటి వారు 22 మిలియన్లు ఉన్నారు. అందుకే నా వంతుగా విరాళం ఇస్తున్నా. పిల్లలు పస్తులుండకూడదు’’ అని పేర్కొన్నారు ఏంజెలినా. -
హీరోయిన్ ఫోటో షేర్ చేసి బుక్కయింది..
టెహ్రాన్ : ఈ మధ్య ఫోటోలనూ మార్ఫింగ్ చేసి సోషల్‌మీడియాలో షేర్ చేయడం వైరల్‌గా మారింది. తాజాగా ఇరాన్‌కు చెందిన సహార్ తబర్ అనే మహిళ ఏకంగా కాస్మొటిక్ సర్జరీ ద్వారా హాలీవుడ్ నటి ఎంజెలీనా జోలీని పోలిన విధంగా తన ముఖాన్ని మార్చుకున్నారు. అంతేగాక ఆ ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసి కటకటాలపాలయ్యారు. ఈ ఘటన ఇరాన్ దేశంలోని టెహ్రాన్ నగరంలో చోటు చేసుకుంది. సాంస్కృతిక, సామాజిక, నైతిక విలువలకు భంగం కలిగించిదన్న ఆరోపణలపై సహార్ తబర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు ఇరాన్ వార్తా సంస్థ వెల్లడించింది. అంతేగాక తప్పుడు దారిలో ఆదాయ మార్గాన్ని ఏంచుకొన్నందుకు, హింసను ప్రోత్సహిస్తున్నందుకు గానూ ఇరాన్ సైబర్‌క్రైమ్ ఆమె మీద కేసులు నమోదుచేసినట్లు పేర్కొంది. సహర్ తబర్ గతేడాది వరుస ప్లాస్టిక్ సర్జరీ ద్వారా మార్చుకున్న ముఖ చిత్రాలను వరుసగా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసి బాగా పాపులర్ అయ్యారు. తాజాగా కాస్మెటిక్ సర్జరీ ద్వారా ఆమె తన ముఖాన్ని ఎంజెలినా జోలి స్పూకీ వెర్షన్‌గా మార్చుకొని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసినట్లు తెలిసింది. కాగా, ఇరాన్లో ఒక్క ఇన్స్టాగ్రామ్ తప్ప మిగతా సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ అయిన ఫేస్బుక్, ట్విటర్లను నిషేదించడం విశేషం. -
విడాకులపై స్పందించిన ప్రముఖ నటి
హాలీవుడ్‌లోనే అత్యంత బలమైన అనుబంధమున్న జంటగా గుర్తింపు పొందిన బ్రాడ్ పిట్, ఏంజెలినా జోలీలు తమ వైవాహిక జీవితానికి స్వస్థి పలికిన సంగతి తెలిసిందే. దాదాపు పదేళ్ల పాటు సహజీవనం చేసిన ఈ జంట.. 2014లో వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ఆ తర్వాత వారి మధ్య విబేధాలు పొడ చూపడంతో.. 2016లో వివాహబంధానికి ముగింపు పలికారు. ఈ నేపథ్యంలో తాజాగా ఏంజెలినా జోలీ విడాకుల వల్ల తాను ఎంత ఒత్తిడికి గురయ్యారో వెల్లడించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘బ్రాడ్ పిట్ నుంచి విడాకులు పొందిన తర్వాత నేను చాలా తీవ్ర దుఖాన్ని అనుభవించాను. నా తలరాతలో ఏం రాసిపెట్టి ఉందో నాకు తెలియదు కానీ.. నేను పరివర్తన కాలంలో ఉన్నట్లు మాత్రం నాకు అర్థం అయ్యింది. మనిషి తన మూలాలను వెతుక్కుంటు వెళ్లినట్లు నేను.. నా అంతరంగం లోనికి ప్రయాణించడం ప్రారంభించాను’ అన్నారు జోలీ. అంతేకాక ‘పిట్తో నా బంధం ముగింపుకు వచ్చిందని నాకు అర్థం అయ్యింది. ఆ సమయంలో నాలో కొంత భాగాన్ని కోల్పోయినట్లు నాకు అనిపించింది. ఆ క్షణం నుంచి మేం విడిపోవడం ప్రారంభించాము. అది నాకు చాలా క్లిష్టమైన సమయం. జీవితంలో నేను ఎక్కడ ఉన్నది నాకు తెలియలేదు. ఆ సమయంలో నేను చాలా తీవ్రమైన, నిజమైన బాధను అనుభవించాను. అయితే ఈ బాధ నాకు చాలా మేలు చేసింది. ప్రతి మనిషి జీవితం ముగింపుకు వచ్చే సరికే మిగిలేది వినయం మాత్రమే అని తెలిసివచ్చింది. అదే నన్ను, నా జీవితంతో మళ్లీ ముడివేసింది’ అని తెలిపారు. ప్రస్తుతం జోలీ, డిస్నీ సంస్థ నిర్మిస్తున్న ‘మేలిఫిసెంట్: మిస్ట్రెస్ ఆఫ్ ఈవిల్’ అనే చిత్రంలో నటిస్తున్నారు. 2014లో వచ్చిన ‘మేలిఫిసెంట్’ సినిమాకు సీక్వెల్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రం ఈ నెల 18న ఇండియాలో విడుదల కానుంది. -
మాజీ భార్య ఆరోపణలపై హీరో ఆవేదన
హాలీవుడ్లో లాంగ్ రిలేషన్షిప్ కొనసాగించిన జంట ‘బ్రాంజెలీనా’(బ్రాడ్ పిట్+ఏంజెలినా జోలీ).. అనూహ్య కారణాలతో విడిపోయిన విషయం విదితమే. ఆ కారణాల వెనుక రకరకాల ఊహాగానాలు వినిపించినప్పటికీ.. అసలు కారణంపై మాత్రం ఇద్దరిలో ఎవరూ స్పష్టత ఇవ్వలేదు. ఇదిలా ఉంటే పిల్లల పోషణార్థం బ్రాడ్ పిట్ తమకు ఇంత వరకు నయా పైసా చెల్లించలేదని ఏంజెలీనా జోలీ ఓ పిటిషన్ దాఖలు చేయగా.. బ్రాడ్ పిట్ స్పందించాడు. ‘ఆమె చేసే ఆరోపణల్లో నిజం కాదు. విడాకుల పిటిషన్ సమయంలోనే ఆమె 9 మిలియన్ డాలర్ల దాకా భరణం చెల్లించాను. కేవలం నాపేరును చెడగొట్టేందుకే ఇప్పుడు ఈ ఆరోపణలు. మీడియా దృష్టిని తనవైపు తిప్పుకునేందుకే ఆమె ఇలా చేస్తోంది ’ అని బ్రాడ్ పిట్ తన లాయర్ ద్వారా ఓ ప్రకటన ఇప్పించాడు. ఇదిలా ఉంటే పిట్ ప్రకటనపై ఏంజెలీనా ఇంకా స్పందించలేదు. మిస్టర్ అండ్ మిస్ స్మిత్ చిత్ర షూటింగ్లో మొదలైన వీళ్ల ప్రేమ.. 9 ఏళ్లపాటు సహజీవనంగానే సాగింది. 2014లో వీళ్లు వివాహం తీసుకోగా.. రెండేళ్ల తర్వాత(2016లో) విడిపోతున్నట్లు ప్రకటించారు. ఈ జంటకు మొత్తం ఆరుగురు పిల్లలు(దత్తత) ఉండగా.. ప్రస్తుతం వాళ్లంతా తల్లి సంరక్షణలోనే ఉన్నారు. ఇదిలా ఉంటే పిల్లలను జాయింట్ కేరింగ్‌కు అప్పగించాలని ‘పిట్’ ఓ పిటిషన్ కూడా దాఖలు చేయటం గమనార్హం. కొడుకు వయసున్న అమ్మాయితో... -
ప్రేమా? రుగ్మతా?
హాలీవుడ్ నటి ఏంజెలినా జోలీకి ఆరుగురు పిల్లలున్నారు. అందులో ముగ్గురు దత్త పుత్రులు కాగా మరో ముగ్గురు బ్రాడ్ పిట్, ఏంజెలినా దంపతులకు జన్మించినవారు. ఇప్పుడు మరో బాబు లేదా పాపను దత్తత తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నారట ఏంజెలినా. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఏంజెలినాకు పిల్లలంటే ఎంత ఇష్టమో. బ్రాడ్‌పిట్‌తో విడాకుల తర్వాత పిల్లల సంరక్షణ, తండ్రితో ఎక్కువ సమయం గడపనివ్వడం లేదని కేస్ విషయమై ప్రస్తుతం ఈ మాజీ భార్యా భర్తలు కోర్ట్ చుట్టూ తిరుగుతున్నారు. ఏంజెలినా నటించిన తాజా చిత్రం ‘మాలిఫిసెంట్ 2’. ఈ సినిమా ప్రమోషన్స్ తర్వాత దత్తత తీసుకోవాలనుకుంటున్నారట. ఏంజెలినాకు పిల్లలంటే భలే ఇష్టమని కొందరు, ‘ఎమ్టీనెస్ట్ సిండ్రోమ్’తో (జీవితంలో ఏదో వెలితి ఉందనే రుగ్మత) బాధపడటం వల్లే ఇలా చేస్తున్నారని మరికొందరు భావిస్తున్నారు. పిల్లలు పెద్ద వాళ్లు అవ్వడంతో తన అవసరం ఇంక ఉండకపోవచ్చని భావించడం ఆ సిండ్రోమ్ లక్షణాలట. మరి ఏంజెలినాది ప్రేమా? సిండ్రోమా? ఏదైతేనేం.. ఆమె దత్తత తీసుకునే బిడ్డ లక్కీ అని చెప్పాలి. మంచి జీవితం దొరుకుతుంది కదా. అన్నట్లు.. ఏంజెలినా తన కడుపున పుట్టిన బిడ్డలకు సమానంగా దత్తత తీసుకున్నవారిని కూడా చూస్తారట. కంటేనే అమ్మ అని అంటే.. ఎలా? కడుపు తీపి తెలిసిన ప్రతి తల్లీ తల్లే అనాలి. ఏంజెలినా.. ఓ మంచి మదర్ అని హాలీవుడ్ వారు అంటారు. -
హాలీవుడ్ నిర్మాత వీన్‌స్టీన్ అరెస్ట్
న్యూయార్క్: లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న హాలీవుడ్ నిర్మాత హార్వీ వీన్‌స్టీన్‌ను న్యూయార్క్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఓ మహిళను రేప్ చేయడంతో పాటు మరో మహిళపై లైంగికదాడికి యత్నించినట్లు కేసులు నమోదయ్యాయి. వీన్‌స్టీన్ తమను రేప్ చేశాడని, లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఏంజెలినా జోలీ, సల్మా హయక్సహా 80 మందికిపైగా హాలీవుడ్ నటీమణులు ఆరోపించారు. ఈ నేపథ్యంలోనే శుక్రవారం లోయర్ మాన్‌హట్టన్‌లోని పోలీస్‌స్టేషన్‌కు చేరుకున్న వీన్‌స్టీన్.. అధికారులకు సరెండర్ అయ్యాడు. తర్వాత ఆయన్ను కోర్టులో హాజరుపరచగా రూ.6.7కోట్ల పూచీకత్తుతో కోర్టు ఆయనకు బెయిలు ఇచ్చింది. -
చచ్చినా మళ్లీ ప్రేమలో పడను!
ఏంజెలినా జోలికి ఇప్పుడు 42 ఏళ్లు. రెండు దశాబ్దాల క్రితం హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చినప్పుడు ఎంత ఎనర్జిటిక్‌గా నటించిందో ఇప్పటికీ అదే ఎనర్జీ. ఇప్పుడింక ఆమెకు ఆరుగురు పిల్లలు. భర్తతో విడిపోయి, ఆ పిల్లలందరినీ తనే పెంచుతోంది. అయినా తనపై ఉన్న ఒత్తిడి సినిమాల్లో కనిపించనివ్వదు. అదెలా సాధ్యమని అడిగితే నవ్వి ఊరుకుంటుంది కానీ, పెద్ద సంఘర్షణే జరుగుతూ ఉండాలి ఆమెలో, ప్రతిరోజూ. అందుకేనేమో భర్త బ్రాడ్‌పిట్‌తో 2016లో విడిపోయాక పిల్లలే ప్రాణంగా గడిపేస్తోన్న ఏంజెలినా, మళ్లీ ప్రేమలో పడతారా? అని అడిగితే, అలాంటివి అస్సలు చెయ్యను. ‘‘మళ్లీ చచ్చినా ప్రేమలో పడను’’ అని చెప్పేస్తోంది. ఎందుకు? అని అడిగితే పిల్లలకు తన అవసరం ఉందని, వాళ్లను పెంచాల్సిన బాధ్యత తనపై ఉందని చెబుతోంది. మరోపక్క ఆమె భర్త బ్రాడ్‌పిట్ మాత్రం ఏంజెలినాతో విడిపోయాక వరుసగా ప్రేమలో పడిపోతూనే ఉన్నాడు. అయితే అవేవీ సీరియస్ ప్రేమలు కావట. ఏంజెలినా మాత్రం అదెలాంటి ప్రేమైనా ఆ జోలికి మాత్రం పోనని గట్టిగా చెప్పేస్తోంది. -
ఏంజెలినా దగ్గర డబ్బుల్లేవా?
ఏంజెలినా జోలి.. హాలీవుడ్లో స్టార్లకే స్టార్, సూపర్‌స్టార్! ఆరుగురు పిల్లలకు తల్లి. బ్రాడ్‌పిట్‌కు విడాకులిచ్చి, సంవత్సర కాలంగా పిల్లలను తానే పెంచుతోన్న ఏంజెలినా, క్రిస్మస్ కోసం పెద్ద ఎత్తునే ఏర్పాట్లు చేసుకుంటోంది. పిల్లలందరికీ బెస్ట్ టైమ్ క్రిస్మస్ కావడంతో వాళ్లను సంతోషపెట్టేందుకు అన్ని విధాలా ప్రయత్నిస్తోందట. అయితే ఇంతవరకూ బాగానే ఉంది కానీ, ఇలా పిల్లలకు క్రిస్మస్ గిఫ్ట్‌లు ఇవ్వాలన్న ప్రయత్నంలో ఏంజెలినా జోలి డబ్బుల్లేక బాధపడుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. మిలియన్ల డాలర్ల డబ్బులున్న ఏంజెలినా పిల్లలకు గిఫ్ట్‌లు కొనడానికి డబ్బుల్లేక బాధపడుతుందా? అని ఎవరన్నా అంటే.. అందుకు ఆమె ‘టార్గెట్’ స్టోర్‌లో కనిపించడాన్ని చూపిస్తూ తమ వాదనను సమర్థించుకుంటున్నారు కొందరు. అమెరికాలో డిస్కౌంట్లో బట్టలు అమ్మే పెద్ద స్టోర్ టార్గెట్. ఏంజెలినా దగ్గర డబ్బులే ఉంటే టార్గెట్‌లో, డిస్కౌంట్లో షాపింగ్ ఎందుకు చేయాలి? అన్న వాదనలు కొన్ని వచ్చాయి. ఇందులో నిజం లేదని ఇంకొందరు అంటారు. టార్గెట్ ఏంజెలినాకు ఫేవరెట్ ప్లేస్ అని, అలా అక్కడికి వెళ్లి ఉండొచ్చని వీరంటారు. కాదు.. కాదు బ్రాడ్‌పిట్‌తో ఆస్తి గొడవ ఇంకా తేలక ఏంజెలినా డబ్బుల్లేక కష్టాల్లో ఉన్నారని వారంటారు. ఎవరేమన్నా ఏంజెలినా దగ్గర డబ్బుల్లేవంటే ఎవ్వరూ నమ్మరని సగటు సినీ అభిమాని అంటాడు. చివరిదే నిజమై ఉండొచ్చు!! -
అలా మొదలైంది...
హాలీవుడ్‌కి బ్యూటీ క్వీన్ ఏంజెలీనా జోలీ. అందంలో ఆమె రాణీ అయితే అందమైన మనసుకు దేవత. అన్ని అందాలున్నా, సినిమాల్లోకి రావాలని ఏంజెలీనా ఎప్పుడూ అనుకోలేదు. కానీ విధి చక్రం తిప్పింది. క్యాన్సర్‌తో బాధపడుతున్న అమ్మ హాస్పిటల్ బిల్స్ ఎలా కట్టాలో తెలియని పరిస్థితుల్లో సినిమా ఇండస్ట్రీలోకొచ్చింది. అంటే ప్రేమించిన వాళ్లకోసం సినిమాల్లోకొచ్చింది. సినిమాని ప్రేమించి కాదు. ఇప్పటికీ తను అలాగే ఉంది. ఎవరికి ఏ కష్టం వచ్చినా, సాయం చేయడానికి ముందుం టుంది. ఏంజెలీనా తల్లిగారి పదవ వర్ధంతి దగ్గరలోనే ఉంది. ఆ విషయమై ఒక ప్రఖ్యాత టెలివిజన్ చానల్‌కి తనిచ్చిన ఇంటర్వ్యూలో తన హాలీవుడ్ ఎంట్రీ గురించి మొట్టమొదటిసారి చెప్పింది. తల్లి మార్షలీ ఒవేరియన్, బ్రెస్ట్ క్యాన్సర్‌తో చనిపోయారు. అమ్మకొచ్చిన క్యాన్సర్ తనకి కూడా వస్తుందని ఏంజెలీనా తన రొమ్ములు తీయించి, సిలికాన్ ఇంప్లాంట్స్ అమర్చుకుంది. -
అనుకోకుండా..
యాక్టింగ్ కెరీర్లో ఏంజెలినా జోలీ ఎంత సక్సెస్ అయ్యారో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. అంతేకాదు ఆస్కార్ అవార్డులను కూడా ఆమె గెల్చుకున్నారు. యాక్టింగ్‌లో ఇంత పాపులారిటీ సంపాదించుకున్న ఏంజెలినా యాక్టింగ్ ఫీల్డ్‌లోకి ఇష్టంతో రాలేదట. వచ్చిన తర్వాత నటనపై ఎక్కువ మక్కువ పెంచుకున్నారట. ఈ విషయాన్ని ఏంజెలీనానే వెల్లడించారు. ‘అనుకోకుండా యాక్టర్ అయ్యా. అమ్మ ఆర్థిక ఇబ్బందులను తగ్గించేందుకు వీలైనంత ఎక్కువగా కష్టపడాలని నిర్ణయించుకున్నా. కెరీర్‌ను స్టార్ట్ చేసిన కొత్తలో ఏదో జాబ్ చేస్తున్న ఫీలింగ్ మాత్రమే ఉండేది నాకు. కానీ యాక్టింగ్ ఫీల్డ్ డిఫరెంట్ అని తెలుసు. లైఫ్‌లో కొత్త కొత్త వ్యక్తులు పరిచయం అవుతారు. డిఫరెంట్ ప్లేసేస్కు వెళ్లాల్సి ఉంటుంది. ఇలాంటి అనుభవాల వల్ల కొత్త విషయాలను నేర్చుకొవచ్చు. లక్కీగా ఈ విషయాలన్నింటినీ నేను తొందరగానే తెలుసుకోగలిగాను. ఆ తర్వాత ఇదో అద్భుతమైన క్రియేటివ్ ఫీల్డ్ అని అర్థమైంది. మెల్లిగా స్కిల్స్‌ను డెవలప్ చేసుకున్నా. అంతేకాదు మానసికంగానూ పరిణితి చెందా ఇప్పుడు నటిగా నాకు ఎంతగానో ఆదరణ లభిస్తోంది. చాలా సంతోషంగా ఉంది’ అన్నారు ఏంజెలీనా. -
ఏదో సరదాకోసం అలా చేశా!
హీరోయిన్ మీద అభిమానంతో 50 సర్జరీలు చేయించుకుని.. దయ్యంలా మారిన యువతి గురించి మీకు తెలిసేఉంటుంది. ఏంజెలీనా జోలీ వీరాభిమానిగా చెప్పుకుంటూ.. అలా మారిపోయేందుకు 50 ప్లాస్టిక్ సర్జరీలు చేయించుకుని.. గుర్తుపట్టలేనంత మారిపోయిన ఇరాన్ యువతి.. సహర్ తబర్ నిజానికి ఎటువంటి సర్జరీలు చేయించుకోలేదట. మోడ్రన్ మేకప్‌తో పాటు.. ఫొటోషాప్ టెక్నాలజీతో సహర్ తబర్ ఫొటోలను అలా మార్చుకుని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసినట్లు తెలిసింది. సహర్ ఒక పత్రికతో పాట్లాడుతూ.. నాకు నిజంగానే ఏంజెలినీ జోలీ అంటే ఇష్టం. నేను ఆమెలా ఉంటాను.. అనే నమ్మకం నాకుంది. నేను ఆమెలా మారితో ఎలా ఉంటుందోనన్న ఆకాంక్షతో ఈ ప్రయోగం చేసినట్లు చెప్పింది. మరో విషయం ఏమిటంటే.. ఆ ఫొటో కోసం 40 కేజీల బరువు తగ్గినట్లు పేర్కొంది. బరువు తగ్గడం కోసం చాలా కష్టపడ్డట్లు తెలిపింది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆ ఫొటోను చూసి చాలామంది షాక్గురయ్యారని సహర్ తబర్ చెప్పింది. ‘నేను అందవికారంగా లేనని.. ఇదిగో ఇలా ఉన్నానంటూ’ ప్రస్తుత ఫొటో ఒకటి తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో మరోసారి పోస్ట్ చేసింది. ఇదిలా ఉండగా.. ఈ ఫొటో పోస్ట్ చేయడానికి ముందు.. సోషల్ మీడియాలో చాలా తక్కువగా ఫాలోవర్లు.. ఉండేవారు. ఇప్పుడు దాదాపు.. ఫాలోవర్ల సంఖ్య దాదాపు 8 లక్షలకు చేరింది. -
కల చెదిరింది.. దెయ్యంలా మారింది
సాక్షి, న్యూఢిల్లీ : అభిమానం తారా స్థాయికి చేరి ఓ యువతి చేసిన పని ఆమె ముఖాన్ని పూర్తిగా మార్చేసింది. తన ఫేవరెట్ హీరోయిన్లా మారిపోవాలని ఏకంగా 50 సర్జరీలు చేయించుకుంది. అవన్నీ వికటించటంతో ఇప్పుడు ఆమె ముఖం దారుణంగా మారిపోయింది. ఇరాన్‌కు చెందిన 19 ఏళ్ల సహర్ తబర్ హాలీవుడ్ నటి ఏంజెలీనా జోలీ వీరాభిమాని. స్వతహాగా అందగత్తె అయిన తబర్.. జోలీలా లేనని తరచూ నిరుత్సాహం చెందేది. ఈ క్రమంలో శస్త్రచికిత్సలు చేయించుకునేందుకు సిద్ధమైపోయింది. ముఖానికి మొత్తం 50 సర్జీలు చేయించుకుంది. అంతేకాదు డైటింగ్ చేసి 40 కేజీలకు బరువు మించకుండా చూసుకుంది. ఇప్పుడు ఆమె ముఖంగా దారుణంగా మారిపోయింది. అయినప్పటికీ తన ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన సహర్ కు ఇప్పుడు ఫ్యాన్ ఫాలోయింగ్ బాగా పెరిగిపోయింది. క్షణక్షణానికి ఆమెను అనుసరించేవారు పెరిగిపోతూ ప్రస్తుతానికి దాదాపు 4 లక్షలకు చేరుకుంది. అయితే వారిలో చాలా మంది పాపం ఆమెను ఎగతాళి చేస్తూ కామెంట్లు పెట్టడం విశేషం. నీ ముఖంపై ఎవరైనా బాంబు వేశారా? జాంబీ, నువ్వు చాలా భయంకరంగా ఉన్నావ్, సర్జరీ కంటే ముందు చాలా అందంగా ఉన్నావ్, నువ్వసలు మనిషివేనా? ఇలాంటి కామెంట్లు కనిపిస్తున్నాయి. مدرسه نابه..!😁❤️ A post shared by سحرتبر..!👾✌🏻 (@sahartabar_official) on Jun 7, 2017 at 2:14am PDT -
ఆమెతో డేటింగ్ చేస్తున్నాడు..!
హాలీవుడ్ నటుడు బ్రాడ్‌పిట్ మాజీ భార్య ఏంజెలినా జోలీకి దూరంగా ఉంటున్నాడు. జోలీతో విడాకులు అనంతరం ఆయన పలువురితో డేటింగ్ చేసినట్టు కథనాలు వచ్చాయి. హాలీవుడ్లో చక్కర్లు కొడుతున్న తాజా కథనం ప్రకారం బ్రాడ్.. ప్రముఖ నటి ఎల్లా పుర్నెల్తో ప్రేమలో మునిగిపోవాలని తపిస్తున్నాడట. అందుకు కారణం.. పుర్నెల్ అచ్చం ఏంజెలినా జోలీలాగే ఉండటమే.. 2014లో వచ్చిన 'మేల్‌ఫిసెంట్' సినిమాలో జోలీ చిన్నప్పటి పాత్రలో తను నటించింది. 21 ఏళ్ల ఎల్లా తాజాగా 'మిస్ పెరెగ్రిన్స్ హోమ్ ఫర్ పెక్యూలియర్ చిల్డ్రన్' సినిమాలో నటించింది. ఈ సినిమాలో ఆమె నటన చూసి ఉప్పొంగిపోయిన పిట్.. ఆమెతో కలిసి పనిచేసేందుకు సిద్ధం అంటూ ఆఫర్ ఇచ్చాడు. బ్రాడ్ సొంత ప్రొడక్షన్ ప్లాన్ బీ నిర్మించనున్న 'స్వీట్ బిట్టర్'లో ఈ ఇద్దరూ కలిసి పనిచేస్తున్నారు. అప్పటినుంచి 53 ఏళ్ల బ్రాడ్ పిట్-21 ఏళ్ల ఎల్లా మధ్య అనుబంధం చిగిరిస్తోందని హాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. 'బ్రాడ్, ఎల్లా మధ్య అనుబంధం ఇప్పుడిప్పుడే మొదలవుతున్నది. ఆమెను ఈ సినిమాలో తీసుకోవడానికి బ్రాడ్ ఎంతో దూరం వెళ్లాడు. తన పట్ల బ్రాడ్ చూపుతున్న అభిమానం, ప్రత్యేక ఆకర్షణ ఎల్లాను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. బ్రాడ్ ఎప్పుడు తన నంబర్ వన్ సెలబ్రిటీ క్రష్ అని ఎల్లా స్నేహితులతో చెప్తోంది' అని సన్నిహిత వర్గాలు తెలిపాయి. అయితే, బ్రాడ్-ఎల్లా సన్నిహితంగా ముందుకు సాగుతుండటం మాజీ భార్య ఏంజెలినాకు ఏమాత్రం నచ్చడం లేదట. ఓ సినిమాలో తన చిన్నప్పటి పాత్ర పోషించిన అమ్మాయితో బ్రాడ్ సాన్నిహిత్యం నెరపడంపై ఆమె మండిపడుతున్నారని సన్నిహిత వర్గాలు తెలిపాయి. తమ కొడుకు మడోక్స్(16)కు కేవలం ఐదేళ్లు ఎక్కువ వయస్సున్న అమ్మాయితో అతను డేటింగ్ చేస్తుండటం.. పెద్ద తప్పు అని, వయస్సు వ్యత్యాసాన్ని అతను గుర్తించాలని జోలీ ఘాటుగా పేర్కొన్నట్టు తెలిసింది. అయితే, ఇవేమీ పట్టించుకోని బ్రాడ్.. ఒకవైపు తన తాజా సైన్స్-ఫిక్షన్ సినిమా 'యాడ్ అస్త్ర'లో పనిచేస్తూనే.. మరోవైపు ఎల్లాతో చెట్టపట్టాలేసుకొని తిరుగుతున్నాడని, ఆమె కోసం చాలా టైమ్ కేటాయించి దగ్గరవుతున్నాడని, తమ అనుబంధాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని అతను భావిస్తున్నాడని సన్నిహిత వర్గాలు చెప్తున్నాయి. -
హాట్ కపుల్ మళ్లీ కలుస్తున్నారా?
బ్రేకప్‌లు, మళ్లీ రిలేషన్లు కామన్ అయిపోతున్న ఈరోజుల్లో హాలీవుడ్ హాట్ జంట బ్రాడ్ పిట్, ఏంజెలీనా జోలీ తమ 12 ఏళ్ల బంధాన్ని తెంచేసుకుంటున్నట్లు ప్రకటించి వార్తల్లో నిలిచారు. అయితే విడాకుల ప్రక్రియను నిలిపివేయాలని జోలీ కోరటంతో ఆమె మనసు మార్చుకుని భర్తతో జీవించేందుకు సిద్ధమైపోయిందా అన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ ఓ ప్రముఖ అమెరికన్ మ్యాగజైన్ కథనం ప్రచురించింది. బ్రాడ్ చేసిన తప్పులను క్షమించేసి తిరిగి అతనితో జీవించేందుకు ఇప్పటికే జోలీ రాయబారం మొదలు పెట్టిందని దాని సారాంశం. తమ ఆరుగురు పిల్లల సంరక్షణను బ్రాడ్ పట్టించుకోవట్లేదన్న కారణం చెప్పినప్పటికీ, మరో యువతితో 52 ఏళ్ల బ్రాడ్ మరో యువతితో అఫైర్ మూలంగానే విడాకులు దారితీసినట్లు హాలీవుడ్లో ఓ టాక్. బ్రాడ్‌తో విడిపోయాక వేరే ఇంటికి మకాం మార్చిన 42 ఏళ్ల జోలీ అతనిపై ప్రేమను చంపుకోలేక చెడు వ్యసనాలకు బానిసయ్యిందని, అంతేకాకుండా పిల్లల భవిష్యత్తు కోసమే తిరిగి భర్తకు చేరువయ్యేందుకు యత్నిస్తోందని, ఈ విషయాన్ని బంధువులు కూడా ధృవీకరించినట్లు ఆ కథనం చెబుతోంది. -
ఫాదర్స్ డే: వాళ్లకు మాత్రం 'మదర్స్ డే'!
లాస్ ఏంజెలిస్: భార్య ఏంజెలినా జోలీతో విడాకులు తీసుకున్న తర్వాత హాలీవుడ్ సూపర్ స్టార్ బ్రాడ్ పిట్ ఒంటరి వాడయ్యాడు. ఎంతలా చివరికి 'ఫాదర్స్ డే' రోజు కూడా తన పిల్లలకు చేరువ కానట్లుగా ఈ హీరో పరిస్థితి తయారైంది. గత ఆదివారం ఫాదర్స్ డే సందర్భంగా.. తమ తండ్రితో అనుబంధాన్ని సెలబ్రిటీలు, సామాన్యులు అనే తేడా లేకుండా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకున్నారు. నటి, బ్రాడ్ పిట్ మాజీ భార్య ఏంజెలినా జోలీ మాత్రం తన ఇష్ట రీతిన ప్రవర్తించింది. గతేడాది వీరి విడాకుల సమయంలో పిల్లల్ని ఆయన ఎప్పుడైనా కలుసుకునే హక్కు ఉందని చెప్పిన జోలి.. ఈ ఫాదర్స్ డే రోజు తన ఆరుగురు పిల్లలతో కలిసి సరదాగా టూర్‌కు వెళ్లింది. లాస్ ఏంజెలిస్ విమానాశ్రయంలో శనివారం రాత్రి తన పిల్లలు మాడెక్స్ జోలీ-పిట్(15), పాక్స్ థియన్ జోలీ-పిట్(13), జహారా మార్లే జోలీ-పిట్(12), షిలోహ్ జోలీ-పిట్(11), కవలలు కెనాక్స్ జోలీ-పిట్, వివీన్నె జోలీ-పిట్(8) లతో దర్శనమిచ్చింది ఏంజెలినా జోలీ. ఇటీవల కొనుగోలు చేసిన కొత్త ఇంట్లో ఉంటున్న జోలీ.. మాజీ భర్తకు పిల్లల్ని దూరం చేసిందన్న వదంతులు ప్రచారంలో ఉన్నాయి. ఈ క్రమంలో ఫాదర్స్ డే రోజు బ్రాడ్ పిట్‌ను తమ పిల్లలకు దూరంగా ఉంచడంలో భాగంగా టూర్ ప్లాన్ చేసింది. మీడియాతో మాట్లాడేందుకు కూడా ఆమె నిరాకరిస్తూ తన దారిన వెళ్లిపోయినట్లు సమాచారం. ప్రపంచ వ్యాప్తంగా 'ఫాదర్స్ డే' జరుపుకుంటుంటే.. బ్రాడ్ పిట్ కు అందుబాటులో లేని పిల్లలు తల్లి ఏంజెలినాతో కలిసి 'మదర్స్ డే' జరుపుకున్నారంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. మరోవైపు ఫాదర్స్ డే రోజు లాస్ ఫెలిజ్ లోని తన పాతింట్లో బ్రాడ్ పిట్ ఒక్కడే బాధతో గడిపాడని తెలుస్తోంది. భర్తతో విడిపోయిన జోలీ నాలుగో పెళ్లికి సిద్ధమైనట్లు ఇటీవల హాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారింది.ఈ కారణంగానే పిల్లలను మాజీ భర్తకు ఆమె దూరం చేస్తుందని.. వారికి తండ్రి ప్రేమ కరువైందని జోలీపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
నాలుగో పెళ్లికి హీరోయిన్ సిద్ధం.. హీరో షాక్..
హాలీవుడ్ భామ ఏంజెలీనా జోలి నాలుగో పెళ్లికి రెడీ అవుతోందనే వార్త హాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారింది. భర్త బ్రాడ్ పిట్తో విడిపోయిన తర్వాత వ్యసనాలకు బానిసైన జోలీ.. మళ్లీ ప్రేమలో పడిందటా. బ్రిటన్‌కు చెందిన ఓ వ్యాపారిని ఆమె నాలుగో పెళ్లి చేసుకోనున్నట్లు ప్రముఖ మ్యాగజేన్ తన కథనంలో పేర్కొంది. మ్యాగజేన్ కథనంలో ఇంకా ఏముందంటే.. జోలీ మాలిబు ఎస్టేట్‌లో ప్రియుడిని తరచూ కలుస్తున్నట్లు చెప్పింది. ఈ విషయం తెలిసిన బ్రాడ్ షాక్‌కు గురయ్యారని తెలిపింది. జోలీ వేరొకరిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్న విషయం తనకు అసలు తెలియదని పిట్ తన సన్నిహితులతో వాపోయారని చెప్పింది. తన పిల్లలతో కలిసి వేరే వ్యక్తి కలిసివుంటారనే ఊహే బాధగా ఉందని బ్రాడ్ అన్నారని తెలిపింది. జోలీ ఇష్టపడుతున్న వ్యక్తిని కలుసుకోవడం బ్రాడ్‌కు ఇష్టం లేదని చెప్పింది. అతన్ని తన కుటుంబాన్ని విడదీస్తున్న వ్యక్తిగా బ్రాడ్ భావిస్తున్నారని తెలిపింది. త్వరలో తాను ప్రేమిస్తున్న వ్యక్తిని పిల్లలకు పరిచయం చేయాలని జోలీ భావిస్తున్నట్లు వివరించింది. -
ఇప్పటికిప్పుడే నిన్ను చూడాలనిపిస్తోంది
ఇప్పటికిప్పుడే నిన్ను చూడాలనిపిస్తోంది ఎరిక్ ఏగ్లేషియాస్ : సుబేమేలా రాడియో నిడివి : 3 ని. 52 సె. ::: హిట్స్ : 1,11,37,259 స్పానిష్ సింగర్ ఎరిక్ ఏగ్లేషియాస్, క్యూబన్ గాయకుడు డెసెమెర్ బ్యూనో, యు.ఎస్. సింగర్స్ జియాన్ అండ్ లెనాక్స్ (య.ఎస్.సింగర్స్).. ముగ్గురూ కలిసి చేసిన వీడియో సాంగ్ ‘సుబేమేలా రాడియో’. రాడియో హిట్ స్పీడ్‌ను చూస్తుంటే యువ సంగీత అభిమానులు నిద్రలు మానుకుని మరీ ఈ వీడియోకు రివైండ్ కొడుతున్నట్లుగా ఉంది. పవన్ కల్యాణ్ ‘ఖుషీ’ సినిమాలోని ‘యే మేరా జహా’ టైప్ తెలుగు పాటలకు చక్కగా పనికొచ్చే ట్యూట్ ఇది. వినసొంపుగా, ఉత్సాహం కలిగించేలా ఉంది. స్పానిష్‌లో ‘సుబేమేలా రాడియో’ అంటే.. ‘రేడియో వాల్యూమ్ పెంచు’ అని అర్థం. ‘నాకు నచ్చిన పాట వస్తోంది. కొంచెం వాల్యూమ్ పెంచు. విని, నువ్వూ అనుభూతి చెందు’ అని ఎగ్లేషియాస్ పాటను ప్రారంభిస్తాడు. అంతలోనే డెసెమెర్ బ్యూనో వచ్చి, ‘నా బాధను తగ్గించడానికి కొద్దిగా మధువును ప్రసాదించు. ఇవాళ మనం చంద్రుడితోనూ, సూర్యుడితోనూ జాయిన్ అవుదాం’ అంటాడు. పాటను ఫస్ట్ హాఫ్ మొత్తం వీళ్లిద్దరే మార్చి మార్చి అందుకుంటుంటారు. సెకండ్ హాఫ్‌లో జియాన్, లెనాక్స్ స్వరం కలుపుతారు. ‘నీ ప్రేమ కోసం పిచ్చిగా వెదుకుతున్నా. ఒంటరిగా నన్నొదిలెయ్కు, నిన్ను ప్రాధేయపడుతున్నా. ఇప్పటికిప్పుడే నిన్ను చూడాలనిపిస్తోంది నాకు. క్షణమైనా నిరీక్షించలేకపోతున్నా’ అని విలవిలలాడతారు. బాధను సంతోషంగా వ్యక్తం చేసే విద్యను ‘సుబేమేలా రాడియో’ను చూసి సాధన చేయవచ్చు. కాంబోడియా కుటుంబాల చేదు జ్ఞాపకాలు ఫస్ట్ దె కిల్డ్ మై ఫాదర్ : ట్రైలర్ టీజర్ నిడివి : 2 ని. 38 సె. ::: హిట్స్ : 10,75,641 ‘నెట్‌ఫ్లిక్స్’లో త్వరలో విడుదల కాబోతున్న సినిమా.. ‘ఫస్ట్ దె కిల్డ్ మై ఫాదర్’. హాలీవుడ్ నటి ఏంజెలీనా జోలీ ఈ బయోగ్రఫికల్ హిస్టారిక్ థ్రిల్లర్ ఫిల్మ్‌ని డైరెక్ట్ చేస్తున్నారు. 2000 సంవత్సరంలో విడుదలై సంచలనం సృష్టించిన నాన్–ఫిక్షన్ నవల ‘ఫస్ట్ దే కిల్డ్ మై ఫాదర్ : ఎ డాటర్ ఆఫ్ కాంబోడియా రిమెంబర్స్’కు దృశ్యరూపమే ఈ సినిమా. కాంబోడియా రచయిత్రి ‘లో నా’ రాసిన ఆ పుస్తకంలోని చేదు జ్ఞాపకాల సముదాయాల్లోంచి కొన్నింటిని తీసుకుని వాస్తవాల వక్రీకరణ జరగకుండా అతి జాగ్రత్తగా, బాధ్యతగా ఈ సినిమాను చిత్రీకరిస్తున్నా రట జోలీ. కాంబోడియాలో ఖ్మేర్రూజ్ పార్టీ హయాంలోని దురాగతాలు కుటుంబాలను ఎలా ఛిన్నాభిన్నం చేసిందీ ఇందులో చూడొచ్చు. అయితే ప్రస్తుతానికి ఈ మూవీ బయటి థియేటర్లలో విడుదల కావడం లేదు. నెట్‌ఫ్లిక్స్ (నెట్ మూవీ) చందాదారులకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. వియ్ మిస్‌యూ ఒబామా క్రౌడ్స్ ఫ్లాక్ టు ఒబామా ఇన్ ఎన్.వై.సి. నిడివి : 1 ని. 3 సె. :::హిట్స్ : 1,71,146 డొనాల్డ్ ట్రంప్ కొత్త ప్రెసిడెంట్‌గా వచ్చినా, పోయిన పాత ప్రెసిడెంటును మాత్రం అమెరికన్లు మర్చిపోలేకపోతున్నారు! ట్రంప్‌ను ప్రతిదానికీ ఒబామాతో పోల్చి చూస్తున్నారు. ఒక్క విషయంలో మాత్రం ట్రంప్‌కీ, ఒబామాకూ పోల్చలేనంత తేడా ఉంది. ట్రంప్ బిజీ బీజీ అయితే, ఒబామా ఫ్రీబర్డ్. సెక్యూరిటీ ఆంక్షలు లేకుండా స్వేచ్ఛగా విహంగంలా తిరుగుతున్నారు. ఇటీవల ఒబామా అకస్మాత్తుగా న్యూయార్క్ సిటీలో ప్రత్యక్షం అయ్యారు. ఆయన్ని గుర్తుపట్టిన అమెరికన్ పౌరులు ఆనందంతో ఆయన్ని చుట్టుముట్టబోయారు కానీ, స్పల్పంగానే అయినా ఆయనకు కాపుగా ఉన్న సిబ్బంది భద్రంగా ఆయన్ని కారెక్కించారు. ఈ అపురూప సన్నివేశాన్ని సి.ఎన్.ఎన్. టీవీ పదేపదే ప్రసారం చేసి వీక్షకుల అభిమానాన్ని పొందింది. ఈ క్లిప్పింగ్‌ను చూసి, తాము కోల్పోయినదేదో తిరిగి దొరికినట్లుగా అమెరికన్ పౌరులలో ఎక్కువమంది ఫీలయ్యారని న్యూస్ రీడర్ వ్యాఖ్యానించారు. మీరూ చూడండి. -
ఏంజెలీనాకు బ్రాడ్‌పిట్ ఝలక్!
లాస్ ఎంజెల్స్: తన నుంచి వేరు పడిన మాజీ భార్య, ప్రముఖ హాలీవుడ్ నటి ఏంజెలీనా జోలికి ఆస్కార్ నటుడు బ్రాడ్‌ఫిట్ ఝలక్ ఇచ్చారు. తనకు పిల్లల భారం పట్టదని తెగేసి చెప్పారు. ఈ మేరకు పిల్లల పేరిట జమచేయాల్సిన లక్ష డాలర్లను చెల్లించేందుకు ఆయన నిరాకరించారు. ఈ విషయాన్ని యాషెస్ షోబిజ్ అనే వార్తా సంస్థ తెలిపింది. ఇటీవల జోలి, బ్రాడ్‌పిట్‌ల వివాహం విచ్ఛిన్నం విషయం తెలిసిందే. మరో 90 రోజుల్లో వారు పూర్తిస్థాయిలో అధికారికంగా విడిపోనున్నారు. వీరిద్దరికి ఆరుగురు పిల్లలు ఉన్నారు. అయితే వారి పోషణార్థం ప్రతి సంవత్సరం ఒక్కొక్కరి పేరిట ట్రస్ట్ ఫండ్‌గా 2,50,000 డాలర్లను ఇరువురు వేయాల్సి ఉంటుంది. ఐదు మిలియన్ డాలర్లు వారి పోషణార్థం జమ చేయాలి. అయితే, ఈ మొత్తంలో తాను లక్ష డాలర్లను చెల్లించలేనని బ్రాడ్‌పిట్ చెప్పేశారంట. అంతేకాదు, బ్రాడ్ పిట్ నుంచి డబ్బులు వసూలు చేసే విషయంలో మాత్రం ఆమె చాలా గట్టిగానే వ్యవహరిస్తోందని సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. -
రక్తం పంచుకున్న నా కూతురుతో మాట్లాడాలి ప్లీజ్!
లండన్: ‘దయచేసి నా రక్తం పంచుకొని పుట్టిన నా కూతురుతో మాట్లాడే అవకాశం కల్పించండి. నా పాపకు తల్లిగా నేనేం చేయలేక పోయాను. ఏంజెలినా జోలీనే ఓ తల్లి చేయాల్సినవన్నీ చేశారు. నా కంటే తల్లిగా ఉండే అర్హత ఆమెకే ఎక్కువగా ఉంది. అయినంత మాత్రాన నేను తల్లి కాకుండా పోతానా? నేను నా కూతురుని వెనక్కి ఇచ్చేయమని కోరడం లేదు. ఆమెతో మాట్లాడే అవకాశం కల్పించాలని మాత్రమే కోరుతున్నాను. ఆమె జీవితంలో నేను కొంత భాగస్వామిని కావాలని కోరుకుంటున్నాను’ ఇది ఈజిప్టుకు చెందిన 31 ఏళ్ల మెంటేవాబ్ డావిట్ లెబిసో అనే ఓ తల్లి ఆవేదన. శిశు ప్రాయంలోనే కన్న బిడ్డను ప్రముఖ హాలివుడ్ నటి ఏంజెలీనా జోలీకి దత్తతిచ్చి ఇప్పుడు ఆమెను వేడుకుంటున్న వైనం. ఆమె కూతురు జహారాకు ఇప్పుడు 12 ఏళ్లు. అత్యంత దుర్భర, నిస్సహాయ పరిస్థితుల్లో లెబిసో రేప్‌కు గురై తల్లయింది. అనారోగ్య పరిస్థితుల్లో పెళ్లి కాకుండానే పుట్టిన బిడ్డను దత్తత ఇచ్చేందుకు సిద్ధపడింది. ఆ సమయంలో ఐక్యరాజ్యసమితి శరణార్థుల కమిషన్‌ను అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న ఏంజెలినా జోలీ ఆ బిడ్డను దత్తత తీసుకున్నారు. తన కూతురు ఎలా ఉన్నది, ఎక్కడున్నదో జోలీ ఇంతవరకు తనకు తెలియజేయలేదని, బిడ్డను దత్తత తీసుకున్న నాటి నుంచి ఇంతవరకు ఒక్క ఉత్తరం కూడా రాయలేదని లెబిసో తెలిపారు. భర్త బ్రాడ్‌పిట్ నుంచి జోలి విడాకులు తీసుకుంటున్నట్లు విన్నానని, ఈ సందర్భంగా తన కూతురు సంరక్షణ బాధ్యతలను జోలియే తీసుకోవాలని ఓ తల్లిగా కోరుతున్నానని ఆమె అన్నారు. ‘నేను నా కూతురును ఎంతో కోల్పోతున్నాను. ప్రతి రోజు కూతురు గురించే ఆలోచిస్తుంటాను. ఆమెను చూడాలని, మాట్లాడాలని తపించిపోతున్నాను. కూతురు పుట్టిన రోజు వేడుకను ఆమె సమక్షంలోనే చేసుకోవాలని ఆరాటపడతాను. నా కూతురుతో మాట్లాడే అవకాశం ఎప్పుడూ ఉండాలని ఆశిస్తున్నాను. ఏంజెలినా అంతగా ప్రేమించే రక్తం పంచిన తల్లి కూడా నా బిడ్డకు ఉందని ఆమె తెలియజేయాలనుకుంటున్నాను. అప్పుడప్పుడు అమెరికాలో ఉండే నా సోదరుడి ద్వారా పాప యోగక్షేమాలను కనుక్కుంటున్నాను’ అని లెబిసో తనను కలసిన మీడియాతో వ్యాఖ్యానించారు. ఆమె సెంట్రల్ ఇథియోపియాలోని ఓ చిన్న పట్టణంలోని ఓ చిన్న సొంతిట్లో ఉంటున్నారు. ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు ఓ ఆగంతకుడు వచ్చి ఆమెను రేప్ చేశాడట. అవమాన భారంతో ఆ విషయాన్ని ఎవరికి చెప్పకపోవడంతో గర్భవతి అయ్యారట. అందువల్ల బంధువులందరు అమెను వదిలేశారట. 2005లో ఆరు నెలల పాపగా ఉన్నప్పుడు జోలీకి తన పాపను దత్తత ఇచ్చానని ఆమె చెప్పారు. ‘నేను ఎప్పటికీ ఇవ్వలేని జీవితాన్ని నేడు నా బిడ్డ పొందుతోంది. కానీ ఆమెతోని ఏదో రకమైన సంబంధాన్ని, సంభాషణను నేను కోరుకుంటున్నాను. ఒకరోజు ముందూ వెనకాల మనమంతా చనిపోయేవాళ్లమే. చనిపోయేలోగానే నా బిడ్డను కలుసుకోవాలని, ఆమెకంటూ నిజమైన తల్లి ఉందని తెలుసుకోవాలని ఎంతో కోరుకుంటున్నాను’ అని చెప్పారు. ‘నా బిడ్డను దత్తత ఇచ్చిన నాటి నుంచి ఇప్పటివరకు జోలి నుంచి ఒక్క ఉత్తరం కూడా రాలేదు. ఎలాంటి ఆర్థిక సహాయం కూడా అందలేదు. అందుకు నాకే బాధ లేదు. ఒంటరిగా మిగిలిపోయాను. డబ్బులిస్తే మాత్రం ఏం చేసుకుంటాను’ ఓ ప్రశ్నకు సమాధానంగా ఆమె చెప్పారు. జహరాకు తల్లి ఉందనే విషయం యాభై కోట్ల డాలర్లకు పైగా ఆస్తి కలిగిన ఏంజెలీనా జోలీకి 2007లో తెల్సింది. అప్పటి వరకు తాను అనాథ పిల్లనే దత్తత తీసుకున్నానని జోలి భావిస్తూ వచ్చారు. 2007లో లెబిసో ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన బిడ్డను అనాథగా చెప్పి జోలికి దత్తత ఇచ్చిన విషయాన్ని వెల్లడించారు. కాలిఫోర్నియాలో నివసిస్తున్న ఏంజెలీనా జోలి, భర్త బ్రాడ్‌పిట్‌తో విడాకులు తీసుకుంటున్నప్పటికీ జహారాతో సహా ఆరుగురు పిల్లలను తన సంరక్షణలోనే ఉండేలా లాయర్ల ద్వారా ఒప్పందం చేసుకున్నారు. -
నటి విడాకులపై ఆమె తండ్రి ఏమన్నారంటే..!
లాస్ఏంజిల్స్: గత ఏడాది హాలీవుడ్ జంట బ్రాడ్‌పిట్-ఏంజెలీనా జోలీ విడాకులు తీసుకున్నారు. ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించి 2016లో ఎక్కవగా చదివిన వార్త వీరి డైవర్స్‌కు సంబంధించింది కావడం గమనార్హం. అయితే కూతురు ఏంజెలీనా జోలీ- అల్లుడు బ్రాడ్‌పిట్ విడాకులు తీసుకోవడం తనకు ఎంతో బాధ కలిగించిందని నటి తండ్రి జాన్ వోయిట్ తెలిపారు. బ్రాంజెలీనా(బ్రాడ్‌పిట్-ఏంజెలీనా జోలీ)ల విడాకులు తీసుకున్న తర్వాత ఆయన తొలిసారి మీడియాతో(యూఎస్ మ్యాగజీన్) మాట్లాడారు. పిల్లల కోసమైనా వారు కలిసి ఉండాలని, వారి బాగోగులు ఇద్దరూ కలిసి చూసుకోవాలని ఆయన ఆకాంక్షించారు. వీలైతే విడాకుల విషయాన్ని పక్కపపెట్టి మళ్లీ భార్యాభర్తలుగా ఉండాలని జోలీ తండ్రి, సీనియర్ నటుడు జాన్ వోయిట్ అభిప్రాయపడ్డారు. ఈ జనవరి 9న తమ విడాకులు, పిల్లల సంరక్షణ విషయాలను వ్యక్తిగతంగా ఉంచాలనుకున్నట్లు ఈ జంట తెలిపింది. చట్టపరమైన నిర్ణయాలు తీసుకోవడానికి ఓ ప్రైవేట్ జడ్జిని నియమించుకోవాలని వారు భావిస్తున్నారు. బ్రాంజెలీనా దంపతులకు ముగ్గురు సంతానం కాగా, మరో ముగ్గురు పిల్లలను దత్తత తీసుకున్నారు. అయితే పిల్లల సంరక్షణ విషయంపై కూతురు, అల్లుడు మధ్య విభేదాలున్నాయని, వాటిని పక్కనపెట్టి తన మనవళ్లు, మనవరాళ్ల కోసమైనా మళ్లీ ఒకటిగా ఉండాలని జాన్ వోయిట్ ఈ సందర్భంగా వారికి సూచించాడు. మరోవైపు పిల్లలను తన వద్దే ఉంచాలని జోలీ కోరుకుంటుండగా, పిట్ మాత్రం సంరక్షణ బాధ్యతలను ఇద్దరికీ అప్పగించాలని కోర్టుకు విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే. -
విడాకులపై హీరోహీరోయిన్ల ప్రకటన
విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకున్న తర్వాత కోర్టును ఆశ్రయించిన హాలీవుడ్ హీరోహీరోయిన్లు బ్రాడ్ పిట్, ఏంజెలినా జోలీ తొలిసారి సంయుక్తంగా ఓ ప్రకటన విడుదలు చేశారు. తమ ఆరుగురు పిల్లల సంరక్షణను దృష్టిలో ఉంచుకుని, విడాకులకు సంబంధించిన కోర్టు డాక్యుమెంట్లన్నింటినీ రహస్యంగా ఉంచాలని ఇద్దరూ ఓ అంగీకారానికి వచ్చారు. కుటుంబం, పిల్లలకు సంబంధించి వ్యక్తిగత రహస్యాల హక్కులను కాపాడటం కోసం ఈ నిర్ణయం తీసుకున్నారు. ఒప్పందంపై బ్రాడ్ పిట్, ఏంజెలినా, వారి న్యాయవాదులు సంతకాలు చేశారు. తమ సమస్యలను పరిష్కరించుకోవడానికి, అవసరమైన చట్టపరమైన నిర్ణయాలు తీసుకోవడానికి ఓ ప్రైవేట్ జడ్జిని నియమించుకోవాలని నిర్ణయించినట్టు ఓ ప్రకటనలో తెలిపారు. పిల్లల సంరక్షణ బాధ్యతలపై ఇద్దరి మధ్య విభేదాలు ఉన్నాయి. పిల్లలను తన వద్దే ఉంచాలని జోలీ కోరుకుంటుండగా, పిట్ మాత్రం సంరక్షణ బాధ్యతలను ఇద్దరికీ అప్పగించాలని కోరాడు. పిల్లలు మైనర్లు అయినందున వారిని తన వద్దే ఉంచాలని జోలీ భావిస్తోంది. పిట్, జోలీ విభేదాల గురించి గతంలో పలు వార్తలు వచ్చాయి. కుటుంబ శ్రేయస్సు దృష్ట్యా పిట్తో విడిపోవాలని నిర్ణయించుకున్నట్టు తొలుత జోలీ చెప్పింది. ఓ ప్రైవేట్ విమానంలో పిట్ పిల్లల పట్ల అనుచితంగా ప్రవర్తించడమే దీనికి కారణం. పిట్తో వ్యక్తిగత, వృత్తిపరమైన సంబంధాలను పూర్తిగా తెగదెంపులు చేసుకోవాలని జోలీ నిర్ణయించుకుంది. ప్రస్తుతం ఇద్దరూ వేరుగా ఉంటున్నారు. విడిపోయాక తీవ్ర ఒత్తిడికి గురైన ఏంజెలినా, చైన్ స్మోకర్గా మారినట్టు ఆమె సన్నిహితులు చెబుతున్నారు. అలాగే జోలీ దూరమయ్యాక పిట్ విషాదంలో మునిగిపోయాడు. జోలీతో తన బంధం ముగుస్తుందని, విడాకులు తీసుకుంటామని బ్రాడ్ ఎప్పుడూ భావించలేదని సన్నిహితులు చెప్పారు. పిల్లలకు దూరంగా ఉండటం కూడా బ్రాడ్‌ను బాధిస్తున్నట్టు తెలిపారు. జోలీ, పిట్ దంపతులకు ముగ్గురు సంతానం కాగా, మరో ముగ్గురు పిల్లలను దత్తత తీసుకున్నారు. -
భార్యతో విడిపోయాక నాకు ఫోన్‌కాల్స్!
- గుట్టు విప్పిన టాప్ హీరో మాజీ ప్రియురాలు లాస్ఏంజిల్స్: గత ఏడాది ప్రపంచ సినీప్రయులను ఆశ్చర్యానికి గురిచేస్తూ హాలీవుడ్ హీరో బ్రాడ్‌పిట్ తన రెండో భార్య ఏంజిలీనా జోలీ నుంచి విడాకులు తీసుకున్నాడు. సినీ రంగానికి సంబంధించి 2016లో ఎక్కువమంది చదివిన వార్తకూడా పిట్-జోలీ డైవర్స్‌కు సంబంధించిదేకావడం గమనార్హం. అయితే జోలీ నుంచి విడిపోయి ఒంటరిగా ఉంటోన్న 53 ఏళ్ల బ్రాడ్‌పిట్.. తన మాజీ గర్ల్‌ప్రెండ్, గాయని సినిట్టాకు దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తున్నాడట. త్వరలోనే టీవీల్లో ప్రసారంకానున్న ఓ టాక్ షోలో సినిట్టాయే స్వయంగా ఈ ముచ్చట చెప్పింది. ‘బ్రాడ్‌పిట్ చాలా రొమాంటిక్. మేం విడిపోయి చాలా ఏళ్లు అవున్నా.. అతనితో గడిపిన రోజులు నాకింకా గుర్తేఉన్నాయి. ఈ మధ్యే భార్య నుంచి విడిపోయిన అతను నాకు ఫోన్‌కాల్స్ చేయడం మొదలుపెట్టాడు. అఫ్కోర్స్ నేను కూడా ఒంటరినే! కానీ, ప్రస్తుత పరిస్థితుల్లో నేను పిట్తో కలిసి ఉండలేను. అందుకే.. నన్ను కాకుండా ఇంకెవరినైనా చూసుకొమ్మని సలహా ఇచ్చా’ అని సినిట్టా చెప్పుకొచ్చింది. కెరీర్ ప్రారంభంలో సినిట్టాతో డేటింగ్చేసిన బ్రాడ్‌పిట్.. ఆమెతో బంధాన్ని బ్రేకప్ చేసుకుని నటి జెన్నీఫర్ అనిస్టీన్ను పెళ్లాడాడు. అదే సమయంలో సినిట్టా.. ఆండీ విల్నర్ను మనువాడింది. అయితే 2005 నాటికి ఈ రెండు జంటలూ విడిపోయాయి. జెన్నీఫర్ నుంచి విడిపోయిన బ్రాడ్‌పిట్.. ఏంజిలీనా జోలీని పెళ్లాడటం, ఆరుగురు పిల్లల్ని కలిగాక మొన్నీమధ్యే విడిపోవడం తెలిసిందే. సినిట్టా మాత్రం మొదటి విడాకుల తర్వాత నుంచీ ఒంటరిగానే జీవిస్తోంది. -
తిండితిప్పలు మాని చైన్ స్మోకరైన ఏంజెలీనా
లాస్ ఏజెంల్స్ : ప్రముఖ హాలీవుడ్ నటి ఏంజెలీనా జోలి పొగరాయుడిగా మారింది. ప్యాకెట్ల కొద్ది సిగరెట్లను కాజేస్తుంది. ఇటీవలె బ్రాడ్ ఫిట్‌తో తన వివాహ బందం బద్థలవడంతో ఆ వేదనను భరించలేక తీవ్ర మానసిక ఒత్తిడికి లోనై తిండి తిప్పలు మానేసి సిగరెట్లను ఒక వ్యసనంగా మార్చుకుంది. ఈ విషయం అక్కడి ఓ ఆంగ్ల వెబ్ సైట్ పేర్కొంది.. పూర్తి వివరాల్లోకి వెళితే..హాలీవుడ్ నటి ఏంజెలీనా జోలీ తన భర్త బ్రాడ్ ఫిట్‌తో విడాకులు తీసుకున్నారు. దీంతో తీవ్ర ఒత్తిడికి గురైన ఏంజేలీనా, చైన్ స్మోకర్గా మారినట్టు ఆమె సన్నిహితులు చెబుతున్నారు. క్యాన్సర్ బారినపడకుండా ఇప్పటికే ఆమె పలు సర్జరీలు చేయించుకున్న ఏంజెలీనా తిండితిప్పలు మాని రోజుకు రెండు సిగరెట్ ప్యాకెట్లు తాగుతుండటాన్ని నమ్మలేకపోతున్నామని వారు ఆశ్చర్యం వ్యక్తంచేస్తున్నారు.. '' ఏంజెలీనా అసలు తిండి ముట్టుకోవడం లేదు. విపరీతంగా సిగరెట్లు తాగుతోంది. ఈజీగా రోజుకు రెండు ప్యాకెట్లను పీల్చేస్తుంది'' అని ఏస్షోబిజ్.కామ్ రిపోర్టు చేసింది. -
వేధింపుల కేసు: నటుడికి విముక్తి
లాస్ఏంజిల్స్: సొంత పిల్లలనే వేధింపులకు గురిచేశాడనే ఆరోపణలు ఎదుర్కొంటున్న హాలీవుడ్ టాప్ హీరో బ్రాడ్ పిట్‌కు భారీ ఊరట లభించింది. నటి ఏంజిలీనా జోలీతో విడిపోయే సందర్భంలో ఆమెపై ఉన్న కోపాన్ని బ్రాడ్ పిట్ పిల్లలపై ప్రదర్శించాడని, ప్రైవేట్ జెట్ విమానంలో ప్రయాణిస్తున్న సమయంలో చిన్నారులను వేధించాడని గత సెప్టెంబర్‌లో కేసు నమోదు అయింది. కాగా, వేధింపులకు పాల్పడినట్లు ఎలాంటి ఆధారాలు లభ్యమయ్యే అవకాశాలు లేకపోవడంతో ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేష్(ఎఫ్‌బీఐ) ఈ కేసు దర్యాప్తును పూర్తిగా నిలిపేసింది. ఈ మేరకు మంగళవారం ఎఫ్‌బీఐ అధికార ప్రతినిధి ప్రకటన విడుదల చేశారు. అటు లాస్ఏంజిల్స్ కౌంటీ చైల్డ్ అండ్ ఫ్యామిలీ సర్వీసెస్ శాఖ కూడా నవంబర్ మొదటివారంలోనే బ్రాడ్ పిట్‌కు ఈ కేసులో క్లీన్చిట్ ఇవ్వడం గమనార్హం. 12 ఏళ్ల (10 ఏళ్ల సహజీవనం, రెండేళ్ల వైవాహిక) బంధానికి ముగింపు పలుకుతూ స్టార్ కపుల్స్ ఏంజిలీనా జోలీ, బ్రాడ్ పిట్లు గత సెప్టెంబర్‌లో విడాకుల కోసం కోర్టును ఆశ్రయించారు. భర్తతో కలిసుండే విషయంలో పునరాలోచన లేదన్న జోలి.. బ్రాడ్ పిట్ పిల్లల్ని వేధించాడని ఆరోపించారు. దీంతో ఆరుగురు పిల్లల(మాడెక్స్ జోలీ-పిట్, పాక్స్ జోలీ-పిట్, జహారా జోలీ-పిట్, షిలోహ్ జోలీ-పిట్, కవలలు కెనాక్స్ జోలీ-పిట్, వివీన్నె జోలీ-పిట్) సంరక్షణ బాధ్యత ఎవరికి అప్పగించాలనే దానిపై సందిగ్ధం నెలకొంది. ఒకదశలో పిల్లల్ని తనకే అప్పగించాలని కోర్టులో పోరాటం చేసిన బ్రాడ్ పిట్.. కొన్ని హామీల మేరకు దిగొచ్చారు. ప్రస్తుతానికి ఆరుగురు పిల్లలూ మలీబులోని ఇంట్లో తల్లి జోలీతో కలిసి ఉంటున్నారు. -
పిల్లల్ని ఆమె దగ్గరే ఉంచండి: హీరో
లాస్ ఏంజెలెస్: హాలీవుడ్ స్టార్స్ బ్రాడ్ పిట్, ఏంజెలినా జోలీ విడాకులు తీసుకోవడానికి నిర్ణయించుకున్న నేపథ్యంలో తమదగ్గరున్న తమ పిల్లల పెంపకంపై ఒక అంగీకారానికి వచ్చారు. ఆరుగురు పిల్లలను ఏంజెలినా జోలీ వద్ద ఉంచేందుకు బ్రాడ్ పిట్ అంగీకరించాడు. మాడెక్స్ జోలీ-పిట్(15), పాక్స్ జోలీ-పిట్(12), జహారా జోలీ-పిట్(11), షిలోహ్ జోలీ-పిట్(10), కవలలు కెనాక్స్ జోలీ-పిట్, వివీన్నె జోలీ-పిట్(8)... ఏంజెలినా జోలీ దగ్గర పెరగనున్నారు. వీరిని అప్పుడప్పుడు బ్రాడ్ పిట్ కలిసేందుకు జోలీ అంగీకరించింది. అంతేకాదు తండ్రిని చూడాలని పిల్లలు కోరుకుంటే అభ్యంతరం చెప్పబోనని జోలీ హామీయిచ్చింది. పిల్లల సంరక్షణ నిపుణుల ఆధ్వర్యంలో కుదిరిన ఈ ఒప్పందంపై బ్రాడ్ పిట్, ఏంజెలినా జోలీ వారం క్రితం సంతకాలు చేశారని జోలీ తరపు ప్రతినిధి ఒక ప్రకటనలో తెలిపారు. బ్రాడ్, జోలీ 12 ఏళ్లపాటు కలిసుండి ఇటీవల విడిపోయారు. బ్రాడ్ పిట్ అంతకుముందు జెన్నిఫర్ అనిస్టన్ నుంచి విడిపోయాడు. ఏంజెలినా జోలీ మూడోసారి విడాకులు తీసుకుంది. అంతకుముందు ఆమె బిల్లీ బాబ్ థొర్నటన్, జానీ లీ మిల్లర్ తో వైవాహిక బంధాన్ని తెంచుకుంది. -
హీరోయిన్ను ప్రశ్నించిన పోలీసులు
మొన్నీమధ్యే భర్త నుంచి విడాకులు తీసుకున్న హాలీవుడ్ హీరోయిన్ ఏంజెలీనా జోలీని ఎఫ్‌బీఐ పోలీసులు నాలుగు గంటల పాటు ప్రశ్నించారు. జోలీ మాజీ భర్త బ్రాడ్ పిట్ వాళ్లిద్దరి కొడుకు మాడాక్స్ (15)ను విమానంలో తీవ్రంగా తిట్టాడని, కొట్టాడని.. ఆ సమయంలో అతడు బాగా తాగి ఉన్నాడని జోలీ పోలీసులకు ఫిర్యాదుచేసింది. ఈ ఘటన సెప్టెంబర్ 14న జరగ్గా, ఆ తర్వాత కొద్దిరోజులకే జోలీ విడాకుల పిటిషన్ దాఖలుచేసింది. గుర్తుతెలియని వ్యక్తులు ఈ ఘటన గురించి పోలీసులకు తెలిపారు. విమానం గాలిలో ఉన్నప్పుడు ఈ ఘటన జరిగింది కాబట్టి.. ఈ విషయాన్ని ఎఫ్‌బీఐ పరిశీలిస్తోంది. విమానం టేకాఫ్ అయినప్పటి నుంచి అది తిరిగి ల్యాండయ్యేవరకు ఏం జరిగిందో మొత్తం అంతా ఎఫ్‌బీఐ వాళ్లు పరిశీలిస్తున్నారని, ఏంజెలీనా జోలీ కూడా వాళ్లకు పూర్తిగా సహకరిస్తోందని పోలీసు వర్గాలు తెలిపాయి. మరికొన్ని వారాల పాటు ఎఫ్‌బీఐ విచారణ కొనసాగనుంది. తర్వాత ఈ కేసును కోర్టుకు తీసుకెళ్తారు. అక్కడ విచారణ అనంతరం బ్రాడ్ పిట్‌పై ఆరోపణలు నమోదుచేయాలా వద్ద అన్నది నిర్ణయిస్తారు. ఇందుకు కొన్ని నెలల సమయం పడుతుంది. నిజానికి బ్రాడ్ పిట్, ఏంజెలీనా జోలీ ఇద్దరూ కూడా దీనిపై కేసు పెట్టకపోతేనే మంచిదని భావిస్తున్నట్లు సమాచారం. అనవసరంగా లేనిపోని గొడవలు ఎందుకని అంటున్నారట. విమానంలో జరిగిన గొడవలో మాడాక్స్కు కూడా గాయాలు ఏమీ కాలేదని, అందువల్ల ఈ వివాదాన్ని ఇంతటితో వదిలిపెట్టడం మంచిదని భావిస్తున్నట్లు సమాచారం. -
హీరోయిన్ ను ప్రశ్నించిన ఎఫ్ బీఐ
లాస్ ఏంజెలెస్: హాలీవుడ్ అగ్రనటి ఏంజెలినా జోలిని ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(ఎఫ్ బీఐ) అధికారులు ప్రశ్నించారు. ఏంజెలినా భర్త బ్రాడ్ పిట్ వ్యక్తిగత విమానంలో జరిగిన గొడవ గురించి ఆమెను నాలుగు గంటల పాటు ఎఫ్ బీఐ అధికారులు విచారించారు. సెప్టెంబర్ 14న మద్యం మత్తులో బ్రాడ్ పిట్ తన కుమారుడు మాడ్ డాక్స్(15)ను దుర్బలాషడాడి కొట్టాడని ఆరోపణలు వచ్చాయి. ఇది జరిగిన కొద్ది రోజుల తర్వాత ఏంజెలినా విడాకుల కోసం కోర్టును ఆశ్రయించింది. కాగా, తాము అడిగిన ప్రశ్నలకు ఏంజెలినా ఓపిగ్గా సమాధానాలిచ్చారని, విచారణకు సహకరించారని ఎఫ్ బీఐ వర్గాలు వెల్లడించాయి. ఆకాశమార్గంలో విమానంలో గొడవ జరిగినందున తాము జోక్యం చేసుకోవాల్సి వచ్చిందని వెల్లడించాయి. మరికొన్ని వారాల పాటు విచారణ కొనసాగే అవకాశముందని తెలిపాయి. అయితే కోర్టు కేసులకు దూరంగా ఉండాలని ఏంజెలినా, బ్రాడ్ పిట్ భావిస్తున్నారని సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. తాము విడిపోతున్నామని వీరిద్దరూ ధ్రువీకరించిన సంగతి తెలిసిందే. -
విడాకుల తర్వాత పిల్లలతో జనంలోకి హీరోయిన్
ప్రముఖ హాలీవుడ్ నటి ఏంజెలీనా జోలీ.. హీరో బ్రాడ్‌పిట్‌తో విడాకులు తీసుకున్న తర్వాత తొలిసారి బయటకు వచ్చింది. ఆమె తన పిల్లలతో కలిసి కాలిఫోర్నియాకు వెళ్లినట్లు చెబుతున్నారు. తన అన్నయ్య జేమ్స్ హావెన్తో పాటు ఐదుగురు పిల్లలు షిలో, జహారా, పాక్స్, కవల పిల్లలు నాక్స్, వివియెన్నెలతో కలిసి జోలీ వెళ్లింది. నల్లటి టాప్స్, అదేరంగు షార్ట్ట్ వేసుకున్న జోలీ.. కాళ్లకు మాత్రం కనీసం చెప్పులు కూడా లేకుండానే ఎయిర్‌పోర్టులో కనిపించింది. కాలిఫోర్నియా వెళ్లేందుకు ముందు హావెన్, పిల్లలు కలిసి ఒక బీచ్‌లో కూడా కనిపించినట్లు సమాచారం. ఈ ట్రిప్‌లో సెక్యూరిటీ గార్డులతో పాటు పిల్లల సంరక్షకులు కూడా ఉన్నారు. కాళ్లకు చెప్పులు కూడా లేకుండా బీచ్‌లో నడిచేటప్పుడు ఏంజెలీనా జోలీ చాలా ఉల్లాసంగా, ఆనందంగా కనిపించిందని అంటున్నారు. పిల్లలు కూడా నీళ్లలో ఆడుకున్నారని, తండ్రి తమవద్ద లేడన్న బాధ ఏమీ వారికి కనిపించలేదని చెబుతున్నారు. విడాకుల ప్రకటన తర్వాత జోలీ ఇలా కనిపించినా.. బ్రాడ్ పిట్ (52) మాత్రం ఇంతవరకు ఎక్కడా కనిపించలేదు. -
భార్య విడిపోవడంతో హీరో విషాదం
హాలీవుడ్ హీరో బ్రాడ్ పిట్ తన భార్య, హీరోయిన్ ఏంజెలినా జోలీ దూరమయ్యాక విషాదంలో మునిగిపోయాడు. ఏంజెలినా జోలీతో విబేధాలు ఏర్పడ్డాక ఇటీవల జరిగిన సంఘటనలు అతన్ని తీవ్రంగా బాధించినట్టు సన్నిహితులు చెబుతున్నారు. జోలీతో తన బంధం ముగుస్తుందని, విడాకులు తీసుకుంటామని బ్రాడ్ ఎప్పుడూ భావించలేదని చెప్పారు. పిల్లలకు దూరంగా ఉండటం కూడా బ్రాడ్‌ను బాధిస్తున్నట్టు తెలిపారు. కుటుంబంలో ఏర్పడిన విబేధాలు, తన జీవితంలో చోటు చేసుకున్న అనూహ్య పరిణామాల గురించి బ్రాడ్ తన తల్లిదండ్రులు, స్నేహితులతో చర్చించినట్టు సమాచారం. బ్రాడ్ తల్లి రోజు అతన్నిఓదారుస్తున్నట్టు సన్నిహితులు చెప్పారు. బ్రాడ్, జోలీ 12 ఏళ్ల అనుబంధం ఇటీవల ముగిసింది. ఓ ప్రైవేట్ విమానంలో బ్రాడ్ మద్యంమత్తులో పిల్లల పట్ల అనుచితంగా ప్రవర్తించాడనే కోపంతో జోలీకి అతనికి దూరమైంది. బ్రాడ్ ఇంటి నుంచి వెళ్లిపోయిన జోలీ పిల్లలతో కలసి అద్దె ఇంట్లో ఉంటోంది. ఇటీవల విడాకుల కోసం కోర్టులో దరఖాస్తు చేసింది. బ్రాడ్, జోలీ ఇద్దరూ తాత్కాలికంగా ఓ ఒప్పందం చేసుకున్నారు. జోలీ విడిపోయిన తర్వాత బ్రాడ్ ఇటీవల తొలిసారి తన పిల్లలను చూశాడు. ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చిన ఈ జోడీ రెండేళ్ల క్రితం వివాహం చేసుకున్నారు. మరో ముగ్గురు పిల్లలను దత్తత తీసుకున్నారు. -
భార్య ఇంటికి వెళ్లేందుకు హీరోకు షరతు
విడిపోవాలని నిర్ణయించుకుని విడాకులకు దరఖాస్తు చేసుకున్న హాలీవుడ్ జంట బ్రాడ్ పిట్, ఏంజెలినా జోలీ తాత్కాలిక ఒప్పందం చేసుకున్నారు. బ్రాడ్ పిట్ డ్రగ్, ఆల్కాహల్ పరీక్షలు చేయించుకున్న తర్వాతే తన పిల్లలను చూసేందుకు వెళ్లాలనే షరతును ఈ ఒప్పందంలో చేర్చారు. దీనికి పిట్, జోలీ ఇద్దరూ అంగీకరించారు. ప్రస్తుతం జోలీ పిట్‌కు దూరంగా అద్దె ఇంట్లో ఉంటోంది. ఆరుగురు పిల్లలు ఆమె దగ్గరే ఉన్నారు. పిట్, జోలీకి ముగ్గురు సంతానం కాగా, మరో ముగ్గురిని దత్తత తీసుకున్నారు. ఇటీవల పిట్ మద్యంమత్తులో పిల్లల పట్ల అనుచితంగా ప్రవర్తించారని ఆరోపిస్తూ జోలీ విడిపోయింది. గత నెల 20న విడాకులకు దరఖాస్తు చేసుకుంది. ఇది కోర్టు విచారణలో ఉంది. గత నెల 15న జోలీ దూరమయ్యాక పిట్ ఇప్పటి వరకు పిల్లలను చూడలేదు. దీంతో వీరిద్దరూ శుక్రవారం తాత్కాలిక ఒప్పందం చేసుకున్నారు. ఈ నెల 20 వరకు ఇది అమల్లో ఉంటుంది. పిల్లల క్షేమంగా దృష్ట్యా తన వద్దే ఉంచుకున్నట్టు జోలీ చెప్పింది. -
బ్లాక్ లిస్ట్‌లో ఆయన ఫోన్!
ప్రముఖుల జీవితాల్లో ఏది జరిగినా మీడియాకు ఎక్కేస్తుంది. బ్రాడ్ పిట్, ఏంజెలీనా జోలీల విడాకుల కథలోని సంగతులు ఇప్పుడు అలాగే బయటకొస్తున్నాయి. హాలీవుడ్ హీరో బ్రాడ్ పిట్తో పన్నెండేళ్ల సహ జీవనం, రెండేళ్ల వివాహ బంధానికి ముగింపు పలుకుతూ హాలీవుడ్ స్టార్ ఏంజెలీనా జోలీ విడాకుల కోసం కోర్టుకెక్కిన సంగతి తెలిసిందే. వారం రోజుల క్రితం ఏంజిలినా జోలీ కోర్టులో కేసు వేశారు. ఆరుగురి పిల్లల్ని తీసుకుని అద్దె ఇంటికి షిఫ్ట్ అయ్యారు. అంతే కాదండోయ్... ఇన్ కమింగ్ మెస్సేజ్‌లతో పాటు బ్రాడ్ పిట్ నుంచి వచ్చే ఫోన్ కాల్స్‌ను కూడా జోలీ బ్లాక్ లిస్టులో పెట్టారట. దాంతో, హీరోగారు షాకయ్యారట. ‘‘గతంలో చాలాసార్లు విడాకులు ఇస్తానని బెదిరించింది. నిజంగా ఇంత పని చేస్తుందనుకోలేదు’’ అని సన్నిహితుల వద్ద బ్రాడ్ పిట్ కన్నీళ్లు పెట్టుకుంటున్నారని వార్త. ఈ స్టార్ విడాకుల కేసులో పోను పోనూ ఇంకెన్ని కబుర్లు బయటికొస్తాయో చూడాలి. -
భర్తను వీడి అద్దెఇంటికి మారిన హీరోయిన్
హాలీవుడ్ హీరోయిన్, దర్శకురాలు ఏంజెలినా జోలీ తన పిల్లలను తీసుకుని భర్త, హీరో బ్రాడ్ పిట్ ఇంటినుంచి వెళ్లిపోయింది. లాస్ ఏంజిలెస్‌లోని ఓ అద్దె ఇంట్లో జోలీ తన ఆరుగురు పిల్లలతో కలసి ఉంటున్నట్టు సమాచారం. 52 ఏళ్ల పిట్, 41 ఏళ్ల జోలీ విబేధాల కారణంగా దూరమయ్యారు. విడాకులు కోరుతూ గతనెలలో జోలీ కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. కుటుంబ శ్రేయస్సు దృష్ట్యా పిట్తో విడిపోవాలని నిర్ణయించుకున్నట్టు జోలీ చెప్పింది. ఓ ప్రైవేట్ విమానంలో పిట్ పిల్లల పట్ల అనుచితంగా ప్రవర్తించినట్టు వార్తలు వచ్చాయి. పిల్లల సంరక్షణ బాధ్యత తనకు అప్పగించాలని, పిట్‌కు పిల్లలను కలుసుకునే హక్కు మాత్రమే ఇవ్వాలని జోలీ కోర్టును కోరింది. జోలీ, పిట్ దంపతులకు ముగ్గురు సంతానం కాగా, మరో ముగ్గురు పిల్లలను దత్తత తీసుకున్నారు. పిట్ నటిస్తున్న ఓ ప్రాజెక్టు నుంచి ఇటీవల జోలీ వైదొలిగింది. ఈ సినిమాకు దర్శకత్వం వహించేందుకు జోలీ తొలుత అంగీకరించినా, ఇటీవల జరిగిన పరిణామాల వల్ల పిట్తో వ్యక్తిగత, వృత్తిపరమైన సంబంధాలను పూర్తిగా తెగదెంపులు చేసుకోవాలని నిర్ణయించుకుంది. -
'నా ఆందోళనంతా ఎంజెలీనా పిల్లల గురించే'
లాస్ ఎంజెల్స్: తన కూతురు చేసే పనుల పట్ల తనకు ఎలాంటి బెంగలేదని, అయితే ఆమె పిల్లల భవిష్యత్ గురించే తన ఆందోళన అని ప్రముఖ హాలీవుడ్ నటి ఎంజెలీనా జోలి తండ్రి, నటుడు జాన్ వోయిట్ అన్నారు. కొన్ని కారణాల వల్ల తన భర్త బ్రాడ్ ఫిట్ నుంచి విడాకులు ఇప్పించాల్సిందిగా ఎంజెలీనా దరఖాస్తు చేసుకున్న విషయం తెలిసిందే. త్వరలోనే ఈ జంట అధికారికంగా విడిబోతున్నారు. దీంతో ప్రతి ఒక్కరు ఈ ఇద్దరి జీవితంలో భవిష్యత్ లో జరగబోయే పరిణామాలు, జరిగిన అంశాలపైనే దృష్టి పెట్టారు. అందులో భాగంగానే ఎంజెలీనా తండ్రి జాన్ తన ఆందోళన వ్యక్తం చేశారు. 'నాకు తెలుసు నా కూతురు ఏం చేసినా మంచే చేస్తుంది. అయితే, నేను ఆమె కుటుంబం, చిన్నారుల గురించే ఆందోళన పడుతున్నాను. బ్రాడ్ ఫిట్, ఎంజెలీనా ఆరుగురు పిల్లలను సాకుతున్నారు. ఇప్పుడు వారి పరిస్థితి ఎలా ఉంటుందో అనే నా ఆలోచన' అని అన్నారు. అయితే, జోలి విషయంలో ఇంతకంటే ఎక్కువ స్పందించేందుకు ఆయన నిరాకరించారు. ప్రస్తుతం కూతురు నుంచి విడిపోయి దూరంగా ఉంటున్న ఈ నటుడు ఓ రకంగా బ్రెంజిలీనా జోడి బద్దలవడం తనకు దిగ్భ్రాంతిని కలిగించిందని చెప్పారు. -
'వాళ్లు విడిపోయారుగా.. ఇక పెళ్లి చేసుకుంటా'
లాస్ ఎంజెల్స్: హాలీవుడ్ హాట్ కపుల్ బ్రాడ్ పిట్, ఏంజెలినా జోలీ విడిపోవడంపై ఎవరికి ఇష్టం వచ్చినట్లు వారు మాట్లాడేస్తున్నారు. హాలీవుడ్ నటి, కమెడియన్ చెల్సియా హ్యాండ్లర్ బ్రెంజిలీనాల(బ్రాడ్ పిట్, ఏంజెలినా) బ్రేకప్ పై స్పందిస్తూ ఏంజెలీనాను తప్పుబట్టింది. ఆమె చాలా వెర్రిదని, చపలచిత్తంగల స్త్రీ అని విమర్శించింది. ఎంతమంది పెళ్లి చేసుకున్నా వారు మాత్రం ఎప్పటికీ పెళ్లి చేసుకోకూడదని ఎప్పుడూ చెప్తుండే దాన్నని చెప్పింది. వాళ్లు పెళ్లి చేసుకున్నందున తిరిగి విడాకులు తీసుకునేవరకు తాను పెళ్లి చేసుకోబోనని చెప్పానని, ఇక వాళ్లు విడాకులు తీసుకుంటున్నందున నేను అధికారికంగా ఎవరైనా పెళ్లి ప్రతిపాదనలతో వస్తే అంగీకరించేందుకు సిద్ధంగా ఉన్నానని తెలిపింది. ప్రతి ఒక్కరు బ్రాడ్ నే విమర్శిస్తున్నారని, ఆయనే తాగుబోతు, సిగరెట్లు తాగుతాడని విమర్శిస్తున్నారని, ఒక వేళ ఏ కారణం లేకుండానే అతడు అలా మారిపోతాడా అని ఆమె ప్రశ్నించింది. ఎంజెలీనా మంచిదికాదని ఆమె ఓ వెర్రిమాలోకం అని వెక్కిరించింది. ఈ విమర్శలు చేసిన చెల్సియా బ్రాడ్ ఫిట్ మాజీ భార్య ఆనిస్టన్ స్నేహితురాలు. అంతకుముందు కర్మ సిద్ధాంత ప్రకారం వారు విడిపోయారని బ్రాడ్ ఫిట్ మాజీ భార్య జెన్నిఫర్ ఆనిస్టన్ పేర్కొనడమే కాకుండా బ్రాడ్‌కు జోలీ ఎంతమాత్రం సరిపోదని చెప్పింది. సాదాసీదాగా ఉండే బ్రాడ్‌కు జోలీ చాలా సంక్లిష్టమైన జోడీ అని చెప్పింది. వారిద్దరు విడిపోవడం సంతోషంగానే ఉందని చెప్పింది.కాగా, బాగా తాగి వచ్చిన బ్రాడ్ ఫిట్ పిల్లలపై చేయిచేసుకోవడం వల్లే ఎంజెలీనా విడిపోయినట్లు కథనాలు వచ్చిన విషయం తెలిసిందే. -
మనుషులే కాదు..బొమ్మలూ విడిపోయాయ్!
హాలీవుడ్ హాట్ కపుల్ బ్రాడ్ పిట్, ఏంజెలినా జోలీ విడిపోతున్నారు. పన్నెండేళ్ల ప్రేమానుబంధం, రెండేళ్ల వివాహ బంధానికి ఈ జంట ముగింపు పలికేశారు. పుష్కర కాలం క్రితం ప్రేమలో పడ్డ ఈ నటుడు, నటి రెండేళ్ల క్రితం పెళ్లి చేసుకున్నారు. హాలీవుడ్లో ఉన్న చూడ చక్కని జంటల్లో ఈ జంట ఒకటి. ఇద్దరి మధ్య సరిచేసుకోలేనంతగా మనస్పర్థలు నెలకొనడంవల్లే విడిపోవాలని నిర్ణయించుకున్నామని ఈ జంట పేర్కొంది. విడాకులకు కూడా అప్లై చేసుకున్నారు. మనషులే విడిపోతున్నప్పుడు ఈ ఇద్దరి బొమ్మలు మాత్రం ఎందుకు కలిసి ఉండాలని లండన్‌లోని మేడమ్ తుస్సాడ్స్ నిర్వాహకులు భావించినట్లు ఉన్నారు. ప్రముఖుల మైనపు బొమ్మలు తయారు చేసి ఈ మ్యూజియమ్‌లో పెడుతుంటారు. 2013లో పిట్, జోలీల బొమ్మలు తయారు చేయించి, ప్రదర్శనకు ఉంచారు. ఇప్పుడు ఈ ఇద్దరూ విడిపోతున్నామని ప్రకటించిన నేపథ్యంలో తుస్సాడ్స్ వారు బొమ్మలను కూడా విడగొట్టేశారు. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. ‘‘బ్రాడ్ పిట్, ఏంజెలినాలు విడిపోతున్న విషయం చాలామందిని షాక్‌కి గురి చేసిన నేపథ్యంలో వాళ్లిద్దర్నీ (బొమ్మలను) మేం అఫీషియల్‌గా విడగొట్టేశాం’’ అని సోషల్ మీడియా ద్వారా పేర్కొన్నారు. -
వాళ్ల విడాకులపై మాజీ భార్య సంతృప్తి!
హాలీవుడ్‌లోనే ప్రముఖ జంటగా పేరొందిన బ్రాడ్ పిట్, ఏంజెలినా జోలీ విడాకుల వార్త సహజంగానే ఇంటర్నెట్లో పెద్ద చర్చనీయాంశమైంది. భర్త బ్రాడ్‌తో విడాకులు తీసుకొనేందుకు కోర్టును జోలీ దరఖాస్తు చేసుకోవడంతో ఈ వార్తపై ఎన్నో కథనాలు వెలువడ్డాయి. అయితే, జోలీ-బ్రాడ్ విడాకులపై బ్రాడ్ మాజీ భార్య, హాలీవుడ్ నటి జెన్నిఫర్ అనిస్టన్ వ్యక్తం చేసిన అభిప్రాయాలు మాత్రం ఆన్‌లైన్‌ను కుదిపేస్తున్నాయి. ఆమె వ్యాఖ్యలపై ఎన్నో జోకులు వెల్లువెత్తుతున్నాయి. యూఎస్ వీక్లీ మ్యాగజీన్ కథనం ప్రకారం జోలీ-బ్రాడ్ విడాకులపై అనిస్టన్ తన సన్నిహితులతో స్పందించింది. ’కర్మ’ సిద్ధాంతం ప్రకారమే వారు విడిపోయినట్టు ఆమె పేర్కొంది. అంతేకాదు జోలీతో బ్రాడ్ విడిపోతుండటంపై ఆమె సంతృప్తి వ్యక్తం చేసింది. 11 ఏళ్ల వైవాహిక జీవితం.. అరడజనుకుపైగా పిల్లలతో అన్యోన్యమైన జంటగా పేరొందిన బ్రాడ్-జోలీ మధ్య ఏదో జరుగుతుందని తనకు ఎప్పుడూ అనిపించేదని ఆమె సన్నిహితులతో పేర్కొంది. ’ బ్రాడ్‌కు జోలీ ఎంతమాత్రం సరిపోదని అనిస్టన్ ఎప్పుడూ భావించలేదు. కానీ సాదాసీదాగా ఉండే బ్రాడ్‌కు జోలీ చాలా సంక్లిష్టమైన జోడీ అని ఆమె భావించేది’ అని సన్నిహితులు పేర్కొన్నారు. తన మాజీ భర్త వైవాహిక జీవితంపై అనిస్టన్కు ఎలాంటి దురభిప్రాయాలు లేవని, వారు విడిపోవాలని కానీ, కలిసుండాలని కానీ ఆమె కోరుకోలేదని చెప్పారు. అయితే, బ్రాడ్-జోలీ విడిపోతుండటంపై ఆమె సంతృప్తిగా ఉందని వారు తెలిపారు. 2000 సంవత్సరంలో బ్రాడ్- అనిస్టన్ పెళ్లి చేసుకొని ఐదేళ్ల తర్వాత విడిపోయారు. అనంతరం 2011 నుంచి జస్టిన్ థిరౌక్స్తో డేటింగ్ చేసిన అనిస్టన్ 2015లో అతన్ని పెళ్లాడించింది. మరోవైపు పిట్-జోలీ విడాకులతో జెన్నిఫర్ అనిస్టన్ సంతోషంలో మునిగిపోయి పండుగ చేసుకుంటున్నదని ఆన్లైన్లో జోకులు వెల్లువెత్తుతున్నాయి. -
ఆ హీరో, హీరోయిన్ వైవాహిక బంధం బద్దలైంది
-
ఆ హీరో, హీరోయిన్ వైవాహిక బంధం బద్దలైంది
లండన్: హాలీవుడ్ మోస్ట్ ఇంట్రెస్టింగ్ కపుల్స్ ఎంజెలీనా జోలీ(41), ఆస్కార్ ఆవార్డు విజేత బ్రాడ్ ఫిట్(52) విడిపోతున్నారు. పన్నేండేళ్ల బంధానికి, రెండున్నారేళ్ల వైవాహిక జీవితానికి గుడ్‌బై చెప్పేస్తున్నారు. ఎంతో ఇష్టపడి ప్రేమించి పెళ్లి చేసుకున్న వారి మధ్యలో మరో అమ్మాయి రావడమే అందుకు ప్రధాన కారణమైంది. ఎంజెలీనా, బ్రాడ్ ఫిట్లకు 2014లో వివాహం అయింది. అంతకుముందు పన్నెండేళ్లపాటు లివింగ్ రిలేషన్ లో ఉన్నారు. 2004 నుంచి వీరిద్దరు ఒకే ఇంట్లో ఉండటమే కాకుండా మంచి కపుల్స్ అని పేరు కూడా తెచ్చుకున్నారు. అయితే, కొద్ది రోజులుగా బ్రాడ్ వ్యవహారంలో అసంతృప్తిగా ఉన్న జోలీ అటార్న్ రాబర్ట్ వద్ద తనకు బ్రాడ్ ఫిట్ నుంచి విడాకులు ఇప్పించాలని దరఖాస్తు చేసుకొంది. తన కుటుంబ క్షేమం కోసమే తాను ఈ నిర్ణయానికి వచ్చినట్లు చెప్పింది. ఈ సమయంలో కుటుంబం విషయంలో ప్రైవసీ కోరుకుంటున్నందున తన విడాకులు కోరుతున్నట్లు వెల్లడించింది. బ్రాడ్ ఫిట్ కూడా ఈ విషయాన్ని స్పష్టం చేశారు. 'ఈ విషయం చెప్పేందుకు బాధగా ఉంది. మా చుట్టూ కొన్ని కారణాల వల్ల ఇలాంటి పరిణామాలు సంభవిస్తున్నాయి. ఇలాంటి సమయంలో మీడియా మాకు కొంత స్వేచ్ఛను ఇవ్వాలి' అని ఆయన చెప్పారు. బ్రాడ్ ఫిట్, ఎంజెలీనాకు ఆరుగురు పిల్లలు కాగా వారిలో ముగ్గురు దత్తత తీసుకున్నవారు ఉన్నారు. మిగితా ముగ్గురు జోలీ, బ్రాడ్ ఫిట్ కు కలిగిన సంతానమే. తన పిల్లలను సరిగా చూసుకోవడం లేదని తన విడాకుల దరఖాస్తులో పేర్కొన్న ఎంజెలీనా.. కావాలంటే అప్పుడప్పుడు బ్రాడ్ ఫిట్ వచ్చి చూసి వెళుతుండొచ్చని అందులో పేర్కొంది. అతడి వద్ద నుంచి ఎంజెలీనా భరణం కూడా కోరలేదు. 2004లో వీరిద్దరు ప్రేమలో పడ్డప్పుడు బ్రాడ్ కు జెన్నిఫర్ అనిస్టన్ అనే ఓ మోడల్ భార్యగా ఉంది. అయితే, బ్రాడ్ తో ఎంజెలీనా విడిపోయేందుకు ప్రధాన కారణం మాత్రం ఆస్కార్ అవార్డు వచ్చిన తర్వాత బ్రాడ్ ఫిట్ ఓ మోడల్ తో చెట్టాపట్టాలేసుకొని తిరుగుతుండటమే కాకుండా ఇంటి సంగతులు పక్కకు పెట్టినట్లు హాలీవుడ్ లో గుసగుసలు. అయితే, ఇలా విడిపోవడం హాలీవుడ్ లో సాధారణ విషయమే. -
ఔను! వాళ్లిద్దరూ విడిపోతున్నారు!
పదకొండు సంవత్సరాల వైవాహిక జీవితం.. అరడజనుకుపైగా పిల్లలు. హాలీవుడ్‌లోనే అత్యంత బలమైన అనుబంధమున్న జంటగా భావించిన బ్రాడ్ పిట్, ఏంజెలినా జోలీ వైవాహిక బంధం బీటలు వారింది. ఈ జంట విడిపోతున్నట్టు గత కొన్నాళ్లుగా వస్తున్న వార్తలు నిజమేనని తేలింది. తాజాగా ఏంజెలినా జోలీ భర్త బ్రాడ్ పిట్తో విడాకులు తీసుకొనేందుకు కోర్టును ఆశ్రయించింది. తమకు విడాకులు ఇవ్వాల్సిందిగా కోర్టులో దరఖాస్తు చేసుకుంది. గతకొన్ని నెలలుగా పిట్-జోలీ అనుబంధంలో లుకలుకలు మొదలయ్యాయని సమాచారం. గత మార్చిలో బ్రాడ్ పిట్ ఒక్కడే తమ పిల్లలు పాక్స్, జాహరా, మడొక్స్, షిల్హా, నాక్స్, వివియెన్నెలతో కలిసి షాపింగ్ చేస్తూ కనిపించడం.. వీరి బ్రేకప్ కు నిదర్శనంగా గతంలో కథనాలు వచ్చాయి. జోలీ తన డైరీలో రాసుకున్న వ్యక్తిగత నిజాలను పిట్ చదువడం వల్లే వీరి మధ్య విభేదాలు మొదలైనట్లు ఈ కథనాల సారాంశం. ఆమె గత జీవితానికి సంబంధించిన సమస్యలు మళ్లీ వెలుగుచూడటంతో, ఆమె చిత్రంగా ప్రవర్తిస్తుండటంతో బ్రాడ్ పిట్ జోలీకి దూరమవుతున్నట్టు ద నేషనల్ ఎంక్వైరెర్ పత్రిక గతంలో పేర్కొంది. పిట్తో అనుబంధం నానాటికీ సన్నగిల్లుతుండటంతో ఆమె బేలగా, నీరసంగా మారిపోయిందని, గత మార్చిలో లండన్‌లో తన పిల్లలతో బయటకొచ్చిన జోలీ 'ఎముకల గూడు'లా కనిపించడంతో ఆమె ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తమవుతున్నదని 'టచ్ మ్యాగజీన్' తెలిపింది. పిట్తో గొడవలు, వ్యవహారం విడాకుల దాకా వెళుతుండటంతో జోలీ చాలా నీరసంగా మారిపోయి మరింత బరువు తగ్గిపోయిందని, తీవ్ర ఒత్తిడిలో భావోద్వేగానికి లోనవుతున్న ఆమె శారీరకంగా, మానసికంగా బ్రేక్‌డౌన్ అయ్యేలా కనిపిస్తున్నదని ఆ మ్యాగజీన్ పేర్కొంది. ఈ పరిస్థితిలో జోలీకి సహాయపడటం కానీ, తమ వైవాహిక బంధాన్ని నిలుపుకోవడానికిగానీ బ్రాడ్ పిట్ ప్రయత్నించడం లేదని చెప్పింది. అయితే ఈ కథనాలపై గతంలో ఈ దంపతులు పెదవి విప్పలేదు. -
మా పిల్లలు నటులు కారట: హీరోయిన్
సాధారణంగా డాక్టర్ల పిల్లలు డాక్టర్లు, లాయర్ల పిల్లలు లాయర్లు, నటీనటుల పిల్లలు కూడా అదే వారసత్వం పుచ్చుకోవడం మనకు తెలుసు. కానీ, హాలీవుడ్ హీరోయిన్ ఏంజెలినా జోలీ పిల్లలు మాత్రం తాము నటనా రంగంలోకి వెళ్లే ప్రసక్తి లేదని కుండబద్దలు కొట్టి మరీ చెప్పేస్తున్నారట. జోలీకి ఆరుగురు పిల్లులన్నారు. వాళ్లు మాడాక్స్ (14), పాక్స్ (12), జహారా (11), షిలో (10), ఇద్దరు కవలలు వివెన్నె, నాక్స్ (7). అయితే ఈ ఆరుగురిలో ఎవరూ నటనా రంగంలోకి వెళ్లాలని అనుకోవట్లేదట. వాళ్లంతా సంగీతకారులు అవ్వాలనుకుంటున్నారని జోలీ చెప్పింది. బీబీసీ రేడియో కార్యక్రమంలో మాట్లాడుతూ ఆమె ఈ విషయం వెల్లడించింది. సినిమా బయటి నుంచే బాగుంటుందన్నది వాళ్ల అభిప్రాయమని, మాడాక్స్కు ఎడిటింగ్‌లోను, పాక్స్‌కు సంగీతం, డీజేయింగ్లోను ఆసక్తి ఉందని తెలిపింది. ఈ పిల్లలంతా కలిసి వాళ్లలో వాళ్లు ఏడు భాషలు నేర్చుకుంటున్నారట. -
ట్రంప్ మాటలకు హర్టయిన హీరోయిన్
లండన్: అమెరికా రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష పదవి అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్ తీరును హాలీవుడ్ హీరోయిన్ ఏంజెలినా జోలీ విమర్శించింది. ముస్లింలకు వ్యతిరేకంగా ట్రంప్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను జోలీ తప్పుపడుతూ అభ్యంతరం వ్యక్తం చేసింది. శరణార్థులకు ఐక్యరాజ్య సమితి దూతగా ఉన్న జోలీ బీబీసీ నిర్వహించిన కార్యక్రమంలో శరణార్థులతో మాట్లాడింది. అమెరికాలోకి ముస్లింలను అనుమతించరాదని ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై స్పందించమని ఓ వ్యక్తి కోరగా.. జోలీ కళ్లు మూసుకుని, నిరసనగా తల అడ్డంగా ఊపింది. అమెరికా అధ్యక్ష పదవికి పోటీ పడుతున్న వ్యక్తి నుంచి ఇలాంటి మాటలు వినాల్సిరావడం చాలి కష్టంగా ఉందని అభ్యంతరం వ్యక్తం చేసింది. 'ప్రపంచ వ్యాప్తంగా వచ్చిన వలసదారులందరితో కలసి అమెరికా నిర్మితమైంది. మతం, ప్రాంతాలకు అతీతంగా స్వేచ్ఛగా జీవించేందుకు అమెరికా వచ్చారు. ట్రంప్ అభిప్రాయం అమెరికాపై నాకున్న విజన్‌కు విరుద్ధమైనది' అని జోలీ చెప్పింది. ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లో జరిగిన ఉగ్రవాదుల దాడిలో 130 మంది మరణించిన అనంతరం ట్రంప్ ముస్లింలకు వ్యతిరేకంగా మాట్లాడుతూ.. వారిని అమెరికాలోకి రాకుండా నిషేధించాలని అన్నారు. అమెరికా అధ్యక్ష పదవికి పోటీపడిన అభ్యర్థులపైనా, పలు విదేశాలపైనా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. -
భార్య కళ్లుగప్పి.. ప్రియురాలితో హీరో చెట్టాపట్టాల్!
హాలీవుడ్ జంట బ్రాడ్ పిట్, ఏంజెలినా జోలీ బ్రేకప్ కథనాలు మళ్లీ జోరందుకున్నాయి. భార్య జోలీ కళ్లుగప్పి.. పిట్ తన ప్రియురాలు మరియన్ కాటిల్లార్డ్తో చెట్టాపట్టాలేసుకొని తిరుగుతున్నాడని తాజాగా హాలీవుడ్ కోడై కూస్తున్నది. జోలీతో తెగదెంపులు చేసుకోవాలనే ఉద్దేశంతోనే కాటిల్లార్డ్తో పిట్ ప్రణయ సల్లాపాలు నెరుపుతున్నట్టు హాలీవుడ్ వర్గాల భోగట్టా. ప్రస్తుతం పిట్, కాటిల్లార్డ్ ప్రస్తుతం 'ఫైవ్ సెకండ్స్ ఆఫ్ సైలెన్స్ ఇన్ ఇంగ్లండ్' సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నారు. 'ఈ ఇద్దరి మధ్య ఏదో గూడుపుఠాణి నడుస్తోంది. వారి మధ్య రహస్యంగా జరగకూడనిది జరుగుతోంది. తమ మధ్య ఉన్నదానిని రహస్యంగా ఉంచి పబ్లిగ్గా చూడటానికి మాత్రం తమ మధ్య ఏమీ లేనట్టు వారు నటిస్తున్నారు' అని ఈ సినిమాకు సంబంధించిన ఇన్సైడర్లు చెప్పినట్టు 'హాలీవుడ్లైఫ్.కామ్' తెలిపింది. (చదవండి: ఔను! వాళ్లు కూడా విడిపోతున్నారట!) 'గతంలో బ్రాడ్-జోలీ జంట ఎవరికివారుగా చాటుమాటుగా చిన్నపాటి సరస సల్లాపాలు నెరిపినా.. అవి పెద్ద దూరం వెళ్లకపోవడంతో వీరి బంధంపై ఆ ప్రభావం పడలేదు. కానీ బ్రాడ్ ఇటీవలికాలంలో మరియన్‌కు ఎమోషనల్‌గా దగ్గరవుతున్నాడు. ఇది ఈ జంట దాంపత్య జీవితంపై ప్రభావం చూపే అవకాశముంది. ఇది వీరి పెళ్లి పెటాకులవ్వడానికి దారితీయవచ్చు' అని సన్నిహిత వర్గాలు చెప్తున్నాయి. చైన్ స్మోకింగ్, మద్యం వంటి అలవాట్ల కారణంగా భారీగా బరువు తగ్గిన ఏంజెలినా జోలీ ప్రస్తుతం 35 కిలోల బరువుకు పడిపోయి.. బలహీనంగా మారిపోయిందని, దాంతో ఆమెను బ్రాడ్ పట్టించుకోవడం మానేశాడని గతంలో కథనాలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పదకొండు ఏళ్ల తమ వైవాహిక జీవితానికి తెరదించాలని ఈ జంట భావించినట్టు, త్వరలోనే వీరు విడాకులు తీసుకోబోతున్నట్టు గతంలోనూ కథనాలు వచ్చిన సంగతి తెలిసిందే. -
అయ్యోపాపం! వాళ్లూ విడిపోతున్నారంట!
పదకొండు సంవత్సరాల వైవాహిక జీవితం.. అరడజనుకుపైగా పిల్లలు. హాలీవుడ్‌లోనే అత్యంత బలమైన అనుబంధమున్న జంటగా భావించిన బ్రాడ్ పిట్, ఏంజెలినా జోలీ వైవాహిక బంధానికి బీటలు వారినట్టు కనిపిస్తోంది. ఈ జంట త్వరలోనే విడాకులు తీసుకోనుందన్న వార్తలు ప్రస్తుతం విదేశీ మీడియాలో పుంఖానుపుంఖాలుగా వెలువడుతున్నాయి. గతకొన్ని నెలలుగా పిట్-జోలీ అనుబంధంలో లుకలుకలు మొదలయ్యాయని, తాజాగా బ్రాడ్ పిట్ ఒక్కడే తమ పిల్లలు పాక్స్, జాహరా, మడొక్స్, షిల్హా, నాక్స్, వివియెన్నెలతో కలిసి షాపింగ్ చేస్తూ కనిపించడం.. వీరి బంధం విడిపోవడానికి చేరినట్టు సూచిస్తోందని ఇంటర్నేషనల్ బిజినెస్ టైమ్స్ పత్రిక పేర్కొంది. జోలీ తన డైరీలో రాసుకున్న వ్యక్తిగత నిజాలను పిట్ చదువడం వల్లే వీరి మధ్య విభేదాలు మొదలైనట్లు ఆ పత్రిక పేర్కొంది. ఆమె గత జీవితానికి సంబంధించిన సమస్యలు మళ్లీ వెలుగుచూడటంతో, ఆమె చిత్రంగా ప్రవర్తిస్తుండటంతో బ్రాడ్ పిట్ జోలీకి దూరమవుతున్నట్టు ద నేషనల్ ఎంక్వైరెర్ పత్రిక పేర్కొంది. పిట్తో అనుబంధం నానాటికీ సన్నగిల్లుతుండటంతో ఆమె బేలగా, నీరసంగా మారిపోయిందని, ఇటీవల లండన్‌లో తన పిల్లలతో బయటకొచ్చిన జోలీ 'ఎముకల గూడు'లా కనిపించడంతో ఆమె ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తమవుతున్నదని 'టచ్ మ్యాగజీన్' తెలిపింది. పిట్తో గొడవలు, వ్యవహారం విడాకుల దాకా వెళుతుండటంతో జోలీ చాలా నీరసంగా మారిపోయి మరింత బరువు తగ్గిపోయిందని, తీవ్ర ఒత్తిడిలో భావోద్వేగానికి లోనవుతున్న ఆమె శారీరకంగా, మానసికంగా బ్రేక్‌డౌన్ అయ్యేలా కనిపిస్తున్నదని ఆ మ్యాగజీన్ పేర్కొంది. ఈ పరిస్థితిలో జోలీకి సహాయపడటం కానీ, తమ వైవాహిక బంధాన్ని నిలుపుకోవడానికిగానీ బ్రాడ్ పిట్ ప్రయత్నించడం లేదని చెప్పింది. అయితే ఇన్ని కథనాలు వెలువడుతున్నా ఈ దంపతులు మాత్రం ఇప్పటివరకు పెదవి విప్పలేదు. -
ఏంజిలీనా వయసుతోపాటే..
- 40వ పడిలో మరో మూడు పచ్చబొట్లు పొడిపించుకున్న హాలీవుడ్ నటి ప్నోమ్ పెన్: వయసుతోపాటే తనవుపై టాటూల సంఖ్యనూ పెంచుకుంటూపోతోంది హాలీవుడ్ నటశిరోమణి ఏంజిలీనా జోలీ. ప్రస్తుతం 40వ పడిలో ఉన్న ఆమె తన మేనుపై తాజాగా మరో మూడు పచ్చబొట్లను పొడిపించుకుంది. 'ఫస్ట్ దె కిల్డ్ మై ఫాదర్' సినిమా షూటింగ్ నిమిత్తం కాంబోడియాలో ఉన్న ఏంజిలీనా ఆదివారం స్పాట్ లో తన కొత్త టాటూలను ప్రదర్శించింది. కొత్త టాటూల్లో రెండు ప్రాచీన థాయి బౌద్ధ సూచికలుకాగా, మరోటి మంచిపనులకు సంకేతంగా భావించే పెట్టె ఆకారం. తన 18వ ఏట నుంచే టాటూలు వేసుకోవడం ప్రారంభించిన ఏంజిలీనా ఇప్పటికీ ఆ అభిరుచిని కొనసాగిస్తుండటం, భర్త బ్రాడ్ పిట్ కూడా అందుకు సహకరిస్తుండటం గమనార్హం. -
ఔను! వాళ్లు కూడా విడిపోతున్నారట!
-
ఔను! వాళ్లు కూడా విడిపోతున్నారట!
ఈ ఏడాది సెలబ్రిటీ దంపతులకు ఏమాత్రం కలిసివచ్చినట్టు కనిపించడం లేదు. అన్యోన్యంగా తిరిగిన వాళ్లు, చెట్టాపట్టాలేసుకొని మీడియా ముందు కనిపించిన వారూ.. చిలుకా గోరింకలు అంటే ఉదాహరణ అనిపించిన జంటలు సైతం ఈ ఏడాది మొదలైంది మొదలు తలోబాట పడుతున్నారు. ఇన్నాళ్ల బంధానికి విడాకులు ఇస్తూ వేరవుతున్నారు. ఇప్పటికే రణ్‌బీర్ కపూర్, కత్రినా కైఫ్‌ల మధ్య బ్రేకప్ ఖాయమైపోయింది. 16 ఏళ్ల పెళ్లి బంధాన్ని తెగదెంపులు చేసుకుంటూ ఫర్హాన్ అఖ్తర్, అధునా అఖ్తర్ వేరవుతున్నట్టు ప్రకటించారు. ఇక జాబితాలో చేరేదిశగా హాలీవుడ్‌లోనే అన్యోన్యమైన జంటగా పేరొందిన ఏంజిలీనా జోలీ, బ్రాడ్ పిట్ సాగుతున్నారు. నిజమే ఈ దంపతుల అభిమానులకు ఇది షాకింగ్ వార్తనే. అయినా వ్యక్తిగత కారణాల వల్ల ఈ జంట తమ అందమైన వైవాహిక అనుబంధానికి తెరదించేదిశగా సాగుతున్నదని హాలీవుడ్లైఫ్.కామ్ వెల్లడించింది. తనకున్న సమయాన్ని ఏంజెలీనా పిల్లలు, సామాజిక కార్యక్రమాలకు వెచ్చించడంతోనే సరిపోతున్నదని, దీంతో బ్రాడ్‌తో గడుపడానికి ఆమె వద్ద పెద్దగా సమయం ఉండటం లేదని ఆ వెబ్సైట్ వెల్లడించింది. అంతేకాకుండా ఏంజిలీనాకు కొన్ని వ్యక్తిగత సమస్యలు, ఇబ్బందులు ఉన్నాయని, దీంతో ఆమె తరచూ అజ్ఞాతంలో గడుపుతుండటం బ్రాడ్ భరించలేకపోతున్నాడని, ఈ నేపథ్యంలో తమ అనుబంధాన్ని తెంచుకోవాలని ఈ జంట నిర్ణయించిందని ఆ వెబ్సైట్ తన కథనంలో తెలిపింది -
'నాకు డజను సంతానం కావాలనుకున్నా'
లాస్ఏంజిల్స్: 'ఖుషీ' సినిమా క్లైమాక్స్‌లో పవన్ కళ్యాణ్, భూమిక డజనుకుపైగా పిల్లలతో ఇక్కట్లు పడే సీన్ ఒకటి ఉంటుంది. అదేవిధంగా తనకు కూడా డజను మంది సంతానం ఉండాలన్న కోరిక ఉండేదని హాలీవుడ్ నటుడు బ్రాడ్‌పిట్ తెలిపాడు. భార్య ఏంజెలినా జోలీతో కలిసి తాను 12 మంది పిల్లల్ని కనాలని భావించినా.. ఇప్పటికే ఇంట్లో ఆరుగురు పిల్లలు ఉండటం.. వారితో వేగలేక ఇళ్లంతా గందరగోళంగా మారాడంతో ఆ ఆలోచన మానుకున్నట్టు చెప్పాడు. ఈ దంపతులకు మడోక్స్ (14), పాక్స్ (11), జహరా (10), శిలొహ్ (9), ఏడేళ్ల కవలలు నాక్స్, వివీన్నె.. మొత్తం ఆరుగురు పిల్లలు ఉన్నారు. 'ఏంజీ, నేను కలిసి 12 మంది పిల్లల్ని కనాలనుకున్నాం. కానీ ఆరుగురికే ఆపేశాం' అని 51 ఏళ్ల బ్రాడ్ చెప్పాడు. ప్రస్తుతం కుటుంబ జీవితం అప్పుడప్పుడు గందరగోళంగా తోస్తుందని ఆయన తెలిపాడు. 'ఎంతో ప్రేమిస్తారు. ఎంతో కొట్టుకుంటారు. ఎన్నో చాడీలు చెప్తారు. అందరి పళ్లు తోమాలి. ముఖం కడుగాలి.. ఇదంతా ఎంతో గందరగోళం. కానీ ఎంతో సంతోషాన్ని కూడా ఇస్తుంది' అని బ్రాడ్‌పిట్ చెప్పాడు. -
మా సమస్యలు మాకున్నాయ్!
వైవాహిక బంధాన్ని కాపాడుకోవడం భార్యాభర్తల్లిద్దరి చేతుల్లో ఉంటుంది. ఒకరి లోపాలను మరొకరు ఇష్టపడాలి. లేదా నచ్చే పద్ధతిలో చెప్పి, మార్చుకోవాలి. ఇలాంటి విషయాలను ప్రస్తావిస్తూ హాలీవుడ్ నటి, దర్శకురాలు ఏంజెలినా జోలీ తీసిన చిత్రం ‘బై ది సీ’. ఈ చిత్రంలో ఏంజెలినా, ఆమె భర్త బ్రాడ్ పిట్ భార్యాభర్తలుగా నటించారు. వైవాహిక జీవితంలో ఏర్పడిన సమస్యలను పరిష్కరించుకోవడానికి ఓ భార్య, భర్త ఏం చేశారనే కథాంశంతో ఈ చిత్రం ఉంటుంది. రియల్ లైఫ్‌లో తనకూ, బ్రాడ్కూ మధ్య సమస్యలున్నాయంటూ -‘‘ఏ కాపురంలో అయినా అలకలు, కలతలు ఉంటాయి. అవి విడిపోవడానికి కారణం కాకూడదు. అంత దూరం వెళ్లనివ్వకుండానే సమస్యలను పరిష్కరించుకోవాలి. మా మధ్య పొరపొచ్ఛాలు వచ్చినప్పుడు మేం కూర్చుని మాట్లాడుకుంటాం. ఏ విషయాన్నీ తెగేదాకా లాగం. మా సమస్యలను సినిమాలో పెట్టలేదు. సినిమాలో చూపించినవి వేరు’’ అని ఏంజెలినా చెప్పారు. బ్రాడ్ పిట్, ఏంజెలినా పదేళ్ల తర్వాత ఈ చిత్రం కోసం మళ్లీ జత కట్టారు. -
ఆ వయసు కోసం వెయిట్ చేస్తున్నా!
లండన్: వయసు పెరుగుతుంటే... ఎవరికైనా కొంచెం ఉత్సాహం..కొంచెం ఉద్వేగం ఉంటాయి. అదే యాభైలలో పడుతుంటే మాత్రం కొంచెం ఆందోళన ఉంటుంది. అందులోనూ గ్లామర్ ప్రపంచంలో ఉన్న మహిళలకు మరింత ఎక్కువే ఉంటుంది. అయితే హాలీవుడ్ నటి, దర్శకురాలు, బోల్డ్ బ్యూటీ ఏంజిలీనా జోలీ మాత్రం తన వయసు పెరుగుతోంటే ఎగ్జయిటింగ్ గా ఫీలవుతోందట. తన జీవితంలో మరోమైలు రాయిని అధిగమించడానికి ఆమె చాలా ఉత్సాహంగా ఎదురు చూస్తున్నట్లు చెబుతోంది. 'నాకు ఇపుడు 40సంవత్సరాలు. ఇంకో పదేళ్లలో యాభై ఏళ్లు నిండుతాయి. యస్ ....అప్పటివరకూ వెయిట్ చేయలేకపోతున్నానని' చెప్పుకొచ్చింది ఈ హాలీవుడ్ బ్యూటీ. ఇంతకీ ఏంజిలీనా జోలీ 50 ఏళ్ల వయసు కోసం ఎందుకింత ఆత్రుతగా ఉందో తెలుసా.. ఇప్పటికే ఆమె కుటుంబీకుల్లో ఇద్దరు మహిళలు ఒవేరియన్ క్యాన్సర్ తో బాధపడుతూ నలభైయేళ్ల లోపే చనిపోయారు. అయితే జోలీకి 40 ఏళ్లు అయినా ఆ మహమ్మారి తన దరికి చేరలేదనే ఆనందంతో ఇలా ఉత్సాహంగా ఉన్నట్లు ఉంది కాబోలు. కాగా ఏంజిలీనా అమ్మ, అమ్మమ్మ ఇద్దరూ కాన్సర్ బాధితులే. ఈ నేపథ్యంలోనే ఏంజిలీనా క్యాన్సర్ రాకుండా ముందుగానే శస్త్ర చికిత్స చేయించుకుంది. గర్భసంచి, రెండు ఫాలోపియన్ ట్యూబులను తొలగించుకొంది. హై రిస్క్ గ్రూప్ లో ఉండడం వల్లనే ఇలా ఆపరేషన్ చేయించుకున్నానని జోలీ బహిరంగంగా ప్రకటించడం అప్పట్లో సంచలనం సృష్టించింది. -
బాలికను దత్తత తీసుకోనున్న ఏంజెలినా జోలి
న్యూయార్క్ : ముగ్గురు రక్తం పంచుకుని పుట్టిన బిడ్డలతోపాటు మూడు జాతులకు చెందిన ముగ్గురు అనాథ పిల్లలను దత్తత తీసుకుని కన్నబిడ్డల్లా పెంచుకుంటున్న హాలీవుడ్ అందాల తార ఏంజెలినా జోలి మరో అనాథ బిడ్డను దత్తత తీసుకోవాలని నిర్ణయించింది. ఈసారి అంతర్యుద్ధంతో రగిలిపోతున్న సిరియాకు చెందిన అనాథ బాలికను దత్తత తీసుకోవాలని నిర్ణయించినట్టు సన్నిహిత వర్గాల ద్వారా తెలిసింది. ఐక్యరాజ్య సమితి శరణార్థుల అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న జోలీ ఇటీవల పలు దేశాల్లోని సిరియా శరణార్థుల శిబిరాలను సందర్శించారు. అక్కడ తల్లిదండ్రులను కోల్పోయిన ముగ్గురు అనాథ బాలల పరిస్థితిని చూసి కదిలిపోయారు. ఆ ముగ్గురు పిల్లలను దత్తత తీసుకోవాలని నిర్ణయానికొచ్చి భర్త బ్రాడ్ పిట్‌కు తన నిర్ణయాన్ని తెలియజేశారట. అయితే ఇప్పటికే ఆరుగురు పిల్లలున్నారని, మరో ముగ్గురు చేరితే తొమ్మిదిమందవుతారని, అంతమందిని చూసుకోవడం కష్టమని, పైగా కొత్త పిల్లలతో సర్దుబాటవటం కూడా కష్టమేనని బ్రాడ్ వాదించారని సన్నిహిత వర్గాలను ఉటంకిస్తూ రేడార్ డాట్ కామ్ వెల్లడించింది. చివరకు సిరియాకు చెందిన ఓ అనాథ ఆడపిల్లను దత్తత తీసుకోవాలని భార్యాభర్తలిద్దరూ ఓ నిర్ణయానికి వచ్చినట్లు ఆ వెబ్సైట్ తెలిపింది. సిరియాలో అంతర్యుద్ధం కారణంగా 70 వేల మంది పిల్లలు తండ్రులను కోల్పోగా, 3,700ల మంది పిల్లలు తల్లిదండ్రులను కోల్పోయారు. ఈ ఏడాదిలోనే ఓ అనాథ సిరియా బాలికను ఏంజెలినా జోలి దత్తత తీసుకునే అవకాశం ఉందని సన్నిహితవర్గాలు చెప్పాయి. భౌతికంగా పిల్లలను కనే అవకాశం జోలికి లేదనే విషయం తెలిసిందే. వంశపారంపర్యంగా తమ కుటుంబంలో వస్తున్న కేన్సర్ ను నివారించడంలో భాగంగా ఆమె అండాశయాన్ని, బ్రెస్ట్‌ను తొలగించుకున్నారు. -
అమ్మకానికి నటి న్యూడ్ చిత్రాలు
లండన్ : ప్రముఖ నటి, హాలీవుడ్ తార ఏంజిలీనా జోలి అరుదైన న్యూడ్ చిత్రాలను లండన్‌లో అమ్మకానికి పెట్టారు. స్థానిక జీబ్రా వన్ గ్యాలరీలో జోలీ ఫోటోలు విక్రయిస్తున్నారు. బ్లాక్ అండ్ వైట్ ఉన్న ఈ తార ఒక్కొక్క ఫోటో రూ. 1,82,000 ధర పలుకుతోంది. అయితే ఆమె ఈ ఫోటోలు 1995లో దిగింది. అప్పటికి జోలీ వయస్సు 20 ఏళ్లు. ఏంజిలీనా జోలి ఈ ఏడాది 40వ పడిలో అడుగుపెట్టనుంది. ఈ మేరకు లండన్‌లోని కాంటాక్ట్ మ్యూజిక్ బుధవారం వెల్లడించింది. -
ఏంజెలినా జోలీకి కోపం వచ్చినవేళ!
ఐక్యరాజ్యసమితి: ఐక్యరాజ్య సమితి కాందిశీకుల హైకమిషనర్ ప్రత్యేక రాయబారి, హాలీవుడ్ నటి ఏంజెలినా జోలీ భద్రతా మండలిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. న్యూయార్క్‌లోని ఐక్యరాజ్య సమితిలో శుక్రవారం భద్రతా మండలిని ఉద్దేశించి ఆమె ప్రసంగించారు. సిరియా సంక్షోభాన్ని పరిష్కరించే శక్తిసామర్థ్యాలు భద్రతా మండలికి ఉన్నప్పటికీ, వాటిని వాడుకోవడం లేదని తీవ్రస్థాయిలో విమర్శించారు. మండలికి ఐక్యత, రాజకీయ సంకల్పం కొరవడిందని ఆమె మండిపడ్డారు. అయిదు సంవత్సరాలుగా సిరియాలో జరుగుతున్న సంఘర్షణలు, సంక్షోభం కారణంగా రెండు లక్షల 20వేల మంది చనిపోయారు. పది లక్షల మందికి పైగా ప్రజలు గాయపడ్డారు. 76 లక్షల మంది వారు నివసించే ప్రదేశాల నుంచి వెళ్లిపోయారు. దాదాపు 40 లక్షల మంది పొరుగుదేశాలకు వెళితే అక్కడ తిరస్కరించబడ్డారు. ఈ సమస్యను రాజకీయంగా పరిష్కరించాలన్న సంకల్పం లేకపోవడంవల్లే ఈ పరిస్థితి ఏర్పడిందన్నారు. ఈ పరిస్థితులలో సిరియా సంక్షోభం సమసిపోయే దిశగా భద్రతా మండలి పనిచేయాలని శరణార్ధుల తరపున ఆమె మండలికి విజ్ఞప్తి చేశారు. మండలి తన అధికారాలను వినియోగించి సిరియాలో సంఘర్షణలకు చరమగీతం పాడి సిరియన్లకు న్యాయం చేయాలని ఆమె కోరారు. మండలిలోని దేశాల విదేశాంగ మంత్రులు అందరూ కలసి ఈ సమస్యకు ఒక రాజకీయ పరిష్కారం కనుగొనాలని ఏంజెలినా జోలీ విజ్ఞప్తి చేశారు. -
ఏంజెలినా జోలీకి ఏడో పాప
మూడు దేశాలు, మూడు జాతులకు చెందిన పిల్లలను దత్తత తీసుకొని జాతులే కాదు దేశాల సరిహద్దులకు కూడా తాను అతీతమని నిరూపించుకొన్న హాలీవుడ్ గ్లామరస్ హీరోయిన్ ఏంజెలినా జోలీ ఇప్పుడు అంతర్యుద్ధంతో రగిలిపోతున్న సిరియా నుంచి ఓ పాపను దత్తత తీసుకోబోతోంది. గత మూడేళ్లలో ఐక్యరాజ్య సమితి అంబాసిడర్‌గా పలుసార్లు సిరియాను సందర్శించిన ఏంజెలినా.. అక్కడి శరణార్థుల శిబిరాల్లో నెలకొన్న పరిస్థితులను చూసి చలించిపోయారు. ముఖ్యంగా ఆడేపాడే వయస్సులో ఆకలితో అలమటిస్తున్న పిల్లలను చూసి జాలిపడ్డారు. 'బాల్యాన్ని హైజాక్ చేస్తారా' అంటూ టెర్రరిస్టులను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. అప్పటి నుంచే సిరియా శరణార్థుల శిబిరాల నుంచి ఓ ఆడపిల్లను దత్తత తీసుకోవాలనే ఆలోచన ఏంజెలినా మనసులో నాటుకుపోయిందని, ఇప్పుడు ఓ పాప దత్తత కోసం దరఖాస్తు కూడా చేసుకున్నారని 'యూఎస్ వీక్లీ' గురువారం ఓ కథనాన్ని ప్రచురించింది. దత్తత తీసుకున్న ముగ్గురు పిల్లలు, తన కడుపున పుట్టిన ముగ్గురు పిల్లలతో కలుపుకొని ఆమెకు ఆరుగురు పిల్లలు ఉన్నారు. ఆమె ఎప్పటి నుంచో బ్రాడ్ పిట్తో కలసి కాపురం చేస్తున్న ఆమె తన 38వ ఏట గతేడాదే ఆయన్ని పెళ్లి చేసుకున్నారు. ఆరుగురు పిల్లలతో వారు కాలిఫోర్నియాలోని తమ ఇంట్లో ఉంటున్నారు. మడోక్స్ (13 ఏళ్లు), పాక్స్ (11), జహరా (10), శిలోహ్ (8), వివిన్నే (6), నాక్స్ (6). వివిన్నే, నాక్స్లు కవల పిల్లలు. కాంబోడియాలోని నామ్‌పెన్ నగరం అనాథాశ్రయం నుంచి మడోక్స్ను, వియత్నాంలోని హోచిమన్ నగరం అనాథాశ్రయం నుంచి పాక్స్, ఇథియోపియాలోని అడి అబాబా నగరం అనాథాశ్రయం నుంచి జహరాలను ఏంజెలినా దత్తత తీసుకున్నారు. ఇకముందు పిల్లలు పుట్టే అవకాశం లేకుండా ఆమె ఇటీవలనే అండాశయాన్ని తొలగించుకున్నారు. ఆమె తల్లి, ఇద్దరు సోదరీమణులు అండాశయ క్యాన్సర్‌తో చనిపోవడంతో, జన్యుపరంగా తనకు కూడా క్యాన్సర్ సోకే అవకాశం ఉండడంతో ముందుజాగ్రత్తగా దాన్ని తొలగించుకున్నారు. క్యాన్సర్ భయంతో ఆమె ఇదివరకే తన బ్రెస్ట్ తొలగించుకున్న విషయం తెలిసిందే. -
టాప్ అప్!
హాలీవుడ్ సుందరాంగి ఏంజలినా జోలీ తనకున్న పాపులారిటీ ఎంతో మరోసారి చాటిచెప్పింది. ఎమ్మా వాట్సన్ వంటి మెగా భామలందరినీ వెనక్కి నెట్టి ‘యూకే టాప్ ఫెమినిస్ట్ ఐకాన్’గా నిలిచింది. ‘రోజ్ అండ్ విల్లార్డ్’ ఫ్యాషన్ హౌస్ జాతీయ స్థాయిలో నిర్వహించిన పోల్‌లో ఈ ముప్పై తొమ్మిదేళ్ల నటి, యాక్టివిస్ట్‌కు పట్టం కట్టారు. యూఎన్ గుడ్‌విల్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న నటి ఎమ్మా వాట్సన్ రెండో స్థానం దక్కించుకుంది. ఇటీవలే జండర్ ఈక్వాలిటీ క్యాంపెయిన్ ‘హి ఫర్ షీ’ లాంచ్ చేసి సేవలందిస్తోంది ఎమ్మా. ప్రొఫెషనల్‌గానే కాకుండా సామాజిక సేవలో భాగంగా మహిళా సాధికారత కోసం కృషి చేస్తున్న జోలీ పర్ఫెక్ట్ ఫెమినిస్ట్ ఐకాన్ అని పోల్ నిర్వహించిన సంస్థ వ్యవస్థాపకులు హైదీ రెహమాన్ చెప్పారు. కెయిట్లిన్ మారన్, జెనిఫర్ లారెన్స్, జర్మైన్ గ్రీర్, టేలర్ స్విఫ్ట్ తరువాతి స్థానాల్లో ఉన్నారు. -
ఫెమినిస్ట్ ఐకాన్‌గా ఏంజిలినా
లండన్: హాలీవుడ్ తార ఏంజిలినా జోలి మరో ఘనత దక్కించుకున్నారు. బ్రిటన్‌లో ఆమె టాప్ ఫెమినిస్ట్ ఐకాన్‌గా నిలిచారు. ఇప్పటికే ఐక్యరాజ్య సమితి ప్రత్యేక రాయబారిగా పనిచేస్తున్న ఆమె ఇటీవల కాలంలో మహిళలపై అత్యాచారాలకు వ్యతిరేకంగా నిరంతరం ప్రచారం నిర్వహించడంతో ఆమె ఈ ఏడాది బ్రిటన్ ఫెమినిస్ట్ ఐకాన్‌గా నిలిచారు. ఈ అవార్డుకు గానూ ఆమె జర్మన్‌కు చెందిన హక్కుల కార్యకర్త గ్రీర్ నుంచి గట్టి పోటీని ఎదుర్కొన్నారు. 'మేం మహిళ స్వశక్తితోనే ముందుకు వెళుతున్నాం. వారి ఘనతకు గుర్తింపుగా మహిళలకు సంబంధించిన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. మహిళల హక్కుల విషయంలో ఏంజిలినా చాలా చక్కగా పనిచేస్తున్నారు' అని ఫెమినిస్ట్ ఫ్యాషన్ వ్యవస్థాపక అధ్యక్షులు హైడీ రహ్మాన్ తెలిపారు. ఈ అవార్డు అందజేయడం కోసం డబ్ల్యూ డబ్ల్యూడబ్ల్యూ.రోసియాండ్విల్లార్డ్.కామ్ అనే సంస్థ బ్రిటన్ వ్యాప్తంగా ఆన్ లైన్ పోల్ నిర్వహించింది. -
బాల్యవివాహాలకు వ్యతిరేకంగా...
‘‘ఆడపిల్లల కలల్ని, ఆశల్ని చిదిమేస్తూ 18 ఏళ్లలోపే వారికి పెళ్లిచేయడం నిజంగా దారుణం, అభివృద్ధి చెందుతున్న దేశాల్లోనే ఇలాంటివి జరగడం అత్యంత హేయమైన విషయం’’ అని హాలీవుడ్ బ్యూటీ, మానవహక్కుల కార్యకర్త ఏంజెలినా జోలీ పేర్కొన్నారు. ఇటీవల ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఏంజెలినా బాల్యవివాహాలపై ఫైర్ అయ్యారు. ఎక్కడైనా బాల్య వివాహం జరుగుతోందని తనకు తెలిస్తే, అక్కడికి స్వయంగా వెళ్లి అడ్డుకోవడానికి వెనకాడనని కూడా జోలీ పేర్కొన్నారు. కేవలం మాటలకు మాత్రమే పరిమితం కాకుండా బాల్యవివాహాలకు వ్యతిరేకంగా తీసిన ఇతోపియన్ చిత్రం ‘డిఫ్రెట్’కి ఆమె సంయుక్త భాగస్వామిగా వ్యవహరిస్తున్నారు. దీన్నిబట్టి బాల్య వివాహాలను అడ్డుకోవడం అనే విషయాన్ని జోలీ ఓ ఉద్యమంలా తీసుకున్నారని చెప్పొచ్చు. -
ప్రపంచ ఆరాధ్య మహిళ.. ఏంజెలీనా..!
హాలీవుడ్ నటి, ఫిల్మ్ మేకర్ ఏంజెలీనా జోలీ క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. వయసు మీదపడుతున్నా ఏంజెలీనా పట్ల తగని ఆదరణ కనిపిస్తోంది. తాజాగా ఈమె ప్రపంచ ఆరాధ్య మహిళగా నిలిచింది. వెబ్ ఆధారితంగా జరిగిన ఒక పోల్ లో అనేక మంది మహిళామణుల మధ్య ఏంజెలీనాను ఆరాధ్యమైన మహిళగా నిలిపారు అభిమానులు. యువ్గోవ్ అనే సంస్థ నిర్వహించిన ఈ సర్వేలో 23 దేశాలకు చెందిన దాదాపు పాతికవేల మంది నెటిజన్లు పాల్గొన్నట్టుగా తెలుస్తోంది. ఇటీవలే నోబెల్ పురస్కారాన్ని పొందిన యూసూఫ్ మలాలాజాయ్, ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన మహిళగా గుర్తింపు ఉన్న జర్మన్ ఛాన్సలర్ ఏంజెలా మోర్కెల్, అమెరికా తొలి మహిళ మిషెల్ ఒబామా, బ్రిటన్ క్వీన్ ఎలిజబెత్ , కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ వంటి ప్రముఖులందరికన్నా ఈ పోల్ లో ఏంజెలీనా కే ఎక్కువ ఆదరణ కనిపించింది. మలాలా రెండో స్థానంలో నిలవగా... హిల్లరీ క్లింటన్, క్వీన్ ఎలిజబెత్ , మిషెల్ ఒబామాలు ఆ తర్వాతి స్థానాల్లో నిలిచారు. అమెరికా టీవీ వ్యాఖ్యాత ఓప్రా విన్ ఫ్రే, హాలీవుడ్ నటి జూలియా రాబర్ట్స్, రాజకీయ వేత్త అంగ్ సన్ సూకీ లు కూడా టాప్ 10 లో నిలిచారు. పురుషుల విభాగంలో మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ మొదటి స్థానంలో నిలిచారు. -
మేము ముందే పెళ్లి చేసుకున్నాం!
కాలిఫోర్నియా: అమెరికాలో జరిగిన పెళ్లి వేడుకకు ముందే ఏంజిలీనా జోలీ-బ్రాడ్ పిట్ ల జోడీ ఒక్కటైందట. గత సంవత్సరం ఆగస్టులో పిల్లల సమక్షంలో జరిగిన పెళ్లి తంతుకు ముందే తాము వివాహం చేసుకున్నట్లు హాలీవుడ్ నటి, దర్శకురాలు ఏంజిలీనా తాజాగా స్పష్టం చేసింది. 'ఒక రోజు ఫ్రాన్స్ లో నాలుగు గంటల సమయంలో బ్రాడ్ ను కలిశాను. తరువాత కొన్ని వివాహ పత్రాలపై ఇద్దరం సంతకాలు చేసి ఒక్కటయ్యాం' అని ఏంజలీనా తెలిపింది. అయితే తాము ఫ్రాన్స్ లో చేసుకున్న వివాహం చట్టబద్ధంగా జరగకపోవడంవల్ల మరోసారి కాలిఫోర్నియాలో పెళ్లి చేసుకున్నామన్నామని తెలిపింది. -
పదేళ్ల తర్వాత మళ్లీ జంటగా...
‘‘నా భర్తను డెరైక్ట్ చేయడం ఓ సరికొత్త అనుభూతినిస్తోంది’’ అంటున్నారు హాలీవుడ్ స్టార్ ఏంజెలినా జోలీ. ప్రస్తుతం ఆమె దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘బై ది సీ’. వైవాహిక బంధాన్ని కాపాడుకోవడానికి ఓ భార్య, భర్త ఏం చేశారన్న కథాంశంతో ఈ చిత్రం సాగుతుంది. ఎన్నో ఏళ్ల క్రితం జోలీ ఈ కథ రాసుకున్నారట. కథానాయికగా బిజీగా ఉన్నందున, దర్శకత్వ శాఖలోకి అప్పుడే అడుగుపెట్టడం ఇష్టం లేక ఆమె ఈ కథను తెరకెక్కించలేదు. గత ఏడాది ఆమె బ్రాడ్ పిట్‌ను పెళ్లి చేసుకున్నారు. అప్పట్నుంచీ ఈ కథను వెండితెరపై ఆవిష్కరించాలనే పట్టుదలతో ఉన్నారు జోలీ. ఇందులో తన నిజజీవిత భర్త బ్రాడ్‌పిట్, తానూ భార్యాభర్తలుగా నటిస్తే బాగుంటుందని భావించి, ఈ ఏడాది ఈ చిత్రాన్ని ఆరంభించారు. వచ్చే ఏడాది ప్రథమార్ధంలో ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారు. 2005లో జోలీ, పిట్లు ‘మిస్టర్ అండ్ మిసెస్ స్మిత్’లో నటించారు. పదేళ్ల తర్వాత తామిద్దరం మళ్లీ జంటగా నటిస్తున్నందుకు జోలీ పరమానందపడిపోతున్నారు. -
నన్ను జోలీ దంపతులు కిడ్నాప్ చేశారు!
లాస్ ఏంజిల్స్: తనను హాలీవుడ్ నటి ఏంజిలీనా జోలీ మరియ ఆమె భర్త బ్రాడ్ పిట్ లు కిడ్నాప్ చేశారంటూ సింగర్ క్రిస్ మార్టిన్ తెలిపాడు. ఏంజిలీనా జోలీ దర్శకత్వం వహిస్తున్న 'అన్ బ్రోకెన్' సినిమాకు పిట్ రాస్తున్న పాట కోసం తనను కిడ్నాప్ చేశారని మార్టిన్ అన్నాడు. 'తొలుత ఆ సినిమాకు సంబంధించి ఒక సందేశాన్ని జోలీ-పిట్ లు పంపారు. ఆ పాట ఎలా వస్తుందో నన్ను చూడమంటూ ఆ మెస్సేజ్ సారాంశం. ఇందుకోసం వారు ముందు హెచ్చరించినట్లుగానే నన్ను కిడ్నాప్ చేశారు. తలపై కొట్టడమే కాకుండా ముఖంపై స్ప్రే చేశారు. తరువాత చూస్తే తాను ఒక ఆఫీస్ లో ఉన్నానన్నాడు. అక్కడ బ్రాడ్ పిట్ ఎక్సర్ సైజ్ లు చేస్తుండగా.. ఏంజిలీనా జోలి భర్త ముందు కూర్చుని ఉంది. అంతేకాకుండా ఓ వ్యక్తి తనపీకపై కత్తిపెట్టి కూర్చున్నాడన్నాడు. ప్రస్తుతం పాట రాస్తున్నామని.. అది విన్నాక అభిప్రాయం చెప్పమన్నారని వారు తనకు తెలిపారని మార్టిన్ అన్నాడు. కాకపోతే ఇక్కడ ఒక ట్విస్ట్ ఉందండోయ్. ఇదంతా తమ వద్ద ఉన్న సాన్నిహిత్యం కారణంగానే అంటూ మార్టిన్ జోక్ పేల్చాడు. -
ఆస్కార్ రావాలి!
హాలీవుడ్ హాట్ లేడీ ఏంజెలినా జోలీలో మంచి దర్శకురాలు కూడా ఉన్నారు. మూడేళ్ల క్రితం ‘ఇన్ ది ల్యాండ్ ఆఫ్ బ్లడ్ అండ్ హనీ’ అనే చిత్రానికి దర్శకత్వం వహించారామె. ఈ చిత్రానికి మిశ్రమ స్పందన లభించినప్పటికీ, జోలీ డెరైక్షన్‌కి మంచి పేరొచ్చింది. తాజాగా ఆమె ‘అన్బ్రోకెన్’ అనే చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ చిత్రానికి ఆస్కార్ అవార్డు రావాలని కోరుకుంటున్నారామె. ఉత్తమ సహాయ నటిగా గతంలో ఆస్కార్ అందుకున్నారు జోలీ. కాబట్టి, ఆస్కార్ అనుభూతి ఆమెకు కొత్త కాదు. కానీ, ‘అన్బ్రోకెన్’కు ఎందుకు ఆస్కార్ దక్కాలనుకుంటున్నారో ఏంజెలినా చెబుతూ -‘‘రెండో ప్రపంచ యుద్ధంలో సైనికులకు చిక్కి, జైలు శిక్ష అనుభవించి, ఆ తర్వాత అందులో నుంచి బయటపడిన క్రీడాకారుడు లూయిస్ జంపెరిని జీవితం ఆధారంగా రూపొందించిన చిత్రమిది. ఎంతోమందికి ఆదర్శంగా నిలిచినజంపెరిని జీవితాన్ని తెరపై ఆవిష్కరించడానికి చాలా శ్రమపడ్డాను. ఈ చిత్రానికి ఆస్కార్ అవార్డు వస్తే ఆ శ్రమకు తగిన ప్రతిఫలం దక్కినట్లు అవుతుంది’’ అని వ్యాఖ్యానించారు. -
ఇక నటనకు గుడ్ బై!
లాస్ ఏంజిల్స్:హాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఏంజిలీనా జోలీ నటనకు గుడ్ బై చెప్పనుందా? ఆమె దృష్టి నటన నుంచి దర్శకత్వం వైపు మళ్లిందా?అంటే ఆమె తాజా వ్యాఖ్యలను బట్టి అవుననక తప్పదు. తనకు కెమెరా ముందు నిలబడటం కంటే మెగా ఫోన్ చేతిలో పట్టుకోవడమంటేనే ఇష్టమంటోంది. అయితే తాను దర్శకురాలిని అవుతానని ఎప్పుడూ అనుకోలేదని హొయలు ఒలగబోస్తోంది. 'నాకు నటించడమంటే అస్సలు ఇష్టం ఉండేది కాదు. కెమెరా ముందు ఎప్పుడూ నిలబడాలన్నా అసౌకర్యంగా ఫీలయ్యేదాన్ని. ఇక నుంచి పూర్తి స్థాయిలో ఫిల్మ్ మేకింగ్ పై దృష్టి పెడతా. దర్శకత్వ శాఖలో కూడా రాణిస్తానని ఆశిస్తున్నా' అని ఏంజిలీనా స్పష్టం చేసింది. చివరిసారిగా ఏంజిలీనా 'మేల్ ఫీసెంట్' చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే. గత మే నెల్లో విడుదలైన ఆ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను కొల్లగొట్టింంది. -
ఏంజలీనా జోలీకి రాజకీయాలపై గాలి మళ్లింది!
లాస్ ఏంజిలెస్: ప్రముఖ హాలీవుడ్ నటి, ఆస్కార్ విజేత ఏంజలీనా జోలీకి రాజకీయాలపై గాలి మళ్లింది. ఈ విషయాన్ని ఆమే స్వయంగా ఓ మ్యాగజైన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. మానవతావాదిగా, ఐక్యరాజ్య సమితి ప్రత్యేక రాయబారిగా ప్రపంచవ్యాప్తంగా ఎన్నో చారిటీ సంస్థలకు ఆమె సహాయ సహకారాలు అందిస్తున్నారు. తాను చేపడుతున్న మానవతావాద కార్యక్రమాలే రాజకీయాలపై తన ఆసక్తిని పెంచాయని ఏంజలీనా తెలిపారు. రాజకీయాలను కెరీర్‌గా ఎంచుకుంటారా? అన్న ప్రశ్నికు, అందుకు తాను సుముఖంగానే ఉన్నట్లు తెలిపారు. మానవతావాదిగా పనిచేసేవారు, సమాజంలో సమూల మార్పులు తీసుకురావాలనుకునే వారు రాజకీయాలలోకి రావాలని అనుకుంటారన్నారు. అయితే తన రాజకీయ ఆకాంక్షకు సినీ కెరీర్ అవరోధం కావచ్చన్న అభిప్రాయాన్ని ఆమె వ్యక్తం చేశారు. సమాజంలో తాను ఏ పాత్రను పోషించడం ద్వారా మరింత ప్రయోజనం చేకూర్చగలనో తనకైతే ఇప్పటికి తెలియదన్నారు. అయితే తన జీవనోపాధి (సినీ రంగం) వల్ల తన ఆకాంక్ష సాధ్యమయ్యే అవకాశం తక్కువగా ఉందని మాత్రం ఆమె పేర్కొన్నారు. ** -
ఏంజెలినా జోలీ దర్శకత్వంలో ఆఫ్రికా!
‘‘నాకు ఆఫ్రికాతో మంచి అనుబంధం ఉంది. అక్కడి సంస్కృతి, సంప్రదాయాలంటే నాకు చాలా మక్కువ’’ అని ఏంజెలినా జోలీ అంటున్నారు. ఈ హాలీవుడ్ హాట్ లేడీ ప్రత్యేకంగా ఆఫ్రికా గురించి చెప్పడానికి కారణం ఉంది. ఆ దేశపు అడవుల్లో జరిగిన ఏనుగు దంతాల అక్రమ రవాణా నేపథ్యంలో ఓ చిత్రం రూపొందనుంది. ‘ఆఫ్రికా’ టైటిల్‌తో రూపొందనున్న ఈ చిత్రానికి ఏంజెలినా దర్శకత్వం వహించనున్నారు. కథానాయికగా మంచి పేరున్న జోలీ దర్శకురాలిగా రెండు, మూడు చిత్రాలు చేశారు. తాజాగా ఈ చిత్రం చేయడానికి అంగీకరించారు. ఆఫ్రికన్ ఏనుగు దంతాలను అక్రమంగా రవాణా చేసేవారి గురించి విస్తృతంగా ప్రచారం చేసిన పేలియో ఆంథ్రోపాలజిస్ట్ (అంతరించిన మానవ జాతుల సమూహ జీవనాల గురించి అధ్యయనం చేసే నిపుణులు) రిచర్డ్ లీ జీవితం ఆధారంగా ఈ చిత్రం రూపొందించనున్నారు. కెన్యాలో జంతు సంరక్షణ సేవా సంస్థకు రిచర్డ్ ఒకప్పుడు అధినేతగా కూడా ఉన్నారు. ఏనుగు దంతాల అక్రమ రవాణాను అరికట్టడానికి ఎంతో కృషి చేశారాయన. మూగజీవాల కోసం పని చేసిన మనసున్న వ్యక్తి జీవితం ఆధారంగా రూపొందే ఈ చిత్రానికి దర్శకత్వం వహించే అవకాశం రావడంపట్ల జోలీ ఆనందం వెలిబుచ్చారు. ‘ఫారెస్ట్ గంప్’ అనే చిత్రానికి ఉత్తమ రచయితగా ఆస్కార్ అవార్డు అందుకున్న ఎరిక్ రోథ్ ఈ చిత్రానికి స్క్రీన్‌ప్లే అందిస్తున్నారు. -
ఏంజెలినా ఫ్లోటింగ్ ప్యాలెస్!
వైవాహిక జీవితాన్ని సరికొత్తగా ఆస్వాదించాలని డిసైడ్ అయినట్టున్నారు హాలీవుడ్ స్టార్ జంట బ్రాడ్ పిట్, ఏంజెలినా జోలీ. దాదాపు 250 మిలియన్ పౌండ్లు వెచ్చించి విలాసవంతమైన నావను కొనుగోలు చేశారు. అలలపై అలాఅలా తేలిపోయే ఈ ఫ్లోటింగ్ ప్యాలెస్‌ను తమ అభిరుచికి అనుగుణంగా తయారు చేయించుకొంటున్నారు. అంతేకాదు... దీన్ని మరింత ఆధునీకరించేందుకు అక్షరాలా మరో రెండు లక్షల పౌండ్లు ఖర్చు చేసేందుకు సిద్ధంగా ఉన్నారట ఈ కొత్త జంట. ఇటాలియన్ బోట్ మేకింగ్ సంస్థ రిజర్డీ దీన్ని రూపొందిస్తోందని ‘ది మిర్రర్’ కథనం. -
2500 కోట్లతో భారీ పడవ కొన్న దంపతులు!
హాలీవుడ్ దంపతులు బ్రాడ్ పిట్, యాంజెలీనా జోలీ ఓ విలాసవంతమైన పడవ కొన్నారు. దాని విలువ దాదాపు 2500 కోట్లు! దాన్ని మరో రెండు కోట్లు వెచ్చించి తమకు తగినట్లుగా మార్పులు చేర్పులు చేయించుకున్నారు. విలాసవంతంగా.. నీళ్లమీద తేలియాడే ప్యాలెస్ లాంటి ఈ పడవలో అత్యద్భుతంగా ఉండే ఇటాలియన్ మార్పుల్ వాడతారు. ఇటాలియన్ కంపెనీ రిజార్డీ ఈ పడవను తయారుచేసింది. డిజిటల్ కెమెరాలను అడ్డుకునే ప్రత్యేక టెక్నాలజీ కూడా ఇందులో ఉంది. అంటే.. ఇందులో ఉన్నవాళ్లను ఫొటో తీయడం దాదాపు అసాధ్యం అన్నమాట 50 ఏళ్ల బ్రాడ్ పిట్, 39 ఏళ్ల యాంజెలీనా జోలీ ప్రస్తుతం మాల్టాలో ఓ సినిమా షూటింగులో ఉన్నారు. గత నెలలో ఫ్రాన్సులో వీళ్లిద్దరూ రహస్యంగా పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. -
ఎట్టకేలకు జోలీ పెళ్లి
లాస్ ఏంజెలిస్: హాలీవుడ్ జంట ఏంజెలినా జోలీ, బ్రాడ్‌పిట్ ఎట్టకేలకు వైవాహిక బంధం తో ఒక్కటయ్యారు. తొమ్మిదేళ్లుగా సహ జీవనం చేస్తున్న వీరు శనివారం ఫ్రాన్స్‌లో కుటుంబసభ్యులు, సొంత బిడ్డలు, సన్నిహితుల మధ్య రహస్యంగా వివాహం చేసుకున్నారు. జోలీ(39)కి మూడో వివాహం కాగా, బ్రాడ్‌పిట్(50)కి రెండోది. వీరిద్దరూ ఒక ఆడపిల్ల, ఇద్దరు కవలలకు జన్మనిచ్చారు. మరో ఆడపిల్ల, ఇద్దరు మగపిల్లలను దత్తత తీసుకున్నారు. 2005లో ‘మిస్టర్ అండ్ మిసెస్ స్మిత్’ సినిమాలో తొలిసారిగా కలిసి నటించిన తర్వాత ఇన్నేళ్లకు మళ్లీ ‘బై ద సీ’ సినిమాలో జతకడుతున్నారు. ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నది జోలీయే. -
ఫ్రాన్స్ లో ఏజెంలీనా జోలీ, బ్రాడ్ పిట్ల వివాహం
హాలీవుడ్ తారలు ఏజెంలీనా జోలీ, బ్రాడ్ పిట్లు శనివారం ఒక్కటవుతున్నారు. జోలీ, బ్రాడ్ పిట్ల వివాహం ఫ్రాన్స్‌లోని చాటీ మిరావల్‌లో జరుగుతుందని వారి ఆధికార ప్రతినిధి వెల్లడించారు. ప్రైవేట్ కార్యక్రమంగా జరిగే ఈ వివాహానికి సన్నిహితులు, బంధువులు మాత్రమే హాజరువుతున్నారని ఓ ప్రకటనలో తెలిపారు. కాలిఫోర్నియా న్యాయమూర్తి నుండి వివాహపత్రాన్ని తీసుకున్నారని, వీరి పెళ్లిని ఫ్రాన్స్‌లో న్యాయమూర్తి జరిపిస్తారని ప్రకటనలో పేర్కొన్నారు. ఈ వివాహానికి జోలీ కుమారులు మాడోక్స్, పాక్స్లు కూడా హాజరవుతున్నారు.