లైంగిక హింస సైలెంట్ కిల్లర్: జోలీ
లైంగిక హింసకు వ్యతిరేకంగా పోరాడాల్సిన అవసరం ఉందని హాలీవుడ్ నటీమణి యాంజెలీనా జోలీ నొక్కిచెప్పింది. అత్యాచారాలు, లైంగిక దాడులు సమాజంలో సైలెంట్ కిల్లర్లుగా వ్యాపిస్తాయని ఆమె ఓ ఇంటర్వ్యూలో తెలిపింది. 'గ్లామర్' పత్రిక తాజా సంచిక కోసం 'గ్లోబల్ సమిట్ టు ఎండ్ సెక్సువల్ వయొలెన్స్' అనే అంశంపై నిర్వహించిన సదస్సులో యాంజెలీనా జోలీ (39)తో పాటు మరో ఐదుగురు ప్రముఖులు పాల్గొన్నారు.
జూలియన్ లసెంజె, జినెత్ బెడోయా, జైనబ్ బంగురా, సురయ్యా పాక్జాద్, వాకు షీ అనే ఐదుగురు ఈ పోరాటంలో యాంజెలీనా జోలీకి సాయంగా నిలిచారు. ప్రపంచంలో తాను ఎక్కడికెళ్లినా అత్యాచారాలు సైలెంట్ కిల్లర్లుగానే కనిపిస్తున్నాయని, మొత్తం సమాజాన్నే సర్వనాశనం చేయడానికి వ్యూహాత్మకంగా చేస్తున్న పథకమే ఈ అత్యాచారాలని జోలీ చెప్పింది.