silent killer
-
నిశ్శబ్దంగా మృత్యువుకు కారణమయ్యే ఎల్డీఎల్ కొలెస్ట్రాల్!
డాక్టర్లు చెప్పిన మందులు చెప్పినట్లు వేసుకునేవారు మనదేశంలో తక్కువే ఉంటారు. అమెరికాలో కూడా ఇంతే. కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉన్న వృద్ధుల్లో దాదాపు 40 శాతం మంది వైద్యులు సూచించిన మందులు వేసుకోరని ‘పాప్యులేషన్ మెడిసిన్’ జర్నల్ అధ్యయనం ఒకటి స్పష్టం చేసింది. ‘లో డెన్సిటీ లిపో ప్రోటీన్’ క్లుప్తంగా ఎల్డీఎల్ అని పిలిచే ఈ రకమైన కొవ్వు గుండె ఆరోగ్యానికి చాలా కీలకం. మందులు సక్రమంగా వేసుకోకపోతే ఈ రకమైన కొవ్వులు ఎక్కువవుతాయి. ఫలితంగా రక్తనాళాల్లో గార పేరుకుపోవడం కూడా పెరిగి పోతుంది. ఇది కాస్తా గుండెజబ్బు లేదా గుండెపోటు వచ్చే ప్రమాదాన్ని ఎక్కువ చేస్తుంది. సకాలంలో చికిత్స చేయకపోతే సమస్య మరింత జటిలమవుతుంది. మందులు సక్రమంగా వేసుకోకపోయేందుకు కారణాలు చాలానే ఉన్నాయి. వ్యాధి లక్షణాలు కనిపించకపోవడం ఒకటైతే.. ‘‘ఆ..ఏమవుతుంది లే’’ అన్న నిర్లక్ష్యం రెండోది. మందులేసుకుంటే సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయన్న ఆందోళన మూడోది. కానీ... ఎల్డీఎల్ మోతాదులు ఆరోగ్యకరంగా ఉండాలంటే దీర్ఘకాలిక విధానం ఒకటి అవసరమవుతుంది. మందులు నిలిపివేయడం వల్ల కొలెస్ట్రాల్ మళ్లీ పెరిగిపోతుంది. కాబట్టి లక్షణాలు ఉన్నా లేకపోయినా వైద్యులు సూచించినట్లుగా మందులు వేసుకోవడం అవసరం.ఎల్డీఎల్ మోతాదులను నియంత్రించుకోవాల్సిన అవసరం గురించి హైదరాబాద్‌లోని కేర్ హాస్పిటల్ క్యాథ్ ల్యాబ్ సీనియర్ కన్సలెట్టంట్, కార్డియాలజిస్ట్ డాక్టర్ పీఎల్ఎన్ కపర్థి మాట్లాడుతూ "LDLC, లేదా "చెడు" కొలెస్ట్రాల్ నియంత్రణ జీవితాంతం కొనసాగాల్సిన ప్రయత్నం. చాలామంది మేము సురక్షితంగానే ఉన్నామని అనుకుంటారు కానీ.. అలా భావించి మందులు అశ్రద్ధ చేయడం వల్ల గుండెపోటుకు గురైన వారూ ఉన్నారు. కొలెస్ట్రాల్ నియంత్రణ అనేది రక్తనాళాల్లోపలి ఆరోగ్యంపై ఆధారపడి ఉంటుంది. లక్షణాలు కనిపించవు కానీ నెమ్మదిగా తీవ్రమవుతుంది. అందుకే తరచుగా డాక్టర్ చెకప్‌లు చేయించుకోవడం అవసరం. దీనివల్ల ఏదైనా మార్పులు ఉంటే ముందుగానే గుర్తించి తగు చర్యలు తీసుకునే అవకాశం ఏర్పడుతుంది. అలాగే వైద్యులు చెప్పినట్లు మందులు కచ్చితంగా సమయానికి తీసుకోవాలి.”హెల్తియన్స్ అనే సంస్థ ఇటీవల నిర్వహించిన ఒక పోల్ ప్రకారం భారతదేశంలో 31 శాతం మంది అధిక కొలెస్ట్రాల్ కలిగి ఉన్నారు. హైదరాబాదు జనాభాలో ఈ మోతాదు 27.4% కావడం గమనార్హం. ఇది అథెరోస్కెలరోటిక్ కార్డియో వాస్కులర్ డిసీజ్ (ASCVD) పెరుగుదలను సూచిస్తుంది. ఎల్డీఎల్ కొలెస్ట్రాల్ ఎక్కువైనప్పుడు లక్షణాలేవీ కనిపించవని ముందుగానే చెప్పుకున్నాం. అందుకే దీన్ని నిశ్శబ్ధ కిల్లర్ అని పిలుస్తూంటారు. ఎల్డీఎల్ కొలెస్ట్రాల్ స్థాయి పెరిగితే ధమనులకు హాని జరుగుతుంది. క్రమంగా మూసుకుపోతాయి. పరిస్థితి తీవ్రమయ్యే వరకూ ఎవరూ గుర్తించలేరు. ఒకసారి మందులు తీసుకోవడం ఆపివేసినా సూచించిన విధంగా తీసుకోకపోయినా ఎల్డీఎల్ స్థాయులు మళ్లీ పెరగవచ్చు.కార్డియోలాజికల్ సొసైటీ ఆఫ్ ఇండియా మార్గదర్శకాల ప్రకారం, ఎల్డీఎల్ కొలెస్ట్రాల్‌ను నియంత్రణలో ఉంచుకోవడానికి జీవనశైలి మార్పులు, సూచించిన మందులు సక్రమంగా తీసుకోవడం అవసరం. ఆరోగ్యకరమైన ఆహారం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం ముఖ్యం. -
పైకి అలా కనిపిస్తాడు కానీ.. నాగచైతన్య సైలెంట్ కిల్లర్ : అఖిల్
-
ఒమిక్రాన్ సైలెంట్ కిల్లర్!... కోలుకున్నా ఇంకా బాధిస్తునే ఉంటుంది!
NV Ramana today called Omicron a "silent killer: సుప్రీంకోర్టు భౌతిక విచారణలకు హాజరవ్వాలన్న అభ్యర్థన పై భారత ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ ఒమిక్రాన్ గురించి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఒమిక్రాన్ సైలెంట్ కిల్లర్ అని సంభోధించారు. ఒక నెల క్రితం ఈ వేరియంట్ భారినపడ్డానని తర్వాత కోలుకున్నాక కూడా తాను ఆ వేరియంట్ ప్రభావంతో ఇంకా బాధపడుతునే ఉన్నానని చెప్పుకొచ్చారు. అంతేకాదు తాను కరోనా మొదటి వేవ్‌లోనే కరోనా వైరస్ భారిన పడ్డానని, నాలుగు రోజుల్లో కోలుకున్నానని, మళ్లీ ఇప్పుడు ఈ వేవ్‌లో భారిన పడి బయటపడ్డాక కూడా ఇంకా 25 రోజులుగా బాధపడుతూనే ఉన్నానని అన్నారు. సుప్రీం కోర్టు బార్ అసోసియేషన్‌కు నేతృత్వం వహిస్తున్న సీనియర్ న్యాయవాది వికాస్ సింగ్ కేసులు తగ్గుముఖం పట్టడంతో పూర్తి భౌతిక విచారణకు తిరిగి రావాలని సుప్రీంకోర్టును అభ్యర్థించడంతో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం హైబ్రిడ్ శైలిలో విచారణలు జరుగుతున్నాయి. వారానికి రెండుసార్లు భౌతిక విచారణలు, మిగిలినవి ఆన్లైన్లో జరుగుతున్నాయి. అయితే కరోనా ఇంకా తగ్గుముఖం పట్టలేదని ఇంకా 15 వేల కేసులు పెరిగాయని జస్టీస్ రమణ అన్నారు. దీనికి సీనియర్ న్యాయవాది వికాస్ సింగ్ ప్రజలు మాత్రం కోలుకుంటున్నారంటూ కౌంటరిచ్చారు. వెంటనే జస్టీస్ రమణ తాము చూస్తాం అని వ్యగ్యంగా బదులిచ్చారు. ఈ మేరకు గత మూడో వేవ్‌లో సుప్రీం కోర్టు న్యాయవాదులు, సిబ్బంది అధిక సంఖ్యలో కరోనా భారిన పడిన సంగతి తెలిసిందే. (చదవండి: 10, 12వ తరగతుల ఆఫ్‌లైన్ పరీక్షలపై సుప్రీంకోర్టులో విచారణ) -
నౌకా దళంలో చేరిన 'సైలెంట్ కిల్లర్'
సాక్షి, ముంబై: భారత నౌకాదళం అమ్ములపొదిలోకి స్కార్పిన్ తరగతికి చెందిన మరో జలాంతర్గామి ఐఎన్ఎస్ ‘ఖండేరీ’ చేరింది. కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సమక్షంలో శనివారం దీన్ని సముద్రంలోకి ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా రక్షణమంత్రి రాజ్‌నాథ్ నేవీ అధికారులను ఉద్దేశించి ‘దేశం వారిపై ఉంచిన విశ్వాసానికి అనుగుణంగా వ్యవహరిస్తారని తాను విశ్వసిస్తున్నా’ అని ట్వీట్ చేశారు. అంతేకాకుండా పాకిస్తాన్‌కు ఆయన ఈ సందర్భంగా వార్నింగ్ ఇచ్చారు. ఖండేరి లాంటి జలాంతర్గాములతో పాక్‌కు గట్టి సమాధానం ఇవ్వగలమన్నారు. జమ్ము కశ్మీర్ అంశంపై భారత్‌కు ప్రపంచ దేశాల మద్దతు లభిస్తోందని, అయితే పాకిస్తాన్ మాత్రం కావాలనే రచ్చ చేస్తోందని రాజ్‌నాథ్ సింగ్ దుయ్యబట్టారు. శత్రు నౌకలకు అంతుచిక్కని ఖండేరి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం కలిగిన ఐఎన్ఎస్ ఖండేరీని 'సైలెంట్ కిల్లర్' అని కూడా పిలుస్తారు. శత్రు నౌకలకు అంతుచిక్కని ఖండేరి పొడవు 67.5 మీటర్లు. శక్తిమంతమైన నాలుగు ఎంటీయూ 12వీ 396, ఎస్ఈ84 ఇంజిన్లు సొంతం. సముద్ర ఉపరితలం నుంచి రోజుల తరబడి ఏకధాటిగా సముద్రంలో ప్రయాణించగల ఈ జలాంతర్గామిలో భారీ సామర్థ్యమున్న 360 బ్యాటరీలు ఉంటాయి. కాగా 2017 డిసెంబరులో ముంబైలో మజగావ్ డాక్ నౌకా నిర్మాణ కేంద్రం నుంచి ఖండేరి జలాంతర్గామిని జల ప్రవేశం చేయించారు. శత్రువుల నిఘాకు చిక్కకుండా అత్యాధునిక సాంకేతికతతో నిర్మించిన ఈ జలాంతర్గామి నుంచి శత్రు లక్ష్యాలపై విధ్వంసక దాడి చేయవచ్చు. అలాగే ట్యూబుల ద్వారా నౌకా విధ్వంసక క్షిపణులను ప్రయోగించవచ్చు. ఐఎన్ఎస్ ఖండేరీలో ఐదురుగురు నేవీ అధికారులుతో పాటు 35 మంది నావికా సిబ్బంది ఉంటారు. ఖండేరీ... ఒకప్పటి మరాఠా దళం పేరు 17వ శతాబ్దంలో సముద్రంపై ఆధిపత్య పోరులో ప్రముఖ పాత్ర పోషించిన మరాఠా దళం ఖండేరీ పేరును దీనికి పెట్టారు. ఫ్రాన్స్‌కు చెందిన డీసీఎన్ కంపెనీ నిర్మిస్తోన్న స్కార్పియో జలాంతర్గాములు డీజిల్–ఎలక్ట్రిక్ ఇంధనంగా పని చేస్తాయి. మజగవా డాక్స్‌లో ఆరు జలాంతర్గాములను తయారు చేస్తుండగా, ఐఎన్ఎస్ ఖండేరీ రెండోది కావడం విశేషం. ముంబయికి చెందిన మజగావ్ డాక్ లిమిటెడ్ సంస్థ దీన్ని నిర్మించింది. ఉష్ణ మండల ప్రాంతాల్లో కూడా ఏ సమస్యలు లేకుండా పనిచేస్తుంది. నౌకాదళంలోని ఇతర విభాగాల నుంచి కూడా ఆపరేట్ చేసేలా కమ్యూనికేషన్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. -
60 శాతం మందికి ఆ రోగం ఉన్నట్లే తెలియదు!
హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ నగరం హైబీపీకి కేంద్ర బిందువుగా మారుతోంది. నగరంలో 18-40 ఏళ్ల వారిలో 36 శాతం మంది, గ్రామీణ ప్రాంతాల్లో 18-20 శాతం మంది అధిక రక్త పోటుతో బాధపడుతున్నట్లు తేలింది. నగరంలో ఏటా వెలుగు చూస్తున్న హృద్రోగ మరణాల్లో అత్యధికం హైబీపీ వల్లే న మోదవుతున్నట్లు కార్డియాలజీ సొసైటీ ఆఫ్ ఇండియా సర్వేలో తేలింది. మారిన జీవనశైలి, ఆహార అలవాట్లు, అతిగా మద్యపానం, ధూమపానం, ఊబకాయం, పని ఒత్తిడి వెరసి గుండె పని తీరుపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. గుండె, మెదడు పనితీరుపై తీవ్ర ప్రభావం చూపుతున్న హైబీపీపై కార్డియాలజీ సొసైటీ ఆఫ్ ఇండియా ఇటీవల దేశవ్యాప్తంగా ‘బిగ్ బీపీ క్యాంపెయిన్’పేరుతో ఎనిమిది గంటల పాటు సర్వే నిర్వహించింది. 1.80 లక్షల మందిని పరీక్షించింది. ఇందులో భాగంగా నగరంలోని సికింద్రాబాద్ రైల్వేస్టేషన్, మహాత్మా గాంధీ బస్టేషన్, ఐఎస్ సదన్, జూబ్లీహిల్స్ అపోలో, డీఆర్డీవో అపోలో, మాదాపూర్‌లతో పాటు మరో 65 కేంద్రాల్లో క్యాంప్‌లు ఏర్పాటు చేసింది. 19,846 మందిని పరీక్షించి, వీరిలో 11,245 శాంపిల్స్‌ను విశ్లేషించింది. బాధితుల్లో 36 శాతం మంది అధిక రక్తపోటుతో బాధపడుతున్నట్లు గుర్తించింది. 60 ఏళ్ల వారితో పోలిస్తే 18-40 ఏళ్లలోపు వారే మూడు రెట్లు ఎక్కువగా అధిక రక్తపోటుతో బాధపడుతున్నట్లు తేలింది. ఆసక్తి కర అంశమైమంటే బాధితుల్లో 60 శాతం మందికి తమకు అధిక రక్తపోటు సమస్య ఉన్నట్లు తెలియదు. మందులు వాడుతున్న 42 శాతం మం దిలో బీపీ కంట్రోల్లో ఉండటం లేదు. ఇప్పటి నుంచే జాగ్రత్త పడక పోతే 2025 నాటికి ఈ సంఖ్య జనాభాలో మూడు వంతుల మం ది హైబీపీ బారిన పడే ప్రమాదం లేక పోలేదు. మహిళల్లోనూ ఇదే ఒరవడి...: ఇటీవల ఐటీ అనుబంధ రంగాల్లో మహిళల సంఖ్య గణనీయంగా పెరిగింది. పురుషులతో పోటీ పడి పనిచేస్తున్నారు. ఇటు ఇంటి పనుల్లోనూ, అటు ఆఫీసు పనుల్లోనూ వీరు క్షణం తీరికలేకుండా గడుపుతున్నారు. జీవనశైలి వల్ల రుతుక్రమంలోనూ అనేక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ప్రతి వంద మంది హృద్రోగ బాధితుల్లో 65 శాతం మంది పురుషులు ఉంటే, 35 శాతం మంది మహిళలు ఉంటున్నారు. పురుషులతో పోలిస్తే మహిళల్లోనే ఆకస్మిక మరణాల రేటు ఎక్కువ . అభివృద్ధి చెందిన దేశాల్లో ఈ ఆకస్మిక మరణాల శాతం 1.2 శాతం ఉంటే, గ్రేటర్లో మాత్రం 4.9 శాతం ఉన్నట్లు సర్వేలో తేలింది. మహిళల ఆరోగ్యంపై శ్రద్ద చూపక పోవ డం, వైద్య ఖర్చుకు వెనకాడటం, నొప్పి వచ్చిన తర్వాత చాలా ఆలస్యంగా ఆస్పత్రికి తీసుకు వెళ్తుండటం కూడా ఇందుకు ఓ కారణమని వై ద్యులు అభిప్రాయపడుతున్నారు. -
రక్తపోటు నిశ్శబ్ద మృత్యువు
పద్మశ్రీ అవార్డు గ్రహీత డాక్టర్ సి.వెంకట ఎస్.రామ్ తెనాలి : నిశ్శబ్ద మృత్యువుగా అభివర్ణించే అధిక రక్తపోటు తగిన జాగ్రత్తలతో జీవితాన్ని గడపొచ్చని ప్రసిద్ధ అంతర్జాతీయ అధిక రక్తపోటు రుగ్మత నిపుణుడు, పద్మశ్రీ అవార్డు గ్రహీత డాక్టర్ సి.వెంకట ఎస్.రామ్ పేర్కొన్నారు. వాకర్స్‌క్లబ్ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన సదస్సుకు క్లబ్ అధ్యక్షుడు డాక్టర్ పాటిబండ్ల దక్షిణామూర్తి అధ్యక్షత వహించారు. ‘అధిక రక్తపోటు– తీసుకోవాల్సిన జాగ్రత్తలు’ అంశంపై డాక్టర్ వెంకట ఎస్.రామ్ మాట్లాడారు. గుండెపోటు, పక్షవాతం, మూత్రపిండాల జబ్బు, మతిమరుపు మొదలైన సమస్యలకు అధిక రక్తపోటు కారణమవుతుందని చెప్పారు. ఎలాంటి లక్షణాలు లేకుండా అధిక రక్తపోటు కొన్ని సంవత్సరాలపాటు పెరిగి, అనేక సమస్యలకు దారితీస్తుందని చెప్పారు. దీనిని సైలెంట్ కిల్లర్ అంటారని వ్యాఖ్యానించారు. తలనొప్పి, తలతిరగడం, ముక్కు నుంచి రక్త స్రావం వంటి లక్షణాలకు, అధిక రక్తపోటుకు సంబంధం లేదనీ, గురకవ్యాధికి, అధిక రక్తపోటుకు సంబంధం ఉందన్నారు. తరచుగా పరీక్షలు చేయించుకుంటూ వైద్యుడి సలహా ప్రకారం మందులు ఆపకుండా వాడాలని సూచించారు. ఉప్పు వాడకం తగ్గించాలనీ, మనిషికి 2–3 గ్రాముల ఉప్పును మాత్రమే వాడాలని చెప్పారు. -
నివారణ - నియంత్రణ మార్గాలకు హైబీప్రిపేర్డ్...
మనకు తెలియకుండానే ముప్పు తెచ్చిపెట్టే జీవనశైలి వ్యాధుల్లో (లైఫ్‌స్టైల్ డిసీజ్‌లో) హైబీపీ లేదా హైపర్‌టెన్షన్ ఒకటి. ఇది ఉన్నట్లే తెలియదు లేదా ఒక్కోసారి అది కొన్ని అవయవాలకు చేయాల్సిన కీడు చేసిన తర్వాత గానీ బయటపడదు. దాంతో కీలక అవయవాలు దెబ్బతిని ఒక్కోసారి చాలా ప్రమాదకరమైన పరిస్థితి రావచ్చు. అందుకే దీన్ని సెలైంట్ కిల్లర్ అంటుంటారు. ఇటీవల దీని విస్తృతి పెరుగుతున్న నేపథ్యంలో చాలా సులువుగా దీన్ని నివారించుకోవడం, ఉంటే నియంత్రించుకోవడం ఎలాగో తెలుసుకుందాం. మన శరీరంలో రక్తం గుండె నుంచి రక్తనాళాల ద్వారా అన్ని అవయవాలకూ ప్రవహిస్తుంటుంది. ఇలా జరగాలంటే రక్తనాళాల్లో అది కొంత ఒత్తిడితో వెళ్తుండాలి. ఒత్తిడినే ‘బ్లడ్ ప్రెషర్’ (బీపీ) అంటారు. సాధారణ బీపీ కొలత 120 / 80 ఉండాలన్నది అందరికీ తెలిసిన విషయమే. ఇందులో మొదటి విలువను సిస్టోలిక్ బీపీ అని, రెండో విలువను డయాస్టోలిక్ బీపీ అని అంటారు. పదిహేను నుంచి నలభై ఏళ్ల వరకు వయసున్న వారిని చాలామందిని పరిశీలించాక ఈ ప్రామాణిక విలువను నిర్ధారణ చేశారు. చిన్నపిల్లల్లో ఈ విలువ మరికాస్త తక్కువగా ఉంటుంది. మహిళల్లో బీపీ ఒకింత తక్కువగా అంటే... 110 / 70 ఉంటుంది. ఇక 45 ఏళ్లు దాటాక వయసును బట్టి బీపీ పెరుగుతూ ఉండవచ్చు. ఉండాల్సిన ప్రామాణిక విలువ కంటే బ్లడ్‌ప్రషర్ ఎక్కువ ఉంటే దాన్ని హైబీపీ లేదా హైపర్‌టెన్షన్ అని అంటారు. లక్షణాలు : హైబీపీ ఉన్నా దాని లక్షణాలు పెద్దగా బయటకు కనిపించకపోవచ్చు. బీపీ చాలా ఎక్కువగా ఉన్నప్పుడు కొన్ని లక్షణాలతో అది బయటపడవచ్చు. ఆ లక్షణాలివి... తరచూ తలనొప్పి రావడం కళ్లు తిరగడం కంటిచూపులో మార్పులు ఫిట్స్ రావడం ఎప్పుడూ చికాకుగా ఉన్నట్లు అనిపిస్తుండటం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఒక్కోసారి ఏదైనా అవయవం దెబ్బతింటే దాని తాలూకు లక్షణాలు బహిర్గతమవుతాయి. నివారణ / నియంత్రణ : అధిక రక్తపోటు (హైబీపీ) ఉన్నవాళ్లు ఆహార నియువూలు తప్పనిసరిగా పాటించాల్సి వుంది. హైబీపీకి ఇప్పుడు అవుల్లో ఉన్న ఆహార నియువూవళిని ‘డ్యాష్’ అంటారు. ‘డయుటరీ అప్రోచ్ టు స్టాప్ హైపర్‌టెన్షన్’ అన్న ఇంగ్లిష్ పదాల సంక్షిప్తరూపమే ఈ డ్యాష్. ఈ నియమాలు బీపీని నివారించుకోవాలనుకుంటున్న వారు కూడా పాటించవచ్చు. ఎందుకంటే ఇవే నివారణకూ తోడ్పడతాయి. ఇవన్నీ ఆరోగ్యకరమైన జీవనశైలిలో భాగమే. - హైపర్‌టెన్షన్ ఉన్నవాళ్లు లేదా దాన్ని నివారించుకోవాలనుకున్నవారు తాజా పండ్లు, కూరగాయులు, ఆకుకూరలు పుష్కలంగా తీసుకోవాలి. ఉదాహరణకు అరటిపండు వంటి పండ్లలో పొటాషియుమ్ పాళ్లు ఎక్కువ కాబట్టి అలాంటి పండ్లు తీసుకోవడం వల్ల బీపీ తగ్గుతుంది లేదా నివారితమవుతుంది. - ఇక క్యాల్షియుమ్కు కూడా బీపీని నివారించే / నియంత్రించే గుణం ఉంది. అరుుతే ఇందుకోసం కొవ్వు పాళ్లు (వెన్నపాళ్లు) తక్కువగా ఉన్న పాలూ, పాల ఉత్పాదనలు తీసుకోవాల్సి ఉంటుంది. - హైపర్‌టెన్షన్ నివారించుకోవాలనుకుంటున్నవారితో పాటు అది ఉన్న వారు ఆహారంలో ఉప్పు (సోడియుం) పాళ్లను గణనీయంగా తగ్గించాలి. ఇందుకోసం ఉప్పు (సోడియమ్) పాళ్లు ఎక్కువగా ఉండే ఆహారాలైన నిల్వ ఉంచిన ఆహారాలు (ప్రిజర్వ్డ్ ఫుడ్స్), బేకరీ ఐటమ్స్, పచ్చళ్లు, అప్పడాలు (పాపడ్), క్యాన్డ్ ఫుడ్స్ పూర్తిగా తగ్గించాలి. సాధారణంగా ఆవకాయలు / పచ్చళ్లు ఎక్కువ కాలం నిల్వ ఉంచడానికి అవసరానికి మించి కాస్త ఎక్కువగానే ఉప్పు వేస్తుంటారు. లేకపోతే ఆవకాయ / పచ్చడి చెడిపోతుందని అంటుండటం మనం వింటూనే ఉంటాం. అందుకే కాస్త పాత బడ్డ తర్వాత ఆవకాయ / పచ్చళ్లు రుచి తగ్గి, ఉప్పగా అనిపిస్తుంటాయి. అందుకే పాత ఆవకాయలనూ, పాత పచ్చళ్లను (నిల్వ పచ్చళ్లను) అస్సలు ఉపయోగించకూడదు. - శరీర బరువు పెరుగుతున్న కొద్దీ లేదా వ్యక్తులు లావెక్కుతున్న కొద్దీ అన్ని కణాలకూ రక్తసరఫరా జరగడానికి రక్తం వేగంగా ప్రవహించాల్సి వస్తుంటుంది. దాంతో స్థూలకాయులకు హైబీపీ వచ్చే అవకాశాలు ఎక్కువ. అందుకే ఎత్తును లేదా బీఎమ్‌ఐని చూసుకొని, ఎత్తుకు తగ్గ బరువుండేలాగా ఎప్పుడూ మన బరువును నియంత్రించుకుంటూ ఉండాలి. - మంచి పోషకాలు ఉండే ఆహారం తినడం వల్ల అంటే పొట్టుతో ఉండే అన్ని రకాల తృణధాన్యాలు, ఆకుపచ్చటి ఆకుకూరలు, కొవ్వు తక్కువగా ఉండే ఆహారంతో బరువు తగ్గడంతో పాటు సాధారణ ఆరోగ్యమూ బాగుంటుంది. కాబట్టి ఇది పరోక్షంగా బీపీ నివారణకు తోడ్పడే అంశం. - క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల బరువు పెరగరు. బరువు పెరగడం, స్థూలకాయం రావడం వంటి అంశాలు హై-బీపీ వచ్చేందుకు రిస్క్ ఫ్యాక్టర్ అన్న విషయం తెలిసిందే. వ్యాయామం మన శరీరంలో కొవ్వు పేరుకోకుండానూ, బరువు పెరగకుండానూ చేసి, పరోక్షంగా హై-బీపీని నివారిస్తుంది. - ఆల్కహాల్ అలవాటును పూర్తిగా మానేయాలి. ఆల్కహాల్ తాగగానే రక్తప్రసరణ వేగంలో తక్షణం మార్పు వస్తుంది. కొంత వేగంగానే పెరుగుతుంది. అందుకే ఈ అలవాటును పూర్తిగా మానేయాలి. - పొగతాగే అలవాటు వల్ల కూడా ఎన్నో అనర్థాలతో పాటు పొగలో ఉండే నికోటిన్ ఒక ఉత్ప్రేరకంగా పనిచేస్తుందన్న విషయం తెలిసిందే. ఉత్ప్రేరకాలన్నీ రక్తప్రసరణ వేగాన్ని పెంచేవే. కాబట్టి బీపీ ఉన్నవారూ, దాన్ని నివారించుకోవాలనుకునే వారు ఈ దురలవాటు నుంచి పూర్తిగా దూరంగా ఉండాలి. - ఆధునిక నగర జీవితంలోనూ, మన వృత్తులలోనూ నిత్యం పెరుగుతున్న ఒత్తిడి రక్తపోటును చాలా ఎక్కువగా పెంచుతుంటుంది. అందుకే రక్తపోటును నివారించుకోవాలనుకునేవారు తప్పనిసరిగా ఒత్తిడిని అదుపులో ఉంచుకోవాలి. ఇందుకోసం యోగా, ప్రాణాయామ వంటి ప్రక్రియలతో పాటు తమకు ఇష్టమైన అభిరుచులలో (హాబీలలో) కృషిచేస్తూ ఆనందంగా, ఆహ్లాదంగా ఉండాలి. మనం నివారణ కోసం (లేదా అప్పటికే బీపీ ఉన్నవారు నియంత్రణ కోసం) అనుసరించే ఈ మార్గాలన్నీ ఆరోగ్యకరమైన జీవనశైలిలో భాగమే. కాబట్టి మంచి జీవనశైలిని అనుసరిస్తే బీపీని అదుపులో ఉంచుకోవడం లేదా నివారించుకోవడం చాలా సులభం. హైబీపీ... తీవ్రత వర్గీకరణ ఎప్పుడూ 120 / 80 ఉండాల్సిన రక్తపోటులో మార్పు వచ్చి అది 140 / 90 కంటే ఎక్కువ ఉంటే దాన్ని హైబీపీగా చెప్పవచ్చు. - మైల్డ్ హైబీపీ : 140 / 90 నుంచి 150 / 90 కొలతలు ఉంటే దాన్ని మైల్డ్ హైబీపీ అనుకోవచ్చు. - మోడరేట్ హైబీపీ : 160 /90 లేదా 160 / 100 నుంచి 170 / 100 లేదా 180 / 100 వరకు విలువలు ఉంటే దాన్ని ఒక మోస్తరు హై-బీపీ (మోడరేట్ హైబీపీ)గా చెప్పవచ్చు. - సివియర్ హైబీపీ : 190 / 100 నుంచి 190 / 110 వరకు ఉంటే దాన్ని తీవ్రమైన హైబీపీ (సివియర్ హైబీపీ) అని పేర్కొనవచ్చు. - యాగ్జిలరేటెడ్ హైపర్‌టెన్షన్ : 200 / 120 నుంచి 210 / 120 ఉంటే దాన్ని మరింత తీవ్రమైన హైబీపీ (యాగ్జిలరేటెడ్ హైపర్‌టెన్షన్) అని చెప్పవచ్చు. -
లైంగిక హింస సైలెంట్ కిల్లర్: జోలీ
లైంగిక హింసకు వ్యతిరేకంగా పోరాడాల్సిన అవసరం ఉందని హాలీవుడ్ నటీమణి యాంజెలీనా జోలీ నొక్కిచెప్పింది. అత్యాచారాలు, లైంగిక దాడులు సమాజంలో సైలెంట్ కిల్లర్లుగా వ్యాపిస్తాయని ఆమె ఓ ఇంటర్వ్యూలో తెలిపింది. 'గ్లామర్' పత్రిక తాజా సంచిక కోసం 'గ్లోబల్ సమిట్ టు ఎండ్ సెక్సువల్ వయొలెన్స్' అనే అంశంపై నిర్వహించిన సదస్సులో యాంజెలీనా జోలీ (39)తో పాటు మరో ఐదుగురు ప్రముఖులు పాల్గొన్నారు. జూలియన్ లసెంజె, జినెత్ బెడోయా, జైనబ్ బంగురా, సురయ్యా పాక్జాద్, వాకు షీ అనే ఐదుగురు ఈ పోరాటంలో యాంజెలీనా జోలీకి సాయంగా నిలిచారు. ప్రపంచంలో తాను ఎక్కడికెళ్లినా అత్యాచారాలు సైలెంట్ కిల్లర్లుగానే కనిపిస్తున్నాయని, మొత్తం సమాజాన్నే సర్వనాశనం చేయడానికి వ్యూహాత్మకంగా చేస్తున్న పథకమే ఈ అత్యాచారాలని జోలీ చెప్పింది.