నివారణ - నియంత్రణ మార్గాలకు హైబీప్రిపేర్డ్... | Prevention - control routes High BP | Sakshi
Sakshi News home page

నివారణ - నియంత్రణ మార్గాలకు హైబీప్రిపేర్డ్...

Published Tue, Jun 16 2015 11:44 PM | Last Updated on Sun, Sep 3 2017 3:50 AM

నివారణ - నియంత్రణ మార్గాలకు హైబీప్రిపేర్డ్...

నివారణ - నియంత్రణ మార్గాలకు హైబీప్రిపేర్డ్...

మనకు తెలియకుండానే ముప్పు తెచ్చిపెట్టే జీవనశైలి వ్యాధుల్లో (లైఫ్‌స్టైల్ డిసీజ్‌లో) హైబీపీ లేదా హైపర్‌టెన్షన్ ఒకటి. ఇది ఉన్నట్లే తెలియదు లేదా ఒక్కోసారి అది కొన్ని అవయవాలకు చేయాల్సిన కీడు చేసిన తర్వాత గానీ బయటపడదు. దాంతో కీలక అవయవాలు దెబ్బతిని ఒక్కోసారి చాలా ప్రమాదకరమైన పరిస్థితి రావచ్చు. అందుకే దీన్ని సెలైంట్ కిల్లర్ అంటుంటారు. ఇటీవల దీని విస్తృతి పెరుగుతున్న నేపథ్యంలో చాలా సులువుగా దీన్ని నివారించుకోవడం, ఉంటే నియంత్రించుకోవడం ఎలాగో తెలుసుకుందాం.
 
మన శరీరంలో రక్తం గుండె నుంచి రక్తనాళాల ద్వారా అన్ని అవయవాలకూ ప్రవహిస్తుంటుంది. ఇలా జరగాలంటే రక్తనాళాల్లో అది కొంత ఒత్తిడితో వెళ్తుండాలి. ఒత్తిడినే ‘బ్లడ్ ప్రెషర్’ (బీపీ) అంటారు. సాధారణ బీపీ కొలత 120 / 80 ఉండాలన్నది అందరికీ తెలిసిన విషయమే. ఇందులో మొదటి విలువను సిస్టోలిక్ బీపీ అని, రెండో విలువను డయాస్టోలిక్ బీపీ అని అంటారు. పదిహేను నుంచి నలభై ఏళ్ల వరకు వయసున్న వారిని చాలామందిని పరిశీలించాక ఈ ప్రామాణిక విలువను నిర్ధారణ చేశారు. చిన్నపిల్లల్లో ఈ విలువ మరికాస్త తక్కువగా ఉంటుంది. మహిళల్లో బీపీ ఒకింత తక్కువగా అంటే... 110 / 70 ఉంటుంది. ఇక 45 ఏళ్లు దాటాక వయసును బట్టి బీపీ పెరుగుతూ ఉండవచ్చు. ఉండాల్సిన ప్రామాణిక విలువ కంటే బ్లడ్‌ప్రషర్ ఎక్కువ ఉంటే దాన్ని హైబీపీ లేదా హైపర్‌టెన్షన్ అని అంటారు.
 
లక్షణాలు : హైబీపీ ఉన్నా దాని లక్షణాలు పెద్దగా బయటకు కనిపించకపోవచ్చు. బీపీ చాలా ఎక్కువగా ఉన్నప్పుడు కొన్ని లక్షణాలతో అది బయటపడవచ్చు. ఆ లక్షణాలివి...
తరచూ తలనొప్పి రావడం  కళ్లు తిరగడం  కంటిచూపులో మార్పులు  ఫిట్స్ రావడం  ఎప్పుడూ చికాకుగా ఉన్నట్లు అనిపిస్తుండటం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఒక్కోసారి ఏదైనా అవయవం దెబ్బతింటే దాని తాలూకు లక్షణాలు బహిర్గతమవుతాయి.

నివారణ / నియంత్రణ : అధిక రక్తపోటు (హైబీపీ) ఉన్నవాళ్లు ఆహార నియువూలు తప్పనిసరిగా పాటించాల్సి వుంది. హైబీపీకి ఇప్పుడు అవుల్లో ఉన్న ఆహార నియువూవళిని ‘డ్యాష్’ అంటారు. ‘డయుటరీ అప్రోచ్ టు స్టాప్ హైపర్‌టెన్షన్’ అన్న ఇంగ్లిష్ పదాల సంక్షిప్తరూపమే ఈ డ్యాష్. ఈ నియమాలు బీపీని నివారించుకోవాలనుకుంటున్న వారు కూడా పాటించవచ్చు. ఎందుకంటే ఇవే నివారణకూ తోడ్పడతాయి. ఇవన్నీ ఆరోగ్యకరమైన జీవనశైలిలో భాగమే.
- హైపర్‌టెన్షన్ ఉన్నవాళ్లు లేదా దాన్ని నివారించుకోవాలనుకున్నవారు తాజా పండ్లు, కూరగాయులు, ఆకుకూరలు పుష్కలంగా తీసుకోవాలి. ఉదాహరణకు అరటిపండు వంటి పండ్లలో పొటాషియుమ్ పాళ్లు ఎక్కువ కాబట్టి అలాంటి పండ్లు తీసుకోవడం వల్ల బీపీ తగ్గుతుంది లేదా నివారితమవుతుంది.
- ఇక క్యాల్షియుమ్‌కు కూడా బీపీని నివారించే / నియంత్రించే గుణం ఉంది. అరుుతే ఇందుకోసం కొవ్వు పాళ్లు (వెన్నపాళ్లు) తక్కువగా ఉన్న పాలూ, పాల ఉత్పాదనలు తీసుకోవాల్సి ఉంటుంది.
- హైపర్‌టెన్షన్ నివారించుకోవాలనుకుంటున్నవారితో పాటు అది ఉన్న వారు ఆహారంలో ఉప్పు (సోడియుం) పాళ్లను గణనీయంగా తగ్గించాలి. ఇందుకోసం ఉప్పు (సోడియమ్) పాళ్లు ఎక్కువగా ఉండే ఆహారాలైన నిల్వ ఉంచిన ఆహారాలు (ప్రిజర్వ్‌డ్ ఫుడ్స్), బేకరీ ఐటమ్స్, పచ్చళ్లు, అప్పడాలు (పాపడ్), క్యాన్డ్ ఫుడ్స్ పూర్తిగా తగ్గించాలి. సాధారణంగా ఆవకాయలు / పచ్చళ్లు ఎక్కువ కాలం నిల్వ ఉంచడానికి అవసరానికి మించి కాస్త ఎక్కువగానే ఉప్పు వేస్తుంటారు. లేకపోతే ఆవకాయ / పచ్చడి చెడిపోతుందని అంటుండటం మనం వింటూనే ఉంటాం. అందుకే కాస్త పాత బడ్డ తర్వాత ఆవకాయ / పచ్చళ్లు రుచి తగ్గి, ఉప్పగా అనిపిస్తుంటాయి. అందుకే పాత ఆవకాయలనూ, పాత పచ్చళ్లను (నిల్వ పచ్చళ్లను) అస్సలు ఉపయోగించకూడదు.
- శరీర బరువు పెరుగుతున్న కొద్దీ లేదా వ్యక్తులు లావెక్కుతున్న కొద్దీ అన్ని కణాలకూ రక్తసరఫరా జరగడానికి రక్తం వేగంగా ప్రవహించాల్సి వస్తుంటుంది. దాంతో స్థూలకాయులకు హైబీపీ వచ్చే అవకాశాలు ఎక్కువ. అందుకే ఎత్తును లేదా బీఎమ్‌ఐని చూసుకొని, ఎత్తుకు తగ్గ బరువుండేలాగా ఎప్పుడూ మన బరువును నియంత్రించుకుంటూ ఉండాలి.
- మంచి పోషకాలు ఉండే ఆహారం తినడం వల్ల అంటే పొట్టుతో ఉండే అన్ని రకాల తృణధాన్యాలు, ఆకుపచ్చటి ఆకుకూరలు, కొవ్వు తక్కువగా ఉండే ఆహారంతో బరువు తగ్గడంతో పాటు సాధారణ ఆరోగ్యమూ బాగుంటుంది. కాబట్టి ఇది పరోక్షంగా బీపీ నివారణకు తోడ్పడే అంశం.
- క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల బరువు పెరగరు. బరువు పెరగడం, స్థూలకాయం రావడం వంటి అంశాలు హై-బీపీ వచ్చేందుకు రిస్క్ ఫ్యాక్టర్ అన్న విషయం తెలిసిందే. వ్యాయామం మన శరీరంలో కొవ్వు పేరుకోకుండానూ, బరువు పెరగకుండానూ చేసి, పరోక్షంగా హై-బీపీని నివారిస్తుంది.
- ఆల్కహాల్ అలవాటును పూర్తిగా మానేయాలి. ఆల్కహాల్ తాగగానే రక్తప్రసరణ వేగంలో తక్షణం మార్పు వస్తుంది. కొంత వేగంగానే పెరుగుతుంది. అందుకే ఈ అలవాటును పూర్తిగా మానేయాలి.
- పొగతాగే అలవాటు వల్ల కూడా ఎన్నో అనర్థాలతో పాటు పొగలో ఉండే నికోటిన్ ఒక ఉత్ప్రేరకంగా పనిచేస్తుందన్న విషయం తెలిసిందే. ఉత్ప్రేరకాలన్నీ రక్తప్రసరణ వేగాన్ని పెంచేవే. కాబట్టి బీపీ ఉన్నవారూ, దాన్ని నివారించుకోవాలనుకునే వారు ఈ దురలవాటు నుంచి పూర్తిగా దూరంగా ఉండాలి.
- ఆధునిక నగర జీవితంలోనూ, మన వృత్తులలోనూ నిత్యం పెరుగుతున్న ఒత్తిడి రక్తపోటును చాలా ఎక్కువగా పెంచుతుంటుంది. అందుకే రక్తపోటును నివారించుకోవాలనుకునేవారు తప్పనిసరిగా ఒత్తిడిని అదుపులో ఉంచుకోవాలి. ఇందుకోసం యోగా, ప్రాణాయామ వంటి ప్రక్రియలతో పాటు తమకు ఇష్టమైన అభిరుచులలో (హాబీలలో) కృషిచేస్తూ ఆనందంగా, ఆహ్లాదంగా ఉండాలి.

మనం నివారణ కోసం (లేదా అప్పటికే బీపీ ఉన్నవారు నియంత్రణ కోసం) అనుసరించే ఈ మార్గాలన్నీ ఆరోగ్యకరమైన జీవనశైలిలో భాగమే. కాబట్టి మంచి జీవనశైలిని అనుసరిస్తే బీపీని అదుపులో ఉంచుకోవడం లేదా నివారించుకోవడం చాలా సులభం.
 
హైబీపీ... తీవ్రత వర్గీకరణ
ఎప్పుడూ 120 / 80 ఉండాల్సిన రక్తపోటులో మార్పు వచ్చి అది 140 / 90 కంటే ఎక్కువ ఉంటే దాన్ని హైబీపీగా చెప్పవచ్చు.
- మైల్డ్ హైబీపీ : 140 / 90 నుంచి 150 / 90 కొలతలు ఉంటే దాన్ని మైల్డ్ హైబీపీ అనుకోవచ్చు.
- మోడరేట్ హైబీపీ : 160 /90 లేదా 160 / 100 నుంచి 170 / 100 లేదా 180 / 100 వరకు విలువలు ఉంటే దాన్ని ఒక మోస్తరు హై-బీపీ (మోడరేట్ హైబీపీ)గా చెప్పవచ్చు.
- సివియర్ హైబీపీ : 190 / 100 నుంచి 190 / 110 వరకు ఉంటే దాన్ని తీవ్రమైన హైబీపీ (సివియర్ హైబీపీ) అని పేర్కొనవచ్చు.
- యాగ్జిలరేటెడ్ హైపర్‌టెన్షన్ : 200 / 120 నుంచి 210 / 120 ఉంటే దాన్ని మరింత తీవ్రమైన హైబీపీ (యాగ్జిలరేటెడ్ హైపర్‌టెన్షన్) అని చెప్పవచ్చు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement