NV Ramana today called Omicron a "silent killer: సుప్రీంకోర్టు భౌతిక విచారణలకు హాజరవ్వాలన్న అభ్యర్థన పై భారత ప్రధాన న్యాయమూర్తి ఎన్‌వీ రమణ ఒమిక్రాన్ గురించి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఒమిక్రాన్ సైలెంట్ కిల్లర్ అని సంభోధించారు. ఒక నెల క్రితం ఈ వేరియంట్ భారినపడ్డానని తర్వాత కోలుకున్నాక కూడా తాను ఆ వేరియంట్ ప్రభావంతో ఇంకా బాధపడుతునే ఉన్నానని చెప్పుకొచ్చారు.
అంతేకాదు తాను కరోనా మొదటి వేవ్‌లోనే కరోనా వైరస్ భారిన పడ్డానని, నాలుగు రోజుల్లో కోలుకున్నానని, మళ్లీ ఇప్పుడు ఈ వేవ్‌లో భారిన పడి బయటపడ్డాక కూడా ఇంకా 25 రోజులుగా బాధపడుతూనే ఉన్నానని అన్నారు. సుప్రీం కోర్టు బార్ అసోసియేషన్‌కు నేతృత్వం వహిస్తున్న సీనియర్ న్యాయవాది వికాస్ సింగ్ కేసులు తగ్గుముఖం పట్టడంతో పూర్తి భౌతిక విచారణకు తిరిగి రావాలని సుప్రీంకోర్టును అభ్యర్థించడంతో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
ప్రస్తుతం హైబ్రిడ్ శైలిలో విచారణలు జరుగుతున్నాయి. వారానికి రెండుసార్లు భౌతిక విచారణలు, మిగిలినవి ఆన్‌లైన్‌లో జరుగుతున్నాయి. అయితే కరోనా ఇంకా తగ్గుముఖం పట్టలేదని ఇంకా 15 వేల కేసులు పెరిగాయని జస్టీస్ రమణ అన్నారు. దీనికి సీనియర్ న్యాయవాది వికాస్ సింగ్ ప్రజలు మాత్రం కోలుకుంటున్నారంటూ కౌంటరిచ్చారు. వెంటనే జస్టీస్ రమణ తాము చూస్తాం అని వ్యగ్యంగా బదులిచ్చారు. ఈ మేరకు గత మూడో వేవ్‌లో సుప్రీం కోర్టు న్యాయవాదులు, సిబ్బంది అధిక సంఖ్యలో కరోనా భారిన పడిన సంగతి తెలిసిందే.
(చదవండి: 10, 12వ తరగతుల ఆఫ్‌లైన్ పరీక్షలపై సుప్రీంకోర్టులో విచారణ)
Comments
Please login to add a commentAdd a comment