బాల్యవివాహాలకు వ్యతిరేకంగా...
‘‘ఆడపిల్లల కలల్ని, ఆశల్ని చిదిమేస్తూ 18 ఏళ్లలోపే వారికి పెళ్లిచేయడం నిజంగా దారుణం, అభివృద్ధి చెందుతున్న దేశాల్లోనే ఇలాంటివి జరగడం అత్యంత హేయమైన విషయం’’ అని హాలీవుడ్ బ్యూటీ, మానవహక్కుల కార్యకర్త ఏంజెలినా జోలీ పేర్కొన్నారు. ఇటీవల ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఏంజెలినా బాల్యవివాహాలపై ఫైర్ అయ్యారు. ఎక్కడైనా బాల్య వివాహం జరుగుతోందని తనకు తెలిస్తే, అక్కడికి స్వయంగా వెళ్లి అడ్డుకోవడానికి వెనకాడనని కూడా జోలీ పేర్కొన్నారు. కేవలం మాటలకు మాత్రమే పరిమితం కాకుండా బాల్యవివాహాలకు వ్యతిరేకంగా తీసిన ఇతోపియన్ చిత్రం ‘డిఫ్రెట్’కి ఆమె సంయుక్త భాగస్వామిగా వ్యవహరిస్తున్నారు. దీన్నిబట్టి బాల్య వివాహాలను అడ్డుకోవడం అనే విషయాన్ని జోలీ ఓ ఉద్యమంలా తీసుకున్నారని చెప్పొచ్చు.