Hollywood Beauty
-
వరల్డ్ మోస్ట్ బ్యూటిఫుల్ నటి మృతి
ప్రపంచంలోనే అందమైన నటిగా పేరుగాంచిన తార ఇకలేరు. ఇటాలియన్ వెండితెర రాణిగా వెలుగొందిన జినా లొల్లో బ్రిగిడా(95) ఇవాళ కన్నుమూశారు. ప్రస్తుతం ఆమె అనారోగ్య సమస్యలతో బాధపడుతూ మరణించారు. ఈ విషయాన్ని ఇటాలియన్ వార్తా సంస్థ అన్సా ధృవీకరించింది. దీంతో హాలీవుడ్ సినీ ప్రముఖులు ఆమెకు సంతాపం తెలిపారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నారు. హాలీవుడ్లో 'బ్రెడ్, లవ్ అండ్ ఫాంటసీ' సినిమాలో తన పాత్రకు బాగా ప్రసిద్ది చెందింది. 1950వ దశకంలో మోస్ట్ బ్యూటిఫుల్ ఉమెన్ ఇన్ ది వరల్డ్‌గా పేరు సంపాదించింది. ఫ్రాంక్ సినాట్రా, హంఫ్రీ బోగార్ట్, మార్సెల్లో మాస్ట్రోయాని లాంటి నటులతో 60కి పైగా చిత్రాలలో నటించింది. 1960 తర్వాత రాజకీయాల్లోకి వెళ్లడంతో కెరీర్ నెమ్మదించింది. జినా ఇటలీలోని సుబియాకోలోని సంపన్న కుటుంబంలో 1927లో జన్మించింది. చదువు కోసం 20 సంవత్సరాల వయస్సులో రోమ్‌కి వెళ్లింది. ఆమె సినిమాల్లో నటనకు అనేక అవార్డులను గెలుచుకుంది. -
నా నగ్న శరీరాన్ని ఎవరైనా చూడొచ్చు.. నటి ఘాటు వ్యాఖ్యలు
Jennifer Lawrence Opens Up About Her Private Photos Leak: 2014లో జరిగిన సంఘటన కారణంగా ఇప్పటికీ మానసిక ఒత్తిడికి గురవుతున్నానని ప్రముఖ హాలీవుడ్ నటి జెన్నిఫల్ లారెన్స్ ఆవేదన వ్యక్తం చేసింది. వేర్వేరు సెలబ్రిటీలకు సంబంధించిన సుమారు 500 ప్రైవేట్ ఫొటోలను హ్యాకర్లు సేకరించి ఆన్లైన్లో లీక్ చేశారు. ఆ సెలబ్రిటీల్లో సింగర్ రిహన్నా, సెలీనా గోమెజ్‌లతో పాటు నటి జెన్నిఫర్ లారెన్స్ కూడా ఉన్నారు. అప్పుడు జరిగిన ఆ స్కాండల్‌తో నిరంతరం మానసిక ఒత్తిడికి గురవుతున్నానని వెల్లడించింది. 'నా అంగీకారం లేకుండా ఎవరైనా నా నగ్న శరీరాన్ని చూడొచ్చు. ఫ్రాన్స్‌కు చెందిన వారేవరో వాటిని పోస్ట్ చేశారు. కానీ నా గాయం మాత్రం ఎన్నటికీ మానదు.' అని తన మనసులోని బాధను ఘాటుగా బయటపెట్టింది జెన్నిఫర్. అలాగే గతంలో ఈ హ్యాక్‌ని ఒక లైంగిక నేరం, లైంగిక ఉల్లంఘనగా పేర్కొంది. జెన్నిఫర్ 2017లో జరిగిన అనుభవం గురించి కూడా చెప్పుకొచ్చింది. తన స్వస్థలమైన లూయిస్ విల్లే, కెంటక్కీ నుంచి న్యూయార్క్‌కు ఒక ప్రైవేట్ విమానంలో బయలుదేరింది. అప్పుడు విమానంలోని రెండు ఇంజిన్లు ఫెయిల్ కావడంతో చనిపోతాననే భావన గట్టిగా కలిగింది జెన్నిఫర్‌కు. 'నా అస్థిపంజరం సీటులో ఉండిపోతుంది. నేను నా కుటుంబానికి వాయిస్ మేయిల్స్ ఇవ్వడం మొదలు పెట్టాను. నేను గొప్ప జీవితాన్ని గడిపాను. నన్ను క్షమించండి.' అని అప్పటి అనుభవాన్ని షేర్ చేసుకుంది. ప్రస్తుతం జెన్నిఫర్ తన రాబోయే చిత్రం డోంట్ లుక్ అప్ ప్రమోషన్లో బిజీగా ఉంది. ఈ సెటైరికల్ సైన్స్ ఫిక్షన్ బ్లాక్ కామెడీ చిత్రంలో లియోనార్డో డికాప్రియో, జెన్నిఫర్ లారెన్స్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రం డిసెంబర్ 10న పరిమిత థియేటర్లలో విడుదలవనుంది. అలాగే డిసెంబర్ 24 నుంచి ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఇది చదవండి: ఇండియన్ ఫుడ్ అంటే ఇష్టమంటున్న 'వండర్ వుమెన్' -
బాల్యవివాహాలకు వ్యతిరేకంగా...
‘‘ఆడపిల్లల కలల్ని, ఆశల్ని చిదిమేస్తూ 18 ఏళ్లలోపే వారికి పెళ్లిచేయడం నిజంగా దారుణం, అభివృద్ధి చెందుతున్న దేశాల్లోనే ఇలాంటివి జరగడం అత్యంత హేయమైన విషయం’’ అని హాలీవుడ్ బ్యూటీ, మానవహక్కుల కార్యకర్త ఏంజెలినా జోలీ పేర్కొన్నారు. ఇటీవల ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఏంజెలినా బాల్యవివాహాలపై ఫైర్ అయ్యారు. ఎక్కడైనా బాల్య వివాహం జరుగుతోందని తనకు తెలిస్తే, అక్కడికి స్వయంగా వెళ్లి అడ్డుకోవడానికి వెనకాడనని కూడా జోలీ పేర్కొన్నారు. కేవలం మాటలకు మాత్రమే పరిమితం కాకుండా బాల్యవివాహాలకు వ్యతిరేకంగా తీసిన ఇతోపియన్ చిత్రం ‘డిఫ్రెట్’కి ఆమె సంయుక్త భాగస్వామిగా వ్యవహరిస్తున్నారు. దీన్నిబట్టి బాల్య వివాహాలను అడ్డుకోవడం అనే విషయాన్ని జోలీ ఓ ఉద్యమంలా తీసుకున్నారని చెప్పొచ్చు.