
Jennifer Lawrence Opens Up About Her Private Photos Leak: 2014లో జరిగిన సంఘటన కారణంగా ఇప్పటికీ మానసిక ఒత్తిడికి గురవుతున్నానని ప్రముఖ హాలీవుడ్ నటి జెన్నిఫల్ లారెన్స్ ఆవేదన వ్యక్తం చేసింది. వేర్వేరు సెలబ్రిటీలకు సంబంధించిన సుమారు 500 ప్రైవేట్ ఫొటోలను హ్యాకర్లు సేకరించి ఆన్‌లైన్‌లో లీక్ చేశారు. ఆ సెలబ్రిటీల్లో సింగర్ రిహన్నా, సెలీనా గోమెజ్‌లతో పాటు నటి జెన్నిఫర్ లారెన్స్ కూడా ఉన్నారు. అప్పుడు జరిగిన ఆ స్కాండల్‌తో నిరంతరం మానసిక ఒత్తిడికి గురవుతున్నానని వెల్లడించింది.
'నా అంగీకారం లేకుండా ఎవరైనా నా నగ్న శరీరాన్ని చూడొచ్చు. ఫ్రాన్స్‌కు చెందిన వారేవరో వాటిని పోస్ట్ చేశారు. కానీ నా గాయం మాత్రం ఎన్నటికీ మానదు.' అని తన మనసులోని బాధను ఘాటుగా బయటపెట్టింది జెన్నిఫర్. అలాగే గతంలో ఈ హ్యాక్‌ని ఒక లైంగిక నేరం, లైంగిక ఉల్లంఘనగా పేర్కొంది. జెన్నిఫర్ 2017లో జరిగిన అనుభవం గురించి కూడా చెప్పుకొచ్చింది. తన స్వస్థలమైన లూయిస్ విల్లే, కెంటక్కీ నుంచి న్యూయార్క్‌కు ఒక ప్రైవేట్ విమానంలో బయలుదేరింది. అప్పుడు విమానంలోని రెండు ఇంజిన్లు ఫెయిల్ కావడంతో చనిపోతాననే భావన గట్టిగా కలిగింది జెన్నిఫర్‌కు. 'నా అస్థిపంజరం సీటులో ఉండిపోతుంది. నేను నా కుటుంబానికి వాయిస్ మేయిల్స్ ఇవ్వడం మొదలు పెట్టాను. నేను గొప్ప జీవితాన్ని గడిపాను. నన్ను క్షమించండి.' అని అప్పటి అనుభవాన్ని షేర్ చేసుకుంది.
ప్రస్తుతం జెన్నిఫర్ తన రాబోయే చిత్రం డోంట్ లుక్ అప్ ప్రమోషన్‌లో బిజీగా ఉంది. ఈ సెటైరికల్ సైన్స్ ఫిక్షన్ బ్లాక్ కామెడీ చిత్రంలో లియోనార్డో డికాప్రియో, జెన్నిఫర్ లారెన్స్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రం డిసెంబర్ 10న పరిమిత థియేటర్లలో విడుదలవనుంది. అలాగే డిసెంబర్ 24 నుంచి ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది.
ఇది చదవండి: ఇండియన్ ఫుడ్ అంటే ఇష్టమంటున్న 'వండర్ వుమెన్'
Comments
Please login to add a commentAdd a comment