గుండెలు పిండే విషాదం : మరణానికి ఏర్పాట్లు చేసుకుంటున్న స్టార్‌ యాక్టర్‌ | Shannen Doherty makes plans for when she dies to make transition easier her mother | Sakshi
Sakshi News home page

గుండెలు పిండే విషాదం : మరణానికి ఏర్పాట్లు చేసుకుంటున్న స్టార్‌ యాక్టర్‌

Published Wed, Apr 3 2024 5:04 PM | Last Updated on Wed, Apr 3 2024 5:31 PM

Shannen Doherty makes plans for when she dies to make transition easier her mother - Sakshi

తిరగబెట్టిన కేన్సర్‌, నాలుగో స్టేజ్‌లో

అమ్మే  నా తొలి ప్రాధాన్యం: ‘‘బెవర్లీ హిల్స్, 90210" స్టార్ షానెన్ డోహెర్టీ

భౌతిక ఆస్తులను అమ్మేస్తున్నా..

తానిక ఎక్కువ రోజులు బతకనని  ఆమెకు తెలుసు .అందుకే లెజెండరీ స్టార్ షానెన్ డోహెర్టీ షానెన్ డోహెర్టీ గుండెలు పిండే విషాదాన్ని షేర్‌ చేసింది. ‘‘లెట్స్ బి క్లియర్" అనే పోడ్‌కాస్ట్‌లో తన జీవితానికి సంబంధించిన కీలక అప్‌డేట్‌ను పంచుకుంది. కేన్సర్‌ చికిత్సలో భాగంగా . "కేన్సర్ ఇన్ఫ్యూషన్"  అనే కొత్త చికిత్స  గురించి కూడా మాట్లాడింది.

ఆశాభావాన్ని కూడా వ్యక్తం చేసింది. అయినా కూడా తన చనిపోయిన తర్వాత తన తల్లి రోసా డోహెర్టీకి అండగా నిలబడేలా, ఆమెకు భారం కాకుండా ఉండేలా, తనను ప్రేమించిన వారికి  కొన్ని జ్ఞాపకాలను మిగిల్చేలా  కొన్ని కీలక నిర్ణయాలను తీసుకున్నట్టు వెల్లడించింది.

ఫోర్త్‌ స్టేజ్‌ రొమ్ము క్యాన్సర్‌తో  బాధపడుతున్న షానెన్‌కు ఇపుడది మెదడు, ఎముకలకు  కూడా వ్యాపించింది. దీంతో తనకిక త్వరలోనే చనిపోతానని తెలిసినా మనోనిబ్బరం కోల్పోలేదు. మరణాన్ని ధైర్యంగా ఆహ్వానించేందుకు సిద్ధపడుతోంది. అంతేకాదు...తల్లిని ఆదు కోవాల్సిన  తను ముందే చనిపోతే, ఆమె ఒంటరిదైపోతుందనీ,అందుకే ఆస్తులను అమ్మి తల్లికివ్వాలని , తద్వారా తన మరణం తర్వాత  ఆమెకు ఆర్థికంగా ఆదుకునేలా ఉండాలని చూస్తోంది.తన కెంతో ఇష్టంగా సేకరించుకున్న వస్తువులను విక్రయిస్తోంది.ఇదే సరైంది అని భావిస్తోంది.  కేన్సర్‌తో పోరాడుతున్నప్పటికీ, డోహెర్టీ  ఉన్న కొద్ది సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని అడుగులువేస్తోంది.భవిష్యత్తు కోసం సిద్ధం కావాలని నిశ్చయించుకుంది. ఆఖరికి అంత్యక్రియల ఏర్పాట్లను ప్లాన్ చేసుకుంటోంది. 

కేన్సర్‌ తన జీవితాన్ని మార్చసిందనీ, నిజంగా జీవితాన్ని, తన ప్రాధాన్యతలను మార్చేసిందని తెలిపింది అందుకే ఏళ్లుగా సేకరించిన పురాతన వస్తువులు, ఇతర వస్తువులను విక్రయించడమో  లేదా విరాళంగా ఇవ్వడమో చేస్తోంది.

"ప్రస్తుతానికి నా ప్రాధాన్యత నా తల్లి - నేను ఆమె కంటే ముందే చనిపోతే అది ఆమెకు కష్టమని నాకు తెలుసు" ఇది  ఆమెకు చాలా కష్టంగా ఉంటుంది కాబట్టి, అందుకే ఆమకోసం ఏదైనా  చేయాలని నిర్ణయించాను అని తెలిపింది. అలాగే షానెన్ ఆమె సంపాదించిన డబ్బుతో తన తల్లిని సెలవులకు తీసుకెళ్లేందుకు ఆమెను ఆనందంగా ఉంచేందుకు ప్రయత్నిస్తోంది. 

కాగా షానెన్ డోహెర్టీ బాల్యం నుండి నటిస్తోంది. 1981లో తన పదేళ్ల వయసులో "ఫాదర్ మర్ఫీ" అనే టీవీ షోలో గెస్ట్ స్టార్‌గా తన కెరీర్‌ను ప్రారంభించింది. టీనేజ్ డ్రామా బెవర్లీ హిల్స్, 90210 , చార్మ్డ్ టీవీ  సీరియల్స్‌  ప్రపంచ వ్యాప్తంగా పాపులర్‌ అయింది.1983  లిటిల్ హౌస్ ఆన్ ది ప్రైరీ  18 ఎపిసోడ్‌లలో జెన్నీ వైల్డర్‌గా నటించిన ప్రశంసలు పొందింది. అనేక  అవార్డులను గెల్చుకుంది. 

2015లో డోహెర్టీకి రొమ్ము క్యాన్సర్ ఉన్నట్లు నిర్ధారణ అయింది. అప్పట్లో కేన్సర్‌తగ్గినా మళ్లీ వచ్చిందని ఆమె 2017లో వెల్లడించింది. 2020లో మరింత విస్తరించిందని తెలిపింది. 2023 నవంబర్ 29 న పీపుల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో  మెదడుకు, ఎముకలకు కూడా పాకిందని తెలిపింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement