డాక్టర్‌పై ఏడు సార్లు కత్తితో దాడి ఘటన.. కుమారుడ్ని సమర్థించిన తల్లి | Watch Video Inside, Patient Whose Son Stabbed Chennai Doctor 7 Times Defends Him, Says He Loves Me Too Much | Sakshi
Sakshi News home page

డాక్టర్‌పై ఏడు సార్లు కత్తితో దాడి ఘటన.. కుమారుడ్ని సమర్థించిన తల్లి

Published Thu, Nov 14 2024 9:29 PM | Last Updated on Fri, Nov 15 2024 11:11 AM

Patient Whose Son Stabbed Chennai Doctor 7 Times Defends Him: He Loves Me Too Much

చెన్నై: తన తల్లికి సరిగ్గా వైద్యం చేయలేదని కోపంతో ఆమె కుమారుడు విఘ్నేష్‌ డాక్టర్‌పై ఏడుసార్లు కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో  నిందితుడు విఘ్నేష్‌ని సమర్థిస్తూ ఆమె తల్లి మాట్లాడారు. అయ్యా.. నా మీదున్న ప్రేమే.. నా కుమారుడితో ఇంత పనిచేయించింది. వాడి తప్పేమీ లేదు. నాకు క్యాన్సర్‌ ఉంది. కీమో థెరఫీ అవసరం లేదని డాక్టర్‌ బాలాజీ చెప్పి వెళ్లిపోయారు. నేను ఆయనకు ఏమైనా శత్రువునా? అని ప్రశ్నించారు.

చెన్నైలో కలకలం రేపిన ప్రభుత్వ వైద్యుడిపై దాడి ఘటనలో నిందితుడి తల్లి మీడియాతో మాట్లాడారు. నాకు క్యాన్సర్‌ స్టేజ్‌ 5లో ఉంటే గిండి కలైజ్ఞర్‌ సెంటినరీ సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి వైద్యులు స్టేజ్ 2 క్యాన్సర్ ఉందని చెప్పారు. అలా ఎలా చెబుతారు? ఆర్థిక ఇబ్బందుల కారణంగా అడయార్ క్యాన్సర్ ఆస‍్పత్రిలో చికిత్స చేయించుకో లేకపోయాను. ఈ (కలైజ్ఞర్‌ సెంటినరీ) ఆస్పత్రికి వస్తే క్యాన్సర్‌ విభాగ వైద్యుడు బాలాజీ నాకు మరో కీమోథెరపీ అవసరం లేదని చెప్పి వెళ్ళిపోయారు. నేను ఆయనకు శత్రువునా? అని ప్రశ్నిస్తూ.. డాక్టర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు.  

అనారోగ్య సమస్య గురించి చెబుతుంటే డాక్టర్‌ బాలాజీ నావైపు చూసేందుకు ఇష్టపడలేదు. నాపై ఉన్న ప్రేమ విఘ్నేష్‌తో ఇంత పనిచేయించింది. విఘ్నేష్‌ హార్ట్ పేషెంట్. మూర్ఛతో బాధపడుతున్నాడని విచారం వ్యక్తం చేశారు. 

 

 ఏం జరిగిందంటే?
చెన్నై గిండిలోని కలైజ్ఞర్‌ సెంటినరీ సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రిలో విధులు నిర్వహిస్తున్న క్యాన్సర్‌ విభాగ వైద్యుడు బాలాజీపై చెన్నై పెరుంగళత్తూర్‌కు చెందిన 25 ఏళ్ల విఘ్నేష్‌ కత్తితో దాడి చేశాడు. దాడిపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. నిందితుడు విఘ్నేష్‌ను అదుపులోకి తీసుకున్నారు. అయితే  క్యాన్సర్‌ సమస్యతో బాధపడుతున్న తన తల్లికి డాక్టర్‌ బాలజీ సరైన వైద్యం అందిచం లేదనే ఆవేదనతో దాడి చేసినట్లు నిందితుడు పోలీసులకు వాంగ్మూలం ఇచ్చాడు. అంతేకాదు, తన తల్లికి సరైన చికిత్స అందించకపోవడంపై డాక్టర్‌ బాలాజీని అడిగానని, వైద్య ఖర్చులు ఇవ్వాలని అడిగితే తనను కిందకి నెట్టివేశాడని, దీంతో కత్తితో దాడిచేసినట్లు పేర్కొన్నాడు. ప్రస్తుతం వైద్యుడిపై దాడి ఘటన సంచలనంగా మారింది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement