chenni
-
డాక్టర్‌పై ఏడు సార్లు కత్తితో దాడి ఘటన.. కుమారుడ్ని సమర్థించిన తల్లి
చెన్నై: తన తల్లికి సరిగ్గా వైద్యం చేయలేదని కోపంతో ఆమె కుమారుడు విఘ్నేష్ డాక్టర్‌పై ఏడుసార్లు కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో నిందితుడు విఘ్నేష్‌ని సమర్థిస్తూ ఆమె తల్లి మాట్లాడారు. అయ్యా.. నా మీదున్న ప్రేమే.. నా కుమారుడితో ఇంత పనిచేయించింది. వాడి తప్పేమీ లేదు. నాకు క్యాన్సర్ ఉంది. కీమో థెరఫీ అవసరం లేదని డాక్టర్ బాలాజీ చెప్పి వెళ్లిపోయారు. నేను ఆయనకు ఏమైనా శత్రువునా? అని ప్రశ్నించారు.చెన్నైలో కలకలం రేపిన ప్రభుత్వ వైద్యుడిపై దాడి ఘటనలో నిందితుడి తల్లి మీడియాతో మాట్లాడారు. నాకు క్యాన్సర్ స్టేజ్ 5లో ఉంటే గిండి కలైజ్ఞర్ సెంటినరీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి వైద్యులు స్టేజ్ 2 క్యాన్సర్ ఉందని చెప్పారు. అలా ఎలా చెబుతారు? ఆర్థిక ఇబ్బందుల కారణంగా అడయార్ క్యాన్సర్ ఆస్పత్రిలో చికిత్స చేయించుకో లేకపోయాను. ఈ (కలైజ్ఞర్ సెంటినరీ) ఆస్పత్రికి వస్తే క్యాన్సర్ విభాగ వైద్యుడు బాలాజీ నాకు మరో కీమోథెరపీ అవసరం లేదని చెప్పి వెళ్ళిపోయారు. నేను ఆయనకు శత్రువునా? అని ప్రశ్నిస్తూ.. డాక్టర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. అనారోగ్య సమస్య గురించి చెబుతుంటే డాక్టర్ బాలాజీ నావైపు చూసేందుకు ఇష్టపడలేదు. నాపై ఉన్న ప్రేమ విఘ్నేష్‌తో ఇంత పనిచేయించింది. విఘ్నేష్ హార్ట్ పేషెంట్. మూర్ఛతో బాధపడుతున్నాడని విచారం వ్యక్తం చేశారు. Prof.Balaji Jagannathan, Professor & HOD, Medical Oncology, Govt Kalaignar Hospital, #Chennai, stabbed by 7 times by criminal from Peringalathur, whose mother ws being Rx fr stage 4 lung #Cancer at this hospital.Prof Balaji is very, very serious now. 🙏. #MedTwitter #medX pic.twitter.com/eG2uN3mKqp— Indian Doctor🇮🇳 (@Indian__doctor) November 13, 2024 ఏం జరిగిందంటే?చెన్నై గిండిలోని కలైజ్ఞర్ సెంటినరీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో విధులు నిర్వహిస్తున్న క్యాన్సర్ విభాగ వైద్యుడు బాలాజీపై చెన్నై పెరుంగళత్తూర్కు చెందిన 25 ఏళ్ల విఘ్నేష్ కత్తితో దాడి చేశాడు. దాడిపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. నిందితుడు విఘ్నేష్‌ను అదుపులోకి తీసుకున్నారు. అయితే క్యాన్సర్ సమస్యతో బాధపడుతున్న తన తల్లికి డాక్టర్ బాలజీ సరైన వైద్యం అందిచం లేదనే ఆవేదనతో దాడి చేసినట్లు నిందితుడు పోలీసులకు వాంగ్మూలం ఇచ్చాడు. అంతేకాదు, తన తల్లికి సరైన చికిత్స అందించకపోవడంపై డాక్టర్ బాలాజీని అడిగానని, వైద్య ఖర్చులు ఇవ్వాలని అడిగితే తనను కిందకి నెట్టివేశాడని, దీంతో కత్తితో దాడిచేసినట్లు పేర్కొన్నాడు. ప్రస్తుతం వైద్యుడిపై దాడి ఘటన సంచలనంగా మారింది. -
పవన్ వ్యాఖ్యలపై ఉదయనిధి స్టాలిన్ కౌంటర్
చెన్నై: తిరుపతి వారాహి డిక్లరేషన్ సభలో సనాతన ధర్మంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై ఇప్పటికే తమిళనాడు అధికార పార్టీ డీఎంకే కౌంటర్ ఇచ్చింది. తిరుమల లడ్డూ కల్తీ జరిగిందంటూ కూటమి ప్రభుత్వం చేసిన రాజకీయంపై సుప్రీం కోర్టు మొట్టి కాయలు వేసిన విషయాన్ని గుర్తు చేసింది. గురువారం పవన్ వారాహి డిక్లరేషన్ సభలో తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ పేరు ప్రస్తావించకుండా పరోక్షంగా విమర్శలు చేసిన విషయం తెలిసిందే. అయితే.. దానిపై తాజాగా శుక్రవారం తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ స్పందించారు. సనాతన ధర్మాన్ని నిర్మూలించలేరంటూ పవన్ చేసిన వ్యాఖ్యలకు బదులిస్తూ.. ‘వేచి చూడండి. వేచి చూడండి’ అని అన్నారు.#WATCH | On Andhra Pradesh Deputy CM Pawan Kalyan's remark 'Sanatana Dharma cannot be wiped out and who said those would be wiped out', Tamil Nadu Deputy CM Udhayanidhi Stalin says "Let's wait and see" pic.twitter.com/YUKtOJRnp9— ANI (@ANI) October 4, 2024 ‘‘సనాతన ధర్మం వైరస్ లాంటిదని, ఆ మహమ్మారిని నిర్మూలించాలని ఈ మధ్య ఓ యువ నాయకుడు మాట్లాడుతున్నాడు. సనాతన ధర్మాన్ని ఎవరూ ఏమీ చేయలేరు. ఎవరైనా సరే దాన్ని నిర్మూలించాలనుకుంటే, వారే తుడిచి పెట్టుకుని పోతారు. తిరుపతి బాలాజీ సాక్షిగా ఈ మాట చెబుతున్నా’’ అని పవన్ కల్యాణ్ అన్నారు.అయితే పవన్ వ్యాఖ్యలపై డీఎంకే ఇప్పటికే గట్టి కౌంటర్ ఇచ్చింది. డీఎంకే అధికార ప్రతినిధి డాక్టర్ సయ్యద్ హఫీజుల్లా మాట్లాడుతూ.. తమ పార్టీ ‘‘ ఏ మతం గురించి, ప్రత్యేకంగా హిందూ మతం గురించి మాట్లాడదు.. కుల దురాగతాలు, అంటరానితనం గురించి మాత్రమే మాట్లాడుతుంది’’ అని సూచించారు. చదవండి: Tirupati Laddu Case Hearing: చంద్రబాబుకు సుప్రీంకోర్టులో మరో ఎదురుదెబ్బ -
బంగ్లాతో తొలి టెస్టు.. రోహిత్ మాస్టర్ ప్లాన్! ఇక చుక్కలే?
బంగ్లాదేశ్‌తో రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌కు టీమిండియా సిద్దమవుతోంది. ఈ సిరీస్‌లో భాగంగా తొలి టెస్టు సెప్టెంబర్ 19 నుంచి చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగా ప్రారంభం కానుంది. వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్‌కు చేరాలంటే ఈ సిరీస్ భారత్‌కు చాలా కీలకం. ఇప్పటికే చెన్నైకు చేరుకున్న టీమిండియా తమ ప్రాక్టీస్‌ను కూడా షురూ చేసింది. ఆటగాళ్లు నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఇప్పటివరకు టీమిండియాపై బంగ్లా జట్టు ఒక్కసారి కూడా విజయం సాధించకపోయినప్పటకి.. ఈ సిరీస్‌ను రోహిత్ సేన ఏ మాత్రం తేలికగా తీసుకోవడం లేదు. పాక్‌పై చారిత్రత్మక టెస్టు సిరీస్ విజయం సాధించి సమరోత్సహంతో భారత్ గడ్డపై అడుగు పెట్టనున్న బంగ్లా బెండు తీసేందుకు భారత్ ప్రత్యేక వ్యూహాలు రచిస్తోంది.రోహిత్ అండ్ గంభీర్ మాస్టర్ మైండ్..?తొలి టెస్టుకు ఆతిథ్యమిస్తున్న చెపాక్ పిచ్‌ను పూర్తిగా పేస్‌కు అనుకూలించే విధంగా తయారు చేయమని టీమిండియా మెనెజ్‌మెంట్ పిచ్క్యూరేటర్కు సూచించినట్లు తెలుస్తోంది. తొలి టెస్టు కోసం ఎర్ర నేల ఆధారిత ట్రాక్‌ను తయారు చేస్తున్నట్లు వినికిడి. భారత కెప్టెన్ రోహిత్ శర్మ, హెడ్ కోచ్ గౌతం గంభీర్ దగ్గరుండి పిచ్‌ను తయారు చేయిస్తున్నట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి.కాగా సాదారణంగా చెపాక్ పిచ్ స్పిన్నర్లకు అనుకూలంగా ఉంటుంది. ఇక్కడ బ్లాక్ సోయిల్ పిచ్‌పై తొలి రోజు నుంచే బంతి టర్న్ అవుతూ ఉంటుంది. అందుకే స్పిన్నర్లు ఈ వేదికగా తమ మయాజాలం ప్రదర్శిస్తుంటారు. కానీ ఇప్పుడు బంగ్లాను తమ పేస్ బౌలింగ్‌తో ముప్పు తిప్పలు పెట్టేందుకు భారత్ సిద్దమైనట్లు సమాచారం. బంగ్లాదేశ్ ఎక్కువగా బ్లాక్ సోయిల్(నల్ల నేల) పిచ్‌లపై ఎక్కువ ఆడుతోంది. కాబట్టి ఎర్ర నేల ట్రాక్‌పై ఆడేందుకు వారు కచ్చితంగా ఇబ్బంది పడతారు. ఈ క్రమంలోనే వారి వీక్నెస్పై భారత్ దెబ్బ కొట్టేందుకు సిద్దమైనట్లు వార్తలు వినిపిస్తున్నాయి.చదవండి: IND vs BAN: చరిత్రకు అడుగు దూరంలో రోహిత్.. సెహ్వాగ్ ఆల్ టైమ్ రికార్డుపై కన్ను -
‘ఒక్క బిస్కెట్ తక్కువైంది సార్’, కోర్టు మెట్లెక్కిన ఢిల్లీ బాబు.. చివరికి ఏమైందంటే?
తాను కొన్న బిస్కెట్ ప్యాకెట్లో ఒక బిస్కెట్ తక్కువైందంటూ ఓ వ్యక్తి కోర్టు మెట్లెక్కాడు. రెండేళ్ల పాటు విచారణ జరిగిన ఈ కేసులో కోర్టు తుది తీర్పు ఏమని ఇచ్చింది. చెన్నైలోని ఎంఎండీఏ మాథుర్‌కు చెందిన పీ. ఢిల్లీ బాబు అనే వ్యక్తికి మూగ జీవాలంటే మహా ఇష్టం. అందుకే ప్రతి రోజు వీధికుక్కలకు బిస్కెట్లను ఆహారంగా అందిస్తుంటారు. ఈ నేపథ్యంలో ఓ రోజు ఢిల్లీ బాబు ఎప్పటిలాగే కుక్కలకి బిస్కెట్లు అందించేందుకు ప్రముఖ ఎఫ్ఎంసీజీ ఐటీసీ సంస్థకు చెందిన సన్‌ఫీస్ట్ మేరీ లైట్ బిస్కెట్లు ప్యాకెట్‌ను కొనుగోలు చేశారు. అనంతరం ఆ బిస్కెట్ ప్యాకెట్‌ను పరిశీలించగా అందులో ఓ తప్పు జరుగుతున్నట్లు గుర్తించారు. సంస్థ రేపర్ (చాక్లెట్ కవర్) మీద 16 బిస్కెట్లు ఉన్నాయని చెప్పింది. కానీ తాను కొన్న బిస్కెట్ ప్యాకెట్లో రేపర్ మీద పేర్కొన్న బిస్కెట్ల సంఖ్య కన్నా ఒక బిస్కెట్ తక్కువగా ఉన్నట్లు నిర్ధారణకు వచ్చారు. వివరణ కోసం స్థానిక స్టోర్‌తో పాటు ఐటీసీకి మెయిల్ చేసినా స్పందన లేదు. ఒక్క బిస్కెట్ తక్కువైంది సార్ దీంతో ఆగ్రహానికి గురైన ఆ వ్యక్తి 2021 డిసెంబర్ నెలలో చెన్నైలోని వినియోగదారుల కోర్టును ఆశ్రయించాడు. ఒక్కో బిస్కెట్ ధర 75 పైసలు. ఐటీసీ రోజుకు 50 లక్షల బిస్కెట్ల ప్యాకెట్లను తయారు చేస్తుంది. ఈ లెక్కల ప్రకారం చూస్తే కంపెనీ వినియోగదారులను ప్రతిరోజూ రూ.29 లక్షలు మేర మోసం చేస్తోంది అంటూ కోర్టు ఫిర్యాదులో పేర్కొన్నాడు. ప్రతిస్పందనగా ఐటీసీ సంస్థ బిస్కెట్లను సంఖ్య ఆధారంగా కాకుండా బరువు ఆధారంగా విక్రయిస్తారని వాదించింది. ఇరు వాదనల విన్న కోర్టు సన్‌ఫీస్ట్ మేరీ లైట్ బిస్కెట్ ప్యాకెట్‌ను పరిశీలించింది. ప్రతి ప్యాకెట్‌పై పేర్కొన్న నికర బరువు 76 గ్రాములు. అయితే, 15 బిస్కెట్లు ఉన్న ఒక్కో ప్యాక్ 74 గ్రాముల బరువు మాత్రమేనని కోర్టు గుర్తించింది. అసంతృప్తికి గురైన కోర్టు 2011 నాటి లీగల్ మెట్రాలజీ నిబంధనలు ముందుగా ప్యాక్ చేసిన వస్తువులలో గరిష్టంగా 4.5 గ్రాముల వ్యత్యాసాన్ని అనుమతించాయని కోర్టుకు విన్నవించుకుంది. అయితే, అస్థిర ఉత్పత్తుల విషయంలో మాత్రమే ఇటువంటి మినహాయింపులు చెల్లుబాటు అవుతాయని కోర్టు సంస్థ ఇచ్చిన వివరణను తిరస్కరించింది. బిస్కెట్లు కాలక్రమేణా బరువు తగ్గవు కాబట్టి నియమం వర్తించదు అని స్పష్టం చేసింది. పైగా, రేపర్‌పై ఐటీసీ 16 బిస్కెట్లను పేర్కొన్నందున, సంఖ్య కాకుండా.. బరువు ఆధారంగా బిస్కెట్లు విక్రయించారనే వాదన కూడా కొట్టివేసింది. లక్ష చెల్లించాలని ఆదేశాలు బిస్కెట్ ప్యాకెట్లో రేపర్‌పై పేర్కొన్న బిస్కెట్ల సంఖ్య కన్నా ఒక బిస్కట్ తక్కువగా ప్యాక్ చేశారంటూ ఐటీసీకి వినియోగదారుల కోర్టు రూ. 1 లక్ష జరిమానా విధించింది. ఆ మొత్తాన్ని ఫిర్యాదు దారుడు ఢిల్లీ బాబుకు చెల్లించాలని ఐటీసీ సంస్థకు వినియోగదారుల కోర్టు ఆదేశాలు జారీ చేసింది. -
చెన్నై స్టేడియం లో ధోని చేసిన పనికి ...
-
తండ్రిలాంటి వాడినంటూ ముద్దు పెట్టుకున్నాడు: స్టూడెంట్
చెన్నై: విద్యాబుద్ధులు నేర్పాల్సిన టీచర్ విద్యార్థినిల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ.. వేధింపులకు గురి చేసిన ఘటన తమిళనాడులో కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ ఘటన మరువక ముందే మరో కీచక ఉపాధ్యాయుడి బాగోతం వెలుగులోకి వచ్చింది. చెన్నైలో ఓ స్కూల్లో కామర్స్ బోధించే ఉపాధ్యాయుడు ఒకరు ఏళ్ల తరబడి విద్యార్థినిలను లైంగిక వేధింపులకు గురి చేస్తున్నట్లు తెలిసింది. పాత విద్యార్థినిలు, ప్రస్తుత విద్యార్థినిలు అంతా కలిసి సుమారు 500 మందికి పైగా సదరు ఉపాధ్యాయుడిపై సోషల్ మీడియా వేదికగా ఫిర్యాదు చేశారు. అలాగే సదరు టీచర్ ఆగడాలను వివరిస్తూ.. పాఠశాల యాజమాన్యానికి మెయిల్ చేశారు. ‘‘క్లాస్ ఏడున్నరకైతే 7 గంటలకు రమ్మని సార్ నాకు మెసేజ్ పెట్టాడు. స్కూల్‌కి వెళ్లి చూస్తే అక్కడ నేను ఒక్కదాన్నే ఉన్నాను. అప్పుడు టీచర్ నన్ను దగ్గరకు లాక్కుని ముద్దు పెట్టుకున్నాడు. దీని గురించి ఎవరికైనా చెప్తే నాపై తప్పుడు ఫిర్యాదు చేస్తానని బెదిరించాడు.. నేను అతడి మాట వినకపోవడంతో 11 గ్రేడ్‌లో ఉండగా నన్ను కొట్టాడు.. దారుణంగా అవమానించాడు’’ అంటూ ఓ విద్యార్థిని తన ఆవేదనను వ్యక్తం చేసింది. మరోక విద్యార్థిని ‘‘టీచర్ నన్ను అసభ్యకర రీతిలో తాకాడు.. తన ఒడిలో కూర్చుపెట్టుకుని నీ తండ్రిలాంటి వాడిని అన్నాడు.. ముద్దు పెట్టుకుని జస్ట్ ఫ్రెండ్లీగా కిస్ చేశాను’’ అనేవాడు అని ఆరోపించింది. ఇక అమ్మాయిల బాధలు ఇలా ఉంటే.. సదరు టీచర్ అబ్బాయిలను బూతులు తిడుతూ.. దారుణంగా హింసించేవాడు.. అందరి ముందు చితకబాదేవాడు. క్లాస్ టీచర్‌గా ఉన్నప్పుడు విద్యార్థుల వ్యక్తిగత సమాచారాన్ని తీసుకుని మిస్ యూస్ చేసేవాడు. విద్యార్థినిలకు అసభ్య సందేశాలు పంపేవాడు. రిప్లై ఇవ్వకపోతే స్టూడెంట్స్ మీద వారి తల్లిదండ్రులకు తప్పుడు కంప్లైంట్స్ ఇస్తానని బెదిరించేవాడు. స్కూల్ అయిపోయాక కూడా కోచింగ్ పేరుతో విద్యార్థినిలను తన దగ్గరే ఉంచుకునేవాడు. రాత్రి 8, 9 గంటల ప్రాంతంలో వారికి ఇంటికి పంపేవాడు. వీటన్నింటి గురించి విద్యార్థులు మెయిల్ ద్వారా యాజమాన్యానకి ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో సదరు టీచర్ని స్కూల్ నుంచి సస్పెండ్ చేశారు. విద్యార్థినిల ఫిర్యాదు మమ్మల్ని కలచి వేసింది. సదరు టీచర్‌పై వచ్చిన ఆరోపణల గురించి దర్యాప్తు చేయడానికి ఒక అంతర్గత కమిటీని వేశాం. ఆరోపణలన్నింటిని పారదర్శకంగా, నిష్పక్షపాతంగా విచారించి.. తగిన చర్యలు తీసుకుంటామని యాజమాన్యం ఓ ప్రకటన ద్వారా తెలియజేసింది. చదవండి: లైంగిక వేధింపులు.. ఆన్లైన్ క్లాస్‌లో టవల్‌తో టీచర్ -
తొలి టెస్ట్ : దంచికొడుతున్న పంత్
సాక్షి, చెన్నై : ఇంగ్లాండ్‌తో జరుగుతున్న తొలి టెస్ట్ మొదటి ఇన్సింగ్స్ ప్రారంభంలోనే భారత్‌కు ఎదురుదెబ్బ తగిలింది. 19 పరుగుల వద్ద ఓపెనర్ రోహిత్ శర్మ(6) ఔట్ అయ్యాడు. కొద్ది సేపటికే మరో ఓపెనర్ శుభమన్ గిల్ (29) వెనుదిరిగాడు. అనంతరం క్రిజ్‌లోకి వచ్చిన కెప్టెన్ విరాట్ కోహ్లి, అంజిక్యా రహానే వెనువెంటనే పెవిలియన్ బాటపట్టారు. దీంతో ఆదిలోనే భారత్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. కాగా అంతకుముందు పర్యటక ఇంగ్లాండ్ జట్టు 578 పరుగులకు ఆలౌట్ అయ్యింది. ఆదివారం 555/8తో మూడో రోజు ఆటను ఆరంభించిన ఇంగ్లీష్ జట్టు మరో 23 పరుగులు జోడించి తొలి ఇన్సింగ్స్‌ను ముగించింది. ఆ జట్టు బ్యాట్స్‌మెన్స్‌లో రూట్ 218, సిబ్లీ 87, స్టోక్స్ 82 పరుగులు పోప్ 34, డొమినిక్ 34, బర్న్స్ 33, బట్లర్ 30 పరుగులతో రాణించారు. భారత బౌలర్లలో బుమ్రా, అశ్విన్‌కు చెరో 3 వికెట్లు, ఇషాంత్, షాబాజ్ నదీమ్‌కు తలో 2 వికెట్లు దక్కాయి. ఆదుకున్న జోడీ.. 76 పరుగులకే నాలుగు కీలక వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో ఉన్న సమయంలో క్రిజ్‌లో అడుగుపెట్టిన రిషభ్ పంత్ తనదైన శైలిలో దూకుడుగా ఆడాడు. సీనియర్ ఆటగాడు పుజారా నుంచి పూర్తి సహకారం అందడంతో బౌండరీలతో చెలరేగిపోయాడు. 40 బంతుల్లో 50 పరుగులు చేసి హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. పుజారా సైతం జట్లు క్లిష్ల సమయంలో బాధ్యతాయుతంగా ఆడి హాఫ్ సెంచరీ సాధించాడు. 106 బంతుల్లో 50 పరుగులు చేశాడు. దీంతో పంత్ 5వ హాఫ్ సెంచరీ, పుజారా 29వ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నారు. ప్రస్తుతం భారత్ స్కోర్ 149/4. క్రిజ్‌లో పంత్, పుజారా ఉన్నారు. తొలి ఇన్నింగ్స్‌లో భారత్ ఇంకా 435 పరుగులు వెనుకబడి ఉంది. అప్డేట్స్ : హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న పుజారా, పంత్ ప్రస్తుతం భారత్ స్కోర్ 149/4 రోహిత్ 6, గిల్ 29, కోహ్లి 11, రహానే 1 ఔట్ -
కరోనా వైరస్‌పై తమిళనాడు స్పందన
చెన్నై: చైనాను వణికిస్తోన్న కరోనా వైరస్ ఇప్పుడు భారత్‌ను భయపెడుతోంది. తాజాగా తమిళనాడులో కరోనా వైరస్ కలకలంపై.. ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ స్పందించింది. చైనా నుంచి వచ్చి చెన్నైలోని ఓ ప్రైవేటు హోటల్లో ఉన్న ఇద్దరు వ్యక్తులను ప్రత్యేక వైద్య బృందం పరీక్షించిందని పేర్కొంది. అదేవిధంగా ఆ ఇద్దరికి కరోనా వైరస్‌కి సంబంధించిన ప్రత్యేక పరీక్షలు జరిపినట్లు తెలియజేసింది. ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో 9 మంది కరోనా వైరస్‌కి సంబంధించిన లక్షణాలు కలిగి ఉన్నట్లు అనుమానం వ్యక్తం చేసింది. ఆయా ప్రభ్యత్వ ఆసుపత్రుల్లో ప్రత్యేక వార్డులను ఏర్పాటు చేసి అత్యవసర చికిత్స అందిస్తున్నామని తమిళనాడు ఆరోగ్యశాఖ తెలిపింది. కేరళ నుంచి చెన్నైకి వస్తున్న ప్రయాణికులపై వైద్య పరీక్షలకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశామని పేర్కొంది. చదవండి: కరోనా విశ్వరూపం చదవండి: మరో 9 మందికి ‘కరోనా’! -
సీఎం లేకుండా కేబినెట్ తొలి భేటీ
చెన్నై: కావేరి జలాల వివాదంపై ప్రతిపక్షాల భారీ ఆందోళనలను.. కర్ణాటక పిటిషన్ పై నేడు సుప్రీంకోర్టులో విచారణ.. ఇంకా ఆసుపత్రిలోనే చికిత్స పొందుతున్న ముఖ్యమంత్రి.. ఈ అంశాల నడుమ అమ్మ లేకుండానే తమిళనాడు కేబినెట్ సోమవారం భేటీ అయింది. సీఎం జయలలిత శాఖలను మంత్రి పన్నీర్ సెల్వం చేపట్టిన తర్వాత ఆయన అధ్యక్షత వహిస్తోన్న మొదటి మంత్రివర్గ సమావేశం ఇదే. కావేరి జలాల విడుదల కోరుతూ ప్రతిపక్ష డీఎంకే నిర్వహించిన (అక్టోబర్ 17, 18న) 48 గంటల రైల్ రోకో వందలాది మంది అరెస్టులకు దారితీసిన సంగతి తెలిసిందే. (తమిళనాడులో 48గంటల పాటు రైలురోకో) మరోవైపు నీళ్లు విడుదల చేయలేమంటూ కర్ణాటక దాఖలు చేసిన పిటిషన్ ను సోమవారం సుప్రీంకోర్టు విస్తృత ధర్మాసనం విచారించనుంది. వీటి నేపథ్యంలో తమిళనాడు ప్రయోజనాలు దెబ్బతినకుండా, అదే సమయంలో ప్రతిపక్షాలను సైతం నిలువరించేలా ఏం చేస్తే బాగుంటుంది? అనేదానిపై పన్నీర్ సెల్వం ఇతర మంత్రులతో చర్చించనున్నారు. అనారోగ్యానికి గురై సెప్టెంబర్ 22న ఆసుపత్రిలో చేరిన తమిళనాడు సీఎం జయలలిత ఇప్పటికీ చికిత్స పొందుతూనే ఉన్నారు. సుదీర్ఘకాలం ఆమె ఆసుపత్రిలోనే ఉండాల్సిఉంటుందని వైద్యులు ప్రకటించిన దరిమిలా జయ నిర్వహిస్తోన్న శాఖలన్నింటినీ ఆర్థిక మంత్రి పన్నీర్ సెల్వంకు కట్టబెట్టిన సంగతి తెలిసిందే. (అమ్మ నిర్ణయం: తమిళనాడులో కీలక పరిణామం) అమ్మ లేకుండా ఆమె కేబినెట్ తీసుకునే నిర్ణయాలు ఎలాం ఉంటాయో వేచిచూడాలి. -
'అమ్మ ఆరోగ్యంపై ఆందోళన వద్దు'
-
'అమ్మ ఆరోగ్యంపై ఆందోళన వద్దు'
సాక్షి, చెన్నై: తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత క్రమంగా కోలుకుంటున్నట్లు ఆదివారం వైద్యులు వెల్లడించారు. అమ్మ ఆరోగ్యంగా ఉన్నారని, ఇక ఎలాంటి ఆందోళన వద్దని, త్వరలోనే ఆమె ఇంటికి చేరుకుంటారని ఏఐడీఎంకే నాయకురాలు, సినీ నటి సీఆర్ సరత్వతి మీడియాకు చెప్పారు. తీవ్రజ్వరం, డీహైడ్రేషన్‌తో బాధపడుతోన్న జయలలితను గురువారం(సెప్టెంబర్ 22న) చెన్నై అపోలో ఆస్పత్రిలో చేర్పించిన సంగతి తెలిసిందే. (సింగపూర్‌కు జయలలిత తరలింపు?) ఆర్థిక మంత్రి పన్నీరు సెల్వం, రెవెన్యూ మంత్రి ఆర్బీ.ఉదయకుమార్, ఆరోగ్య మంత్రి విజయభాస్కర్, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామ్మోహన్రావు, సలహాదారు షీలాబాలకృష్ణన్, ఆరోగ్య శాఖ కార్యదర్శి రాధాకృష్ణన్ తదితరులున్నారు ఆదివారం ఆసుపత్రికి వచ్చి ముఖ్యమంత్రిని పరామర్శించారు. ఆమె ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యుల్ని అడిగి తెలుసుకున్నారు. ఆదివారం కూడా తమ అమ్మ కోసం అన్నాడీఎంకే వర్గాలు పూజల్లో నిమగ్నమయ్యాయి. (ఆస్పత్రిలో అమ్మ)