సాక్షి, చెన్నై : ఇంగ్లాండ్‌తో జరుగుతున్న తొలి టెస్ట్ మొదటి ఇన్సింగ్స్ ప్రారంభంలోనే భారత్‌కు ఎదురుదెబ్బ తగిలింది. 19 పరుగుల వద్ద ఓపెనర్ రోహిత్ శర్మ(6) ఔట్ అయ్యాడు. కొద్ది సేపటికే మరో ఓపెనర్ శుభమన్ గిల్ (29) వెనుదిరిగాడు. అనంతరం క్రిజ్‌లోకి వచ్చిన కెప్టెన్ విరాట్ కోహ్లి, అంజిక్యా రహానే వెనువెంటనే పెవిలియన్ బాటపట్టారు. దీంతో ఆదిలోనే భారత్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. కాగా అంతకుముందు పర్యటక ఇంగ్లాండ్ జట్టు 578 పరుగులకు ఆలౌట్ అయ్యింది. ఆదివారం 555/8తో మూడో రోజు ఆటను ఆరంభించిన ఇంగ్లీష్ జట్టు మరో 23 పరుగులు జోడించి తొలి ఇన్సింగ్స్‌ను ముగించింది. ఆ జట్టు బ్యాట్స్‌మెన్స్‌లో రూట్ 218, సిబ్లీ 87, స్టోక్స్ 82 పరుగులు పోప్ 34, డొమినిక్ 34, బర్న్స్ 33, బట్లర్ 30 పరుగులతో రాణించారు. భారత బౌలర్లలో బుమ్రా, అశ్విన్‌కు చెరో 3 వికెట్లు, ఇషాంత్, షాబాజ్ నదీమ్‌కు తలో 2 వికెట్లు దక్కాయి.
ఆదుకున్న జోడీ..
76 పరుగులకే నాలుగు కీలక వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో ఉన్న సమయంలో క్రిజ్‌లో అడుగుపెట్టిన రిషభ్ పంత్ తనదైన శైలిలో దూకుడుగా ఆడాడు. సీనియర్ ఆటగాడు పుజారా నుంచి పూర్తి సహకారం అందడంతో బౌండరీలతో చెలరేగిపోయాడు. 40 బంతుల్లో 50 పరుగులు చేసి హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. పుజారా సైతం జట్లు క్లిష్ల సమయంలో బాధ్యతాయుతంగా ఆడి హాఫ్ సెంచరీ సాధించాడు. 106 బంతుల్లో 50 పరుగులు చేశాడు. దీంతో పంత్ 5వ హాఫ్ సెంచరీ, పుజారా 29వ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నారు. ప్రస్తుతం భారత్ స్కోర్ 149/4. క్రిజ్‌లో పంత్, పుజారా ఉన్నారు. తొలి ఇన్నింగ్స్‌లో భారత్ ఇంకా 435 పరుగులు వెనుకబడి ఉంది.
అప్‌డేట్స్ :
- హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న పుజారా, పంత్
- ప్రస్తుతం భారత్ స్కోర్ 149/4
- రోహిత్ 6, గిల్ 29, కోహ్లి 11, రహానే 1 ఔట్
Comments
Please login to add a commentAdd a comment