సీఎం లేకుండా కేబినెట్ తొలి భేటీ
సీఎం లేకుండా కేబినెట్ తొలి భేటీ
Published Wed, Oct 19 2016 10:49 AM | Last Updated on Thu, Sep 27 2018 8:27 PM
చెన్నై: కావేరి జలాల వివాదంపై ప్రతిపక్షాల భారీ ఆందోళనలను.. కర్ణాటక పిటిషన్ పై నేడు సుప్రీంకోర్టులో విచారణ.. ఇంకా ఆసుపత్రిలోనే చికిత్స పొందుతున్న ముఖ్యమంత్రి.. ఈ అంశాల నడుమ అమ్మ లేకుండానే తమిళనాడు కేబినెట్ సోమవారం భేటీ అయింది. సీఎం జయలలిత శాఖలను మంత్రి పన్నీర్ సెల్వం చేపట్టిన తర్వాత ఆయన అధ్యక్షత వహిస్తోన్న మొదటి మంత్రివర్గ సమావేశం ఇదే.
కావేరి జలాల విడుదల కోరుతూ ప్రతిపక్ష డీఎంకే నిర్వహించిన (అక్టోబర్ 17, 18న) 48 గంటల రైల్ రోకో వందలాది మంది అరెస్టులకు దారితీసిన సంగతి తెలిసిందే. (తమిళనాడులో 48గంటల పాటు రైలురోకో) మరోవైపు నీళ్లు విడుదల చేయలేమంటూ కర్ణాటక దాఖలు చేసిన పిటిషన్ ను సోమవారం సుప్రీంకోర్టు విస్తృత ధర్మాసనం విచారించనుంది. వీటి నేపథ్యంలో తమిళనాడు ప్రయోజనాలు దెబ్బతినకుండా, అదే సమయంలో ప్రతిపక్షాలను సైతం నిలువరించేలా ఏం చేస్తే బాగుంటుంది? అనేదానిపై పన్నీర్ సెల్వం ఇతర మంత్రులతో చర్చించనున్నారు.
అనారోగ్యానికి గురై సెప్టెంబర్ 22న ఆసుపత్రిలో చేరిన తమిళనాడు సీఎం జయలలిత ఇప్పటికీ చికిత్స పొందుతూనే ఉన్నారు. సుదీర్ఘకాలం ఆమె ఆసుపత్రిలోనే ఉండాల్సిఉంటుందని వైద్యులు ప్రకటించిన దరిమిలా జయ నిర్వహిస్తోన్న శాఖలన్నింటినీ ఆర్థిక మంత్రి పన్నీర్ సెల్వంకు కట్టబెట్టిన సంగతి తెలిసిందే. (అమ్మ నిర్ణయం: తమిళనాడులో కీలక పరిణామం) అమ్మ లేకుండా ఆమె కేబినెట్ తీసుకునే నిర్ణయాలు ఎలాం ఉంటాయో వేచిచూడాలి.
Advertisement
Advertisement