'అమ్మ ఆరోగ్యంపై ఆందోళన వద్దు'
సాక్షి, చెన్నై: తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత క్రమంగా కోలుకుంటున్నట్లు ఆదివారం వైద్యులు వెల్లడించారు. అమ్మ ఆరోగ్యంగా ఉన్నారని, ఇక ఎలాంటి ఆందోళన వద్దని, త్వరలోనే ఆమె ఇంటికి చేరుకుంటారని ఏఐడీఎంకే నాయకురాలు, సినీ నటి సీఆర్ సరత్వతి మీడియాకు చెప్పారు. తీవ్రజ్వరం, డీహైడ్రేషన్‌తో బాధపడుతోన్న జయలలితను గురువారం(సెప్టెంబర్ 22న) చెన్నై అపోలో ఆస్పత్రిలో చేర్పించిన సంగతి తెలిసిందే. (సింగపూర్‌కు జయలలిత తరలింపు?)
ఆర్థిక మంత్రి పన్నీరు సెల్వం, రెవెన్యూ మంత్రి ఆర్‌బీ.ఉదయకుమార్, ఆరోగ్య మంత్రి విజయభాస్కర్, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామ్మోహన్‌రావు, సలహాదారు షీలాబాలకృష్ణన్, ఆరోగ్య శాఖ కార్యదర్శి రాధాకృష్ణన్ తదితరులున్నారు ఆదివారం ఆసుపత్రికి వచ్చి ముఖ్యమంత్రిని పరామర్శించారు. ఆమె ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యుల్ని అడిగి తెలుసుకున్నారు. ఆదివారం కూడా తమ అమ్మ కోసం అన్నాడీఎంకే వర్గాలు పూజల్లో నిమగ్నమయ్యాయి. (ఆస్పత్రిలో అమ్మ)