లాతూర్: మహారాష్ట్రలోని లాతూర్‌లో కలుషిత ఆహారం తిన్న విద్యార్థినులు అనారోగ్యం బారినపడ్డారు. ఇక్కడి పురన్‌మల్ లాహోటీ హాస్టల్‌లో కలుషిత ఆహారం తిన్న 50 మంది విద్యార్థినులు అనారోగ్యం పాలయ్యారు. దీంతో వారిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. చికిత్స అనంతరం కోలుకున్న విద్యార్థినులను తిరిగి హాస్టల్‌కు పంపించారు. విద్యార్థినుల ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.
విద్యార్థినులు తెలిపిన వివరాల ప్రకారం వారు తిన్న ఆహారంలో బల్లి కనిపించింది. అస్వస్థతకు గురైన విద్యార్థినులకు ఆస్పత్రిలో వెంటనే చికిత్స అందించారు. ప్రస్తుతం విద్యార్థుల ఆరోగ్యం బాగానే ఉందని వైద్యులు తెలిపారు. లాతూర్ ప్రభుత్వ ఆస్పత్రి వైద్యులు డాక్టర్ శివాజీ కల్గే మీడియాతో మాట్లాడుతూ గార్మెంట్ పాలిటెక్నిక్ ఉమెన్స్ హాస్టల్‌లో ఫుడ్ పాయిజనింగ్ జరిగిందన్నారు. వారికి చికిత్స అందించి, అబ్జర్వేషన్‌లో ఉంచి తరువాత తిరిగి హాస్టల్‌కు పంపించామన్నారు. కాగా ఈ ఘటనపై హాస్టల్ అధికారులు విచారణ చేస్తున్నారు.
ఇది కూడా చదవండి: 'మూడు రెట్ల జీతం వచ్చే ఉద్యోగం'
Comments
Please login to add a commentAdd a comment