వైద్యం కోసం అర్థించిన బాధితురాలు
పట్టించుకోని ప్రైవేటు ఆస్పత్రి సిబ్బంది
ఏలూరు టౌన్: ఏలూరు ఎన్‌ఆర్‌పేటలోని ఒక ప్రైవేటు హాస్పిటల్ యాజమాన్యం తమ కర్కశత్వాన్ని ప్రదర్శించింది. కైకలూరు మండలం దేవిచింతపాడు గ్రామానికి చెందిన తానేటి నాగమణి 2 నెలల క్రితం ఏలూరు ఎన్‌ఆర్‌పేటలోని ఒక ప్రైవేటు హాస్పిటల్‌లో కడుపులో కణితి ఉందని శస్త్ర చికిత్స చేయించుకుంది.
ఆపరేషన్ అనంతరం ఆమె ఇంటికి వెళ్ళగా కొద్ది రోజులకు తీవ్ర అనారోగ్యానికి గురైంది. కుటుంబ సభ్యులు ఆమెను వేరే హాస్పిటల్‌కు తీసుకువెళ్ళగా పరీక్షలు చేసిన వైద్యులు ఆమెకు క్యాన్సర్ ఉన్నట్లు తెలిపారని చెప్పారు. క్యాన్సర్ కణితిని శస్త్ర చికిత్స చేయటంతో ఇన్ఫెక్షన్ అయిందని, అది తీవ్ర అనారోగ్యానికి దారితీసిందని వైద్యులు చెప్పారని వివరించారు.
ఈ నేపథ్యంలో తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న బాధితురాలు నాగమణిని శనివారం సాయంత్రం.. ముందుగా ఆపరేషన్ చేసిన హాస్పిటల్‌కు తీసుకురాగా, తమకు సంబంధం లేదని, వైద్యం చేయబోమంటూ హాస్పిటల్ యాజమాన్యం నిర్లక్ష్యంగా చెప్పింది. రాత్రి 10.35 గంటల వరకూ ఆరున్నర గంటల పాటు రోడ్డుపైనే ఉన్నా ఎవరూ పట్టించుకోలేదు.
Comments
Please login to add a commentAdd a comment