పశ్చాత్తాపంలో దొంగ.. చోరీ విగ్రహాలను తిరిగి ఇచ్చేసి.. | Thief Regretted After Son Fell ill | Sakshi
Sakshi News home page

పశ్చాత్తాపంలో దొంగ.. చోరీ విగ్రహాలను తిరిగి ఇచ్చేసి..

Published Thu, Oct 3 2024 11:11 AM | Last Updated on Thu, Oct 3 2024 11:27 AM

Thief Regretted After Son Fell ill

ప్రయాగ్‌రాజ్‌: ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో  విచిత్రమైన చోరీ ఉదంతం వెలుగు చూసింది. ఇటీవల ప్రయాగ్‌రాజ్ పరిధిలోని  శృంగవేర్‌పూర్ ధామ్‌లోని గోఘాట్ ఆశ్రమం వద్దనున్న శ్రీరామ జానకి ఆలయంలో చోరీ జరిగింది. ఆలయ తాళం పగులగొట్టి అష్టధాతువులతో తయారు చేసిన 100 ఏళ్ల రాధాకృష్ణుల విగ్రహాన్ని చోరీ చేశారు.  

ఆలయ సిబ్బంది ఫిర్యాదుతో పోలీసులు చోరీ కేసు నమోదు చేశారు. అయితే ఈ చోరీకి పాల్పడ్డ దొంగ వారం రోజుల తరువాత ఆలయానికి కొద్దిదూరంలో రోడ్డుపై రాధాకృష్ణుల విగ్రహాలను, ఒక లేఖను ఉంచి, అక్కడి నుంచి వెళ్లిపోయాడు.  స్థానికులు ఆ విగ్రహాల గురించి ఆలయ సిబ్బందికి తెలియజేశారు. అక్కడ లభ్యమైన లేఖను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆ లేఖలో సదరు దొంగ క్షమాపణలు చెబుతూ.. రాధాకృష్ణుల విగ్రహాలను దొంగిలించాక తన కుమారుడు అనారోగ్యానికి గురయ్యాడని, పీడకలలతో బాధపడుతున్నాడని’ రాశాడు. తాను అప్పగించిన విగ్రహాలను ఆలయంలో తిరిగి అదోచోట ఉంచాలని ఆ దొంగ వినయపూర్వకంగా కోరాడు.

ఇది కూడా చదవండి: ఆర్‌జేడీ నేతపై కాల్పులు.. పరిస్థితి విషమం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement