బంగ్లాదేశ్‌తో రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌కు టీమిండియా సిద్దమవుతోంది. ఈ సిరీస్‌లో భాగంగా తొలి టెస్టు సెప్టెంబర్ 19 నుంచి చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగా ప్రారంభం కానుంది. వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్‌కు చేరాలంటే ఈ సిరీస్ భారత్‌కు చాలా కీలకం.
ఇప్పటికే చెన్నైకు చేరుకున్న టీమిండియా తమ ప్రాక్టీస్‌ను కూడా షురూ చేసింది. ఆటగాళ్లు నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఇప్పటివరకు టీమిండియాపై బంగ్లా జట్టు ఒక్కసారి కూడా విజయం సాధించకపోయినప్పటకి.. ఈ సిరీస్‌ను రోహిత్ సేన ఏ మాత్రం తేలికగా తీసుకోవడం లేదు. పాక్‌పై చారిత్రత్మక టెస్టు సిరీస్ విజయం సాధించి సమరోత్సహంతో భారత్ గడ్డపై అడుగు పెట్టనున్న బంగ్లా బెండు తీసేందుకు భారత్ ప్రత్యేక వ్యూహాలు రచిస్తోంది.
రోహిత్ అండ్ గంభీర్ మాస్టర్ మైండ్..?
తొలి టెస్టుకు ఆతిథ్యమిస్తున్న చెపాక్ పిచ్‌ను పూర్తిగా పేస్‌కు అనుకూలించే విధంగా తయారు చేయమని టీమిండియా మెనెజ్‌మెంట్ పిచ్‌క్యూరేటర్‌కు సూచించినట్లు తెలుస్తోంది. తొలి టెస్టు కోసం ఎర్ర నేల ఆధారిత ట్రాక్‌ను తయారు చేస్తున్నట్లు వినికిడి. భారత కెప్టెన్ రోహిత్ శర్మ, హెడ్ కోచ్ గౌతం గంభీర్ దగ్గరుండి పిచ్‌ను తయారు చేయిస్తున్నట్లు పలు రిపోర్ట్‌లు పేర్కొంటున్నాయి.
కాగా సాదారణంగా చెపాక్ పిచ్ స్పిన్నర్లకు అనుకూలంగా ఉంటుంది. ఇక్కడ బ్లాక్ సోయిల్ పిచ్‌పై తొలి రోజు నుంచే బంతి టర్న్ అవుతూ ఉంటుంది. అందుకే స్పిన్నర్‌లు ఈ వేదికగా తమ మయాజాలం ప్రదర్శిస్తుంటారు. కానీ ఇప్పుడు బంగ్లాను తమ పేస్ బౌలింగ్‌తో ముప్పు తిప్పలు పెట్టేందుకు భారత్ సిద్దమైనట్లు సమాచారం.
బంగ్లాదేశ్ ఎక్కువగా బ్లాక్ సోయిల్(నల్ల నేల) పిచ్‌లపై ఎక్కువ ఆడుతోంది. కాబట్టి ఎర్ర నేల ట్రాక్‌పై ఆడేందుకు వారు కచ్చితంగా ఇబ్బంది పడతారు. ఈ క్రమంలోనే వారి వీక్‌నెస్‌పై భారత్ దెబ్బ కొట్టేందుకు సిద్దమైనట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
చదవండి: IND vs BAN: చరిత్రకు అడుగు దూరంలో రోహిత్.. సెహ్వాగ్ ఆల్ టైమ్ రికార్డుపై కన్ను
Comments
Please login to add a commentAdd a comment