
నేడు తొలి మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌తో ‘ఢీ’
ఫామ్‌లో టీమిండియా ఆటగాళ్లు
మధ్యాహ్నం గం.2:30 నుంచి స్టార్ స్పోర్ట్స్, స్పోర్ట్స్ 18, జియో హాట్‌స్టార్‌లలో ప్రత్యక్ష ప్రసారం
దుబాయ్: చాంపియన్స్ ట్రోఫీలో భారత జట్టు పోరు నేటి నుంచి మొదలవుతోంది. గ్రూప్ ‘ఎ’లో భాగంగా జరిగే తమ తొలి మ్యాచ్‌లో గురువారం బంగ్లాదేశ్‌తో టీమిండియా తలపడుతుంది. బలాబలాలు, ఫామ్ పరంగా చూసుకుంటే రోహిత్ సేన ప్రత్యర్థికంటే ఎంతో బలంగా ఉంది. అయితే ఎప్పటిలాగే బంగ్లాదేశ్ తమ స్థాయికి మించిన ప్రదర్శన కనబర్చి సంచలనాన్ని ఆశిస్తోంది. బ్యాటింగ్‌తో పాటు స్పిన్ ప్రధాన బలంగా భారత్ బరిలోకి దిగుతుండగా... బంగ్లాదేశ్ తమ పేస్ బౌలింగ్‌పై ఆశలు పెట్టుకుంది.
సమష్టిగా చెలరేగితే...
భారత్ తుది జట్టు కూర్పు విషయంలో ఎలాంటి సందేహాలు లేవు. ఓపెనర్లుగా రోహిత్, గిల్ శుభారంభం అందిస్తే ఆ తర్వాత కోహ్లి దానిని కొనసాగించగలడు. ఇటీవల ఇంగ్లండ్‌తో చివరి వన్డేలో చక్కటి అర్ధసెంచరీ సాధించిన కోహ్లి భారీ ఇన్నింగ్స్ ఆడాలని పట్టుదలగా ఉన్నాడు.
ఫామ్‌లో ఉన్న శ్రేయస్ అయ్యర్‌తో పాటు ఐదో స్థానంలో కేఎల్ రాహుల్ కూడా రాణిస్తే తిరుగుండదు. గత సిరీస్‌లో వరుస ప్రయోగాలతో రాహుల్ స్థానం పదే పదే మారింది. అయితే ఈసారి మాత్రం అతనికి అచ్చొచ్చిన ఐదో స్థానంలోనే ఆడించే అవకాశం ఉంది. పాండ్యా, జడేజా, అక్షర్‌ల ఆల్‌రౌండ్ నైపుణ్యం జట్టుకు అదనపు బలం.
కుల్దీప్ చాలా కాలంగా చక్కటి ఆటతీరు కనబరుస్తున్నాడు. ముఖ్యంగా మధ్య ఓవర్లలో అతడిని ఎదుర్కోవడం ప్రత్యర్థులకు సవాల్. అనుభవజు్ఞడైన షమీతో పాటు అర్ష్ దీప్ ఆరంభంలో బంగ్లాదేశ్‌ను కట్టిపడేయగల సమర్థులు.
బలహీన బ్యాటింగ్...
తమ దేశపు స్టార్ ఆటగాడు షకీబ్ లేకుండా 2004 తర్వాత బంగ్లాదేశ్ తొలిసారి ఒక పెద్ద టోర్నీ ఆడుతోంది. లిటన్ దాస్ కూడా ఈ టోర్నీలో లేడు. అయితే ఇతర సీనియర్లు ముషి్ఫకర్, మహ్ముదుల్లా లాంటి ప్లేయర్లు మరోసారి జట్టు భారం మోయాల్సి ఉంది. యువ బ్యాటర్లలో తన్‌జీద్, తౌహీద్ ఇటీవల పెద్దగా ప్రభావం చూపలేదు.
కెప్టెన్ నజు్మల్ చాలా కాలంగా ఫామ్‌లో లేడు. ఇలాంటి స్థితిలో ఈ బ్యాటింగ్ లైనప్ భారత బౌలింగ్‌ను ఏమాత్రం సమర్థంగా ఎదుర్కోగలదనేది సందేహమే. పేసర్లు ముస్తఫిజుర్, నాహిద్ రాణా, తస్కీన్ రాణించాలని జట్టు కోరుకుంటోంది. స్పిన్ ఆల్‌రౌండర్ మెహదీ మిరాజ్ కీలకం కానున్నాడు.
తుది జట్లు (అంచనా):
భారత్: రోహిత్ (కెప్టెన్), గిల్, కోహ్లి, శ్రేయస్, రాహుల్, పాండ్యా, జడేజా, అక్షర్, కుల్దీప్, షమీ, అర్ష్ దీప్.
బంగ్లాదేశ్: నజు్మల్ (కెప్టెన్), తన్‌జీద్, సౌమ్య సర్కార్, తౌహీద్, ముషి్ఫకర్, మహ్ముదుల్లా, మెహదీ హసన్ మిరాజ్, రిషాద్, తస్కీన్, నాహిద్, ముస్తఫిజుర్.
పిచ్, వాతావరణం
ఈ వేదికపై వన్డేలు అరుదుగా జరుగుతున్నాయి. దాదాపు అన్ని మ్యాచ్‌లలో తక్కువ స్కోర్లే నమోదయ్యాయి. నెమ్మదైన పిచ్‌పై స్పిన్నర్ల ప్రభావం ఖాయం. వర్ష సమస్య లేదు.
41 భారత్, బంగ్లాదేశ్ మధ్య మొత్తం 41 వన్డేలు జరిగాయి. భారత్ 32 మ్యాచ్‌ల్లో...బంగ్లాదేశ్ 8 మ్యాచ్‌ల్లో నెగ్గాయి. ఒక మ్యాచ్ రద్దయింది. చాంపియన్స్ ట్రోఫీలో ఒకే ఒక్కసారి 2017 సెమీఫైనల్లో ఇరు జట్లు తలపడ్డాయి. భారత్ 9 వికెట్లతో ఘన విజయం సాధించింది.
Comments
Please login to add a commentAdd a comment