పవన్‌ వ్యాఖ్యలపై ఉదయనిధి స్టాలిన్‌ కౌంటర్‌ | Udhayanidhi Stalin Says Wait And See On Pawan Kalyan Sanatana Dharma Comments At Varahi Declaration Meeting | Sakshi
Sakshi News home page

పవన్‌ వ్యాఖ్యలపై ఉదయనిధి స్టాలిన్‌ కౌంటర్‌

Published Fri, Oct 4 2024 2:37 PM | Last Updated on Fri, Oct 4 2024 3:20 PM

Udhayanidhi Stalin says Wait And See On Pawan Kalyan Sanatana Dharma comments

చెన్నై: తిరుపతి వారాహి డిక్లరేషన్‌ సభలో సనాతన ధర్మంపై డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌ చేసిన వ్యాఖ్యలపై  ఇప్పటికే తమిళనాడు అధికార పార్టీ డీఎంకే కౌంటర్ ఇచ్చింది. తిరుమల లడ్డూ కల్తీ జరిగిందంటూ కూటమి ప్రభుత్వం చేసిన రాజకీయంపై సుప్రీం కోర్టు మొట్టి కాయలు వేసిన విషయాన్ని గుర్తు చేసింది. 

గురువారం పవన్‌ వారాహి డిక్లరేషన్‌ సభలో తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్‌ పేరు ప్రస్తావించకుండా పరోక్షంగా విమర్శలు చేసిన విషయం తెలిసిందే. అయితే.. దానిపై తాజాగా శుక్రవారం తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్‌  స్పందించారు. సనాతన ధర్మాన్ని నిర్మూలించలేరంటూ పవన్‌ చేసిన వ్యాఖ్యలకు బదులిస్తూ.. ‘వేచి చూడండి. వేచి చూడండి’ అని అన్నారు.

 

‘‘సనాతన ధర్మం వైరస్ లాంటిదని, ఆ మహమ్మారిని నిర్మూలించాలని ఈ మధ్య ఓ యువ నాయకుడు మాట్లాడుతున్నాడు. సనాతన ధర్మాన్ని ఎవరూ ఏమీ చేయలేరు. ఎవరైనా సరే దాన్ని నిర్మూలించాలనుకుంటే, వారే తుడిచి పెట్టుకుని పోతారు. తిరుపతి బాలాజీ సాక్షిగా ఈ మాట చెబుతున్నా’’  అని పవన్ కల్యాణ్‌ అన్నారు.

అయితే పవన్‌ వ్యాఖ్యలపై డీఎంకే ఇప్పటికే గట్టి కౌంటర్‌ ఇచ్చింది. డీఎంకే అధికార ప్రతినిధి డాక్టర్ సయ్యద్ హఫీజుల్లా మాట్లాడుతూ.. తమ పార్టీ ‘‘ ఏ మతం గురించి, ప్రత్యేకంగా హిందూ మతం గురించి మాట్లాడదు.. కుల దురాగతాలు, అంటరానితనం గురించి మాత్రమే మాట్లాడుతుంది’’ అని సూచించారు.  

చదవండి: Tirupati Laddu Case Hearing: చంద్రబాబుకు సుప్రీంకోర్టులో మరో ఎదురుదెబ్బ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement