కరోనా వైరస్‌పై తమిళనాడు స్పందన | Tamil Nadu Health Department React On Coronavirus | Sakshi
Sakshi News home page

కరోనా వైరస్‌పై తమిళనాడు స్పందన

Published Thu, Feb 6 2020 10:54 AM | Last Updated on Thu, Feb 6 2020 10:57 AM

Tamil Nadu Health Department React On Coronavirus - Sakshi

చెన్నై: చైనాను వణికిస్తోన్న కరోనా వైరస్ ఇప్పుడు భారత్‌ను భయపెడుతోంది. తాజాగా తమిళనాడులో కరోనా వైరస్ కలకలంపై.. ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ స్పందించింది. చైనా నుంచి వచ్చి చెన్నైలోని ఓ ప్రైవేటు హోటల్‌లో ఉన్న ఇద్దరు వ్యక్తులను ప్రత్యేక వైద్య బృందం పరీక్షించిందని పేర్కొంది.  అదేవిధంగా ఆ ఇద్దరికి కరోనా వైరస్‌కి సంబంధించిన ప్రత్యేక పరీక్షలు జరిపినట్లు తెలియజేసింది. ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో 9 మంది కరోనా వైరస్‌కి సంబంధించిన లక్షణాలు కలిగి ఉన్నట్లు అనుమానం వ్యక్తం చేసింది. ఆయా ప్రభ్యత్వ ఆసుపత్రుల్లో ప్రత్యేక వార్డులను ఏర్పాటు చేసి అత్యవసర చికిత్స అందిస్తున్నామని తమిళనాడు ఆరోగ్యశాఖ తెలిపింది. కేరళ నుంచి చెన్నైకి వస్తున్న ప్రయాణికులపై  వైద్య పరీక్షలకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశామని పేర్కొంది.
చదవండి: కరోనా విశ్వరూపం
చదవండి: మరో 9 మందికి ‘కరోనా’!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement