Government hopistal
-
డాక్టర్‌పై ఏడు సార్లు కత్తితో దాడి ఘటన.. కుమారుడ్ని సమర్థించిన తల్లి
చెన్నై: తన తల్లికి సరిగ్గా వైద్యం చేయలేదని కోపంతో ఆమె కుమారుడు విఘ్నేష్ డాక్టర్‌పై ఏడుసార్లు కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో నిందితుడు విఘ్నేష్‌ని సమర్థిస్తూ ఆమె తల్లి మాట్లాడారు. అయ్యా.. నా మీదున్న ప్రేమే.. నా కుమారుడితో ఇంత పనిచేయించింది. వాడి తప్పేమీ లేదు. నాకు క్యాన్సర్ ఉంది. కీమో థెరఫీ అవసరం లేదని డాక్టర్ బాలాజీ చెప్పి వెళ్లిపోయారు. నేను ఆయనకు ఏమైనా శత్రువునా? అని ప్రశ్నించారు.చెన్నైలో కలకలం రేపిన ప్రభుత్వ వైద్యుడిపై దాడి ఘటనలో నిందితుడి తల్లి మీడియాతో మాట్లాడారు. నాకు క్యాన్సర్ స్టేజ్ 5లో ఉంటే గిండి కలైజ్ఞర్ సెంటినరీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి వైద్యులు స్టేజ్ 2 క్యాన్సర్ ఉందని చెప్పారు. అలా ఎలా చెబుతారు? ఆర్థిక ఇబ్బందుల కారణంగా అడయార్ క్యాన్సర్ ఆస్పత్రిలో చికిత్స చేయించుకో లేకపోయాను. ఈ (కలైజ్ఞర్ సెంటినరీ) ఆస్పత్రికి వస్తే క్యాన్సర్ విభాగ వైద్యుడు బాలాజీ నాకు మరో కీమోథెరపీ అవసరం లేదని చెప్పి వెళ్ళిపోయారు. నేను ఆయనకు శత్రువునా? అని ప్రశ్నిస్తూ.. డాక్టర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. అనారోగ్య సమస్య గురించి చెబుతుంటే డాక్టర్ బాలాజీ నావైపు చూసేందుకు ఇష్టపడలేదు. నాపై ఉన్న ప్రేమ విఘ్నేష్‌తో ఇంత పనిచేయించింది. విఘ్నేష్ హార్ట్ పేషెంట్. మూర్ఛతో బాధపడుతున్నాడని విచారం వ్యక్తం చేశారు. Prof.Balaji Jagannathan, Professor & HOD, Medical Oncology, Govt Kalaignar Hospital, #Chennai, stabbed by 7 times by criminal from Peringalathur, whose mother ws being Rx fr stage 4 lung #Cancer at this hospital.Prof Balaji is very, very serious now. 🙏. #MedTwitter #medX pic.twitter.com/eG2uN3mKqp— Indian Doctor🇮🇳 (@Indian__doctor) November 13, 2024 ఏం జరిగిందంటే?చెన్నై గిండిలోని కలైజ్ఞర్ సెంటినరీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో విధులు నిర్వహిస్తున్న క్యాన్సర్ విభాగ వైద్యుడు బాలాజీపై చెన్నై పెరుంగళత్తూర్కు చెందిన 25 ఏళ్ల విఘ్నేష్ కత్తితో దాడి చేశాడు. దాడిపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. నిందితుడు విఘ్నేష్‌ను అదుపులోకి తీసుకున్నారు. అయితే క్యాన్సర్ సమస్యతో బాధపడుతున్న తన తల్లికి డాక్టర్ బాలజీ సరైన వైద్యం అందిచం లేదనే ఆవేదనతో దాడి చేసినట్లు నిందితుడు పోలీసులకు వాంగ్మూలం ఇచ్చాడు. అంతేకాదు, తన తల్లికి సరైన చికిత్స అందించకపోవడంపై డాక్టర్ బాలాజీని అడిగానని, వైద్య ఖర్చులు ఇవ్వాలని అడిగితే తనను కిందకి నెట్టివేశాడని, దీంతో కత్తితో దాడిచేసినట్లు పేర్కొన్నాడు. ప్రస్తుతం వైద్యుడిపై దాడి ఘటన సంచలనంగా మారింది. -
11 రోజులుగా స్ట్రెచర్ మీదే : అస్థిపంజరంలా
ఇండోర్: మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో దారుణం చోటు చేసుకుంది. నగరంలోని అతిపెద్ద ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీలో ఘోరంగా కుళ్లిపోయి, దయనీయ స్థితిలో మృతదేహం పడి ఉన్న వైనం వెలుగులోకి వచ్చింది. మహారాజా యశ్వంతరావు ఆసుపత్రి మార్చురీలోని స్ట్రెచర్ మీద దాదాపు అస్థిపంజరంలా మారిన డెడ్ బాడీ అక్కడి వారిని షాక్ కు గురిచేసింది. వివరాలను పరిశీలిస్తే..గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం గత 11 రోజులుగా అక్కడ పడి ఉంది. కుళ్లి కంపుకొడుతున్నాసిబ్బంది పట్టించుకోలేదు. చివరికి అస్థిపంజరంలా మారి భయం గొల్పుతూ ఉండటంతో ఆసుపత్రిలోని ఇతరులు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగు చూసింది. సోషల్ మీడియాలో దీనికి సంబంచిన ఫోటో వైరల్ అయింది. అయితే అంత్యక్రియలు నిర్వహించేందుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో, ఏదైనా ఎన్జీవో, లేదా ఇండోర్‌కు చెందిన పౌర సంస్థ కోసం వస్తుందని ఎదురుచూస్తున్నామని అందుకే అలా స్ట్రెచర్ మీదే ఉంచినట్లు ఆసుపత్రి సిబ్బంది వెల్లడించారు. దీనిపై దర్యాప్తు ప్రారంభిస్తామని, బాధ్యులైన వారికి నోటీసులు ఇవ్వనున్నామని ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ పీఎస్ ఠాకూర్ తెలిపారు. రోజూ సుమారు 16-17మృతదేహాలు వస్తాయనీ, జిల్లాలో కరోనాతో ఈ సంఖ్య రెట్టింపు అయిందని తెలిపారు. దీంతో మార్చురీపై భారం పెరిగిందనీ, ఫ్రీజర్ల సంఖ్య పెంచాలని ప్రభుత్వాన్న ఇప్పటికే కోరామని ఆయన చెప్పారు. కాగా ఒకదానికి బదులుగా మరో మృతదేహాన్ని అప్పగించిన వైనం ఇటీవల కలకలం రేపింది. ఆసుపత్రి తీవ్ర నిర్లక్ష్యంతో తమ కుమారుడి బదులుగా వేరే బాడీని అప్పగించిందంటూ ఆ కుటుంబం ఆసుపత్రిపై ఫిర్యాదు చేసింది. -
ప్రభుత్వాస్పతిలో గర్భిణీ మృతి
-
‘మేము జంతువులమా.. నీళ్లు కూడా ఇవ్వరా?’
లక్నో: తమకు సరైన ఆహారం, తాగడానికి కనీసం నీళ్లు కూడా ఇవ్వడంలేదంటూ కరోనా పేషంట్లు నిరసన వ్యక్తం చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ఉత్తరప్రదేశ్ ప్రయాగ్‌రాజ్‌లోని కొత్వా బన్సి ఏరియా ప్రభుత్వ ఆస్పత్రిలో గురువారం ఈ సంఘటన చోటు చేసుకుంది. మూడు నిమిషాల వ్యవధి ఉన్న ఈ వీడియోలో ఎల్1 కేటగిరికి చెందిన ఓ కరోనా పేషెంట్ తమ పరిస్థితి జంతువుల కంటే హీనంగా ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ‘మేము జంతువులమా.. మాకు కనీసం నీళ్లు కూడా ఇవ్వరా’ అంటూ ఆస్పత్రి యాజమాన్యాన్ని ప్రశ్నించాడు. ‘ఆహారం సరిగా పెట్టడం లేదా’ అని ఓ వ్యక్తి ప్రశ్నిస్తే.. ‘లేదు కచ్చపచ్చగా ఉడకేసి ఇస్తున్నారు’ అని తెలిపాడు. అంతేకాక ‘మీ దగ్గర డబ్బు లేకపోతే చెప్పండి.. మేం ఇస్తాం. అంతేకాని ఈ పరిస్థితులు ఇలానే కొనసాగతే మేం ఇంటికి వెళ్లి పోతాం. అధికారులతో చెప్పండి’ అంటూ సదరు పేషెంట్ ఆందోళనకు దిగాడు. అతడికి ఇతర రోగులు మద్దతు తెలిపారు. (మూడేళ్ల తర్వాత.. కరోనా కలిపింది) గురువారం ఉదయం ఆస్పత్రిలో రెండు గంటల పాటు మంచి నీటి సరఫరా నిలిచిపోయింది. అధికారులు స్పందించకపోవడంతో పేషెంట్లు ఇలా నిరసనకు దిగారు. దీని గురించి ప్రయాగ్‌రాజ్ చీఫ్ మెడికల్ అధికారిని ప్రశ్నించగా.. ‘విద్యుత్ లోపంతో మంచినీటి సరఫరాలో అంతరాయం ఏర్పడింది. ఎలక్ట్రీషియన్‌ను పిలిచి రెండు గంటల వ్యవధిలోనే సమస్యను పరిష్కరించాము. ఓవర్‌హెడ్ ట్యాంక్‌లో నీరు ఎప్పుడు అందుబాటులోనే ఉంటుంది. కాని రోగులు స్నానానికి మంచినీటిని ఉపయోగిసస్తారు. ఫలితంగా ఈ సమస్య తలెత్తింది. మేము వారి సమస్యను వెంటనే పరిష్కరించాము’ అని తెలిపారు. -
ప్రభుత్వాస్పత్రులంటే ఇంత నిర్లక్ష్యమా?
రాపూరు పీహెచ్‌సీని పరిశీలించిన జెడ్పీచైర్మన్ వైద్యసిబ్బంది అందుబాటులో లేకపోవడంపై ఆగ్రహం డీఎంహెచ్ఓకు ఫోన్లో ఫిర్యాదు రాపూరు: ప్రభుత్వ ఆస్పత్రి అంటే ఇంత నిర్లక్ష్యమా..పేదలకు సేవలందించేందుకు ఒక్క వైద్యుడు కూడా అందుబాటులో లేకపోవడం ఏమిటని జెడ్పీచైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక పీహెచ్‌సీని శుక్రవారం ఆయన పరిశీలించారు. వైద్యశాలలో వైద్యులు లేకపోవడాన్ని గుర్తించి హాజరు రిజిస్టర్‌ను తనిఖీ చేశారు. 25 మంది సిబ్బంది ఉన్నా హెడ్ నర్సు, మెటర్నటీ అసిస్టెంట్, దంత, ఫిజియో«థెరపీ వైద్యులు మాత్రమే ఉండడంతో ఆగ్రహం వ్యక్తంచేశారు. రోజుకు ఎంత మంది రోగులు వస్తుంటారని దంత వైద్యుడ్ని ప్రశ్నించారు. నిత్యం 250 నుంచి 300 మంది వస్తుంటారని చెప్పగా, ఇంత మంది వస్తున్నా ఒక్క వైద్యుడు లేకపోవడం ఏమిటని ఆగ్రహం వ్యక్తం చేశారు. దంత, ఫిజియోథెరపి వైద్యులు రోగులను పరీక్షించడం ఏమిటని వెంటనే డీఎంహెచ్ఓతో ఫోన్లో మాట్లాడారు. ఐదుగురు వైద్యులు, ఆరుగురు నర్సులు, ఎన్సీడీ వైద్యులు ముగ్గురు ఉండాల్సి ఉండగా ఒక్కరూ లేకపోవడం ఏమిటని..వైద్యులకు సెలవులు ఎవరు ఇస్తున్నారని ప్రశ్నించారు. వైద్యులు అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కలెక్టర్ దృష్టికి సమస్యను తీసుకెళ్లి వైద్యసిబ్బందిని నియమించేలా చూస్తామన్నారు. ఆయన వెంట వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ బండి కృష్ణారెడ్డి, జెడ్పీటీసీ సభ్యురాలు పిల్లకదుపు శకుంతల, నాయకులు పాపకన్ను దయాకర్‌రెడ్డి, బండి తిరుపాల్‌రెడ్డి, తదితరులు ఉన్నారు. -
నరకయాతన
► సర్వజనాస్పత్రిలో గంటన్నర పాటు కరెంట్ కట్ ► నానా అవస్థలు పడిన రోగులు ► టార్చ్‌లైటు వెలుతురులోనే ప్రసవాలు అనంతపురం మెడికల్ : జిల్లా కేంద్రంలోని సర్వజనాస్పత్రిలో కరెంటు కష్టాలు మొదలయ్యాయి. శనివారం వర్షం కారణంగా కరెంటు కట్ చేశారు. దాదాపు గంటన్నర పాటు కరెంటు లేకపోవడంతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వైద్య సేవలకు తీవ్ర అంతరాయం కల్గింది. ఎమర్జెన్సీ, ఏఎంసీ, ఈఓటీ తప్ప మిగిలిన అన్ని వార్డుల్లో రోగులు చీకట్లో మగ్గారు. లేబర్ వార్డులోని ఆరోగ్యశ్రీ యూనిట్లో సర్జరీ చేయించుకుని వచ్చిన వారు ఉక్కపోతతో అల్లాడిపోయారు. వారికి కుటుంబ సభ్యులు పేపర్లతో గాలి ఊపి సేదతీర్చారు. కొంత మంది వార్డుల్లో ఉండలేక బయటకు వచ్చేశారు. గుత్తికు చెందిన షకీల, కూడేరు మండలం నారాయణపురానికి చెందిన యశోదకు గుడ్డి మబ్బులోనే డెలివరీ చేశారు. ఎమర్జెన్సీ కేసులను ఈఓటీకు తరలించాల్సి వచ్చింది. స్పెషల్కేర్ నియోనెటాల్ యూనిట్(ఎస్ఎన్సీయూ)లోనూ ఇదే పరిస్థితి. ఇక్కడ 34 మంది పసికందులున్నారు. కరెంటు పోవడంతో ఏసీలు ఆగిపోయాయి. పసికందులకు ఏమైనా జరుగుతుందేమోనన్న భయంతో తల్లిదండ్రులు అల్లాడిపోయారు. స్టాఫ్‌నర్సులు దగ్గరుండి పసికందులకు సేవలందించారు. టార్చ్‌లైట్ వెలుతురులో పాలు పట్టించారు. ఇంజెక్షన్లు వేశారు. ఆస్పత్రిలో జనరేటర్ సౌకర్యమున్నా..పూర్తి స్థాయిలో పని చేయడం లేదు. లేబర్ వార్డు, ఐసీసీయూ, ఎస్ఎన్సీయూ వార్డుల్లో వెంటిలేటర్‌పై కేసులున్నప్పుడు కరెంటు పోతే పరిస్థితి దారుణంగా ఉంటుందని సిబ్బంది చెబుతున్నారు. భవిష్యత్తులో ఇలాంటి సమస్య తలెత్తకుండా చూడాలని కోరుతున్నారు. -
ఈ ‘రోగానికి’ మందులేదా?
అధ్వానంగా విజయవాడ ప్రభుత్వాస్పత్రి బంధువులే రోగులను తీసుకెళ్లాల్సిన దుస్థితి విజయవాడ : ‘నేను రాను బిడ్డో.. సర్కారు దవాఖానకు..’ పాట గుర్తుకొస్తోంది ప్రభుత్వాస్పత్రిని చూస్తుంటే. చినుకు పడితే చాలు ఆస్పత్రి ప్రాంగణం చిత్తడిగా మారుతోంది. వర్షపు నీరు పారేందుకు సరైన డ్రైనేజీ వ్యవస్థ లేనందున ఆవరణంతటాకాన్ని తలపిస్తోంది. దీంతో రోగులు ఆ నీటిలోనే నడుచుకుంటూ ఆస్పత్రిలోకి వెళ్లాల్సిన దుస్థితి నెలకొంది. నిత్యం వందలాది మంది చికిత్స కోసం వచ్చే ప్రభుత్వాస్పత్రిలో రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరచడంలో పాలకులు, అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. తీవ్ర అనారోగ్యానికి గురై నడవలేని స్థితిలో ఉన్నవారు సైతం బురదనీటిలో నడిచివెళ్లక తప్పడం లేదని ఆవేదన చెందుతున్నారు. రోగిని స్ట్రెచర్‌పై తీసుకెళ్లేందుకు సిబ్బంది కూడా అందుబాటులో లేకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో బంధువులే తీసుకెళ్లాల్సివస్తోంది. ఆస్పత్రి చుట్టూ నీరు నిలవడంతో దోమలు బాగా ఉత్పత్తి అవుతున్నాయి. ముఖ్యంగా ఆస్పత్రి వెనుకవైపు, డయాగ్నోస్టిక్ బ్లాక్ పక్కన, ఎదురుగా నిత్యం నీరు నిలిచే ఉంటుందని, రాత్రి వేళల్లో విధులు నిర్వర్తించడం కష్టంగా ఉంటోందని సిబ్బంది చెబుతున్నారు. రానున్న వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని ఆస్పత్రిలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాల్సిన బాధ్యత అధికారులపై ఉంది. -
ఏసీబీ చేతిలో కీలక ఫైళ్లు
విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో తనిఖీలు ఆరోగ్యశ్రీ, మందుల కొనుగోళ్లు ఫైళ్లు, ఆయిల్ లాగ్ బుక్‌లు స్వాధీనం ఉద్యోగుల్లో టెన్షన్.. టెన్షన్ విజయవాడ : ప్రభుత్వాస్పత్రిలోని పలు కీలక ఫైళ్లను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆరోగ్యశ్రీకి సంబంధించిన ఫైళ్లతో పాటు, మందుల కొనుగోళ్లు, అంబులెన్స్ ఆయిల్ లాగ్‌బుక్స్‌ను అధికారులు తమ వెంట తీసుకెళ్లారు. కాగా హైదరాబాద్, ఒంగోలు, గుంటూరు, విజయవాడకు చెందిన ఐదు బృందాల ఏసీబీ అధికారులు మంగళవారం ఉదయం నుంచి బుధవారం వేకువ జాము వరకూ ఆస్పత్రిలో తనిఖీలు నిర్వహించారు. వారి తనిఖీల్లో పలులోపాలతో పాటు, సందేహాలున్న ఫైళ్లను సీజ్ చేసి తమ వెంట తీసుకెళ్లి బుధవారం క్షుణ్ణంగా పరిశీలిస్తున్నట్లు తెలిసింది. వారికి ఎక్కడైనా అనుమానం వస్తే ప్రభుత్వాస్పత్రిలోని సంబంధిత సిబ్బందికి ఫోన్ చేసి వివరాలు అడగటంతో పాటు, మరింత సమాచారం కోసం ఇతర ఫైళ్లు కూడా తమకు అందజేయాలని కోరుతున్నారు. అలా పార్లమెంటు సభ్యులు లగడపాటి రాజగోపాల్ తన అభివృద్ధి నిధుల నుంచి ఆస్పత్రికి ఇచ్చిన రూ.20లక్షలకు సంబంధించి ఖర్చు వివరాల ఫైలు కావాలంటూ బుధవారం ఆస్పత్రి అధికారులను కోరినట్లు తెలిసింది. దాంతో పాటు రాజీవ్ ఆరోగ్యశ్రీ కోర్ కమిటీ, ఆస్పత్రి డ్రగ్స్ పర్చేజింగ్ కమిటీ సభ్యుల వివరాలు కావాలని అడిగారని సమాచారం. కొంత కాలంగా ఆయా కమిటీల సమావేశాలు నిర్వహించని విషయం తెలుసుకున్న ఏసీబీ అధికారులు, ఆ సభ్యులను సైతం విచారించి కారణాలు తెలుసుకునే అవకాశం ఉందని తెలుస్తుంది. కాగా మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఆరోగ్యశ్రీకి సంబంధించి ప్రతి ఫైలును పరిశీలించడంతో పాటు, రోగులు కేస్ షీటులనూ ఏసీబీ అధికారులు పరిశీలించినట్లు తెలిసింది.ఏసీబీ సిబ్బంది బుధవారం ఆస్పత్రికి వచ్చి డ్రగ్‌స్టోర్‌ను పరిశీలించి వారికి కావాల్సిన వివరాలు సేకరించారు. ఉద్యోగుల్లో టెన్షన్.. టెన్షన్ ఎన్నడూ లేని విధంగా ఏసీబీకి చెందిన ఐదుగురు డీఎస్పీ స్థాయి అధికారులు , పెద్ద సంఖ్యలో సీఐలు, ఎస్ఐలు ప్రభుత్వాస్పత్రిలో తనిఖీలు నిర్వహించడంతో ఉద్యోగుల్లో టెన్షన్ వాతావరణం నెలకొంది. కొన్ని ఫైళ్లను వారి వెంట తీసుకెళ్లడంతో ఏమి జరుగుతుందోనని అయోమయంలో ఉన్నారు. ఏసీబీ అధికారులు పలువురు ఉద్యోగుల్ని అదుపులోకి తీసుకుంటారనే పుకార్లు రావడంతో మరింత ఆందోళనకు గురవుతున్నారు. -
ప్రభుత్వ ఆస్పత్రుల్లో కాన్పులయ్యేలా చూడాలి
కలెక్టరేట్, న్యూస్‌లైన్: ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన ప్రసూతి సౌకర్యాలు కల్పించడంతో పాటు గర్భిణుల నమోదుతో పాటు రెండవ, నాల్గవ వైద్య పరీక్షలు నిర్వహించడంలో జిల్లా రాష్ట్రంలోనే మొద టి స్థానంలో నిలిచిందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పీకే మహంతి కలెక్టర్ స్మితా సబర్వాల్‌ను అభినందించారు. బుధవారం హైదరాబాద్ నుంచి వైద్య ఆరోగ్యంపై కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో మార్పు కార్యక్రమం ద్వారా క్లస్టర్ పరిధిలో స్వయం సహాయక సభ్యులు, అంగన్వాడీ, ఆర్డబ్ల్యూఎస్, ఐకేపీ, ఐసీడీఎస్ వివిధ ప్రభుత్వ శాఖల సమన్వయంతో సమావేశాలు నిర్వహించడంతో పాటు గర్భిణుల నమోదు, క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. హైరిస్క్ ప్రసవాలను ముందే గుర్తించి గర్భిణుల పట్ల అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకుంటామన్నారు. సిద్దిపేట సీహెచ్‌సీలో ప్రత్యేకంగా డెడికేటెడ్ హై రిస్క్ కేంద్రం ఏర్పాటు చేసి సుఖై ప్రసవాలు జరిగేలా వైద్య సదుపాయాలు, స్త్రీ వైద్య నిపుణులను అందుబాటులో ఉంచేలా ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈ నెల 24న ప్రారంభించే కార్యక్రమానికి హాజరు కావాల్సిందిగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రధాన కార్యదర్శి, కమిషనర్లను కలెక్టర్ ఆహ్వానించారు. జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాల సంఖ్య పెంచేలా చర్యలు తీసుకోవడంలో భాగంగా 46 మంది స్టాఫ్ నర్సులను నియమించామన్నారు. గతేడాది అక్టోబర్ వరకు ప్రభుత్వ ఆసుపత్రుల్లో నెలకు 1600 ప్రసవాలు జరగగా నవంబర్ నాటికి 2000 వేలకు పైగా నమోదవుతున్నాయన్నారు. పుట్టిన పిల్లలకు టీకాలు వేయడంలో ప్రత్యేక చొరవ చూపి మెరుగు పర్చేందుకు కృషి చేస్తున్నామన్నారు. 19న పల్స్ పోలియో పల్స్ పోలియో ఇమ్యునైజేషన్ కార్యక్రమంలో 0 నుంచి ఐదేళ్లలోపు చిన్నారులకు 100 శాతం పోలియో చుక్కలు వేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సూచించారు. కాన్ఫరెన్స్‌లో జిల్లా నుంచి డీఎంహెచ్ఓ డాక్టర్ పద్మ, డీసీహెచ్ఎస్ డాక్టర్ వీణాకుమారి, ఎన్ఆర్హెచ్ఎం పి.జగనాథ్‌రెడ్డి, డీఆర్డీఏ పీపీ రాజేశ్వర్‌రెడ్డి, ఐసీడీఎస్ పీడీ శైలజ వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.