కేన్సర్ పేషెంట్ల చికిత్స చాలా క్లిష్టం. ఈ వ్యాధిని ఎదుర్కోవడం ఎలా అనేది ఒక ఎత్తు అయితే, కీమో థెరపీ సైడ్ ఎఫెక్ట్స్‌ను భరించడం మరో ఎత్తు. ఒక విధంగా చెప్పాలంటే మామూలు వారు ఈ ఆలోచన భరించడమే కష్టం. కానీ కేన్సర్ సోకిన వారు కచ్చితంగా ఫేస్ చేయాలి. అనేక శారీరక బాధలను భరించాలి. ధైర్యంగా నిలడాల్సిందే.
ముఖ్యంగా ఎంత పెద్ద జుట్టు అయినా, కుచ్చులుగా కుచ్చులుగా ఊడిపోతోంది. బోడిగుండు అయిపోతుంది. వీటి అన్నింటినీ తట్టుకోని బైటపడాలంటే చాలా మానసిక స్థయిర్యం కావాలి. ఈ మొత్తం ప్రక్రియలో చికిత్సం అందించే వైద్యులు, నర్సులుతో, స్నేహితులు, సన్నిహితులు, కుటుంబసభ్యులు అందించే సపోర్ట్ చాలా కీలకం. దీనికి సంబంధించిన ఒకటి ట్విటర్‌లో ఒకటి నెటిజన్ల కంట తడి పెట్టిస్తోంది. (సమ్మర్‌లో ఈ రైస్ తింటే..లాభాలే..లాభాలు!)
ముఖ్యంగా కీమోథెరపీ తరువాత జుట్టు ఊడిపోతున్న క్రమంలో చాలామంది రోగులు ముందుగానే తమ హెడ్ షేవ్ చేసుకుంటా ఉంటారు. ఈ క్రమంలో కేన్సర్ బారిన పడి తల్లి తన జుట్టును మొత్తం తీసివేయించుకనేందుకు పార్లర్‌కు వెళ్లింది. అంతా సిద్దమైన తరువాత ఆమె కుమార్తె వచ్చి అనూహ్యంగా హెయిర్‌కటింగ్ టూల్‌ను తీసుకొని తన జుట్టును కట్ చేసుకుటుంది. దీన్ని గమనించిన తల్లి కన్నీంటి పర్యంతమవుతుంది. ‘‘నేను నీతోనే.. అమ్మా... నువ్వు ఒంటరివి కాదు’’ అన్నట్టు తల్లిని హత్తుకుంటుంది. ట్విటర్‌లో షేర్ అయిన ఈ వీడియో మిలియన్ల వ్యూస్‌ను సొంతం చేసుకుంది. (అన్నీ ఎదురుదెబ్బలే, 4 సార్లు ఫెయిల్ : సక్సెస్ చేయి అందుకుంది)
“Mom, you don’t have to go through this alone”🥺❤️ pic.twitter.com/fsdTasZAWt
— non aesthetic things (@PicturesFoIder) March 29, 2024
Comments
Please login to add a commentAdd a comment